తాడిపత్రిలో రౌడీ రాజ్యం
సాక్షి టాస్క్‌ఫోర్స్: తాడిపత్రిలో రౌడీ రాజ్యం నడుస్తోంది. మామూళ్లు, ఆధిపత్యం, రాజకీయ ప్రేరేపిత దాడులతో రణరంగం సృష్టిస్తున్నాయి. నిత్యం గొడవలు సృష్టిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తాడిపత్రి పట్టణంలోని పాత కూరగాయాల మార్కెట్, గాంధీకట్ట, శివాలయం వీధి, టైలర్స్ కాలనీ, యల్లనూరు రోడ్డు, నందలపాడులో మట్కా, పేకాట స్థావరాలు విచ్చలవిడిగా నిర్వహిస్తున్నారు. వీటి ద్వారా ఆదాయం భారీగా వస్తుండటంతో కొందరు అధికార పార్టీ నేతలు యువకులను చేరదీసి వారితో రౌడీగ్యాంగ్‌లు నడుపుతున్నారు. కొన్ని గ్యాంగ్‌లు మట్కా, పేకాట కేంద్రాలు నిర్వహిస్తుంటే.. మరికొన్ని గ్యాంగ్‌లు అటువంటి కేంద్రాల నుంచి మామూళ్లు వసూళ్లు చేసుకుంటూ పబ్బం గడుపుకుంటున్నాయి. మామూళ్ల కోసం ఒక్కోసారి ఒక గ్యాంగ్‌పై మరొక గ్యాంగ్ దాడులకు పాల్పడి భయానక వాతావరణం సృష్టిస్తున్నాయి. అధికార పార్టీ ముఖ్య నాయకుల మెప్పుకోసం ప్రత్యర్థి పార్టీ నాయకుల ఇళ్లపై దాడులకు తెగబడుతూ, ఆస్తులను విధ్వంసానికి పాల్పడుతున్నాయి. రౌడీ గ్యాంగ్‌లకు అధికారపార్టీ నాయకుల అండదండలు ఉండటంతో పోలీసులు వారిని కట్టడి చేయడం లేదు. బాధితులు ఫిర్యాదు చేస్తున్నా కేసుల నమోదుకు వెనకాడటమే ఇందుకు నిదర్శనం.
సినీ ఫక్కీలో గ్యాంగ్ వార్..
రౌడీ గ్యాంగ్‌ల మధ్య గొడవలు సినీ ఫక్కీలో జరుగుతున్నాయి. ఈ నెల నాలుగో తేదీ రాత్రి గాంధీకట్ట వద్ద మట్కా డాన్ లఫ్పా ఖాజా గ్యాంగ్ నుంచి మట్కా మామూళ్ల కోసం టీడీపీ చోట నాయకుడు వద్ద వున్న సాదక్‌వలి అలియాస్ పండు గ్యాంగ్ రాళ్లు, కర్రలతో దాడికి దిగింది. ప్రతిగా లఫ్పా ఖాజా గ్యాంగ్ కూడా దాడి చేయడంతో పండు తీవ్రగాయాలపాలయ్యాడు. మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రెండు గ్యాంగ్‌లనూ చెదరగొట్టి కొంత మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే రెండు గ్యాంగ్‌లు అధికార పార్టీ మద్దతుదారులు కావడంతో ఫిర్యాదు లేదన్న కారణంగా పోలీసులు వారిని వదిలేశారు. ఇలాంటి గొడవలు పట్టణంలో చీకటి పడితే చాలు నిత్యకృత్యంగా మారుతున్నాయి.
ముసుగు ధరించి దాడులు..
కొన్ని రౌడీ గ్యాంగ్‌లు అధికారపార్టీ నాయకుల మెప్పు కోసం రాత్రి వేళల్లో ముసుగులు ధరించి వైఎస్సార్‌సీపీ నాయకుల ఇళ్లపై దాడులకు పాల్పడటం, ఆస్తులను ధ్వంసం చేయడం, ద్విచక్ర వాహనాలను తగలబెట్టడం చేస్తున్నాయి. ఒంటరిగా ఉన్న ప్రత్యర్థులపై దాడులు చేసి గాయపరుస్తున్నాయి. ఇప్పటి వరకు పట్టణంలో దాదాపు 20 మందిపై దాడులకు పాల్పడినట్లు సమాచారం.
మామూళ్లు, ఆధిపత్యం కోసమే..
అధికారపార్టీ నేతల
అండదండలు పుష్కలం


