breaking news
NRI
-
ఒక్కసారిగా అదృష్టం తలుపు తెరిచింది.. ఊహించనంత డబ్బు దక్కింది..
అబుదాబి: సెప్టెంబర్ మూడో వారపు బిగ్ టికెట్ ఎలక్ట్రానిక్ డ్రాలో భారత్, బంగ్లాదేశ్‌కు చెందిన నలుగురు ప్రవాసులు విజేతలుగా నిలిచారు. ఒక్కొక్కరికి 25,000 దిర్హామ్‌ల (సుమారు రూ.6.5 లక్షల) చొప్పున మొత్తం 1,00,000 దిర్హామ్‌ల (రూ.26.1 లక్షలు) నగదు బహుమతి లభించింది. విజేతల్లో తమిళనాడుకు చెందిన మెషీన్ల నిర్వాహకుడు, కేరళకు చెందిన డ్రైవర్, బంగ్లాదేశ్‌కు చెందిన పెయింటర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉన్నారు.తమిళనాడుకు చెందిన అయ్యలు స్వామి (41) గత 15 ఏళ్లుగా యూఏఈలో పనిచేస్తున్నారు. ఆయన కుటుంబం భారత్‌లోనే ఉంటోంది. బిగ్ టికెట్లో తరచుగా పాల్గొనే ఆయన ఈసారి ఒంటరిగానే టికెట్ కొనుగోలు చేసి, నంబర్‌ను యాదృచ్ఛికంగా ఎంచుకున్నారు. విజయం సాధించిన విషయం ఫోన్ ద్వారా తెలియగానే చాలా సంతోషంగా అనిపించిందని చెప్పారు. వచ్చిన డబ్బును భారత్‌లో ఉన్న తన కుటుంబం కోసం వినియోగిస్తానని తెలిపారు. భవిష్యత్తు డ్రాల్లోనూ పాల్గొంటానన్నారు.మిగతా వారు ఎవరు? ఏమన్నారు? బంగ్లాదేశ్‌కు చెందిన అబుల్ బషర్ (56) షార్జాలో గత 34 ఏళ్లుగా నివసిస్తున్నారు. తన సోదరుడి ద్వారా బిగ్ టికెట్ గురించి తెలుసుకున్న ఆయన ప్రస్తుతం 20 మంది స్నేహితులతో కలిసి పాల్గొంటున్నారు. గెలిచిన బహుమతిని బృంద సభ్యుల మధ్య పంచుకోనున్నారు. తన వాటాను కుటుంబానికి పంపడంతో పాటు కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు కేటాయిస్తానని అబుల్ చెప్పారు. బంగ్లాదేశ్‌కు చెందిన సేల్స్ ఎగ్జిక్యూటివ్ మహమ్మద్ షహాదత్ హుస్సేన్ (38) గత 16 ఏళ్లుగా అబుదాబిలో ఉంటున్నారు. ఈసారి 13 మంది స్నేహితులతో కలిసి టికెట్ కొనుగోలు చేశారు. ప్రత్యేకంగా నంబర్‌ను ఎంచుకోకుండా కనిపించిన మొదటి నంబర్‌నే తీసుకున్నారు. వచ్చిన బహుమతిని బృంద సభ్యులతో పంచుకుని, తన వాటాను బంగ్లాదేశ్‌కు పంపాలని భావిస్తున్నారు. ఇకపై ప్రతి నెలా పాల్గొని గ్రాండ్ ప్రైజ్ గెలిచే వరకు ప్రయత్నిస్తానని చెప్పారు. కేరళకు చెందిన డ్రైవర్ ఎల్డో మాథ్యూ (30) గత 8 ఏళ్లుగా కువైట్‌లో పనిచేస్తున్నారు. 25 మంది సభ్యులతో కలిసి బిగ్ టికెట్లో పాల్గొంటున్న ఆయన బృందానికి 25,000 దిర్హామ్‌ల బహుమతి లభించింది. ఈ మొత్తాన్ని 25 మందితో పంచుకోనున్నారు. తన వాటాను ఎలా వినియోగించాలనే విషయాన్ని ఇంకా నిర్ణయించలేదని ఎల్డో తెలిపారు. అయితే భవిష్యత్తులోనూ బిగ్ టికెట్లో పాల్గొని మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు.ఇదీ చదవండి: సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు భారతరత్న ఇవ్వాలి -
తానా ప్రపంచసాహిత్య వేదిక 96వ సమావేశం విజయవంతం
‘తానా ప్రపంచ సాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో గత ఆరేళ్లకు పైగా “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట ప్రతి నెలా ఆఖరి ఆదివారం అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి (9 సెప్టెంబర్) ని పురస్కరించుకుని తెలంగాణా రాష్ట్రంలో తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తానా ప్రపంచసాహిత్య వేదిక ఆదివారం జరిపిన 96వ అంతర్జాల సమావేశం సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ స్వాగతోపన్యాసంతో ప్రారంభమై విజయవంతంగా ముగిసింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న తెలంగాణా రాష్ట్ర శాసనమండలి సభ్యులు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, విశిష్ట రచయిత, ప్రజాకవి, వాగ్గేయకారుడు డా. గోరటి వెంకన్న మాట్లాడుతూ “తెలుగు భాషను కాపాడుకోవడం మన అందరి బాధ్యత అని, భాష పరిరక్షణపట్ల ప్రజలలో అవగాహన ఆవసరం అన్నారు. అలాగే ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఉత్తర్వులు, కార్యకలాపాలు తెలుగులో ఉండేటట్లు చూడాలని, ప్రాధమిక స్థాయిలో మాతృభాషను నిర్భందంగా ప్రవేశపెట్టాలని కోరారు.తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర తన ప్రసంగంలో “ప్రజాకవిగా పేరుగాంచిన కాళోజీ తన జీవితం అంతా సామాన్య ప్రజల మధ్యే గడుపుతూ, అనునిత్యం ప్రజాహక్కుల కోసం, తెలుగుభాష పరిరక్షణ కోసం పాటుబడ్డ భాషాభిమాని అని, కేవలం ఆయన జయంతిని భాషాదినోత్సవంగా జరుపుకుని, ఒక సాహిత్య పురస్కారం అందజేసి చేతులు దులుపుకోకుండా, ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో తెలుగు భాషను పరిరక్షించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని కోరారు.”విశిష్టఅతిథులుగా పాల్గొన్న తెలంగాణా తెలుగు అకాడమీ ఛైర్మన్ ఆచార్య కూరపాటి వెంకట నారాయణ, బాల సాహితీవేత్త డా. సిరి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి తల్లి అంటే ఎంత ప్రేమో, తల్లి భాషను కాపాడుకోవడంలోను అంత శ్రద్ధ ఉండాలని, ఒక ఉద్యమ స్ఫూర్తితో ప్రజలంతా కలిసికట్టుగా భాషను కాపాడుకోవాలని, ప్రభుత్వం వెంటనే తగు చర్యలను చేపట్టకపోతే తెలుగునేలమీద తెలుగుభాష అంతరించిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో తెలుగువిభాగంలో సహాచార్యురాలిగా పనిచేస్తున్న డా. ఎం. దేవేంద్ర కాళోజీ కలంనుండి వెలువడ్డ కొన్ని ముఖమైన కధలను సంక్షిప్తంగా పరిచయంచేసి ఆయన రచనా నైపుణ్యాన్ని చక్కగా ఆవిష్కరించారు. కార్యక్రమం చివరిలో కాలిఫోర్నియాలో నివసిస్తున్న రచయిత వెంకట్ నాగం రచించిన, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ప్రచురించిన, పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ ముందు మాటలు వ్రాసిన “కలగూరగంప”, “రచ్చబండ చర్చలు” అనే రెండు గ్రంధాలను డా. ప్రసాద్ తోటకూర ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రచయిత వెంకట్ తో పాటు ఆయన భార్య వాణి, మిత్రులు డా. సురేంద్ర దార, వేణు నక్షత్రం, తాటిపాముల మృత్యుంజయుడు, శ్రీకాంత్ గోడే లు పాల్గొని రచయిత వెంకట్‌కు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు, ఈ కార్యక్రమ విజయానికి సహకరించిన ప్రసార మాధ్యమాలకు, కార్యకర్తలకు డా. ప్రసాద్ తోటకూర కృతజ్ఞతలు తెలియజేశారు.ఇదీ చదవండి: 9/11 అమరులకు నివాళిగా ‘గ్రాడ’ మెగా రక్తదాన శిబిరం -
9/11 అమరులకు నివాళిగా ‘గ్రాడ’ మెగా రక్తదాన శిబిరం
అమెరికాలో 9/11 ఉగ్రదాడుల అమరులను స్మరిస్తూ, 'గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ ఏరియా' (GRADA) ఆధ్వర్యంలో కార్టర్ బ్లడ్‌కేర్ సహకారంతో నిర్వహించిన 4వ మెగా రక్తదాన శిబిరం విజయవంతమైంది. డల్లాస్ - ఫ్రిస్కోలోని స్పైసీ వెన్యూ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 50 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు.ఫ్రిస్కో నగర మేయర్ మార్క్ హిల్ ముఖ్య అతిథిగా హాజరై నిర్వాహకులను, రక్తదాతలను ప్రత్యేకంగా అభినందించారు. సమాజ హితం కోసం గ్రాడ చేపడుతున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు డా. దర్గా నాగిరెడ్డి, చెన్నా రెడ్డి కొర్విలకు గ్రాడ కార్యవర్గం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. వారి మార్గదర్శకత్వంలోనే సమాజానికి ఉపయుక్తమైన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించగలుగుతున్నామని పేర్కొంది. ఈ కార్యక్రమ విజయవంతానికి కృషి చేసిన కోఆర్డినేటర్లు ఉమా మహేశ్వర్, హరినాథ్, జగదీష్‌లతో పాటు చురుగ్గా పాల్గొన్న యువ వాలంటీర్లకు గ్రాడ అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి గాలి, కార్యదర్శి రాజు కంచం, ఈసీ కార్యవర్గ సభ్యులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. రక్తదాన శిబిరానికి స్థలాన్ని కేటాయించి పూర్తి సహకారం అందించిన స్పైసీ వెన్యూ రెస్టారెంట్ యజమాని సునీల్‌కు, ప్రాణాలను కాపాడేందుకు ముందుకొచ్చిన రక్తదాతలందరికీ గ్రాడ టీమ్ ధన్యవాదాలు తెలియజేసింది.ఇదీ చదవండి: జపాన్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలు -
23 ఏళ్ల తరువాత అమెరికా డ్రీమ్స్ వదిలి ‘అమ్మ’దగ్గరికి
అమెరికాలో స్థిరపడి, సొంత వ్యాపారం నిర్వహిస్తున్న ఒక ఎన్సారై భారత్‌కు తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. అదీ 23 ఏళ్ల తర్వాత. ముంబైలో మరింత సురక్షితంగా అనిపించడం' వల్ల 23 ఏళ్ల తర్వాత తిరిగి భారత్‌కు వచ్చానని చెప్పిన ఒక ఎన్ఆర్ఐ (NRI) సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించారు. ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్వదేశానికి తిరిగి రావాలన్న నిర్ణయం వెనుక అసలు కారణలేంటి?ఆ ఎన్ఆర్ఐ సోషల్ మీడియా పోస్ట్ ప్రకారం తన 15వ ఏట అమెరికా వెళ్లిన ఆయన, న్యూయార్క్ నగరంలో చదువు పూర్తి చేసుకుని బయోమెడికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ చేశారు. ఆ తర్వాత ఫార్మాస్యూటికల్ రంగంలో స్థిరపడి, హెచ్-1బి వీసా పొంది, ఐదేళ్ల తర్వాత అమెరికా పౌరసత్వాన్ని పొందారు. సొంతంగా వ్యాపారం ప్రారంభించి విజయవంతం అయ్యారు. మరి ఇండియాకు ఎందుకు తిరిగొచ్చారు.పెళ్లి కాలేదు, ఒక కుక్క, సొంత ఇల్లుతొ అమెరికన్ డ్రీమ్ లాంటి జీవనశైలితో జీవితం హాయిగా గడుస్తోంది. కానీ అప్పటికీ ఆయన తల్లిదండ్రులు 60 ఏళ్ల వయసు దాటి వృద్ధాప్యంలో ఉన్నారు, వారికి అమెరికాకు రావాలనే ఆసక్తి ఏమాత్రం లేదు. ఇంతలో తండ్రికి క్యాన్సర్ నిర్ధారణ అయింది. 70 ఏళ్ల వయసు తండ్రి క్యాన్సర్‌తో మరణించడం, తల్లి ఒంటరిగా ఉండటంతో ఆయనకు భారతదేశానికి తిరిగి వెళ్లాలనే కోరిక బలపడింది. 60 ఏళ్ల పైబడిన తల్లిని చూసుకోవడం, ఆమె వద్దే ఉండాలనే ఉద్దేశంతో ఆయన అమెరికాను వీడాలని నిర్ణయించుకున్నారు.2018, 2020 సంవత్సరాల్లో భారతదేశానికి వచ్చి వెళ్లిన ఆయన, కోవిడ్ మహమ్మారి సమయంలో భారతదేశ వాతావరణానికి, జీవన శైలికి ఆకర్షితులయ్యారు. 2022లో అమెరికాలో తన వ్యాపారాన్ని విక్రయించి, పెన్సిల్వేనియాలోని తన ఇంటిని అమ్మేసి 2023లో ముంబైకి శాశ్వతంగా తిరిగి వచ్చేశారు. ప్రస్తుతం ఆయన భారతీయ కంపెనీలకు కన్సల్టెన్సీ సేవలు అందిస్తున్నారు.ఇదీ చదవండి: 3 రోజుల సమ్మె : బ్యాంకులకు ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలుఅమెరికా డ్రీమ్ కంటే స్వదేశమే మిన్నఅమెరికాలోని శుభ్రమైన గాలి, అక్కడి జీవనశైలి కంటే ఇంటి భోజనం, తల్లితో సాయంత్రం వేళల్లో టీ తాగడం, పాత స్నేహితులు, బంధువులతో గడపడంలో లభించే అమూల్యమైన ప్రేమ (అన్‌కండిషనల్ లవ్) ముంబైలో తనకు లభించిందని, అందుకే ఇక్కడే ఎక్కువ భద్రతా భావన కలిగిందని ఆయన పేర్కొన్నారు. ఏది ఏమైనా ఇంటి ఫుడ్, తల్లిదండ్రుల చిన్ననాటి కథలు వినడం , స్నేహితులతో సరదాగా గడపడం ఆ నిస్వార్థ ప్రేమ ముందు అన్నీ దిగదుడుపే అని వ్యాఖ్యానించారు.అంతేకాదు అమెరికాకు వెళ్లే ముందు వదిలిపెట్టిన నా చిన్ననాటి స్నేహితులతో ఇప్పటికీ సంబంధాలు కొనసాగిస్తున్నాను. వారు తమ కుటుంబ బాధ్యతల్లో బిజీగా ఉన్నప్పటికీ, తరచుగా కలుస్తుంటాం, కనీసం ఏడాదికి ఒకసారి ట్రిప్పులు లేదా ట్రెక్కింగ్‌లకు వెళ్తుంటామని సంతోషంగా చెప్పారు. సోషల్ మీడియా స్పందనలు చాలామంది నెటిజన్లు ఆయన నిర్ణయాన్ని సమర్థిస్తూ అభినందించారు. జీవితంలో నూటికి నూరుపాట్లు సంతృప్తే ముఖ్యం. ఏదైనా బలమైన కారణం ఉంటే తప్ప మళ్లీ అమెరికాకు వెళ్లకండి. సంతోషంగా ఉండండి అని ఒకరు వ్యాఖ్యానించారు. పౌరసత్వం కేవలం కాగితం ముక్క మాత్రమే భారతదేశం అంత చెడ్డది కాదు. యపలకపి మనలను ఈ స్థాయికి తెచ్చిన కుటుంబానికి అండగా ఉండటమే నిజమైన సంతోషం మరొకరు అభిప్రాయపడ్డారు. భారత్‌లో అమ్మగారితో సమయం గడపండి. ఆ తర్వాత ఇక్కడే ఉండాలా లేక అమెరికా వెళ్ళాలా అన్నది నిర్ణయించుకోవచ్చు అని మరో నెటిజన్ సలహా ఇచ్చారు. ఇదీ చదవండి : పక్కింటి వైఫై సాయం : స్లమ్ నుంచి ఢిల్లీ ఐఐటీ దాకా ఎవరీ అభిషేక్ -
షార్జాలో భారతీయుడి దారుణ హత్య.. భార్య, కొడుకు మిస్సింగ్!
యూఏఈలో జరిగిన ఘోరం.. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. షార్జాలో భారతీయుడి మిస్టరీ కేసు విషాదాంతంగా ముగిసింది. అతని మృతదేహం ఓ కారులో ముక్కలుగా లభించగా.. భార్య, కొడుకు కనిపించకుండా పోవడం ఈ కేసును మరింత మిస్టరీగా మార్చింది. మృతుడ్ని కర్ణాటకకు చెందిన అల్విన్ ప్రకాశ్ కుందర్గా అక్కడి అధికారులు నిర్దారించారు.ఉడుపి జిల్లా కుందాపురకు చెందిన అల్విన్ .. గత 14 ఏళ్లుగా షార్జా ఎయిర్‌పోర్టులో పని చేస్తుండేవారు. భార్య, కొడుకుతో ఆయన అక్కడే జీవిస్తున్నారు. అయితే జూలై 20న అల్విన్‌కు ఆయన సోదరుడు అనిల్ ప్రశాంత్ కుందర్ ఫోన్ చేశారు. అల్విన్ కాల్ ఎత్తకపోగా.. తాను బాగానే ఉన్నానంటూ మెసేజ్ పంపారు. సాధారణంగా వాయిస్ మెసేజ్‌ల ద్వారానే మాట్లాడే అల్విన్ ఇలా టెక్స్ట్ చేయడం కుటుంబ సభ్యులకు అనుమానం కలిగించింది. వారం రోజుల తర్వాత మళ్లీ ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో స్నేహితుడి ద్వారా ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేశారు.అల్విన్ నివసించే అపార్ట్‌మెంట్‌కు వెళ్లిన ఆయన స్నేహితుడికి వాచ్‌మన్.. ఆయన భారత్‌కు వెళ్లిపోయారని చెప్పాడు. ఆయన పని చేసే కంపెనీ హెచ్ఆర్ విభాగం కూడా ఇదే విషయాన్ని చెప్పింది. దీంతో కొన్నాళ్లు ఆగి చూసినా ఫలితం లేకపోయింది. దీంతో సదరు కంపెనీ అధికారులు పాస్‌పోర్ట్ వివరాలను పరిశీలించారు. అల్విన్ అప్పటికీ షార్జాలోనే ఉన్నట్లు తేలడంతో మిస్సింగ్ ఫిర్యాదు చేశారు.రెండు నెలల తర్వాత.. ఒమన్ వైపు వెళ్లే మార్గంలో పార్క్ చేసిన ఓ కారులో ఓ మృతదేహం లభించింది. అందులో మృతదేహాన్ని తొమ్మిది ముక్కలుగా చేసి రెండు బ్యాగుల్లో ఉంచారు. పోస్టుమార్టం ద్వారా మృతదేహం అల్విన్దేనని నిర్ధారణ అయింది. హత్యకు కారణం ఏమిటి? ఎవరు చేశారు? అనే వివరాలు మాత్రం ఇంకా వెలుగులోకి రాలేదు.భార్య, కుమారుడు ఎక్కడ?అల్విన్ హత్య తర్వాత ఆయన భార్య టీనా, కుమారుడు ఆచూకీ తెలియకపోవడం కేసులో మరో ప్రశ్నగా మారింది. వాళ్లు షార్జా నుంచి భారత్‌కు వెళ్లి ఉండొచ్చన్న ప్రచారం ఉన్నప్పటికీ.. దీనిపై అధికారిక నిర్ధారణ లేదు. హత్యలో టీనా పాత్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దంపతుల మధ్య ఎలాంటి వివాదం ఉన్నట్లు తమకు తెలియదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.ఉడుపి పోలీసుల దృష్టికి..అల్విన్ సోదరుడు అనిల్, ఉడుపి ఎస్పీని కలిసి కేసుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. షార్జా అధికారుల నుంచి అధికారిక సమాచారం కోసం ఉడుపి పోలీసులు ఎదురుచూస్తున్నారు. యూఏఈలో న్యాయపరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాత అల్విన్ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురావాలని కుటుంబం ప్రయత్నిస్తోంది. హత్య వెనుక కారణం, నిందితులెవరు, అల్విన్ భార్య, కుమారుడు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారన్నది షార్జా దర్యాప్తులో తేలాల్సి ఉంది.మరోవైపు ఈ ఘటన వెలుగులోకి రావడానికి దాదాపు రెండు నెలలు పట్టడం, హత్య తర్వాత అల్విన్ భార్య, పదో తరగతి చదువుతున్న కుమారుడి ఆచూకీ లేకపోవడం కేసును మరింత మిస్టరీగా మార్చింది.విదేశాల్లో భారతీయుల విషాదం..ఉపాధి, మెరుగైన జీవితం కోసం విదేశాలకు వెళ్లే భారతీయులు అనుకోని ప్రమాదాలు, అనుమానాస్పద మరణాలతో కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగుల్చుతున్న ఘటనలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తుంటాయి. అల్విన్ కుందర్ విషయంలోనూ అసలు ఏం జరిగింది? ఆయన హత్యకు దారితీసిన పరిస్థితులేమిటి? కుటుంబ సభ్యుల ఆందోళనలకు ఎప్పుడు సమాధానం దొరుకుతుంది? అనేది దర్యాప్తుపైనే ఆధారపడి ఉంది.ఇదీ చదవండి: క్షమాపణలు చెప్పేంత తప్పు ఆ ఎమ్మెల్యే కూతురు చేసిందా? -
జపాన్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలు
జపాన్‌లోని తెలుగు సమాజానికి అండగా నిలుస్తున్న TAJ (Telugu Association of Japan) ఆధ్వర్యంలో టోక్యోలోని ఓజిమా ప్రాంతంలో గణేష్ వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో, భారతీయ సంస్కృతి సంప్రదాయాల వైభవాన్ని ప్రతిబింబించేలా ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో తెలుగు కుటుంబాలతో పాటు స్థానిక జపాన్ ప్రజలు కూడా ఉత్సాహంగా పాల్గొని, భారతీయ ఆధ్యాత్మికత, సంస్కృతి,సంప్రదాయాలను ఆసక్తిగా వీక్షించారు. భారతీయులు, జపాన్ స్థానికులు కలిసి వినాయక చవితిని జరుపుకోవడం రెండు సంస్కృతుల మధ్య స్నేహం, సాంస్కృతిక పరస్పర అవగాహనకు ప్రతీకగా నిలిచింది.వినాయక చవితిని పురస్కరించుకుని వినాయకుడికి ప్రత్యేక పూజలు, భక్తి కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారులు, కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పాల్గొని వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకొచ్చారు.“ఎక్కడ ఉన్నా మన సంస్కృతి మనతోనే” అనే భావనతో, జపాన్‌లోని తెలుగు కుటుంబాలు తమ పిల్లలకు భారతీయ సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాలను పరిచయం చేస్తూనే, స్థానిక జపాన్ సమాజంతో సాంస్కృతిక అనుబంధాలను పెంపొందించేలా కార్యక్రమాన్ని నిర్వహించారు.భారతదేశానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న టోక్యోలో తెలుగు సంస్కృతి, భారతీయ సంప్రదాయాలు, జపాన్ స్థానికుల భాగస్వామ్యం, భక్తి, సమాజ ఐక్యత కలగలిసి వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకొచ్చాయి.కార్యక్రమంలో పాల్గొన్న కుటుంబాలు, చిన్నారులు, TAJ సభ్యులు, జపాన్ స్థానికులు పరస్పరం వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ నిర్వహించారు.జపాన్‌లో భారతీయ, తెలుగు సంస్కృతిని కొనసాగిస్తూ, జపాన్ సమాజంతో స్నేహపూర్వక సాంస్కృతిక వారధులను నిర్మించడంలో TAJ కీలక పాత్ర పోషిస్తోందని నిర్వాహకులు తెలిపారు. -
బీజేపీలో చేరిన NRI వాణి గడ్డం
-
మలేషియా విమానంలోనే ప్రాణం విడిచిన భారతీయుడు
కౌలాలంపూర్ నుండి సిడ్నీకి వెళ్తున్న మలేషియా ఎయిర్‌లైన్స్ Malaysia Airlinesవిమానంలో 58 ఏళ్ల భారతీయుడు మరణించారు. ఎనిమిది గంటల విమాన ప్రయాణంలో ఆయనకు అకస్మాత్తుగా వైద్యపరమైన అత్యవసర పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగానే ఆయన చనిపోయినట్లు తెలుస్తోంది. ఆయన పేరు, ఇతర వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు.పీపుల్ మ్యాగజైన్ పోలీసులను ఉటంకిస్తూ ఈ విషయాన్ని వెల్లడించింది. కుటుంబ సభ్యులతో ప్రయాణిస్తుండగా ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారని తెలిపింది. డైలీ మెయిల్ నివేదిక ప్రకారం, విమాన ప్రయాణంలో అతనికి ఆస్తమా సోకడంతో మరణించారని సమాచారం. విమానంలో ఒక ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడని సమాచారం అందడంతో, సెప్టెంబర్ 16న సాయంత్రం 5:50 గంటలకు (స్థానిక సమయం) సిడ్నీ విమానాశ్రయం అంతర్జాతీయ టెర్మినల్‌కు అధికారులు చేరుకున్నారని న్యూ సౌత్ వేల్స్ పోలీసులు ఒక ప్రకటనలో పీపుల్‌కు తెలిపారు. విమాన సిబ్బంది, తోటి ప్రయాణికులు ప్రథమ చికిత్స అందించడానికి ప్రయత్నించారని, కానీ ఫలితం లేకపోయిందని విమానంలో ఉన్న వైద్యుడు కూడా దీనని ధృవీకరించారని అధికారులు తెలిపారు. తరువాత మరణించినట్లు ప్రకటించారుఇదీ చదవండి: పెళ్లైన 17 రోజులకే అమెరికాలో హైదరాబాదీ అనుమానాస్పద మృతిఅయితే దీన్ని అనుమానాస్పదంగా పరిగణించడం లేదని, తదుపరి పోలీసు చర్యలు ఉండవని కూడా పోలీసులు తెలిపారు. అటు మలేషియా ఎయిర్‌లైన్స్ మరియు సిడ్నీ విమానాశ్రయం ఇంకా ప్రకటన విడుదల చేయలేదు. ఈ కేసులో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: రూ. 500 కోట్ల నోటీసు : దిశా కేసులో ఆదిత్య ఠాకరేకు మరో షాక్ -
పెళ్లైన 17 రోజులకే అమెరికాలో హైదరాబాదీ అనుమానాస్పద మృతి
అమెరికాలో హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి ఆకస్మిక మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. అమెరికాలోని మసాచుసెట్స్‌లో సివిల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నమహ్మద్ జాబర్ హుస్సేన్ (28) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వివాహం జరిగిన కేవల 17 రోజులకే అమెరికాలోని తన ఇంట్లో శవమై తేలడం కలకలం రేపింది.మసాచుసెట్స్‌లోని లోవెల్‌లో ఉన్న తన ఇంట్లోని గదిలో హుస్సేన్ నిద్రలోనే కన్నుమూసినట్లు తెలుస్తోంది. జాబర్ హుస్సేన్‌కు ఆగస్టు 28న టెక్సాస్‌లో వివాహం జరిగింది. ఆ తర్వాత మసాచుసెట్స్‌లోని తన నివాసానికి తిరిగి వెళ్లారు. సెప్టెంబర్ 14న కుటుంబ సభ్యులతో చివరిసారిగా మాట్లాడిన కొద్ది గంటలకే, ఆయన గదిలో విగతజీవుడిగా పడి ఉన్నట్లు రూమ్మేట్ ద్వారా సమాచారం అందింది.తాము ఆర్థికంగా బలహీనవర్గానికి చెందినవారమని, హుస్సేన్ పార్థివ దేహాన్ని హైదరాబాద్‌కు రప్పించే ఏర్పాట్లు చేయాలని కుటుంబం భారత ప్రభుత్వ సహాయాన్ని కోరింది.ఇదీ చదవండి: రూ. 500 కోట్ల నోటీసు : దిశా కేసులో ఆదిత్య ఠాకరేకు మరో షాక్మజ్లిస్ బచావో తహ్రీక్ (MBT) జోక్యంఎంబీటీ ప్రతినిధి అంజద్ ఉల్లా ఖాన్ ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ దృష్టికి తీసుకువెళ్తూ.. అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ద్వారా మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు సాయం చేయాలని ఎక్స్ వేదికగా కోరారు. మృతికి అసలు కారణాలు ఏంటి దానిపై స్పష్టత లేదు. పోస్ట్‌మార్టం,వైద్య నివేదికల కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు.ఇదీ చదవండి: రూ. 11 దానికి రూ. 325 వసూలు : మరో బాంబు పేల్చిన తుకారం ముండే -
పెన్సిల్వేనియాలో డాక్టర్ వై ఎస్ రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ రక్తదాన శిబిరం
డాక్టర్ వై ఎస్ రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ (అమెరికా) ఆధ్వర్యంలో వైఎస్సార్ పదిహేడవ వర్ధంతి నేపథ్యంలో 9/11 ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమరుల స్మరణార్థం ఫిలడెల్ఫియాలో సెప్టెంబర్ 12, 2026 న అమెరికన్ రెడ్ క్రాస్ సంస్థ సహాయంతో మెగా రక్త దాన శిబిరం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ గోసల రాఘవ రెడ్డి, ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఆళ్ళ రామి రెడ్డి, శివ మేక పాల్గొన్నారు. డాక్టర్ రాఘవ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఏడాది జరిగే ఈ రక్తదాన శిబిరానికి దాదాపు 300 మంది దాక కార్యకర్తలు పాల్గొని వైఎస్సార్‌కి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది దాక రక్త దానం చేశారు. ఈ కార్యక్రమంలో విజయ్ పోలంరెడ్డి, శ్రీకాంత్ పెనుమాడ, ఎల్లంపల్లి రామమోహన్ రెడ్డి, నగేష్ ముక్కమల్ల, ఆనంద్ తొండపు, ప్రసాద్ సానికొమ్ము, శ్రీధర్ రెడ్డి తిక్కవరపు, భాస్కర రెడ్డి, ఉయ్యూరు నాగి రెడ్డి, రవి మరక, కొత్త రమణ, కొండా లక్ష్మీనరసింహ రెడ్డి, గీత దోర్నాదుల, ఆళ్ళ అనుపమ రెడ్డి, తాతా రావు, వైఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు.యువ వాలంటీర్స్ అనేక మంది ఈ రక్తదాన శిబిరానికి సహాయ సహకారాలు అందించారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్న శ్రీకాంత్ పెనుమాడ, లక్ష్మీనారాయణ రెడ్డి గోపిరెడ్డి, హరి కురుకుండ, వెంకటరామి రెడ్డి శనివరపు మరియు ఇతరులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియచేసుకుంటుంది డాక్టర్ వైఎస్సార్ ఫౌండేషన్!మంచి భోజనం ఏర్పాటు చేసిన పెప్పర్ హౌస్ రాజేంద్ర మోదుగుల వారికి, సాక్షి టీవీ శివ్ వొడపల్లి గారికి కృతజ్ఞతలు. క్రమం తప్పకుండా ఇలాంటి మెగా రక్త దాన శిబిరాన్ని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫౌండేషన్ నిర్వహిస్తున్నందుకు అమెరికన్ రెడ్ క్రాస్ ప్రత్యేకంగా అభినందించింది.ఇదీ చదవండి: వైఎస్సార్ చెస్ టోర్నమెంట్లో విజేతగా శిబి శ్రీనివాస్ చెమికల) -
పోలీసులు బెదిరించి నా పొలం రాయించుకున్నారు.. NRI శాంత సంచలన వీడియో
-
పట్టాలపై ప్రియుడితో ఎన్నారై యువతి.. క్షణాల్లో ఘోరం!
