గణతంత్ర వేడుకకు వేళాయె..
అనంతపురం అర్బన్: గణతంత్ర వేడుకలకు పోలీసు పరేడ్ మైదానం ముస్తాబయ్యింది. వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. సోమవారం ఉదయం 8.55 గంటలకు జాతీయ పతాకాన్ని ఇన్‌చార్జ్ కలెక్టర్ విష్ణుచరణ్ ఆవిష్కరిస్తారు. సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరిస్తారు. ఉదయం 9.20 గంటలకు ఇన్‌చార్జ్ కలెక్టర్ తన సందేశాన్ని వినిపిస్తారు. 10 గంటలకు ప్రభుత శాఖల శకటాల ప్రదర్శన, ఆ తరువాత సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఉత్తమ సేవ పురస్కారానికి 12 మంది అధికారులు, 417 మంది ఉద్యోగులను ఎంపిక చేశారు. స్వచ్ఛంద సంస్థలకూ అవార్డులు ప్రదానం చేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు కార్యక్రమం ముగుస్తుంది. గణతంత్ర దినోత్సవం ఏర్పాట్లను ఇన్‌చార్జ్ కలెక్టర్ విష్ణు చరణ్, ఎస్పీ జగదీశ్ ఆదివారం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
గణతంత్ర వేడుకకు వేళాయె..


