నేడు ‘పరిష్కార వేదిక’ లేదు
అనంతపురం అర్బన్: కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం లేదని ఇన్‌చార్జ్ కలెక్టర్ విష్ణుచరణ్ తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ సెలవు దినమైనందన కార్యక్రమం నిర్వహించడం లేదని పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
ప్రజాస్వామ్యంలో
ఓటు బ్రహ్మాస్త్రం
● ఇన్‌చార్జ్ కలెక్టర్ విష్ణుచరణ్
అనంతపురం అర్బన్: ప్రజాస్వామ్యంలో ఓటు బ్రహ్మాస్త్రం వంటిదని ఇన్‌చార్జ్ కలెక్టర్ విష్ణుచరణ్ అన్నారు. ఆదివారం కలెక్టరేట్ రెవెన్యూ భవన్‌లో ‘నా భారత్... నా ఓటు...భారత ప్రజాస్వామ్య హృదయంలో పౌరుడు’ అనే నినాదంతో 16వ జాతీయ ఓటరు దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఇన్‌చార్జ్ కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రతిజ్ఞతో ప్రారంభించారు. అనంతరం భారత ఎన్నికల కమిషన్ డాక్యుమెంటరీ వీడియోని అందరూ తిలకించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ 18 ఏళ్లు వయసు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు అవ్వాలన్నారు. 17 ఏళ్లు నిండిన వారు ప్రాస్పెక్టివ్ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకుని మంచి నేతను,, సుపరిపాలన అందించే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని సూచించారు. అనంతరం యువ ఓటర్లకు ఎపిక్ కార్డులను అందజేశారు. సీనియర్ సిటిజన్లను సన్మానించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, ఇతర పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, డీఆర్‌ఓ మలోల, ఆర్డీఓ కేశవనాయుడు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు రామ్మోహన్, మల్లికార్జునుడు, డీఐపీఆర్‌ఓ బాలకొండయ్య, అర్ట్స్ కళాశాల సహ ప్రిన్సిపల్ సహదేవుడు, విభాగాల అధిపతులు వసంతలత, యుగేశ్వరిదేవి, రియాజుద్ధీన్, తహసీల్దార్లు మోహన్‌కుమార్, విజయకుమారి, ఎనికల విభాగం డీటీ కనకరాజు, ఎస్‌ఏ శామ్యూల్ బెంజిమన్, ఎన్నికల సిబ్బంది, విద్యార్థులు, పాల్గొన్నారు.
ఉత్తమ పనితీరుకు అవార్డులు..
ఎన్నికల విధుల్లో ఉత్తమ పనితీరు కనపరిచిన 13 మందికి అవార్డులను ఇన్‌చార్జ్ కలెక్టర్ ఆందజేశారు. అవార్డు అందుకున్న వారిలో ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్లు హబీబ్‌ఖాన్, ఆంజనేయులు, లక్ష్మీదేవి, 1950 ఆపరేటరల్ శరణ్య, ఆఫీస్ సబార్డినేట్ మహేష్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు మహబూబ్, దివ్యమానస, నీలకంఠ కుమార్, నరేష్ కుమార్, మాథ్యూస్‌పాల్, గౌతమి, శ్రీకాంత్, రఘుప్రసాద్ ఉన్నారు.
నేడు ‘పరిష్కార వేదిక’ లేదు