న్యూయార్క్ నగరంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పట్టాలపై కూర్చున్న ఓ జంటను రైలు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో భారత సంతతికి చెందిన మలైకా చిత్రే (24)తో పాటు నేపాలీ-అమెరికన్ నవమ్ కౌల్ (24) ఉన్నారు. బలవన్మరణమా? లేదంటే మత్తులో అక్కడికి చేరారా?.. వీళ్లు పట్టాలపై ఎందుకు కూర్చున్నారు అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.లోయర్ మన్‌హాటన్‌లోని స్ప్రింగ్ స్ట్రీట్ సబ్వే స్టేషన్లో ఆదివారం తెల్లవారుజామున 3.15 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. సౌత్ వింగ్ వైపు వెళ్తున్న నంబర్ 4 రైలు పట్టాలపై ఉన్న ఇద్దరినీ ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించగా.. ఇద్దరూ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటన తర్వాత రైలులో ఉన్న సుమారు 100 మంది ప్రయాణికులను బయటకు తరలించారు.ఇద్దరూ మంచి ఉద్యోగాల్లో..మలైకా చిత్రే న్యూజెర్సీలోని డేటన్కు చెందినవారు. అకాడియా ఫార్మాస్యూటికల్స్‌లో ఆపరేషన్స్ స్పెషలిస్ట్‌గా పనిచేస్తున్నారు. నవమ్ కౌల్ సైరేవిల్లేకు చెందినవారు కాగా.. బ్లూమ్‌బర్గ్‌లో ఫైనాన్షియల్ డేటా అనలిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఇద్దరూ రట్జర్స్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థులే. దాదాపు ఒకే సమయంలో అక్కడి నుంచి పట్టాలు పొందారు.ఈ విషాదంతో వాళ్ల సన్నిహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. నవమ్ ఎంతో స్నేహపూర్వకంగా, సరదాగా ఉండేవాడని స్నేహితులు గుర్తుచేసుకున్నారు. ఆయన తల్లిదండ్రులు దాదాపు మూడు దశాబ్దాల క్రితం నేపాల్ నుంచి అమెరికాకు వలస వచ్చినట్లు తెలిపారు. మలైకా తెలివైన, చురుకైన విద్యార్థినిగా తమకు తెలుసని ఆమె కుటుంబానికి సమీపంలోని పొరుగువారు చెప్పారు. ఇంత చిన్న వయసులో ఇద్దరూ ఇలా ప్రాణాలు కోల్పోవడంపై విచారం వ్యక్తం చేస్తున్నారు.A tragic situation in Manhattan. Recent Rutgers graduates Navam Kaul and Malaika Chitre were killed after being struck by a southbound 4 train at Spring Street around 3:15 a.m. Sunday.Reports say Kaul went onto the tracks first and Chitre climbed down after him, apparently…— Shadab Chow 🇺🇸 (@tonyinmycity97) September 15, 2026వైరల్‌గా మారిన వీడియో..ఈ ఘటనకు ముందు ఓ వ్యక్తి తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్‌గా మారింది. అందులో మలైకా, నవమ్ ఇద్దరూ పట్టాలపై ప్రశాంతంగా కూర్చున్నట్లు కనిపిస్తోంది. రైలు వస్తున్న సమయంలోనూ వారు అక్కడే ఉన్నారు. అయితే రైలు డ్రైవర్ మాత్రం.. మలైకా నవమ్ను తన వైపునకు లాగుతున్నట్లు, ఆమె నవ్వుతున్నట్లు కనిపించిందని చెప్పినట్లు సమాచారం.ఇద్దరూ పట్టాలపైకి ఎందుకు వెళ్లారన్నది మాత్రం ఇప్పటికీ స్పష్టంగా తెలియలేదు. వారిలో ఒకరు ప్రమాదవశాత్తు పట్టాలపై పడిపోయి ఉండొచ్చని, ఆమెను కాపాడేందుకు మరొకరు పట్టాలపైకి వెళ్లి ఉండొచ్చని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. రైలు డ్రైవర్ వారిని గమనించి అత్యవసర బ్రేకులు వేసినా.. అప్పటికే రైలు సమీపంలోకి రావడంతో ఆపడం సాధ్యం కాలేదని అధికారులు తెలిపారు.మత్తులో ఉన్నారా?ఇద్దరూ పట్టాలపైకి ఎందుకు వెళ్లారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారు మద్యం లేదంటే ఇతర మత్తు పదార్థాల ప్రభావంలో ఉండి ప్రమాదాన్ని గుర్తించలేకపోయారా? అనే కోణంలోనూ విచారణ సాగుతోంది. ఘటనాస్థలిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. అయితే ఆత్మహత్య కోణాన్ని కూడా పూర్తిగా కొట్టిపారేయలేదని అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: ఆ యాక్సిడెంట్‌తో స్పాట్లోనే చనిపోయేదాన్ని! -
620 కోట్ల కుంభకోణం.. భారత్‌లో తలదాచుకున్న నిందితుడు!
అమెరికాలో సుమారు రూ. 620 కోట్ల విలువైన భారీ మెడికేర్ కుంభకోణానికి పాల్పడి, మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న ఓ భారతీయ వ్యక్తి ప్రస్తుతం హైదరాబాద్‌లో తలదాచుకున్నట్లు తెలిసింది. మహమ్మద్ ఖదీర్ ఖాన్ అనే ఈ నిందితుడు నగరంలోనే ఉన్నాడని అమెరికా పోలీసులు హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన స్థానిక అధికారులు అతడి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.టెక్సాస్‌లోని రిచర్డ్సన్లో ఖదీర్ ఖాన్ 'అమెరికన్ ప్రీమియర్ ల్యాబ్స్' పేరుతో ఒక జెనెటిక్ టెస్టింగ్ ల్యాబొరేటరీని నిర్వహించేవాడు. 2023 ఆగస్టు నుంచి 2024 అక్టోబర్ మధ్య కాలంలో, అమెరికా ప్రభుత్వ మెడికేర్ పథకం కింద సుమారు 93 మిలియన్ డాలర్ల విలువైన నకిలీ క్లెయిమ్‌లను అతడు సృష్టించాడు. వీటి ద్వారా ప్రభుత్వం నుంచి 65 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 620 కోట్లు) అక్రమంగా పొందినట్లు దర్యాప్తులో తేలింది. వైద్యుల వివరాలు, సంతకాలను ఫోర్జరీ చేసి ఈ భారీ మోసానికి పాల్పడినట్లు అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, ఎఫ్‌బీఐ, ఆరోగ్య శాఖల సంయుక్త విచారణలో వెల్లడైంది.ఈ కుంభకోణం బయటపడటంతో అధికారులు ఖాన్ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసి, అతడిని 'మోస్ట్ వాంటెడ్ ఫ్యుజిటివ్'గా ప్రకటించారు. అయితే, అప్పటికే అతను అమెరికా నుంచి పరారయ్యాడు. ప్రస్తుతం ఖాన్ హైదరాబాద్‌లోనే ఉన్నట్లు పక్కా సమాచారం అందడంతో, శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికుల జాబితాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నగరవ్యాప్తంగా గాలిస్తున్నారు.ఇదీ చదవండి: జేడీయూ యూటర్న్.. షాక్‌లో బీజేపీ! -
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్)(TCSS) ఆధ్వర్యంలో అంతర్జాలంలో గూగుల్ మీట్ ద్వారా 14-Sep-2026 ఉదయం శ్రీ వరసిద్ధి వినాయక చవితి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమంలో ఎంతో మంది భక్తులు కుటుంబ సమేతంగా ప్రత్యక్ష పూజలో పాల్గొన్నారు. సకల విఘ్నాలు తొలిగి అందరి పై వినాయకుని ఆశీస్సులు ఉండాలని వినాయకుడిని కోరారు. ఈ పూజను ఇండియా నుండి మహబూబ్ నగర్ కు చెందిన శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ పురోహితులు ఇరువంటి శ్రావణ్ కుమార్ శర్మ గారు అంతర్జాలం ద్వారా నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రతిఒక్కరికి సొసైటీ అధ్యక్షులు నల్ల భాస్కర్ గుప్త, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కోశాధికారి శెశిధర్ రెడ్డి ఎర్రమరెడ్డి, ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, జూలూరి సంతోష్ కుమార్, మిర్యాల సునీత రెడ్డి, సంతోష్ వర్మ మాదారపు మరియు విక్రమ్ చిట్ల సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు నంగునూరి వెంకట రమణ, నడికట్ల భాస్కర్, మహేష్ చెట్టిపెల్లి, కల్వ లక్ష్మణ్ రాజు , శివ ప్రసాద్ ఆవుల మరియు కార్యవర్గ సభ్యులు బొడ్ల రోజా రమణి, రవి కృష్ణ విజ్జాపూర్, పెరుకు శివ రామ్ ప్రసాద్, విజయ మోహన్ వెంగళ, సతీష్ పెసరు, చల్లా క్రిష్ణ, మణికంఠ రెడ్డి, భాస్కర్ రావు పులిగిళ్ల, ప్రవీణ్ మామిడాల, తోట రాజేంద్ర ప్రసాద్ , యసరావేణి విజయ కుమార్, మల్లారెడ్డి కల్లెం మరియు సుకేందర్ నీలం మొదలగు వారు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.అందరి పై శ్రీ వినాయకుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ ఎల్లప్పుడు సొసైటీ వెన్నంటే ఉంటూ సహకారం అందిస్తున్న వారితో పాటు ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలతో పాటు కృతజ్ఞతలు తెలియ జేశారు.ఈ వేడుకలకు సహకారం అందించిన మై హోమ్ బిల్డర్స్, కుమార్ ప్రాపర్టీస్ (ప్రాప్నెక్స్) సింగపూర్, ASBL కన్స్ట్రక్షన్ కంపెనీ, సరిగమ గ్రాండ్ ఇండియన్ రెస్టారెంట్, వజ్రా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ, ఏపీజే అభిరామి, ఏపీజే జువెల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎవోల్వ్, ఏ వి ఏం కన్స్ట్రక్షన్ అండ్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, విజయ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ (కూల్ టైమ్ ఎయిర్కాన్ ఇన్స్టాలేషన్ & సర్వీస్), కామాక్షి సిల్వర్,గోల్డ్ & డైమండ్ , బులియన్ కింగ్ గార్లకు సొసైటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. -
అభివృద్ధి, సంక్షేమానికి మారుపేరు వైఎస్సార్
సాక్షి, అమరావతి: అమెరికాలోని ఓర్లాండోలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ అభిమానులు, ప్రవాసాంధ్రులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్సార్సీపీ నేత చల్లా మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమానికి మారుపేరు వైఎస్సార్ అని కొనియాడారు. వైఎస్సార్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రవాసాంధ్రులు వైఎస్సార్సీపీని బలోపేతం చేయాలని, వైఎస్ జగన్మోహన్రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి చేయడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్ జగన్ పాలనలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలతో వైఎస్సార్ సంక్షేమ వారసత్వాన్ని కొనసాగించారని పేర్కొన్నారు. డాక్టర్ వాసుదేవరెడ్డి మాట్లాడుతూ.. పేదలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకురావడంలో వైఎస్సార్ ప్రభు త్వం చేపట్టిన చర్యలు కీలకపాత్ర పోషించాయన్నారు. డాక్టర్ కొండ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులను వివరించారు. పెద్ద సంఖ్యలో ఎన్ఆర్ఐలు, వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్సీపీ సానుభూతిపరులు హాజరై వైఎస్సార్‌కు నివాళులర్పించారు. రత్నాకర్ పి.జలంధర్, రాయల్‌రెడ్డి, రాజశేఖర్, రవి, సంజీవ, రఘు, జనార్దన్, సునీల్, వెంకట్ పులి, శేషాద్రి, సురేంద్ర, మధు, కిరణ్, రమణారెడ్డి పాల్గొన్నారు. -
బార్బెక్యూలో బీఫ్ : కెనడాలో చిక్కుల్లో భారతీయ మహిళ
కెనడాలో ఒక ప్రవాస భారతీయ మహిళ ఓవర్ యాక్షన్ నెట్టింట తీవ్ర చర్చకు దారి తీసింది. తన ఇంట్లో అద్దెకి ఉంటున్న వ్యక్తిపై అనుచితంగా ప్రవర్తించిన వైనం కలకలం రేపింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వివాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కెనడాలోని సరీ నగరంలో చోటు చేసుకుంది. అసలేం జరిగింది అంటే.కెనడాలో నివసిస్తున్న రాజ్ తివానా అనే భారతీయ మహిళ, తన అద్దెదారుడితో వాగ్వాదానికి దిగింది. ఆ ఇంట్లోని తోటలో తన స్నేహితుడితో కలిసి బార్బెక్యూలో బీఫ్ వండడాన్ని తివానా అభ్యంతరం చెప్పడంతో వివాదం షురూ అయింది. తన ఇంటిని, గోడల్ని పాడు చేస్తున్నారని ఆరోపిస్తూ వారితో గొడవకు దిగింది. అక్కడితో ఆగలేదు ఒక కర్ర ముక్కను తీసుకుని గ్రిల్ పైనుంచి ఆహారాన్ని తోసేసింది. ఆ తరువాత ఇంట్లోకి చొరబడి మరీ ఆమె రాయితో దాడిచేసింది. మస్కిటో బ్యాట్‌తోనూ ఎటాక్ చేసింది. తన యూనిట్ నుంచి వెళ్లిపోమని పదేపదే దూషించడం, అతడిపై ఎటాక్ చేయడం లాంటివి వీడియోలు రికార్డైనాయి. దీంతో బాధితుడు తన యజమానురాలు పదేపదే వేధిస్తోందని, తన పనుల్లో జోక్యం చేసుకుంటోందని ఆరోపిస్తూ వరుస వీడియోలను పోస్ట్ చేశాడు. ఇదీ చదవండి: జొమాటో కస్టమర్ల నెత్తిన పిడుగు, భారీ షాకిచ్చిందిగా! An Indian woman in Canada clashed with her tenant after objecting to him using a barbecue in the garden with a friend on her property. After a video of their altercation went viral, the man shared a series of clips alleging that the incident was part of a larger pattern of… pic.twitter.com/vGMtZnVSmZ— Hate Detector 🔍 (@HateDetectors) September 12, 2026తన గదిని ఖాళీ చేసి వెళ్లాలని వేడుకుంటున్నావినలేదంటూ మరో వీడియో షేర్ చేశాడు. ముందస్తు సమాచారం లేకుండానే లోపలికి వచ్చి తాళాలు మార్చేయడమే కాకుండా, చివరకు అతని ఇంటి ప్రధాన తలుపునే పూర్తిగా తొలగించిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంకో వీడియోలో కొంతమంది పురుషులు ఆ ప్రాంగణంలోకి ప్రవేశించడం, ఘర్షణ పడటం కూడా రికార్డైంది. అతని ఫిర్యాదు మేరకు ఈ సంఘటనకు సంబంధించి తివానాను అరెస్టు చేసినట్టు కూడా ఈ వీడియోల ద్వారా తెలుస్తోంది.ఇదీ చదవండి: నటి అమీషా తల్లి డైమండ్ నగలు చోరీ : పనిమనిషి అరెస్ట్Landlord and tenant disputes in Canada are rampant specifically in Punjabi dominated areas and properties; however this incident between Raj Tiwana and her tenant has turned the conversation exceedingly factional; entire incident is being seen from a highly racists point of view… pic.twitter.com/YKQnx07R0v— Arshdeep Singh Saini (@the_lama_singh) September 12, 2026అయితే ఈ ఘటనలో అసలు వివాదానికి కారణాలపై స్పష్టత లేదు. అలాగే దాడికి సంబంధించిన పూర్తి వివరాలు, పోలీసులు నమోదు చేసిన అభియోగాలు తదితర అంశాలపై క్లారిటీ లేదు. ఇదీ చదవండి : రూ. 250లతో చెట్టు కింద ఉచిత స్కూలు: KBC 18 కంటెస్టెంట్ ఇంట్రస్టింగ్ స్టోరీ -
భారత సంతతి మహిళను ఫాలో అయ్యాడు.. చివరకు కాల్పులు
అమెరికాలోని కాలిఫోర్నియాలో శాక్రమెంటో కౌంటీలో పనేరా బ్రెడ్ రెస్టారెంట్ వెలుపల భారత సంతతికి చెందిన ఓ మహిళ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయింది. నెలల తరబడి ఓ వ్యక్తి ఆమె వెంటపడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అతడిపై నిషేధాజ్ఞలు కూడా ఉన్నాయని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ తెలిపింది. అమెరికాలో నిషేధాజ్ఞ అంటే ఒక వ్యక్తి మరో వ్యక్తిని సంప్రదించడం, కలవడం లేదా దగ్గరకు వెళ్లడాన్ని చట్టపరంగా నిరోధించే ఆదేశం.షాలిని ఠాకూర్ (38) తన కారుకు సమీపంలో నిలబడి ఉండగా.. భారతదేశానికి చెందిన చట్టబద్ధ పత్రాలు లేని వలసదారు రోహిత్ ఆమె వద్దకు వచ్చినట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ తెలిపింది. షాలిని తప్పించుకునేందుకు ప్రయత్నించగా రోహిత్ ఆమెను వెంబడించి తలపై కాల్పులు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం కారులో ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాల్పుల ఘటనపై స్పందించిన పోలీసులు రోహిత్‌ను కొద్దిసేపటికే పట్టుకున్నారు. అధికారుల ప్రకారం.. ఆ తర్వాత అతడు తుపాకీతో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గంటల తరబడి కారు నిలిపి.. కాల్పుల ఘటనకు ముందు రోహిత్ నెలల తరబడి షాలినిని వెంటాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. షాలినికి అతడు డోర్‌డ్యాష్ డెలివరీ డ్రైవర్‌గా తెలుసని ఏబీసీ 10 తెలిపింది. అతడు ఆమె ఇంటి బయట గంటల తరబడి కారు నిలిపి.. ప్రతిరోజూ ఆమెతో మాట్లాడేవాడని పేర్కొంది.ఓ దశలో రోహిత్ తనను పెళ్లి చేసుకోవాలని షాలినిపై ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇతరులతో స్నేహంగా ఉండకుండా కూడా ఆమెను అడ్డుకున్నాడు. ఆమె ఎవరినైనా కలిస్తే ఆ వ్యక్తిని లేదా తనను తాను తుపాకీతో కాల్చుకుంటానని రోహిత్ బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.తర్వాత రోహిత్ షాలిని కారు టైర్లలోని గాలిని తీసేసి.. ఆమె పనిచేసే చోటుకూ వెంబడించినట్లు అధికారులు తెలిపారు. అక్కడ ఆమెకు సహాయం చేస్తున్నట్లు నటించేవాడని చెప్పారు. షాలిని అపార్ట్మెంట్ తాళం చెవి నకలును కూడా రోహిత్ సంపాదించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆమె నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించేందుకే అతడు ఆ నకలు తాళం చెవిని సంపాదించినట్లు తెలుస్తోంది.మేలో షాలిని చివరకు రోహిత్‌పై నిషేధాజ్ఞ పొందింది. అయినప్పటికీ అతడు ఆమెను ఫాలో కావడం కొనసాగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. షాలిని తల్లి సుదేశ్ కుమారి మాట్లాడుతూ తన కుమార్తె పలుసార్లు పోలీసులను ఆశ్రయించిందని తెలిపారు. చివరకు మంగళవారం శాక్రమెంటో కౌంటీలోని పనేరా బ్రెడ్ రెస్టారెంట్ వెలుపల జరిగిన కాల్పుల్లో షాలిని ప్రాణాలు కోల్పోయింది. -
ఫీనిక్స్‌లో ‘రాజా 50’ : వేలాది మందిని కట్టిపడేసిన ఇళయరాజా!
