విధులు సక్రమంగా నిర్వర్తించాలి
● జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ
అనంతపురం టవర్‌క్లాక్: విధులు సక్రమంగా నిర్వర్తిస్తూ మంచి పేరు గడించాలని పదోన్నతి పొందిన ఉద్యోగులకు జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ సూచించారు. జెడ్పీ పరిధిలోని ఉమ్మడి జిల్లాకు చెందిన 54 మంది జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులకు పదోన్నతుల ఉత్తర్వులను సోమవారం జెడ్పీలోని తన చాంబర్‌లో గిరిజమ్మ అందజేసి, మాట్లాడారు. సుదీర్ఘ కాలంగా ప్రమోషన్లు అందక జెడ్పీ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ వచ్చారని అన్నారు. ఇటీవల డిప్యూటీ ఎంపీడీఓలకు ఎంపీడీఓలుగా, సీనియర్ అసిసెంట్లకు డిప్యూటీ ఎంపీడీఓలుగా పదోన్నతులు కల్పించామన్నారు. తాజాగా 24 మంది టైపిస్టులు, 30 మంది జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించామన్నారు. కార్యక్రమంలో సీఈఓ శివశంకర్, ఏఓ శ్రీనివాసులు పాల్గొన్నారు.


