మేడారం సమ్మక్క– సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
వివిధ ప్రాంతాల నుంచి 50వేల మంది వరకు తరలివచ్చిన భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించారు.
అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, కానుకలు, ఒడిబియ్యం, పూలు, పండ్లు, ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
జంపన్నవాగులో భక్తులు పూనకాలతో ఊగిపోయారు. కోళ్లను, యాటలను అమ్మవార్లకు మొక్కుగా చెల్లించారు. మొక్కుల అనంతరం మేడారం అటవీ ప్రాంతంలో విడిది చేసి వంటావార్పు చేసుకున్నారు.