శంకర నేత్రాలయ సేవలపై అవగాహన కల్పించే లక్ష్యంతో అరిజోనాలోని ఫీనిక్స్ నగరంలో ప్రముఖ సంగీత దర్శకుడు మాస్ట్రో ఇళయరాజా, ‘రాజా 50’ పేరుతో ప్రత్యక్ష సంగీత కార్యక్రమంలో ఆహూతులను అలరించింది. దాదాపు మూడు గంటలపాటు ప్రేక్షకులను తన సంగీత ప్రపంచంలో విహరింపజేశారు. ఫీనిక్స్‌లో గతంలో ఎన్నో భారతీయ సాంస్కృతిక, సంగీత కార్యక్రమాలు జరిగినప్పటికీ, ఇంత భారీ స్థాయిలో లైవ్ సింఫనీ సంగీత బృందంతో జరిగిన ఈ కార్యక్రమం ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని అందించింది.దాదాపు 40 మంది సంగీత కళాకారులతో కూడిన బృందం ఇళయరాజాతో కలిసి వేదికను పంచుకుంది. ఒక్కో వాయిద్యం సంగీతంలో ఎలాంటి పాత్ర పోషిస్తుందో ఇళయరాజా స్వయంగా వివరించడం ఈ కార్యక్రమాన్ని సాధారణ సంగీత కచేరీకి భిన్నంగా నిలిపింది.Arizona Financial Theatreలో జరిగిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. 4వేల మందికి పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు వివిధ భారతీయ భాషలు, ప్రాంతాలకు చెందిన కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం సంగీతానికి భాషా సరిహద్దులు లేవని మరోసారి చాటింది.‘రాజా 50’ ఫీనిక్స్‌లో ఒక విజయవంతమైన సంగీత కార్యక్రమంగా మాత్రమే కాకుండా, శంకర నేత్రాలయ సేవలను 4,000 మందికి పైగా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లిన ముఖ్యమైన అవగాహన వేదికగా నిలిచింది. ముఖ్యంగా MESU కార్యక్రమాన్ని పరిచయం చేయడం, దానికి సంబంధించిన వీడియోలను ప్రదర్శించడం ద్వారా సంగీత వేదికపై సేవా సందేశాన్ని కూడా వినిపించే అవకాశం లభించింది. ఇళయరాజా సంగీతం ప్రజలను ఒకచోట చేరిస్తే, ఆ అవకాశాన్ని శంకర నేత్రాలయ సేవలను మరింత మందికి పరిచయం చేయడానికి ఉపయోగించుకోవడం ఈ కార్యక్రమానికి మరో ప్రత్యేకతను ఇచ్చింది. సంగీతం, సమాజం, సేవ ఒకే చోట కలిసిన మరపురాని రాత్రిగా ‘రాజా 50’ నిలిచిపోయింది. మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు నేత్ర వైద్య సేవలను చేరువ చేయడంలో MESU చేస్తున్న సేవలను పరిచయం చేస్తూ, దానికి సంబంధించిన వీడియోలను కూడా వేదికపై ప్రదర్శించారు. సంగీతం కోసం వచ్చిన వేలాది మందికి శంకర నేత్రాలయ సేవా కార్యక్రమాలను చూపించగలగడం ఈ వేదికకు ప్రత్యేకమైన సామాజిక ప్రాధాన్యతను తీసుకొచ్చింది.ఈ కార్యక్రమానికి ఫీనిక్స్‌లోని వివిధ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సంఘాలు, ఇతర భారతీయ సామాజిక సంస్థల ప్రతినిధులు, కమ్యూనిటీ నాయకులు, స్పాన్సర్లు, వాలంటీర్లు తమ వంతు సహకారం అందించారు. భాషలు, ప్రాంతాలు వేరైనా ఒక మంచి కార్యక్రమం కోసం అందరూ కలిసి రావడం ఈ విజయానికి ప్రధాన బలంగా నిలిచింది. నిర్వాహకులతో పాటు వివిధ సంఘాలు, స్పాన్సర్లు, వాలంటీర్లు, శంకర నేత్రాలయ శ్రేయోభిలాషులు, ఫీనిక్స్ భారతీయ సమాజం అందించిన సహకారం ఇందులో భాగమైంది.ఇంత పెద్ద కార్యక్రమం వెనుక ఆది మొర్రెడ్డి, అనిల్ భరద్వాజ్, విజయ్ రాజ్, చెన్నా రెడ్డి మద్దూరి, చిత్రప్రియ, సుబ్బు ఉప్పులూరి, జ్ఞాని మారుపాకుల, జెగ్గీ క్రిష్, డా. కార్తిక్ రెడ్డి దొనూర్, లక్ష్మి బొగ్గరపు, ప్రవీణ్ సామల, శరవ్ సుబ్రమణియన్, సచ్చిదానంద ప్రభు, సతీష్ పంచాక్షరం, సతి శివం, శ్యామ్ బైరా, శ్రీజిత్ శ్రీనివాసన్, గుప్తా, శ్రీని సుబ్రమణియన్, వంశీ కృష్ణ ఇరువారం, ధీరజ్ రెడ్డి పోల తమ వంతు బాధ్యతలను నిర్వర్తించారు.ఇళయరాజా సంగీత ప్రయాణానికి యాభై సంవత్సరాలు అనే సందర్భంలో జరిగిన ఈ కార్యక్రమం తరాలను కూడా ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. ఎన్నో సంవత్సరాలుగా ఆయన పాటలను ఆస్వాదిస్తున్న తరం పక్కనే నేటి యువతరం కూడా అదే సంగీతాన్ని ప్రత్యక్షంగా ఆస్వాదించింది. వివిధ వయసులు, భాషలు, ప్రాంతాలకు చెందిన వేలాది మంది సంగీతంతో ఒక్కటయ్యారు. -
అమెరికాలో ఏఐ కాలేజీకి ఎన్నారై దంపతుల పేరు
అమెరికాలో స్థిరపడిన భారతీయ సంతతికి చెందిన దంపతులు విద్యారంగానికి భారీ విరాళం అందించారు. టెక్సాస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ (UNT)లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), అడ్వాన్స్డ్ అనలిటిక్స్‌కు ప్రత్యేక కాలేజీ ఏర్పాటుకు ఏకంగా 20 మిలియన్ డాలర్లు (సుమారు రూ.167 కోట్లు) విరాళంగా ఇచ్చారు. ఈ భారీ విరాళం అందించిన అనురాధ, వికాస్ సిన్హా దంపతుల పేరుతోనే కొత్త కాలేజీకి ‘అనురాధ అండ్ వికాస్ సిన్హా కాలేజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అడ్వాన్స్డ్ అనలిటిక్స్’ అని పేరు పెట్టనున్నారు.AI, ఇంటెలిజెంట్ సిస్టమ్స్, డేటా అనలిటిక్స్ రంగాల్లో విద్య, పరిశోధనలకు ఈ కాలేజీ కేంద్రంగా పనిచేయనుంది. AI, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, అడ్వాన్స్డ్ అనలిటిక్స్, హెల్త్ ఇన్ఫర్మేటిక్స్, ఇన్ఫర్మేషన్ సైన్స్, లైబ్రరీ సైన్స్, లెర్నింగ్ టెక్నాలజీస్ వంటి విభాగాలను ఒకే వేదికపైకి తీసుకురానుంది. విద్యార్థులు, అధ్యాపకులు కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేయడంతో పాటు వాటిని ఆచరణలోకి తీసుకురావడానికి ఈ కాలేజీ ఉపయోగపడుతుందని వర్సిటీ అధ్యక్షుడు హారిసన్ కెల్లర్ తెలిపారు.ఈ విరాళంతో కాలేజీ నాయకత్వం, విద్యార్థుల స్కాలర్షిప్లు, ప్రొఫెసర్‌షిప్‌లు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఇంక్యుబేషన్, అధునాతన పరిశోధనలు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలకు మద్దతుగా ఆరు శాశ్వత ఎండోమెంట్లు ఏర్పాటు చేయనున్నారు. అలాగే *అప్లైడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఇన్స్టిట్యూట్*ను కూడా ఈ కాలేజీలో ఏర్పాటు చేస్తారు. ఇది వర్సిటీలోని వివిధ విభాగాల మధ్య AI, డేటా సైన్స్ పరిశోధనలకు సమన్వయం చేస్తూ పరిశ్రమలతో భాగస్వామ్యాలకు అవకాశాలు కల్పించనుంది.చదువు కోసం అమెరికాకు.. ఇప్పుడు భారీ విరాళంవికాస్, అనురాధ ఇద్దరూ భారత్ నుంచి అమెరికాకు వెళ్లారు. ఉత్తరప్రదేశ్‌లోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీలు పూర్తి చేసిన అనంతరం ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లారు. అనంతరం ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీలు పొందారు. వికాస్ సిన్హా నార్త్‌వెస్ట్రన్ యూనివర్సిటీలోనూ చదివి, 2023లో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ నుంచే పీహెచ్డీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన బ్రాడ్‌కామ్‌లో వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు.సిన్హా దంపతులు ఇప్పటికే UNTకు పలు సందర్భాల్లో భారీగా అండగా నిలిచారు. 2024లో వారు అందించిన విరాళంతో అనురాధ అండ్ వికాస్ సిన్హా డిపార్ట్మెంట్ ఆఫ్ డేటా సైన్స్‌ను ఏర్పాటు చేశారు. విద్యార్థుల స్కాలర్షిప్లు, అధ్యాపకులు, పరిశోధనలకు మద్దతుగా ఎండోమెంట్లను కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఏడాదికే మరో భారీ విరాళంతో సిన్హా ఇన్నోవేషన్ ల్యాబ్ ఫర్ డేటా సైన్స్‌ను ఏర్పాటు చేశారు.“మాకు ఈ విరాళం అంటే అవకాశాన్ని మరో తరానికి అందించడం. వలస వచ్చినవారు అమెరికన్ డ్రీమ్‌లో కేవలం భాగస్వాములు మాత్రమే కాదు.. దాన్ని నిర్మించడంలోనూ కీలక పాత్ర పోషిస్తారు. విద్య మా జీవితాల్లో ఎన్నో తలుపులు తెరిచింది. ఇప్పుడు ఆ తలుపులు మరికొందరికి తెరిచి ఉంచాలనుకుంటున్నాం” అని వికాస్ సిన్హా తెలిపారు.AI, డేటా ఆధారంగా భవిష్యత్తు ఉద్యోగ మార్కెట్ వేగంగా మారుతున్న నేపథ్యంలో.. కొత్త తరం విద్యార్థులను అందుకు సిద్ధం చేయడం, పరిశోధనలను ప్రోత్సహించడం, పరిశ్రమలతో అనుసంధానం పెంచడం ఈ కొత్త కాలేజీ ప్రధాన లక్ష్యాలుగా ఉండనున్నాయి.(చదవండి: మెహిందీ పెడుతూ.. లక్షదాక సంపాదిస్తున్న టెకీ!) -
వైఎస్సార్ చెస్ టోర్నమెంట్లో విజేతగా శిబి శ్రీనివాస్ చెమికల
మహానేత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ సీపీ జర్మనీ విభాగం కన్వీనర్ కృష్ణ తేజా రెడ్డి గడ్డం ఆధ్వర్యంలో మ్యూనిక్ నగరంలో వైఎస్సార్ చెస్ టోర్నమెంట్ నిర్వహించారు. ఇందులో విజేతగా నిలిచిన డార్మ్ స్టడ్ అప్లయిడ్ సైన్సెస్ యూనివర్సిటీ విద్యార్ధి శిబి శ్రీనివాస్ చెమికలకు వైఎస్సార్ సీపీ ఐటీ విభాగ కోర్డినేటర్ విష్ణు వర్ధన్ రెడ్డి మార్తల ట్రోఫీని అందజేశారు. జర్మనీ వైఎస్సార్ సీపీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సాయి సూర్య చౌదరి నేలకుర్తి ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు.(చదవండి: జర్మనీలో ఘనంగా వైఎస్సార్ వర్ధంతి) -
జర్మనీలో ఘనంగా వైఎస్సార్ వర్ధంతి
బెర్లిన్: జర్మనీలోని మ్యూనిచ్, స్టుట్గార్ట్, బెర్లిన్ నగరాల్లో ఈ రోజు సోమవారం దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి 17వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున వైఎస్సార్ అభిమానులు తరలివచ్చి, ఆయన సేవలను కొనియాడారు. ఫీజు రీయింబర్స్మెంట్ వంటి ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా నేడు తామంతా ఉన్నత స్థాయిలో ఉండగలుగుతున్నామని ఆయన సేవలను స్మరించుకున్నారు.17వ వర్ధంతి సందర్భంగా మ్యూనిచ్ నగరంలో నిర్వహించిన “YSR Chess Tournament” విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం కృష్ణ తేజ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి కోర్ కమిటీ సభ్యులు నాగార్జున రెడ్డి ఆవుల (జనరల్ సెక్రటరీ), గురు (కో-కన్వీనర్), విష్ణు వర్ధన్ రెడ్డి మార్తల (ఐటీ కోఆర్డినేటర్), Dr. మల్లికార్జున రెడ్డి బండి (మీడియా స్పోకెస్పర్సన్), మనోజ్ కామసాని (మీడియా స్పోకెస్పర్సన్), నవీన్ రెడ్డి కలమకూరి (సోషల్ మీడియా కోఆర్డినేటర్), సాయి సూర్య చౌదరి (ఎగ్జిక్యూటివ్ మెంబర్), మంజునాథ్ రెడ్డి చవ్వాబాలన్న (ఎగ్జిక్యూటివ్ మెంబర్), వినోద్ అమలదాసు (ఎగ్జిక్యూటివ్ మెంబర్), షాలిని అక్షింతల (ఎగ్జిక్యూటివ్ మెంబర్), ఉపేంద్ర జలది, ప్రదీప్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.వైఎస్సార్ సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే తమ బాధ్యతని ఈ సందర్భంగా కమిటీ సభ్యులు తెలిపారు. -
వైఎస్సార్ వర్ధంతి: వైఎస్సార్సీపీ ఫీనిక్స్ ఎన్నారై కమిటీ రక్తదానం
ఫీనిక్స్ (అరిజోనా): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి , దివంగత నేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి 17వ వర్ధంతిని పురస్కరించుకుని వైఎస్సార్సీపీ ఫీనిక్స్ ఎన్నారై కమిటీ, వైటలెంట్ సహకారంతో సెప్టెంబర్ 6న రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు కమ్యూనిటీ సభ్యులు, వాలంటీర్లు పాల్గొన్నారు. ప్రజాసేవకు, అవసరంలో ఉన్న వారికి అండగా నిలవడానికి డాక్టర్ వైఎస్సార్ చూపిన నిబద్ధతను ప్రతిబింబించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గ్లోబల్ ఎన్నారై కోఆర్డినేటర్, మాజీ ముఖ్యమంత్రి విద్యా సలహాదారు ఆలూరు సాంబశివ రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు. కార్యక్రమం ప్రారంభంలో డాక్టర్ వైఎస్సార్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆయన జీవితం, ప్రజాసేవ, ప్రజా సంక్షేమం కోసం చేసిన కృషిని ప్రతిబింబించే ప్రత్యేక ఆడియో-విజువల్ ప్రదర్శన నిర్వహించారు.కమిటీ సభ్యులు డాక్టర్ వైఎస్సార్‌తో తమకున్న వ్యక్తిగత అనుభవాలను, ఆయనలోని నిరాడంబరత, ధైర్యం, ప్రజాకేంద్రిత పాలనా విధానాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలూరు సాంబశివ రెడ్డి డాక్టర్ వైఎస్సార్‌ను “ప్రజల నాయకుడు”గా అభివర్ణిస్తూ, సామాన్య ప్రజలతో ఆయనకు ఉన్న విడదీయరాని అనుబంధాన్ని గుర్తుచేశారు. డాక్టర్ వైఎస్సార్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆ ఆశయాలను కొనసాగిస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన ఫీనిక్స్ ఎన్నారై కమిటీని ఆయన అభినందించారు. రక్తదానం అనేది సులభమైనదైనా, అత్యంత విలువైన సేవా కార్యక్రమమని, ఒకరి రక్తదానం నేరుగా మరొకరి ప్రాణాలను కాపాడగలదని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమాన్ని ధీరజ్ పోలా, వంశీ ఎరువరం, చెన్నా రెడ్డి మద్దూరి, రుక్మన్, శ్రీధర్ చెమిడితి, అంజి రెడ్డి,నాగేష్ పొర్ల, వేమ శేఖర్, విఘ్నేష్, కొండా రెడ్డి , శ్రీనివాస్ మామిడి, హేమ కుమార్, అజయ్ కాల్వ , కుడుముల సుధీర్, సుజన్, రాజేశ్వరరావు బండారు, రాజశేఖర్ అవుదూరి, హితేష్ తదితరులు నిర్వహించి, పాల్గొన్నారు. పలువురు వాలంటీర్లు, కమ్యూనిటీ సభ్యులు కూడా కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన వైటలెంట్, రక్తదాతలు, వాలంటీర్లు, నిర్వాహకులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాసేవ, మానవతా విలువలు, సమాజ సంక్షేమం పట్ల డాక్టర్ వైఎస్సార్ చూపిన నిబద్ధతను కొనసాగిస్తూ, ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురాగల సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఫీనిక్స్ ఎన్నారై కమిటీ తన నిబద్ధతను మరోసారి పునరుద్ఘాటించింది. -
జయ పీసపాటి గౌరవార్థం సింగపూర్‌లో ఆత్మీయ సమ్మేళనం
సింగపూర్: హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు జయ పీసపాటి సింగపూర్ పర్యటన సందర్భంగా, శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం ఆదివారం సింగపూర్‌లో ఘనంగా జరిగింది. సరిగమ గ్రాండ్ రెస్టారెంట్లో సుమారు 25 మంది తెలుగు ప్రముఖులు, సాహితీ, సాంస్కృతిక రంగాల ప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో సాగింది.సుబ్బు వి. పాలకుర్తి నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమానికి జయ పీసపాటి తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరైనారు. ఈ సందర్భంగా జయ పీసపాటి మాట్లాడుతూ, హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య ఆవిర్భావానికి ముందు జరిగిన పరిణామాలతో పాటు, గత 22 సంవత్సరాలుగా సమాఖ్య ద్వారా తెలుగువారికి అందిస్తున్న సేవలను వివరించారు. తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యాన్ని భావితరాలకు అందించడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఆమె పిలుపునిచ్చారు.మహిళలు మీడియా సహా వివిధ రంగాల్లో మరింత చురుకైన పాత్ర పోషించడం ద్వారా సమాజంలోని మరెందరికో స్ఫూర్తిగా నిలవగలరని జయ పీసపాటి పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో పిల్లలకు తెలుగు నేర్పించడం ద్వారా వారికి భాషపై అభిమానం పెంపొందించడంతో పాటు, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలుగువారిగా ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని అన్నారు. ఆదివారం కూడా ఇంతమంది తెలుగువారు ఒకచోట చేరి కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు. సింగపూర్, హాంగ్ కాంగ్ తెలుగు సంస్థల మధ్య ఇప్పటికే ఉన్న సత్సంబంధాలు భవిష్యత్తులో మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.సింగపూర్‌తో 2016 నుంచే ప్రత్యేక అనుబంధంహాంగ్ కాంగ్లో తెలుగు సమాఖ్యను నిర్వహిస్తున్న తనకు విదేశాల్లో జరిగిన తెలుగు కార్యక్రమాల్లో తొలిసారిగా పాల్గొనే అవకాశం 2016లో సింగపూర్‌లో జరిగిన 5వ ప్రపంచ సాహితీ సదస్సు ద్వారా లభించిందని జయ పీసపాటి గుర్తు చేసుకున్నారు. ఆ సందర్భంగా సింగపూర్‌లోని తెలుగువారి ఐక్యత, చురుకుదనం తనకు ఎంతో ప్రేరణనిచ్చాయని ఆమె నాటి జ్ఞాపకాలను పంచుకున్నారు.ఇటీవల మలేషియా తెలుగు సంఘం నిర్వహించిన 70వ వార్షికోత్సవ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సంస్థలకు ఒక మార్గదర్శకంగా, బెంచ్‌మార్క్‌గా నిలిచాయని ఆమె అభినందించారు. ముఖ్యంగా నేటి తరం పిల్లలు ఎంతో చక్కగా తెలుగు మాట్లాడటంతో పాటు పద్యాలు, గద్యాలను స్పష్టంగా చదివి వినిపించడం తనను ఎంతగానో ఆకట్టుకుందని అన్నారు.మలేషియా తెలుగు సమాజం చూపించిన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని, ప్రపంచంలోని వివిధ దేశాల్లో తెలుగు భాష మరింతగా అభివృద్ధి చెంది, భావితరాల్లో సజీవంగా కొనసాగాలని జయ పీసపాటి ఆకాంక్షించారు.తమకు ఆత్మీయ‘జయక్క’గా మారిన“జయ పీసపాటి ఈ సందర్భంగా రత్న కుమార్ మాట్లాడుతూ అభినందనలు తెలిపారు. హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య నిర్వహిస్తున్న కార్యక్రమాలుఎన్నో సందర్భాల్లో స్ఫూర్తినిచ్చాయన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీ సాంస్కృతిక కళాసారథి సభ్యులు రాము చామిరాజు, భాస్కర్ వూలపల్లితో పాటు సింగపూర్ తెలుగు ప్రముఖులు సుదర్శన్ పూల, కొనాలి కాళికృష్ణ, సత్య జాస్తి, యోగి బూరుగుపల్లి, రాఘవాచార్యులు తట్టా, రాధాకృష్ణ గణేశ్న, కాత్యాయని, విద్యాధరి, రేణుక, శ్రీలలిత, పద్మావతి, సునీత, మాధవి తదితరులు పాల్గొన్నారు. -
మెహిందీ పెడుతూ.. లక్షదాక సంపాదిస్తున్న టెకీ!
ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మెహిందీ పెడుతూ ఎంత ఆదాయం గడిస్తుందో నెట్టింట వీడియో రూపంలో షేర్ చేసింది. భారత్‌లో మెహిందీ పెట్టే స్కిల్‌ని ఎలా చూస్తారు..అదే అమెరికాలో అయితే ఎలా ఉంటుందో పోలుస్తూ చెప్పుకొచ్చింది వీడియోలో. అంతేగాదు పార్ట్‌టైంగా చేస్తున్న ఈ సరదా స్కిల్‌తో తాను ఎంత మేర ఆర్జిస్తుందో కూడా పంచుకుంది. ఈ వీడియో నెటిజన్లను అమితంగా ఆకర్షించి మెహిందీ స్కిల్‌పై చర్చలు రేకెత్తించింది. అమెరికాలో పూర్తి స్థాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రియాం కజైన్ ఈ పోస్ట్ పంచుకుంది. తన ఉద్యోగానికి, అభిరుచికి మధ్య చక్కటి సమతుల్యతను పాటిస్తూ..ప్రొఫెషనల్ మెహిందీ ఆర్టిస్ట్‌గా ఎలా కొనసాగుతుందో చెప్పుకొచ్చింది. కోడింగ్ ద్వారా నెలవారీ ఖర్చులు తీరుతుండగా, మెహిందీ పనితో అదనపు ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నట్లు పేర్కొంది. తన డిజైన్ పనికి గంటకు సుమారు రూ. 9 వేల నుంచి పదివేల దాకా ఛార్జ్ చేస్తుందట. అంతేగాదు నిర్ణీత గంటల రుసుము తోపాలు ఒక్కోసారి 20 శాతం వరకు టిప్ రూపంలో అదనపు మొత్తాన్ని కూడా ఆర్జిస్తున్నట్లు వెల్లడించింది. అంతేగాదు పెళ్లిళ్ల సీజన్లో అయితే మెహిందీ పెట్టే పూర్తి స్థాయి బుకింగ్‌ని బట్టి ఒక్క రోజుకి దాదాపు రూ. 1 లక్ష దాక సంపాదించొచ్చని తెలిపింది. తనకు అమెరికా వచ్చిన తర్వాతే కళాకారులకు ఎంత విలువ ఉంటుందో అర్తమైందని అంటోంది. భారత్‌లో మెహిందీ ఆర్టిస్ట్ వృత్తిని అంత గొప్ప పనిగా చూడరు, అంతగా గౌరవించరని వాపోయింది. కానీ ఇక్కడ తనను కళాకారిణిగా గౌరవిస్తారని అంటోంది. అంతేగాదు తనకు ఏదో ఒక చిన్న పనిచేస్తున్నట్లు అనిపించదని చెబుతోంది. అయినా ఏపని చిన్నిది, పెద్దది అని ఉండదు, పని అంటే పనే అని నొక్కి చెబుతోంది. ఇక అలాగే అమెరికాలో జీవన వ్యయాలు కూడా అధికంగానే ఉంటాయని ఒప్పుకుందామె. నెటిజన్లు కూడా ఆమె మాటలకు మద్దతిస్తూ..ఔను ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాన్ని తప్ప మరే ఏ ఇతర ఉద్యోగాన్నీ అంతగ గౌరవించరంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Priyancka Jaiin (Creating Wings Co.) (@priyancka.jaiin) (చదవండి: అద్భుతమైన క్రిమ్సన్ చీరలో నీతా అంబానీ స్టన్నింగ్ లుక్..!) -
ఆర్ఎస్ఎస్ అంటే విద్వేషమా? మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ భావజాలంపై ఏళ్లుగా రాజకీయంగా తీవ్ర విమర్శలు, భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ సంస్థ చీఫ్ మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల మధ్య అనుబంధం, ఏకత్వ భావనే సంఘ్ ఆలోచనకు ఆధారమని ఆయన స్పష్టం చేశారు. అలాగే వైవిధ్యాన్ని గౌరవిస్తూ అందరూ కలిసి ముందుకు సాగడమే తమ దృక్పథమని చెప్పారు.ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలకు విద్వేషమే పునాది అనే విమర్శలను ఆ సంస్థ చీఫ్ మోహన్ భాగవత్ ఖండించారు. లండన్‌లో జరిగిన ‘సెలబ్రేషన్ ఆఫ్ వన్నెస్’ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘విద్వేషం కాదు.. అందరినీ కలిపే భావనే ఆర్ఎస్ఎస్ పునాది అని, అదే తమ సంస్థ పనితీరుకు ఆధారమని స్పష్టం చేశారు. ఒక వ్యక్తి నుంచి కుటుంబం, సమాజం, మానవాళి వరకు ఒకరితో ఒకరికి అనుబంధ భావన ఉండటమే హిందూ ఆలోచనా విధానమని భాగవత్ చెప్పారు. భిన్నత్వం సహజమేనని, అయితే దాని వెనుక ఉన్న ఏకత్వాన్ని గుర్తించి పరస్పరం గౌరవించుకోవాలని సూచించారు. ‘వైవిధ్యం కోసం ఏకత్వాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు.. ఏకత్వం కోసం వైవిధ్యాన్ని తొలగించాల్సిన పనిలేదు’ అనే భావనను వివరించారు.‘అందరం కలిసి ఎదగాలి’ప్రపంచంలో ఘర్షణలు, పోటీ, పర్యావరణ సమస్యలకు పరస్పర ప్రయోజనకరమైన పరిష్కారాలు అవసరమని ఆయన అన్నారు. మనిషి ప్రకృతిలో భాగమే తప్ప.. దానికి వేరుగా లేడని పేర్కొన్నారు. అభివృద్ధి ప్రకృతిని దెబ్బతీయకుండా దాని పురోగతికి తోడ్పడాలని చెప్పారు. ‘జీవించు.. ఇతరులను జీవించనివ్వు.. వారిని కూడా ఎదగనివ్వు’ అనే దృక్పథాన్ని ప్రపంచానికి అందించాల్సిన అవసరం ఉందన్నారు.హిందూ దేశంపై వివరణ‘హిందూ’ అనేది కేవలం ఒక మతం లేదంటే పూజా విధానం కాదని భాగవత్ అన్నారు. భిన్న మార్గాలను గౌరవించడం, ప్రతి ఒక్కరూ తమ మార్గంలో ముందుకు సాగేందుకు అవకాశం కల్పించడమే హిందూ ఆలోచనా విధానమని చెప్పారు. ‘యూనిఫార్మిటీ అవసరం లేదు.. యూనిటీ ఇన్ డైవర్సిటీ ఉండాలి’ అని పేర్కొన్నారాయన. బ్రిటిష్ హిందువులపై.. బ్రిటన్‌లో నివసించే హిందువులు తమ కర్మభూమి అయిన బ్రిటన్ పట్ల విధేయతతో ఉండాలని మోహన్ భాగవత్ అక్కడున్నవాళ్లు వేసిన ఓ ప్రశ్నకు స్పష్టం చేశారు. బ్రిటన్, భారత్ ప్రయోజనాల మధ్య ఎప్పుడైనా విభేదం తలెత్తితే.. బ్రిటిష్ హిందువులు తమ కర్మభూమి వైపే నిలవడం సహజమని అన్నారు. “మీ కర్మభూమి ఎక్కడైతే ఉందో.. మీ విధేయత కూడా అక్కడే ఉండాలి. జన్మభూమి నుంచి విలువలను పొందుతారు.. ఆ విలువలను కర్మభూమిలో ఆచరిస్తూ అక్కడి సమాజానికి సేవ చేయాలి” అని చెప్పారు. హిందుత్వం ఎప్పుడూ కర్మభూమికి ద్రోహం చేయాలని చెప్పదని స్పష్టం చేశారు. భారత్ తమకు విలువలను అందించిన జన్మభూమి కాగా.. బ్రిటన్ తమ కర్మభూమి అని పేర్కొన్నారు.యువతపై తనకు పూర్తి విశ్వాసం ఉందని భాగవత్ చెప్పారు. వారికి ఏం సాధించాలో లక్ష్యాన్ని నిర్దేశించాలి కానీ.. ఆ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలన్న మార్గాన్ని మాత్రం వారికే వదిలేయాలని సూచించారు. కొత్త తరానికి తమదైన ఆలోచనలు, సామర్థ్యాలతో ముందుకు సాగే అవకాశం కల్పించాలని అన్నారు.Qs: If Britain 🇬🇧 and India’s 🇮🇳 interests ever diverge, what should British Hindus do?Mohan Bhagwat: There is no conflict. British Hindus will support the UK, because your loyalties lie with your karmabhoomi (land of work/host). But your values stem from your janmabhoomi (land…— Abhijit Majumder (@abhijitmajumder) September 6, 2026వందేళ్ల ప్రస్థానం.. ముందున్న లక్ష్యంఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకల్లో భాగంగా అమెరికా, కెనడా, బ్రిటన్‌లో భాగవత్ పర్యటిస్తున్నారు. లండన్ కార్యక్రమంలో 326 సంస్థలకు చెందిన సుమారు 600 మంది ప్రతినిధులు, బ్రిటన్ పార్లమెంట్ సభ్యులు, మేయర్లు, కౌన్సిలర్లు, వివిధ వర్గాల నాయకులు పాల్గొన్నారు. సమాజాన్ని మరింత సంఘటితం చేసి, ప్రజలంతా కలిసి ముందుకు సాగే వాతావరణాన్ని సృష్టించడమే తదుపరి లక్ష్యమని భాగవత్ చెప్పారు. ఇదీ చదవండి: ఛిద్రమైన కలల్ని నిలబెట్టగలరా? -
మిస్సిసాగాలో ఘనంగా వైఎస్సార్ వర్ధంతి
మిస్సిసాగా: కెనడాలోని మిస్సిసాగా నగరంలో శనివారం(సెప్టెంబర్ 5వ తేదీ) సాయంత్రం 6 గంటలకు వైఎస్సార్సీపీ కెనడా విభాగం ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సార్ ప్రజా సేవ, సంక్షేమ పథకాలు, నాయకత్వ పటిమ, ప్రజల పట్ల ఆయన చూపిన నిబద్ధతను నేతలు, కార్యకర్తలు ఘనంగా స్మరించుకున్నారు.ఈ కార్యక్రమం వైఎస్సార్సీపీ కెనడా అడ్వైజర్ డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారి మార్గదర్శకత్వంలో, వైఎస్సార్సీపీ కెనడా కన్వీనర్ వేణు చుక్కలూరు గారి సమన్వయంతో విజయవంతంగా నిర్వహించబడింది.కార్యక్రమ నిర్వాహకులు (వైఎస్సార్సీపీ కెనడా టీమ్):* సుబ్బారావు – వైఎస్సార్సీపీ కెనడా కో-కన్వీనర్* నూర్ గారు – వైఎస్సార్సీపీ కెనడా యూత్ వింగ్ కన్వీనర్ముఖ్య అతిథులు మరియు వక్తలుచల్లా మధుసూదన్ రెడ్డి గారు (వైఎస్సార్సీపీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ) – జూమ్ ద్వారా హాజరయ్యారుపాండుగాయల రత్నాకర్ గారు (మాజీ వైఎస్సార్సీపీ యూఎస్ఏ/ఎన్ఆర్ఐ కన్వీనర్, ఏపీ ప్రభుత్వ మాజీ నార్త్ అమెరికా ప్రత్యేక ప్రతినిధి) – జూమ్ ద్వారా హాజరయ్యారు. డాక్టర్ ప్రదీప్ చింత గారు (వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి - ఎన్ఆర్ఐ వ్యవహారాలు) – జూమ్ ద్వారా హాజరయ్యారు. కొండం వెంకట్ రెడ్డి గారు (కెనడా కమ్యూనిటీ నాయకులు) – ప్రత్యక్షంగా పాల్గొని ప్రసంగించారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి దూరదృష్టి, పేదలు, సామాన్య ప్రజల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి, ప్రజాసేవలో ఆయన చూపిన అంకితభావాన్ని కొనియాడారు.ఎగ్జిక్యూషన్ టీమ్: కార్యక్రమ నిర్వహణ, వేదిక ఏర్పాట్లు, సమన్వయంలో కీలక పాత్ర పోషించిన సభ్యులు: అస్లాం, సుమంత్, యశ్వంత్ నిమ్మకాయల, గోపిరెడ్డి కృష్ణారెడ్డి, పురుషోత్తం రెడ్డి, కృష్ణ, ఆరిఫ్, డాక్టర్ నిరంజన్ చుక్కలూరు, సుబ్బారెడ్డి దుగంపూడి, శ్రీనివాస్ కొరపోరలు.అడ్వైజర్ కమిటీ: కార్యక్రమానికి విలువైన మార్గదర్శకత్వం అందించిన సలహాదారుల కమిటీ సభ్యులు:* కృష్ణారెడ్డి పసల* రాజగోపాల్ గుంటక* విశ్వనాథ్ రెడ్డి* విజయభాస్కర్ రెడ్డి* కృష్ణ ఆలంపాటి* డాక్టర్ శివ రెడ్డిఈ కార్యక్రమంలో మిస్సిసాగాతో పాటు పరిసర ప్రాంతాల నుండి వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో చురుకైన పాత్ర పోషించిన కోర్ కమిటీ సభ్యులందరికీ, ఎగ్జిక్యూషన్ టీమ్‌కు, అడ్వైజర్ కమిటీ సభ్యులకు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. -
రోడ్డు శుభ్రత, ప్రయాణికుల భద్రతకు ‘టీపాడ్’ అడాప్ట్ ఏ హైవే
పడమటి నేల అమెరికాపై పుష్కర కాలంగా తెలుగు నేల పరిమళాలు వెదజల్లుతూ, తెలంగాణ సంప్రదాయాలను కొనసాగిస్తూ, అందరి మన్ననలు పొందుతున్న తెలుగు ప్రజల సంస్థ ‘తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ (టీపాడ్)’ తాజాగా ‘అడాప్ట్ ఎ హైవే’ పేరిట కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. టెక్సాస్ రాష్ట్రంలో నివసిస్తున్న తెలుగు ప్రజలకే కాకుండా, తమకు ఆశ్రయం ఇచ్చిన అమెరికా నేలకు సేవ చేయాలనే కర్తవ్య దృక్పథంతో.. స్టేట్ హైవే (SH 121)పై భద్రత, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణను భుజానికెత్తుకుంది. ఫ్రిస్కో నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ప్రధాన రహదారుల్లో ఒకటైన ప్రెస్టన్ రోడ్‌ను, స్టేట్ హైవే నుంచి మెయిన్ స్ట్రీట్ వరకు రెండువైపులా రెండు మైళ్లకు పైగా విస్తరించిన రహదారిని దత్తత తీసుకుని ఈ కార్యక్రమం చేపట్టింది. టీపాడ్ తన వలంటీర్లతో రహదారికి ఇరువైపులా శుభ్రం చేయడమే కాకుండా సురక్షితంగా మార్చడమే ధ్యేయంగా ఈ సంకల్పం తీసుకుంది.రోడ్డు పక్కన, కాలిబాటలపై ఉండే చెత్త, ఇతర వ్యర్థాలు బలమైన గాలులకు రోడ్డుపైకి ఎగిరివచ్చి రహదారిపై తీవ్ర ప్రమాదాలు జరిగే అవకాశమున్నది. ఇటువంటి వ్యర్థాలు పాదచారులకు, వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగించకుండా, ఆస్తి నష్టం, ప్రాణనష్టం, గాయాలు, ప్రమాదాలు జరగడానికి అవకాశం లేకుండా నివారించేందుకే టీపాడ్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి మూడు నెలలకోసారి.. ‘అడాప్ట్ ఎ హైవే’ పేరిట టెక్సాస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్తో ఒప్పందం కుదుర్చుకున్న టీపాడ్ ప్రతి మూడు నెలలకోసారి స్టేట్ హైవే 121 పక్కన, కాలిబాటలపై, ఆటంకం కలిగించే పరిసరాల్లో పేరుకుపోయే చెత్త, వ్యర్థాలు, ఇతర వస్తువులను తొలగిస్తుంది. టీపాడ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ రామ్ అన్నాడి సమన్వయం చేస్తున్న ఈ నూతన బాధ్యతకు ఫౌండేషన్ కమిటీ చెయిర్ రఘువీర్ బండారు, ఫౌండేషన్ కమిటీ సభ్యులు రావు కల్వల, అజయ్ రెడ్డి, జానకీరామ్ మందాడి మార్గదర్శకత్వం చేయడంతో పాటు సహకారం అందిస్తున్నారు.బీవోటీ చెయిర్ రవికాంత్ మామిడి నాయకత్వంలోని టీపాడ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, కోఆర్డినేటర్ లింగారెడ్డి అల్వ; ప్రెసిడెంట్ లక్ష్మి పోరెడ్డి నాయకత్వంలోని ఎగ్జిక్యూటివ్ కమిటీ, అడ్వయిజరీ కమిటీ, కొలాబరేషన్ కమిటీ, టీపాడ్ వలంటీర్ల బృందం ఈ కార్యక్రమాన్ని సమష్టి నిబద్ధతతో నిర్వహిస్తున్నది. మూడో సారి హైవే క్లీనింగ్ యాక్టివిటీని చేపట్టిన టీపాడ్ తన 25 మంది వలంటీర్లతో ప్రెస్టన్ రోడ్డు పక్కన కాలిబాటలు, రోడ్డు పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తతో పాటు పెద్ద పరిమాణంలోని వ్యర్థాలు, ఇతర వస్తువులను తొలగించారు.బ్లడ్ డ్రైవ్ ద్వారా రక్తం సేకరించి ఎంతో మంది ప్రాణాలను కాపాడేందుకు టీపాడ్ ఇప్పటికే కృషి చేస్తున్నది. ఫుడ్ డ్రైవ్ ద్వారా అన్నార్థుల ఆకలి తీర్చుతున్నది. తాజాగా అడాప్ట్ ఎ హైవే కార్యక్రమం ద్వారా రోడ్డు భద్రత, ప్రయాణికుల రక్షణ, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణకు పాటు పడుతున్నది. టీపాడ్ నాయకత్వం రవికాంత్ మామిడి(బీవోటీ చెయిర్), లక్ష్మి పోరెడ్డి(ప్రెసిడెంట్), రఘువీర్ బండారు (ఎఫ్‌సీ చెయిర్), లింగారెడ్డి అల్వ(కోఆర్డినేటర్) వలంటీర్లందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టడం ద్వారా సమాజానికి సేవ చేయాలని ఇతర కమ్యూనిటీ సంస్థలకు, ఫ్రెండ్స్ గ్రూప్స్‌కు టీపాడ్ నాయకత్వం పిలుపునిచ్చింది. -
దుబాయ్‌లో ఘనంగా వైఎస్సార్ 17వ వర్ధంతి
దివంగత మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా దుబాయ్‌లోని బిన్ సనత్ లేబర్ క్యాంప్, సోనాపూర్‌లో అన్నదాన సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గల్ఫ్ కో-కన్వీనర్ మహమ్మద్ జిలాన్ బాషా, ప్రముఖ పారిశ్రామికవేత్త సుధాకర్ రెడ్డి, ప్రసన్న సోమిరెడ్డిల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముందుగా కార్యక్రమం ప్రారంభంలో డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి సేవలను స్మరించుకుంటూ నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు రాజా రెడ్డి, శ్రీనివాస్ చౌదరి, కోటేశ్వర రెడ్డి, నరేష్ చౌదరి, జనార్దన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మల్లికార్జున రెడ్డి, రమణ రెడ్డి , ఇషాల్ , వెంకట్ రెడ్డి, షరీఫ్, వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ నేపథ్యంలో ప్రియతమ మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రజల సంక్షేమం కోసం అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా..ఆయన చేసిన సేవలు, అమలు చేసిన కార్యక్రమాలు నేటికీ ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయాయన్నారు. అంతేగాదు వైఎస్సార్ ఆశయాలను కొనసాగిస్తూ, భవిష్యత్తులో కూడా సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు గల్ఫ్ కో-కన్వీనర్ మహమ్మద్ జిలాన్ బాషా.(చదవండి: మరపురాని మహానేత.. జలప్రదాత వైఎస్సార్) -
అమెరికాలో ఘనంగా మనబడి తెలుగుకు పరుగు రన్4తెలుగు 2026
అమెరికా సంయుక్త రాష్ట్రాలలో సిలికానాంధ్ర మనబడి ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవాన్ని, పురస్కరించుకొని నిర్వహించిన ప్రతిష్ఠాత్మక ‘తెలుగుకు పరుగు – Run4Telugu 2026’ కార్యక్రమం ఘనంగా జరిగింది.వల్లభాపురపు బాలాజీ, అల్లం శ్రీదేవిల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అమెరికాలోని అరిజోనా, కాలిఫోర్నియా, కొలరాడో, జార్జియా, ఇల్లినాయిస్, మిషిగన్, మిన్నెసోటా, మిస్సోరీ, న్యూ జెర్సీ, ఒక్లాహోమా, టెన్నెస్సీ, టెక్సాస్, వర్జీనియా తదితర రాష్ట్రాలలోని సుమారు 25 ప్రాంతాల నుంచి మూడువేల మందికి పైగా తెలుగు భాషాభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు.తెలుగు భాష గొప్పతనాన్ని చాటిచెప్పడంతో పాటు “ఆరోగ్యమే మహాభాగ్యం” అనే సందేశాన్ని సమాజానికి అందించాలనే లక్ష్యంతో మనబడి భాషా సైనికుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు అన్ని వయసుల వారు ‘తెలుగుకు పరుగు’లో ఉత్సాహంగా పాల్గొని తెలుగు భాషపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా మనబడి ‘తెలుగుకు పరుగు’ నిర్దేశకులు వల్లభాపురపు బాలాజీ మాట్లాడుతూ, మనబడి నిర్వహిస్తున్న తెలుగు భాషా తరగతుల గురించి వివరించారు. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన నమోదు వివరాలను తెలియజేస్తూ, తెలుగు భాషను భావితరాలకు అందించడం ప్రతి తెలుగు కుటుంబం బాధ్యత అని గుర్తుచేశారు. అమెరికా, కెనడాతో పాటు వివిధ దేశాలలో మనబడి నిర్వహిస్తున్న తెలుగు తరగతులు, కార్యక్రమాల గురించి కూడా వివరించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం కల్పించిన మనబడి అధ్యక్షులు, కులపతి చమర్తి రాజు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తెలుగుకు పరుగులో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ, నిర్వాహకులకు శుభాభినందనలు తెలిపారు. Run4Telugu పోటీలను రెండు విభాగాలలో నిర్వహించారు. ప్రతి ప్రాంతంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విజేతలను మనబడి మెడల్స్‌తో సత్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ మనబడి ధృవపత్రాలను అందజేశారు. ఆయా ప్రాంతాలలో పాల్గొన్న వారికి అల్పాహార విందును కూడా ఏర్పాటు చేశారు. అంతేగాదు “తెలుగు నేర్చుకుందాం… తెలుగు మాట్లాడుదాం… తెలుగు భాషను భావితరాలకు అందిద్దాం” అనే మనబడి సందేశాన్ని అమెరికా వ్యాప్తంగా ధ్వనింపచేసేలా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. (చదవండి: స్టిక్కీ నోట్‌తో గిన్నిస్ రికార్డు) -
లక్షల్లో జీతం, హెచ్1 బీ వీసా : తిరిగి ఇండియాకు, ఎందుకు?
ఆరంకెల జీతం, హెచ్1-బీ వీసా కలలతో అమెరికాకు ఎగిరిపోయే భారతీయులకు ఈ కల సాకారమైనాక ఇక లైఫ్ సెట్ అనుకుంటారు. కానీ ఒక భారత సంతతి మహిళ అలా అనుకోలేదు. వాటన్నింటినీ వదులుకుని మాతృదేశానికి తిరిగి వచ్చేయాలని నిర్ణయించుకుంది. ఎందుకో తెలుసా?'బిజినెస్ ఇన్సైడర్' అందించిన వివరాల ప్రకారం 28 ఏళ్ల దిశా లాంబా, 2021లో న్యూయార్క్ యూనివర్సిటీలో కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ కోసం అమెరికాకు వెళ్లింది. అక్కడ విజయ వంతమైన కెరీర్‌ను నిర్మించుకుని, 2024లో CVS హెల్త్‌లో డేటా సైంటిస్ట్ ఉద్యోగాన్ని పొందింది. ఆరెంకల భారీ వేతనంతో కూడిన ఉద్యోగం. H-1B వీసా లాటరీ ప్రక్రియలోనూ విజయం సాధించింది. కానీ తన కుటుంబానికి దగ్గరగా ఉండటంతో పాటు,మారుతున్న పరిస్థితుల రీత్యా వాటన్నింటినీ వదులుకోవాలని నిర్ణయించుకుంది.ఒంటరితనం, అమెరికా సమయానికి అనుగుణంగా ఇండియాలోని తల్లిదండ్రులతో మాట్లాడాల్సి రావడం ఆమెను మానసికంగా ఇబ్బందికి గురి చేసినట్టు ఆమె వెల్లడించారు. H-1B వీసా పొందినప్పటికీ ఉద్యోగం మారడం, ఇతర ఆదాయ మార్గాలు (Side hustles) వెతుక్కోవడం, ప్రయాణాలు లేదా కెరీర్ గ్యాప్ తీసుకోవడం H-1B నిబంధనల వల్ల చాలా కష్టంతో కూడుకున్నవి కావడం కూడా ఆమె నిర్ణయానికి ఊతమిచ్చాయి.ఇదీ చదవండి: రూ. 15 లక్షల కారు, 70 తులాల గోల్డ్ : అయినా కట్నదాహానికి టీచర్ భువనేశ్వరి ఆహుతి2026 మేలో ఉద్యోగానికి రాజీనామా చేసి గురుగ్రామ్‌లోని తన తల్లిదండ్రుల వద్దకు తిరిగొచ్చేశారు. ప్రస్తుతం ఒక చిన్న కెరీర్ బ్రేక్ తీసుకుని, భారతదేశంలోనే కొత్త అవకాశాలు లేదా స్వంతంగా వ్యాపారం ప్రారంభించే యోచనలో ఉన్నారు. H-1B వీసాలపై కొత్త ప్రతిపాదనలప్రకారం, అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) H-1B వీసాలకు సంబంధించి కొన్ని కఠినమైన మార్పులను ప్రతిపాదించింది: H-1B వీసా ఫీజు పెంచే ప్రతిపాదనతోపాటు. గ్రేస్ పీరియడ్ రద్దచేయాలని భావిస్తోంది. దీంతో ఉద్యోగం కోల్పోయిన H-1B హోల్డర్లకు ఇచ్చే 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను తొలగిస్తారు.అలాగే H-1B వీసాదారుల జీవిత భాగస్వాములకిచ్చే (H-4 వీసా) ఇచ్చే పని అనుమతులను రద్దు చేసే ప్రతిపాదన కూడా ఉంది. ఈ నిబంధనలు ఎక్కువ మంది భారతీయ కుటుంబాలపై ప్రభావం చూపుతున్నాయి. ఇదీ చదవండి: 12 ఏళ్లు ఆర్మీకి సేవలు : గుడ్‌బై చెప్పిన ‘నేషనల్ క్రష్’ -
నేపాల్ వరదల్లో 25 మంది తెలంగాణ NRIలు గల్లంతు..!
