డిజిటల్ అరెస్ట్ అంటూ కోట్ల రూపాయలు మోస పోతున్న కథనాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఒక ఎన్‌ఆర్‌ఐ డాక్టర్ దంపతులు ఏకంగా రూ. 15 కోట్లు పోగొట్టుకున్న వైనం పలువుర్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి..
డాక్టర్ ఇంద్ర తనేజా (77),ఆమె భర్త డాక్టర్ ఓం తనేజాను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు. పోలీసులమని చెప్పి, మనీలాండరింగ్ ఆరోపణలు అంటూ భయపెట్టి గత సంవత్సరం డిసెంబర్ 24 -జనవరి 9 వరకు దక్షిణ ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్-IIలోని డిజిటల్ అరెస్ట్ చేశారు. వీరినుంచి రూ.14.85 కోట్లను దోచేశారు.నిందితులలో ఇద్దరు వ్యక్తులు తమ బ్యాంకు ఖాతాలను స్కామర్లకు అందించగా, మూడవ వ్యక్తి సహాయకుడిగా వ్యవహరించాడు
అశ్లీల వీడియోలు, మనీలాండరింగ్ కేసులో 20 కి పైగా ఫిర్యాదులు నమోదయ్యాయని ఈ జంటను భయపెట్టేశారు. . మొత్తం రూ. 14.85 కోట్లలో, గరిష్టంగా రూ. 4 కోట్లు గుజరాత్‌లోని వడోదరలోని బ్యాంకు ఖాతాకు బదిలీ చేయించారు. పోలీసులు రూ. 2.10 కోట్లను నిలిపివేయగలిగారు. డిసెంబర్ 26, 2025న అస్సాంలోని గౌహతిలోని జలుక్‌బరికి రూ.1.99 కోట్లు, ఆ తర్వాత డిసెంబర్ 29 , 30 తేదీల్లో ఒక్కొక్కరికి రూ.2 కోట్లు వడోదరలోని సామ సావ్లికి బదిలీ అయినట్టు పోలీసులు గుర్తించారు. ఇలా రకరకాలుగా ఖాతాలు ఛారిటబుల్ ఫౌండేషన్‌లు, కెమికల్ ట్రేడింగ్ కంపెనీలు, రిక్రూట్‌మెంట్ సంస్థలు, టూర్, ట్రావెల్ వ్యాపారాల పేర్లతో నమోదైన బ్యాంకు ఖాతాలకు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు.
An elderly NRI doctor couple was tricked over the phone, accused of money laundering, and lost ₹14.85 crore.
Two fraudsters, Divyank Patel & Krutik Shitoli, caught in Vadodara.
Gujarat model, once again#DrugFreeIndia #INDvsNZ @tanmoyofc @MdHafiz59473117 @NasirHussainINC pic.twitter.com/rOkpcxRdJs— Dr Kaalika (@DrKaalika) January 19, 2026
అరెస్ట్ వారెంట్లు అంటూ వరుస వీడియో కాల్స్‌తో
టెలికాం అధికారులు, పోలీసు అధికారులుగా నటిస్తూ వరుస నకిలీ కాల్స్ ,వీడియో కాల్స్ తమను ఉక్కిరి బిక్కిరి చేసేశారని బాధితులు వాపోయారు. మహారాష్ట్రలో FIR ,అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయని బెదిరించారు. అలాగే ఆమె నా పేరు మీద ఉన్న కెనరా బ్యాంక్ ఖాతాను ఒక ఒక పెద్ద మోసంలో ఉపయోగించారని భయపెట్టాడు. దీంతో తన భర్త AIIMSలోఅపరేషన్ తరువాత కోటుకుంటున్నారని, పైగా తమకు ఎవరూ సామయం చేసేవారు లేకపోవడంతో రూ. 14.85 కోట్లు కోల్పోయాని తెలిపారు.
ఇదీ చదవండి: తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం : ఆ కాఫ్ సిరప్ బ్యాన్
ఈ కేసులోగుజరాత్‌లోని వడోదర నివాసితులు దివ్యాంగ్ పటేల్, కృతిక్ షిటోలి, ప్రయాగ్‌రాజ్‌కు చెందిన కెఎస్ తివారీ నిందితులుగా గుర్తించారు. చైనా, కంబోడియాకు చెందిన స్కామర్‌లతో వీరికేమైనా సంబంధాలున్నాయనే కోణంలో పోలీసులు పరిశీలిస్తున్నారు.
ఇదీ చదవండి: మ్యాట్రిమోనియల్ స్కాం : కోట్లు నష్టపోయిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్


