బరువు తగ్గే జర్నీ నిబద్ధతతో కూడిన స్థిర ప్రయాణం. దీనికి ఎలాంటి షార్ట్‌కట్‌లు ఉండవు. కేవలం సరైన ఆహారం, చక్కటి వ్యాయామాల కలయికతోటే బరువు తగ్గడం అనేది సాధ్యం. చాలామంది ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు చెప్పే మాట ఇది. అదే నిజం అని నిరూపితమైంది కృష్ణ ఇంగ్లే రోగి విషయంలో. ఎన్నో ఏళ్లుగా అధిక బరువుతో అనేక అనారోగ్య సమస్యలతో బాధపడ్డ ఈ వ్యక్తి..జస్ట్ 90 రోజుల్లో ఏదో మ్యాజిక్ చేసినట్లుగా ఏకంగా 12 కిలోల బరువు తగ్గాడు. తనకు అదేలా సాధ్యమైందో కూడా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా షేర్ చేసుకున్నాడు. మరి అతడి వెయిట్‌లాస్ సీక్రెట్ ఏంటో సవివరంగా చూద్దామా..!.
మహారాష్ట్రలోని పాల్ఘర్‌కు చెందిన కృష్ణ ఇంగ్లే ఎక్స్‌లో తాను అధిక బరువు సంబధిత సమస్యలతో బాధపడుతున్నానని, వెయిట్‌లాస్ కోసం యూట్యూబ్‌లో అనేక వీడియోలతో సహా ఏఐ హెల్ప్ కూడా తీసుకున్నట్లు తెలిపాడు. అయితే అవేమి తన బరువుని తగ్గించలేకపోయాయని బాధగా చెప్పుకొచ్చాడు. ఏ చిట్కాలు, సూచనలు పనిచేయకపోవడంతో..కొల్హాపూర్‌కు చెందిన డాక్టర్ సాయాజీరావు గైక్వాడ్‌ను సంప్రదించినట్లు తెలిపాడు. ఆయన మంచి కొవ్వులు, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహార ప్రణాళికను సూచించారు.
అదే సమయంలో భోజనంలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండేలా చూసుకున్నారు. ప్రతి రోజు కనీసం 90 నుంచి 120 గ్రాముల ప్రోటీన్ ఉండేలా చూసుకున్నాడు. స్వీట్స్‌కి పూర్తిగా దూరంగా ఉన్నాడు. వారానికి ఒకసారి మాత్రమే 10 నుంచి 12 గ్రాముల చక్కెరను పెరుగులో కలుపుకుని తినేవాడు. అలాగే కృష్ణ రోజుకు రెండు పూటలా భోజనం చేయడం, భోజనం తర్వాత 10 నిమిషాల నడక తప్పనిసరిగా పాటించేవాడు. అయితే పడుకోవడానికి కనీసం 2 నుంచి 3 గంటల ముందు రాత్రి భోజనం చేసేలా చూసుకున్నాడు.
అంతేకాకుండా వారానికి కనీసం నాలుగు రోజులు బీచ్‌లో 4 నుంచి 5 కిలోమీటర్లు నడిచేవాడు. ఈ విధమైన ప్రణాళికతో అంతకుమునుపు ఉన్న అధిక బరువు సంబంధిత సమస్యలన్నీ తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా తీవ్రమైన ఎసిడిటీ సమస్య చాలమటుకు నార్మల్ అయ్యింది. అలా కృష్ణ 78 నుంచి 80 కిలోల బరువుకి చేరుకోగానే మొత్తం అనారోగ్య సమస్యలన్నీ చాలావరకు క్యూర్ అయ్యాయని పోస్ట్‌లో రాసుకొచ్చాడు. అంతేగాదు తాను డైట్‌లో ఎలాంటి ఫుడ్ తీసుకునేవాడో కూడా తెలిపాడు.
కృష్ణ తన భోజనంలో గుడ్లు, చికెన్, పెరుగు, పప్పులు, సోయా చంక్స్ వాటితోపాటు ఆవిరి మీద ఉడికించిన కూరగాయలు, పండ్లు, సలాడ్లు ఉండేలా చూసుకునేవాడనని వివరించాడు. ఇక కృష్ణ విషయంలో బరువు తగ్గడంలో కీలకంగా మారినవి ఏంటో డాక్టర్ సాయాజరివు గైక్వాడ్ ఇలా పంచుకున్నారు.
బాగా నిద్రపోవడం
ఆకలిని అదుపులో ఉంచుకోవడం
మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవడం
తదితరాలే బరువు తగ్గేందుకు హెల్ప్ అయ్యాయని అన్నారు. అందువల్లే ఎసిడిటీ సమస్య తగ్గి, అతనిలో శక్తి స్థాయిలు మెరుగుపడ్డాయని అన్నారు. చివరగా ఆయన.. శరీరానికి పోషణవంతమైన ఆహారాన్ని అందేలా దినచర్యలో భాగం చేసుకోవడం అనేది స్థిరంగా ఉంటే..బరువు తగ్గడం అత్యంత సహజసిద్ధంగానే జరుగుతుందని అన్నారు.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను అనుసరించడం ఉత్తమం.
A follower DM’d me this 👇 (shared with identity hidden)
“Your posts changed my mindset about diet.”
84–85 kg → 72–73 kg in 90 days.
No extremes.
Just clarity and consistency. 🙏 pic.twitter.com/7XFgOdP98y— Dr.Sayajirao Gaikwad (@DietDrsayajirao) January 17, 2026
(చదవండి: Republic Day 2026: గణతంత్ర వేడుకల ఆహ్వాన పత్రిక స్పెషాల్టీ ఇదే..! అష్టలక్ష్మి రాష్ట్రాల..)