-
అమెరికాలో తెలంగాణ యువకుల దుర్మరణం
ఎన్నారై న్యూస్: అమెరికా స్టేట్ ఫ్లోరిడాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు భారతీయులు మృతి చెందారు. మృతి చెందిన వాళ్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్లని సమాచారం. మృతుల్లో ఓ యువకుడు నిజామాబాద్ వాసిగా నిర్ధారణ అయ్యింది. మిగతా ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది.ఫ్లోరిడా హైవే పెట్రోల్ అందించిన సమాచారం ప్రకారం.. తెల్లవారుజామున వాళ్లు ప్రయాణిస్తున్న కారు ఓ చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మరణించినట్లు తెలుస్తోంది. ప్రమాదం గురించి కుటుంబ సభ్యులకు అక్కడి అధికారులు సమాచారం చేరవేశారు.నిజామాబాద్ జిల్లాకు చెందిన రాహుల్.. మూడు నెలల కిందట ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లాడు. ప్రమాదంలో అతనూ మరణించినట్లు తల్లిదండ్రులకు సమాచారం అందింది. ఈ వార్తతో ముగ్గురి స్వస్థలాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాల్ని స్వదేశానికి రప్పించాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు.ఇదీ చదవండి: నేపాల్‌లో ప్రకృతి విలయ తాండవం -
ఉద్యోగం రాలేదని అమెరికాలో హైదరాబాదీ యువకుడి ఆత్మహత్య
కోటి కలలతో రెక్కలు కట్టుకుని విదేశాలకు ఎగిరిపోయిన ఒక యువకుడి జీవితం విషాదంతమైంది. ఉన్నత చదువులు చదివినా కూడా ఉద్యోగం రాలేదని అమెరికాలో హైదరాబాద్‌కు చెందిన సాయిప్రదీప్ ఆత్మహత్య చేసుకున్న దిగ్బ్రాంతి రేపింది. హైదరాబాద్‌లోని దమ్మాయిగూడలోని శ్రీనివాసనగర్ కాలనీ చెందినవాడుగా పోలీసులు గుర్తించారు. నివేదికల ప్రకారం, సాయి ప్రదీప్ 2024లో అమెరికాకు వెళ్లారు. ఇటీవల 'యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ శాన్ ఆంటోనియో'లో తన మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు. అతనికి సప్లై చైన్ అనలిస్ట్‌గా 5 సంవత్సరాల అనుభవం ఉన్నట్టు తెలుస్తోంది. గత నాలుగు నెలలుగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న ఫలితం దక్కకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైనాడు. దీంతో ఈ డిప్రెషన్‌తో ఆగస్టు 21న ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. అతని మృతదేహాన్ని భారతదేశానికి రప్పించడానికి మరియు అంత్యక్రియల ఖర్చులను భరించడానికి అతని కుటుంబం నిధుల సేకరణను ప్రారంభించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.కాగా అమెరికా కఠినమైన వలస విధానాలలో నెలకొన్న ఉద్యోగ సంక్షోభం, ఎన్నారైలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. భవిష్యత్ అనిశ్చితి కెరీర్ కలలు, ఆర్థిక ఒత్తిడి వేలాది మంది భారతీయ విద్యార్థులు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతోంది.ఇదీ చదవండి: పెళ్లై మూడేళ్లు, ముత్యాల్లాంటి కవలలు : అల్లుడ్ని కొట్టి చంపేశారు -
నా పిల్లలు కాలేజ్‌కి వెళ్లకూడదు..! భారత సంతతి సీఈవో
లిఫ్ట్, ప్రెస్టో వంటి కంపెనీల భాతర సంతతి సహవ్యవస్థాపకుడు రజత్ సూరి తరగతి గది వర్సెస్ ఏఐపై చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏఐ యుగంలో కాలేజీ విద్య నిరుపయోగంగా మారుతోందంటూ చర్చను రేకెత్తించారు. పైగా ఆయన తన పిల్లలు కాలేజ్‌కి వెళ్లి చదవకపోవడమే మేలు అని సోషల్ మీడియా ఎక్స్ పోస్ట్‌లో రాసుకొచ్చారు. యువతకు అవసరమైన నైపుణ్యాలు, అనుభవాన్ని సంపాదించడానికి సాంప్రదాయ కాజేల్ చదువులు సరిపోకపోవచ్చని వాదించారు. ఆయన తన వ్యక్తిగత అనుభవాన్ని ప్రస్తావిస్తూ..తాను యూనివర్సిటీ ఆఫ్ వాటర్లూలో ఎకనామిక్స్ అండ్ ఇంజనీరింగ్‌లో డబుల్ డిగ్రీలు చేశాక, ప్రతిష్టాత్మక మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ(ఎంఐటీ)లో పీహెచ్డీ/ఎంబీఏ ప్రోగ్రామ్ చేయడం కోసం చేరినట్లు తెలిపారు. అయితే తగరతి గదిలో నేర్చుక్నుదానికంటే వాస్తవ ప్రంపంచంలోనే అసలైన పనిని నేర్చుకున్నానని అంటున్నారు. ఆ కారణంగానే తాను వ్యవస్థాపకతపై దృష్టి సారించాలనే ఉద్దేశ్యంతోనే ఎంఐటీని మధ్యలోనే వదిలేశానని చెప్పారు. ఈ రోజు తన పిల్లలు గురించి ఆలోచిస్తుంటే వాళ్లు అసలు కాలేజ్ దరిదాపుల్లోకి వెళ్లకూడదని కోరుకుంటున్నానని అన్నారు. అలాగే వాటర్లూలో తనకు ఆరు వేర్వేరు వర్క్ప్లేస్మెంట్లు లభించాయని అన్నారు. అవి తనను వివిధ కంపెనీలు, సంస్కృతులు, మేనేజర్లు, వ్యాపార నమునాలకు పరిచయం చేశాయని అన్నారు. నిజానికి తన కోర్సు వర్క్‌లోని చాలా భాగం కంటే ఆ అనుభవాలే ఎంతో విలువైనవని అన్నారు. తాను స్కూల్లో నేర్చుకున్న చాలా విషయాలు వాటర్లూలోని వర్క్ టర్మ్స్‌లోనే నేర్చుకున్నానని చెప్పారు. అక్కడ నుంచి ఆరు వేర్వేరు కంపెనీలలో పనిచేశానని చెప్పారు. ఎంతో భిన్నమైన సంస్కృతులు, భిన్న యాజమాన్య శైలుల, టీమ్ డైనమిక్స్, వ్యాపార నమునాలు గురించి నేర్చుకున్నానని చెప్పారు. అందువల్ల ఈ రోజుల్లో తరగతి గదుల కంటే ఏఐ.. విద్యా నైపుణ్యాలను మరింత సమర్ధవంతంగా నేర్పించగలదని అన్నారు. కాబట్టి నాలుగేళ్లపాటు తరగతులకు హాజరయ్యే బదులు, యువత నేరుగా వివిధ సంస్థలలో పని అనుభవం ద్వారా నేర్చుకోవడమే మంచిదని ఆయన వాదించారు. అంతేగాదు రజత సూరి తన వర్క్‌లైఫ్ ద్వారానే చాలా నేర్చుకున్నాని, అదే తనను ప్రెస్టో, లిఫ్ట్ వంటి కంపెనీలను స్థాపించి వ్యవస్థాపకుడిగా మార్చిందన్నారు. ప్రస్తుతం ఆయన లీమా, ట్రైబ్ చాట్లకు సహా వ్యవస్థాపుకుడిగా ఉన్నారు. I went to MIT for a PhD / MBA after graduating with 2 degrees at Waterloo, and yet I'm thinking that my kids probably shouldn't go to collegeMost of what I learned at school was at my work terms at Waterloo. I worked at 6 different companies there, experienced vastly different…— Rajat Suri (@rajatsuri) August 18, 2026 (చదవండి: లస్సీ అమ్ముతూ నెలకు రూ. 80 వేలు..!) -
సోషల్ మీడియాలో సంచలనంగా కన్సల్టెంట్ కథ!
ఇండియాకు చెందిన ఓ మేనేజ్మెంట్ కన్సల్టెంట్.. త రెండున్నర ఏళ్లలో రూ.6.5 కోట్లు ఆదా చేసినట్టు, తన మొత్తం నెట్ వర్త్‌ను రూ.1 కోటి నుంచి రూ.7.5 కోట్లకు పెంచుకున్నట్టు రెడ్డిట్‌లో పంచుకున్న పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.'From Rs 1 Cr at 34 to Rs 7.5 Cr at 37: My Middle East Consulting Journey' పేరుతో పెట్టిన ఈ పోస్టులో, 37 ఏళ్ల ఈ వ్యక్తి తన కెరీర్, ఆదాయం, పొదుపు, పెట్టుబడుల వివరాలను వివరంగా పంచుకున్నాడు. ఇంజినీరింగ్ డిగ్రీతో పాటు దేశంలోని టాప్ ఇన్స్టిట్యూట్ నుంచి ఎంబీఏ పూర్తి చేసిన ఈయన, ప్రస్తుతం ఒక ప్రముఖ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థలో పనిచేస్తున్నాడు.కెరీర్, జీతం ఎలా పెరిగాయంటే...22 ఏళ్ల వయసులో గ్రాడ్యుయేట్ ట్రైనీగా కెరీర్ మొదలుపెట్టిన ఈయన, అప్పుడు ఏడాదికి రూ.10 లక్షలు సంపాదించేవాడు. ఎంబీఏ పూర్తయ్యాక 26 ఏళ్లకు మేనేజ్మెంట్ కన్సల్టింగ్లోకి అడుగుపెట్టాడు, అప్పటి వార్షిక ఆదాయం రూ.25 లక్షలు. 29 ఏళ్లకు మరో కెరీర్ మార్పుతో ఇండస్ట్రీ రోల్‌లోకి మారి, రూ.40 లక్షల ప్యాకేజీ అందుకున్నాడు. తర్వాతి ఐదేళ్లలో జీతం క్రమంగా పెరుగుతూ రూ.65 లక్షలకు చేరింది. ఈ కాలంలోనే పీఎఫ్, బంగారం, స్టాక్స్, రియల్ ఎస్టేట్లలో పెట్టుబడులతో దాదాపు రూ.1 కోటి నెట్ వర్త్ సాధించాడు.పశ్చిమాసియా మలుపు తిప్పిన సంపద34 ఏళ్ల వయసులో మళ్లీ కన్సల్టింగ్ రంగంలోకి వెళ్లి, పశ్చిమాసియాకు మారిన ఈయన జీతం ఒక్కసారిగా రూ.3.5 కోట్లకు (సుమారు 4 లక్షల డాలర్లు) పెరిగింది. అదీ పన్ను లేకుండా. ఈ భారీ జీత పెరుగుదలే ఆదా వేగాన్ని పెంచింది. "ఇప్పుడు 37 ఏళ్ల వయసులో, గత రెండున్నర ఏళ్లలో దాదాపు రూ.6.5 కోట్లు ఆదా చేశాను, నా నెట్ వర్త్ రూ.7.5 కోట్లకు చేరింది" అని ఆయన పోస్టులో పేర్కొన్నాడు.తన ప్రస్తుత ఆస్తుల గురించి కూడా వివరించాడు. ముంబైలో పూర్తిగా చెల్లించిన మూడు ప్రాపర్టీలు, భౌతిక బంగారం, సావరిన్ గోల్డ్ బాండ్ల రూపంలో సుమారు 700 గ్రాముల బంగారం, ఈక్విటీల్లో దాదాపు రూ.30 లక్షల పెట్టుబడి ఉన్నట్టు తెలిపాడు. రాబోయే కాలంలో ఈక్విటీ పోర్ట్‌ఫోలియోను మరింత పెంచుకోవడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు.నెటిజన్ల స్పందనఈ పోస్ట్ రెడ్డిట్ యూజర్లను బాగా ఆకట్టుకుంది. కొందరు తమ కెరీర్, ఫైనాన్స్ గురించి సీరియస్‌గా ఆలోచించేలా ప్రేరణ ఇచ్చిందని చెప్పగా, మరికొందరు ఇంత సంపద సాధించడం వెనుక ఏళ్ల కృషి, కష్టమైన నిర్ణయాలు ఉంటాయని కొనియాడారు. అధిక జీతాలు, పన్ను మినహాయింపులతో మిడిల్ ఈస్ట్ సంపద నిర్మాణానికి 'చీట్ కోడ్' లాంటిదని కొందరు వ్యాఖ్యానించారు. విదేశాలకు మారడం ఎలా సాధ్యమైందో, కెరీర్ ప్రారంభంలోనే ఇలాంటి అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఏం చేయాలో తెలుసుకోవాలని కొందరు ఆసక్తి చూపారు. -
27 ఏళ్లుగా అమెరికాలోనే.. ICE అదుపులో ఎన్నారై మహిళ!
అమెరికాలో 27 ఏళ్లుగా నివసిస్తున్న ఓ భారత సంతతి మహిళకు అనూహ్య పరిస్థితి ఎదురైంది. చట్టబద్ధమైన శాశ్వత నివాస హోదా (గ్రీన్‌కార్డ్) ఉన్నప్పటికీ.. అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆమెను అదుపులోకి తీసుకుంది. అంతేకాదు.. ఆమెపై గతంలో కొనసాగిన డిపోర్టేషన్ కేసును ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తి ఇప్పటికే కొట్టివేసినప్పటికీ ఈ అరెస్టు జరగడం చర్చనీయాంశంగా మారింది.వెంకట నరసమాంబ వాసంశెట్టి అనే మహిళను ఆగస్టు 11న సాధారణ చెక్-ఇన్‌కు హాజరైన సమయంలో ICE అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆమెను జార్జియాలోని డిటెన్షన్ కేంద్రంలో ఉంచినట్లు సమాచారం. 2013 నుంచి ఆమెకు అమెరికాలో లాఫుల్ పర్మనెంట్ రెసిడెంట్ (LPR) హోదా ఉంది.క్రిమినల్ రికార్డ్ లేదు..వాసంశెట్టి కుటుంబం దాదాపు మూడు దశాబ్దాలుగా అమెరికాలో స్థిరపడింది. నార్త్ కరోలినాలో ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు బోధించే ఉపాధ్యాయురాలిగా ఆమె పనిచేసినట్లు ఆమె కుటుంబ న్యాయవాది వెల్లడించారు. ఆమెకు ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదని, ఇద్దరు అమెరికా పౌరులైన పిల్లలు, ఇద్దరు అమెరికా పౌరులైన మనవళ్లు ఉన్నారని తెలిపారు.ఆమె ఇల్లు, ఉద్యోగం, కుటుంబం మొత్తం అమెరికాలోనే ఉన్నాయని.. గ్రీన్‌కార్డ్‌ను వదులుకోవాలనే ఉద్దేశం ఎప్పుడూ లేదని కుటుంబ సభ్యులు, న్యాయవాదులు చెబుతున్నారు.ఏడు నెలలు భారత్‌లో ఉన్నందుకేనా?వాసంశెట్టి 2022 జూలైలో అనారోగ్యంతో ఉన్న తల్లిదండ్రులను చూసుకునేందుకు భారత్‌కు వెళ్లారు. అక్కడ ఉండగానే ఆమెకు కోవిడ్ సోకడంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయని న్యాయవాదులు తెలిపారు. పరిస్థితి విషమించడంతో దాదాపు రెండు వారాలపాటు ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు చెప్పారు. దీంతో ఆమె అమెరికాకు తిరిగి రావడం ఆలస్యమైంది. చివరకు 2023 ఫిబ్రవరిలో రాలీ-డర్హామ్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా అమెరికాకు చేరుకున్నారు. మొత్తం మీద ఆమె సుమారు ఏడు నెలలు భారత్‌లో ఉన్నారు. అయితే.. ఈ వ్యవధినే అమెరికా ప్రభుత్వం ఆమె గ్రీన్‌కార్డ్ హోదాను ప్రశ్నించడానికి ప్రధాన కారణంగా చూపినట్లు సమాచారం. అమెరికా వెలుపల ఎక్కువ కాలం ఉండటం వల్ల శాశ్వత నివాసాన్ని వదులుకోవాలనే ఉద్దేశం ఉందా? అనే అంశాన్ని అధికారులు పరిశీలించవచ్చు.‘అమెరికాను వదిలే ఉద్దేశమే లేదు’అయితే వాసంశెట్టి మాత్రం అమెరికాలో తన జీవితాన్ని కొనసాగించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆధారాలు సమర్పించారు. భారత్‌కు వెళ్లిన సమయంలోనూ అమెరికాలో తన ఉద్యోగం, కుటుంబం, ఇల్లు వంటి సంబంధాలను కొనసాగించారని ఆమె తరఫు న్యాయవాదులు చెబుతున్నారు. అంతేకాదు.. భారత్‌లో ఉన్న సమయంలోనే నార్త్ కరోలినాలో తన ప్రధాన నివాసంగా ఉపయోగించుకునే ఇంటిని కొనుగోలు చేసినట్లు ఆమె తరఫు న్యాయవాది తెలిపారు. తల్లిదండ్రుల అనారోగ్యం, తన ఆరోగ్య సమస్యల కారణంగా జరిగిన తాత్కాలిక ప్రయాణాన్ని అమెరికా శాశ్వత నివాసాన్ని వదులుకోవాలనే నిర్ణయంగా చూడలేమని వాదించారు.కోర్టు కేసు కొట్టేసినా.. మళ్లీ అరెస్టువాసంశెట్టిపై అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) డిపోర్టేషన్ చర్యలు ప్రారంభించింది. అయితే కేసుకు సంబంధించిన ఆధారాలను సమర్పించేందుకు కోర్టు విధించిన గడువులో DHS విఫలమైందని ఆమె న్యాయవాది తెలిపారు. దీంతో 2026 మే 19న ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తి ఆమెపై కొనసాగుతున్న డిపోర్టేషన్ ప్రక్రియను ముగించారు. ఆ తర్వాత కూడా ఆమెకు విధించిన ICE చెక్-ఇన్లకు క్రమం తప్పకుండా హాజరవుతూ వచ్చారు. అలా ఆగస్టు 11న చెక్-ఇన్‌కు వెళ్లిన సమయంలోనే ICE అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.‘ఆమె గ్రీన్‌కార్డ్ హోల్డర్ కాదు’వాసంశెట్టిని అదుపులోకి తీసుకున్న తర్వాత ICE మాత్రం ఆమె గ్రీన్‌కార్డ్ హోల్డర్ కాదని వాదిస్తున్నట్లు ఆమె న్యాయవాదులు తెలిపారు. దీంతో ఆమె కుటుంబం మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఆగస్టు 13న ఆమె తరఫు న్యాయ బృందం అత్యవసర హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై స్పందించిన ఫెడరల్ న్యాయమూర్తి.. ఆమెను నిర్బంధించడానికి ఉన్న చట్టపరమైన ఆధారాలను మూడు రోజుల్లో వివరించాలని ఇమ్మిగ్రేషన్ అధికారులను ఆదేశించారు.తర్వాత ఏం జరగొచ్చు?తాజా కోర్టు పరిణామాల ప్రకారం.. ఆమెను వెంటనే విడుదల చేయాలని ఆదేశం వెలువడలేదు. అయితే కోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇస్తే, వాసంశెట్టికి బెయిల్‌పై విడుదల కావచ్చా? అనే అంశాన్ని పరిశీలించేందుకు ఇమ్మిగ్రేషన్ జడ్జి ఎదుట బాండ్ హియరింగ్ జరిగే అవకాశం ఉంది.27 ఏళ్లుగా అమెరికాలో నివసిస్తూ.. గ్రీన్‌కార్డ్ ఆధారంగా జీవనం సాగిస్తున్న ఓ భారత సంతతి మహిళను ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకోవడం ఇప్పుడు అమెరికాలోనే కాకుండా భారతీయ సమాజంలోనూ చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా తాత్కాలికంగా విదేశాల్లో ఎక్కువకాలం ఉండటం వల్ల గ్రీన్‌కార్డ్ హోదాపై ఎలాంటి ప్రభావం పడుతుంది? అనే ప్రశ్న మరోసారి ముందుకొచ్చింది. -
నాట్స్ వినూత్న సేవ కార్యక్రమం
భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ మిస్సోరీ చాప్టర్ సభ్యులు వినూత్నంగా సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. సమాజ శ్రేయస్సే ధ్యేయంగా సెయింట్ లూయిస్ ప్రాంతీయ ఫుడ్ బ్యాంకాక్‌లో జరిగిన ప్రత్యేక ఆహార సేకరణ, ప్యాకేజింగ్ కార్యక్రమంలో నాట్స్ టీమ్ చురుగ్గా పాల్గొని సేవలు అందించింది. పేదలు, నిరుపేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాట్స్ వాలంటీర్లు, తెలుగు కుటుంబాలు స్వచ్ఛందంగా పాల్గొన్నాయి. ఈ సేవా కార్యక్రమంలో నాట్స్ నార్త్ సెంట్రల్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ సందీప్ కొల్లిపర, నాట్స్ మిస్సోరీ చాప్టర్ జాయింట్ కోఆర్డినేటర్ అన్వేష్ చాపరాలలతో పాటు చాప్టర్ ప్రతినిధులు మధుసూధన్ దడ్డాల, నరేష్ రాయంకుల తదితరులు పాల్గొని తమ వంతు సహాయ సహకారాలు అందించారు. తెలుగు సమాజానికి, అలాగే స్థానిక అమెరికన్ సమాజానికి సహాయం చేయడంలో నాట్స్ ఎల్లప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా నాట్స్ నాయకులులు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఆకలితో ఉన్నవారికి బాసటగా నిలవడం ఎంతో తృప్తినిచ్చిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నాట్స్ వాలంటీర్లకు, నాట్స్ సభ్యులకు నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, నాట్స్ అధ్యక్షుడు రాజ్ అల్లాడ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.(చదవండి: సేవే జీవిత ధ్యేయంగా.. శోభా, ప్రసాద్ రెడ్డి దంపతుల సేవా ప్రస్థానం) -
బెర్లిన్‌లో ఘనంగా భారత్ దివస్ వేడుకలు
బెర్లిన్: జర్మనీలోని భారతీయ ప్రవాసులు ఆగస్టు 16న బెర్లిన్‌లోని చారిత్రక బ్రాండెన్‌బర్గ్ గేట్ వద్ద భారత్ దివస్‌ను ఘనంగా నిర్వహించారు. భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో జర్మనీ నలుమూలల నుంచి భారతీయ సంఘాలు, ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.భారతదేశ ఐక్యత, వైవిధ్యం, గొప్ప సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించేలా వేడుకలు ఉత్సాహభరితంగా సాగాయి. తెలంగాణ అసోసియేషన్ చైర్పర్సన్, వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ రఘు చెల్లిగంటి, యూపీ అసోసియేషన్‌కు చెందిన డాక్టర్ అఖిల్ అగర్వాల్, కాశ్మీరీ సమాజానికి ప్రాతినిధ్యం వహించిన వీణా చౌదరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జర్మనీలోని పలు భారతీయ సంఘాలు, కమ్యూనిటీ సంస్థలు చురుకైన సహకారం అందించాయి.ఈ వేడుకలకు జర్మనీలో భారత రాయబారి అజిత్ గుప్తా తన సతీమణితో కలిసి హాజరయ్యారు. భారత రాయబార కార్యాలయానికి చెందిన కాన్సులర్ మంత్రి స్టాలిన్ బాబు చీకట్ల, పర్సనల్ మంత్రి డాక్టర్ మందీప్ సింగ్ తులితో పాటు పలువురు ప్రముఖ అధికారులు, అతిథులు పాల్గొన్నారు.బ్రాండెన్‌బర్గ్ గేట్ వద్ద వందలాది మంది భారతీయ ప్రవాసులు ఒకచోట చేరడంతో దేశభక్తి, ఐక్యత, సోదరభావంతో కూడిన ప్రత్యేక వాతావరణం నెలకొంది. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించే రంగురంగుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. దేశంలోని భిన్నత్వాన్ని చాటుతూ, అందరినీ త్రివర్ణ పతాకం కింద ఒక్కతాటిపైకి తీసుకువచ్చాయి.అనంతరం బ్రాండెన్‌బర్గ్ గేట్ నుంచి శాంతి స్తూపం వరకు యూనిటీ వాక్ నిర్వహించారు. శాంతి, స్నేహం, ఐక్యత, పరస్పర సహకారం అనే సందేశాన్ని ఈ వాక్ ద్వారా చాటారు.జర్మనీలోని భారతీయ సమాజానికి ఈ వేడుక ఒక గర్వించదగిన, చిరస్మరణీయమైన సందర్భంగా నిలిచింది. భారతదేశం పట్ల తమ అనుబంధాన్ని, ఉమ్మడి వారసత్వాన్ని, భిన్నత్వంలో ఏకత్వం అనే భారతీయ స్ఫూర్తిని ప్రవాస భారతీయులు ఘనంగా చాటుకున్నారు.చదవండి: సేవే జీవిత ధ్యేయంగా.. శోభా, ప్రసాద్ రెడ్డి దంపతుల సేవా ప్రస్థానం -
ఎన్ఆర్ఐలు, ఓసీఐలకు గుడ్ న్యూస్
భారత మార్కెట్లలో పెట్టుబడులను ప్రోత్సహించడం, నియంత్రణ నిబంధనలను సులభతరం చేయడమే లక్ష్యంగా మూలధన మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐ), విదేశీ భారతీయ పౌరులు (ఓసీఐ), ఇతర విదేశీ పౌరుల కోసం డిజిటల్ ‘నో యువర్ కస్టమర్’(కేవైసీ) ప్రక్రియను మరింత సరళతరం చేయాలని సెబీ ప్రతిపాదించింది.ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం, విదేశీ పెట్టుబడిదారులు డిజిటల్ ఆన్‌బోర్డింగ్ ప్రక్రియను పూర్తి చేయడానికి ప్రత్యక్షంగా భారత్‌లోనే ఉండాల్సి వస్తోంది. అయితే, నూతన మార్గదర్శకాల ప్రతిపాదన ప్రకారం.. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) నిబంధనలకు కట్టుబడి ఉండే దేశాల్లో నివసిస్తున్న అభ్యర్థులు విదేశాల్లో ఉంటూనే పూర్తి డిజిటల్ కేవైసీని పూర్తి చేసుకోవచ్చు.ఈ సంస్కరణల ద్వారా ఆన్లైన్ అప్లికేషన్లు, ఎలక్ట్రానిక్ సంతకాలు, డిజిటల్ డాక్యుమెంట్ల సమర్పణ సులభతరం కానుంది. అంతేకాకుండా, దరఖాస్తుదారులు డిజిటల్ పద్ధతిలో క్రాప్ చేసిన సంతకం దాఖలు చేయవచ్చు. అనంతరం ‘వీడియో ఇన్-పర్సన్ వెరిఫికేషన్’ సమయంలో ఒరిజినల్ వెట్ సిగ్నేచర్(లైవ్‌లో సంతకం చేయిస్తారు)ను పరిశీలిస్తారు.ఇదే కాకుండా, ఎన్ఆర్ఐ కస్టమర్ల కేవైసీ రికార్డులను ప్లాట్‌ఫారమ్‌ల మధ్య మార్చుకునేలా సెబీ డిస్కషన్ పేపర్లో ఆమోదం తెలిపింది. కేవైసీ నమోదు ఏజెన్సీలు అధికారిక డేటాబేస్‌ల ద్వారా వివరాలను సరిచూసుకుని ధ్రువీకరించినది(వెరిఫైడ్)గా ట్యాగ్ చేస్తాయి. స్టాక్ బ్రోకర్లు, డిపాజిటరీ పార్టిసిపెంట్లకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను పెంచేందుకు ఈ చర్యలు ఉపయోగపడతాయని సెబీ పేర్కొంది.మార్కెట్ వాటాదారులు, విదేశీ పెట్టుబడిదారుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని రూపొందించిన ఈ బ్లూప్రింట్‌పై ఆసక్తి కలిగిన వర్గాలు సెప్టెంబర్ 4 నాటికి తమ సలహాలు, సూచనలను అందజేయాలని సెబీ కోరింది. నిబంధనల సరళీకరణతో భారత సెక్యూరిటీల మార్కెట్లోకి విదేశీ నిధుల ప్రవాహం వచ్చే అవకాశముందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.ఇది చదవండి: ఒరిజినల్ ఆస్తి పత్రాలు పోతే ఏం చేయాలి? -
నిన్ను సూటిగా ఒక్కటే అడుగుతున్నా.. లోకేష్ కు ఇచ్చిపడేసిన మహిళా
-
చాట్‌జీపీటీ సాయం : తల్లి, తమ్ముడ్ని హత్య చేసిన 17 ఏళ్ల టీనేజర్
అమెరికాలో జంట హత్యలు కలకలం రేపాయి. అమెరికాలో భారత సంతతికి చెందిన 17 ఏళ్ల యువకుడు తల్లిని, తమ్ముడిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. కుటుంబాన్ని ఎలా హత్య చేయాలనే విషయాలను ఏఐలో వెతికి మరీ ఈ దురాగతానికి పాల్పడటం మరింత ఆందోళ రేపింది. గోతిక్ నవల (Gothic novel) తరహా కథలు, పాత్రలను రూపొందించడంలో సాయం చేయాలని AI ఛాట్‌బాట్‌ను కోరినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.మసాచుసెట్స్ డిస్ట్రిక్ట్ అటార్నీకార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం, అమెరికాలోని మాసాచుసెట్స్ సబర్బన్ ఏరియాలో భారతీయ సంతతికి చెందిన టీనేజర్ అర్జున్ అరవింద్, తల్లి సుధా వెంకటేశన్ (45), సోదరుడు సిద్ధార్త్ (14) దారుణంగా హత్య చేసిన ఆరోపణలపై అరెస్ట్ అయ్యాడు.Accused killer 17 year old Arjun Aravind of Acton was taken into custody in Wayland overnight and tomorrow he’s expected in adult court charged with murdering his mother and younger brother…his dad was at work when the murders took place #7News pic.twitter.com/ljpT6lNZGR— Steve Cooper (@scooperon7) August 12, 2026 మంగళవారం సాయంత్రం ఇంటికి వచ్చిన ట్యూటర్ లోపలికి వెళ్లలేక అర్జున్ తండ్రికి సమాచారం అందించారు. తండ్రి ఫోన్ చేసినా ఎలాంటి సమాధానం లేకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చి ‘వెల్ బీయింగ్ చెక్’ చేయాల్సిందిగా కోరారు. పోలీసులు వచ్చి చూడగా తల్లీ కొడుకులిద్దరూ మృతి చెంది ఉన్నారు. ఆక్టన్ ప్రాంతంలోని వారి ఇంట్లోనే ఈ హత్యలు జరిగాయి.నేరం జరిగిన తర్వాత అర్జున్ తన తల్లికి చెందిన హోండా కార్లో పరారైనట్టు పోలీసులు గుర్తించారు. మృత దేహాలపై తీవ్రమైన గాయాలున్నాయనీ, తల్లి మృతదేహం బేస్మెంట్లో, తమ్ముడి మృతదేహం మొదటి అంతస్తులో లభ్యమయ్యాయనీ వెల్లడించారు. దీంతో అర్జున్‌పై రెండు హత్య కేసులు, కుటుంబ సభ్యులపై దాడి, కారు దొంగతనం వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. గాలింపు చర్యల అనంతరం వేలాండ్ (Wayland) ప్రాంతంలోని ఒక పార్కింగ్ లాట్లో కారులో అర్జున్ను అదుపులోకి తీసుకున్నారు.ఛాట్‌జీపీటీ వాడకంపై పోలీసుల ప్రకటనఅర్జున్ కొంతకాలంగా విచిత్రమైన ప్రవర్తన కనబరుస్తున్నాడు. కుటుంబాన్ని చంపేందుకు సంబంధించిన ఊహాజనిత కథనాలు, ఆలోచనల కోసం ఇంటర్నెట్, ChatGPTని ఉపయోగించినట్లు విచారణలో తేలిందని మిడిల్సెక్స్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. -
బాల్టిమోర్‌లో 19వ ఆటా మహాసభలు.. తెలుగు సంస్కృతికి పట్టాభిషేకం
బాల్టిమోర్, అమెరికా: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 19వ మహాసభలు, యువజన సదస్సు దిగ్విజయంగా ముగిశాయి. అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం, బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో మూడు రోజుల పాటు (జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు) అత్యంత వైభవంగా, కోలాహలంగా జరిగిన కార్యక్రమాలకు ఉత్తర అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా ప్రపంచ నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన తెలుగు ప్రజలతో బాల్టిమోర్ నగరం ఒక మినీ తెలుగు సీమను తలపించింది. తెలుగు భాషాభిమానం, సామాజిక ఐక్యత, ఆర్థిక పురోగతి , భావితరాల చైతన్యానికి ప్రతీకగా నిలిచిన ఈ మహాసభలను హాజరైన ప్రతినిధులు ‘సూపర్ డూపర్ హిట్’గా అభివర్ణించారు. శోభాయమానమైన గ్రాండ్ బాంక్వెట్‌తో ప్రారంభమైన ఈ వేడుకలు ఆటా చరిత్రలోనే ఒక చిరస్మరణీయ మైలురాయిగా నిలిచాయి.జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత తెచ్చిన రాజకీయ దిగ్గజాలుఈ మహాసభలకు అమెరికా జాతీయ రాజకీయ దిగ్గజాలతో పాటు భారతదేశానికి చెందిన ప్రజాప్రతినిధులు హాజరై ప్రత్యేక శోభను తెచ్చారు. మేరీల్యాండ్ గవర్నర్ వెస్ మూర్ మాట్లాడుతూ మేరీల్యాండ్, అమెరికా సమగ్ర అభివృద్ధిలో తెలుగు ప్రవాసుల పాత్రను కొనియాడారు. సాంకేతికత, వైద్యం, విద్య, వ్యాపారం, పౌర సేవల్లో తెలుగు వారి నిబద్ధతను అభినందించారు.ఈ కార్యక్రమానికి హాజరైన మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ అరుణా మిల్లర్ తన జీవిత ప్రయాణాన్ని షేర్ చేసుకుంటూ.. పిల్లల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడం ద్వారా అమెరికన్ సమాజంలో ఉన్నత అవకాశాలను సాధించవచ్చని సూచించారు. వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ గజాలా ఎఫ్. హష్మీ తన హైదరాబాద్ బాల్య జ్ఞాపకాలైన పాతబస్తీ, చార్మినార్, లాడ్ బజార్, హైదరాబాదీ బిర్యానీ, రైలు ప్రయాణాలను గుర్తుచేసుకుని ప్రేక్షకులను చప్పట్లు కొట్టేలా చేశారు. ప్రవాసులు పౌర, రాజకీయ ప్రక్రియల్లో చురుగ్గా పాల్గొనాలని కోరారు.తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్ర ప్రగతి, మౌలిక వసతులు, పెట్టుబడి అవకాశాలను వివరిస్తూ రాష్ట్రాభివృద్ధికి, ఉపాధి కల్పనకు ప్రవాస పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ వేడుకల్లో తానా, నాట్స్, టీటీఏ, టీడీఎఫ్, ఏఏపీఐ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు పాల్గొని తెలుగు సమాజ ఐక్యతను చాటారు. అమెరికా సాయుధ దళాల్లో వీరోచితంగా సేవలందిస్తున్న తెలుగు మహిళలు, పురుషులను ఈ వేదికపై ఘనంగా సత్కరించడంతో సభ మొత్తం అత్యంత భావోద్వేగానికి గురవడమే కాదు, స్టాండింగ్ ఒవేషన్, కరతాల ధ్వనులతో వేదికను మార్మోగేలా చేశారు.వ్యాపార, సాంస్కృతిక వేడుకలుమూడు రోజుల పాటు విభిన్న కార్యక్రమాలతో కన్వెన్షన్ సెంటర్ సభా ప్రాంగణాలు కిటకిటలాడాయి. ఈ వేదికలపై కవిత్వం, సాహిత్యం, సినిమా, చరిత్రపై లోతైన చర్చలు జరిగాయి. పారిశ్రామిక వేదికల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ, వైద్యం, రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ రంగాల్లో అవకాశాలపై సీనియర్ పారిశ్రామికవేత్తలు, యువ స్టార్టప్ వ్యవస్థాపకులు విస్తృతంగా చర్చించారు. రెండవ, మూడవ తరాల తెలుగు-అమెరికన్ యువత కోసం సంస్కృతి, నెట్వర్కింగ్, నాయకత్వ నైపుణ్యాలు,కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలను నిర్వహించారు. ఉర్రూతలూగించిన జానపదాలుతెలుగు సంగీత ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న జానపద గీతాలు ఈ వేదికకు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి. కాసర్ల శ్యామ్, మిట్టపల్లి సురేందర్, రసమయి బాలకిషన్, జనార్దన్ పన్నెల బృందం ఆలపించిన తెలంగాణ జానపద గేయాలు చప్పట్లతో మారుమోగించాయి.తారల సందడి.. కీరవాణి స్వర నీరాజనంతెలుగు సినీ ప్రపంచానికి చెందిన ప్రముఖుల రాకతో వేడుకల్లో ఉత్సాహం రెట్టింపైంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, అడివి శేష్, హాస్య నటుడు రాజేంద్ర ప్రసాద్, మురళీధర్ గౌడ్, వరుణ్ సందేశ్, పూజా హెగ్డే, రీతూ వర్మ, అనన్య నాగళ్ల, దివి వడ్త్యా అభిమానులతో ముచ్చటించారు. యువ నటుడు నవీన్ పోలిశెట్టి తన టైమింగ్ కామెడీ పంచ్ లతో ప్రాంగణాన్ని నవ్వుల సంద్రంలో ముంచెత్తారు. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో, గాయని సునీత, త్రీయరీ, ఆరెంజ్ స్ట్రీట్ బృందాల ప్రదర్శనల అనంతరం... ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ మహాసభలకు 'గ్రాండ్ ఫినాలే'గా నిలిచింది.20వ మహాసభలు డాలస్‌లో ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, కన్వీనర్ శ్రీధర్ బానాల, సతీష్ రెడ్డి రామసహాయం మరియు కోర్ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో వందలాది మంది వాలంటీర్లు భోజనం, రవాణా, లాజిస్టిక్స్ ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించి అతిథుల మెప్పు పొందారు.ఈ మహాసభల ముగింపు సందర్భంగా కీలక ప్రకటన చేస్తూ, 2028లో జరగబోయే 20వ ఆటా మహాసభలకు డాలస్ (టెక్సాస్) నగరం ఆతిథ్యం ఇవ్వబోతోందని నిర్వాహకులు అధికారికంగా వెల్లడించారు. బాల్టిమోర్ మహాసభలు కేవలం సదస్సులు కాదు.. తెలుగువారి గుర్తింపునకు ఒక గొప్ప వేడుక.. కొత్త అవకాశాలకు వేదిక.. సంస్థలు, వృత్తులు, తరాలకు అతీతమైన ఐక్యతకు శక్తివంతమైన ప్రతీక.. అని తెలిపారు. -
ఐర్లాండ్ గడ్డపై ప్రతిభ చాటిన తెలంగాణ బిడ్డలు
వైరా: ఐర్లాండ్‌లో ఈనెల 8వ తేదీన నిర్వహించిన మిస్ ఇండియా యూనివర్స్ ఐర్లాండ్ పోటీల్లో ఖమ్మం జిల్లా వైరాకు చెందిన మాదినేని నిఖిత ఫస్ట్ రన్నరప్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 2022లో అక్కడ ఎంఎస్ పూర్తి చేసిన ఆమె అక్కడే కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తోంది. ఈ నేపథ్యాన ఐర్లాండ్ ఈవెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యాన భారత్ నుంచి వెళ్లి ఐర్లాండ్‌లో ఉంటున్న యువతులకు ఇటీవల నిర్వహించిన పోటీల్లో తెలంగాణ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు చెందిన 18 మంది పాల్గొన్నారు. ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో జరిగిన పోటీల్లో ఫస్ట్ రన్నరప్‌గా నిఖిత నిలవగా, ఆ తర్వాత స్థానాల్లో కేరళకు చెందిన అన్మోల్, వరంగల్‌కు చెందిన రాజరాజేశ్వరి నిలిచారు. ఈ సందర్భంగా నిఖిత ‘సాక్షి’తో మాట్లాడుతూ స్టేజీ ఫెర్పార్మెన్స్‌ను పరిశీలించడమే కాక న్యాయనిర్ణేతలు పలు ప్రశ్నలు అడిగారని తెలిపారు. అపజయాలు ఎదురైనప్పుడు ఎలా స్పందిస్తావన్న ప్రశ్నకు మనోధైర్యం కోల్పోకుండా మళ్లీ ప్రయత్నం చేస్తానని వెల్లడించింది. కాగా, నిఖిత తల్లి సునీత వైరా 12వ వార్డు కౌన్సిలర్‌గా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలవగా ఆమె తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఐర్లాండ్ అందాల పోటీల్లో ఆమె నెగ్గడంపై తల్లిదండ్రులు, వైరా వాసులు అభినందించారు. -
దమ్ముంటే ఆ మంత్రిని తొలగించు.. బాబుకు వరుదు కళ్యాణి సవాల్
-
టీడీపీ అంటే తెలుగు దుశ్శాసన పార్టీ: వరుదు కళ్యాణి
సాక్షి, విశాఖ: టీడీపీ అంటే తెలుగు దుశ్శాసన పార్టీ అని మండిపడ్డారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. ఒక మహిళను టీడీపీ మంత్రి వేధించడం దారుణం. కూటమిది మంత్రి వర్గమా లేక వేధింపుల వర్గమా అనే అనుమానం కలుగుతోంది అంటూ ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఆ మంత్రిని వెంటనే భర్తరఫ్ చెయ్యాలని డిమాండ్ చేశారు.ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి స్థానంలో ఉన్న ఓ వ్యక్తి.. ఎన్ఆర్ఐ మహిళను వేధించడమేంటి?. తన సేవల కోసం వివరించడానికి ఒక మహిళ తన టీమ్‌తో వస్తానంటే ఆమెను మాత్రమే సదరు ఒంటరిగా రమ్మని చెప్పారంట. వెంటనే ఆ మంత్రిని బర్తరఫ్ చేయాలి. టీడీపీ అంటే తెలుగు దుశ్శాసన పార్టీ. ఆ మంత్రిపై కేసు పెట్టి విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కూటమి నేతలు మన రాష్ట్ర పరువును విదేశాల్లో కూడా తీస్తున్నారు. మహిళల గౌరవం విషయంలో ఇంత జరిగినా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు?.చంద్రబాబుకి చిత్తశుద్ధి ఉంటే ఆ మంత్రిని వెంటనే భర్తరఫ్ చేయాలి. ఇంత పెద్ద తప్పు చేసిన మంత్రిని రోడ్డుపై నడిపిస్తారా?. మేక, కోడిని కోస్తే మా పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టి రోడ్డుపై నడిపించారు. ఇప్పుడు ఈ మంత్రి విషయంలో ఏం చేస్తారు?. కేబినెట్లో ఉన్న ముగ్గురు మహిళా మంత్రులు ఆ వేధింపుల మంత్రిని మెడ పట్టుకొని బయటకు గెంటేసే దమ్ముందా?. మహిళలపై ఈగ వాలితే నేనుంటా అన్న పవన్ కళ్యాణ్ ఏమయ్యారు?. ఈ విషయంలో ఎందుకు స్పందించలేదు.ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకపోగా వేరే దేశంలో ఉన్న తెలుగు మహిళలను మంత్రులు వేధిస్తున్నారు. కూటమి పాలనలో అడుగుకొక కీచకుడు ఉన్నాడు. మా ఎమ్మెల్యే విరూపాక్షిపై కేసు పెట్టడం కోసం టీడీపీ నేత తన భార్య బట్టలు చింపేసాడు. అరవ శ్రీధర్ విషయంలో కమిటీ వేసి చేతులు దులుపుకున్నారు. మహిళలపై ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడినా చర్యలు ఉండవని అంతా అనుకుంటున్నారు. ఆ మంత్రి పేరు బయటపెట్టాలి.. కేసు పెట్టాలి.. మంత్రివర్గం నుంచి ఆయన్ను భర్తరఫ్ చేయాలి. ఒక ఎన్ఆర్ఐ మహిళ తన ఆవేదన చెప్పుకుంటుంటే టీడీపీ సైకోలు పోస్టులు పెట్టి ఆమెను వేధిస్తున్నారు అంటూ మండిపడ్డారు. -
నీ కేబినెట్‌ను శుభ్రం చేసుకో బ్రో
సాక్షి, అమరావతి : ‘మా సంస్థ పేద పిల్లల కోసం పని చేస్తుంది. మా బృందంతో వచ్చి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం.. అంటే బృందంగా వద్దు.. మీరు మాత్రమే ఒంటరిగా కాఫీ షాప్‌కు రండి. అక్కడ మనిద్దరం మాట్లాడుకుందాం’ అంటూ చంద్రబాబు కేబినెట్లోని ఓ మంత్రి వెదవ వేషాలు వేయబోయాడంటూ ఓ ఎన్ఆర్ఐ మహిళ సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు బుధవారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఎక్కడ నలుగురు కలిసినా ఎవరా మంత్రి అంటూ చర్చించుకుంటున్నారు. ఓ ఎన్ఆర్ఐ మహిళతో ఏమిటీ బరితెగింపు అని విస్తుపోతున్నారు. ఇంతకూ ఆ మంత్రి ఎవరు అంటూ టీడీపీ నేతలు సైతం పరస్పరం ఫోన్లు చేసుకుంటున్నారు.ఇద్దరు అమ్మాయిలున్న ఆ మంత్రి ఎవరబ్బా.. అంటూ వాకబు చేస్తున్నారు. లోకేశ్‌కు చెప్పినా చర్యలు తీసుకోలేదంటే ఆయనకు బాగా కావాల్సిన మంత్రి కాబోలు అంటూ మాట్లాడుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన ఈ బాగోతం వివరాలు ఇలా ఉన్నాయి. డాక్టర్ శైలా తాళ్లూరి అనే మహిళ ప్యూర్ (పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్) సంస్థ వ్యవస్థాపకురాలు, సీఈవో. ఈ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఆమె పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పేద పిల్లలకు విద్యను అందిస్తూ, మహిళా సాధికారత పెంపొందించడానికి కృషి చేస్తున్నారు.భారతదేశంతో పాటు కెన్యా, సియెర్రా లియోన్, అమెరికా వంటి పలు దేశాలలో ప్యూర్ సంస్థ కార్యకలాపాలు సాగిస్తోంది. ఈమె సేవలకు పలు పురస్కారాలు కూడా లభించాయి. ఈ క్రమంలో అమెరికాలోని డల్లాస్‌లో జరిగిన నాటా కార్యక్రమంలో డాక్టర్ శైలా తాళ్లూరి చంద్రబాబు కేబినెట్లోని ఓ మంత్రిని కలవడానికి ప్రయత్నించారు. దీన్ని అవకాశంగా తీసుకున్న అమాత్యుడు ఆమెను లోబరుచుకునేందుకు విఫలయత్నం చేశారు. ఈ విషయాన్ని ఆమె కీలక మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకొచ్చారు. అంతకు ముందు సదరు మంత్రిని ఉద్దేశించి కూడా నీకు ఇద్దరు ఆడపిల్లలున్నారంటూ ఓ పోస్టు పెట్టారు.మీరు ఏం పీకారు?‘నారా లోకేశ్.. క్లీన్ అప్ యువర్ కేబినెట్ బ్రో.. నీ మంత్రుల్లో ఒకడి నీచ ప్రవర్తన గురించి వివరాలు కావాలంటే నన్ను సంప్రదించు. అన్ని అధారాలు ఇస్తాను. గతంలో అమెరికాలోని డల్లాస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆ మంత్రి నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. అపాయింట్మెంట్ పేరుతో నాకు మెసేజ్‌లు పంపారు. బృందంగా వచ్చి కలుస్తామంటే.. కాదు కాదు కాఫీ షాప్‌కు ఒంటరిగా రమ్మన్నాడు. ఏదో సాకు చెప్పి తప్పించుకున్నా. అసభ్య మెసేజ్‌లు, ఫొటోలతో నన్ను విసిగించాడు. ఆంధ్రప్రదేశ్‌లో పేద పిల్లల కోసం వచ్చే సాయం ఇలాంటి బ్రోకర్ల వల్ల ఆగిపోతుందనే భయంతో అవమానాన్ని దిగమింగి ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నాను. ఇప్పుడిక తప్పడం లేదు. ఆ మంత్రి ఎవరనేది నేను ఫొటో సహా నేరుగా చెబుతాను. కాకపోతే మాకు ఒకమాట చెప్పి ఉండాల్సిందని తర్వాత మీరు అంటారు. అప్పుడే ఎందుకు చెప్పలేదు? ఫలానా వారికి చెప్పి ఉండాల్సింది కదా.. మాకు చెప్పి ఉండాల్సింది కదా.. అంటారు. అందుకే ఆ మంత్రి ఎవరో ఇప్పటికే మీకు ఫోన్లో చెప్పాను. ఒక్క ‘సారీ యూ హ్యాడ్ టు గో త్రూ దిస్’ అనే మాట తప్ప అన్నీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు రెస్పెక్టబుల్‌గా అడుగుతున్నాను. ఇలాంటి ఘటనల్లో మీరు ఏం చర్యలు తీసుకున్నారు? ఏమి పీకుతున్నారు? పీకారు సో ఫార్??!! ఆ భోగాపురం పీపుల్ బెటర్.. చెట్లు పీకి ఇంకో చోట నాటారు. నా వద్ద ఉన్న చాట్ హిస్టరీ, స్క్రీన్షాట్లు ఆ మంత్రి వద్ద కూడా ఉంటాయి. మీకు ఫోన్లో పేరు చెప్పానుగా.. ఆయన ఫోన్ తీసుకుని చూడండి.. ఇంకా ఎవరెవరిని విసిగిస్తున్నాడో తెలుస్తుంది. మీరు విచారణ నిర్వహిస్తే నా వద్ద ఉన్న ఆధారాలు అన్నీ ఇస్తాను. ఆ మంత్రిపై చర్యలు తీసుకోవాలి’ అంటూ డాక్టర్ శైలా తాళ్లూరి డిమాండ్ చేశారు. కాగా, ఈ పోస్టుపై అటు ప్రభుత్వం నుంచి కానీ, ఇటు టీడీపీ నుంచి కానీ ఎలాంటి స్పందన రాలేదు. -
NRI మహిళపై TDP మంత్రి లైంగిక వేధింపులు
-
ఏపీ కేబినెట్ మంత్రి చిలిపి చేష్టలు.. ఎన్ఆర్ఐ మహిళ వార్నింగ్!
సాక్షి,అమరావతి: ఏపీ కేబినెట్ మంత్రిపై లైంగిక ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. కూటమి ప్రభుత్వానికి చెందిన ఓ కీలక కేబినెట్ మంత్రి తనను లైంగికంగా వేధించారంటూ అమెరికాలో నివసిస్తున్న ఒక ఎన్ఆర్ఐ మహిళ సోషల్ మీడియా వేదికగా చేసిన ఆరోపణలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి.షైలా అనే పేరుతో ఉన్న సదరు ఎన్ఆర్ఐ మహిళ, మంత్రిపై తీవ్రస్థాయిలో మండిపడుతూ వరుస పోస్టులు పెట్టారు. పేద పిల్లలకు సహాయం చేసేందుకు, సామాజిక సేవా కార్యక్రమాల నిమిత్తం తాను మంత్రి అపాయింట్మెంట్ కోరినట్లు ఆమె పేర్కొన్నారు. అమెరికాలోని డల్లాస్‌లో జరిగిన 'నాటా' వేడుకల సమయంలో సదరు మంత్రి తనతో అసభ్యంగా ప్రవర్తించారని సదరు మహిళ ఆరోపించారు.అపాయింట్మెంట్ అడిగితే కాఫీ షాప్‌నకు ఒంటరిగా రావాలని ఒత్తిడి తెచ్చారని, అంతేకాకుండా కాళ్లు, చేతుల ఫోటోలు పంపిస్తూ అసభ్యకరంగా వ్యవహరించారని ఆమె తన పోస్టులో రాసుకొచ్చారు. ఈ వేధింపుల ఉదంతంపై నారా లోకేష్‌కు కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశానని, అయినా దానిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే సదరు మంత్రికి సంబంధించిన ఫోటోలు, ఆయన ఉపయోగించిన ఫోన్ నెంబర్లతో సహా పూర్తి ఆధారాలను బహిర్ఘతం చేస్తానని సదరు ఎన్ఆర్ఐ మహిళ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఉదంతంపై టీడీపీలో చర్చాంశనీయంగా మారింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు నాయకుడు రాయలసీమ ప్రాంతానికి చెందిన మంత్రి అయి ఉంటారని, గతంలో ఆయన నాటా సదస్సుకు హాజరయ్యారని పార్టీ వర్గాల్లో అంతర్గతంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ప్రభుత్వం లేదా సదరు మంత్రి అధికారికంగా ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. -
H-1B, L-1 వీసాలు.. భారతీయులకు బిగ్ షాక్!
హెచ్-1బీ, ఎల్-1 వీసాల నిబంధనలను మరింత కఠినతరం చేసే దిశగా ట్రంప్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు కొత్త వీసాలు, ఉద్యోగ మార్పుల సమయంలో మాత్రమే వసూలు చేస్తున్న అదనపు రుసుమును.. ఇకపై వీసా రెన్యూవల్ (పొడిగింపు) సమయంలోనూ వర్తింపజేయాలని ప్రతిపాదించింది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే.. అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు బిగ్ షాక్ అనే చెప్పొచ్చు. అటు పెద్ద సంఖ్యలో ఉన్న భారతీయ నిపుణులను కొనసాగించే కంపెనీలపై భారీ ఆర్థిక భారం పడే అవకాశం ఉంది.అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS), కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) సంస్థలు తాజాగా ప్రతిపాదించిన నిబంధనల ప్రకారం.. H-1B, L-1 వీసాలపై పనిచేస్తున్న విదేశీ ఉద్యోగుల స్టే పొడిగింపు దరఖాస్తులపైనా అదనపు ఫీజు విధించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ రుసుము కొత్త H-1B, L-1 వీసా దరఖాస్తులు లేదంటే ఉద్యోగ మార్పు సమయంలో మాత్రమే వర్తిస్తోంది. అయితే కొత్త ప్రతిపాదన ఆమోదం పొందితే.. అదే కంపెనీలో కొనసాగుతున్న ఉద్యోగుల వీసా పునరుద్ధరణ సమయంలో కూడా సంస్థలు ఈ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఈ మార్పు ప్రధానంగా అమెరికాలో 50 మందికి పైగా ఉద్యోగులు కలిగి ఉండి.. వారిలో కనీసం సగం మంది H-1B లేదా L-1 వీసాలపై పనిచేస్తున్న సంస్థలకు వర్తించే అవకాశం ఉంది.భారతీయులపై ఎందుకు ప్రభావం ఎక్కువ?H-1B వీసా వ్యవస్థలో భారతీయ నిపుణుల వాటా అత్యధికంగా ఉంది. ముఖ్యంగా ఐటీ, సాఫ్ట్వేర్, ఇంజినీరింగ్ రంగాల్లో వేలాది మంది భారతీయులు ఈ వీసాలపై అమెరికాలో పనిచేస్తున్నారు. అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (USCIS) గణాంకాల ప్రకారం.. 2025 ఆర్థిక సంవత్సరంలో ఆమోదమైన H-1B పిటిషన్లలో కొనసాగుతున్న ఉద్యోగాలకు సంబంధించినవి 2.91 లక్షలకు పైగా ఉన్నాయి. వీటిలో భారతీయుల వాటా సుమారు 77 శాతానికి పైగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీంతో ఈ కొత్త ఫీజు విధానం అమల్లోకి వస్తే.. భారతీయ ఉద్యోగులను కొనసాగించే ఐటీ కంపెనీల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.ఐటీ కంపెనీలపై అదనపు భారంఅమెరికాలో భారీ సంఖ్యలో H-1B ఉద్యోగులను కలిగి ఉన్న టెక్నాలజీ సంస్థలు ఈ మార్పుతో ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అమెజాన్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), మైక్రోసాఫ్ట్, మెటా, యాపిల్, గూగుల్ వంటి సంస్థలు H-1B ఉద్యోగుల విషయంలో ముందంజలో ఉన్నాయి. వీసా పొడిగింపుల సమయంలో అదనపు రుసుము చెల్లించాల్సి వస్తే.. విదేశీ నిపుణులను కొనసాగించడం కంపెనీలకు మరింత ఖరీదైన వ్యవహారంగా మారవచ్చు.ఎంత ఫీజు?ప్రస్తుతం అర్హత కలిగిన కొన్ని సంస్థలు కొత్త H-1B దరఖాస్తుల సమయంలో సుమారు 4,000 డాలర్లు, L-1 వీసాల కోసం సుమారు 4,500 డాలర్లు వరకు అదనపు రుసుము చెల్లిస్తున్నాయి. ప్రతిపాదిత మార్పు అమల్లోకి వస్తే.. ఇదే భారం వీసా పొడిగింపు దరఖాస్తులకూ వర్తించే అవకాశం ఉంది.ఎందుకీ పెంపు?అమెరికా అధికారులు చెబుతున్న ప్రకారం.. ఈ అదనపు రుసుమును 9/11 భద్రతా చర్యల్లో భాగమైన బయోమెట్రిక్ ఎంట్రీ-ఎగ్జిట్ వ్యవస్థ నిర్వహణకు ఉపయోగించనున్నారు. ముఖ గుర్తింపు వంటి సాంకేతికతలతో ప్రయాణికుల ప్రవేశ, నిష్క్రమణలను పర్యవేక్షించే వ్యవస్థకు నిధులు సమకూర్చడమే లక్ష్యమని తెలిపారు. ఈ ప్రతిపాదన ద్వారా ఏడాదికి సుమారు 157 మిలియన్ డాలర్ల అదనపు ఆదాయం వస్తుందని అమెరికా అంచనా వేస్తోంది.తుది నిర్ణయం ఎప్పుడంటే..అయితే ఈ ప్రతిపాదన ఇంకా తుది నిబంధనగా మారలేదు. అమెరికా పరిపాలన తుది నిబంధనలను విడుదల చేసిన తర్వాతే అమలు తేదీ, పూర్తి వివరాలు స్పష్టమవుతాయి. ఇప్పటికే H-1B వీసా విధానంపై కఠిన వైఖరి అవలంబిస్తున్న ట్రంప్ ప్రభుత్వం.. తాజా ప్రతిపాదనతో విదేశీ నిపుణులను నియమించుకునే కంపెనీలపై మరింత నియంత్రణ తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తోంది.మొత్తంగా.. H-1B, L-1 వీసాలపై ప్రతిపాదిత కొత్త ఫీజు విధానం అమల్లోకి వస్తే.. అమెరికాలో పనిచేస్తున్న భారతీయ నిపుణులు, వారిని నియమించుకునే ఐటీ కంపెనీలపై ఖర్చుల భారం పెరిగే అవకాశం ఉంది. -
తెలంగాణ కల్చరల్ సొసైటీ అధ్యక్షుడిగా నల్ల భాస్కర్ గుప్త
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) /TCSS యొక్క పదమూడో వార్షిక సర్వసభ్య సమావేశం ఆగస్టు 2వ తేదీన స్థానిక కుర్తాళం బోర్డర్, లిటిల్ ఇండియాలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సుమారు 65-70 మంది సభ్యులు పాల్గొనడం జరిగింది. సమావేశంలో ముందుగా పన్నెండో సర్వసభ్య సమావేశపు వివరాలతో పాటు 2025-2026 ఆర్థిక సంవత్సరపు రాబడి ఖర్చుల పట్టికను సభ్యులకు వివరించి ఆమోదం పొందడం జరిగింది. ఈ సమావేశం సందర్భంగా సభ్యులు సమ్మయ్య మోలుగూరి, ఇతర సభ్యులు అడిగిన వివిధ ప్రశ్నలకు సొసైటీ పూర్వ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల,కోశాధికారి నంగునూరి వెంకట రమణ సమాధానాలు ఇవ్వడం జరిగింది. ఈ సమావేశానికి మోడరేటర్ ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల వ్యవహరించారు.2025-2026 ఆర్థిక సంవత్సరానికి ఆడిటర్లుగా సేవలందించిన కిరణ్ కుమార్ ఎర్రబోయిన నీలం సుఖేందర్ గార్లకు కృతజ్ణతలు తెలియజేశారు. తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ప్రస్తుత పదవీకాల అధ్యక్షుడిగా నామినేషన్ వేసిన నల్ల భాస్కర్ గుప్త, ఆయన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ప్రతిపాదించడంతో పాటు నామినేషన్ గడువులోగా ఒకే టీమ్ నుంచి నామినేషన్ రావడంతో ఎన్నిక ఏకగ్రీవం అయినట్టు ఎన్నికల అధికారులు తెల్లదేవరపల్లి కిషన్ రావు, మల్లారెడ్డి కళ్లెం గార్లు ప్రకటించారు. నూతన కార్యవర్గం సహకారంతో సొసైటీని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని అధ్యక్షుడు నల్ల భాస్కర్ తెలిపారు. అలాగే సొసైటీ వెన్నంటే ఉంటూ ఎప్పుడూ సహాయ సహకారాలు అందిస్తున్న కార్యనిర్వాహక వర్గ సభ్యులందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో సభ్యులు ఇచ్చిన సలహాలన్నింటిని స్వీకరించి అమలు చేయుటకు శాయశక్తుల ప్రయత్నిస్తామని కార్యవర్గ సభ్యులు తెలిపారు.ఈ సారి ఎన్నికల అధికారులుగా వ్యవహరించిన తెల్లదేవరపల్లి కిషన్ రావు, మల్లారెడ్డి కళ్లెం గార్లకు సొసైటీ సభ్యులు కృతజ్ణతలు తెలియజేశారు. దీని తోపాటు 2026-2027 ఆర్థిక సంవత్సరానికి ఆడిటర్లుగా సురేష్ మాటేటి, శ్రీధర్ బండారు గార్లను ప్రకటించి ఎన్నుకోవడం జరిగింది.నూతన కార్యవర్గం కార్యనిర్వాహక వర్గంలో అధ్యక్షులు నల్ల భాస్కర్, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కోశాధికారి శెశిధర్ రెడ్డి ఎర్రమరెడ్డి, ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, జూలూరి సంతోష్ కుమార్, మిర్యాల సునీత రెడ్డి, సంతోష్ వర్మ మాదారపు, విక్రమ్ చిట్ల సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు నంగునూరి వెంకట రమణ, నడికట్ల భాస్కర్, మహేష్ చెట్టిపెల్లి, కల్వ లక్ష్మణ్ రాజు, శివ ప్రసాద్ ఆవుల, కార్యవర్గ సభ్యులు బొడ్ల రోజా రమణి, రవి కృష్ణ విజ్జాపూర్, పెరుకు శివ రామ్ ప్రసాద్, విజయ మోహన్ వెంగళ, సతీష్ పెసరు, చల్లా క్రిష్ణ, మణికంఠ రెడ్డి, భాస్కర్ రావు పులిగిళ్ల, ప్రవీణ్ మామిడాల, తోట రాజేంద్ర ప్రసాద్య, సరావేణి విజయ కుమార్ ఉన్నట్టు తెలిపారు.మాజీ అధ్యక్షుడు రమేష్ బాబు గడప, తన పదవీకాలంలో సొసైటీని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళిన అసాధారణ, అద్భుతమైన సేవలను ఏవి (AV) రూపంలో ప్రదర్శించి కార్యనిర్వాహక సభ్యులందరూ మర్యాదపూర్వకంగా సన్మానించారు. గత పన్నెండు సంవత్సరాలుగా రమేష్ బాబు గడప అందించిన సేవలను పూర్వ అధ్యక్షులు బండ మాధవ రెడ్డి, నీలం మహేందర్ గార్లు ఘనంగా కొనియాడారు. గత పదమూడు సంవత్సరాలుగా సొసైటీలో భాగమై రెండు సార్లు అధ్యక్షుడిగా సేవచేసే అవకాశం ఇచ్చినందుకు అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. అలాగే సొసైటీ వెన్నంటే ఉంటూ సేవలందించిన దుర్గా ప్రసాద్, సుగుణాకర్ రెడ్డి గార్లకు కార్యనిర్వాహక సభ్యులందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ సందర్భంగా సొసైటీ వెన్నంటే ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి సమావేశం సజావుగా సాగడానికి సహకరించిన సభ్యులందరికి కార్యనిర్వాహక సభ్యులందరూ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. చివరిగా సర్వ సభ్యులందరూ సొసైటీ ఏర్పాటు చేసిన హై టీని ఆస్వాదించారు.(చదవండి: అటా మహాసభలు.. జర్నలిజంలో రవికాంత్‌రెడ్డికి అవార్డ్) -
బాల్టిమోర్‌లో ఘనంగా వైఎస్సార్ జయంతి
సాక్షి, అమరావతి: అమెరికాలోని బాల్టిమోర్ నగరంలో నిర్వహించిన 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) జాతీయ మహాసభలు విజయవంతంగా ముగిశాయి. మహాసభల్లో భాగంగా ఆదివారం వైఎస్సార్ జయంతి కార్యక్రమం, ఎన్ఆర్ఐలతో విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రైమ్ హెల్త్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధిలో మరింత చురుకైన పాత్ర పోషించాలని ఎన్ఆర్ఐలను కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం వైఎస్ జగన్‌కు మరోసారి అవకాశం కల్పించే దిశగా ప్రతి ఎన్ఆర్ఐ తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని విజ్ఞప్తి చేశారు. మహాసభల సందర్భంగా అమెరికా నలుమూలల నుంచి వచ్చిన ప్రవాసాంధ్రులతో జరిగిన సమావేశాలు, పరస్పర చర్చలు, సూచనలు భవిష్యత్తులో పార్టీ సంస్థాగత బలోపేతానికి, ఎన్ఆర్ఐల భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు దోహదపడతాయని ఆలూరు సాంబశివారెడ్డి తెలిపారు. -
హైదరాబాద్‌కు శ్రీపతి దీపారెడ్డి పార్థీవదేహం
హైదరాబాద్: చంపాపేట డివిజన్ శిఖరా ఎన్క్లేవ్ కాలనీకి చెందిన శ్రీపతి దీపారెడ్డి (42) అమెరికా న్యూజెర్సీలో గతనెల 28న రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. దీపారెడ్డి 15 సంవత్సరాలు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిన తర్వాత గత మూడు సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు.గత నెల 28న భర్త రామకృష్ణారెడ్డిని కారులో కార్యాలయంలో దించి ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న దీపారెడ్డి కారును, ఓ మెడికల్ విద్యార్థి కారుతో ఢీకొట్టడంతో ఆ ప్రమాదంలో దీపారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరిన మొదట్లో ఆమె అవయవాలను మెడికల్ విద్యార్థులకు అందజేస్తానని అంగీకరించడంతో ఆమె అవయవాలు ప్రభుత్వం సేకరించినట్లు సమాచారం. సంబరపడే లోపే..రెండు రోజుల్లో మాదాపూర్‌లో ఇటీవల కొనుగోలు చేసిన ఫ్లాట్ గృహప్రవేశానికి వస్తుందని సంబరపడ్డాం.. అన్ని ఏర్పాట్లు చేశాం, ఈవిధంగా వస్తుందని కలలో కూడా అనుకోలేదని ఆమె కుటుంబ సభ్యులు భోరున విలపిస్తుండటంతో స్థానికులు కంటతడి పెట్టారు. నేడు చంపాపేటలో అంత్యక్రియలు దీపారెడ్డి పార్థివ దేహాన్ని ఆదివారం నగరానికి తీసుకురానున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. చంపాపేటలోని రెడ్డి శ్మశానవాటికలో అంత్యక్రియలు జరపనున్నట్లు ఆమె బంధువులు తెలిపారు. -
అటా మహాసభలు.. జర్నలిజంలో రవికాంత్‌రెడ్డికి అవార్డ్
సాక్షి,హైదరాబాద్: అమెరికా తెలుగు అసోసియేషన్ 19వ మహసభలు శనివారం అమెరికాలోని బాల్టిమోర్‌లో ఘనంగా ప్రారంభమైయ్యాయి. అమెరికాలో స్థిరపడ్డ తెలుగువారితో పాటు తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌ల నుండి భారీ ఎత్తున వివిధ రంగాల ప్రముఖులు తొలి రోజు ఆరంభవేడుకలకు హాజరైయ్యారు. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డితో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు పలువురు ఎంఎల్ఎలు సినీ,సాంస్కృతిక రంగాల ప్రముఖులు హాజరైయ్యారు.దాదాపు మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో తొలి రోజు తెలుగు సంస్కృతిని చాటిచెప్పే కళాప్రదర్శనలు నిర్వహించారు.వివిధ రంగాల్లో విశేషసేవ చేసిన 15 మంది ప్రముఖులను ఆటా అవార్డులతో సత్కరించారు. అవార్డులు అందుకున్న వారిలో ఆర్.రవికాంత్‌రెడ్డి(జర్నలిజం) డాక్టర్ రవీందర్(వైద్యం), కిరణ్ చుక్కపల్లి(ఇండస్ట్రీ) తదితరులను ఆటా మాజీ అధ్యక్షులు పారిశ్రామికవేత్త డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి సత్కరించారు. -
ఎన్ఆర్ఐలు పార్టీకి సేవలు అందించాలి
సాక్షి, అమరావతి: అమెరికాలోని షార్లెట్, నార్త్ కరోలినాలో గురువారం నిర్వహించిన వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ అవుట్ రీచ్ సమావేశానికి ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్ఆర్ఐ వింగ్ గ్లోబల్ కో–ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ.. సోషల్ మీడియా, టెక్నాలజీ, కంటెంట్, డేటా, డిజిటల్ కమ్యూనికేషన్ రంగాల్లో నైపుణ్యం కలిగిన ఎన్ఆర్ఐలు తమ సేవలను పార్టీకి అందించాలని కోరారు. కేవలం పోస్టులు, లైకులు, షేర్లకు పరిమితం కాకుండా, స్పష్టమైన లక్ష్యాలు, సమన్వయంతో పనిచేయాలని సూచించారు.వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై ఉన్న ప్రజాభిప్రాయాన్ని వాస్తవాలు, సానుకూల కమ్యూనికేషన్, టెక్నాలజీ, సృజనాత్మక కంటెంట్‌ను విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.అమెరికాలోని షార్లెట్, నార్త్ కరోలినాలో నిర్వహించిన వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ అవుట్‌రీచ్ సమావేశంలో పాల్గొన్న ఆలూరు సాంబశివారెడి, తదితరులు -
అమెరికాలో భారతీయ విద్యార్థులకు భారీ షాక్!
అమెరికాలో చదువు పూర్తి చేసి ఉద్యోగం పొందాలని కలలు కనే విదేశీ విద్యార్థులకు, ముఖ్యంగా భారతీయులకు కొత్త సవాళ్లు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. అంతర్జాతీయ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ తర్వాత అమెరికాలో పని చేసేందుకు ఉపయోగించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) విధానంపై భారీగా 1 లక్ష డాలర్ల ఫీజు విధించే ప్రతిపాదనను ట్రంప్ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.అమెరికాలో F-1 విద్యార్థి వీసాపై చదివే విదేశీ విద్యార్థులకు చదువు పూర్తయిన తర్వాత కొంతకాలం అక్కడే ఉండి తమ విద్యకు సంబంధించిన రంగంలో ఉద్యోగం చేసే అవకాశం OPT ద్వారా లభిస్తుంది. ప్రస్తుతం సాధారణ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు గరిష్ఠంగా ఒక సంవత్సరం వరకు OPT కింద పనిచేయవచ్చు. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (STEM) కోర్సులు చేసిన వారికి ఈ గడువు మూడు సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ సమయంలో విద్యార్థులు ఉద్యోగ అనుభవం సంపాదించడంతో పాటు, తర్వాత H-1B వర్క్ వీసా పొందేందుకు ప్రయత్నిస్తారు.అయితే ఈ అవకాశానికి ఏకంగా 100,000 డాలర్ల ఫీజు విధించే ఆలోచన ఇప్పుడు చర్చకు వచ్చింది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే.. అమెరికాలో ఉన్నత విద్య పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాల మార్గం మరింత ఖరీదైనదిగా మారే అవకాశం ఉంది. అయితే ఈ నిర్ణయంపై ఇంకా తుది ప్రకటన వెలువడలేదు.ఎవరిపై భారం పడనుంది?ప్రతిపాదిత ఫీజును విద్యార్థులే చెల్లించాలా? లేక వారిని ఉద్యోగంలోకి తీసుకునే కంపెనీలే చెల్లించాలా? అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. విద్యార్థులే చెల్లించాల్సి వస్తే.. చాలా మందికి ఇది అందనంత భారంగా మారే అవకాశం ఉంది. కంపెనీలు చెల్లించాల్సి వస్తే.. విదేశీ గ్రాడ్యుయేట్లను నియమించుకోవడంపై సంస్థలు వెనుకడుగు వేసే పరిస్థితి రావచ్చని నిపుణులు భావిస్తున్నారు. దీంతో అమెరికన్ విద్యార్థులకు ప్రాధాన్యం పెరిగి, అంతర్జాతీయ విద్యార్థుల ఉద్యోగ అవకాశాలు తగ్గే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.భారతీయ విద్యార్థులపై ప్రభావం ఎంత?అమెరికా ఉన్నత విద్యకు భారతీయ విద్యార్థులు ప్రధాన వర్గంగా ఉన్నారు. ప్రస్తుతం లక్షలాది మంది భారతీయులు అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నారు. చాలామంది విద్యార్థులు కేవలం డిగ్రీ కోసం మాత్రమే కాకుండా.. చదువు పూర్తయ్యాక అక్కడే ఉద్యోగం చేసి అంతర్జాతీయ అనుభవం పొందాలనే లక్ష్యంతో అమెరికాకు వెళ్తున్నారు.అమెరికా విద్య కోసం కుటుంబాలు లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెడుతున్న నేపథ్యంలో.. OPTపై భారీ ఫీజు ప్రతిపాదన విద్యార్థులపై ఆర్థిక ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది.నాలుగేళ్ల వీసా పరిమితి కూడా!OPT ఫీజు ప్రతిపాదనతో పాటు అంతర్జాతీయ విద్యార్థుల వీసా నిబంధనల్లో మరో కీలక మార్పు కూడా తెరపైకి వచ్చింది. ఇప్పటివరకు విదేశీ విద్యార్థులు “డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్” విధానంలో అమెరికాలో ఉండేవారు. అంటే.. వారు తమ కోర్సును నిబంధనల ప్రకారం కొనసాగిస్తున్నంత కాలం అమెరికాలో ఉండే అవకాశం ఉండేది.తాజా ప్రతిపాదనల ప్రకారం.. విద్యార్థులకు గరిష్ఠంగా నాలుగేళ్ల వరకు మాత్రమే ఉండే అనుమతి ఇవ్వాలనే ఆలోచన ఉంది. అంతకంటే ఎక్కువ సమయం అవసరమైతే.. హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం నుంచి ప్రత్యేక అనుమతి పొందాల్సి ఉంటుంది.ట్రంప్ ప్రభుత్వం చెబుతున్న కారణంఅమెరికా వలస విధానాన్ని మరింత పర్యవేక్షించడం, చట్టబద్ధమైన వలస వ్యవస్థను బలోపేతం చేయడం, దేశ భద్రతను పెంచడమే లక్ష్యంగా ఈ మార్పులు చేస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం చెబుతోంది. అయితే విద్యా రంగ నిపుణులు మాత్రం.. ఇలాంటి నిబంధనలు అమెరికాను అంతర్జాతీయ విద్యార్థులకు తక్కువ ఆకర్షణీయ గమ్యస్థానంగా మార్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.ఇప్పటికిప్పుడు ఆందోళన అవసరం లేదా?$100,000 OPT ఫీజు ప్రతిపాదన ఇంకా చర్చల దశలోనే ఉంది. దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే అమెరికా వలస విధానంలో క్రమంగా కఠినమైన మార్పులు వస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో చదువు పూర్తి చేసి అక్కడే కెరీర్ నిర్మించుకోవాలనుకునే భారతీయ విద్యార్థులకు ఇకపై మార్గం మరింత ఖరీదైనదిగా, నిబంధనలతో కూడుకున్నదిగా మారే అవకాశం ఉంది. -
శ్రీ బాలాజీ దేవాలయంలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం
యూకేలోని గ్లౌసెస్టర్షైర్ ప్రాంతంలో తాత్కాలిక శ్రీ బాలాజీ ఆలయం ఏర్పాటు తోపాటు ఘనంగా అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇది ఆధ్యాత్మిక శక్తి, ఐక్యతలకు నిదర్శంనగా నిలిచింది ఈ వేడుక. విదేశీగడ్డపై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు భక్తులంతా వాలంటీర్‌గా ముందుకు వచ్చి.. సనాతన ధర్మ స్ఫూర్తిని చాటడం విశేషం. ఈ వేడుకలో పురోహిత విధులను అరవింద్, లక్ష్మి, సహస్ర నిర్వహించగా, ఆలయ కార్యక్రమాల్ని దిగ్విజయంగా జరిగేలా శ్రీనిరెడ్డి, మాధురి కుటుంబం, అలాగే శ్రీలక్ష్మీ, శ్రీని అర్గిల్ల, శిల్ప కుటుంబం పర్యవేక్షించింది. నరేష్, సురేష్ బండారులు విగ్రహాలను సమకూర్చగా, మహిళలు, చిన్నారులు స్వామి అలకంరణలో పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు శ్రీలక్ష్మీ, రాజేష్, నానీ, సోను కుటుంబ సభ్యులు అన్నప్రసాదం అందించారు. ఈ కార్యక్రమం జయప్రదం అయ్యేలా వాలంటీర్లు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అవిశ్రాంతంగా సేవలందించారు. ఇది గ్లౌసెస్టర్ హిందూ సమాజపు బలాన్ని, సనాతన ధర్మ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. (చదవండి: న్యూయార్క్‌లో వైభవంగా ఆషాఢమాస బోనాలు) -
అట్లాంటా: విజయవంతంగా ‘వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ అవుట్‌రీచ్’
అట్లాంటాలో వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ అవుట్‌రీచ్ సమావేశం విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్ఆర్ఐ వింగ్ గ్లోబల్ కో-ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ పాలనలో అమలైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలనా సంస్కరణలను వివరించారు. వైఎస్సార్సీపీ చేపడుతున్న Let’s Speak for Jagananna, Let’s Write for Jagananna, Let’s Post for Jagananna, Let’s Code for Jagananna’’ కార్యక్రమాల లక్ష్యాలను వివరించారు.ప్రస్తుత డిజిటల్ యుగంలో Online Reputation Management-ORM ప్రాధాన్యతను ప్రత్యేకంగా వివరించారు. కేవలం పోస్టులు చేయడం, కార్యక్రమాల్లో పాల్గొనడం మాత్రమే కాకుండా.. స్పష్టమైన లక్ష్యం, సమన్వయంతో ముందుకు సాగాలని ఎన్ఆర్ఐ కార్యకర్తలకు సాంబశివారెడ్డి పిలుపునిచ్చారు.వాస్తవాలను ప్రజలకు సమర్థంగా చేరవేయాలన్న సాంబశివారెడ్డి.. తప్పుడు ప్రచారాలను ఆధారాలతో ఎదుర్కోవాలని సూచించారు. YSRCP NRI Wing Portal, Jagan 2.0 Super యాప్‌ల కూడా అవగాహన కల్పించారు. మన గ్లోబల్ డిజిటల్, సంస్థాగత వ్యవస్థను బలోపేతం చేయడంలో అందరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. -
ఈ క్షణం కోసమే ఎదురుచూశా..! ఉప్పొంగి పోయిన తల్లిదండ్రులు..
మన కోసం ఎన్నో త్యాగాలు చేసే, సర్వసం మనకు ధారపోసే కన్నవాళ్లను ఎంతో బాగా చూసుకోవాలని కోరుకుంటారు చాలామంది పిల్లలు. అందుకోసం తమ వంతుగా చేయాల్సిదంతా చేస్తుంటారు బిడ్డలు. అలానే ఈ మహిళ కూడా తన పేరెంట్స్‌కి గొప్ప అనుభవం ఇవ్వాలని అనుకుంది. అందుకని వాళ్లని ఎప్పటికైన మంచి పర్యాట ప్రదేశానికి తీసుకువెళ్లాలనుకుంది. అనుకున్నట్లుగానే కల నేరవేర్చుకోవడంతో ఆ పట్టరాని సంతోషాన్ని ఇలా సోషల్ మీడియా వేదికగా వీడియో రూపంలో పంచుకుంది. ఆ మహిళా ప్రియాంక అనే ఎన్నారై. ఆమె ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. తన తల్లిదండ్రులను అమెరికాలోని ప్రసిద్ధ నయగరా జలపాతానికి తీసుకువెళ్లాలని అనుకుంది. ఆ జలపాతాన్ని దగ్గరగా వీక్షించే అనుభవం ఇవ్వాలని ఎన్నాళ్ల నుంచో అనుకుంది. ఆ డ్రీమ్ నెరవేరడమే గాక తన తల్లిదండ్రులు 'మెయిడ్ ఆఫ్ ది మిస్ట్' బోట్ టూర్లో పాల్గొంటూ ఉధృతంగా పడుతున్న జలపాతాన్ని చూస్తున్న వీడియోని ఇలా సోషల్ మీడియాలో పంచుకుంది. ఒక చల్లని తుంపర్లు, దట్టమైన పొగమంచు మధ్య అందమైన దృశ్యాన్ని వీక్షించారు. వర్షం నుంచి రక్షించే రెయిన్ పాంచోలు ధరించి ప్రియాంక తల్లిదండ్రులు పడవలో జలపాతం సమీపం వరకు వెళ్తున్న దృశ్యాలు స్ఫష్టంగా కనిపిస్తున్నాయి. ఆమె పేరెంట్స్ కనువిందు చేస్తున్న ఆ దృశ్యాన్ని వీక్షిస్తూ..ఉప్పొంగిపోయారు. ఆ ప్రకృతి అందాన్ని అంత దగ్గర చూసి సంతోషం, ఆశ్చర్యం కలగలసిన భావాలు వాళ్ల ముఖాల్లో స్పష్టంగా కనిపించాయి వీడియోలో. ఆమె ఆ వీడియోని పోస్ట్ చేస్తూ..ఈ క్షణం కోసం ఎన్నో ఏళ్లు ఎదురు చూశా. పేరెంట్స్‌ని కచ్చితంగా ఇక్కడ తీసుకురావాలని అనుకున్నా. ఆ కల ఈవేళ నిజమైంది. ఇది అత్యంత హృద్యమైన క్షణం అంటూ క్యాప్షన్ ఇచ్చి మరి పోస్ట్ చేసింది. నెటిజన్లు కూడా చాలా బాగుంది మేడం, నిజంగా ఇది హృద్యంగా ఉంది అంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Priyanka | Indian in the US (@thatbrownbanni.usa) (చదవండి: మిస్ టీన్ యూనివర్స్ ఇండియా విజేతగా ప్రసుచి పాండా) -
టొరంటోలో భారత సంతతి అమ్మాయిని చంపిన యువకుడు
కెనడాలోని టొరంటోలో భారత సంతతికి చెందిన ఓ యువతి(26)ని ఓ వ్యక్తి కాల్చి చంపాడు. ఈ హత్య కేసుపై కెనడియన్ పోలీసులు వివరాలు తెలిపారు. ఈ కేసులో భారత సంతతికి చెందిన 37 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసి హత్య కేసు నమోదు చేశారు.మృతురాలిని నవనీత్ కౌర్‌గా, నిందితుడిని బ్రాంప్టన్‌కు చెందిన శరణ్జీత్ సింగ్‌గా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇంకెవరూ పరారీలో లేరని, హత్య కేసుల దర్యాప్తు విభాగం విచారణ కొనసాగిస్తోందని తెలిపారు.హంబర్‌వుడ్ బులేవార్డ్, రెక్స్‌డేల్ బులేవార్డ్ కూడలిలో ఈ కాల్పులు జరిగాయని టొరంటో పోలీసు సర్వీస్ తెలిపింది. కాల్పులు జరిగాయని సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, తుపాకీ గాయంతో ఉన్న నవనీత్ కౌర్‌ను గుర్తించారు. ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించినా, ఘటనాస్థలిలోనే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.దర్యాప్తు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కాల్పులకు ముందు బాధితురాలు, నిందితుడు కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత నిందితుడు ఆమెపై కాల్పులు జరిపి, పోలీసులు చేరుకునేలోపే అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం అంటారియో ప్రావిన్షియల్ పోలీసులు అతడిని గుర్తించి అరెస్టు చేశారు. శరణ్జీత్ సింగ్‌పై హత్య కేసుతో పాటు, చట్టపరమైన షరతులను ఉల్లంఘించిన అభియోగం కూడా నమోదు చేశారు. -
ఘనంగా తానా ప్రపంచసాహిత్యవేదిక 94వ సమావేశం
తానాసంస్థ సాహిత్య విభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో గత ఆరు సంవత్సరాలకు పైగా “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట ప్రతి నెలా ఆఖరి ఆదివారం అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. “ప్రపంచంలోనే వైద్యశాస్త్రానికి ఆద్యుడు – మహర్షి సుశ్రుత” అనే అంశం మీద ఆదివారం జరిగిన 94 వ అంతర్జాల సమావేశం చాలా విజ్ఞానదాయకంగా జరిగింది. యూకేలో శస్త్రచికిత్సా వైద్యనిపుణుడిగా ప్రసిద్ధిచెందిన డా. చంద్ర చెరువు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తమ కుటుంబం తరపున రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఎడిన్బర్గ్లో శస్త్రచికిత్సా పితామహుడు ఆచార్య సుశ్రుతిని 90 కిలోల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ ప్రయత్నంలో సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు అలాగే ఇదే సందర్భంలో వెలువరించిన “మహర్షి సుశ్రుత ఏ కంపెండియం – ఫాదర్ ఆఫ్ సర్జరీ” అనే గ్రంధంలో విలువైన వ్యాసాలను వ్రాసి ప్రోత్సహించిన సహచర వైద్యమిత్రులకు ధన్యవాదములు అన్నారు. వేల సంవత్సరాలనాడే సుశ్రుతుడు సోదాహరణంగా వివరించిన వైద్య పద్దతులు, ఉపయోగించిన శస్త్ర పరికరాల జాబితా పరిశీలిస్తే ఎంతో ఆశ్చర్యం కల్గుతుందని అన్నారు. సుశ్రుతుడు రచించిన “సుశ్రుత సంహిత” గ్రంధంలోని అనేక విషయాలను ఇతర భారతీయ భాషలలోకి, ప్రపంచ భాషలలోకి అనువాదం కావలసిన అవసరం ఉందని, వైద్య విద్యార్థులకు ఆయన పరిశోధనలు, ఆవిష్కారాలు స్ఫూర్తి దాయకంగావాలని ఆకాంక్షించారు. ఇప్పుడు తాము అదే ప్రయత్నంలో ఉన్నామన్నారు.” తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “వేల సంత్సరాలనాడే ప్రపంచం ఇంకా పూర్తిగా కళ్ళు తెరవకముందే సుశ్రుతుడు సంస్కృతంలో రచించిన 184 అధ్యాయాలగా ఉన్న “సుశ్రుత సంహిత” అనే ఆయుర్వేద గ్రంథం వైద్యులకు మొట్టమొదటి ప్రామాణిక గ్రంథం అన్నారు. మనిషి సాధారణంగా 1,120 రకాల వ్యాధులకు గురిఅవుతాడని, 700 కు పైగా మొక్కల గురించి ఏ మొక్క, ఏ వ్యాధిని, ఎలా తగ్గిస్తుందో ప్రయోగాత్మకంగా నిరూపించాడు. 64 రకాల ఖనిజాల నుంచి అవసరమైన మందులను ఎలా తయారుచేసుకోవచ్చో వివరించాడు. ఈ గ్రంథంలో 120 శస్త్రపరికరాల గురించి వివరించాడు. ప్రపంచానికి ప్లాస్టిక్ సర్జరీని పరిచయం చేసింది సుశ్రుతుడే! అనస్తీషియా ప్రక్రియకు ఆద్యుడు సుశ్రుతుడు. ప్రొస్టేట్ గ్రంథిని జాగ్రత్తగా తొలగించే పద్ధతి, విరిగిన ఎముకలు తిరిగి అతుక్కునేందుకు శస్త్రచికిత్స సూత్రాలు, తెగిన శరీర భాగాలను అతికించటం, అతి సున్నితమైన పొట్టభాగాన్ని, జీర్ణాశయ పొరలను చీమతలకాయంత సన్నని సూదులతో కుట్లు వేసి అతికించగల్గడం, గర్భిణీస్త్రీ ఉదరంలో శిశువు పరిణామ క్రమం, కొన్ని క్లిష్ట పరిస్థితులలో సిజేరియన్ ఆపరేషన్లు చేసే విధానం, వ్యాధిరహితంగా ఉండేందుకు ఏ ఏ కాలాల్లో, ఎలాంటి కూరగాయలు, పండ్లు తినాలి, ఎలాంటి తృణధాన్యాలు, పప్పుదినుసుల వాడాలి అనే సంపూర్ణ విజ్ఞానం అందించిన సుశ్రుతిని పరిశోధనా విశేషాలను ప్రాధమికదశనుండే విద్యార్థులకు పాట్యాంశంగా చేర్చవలసిన అవసరం ఉందన్నారు. విశిష్టఅతిథులుగా పాల్గొన్న డా. బుచ్చిబాబు పైడిపాటి (డెట్రాయిట్ నుండి) సుశ్రుతుడు ఎంతో విపులంగా పేర్కొన్న మెడికల్ ఎథిక్స్ గురించి, డా. వి. కె రాజు (వెస్ట్ వర్జీనియా నుండి) సుశ్రుతుడు చేసిన కంటివైద్య పద్దతుల గురించి, డా. శేషు శర్మ (వాషింగ్టన్ డి.సి నుండి) సుశ్రుత సంహితలో వాత, పిత్త, కఫ దోష పరిస్థితులను ఎదుర్కోవడానికి సరైన ఆహరం, వ్యాయామం, నిద్ర అలవాట్లు ఎంత ముఖ్యమో వివరించారు. అలాగే డా. పండరి గంటి (లాస్ ఏంజిల్స్ నుండి) సుశ్రుతుడు ప్రధానంగా ఆయుర్వేద చికిత్సా విధానం ఎలా పనిచేస్తుందో సుశ్రుత సంహిత గ్రంధంలో పేర్కొన్నారని, అది నేటికీ ఫలవంతమైన చికిత్సేనని వెల్లడించారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ పాల్గొన్న అతిథులందరికీ, ఈ కార్యక్రమ విజయానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. (చదవండి: ఒత్తిడిని జయించడంపై టాంపాలో నాట్స్ సదస్సు) -
డల్లాస్‌లో వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ అవుట్ రీచ్ సమావేశం
సాక్షి, అమరావతి: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ప్రముఖ నగరం డల్లాస్‌లో నిర్వహించిన వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ అవుట్ రీచ్ సమావేశం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్ఆర్ఐ వింగ్ గ్లోబల్ కో–ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి ప్రవాసాంధ్రులను ఉద్దేశించి మాట్లాడారు. 2019–2024 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమలైన సంక్షేమ పథ కాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలనా సంస్క రణల గురించి వివరించారు. పార్టీ చేపడుతున్న డిజిటల్ కార్యక్రమాలను వారికి పరిచయం చేశారు. ‘జననన్న కోసం మాట్లాడుదాం.. జగనన్న కోసం రాద్దాం.. జగనన్న కోసం పోస్ట్ చేద్దాం.. జగనన్న కోసం కోడ్ చేద్దాం (డిజిటల్ టూల్స్/ యాప్‌లు/టెక్ పరిష్కారాలు)..’ అని పార్టీని సాంకేతికంగా మరింత బలోపేతం చేసే కార్యక్రమాల లక్ష్యాలను వివరించారు. వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ వింగ్ పోర్టల్ (www.ysrcpnriwing.org)ను ప్రారంభించారు. జగన్ 2.0 సూపర్ యాప్‌ను ఆవిష్కరించారు. పార్టీ కోసం సేవలందించే ఎన్ఆర్ఐ కార్యకర్తలకు తగిన గుర్తింపు, ప్రోత్సాహం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రవాసాంధ్రులు పార్టీ కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తామంటూ వైఎస్ జగన్ నాయకత్వంపై తమ విశ్వాసాన్ని పునరుద్ఘాటించారు. -
కెనడాలో పంజాబ్‌కు చెందిన మహిళ దారుణ హత్య
కెనడాలో ఎడ్మింటన్‌లో దారుణం చోటు చేసుకుంది. భారత సంతతికి చెందిన 23 ఏళ్ల దమన్ ప్రీత్ కౌర్ దారుణ హత్య కలకలం రేపింది. ఆమెను గొంతు నులిమి హత్య చేసినట్టు దర్యాప్తు అధికారులు తెలిపారు.ఎడ్మంటన్ పోలీసుల సమాచారం ప్రకారం బాధితురాలు, జూలై 9న పంజాబ్‌లోని లుధియానా జిల్లా, సమ్రాలా నివాసి దమన్ ప్రీత్‌కౌర్ స్పృహలేకుండా, తీవ్ర గాయాలతో పడి ఉందనే సమాచారం పోలీసులకు అందింది. వెంటనే స్పందించిన పోలీసులు ఆగ్నేయ ఎడ్మంటన్‌లోని సిల్వర్బెర్రీ నివాస ప్రాంతానికి చేరుకుని ఆమెను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కౌర్ కన్నుమూసింది. ఇది హత్యేనని పోస్ట్ మార్టంలో నివేదిక ద్వారా ధృవీకరణ అయింది. ఈ కేసులో గత కొన్నాళ్లుగా దమన్ ప్రీత్ కౌర్‌తో కలిసి నివసిస్తున్న (Live-in Partner) ఢిల్లీకి చెందిన 22 ఏళ్ల రీతీష్ కమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనే గొంతు నులిమి చంపినట్టు భావిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో వేరే అనుమానితులు ఎవరూ లేరని పోలీసులు స్పష్టం చేశారు. 'సెకండ్ డిగ్రీ మర్డర్' ఆరోపణలు నమోదు చేశారు.మరోవైపు కౌర్ మృతదేహాన్ని భారతదేశంలోని ఆమె స్వగ్రామానికి తరలించడానికి, అంత్యక్రియల ఖర్చుల కోసం కుటుంబ సభ్యులకు సహాయంగా ఒక GoFundMe క్యాంపెయిన్ ప్రారంభించారు. 20 వేల డాలర్లకు గాను ఇప్పటికే దాదాపు 19వేల డాలర్ల విరాళాలు అందాయి. ఇదీ చదవండి: 150 పిజాలు, రూ. 75 వేలు : జంతర్ మంతర్‌లో మానవత్వపు పరిమళాలు -
అమెరికాలో చరిత్ర సృష్టించిన తెలుగు కుర్రాడు
అమెరికా రాజకీయ రంగాన, అత్యంత ప్రతిష్టాత్మకమైన నాయకత్వ శిక్షణా వేదికపై ఒక తెలుగు కుర్రాడు సరికొత్త చరిత్ర సృష్టించాడు. అగ్రరాజ్యం వాషింగ్టన్ డి.సి.లో అత్యంత కఠినమైన వడపోతతో నిర్వహించే "అమెరికన్ లెజియన్ బాయ్స్ నేషన్" మాక్ పార్లమెంటరీ ఎన్నికల్లో మన తెలుగు తేజం క్రిష్ కొర్రపాటి ఉపాధ్యక్ష పదవిని కైవసం చేసుకుని ప్రవాస భారతీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ గర్వపడేలా చేశాడు.అమెరికాలోని 49 రాష్ట్రాలు మరియు డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా నుండి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కేవలం 100 మంది హైస్కూల్ సీనియర్ విద్యార్థులను మాత్రమే ఈ బాయ్స్ నేషన్ కార్యక్రమానికి ఎంపిక చేస్తారు. ముందుగా రాష్ట్ర స్థాయి బాయ్స్ స్టేట్ పోటీల్లో సత్తా చాటిన వారు మాత్రమే ఈ జాతీయ స్థాయికి అర్హత సాధిస్తారు. అలా ఎంపికైన యువత ఒక వారం పాటు అమెరికా సెనెట్ తరహాలో మాక్ సమావేశాలు నిర్వహించి, చట్టాల రూపకల్పన, రాజకీయ చర్చల్లో పాల్గొంటారు.ఈ మహాసభల్లో విద్యార్థులు నేషనలిస్ట్స్, ఫెడరలిస్ట్స్ అనే రెండు పార్టీలుగా విడిపోయి తమ వాక్చాతుర్యాన్ని, నాయకత్వ ప్రతిభను ప్రదర్శిస్తారు. ఈ క్రమంలో తోటి సెనెటర్లందరి మద్దతును కూడగట్టుకుంటూ నార్త్ కరొలినా తరఫున ప్రాతినిధ్యం వహించిన క్రిష్ కొర్రపాటి బాయ్స్ నేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయనతో పాటు అర్కాన్సాస్ కు చెందిన సాయర్ రే అధ్యక్షుడిగా ఎన్నికై ఈ నాయకత్వ బృందానికి సారథ్యం వహిస్తున్నారు.తెలుగు వారందరికి గర్వకారణం..అమెరికాలో స్థిరపడిన గుంటూరు జిల్లా పల్లపాడు గ్రామానికి చెందిన తెలుగు కుటుంబం నుంచి వచ్చిన క్రిష్ కొర్రపాటి అద్భుతమైన విజయాన్ని సాధించి యావత్ తెలుగువారందరికీ గర్వకారణంగా నిలిచాడు. డాక్టర్ మధు కొర్రపాటి, శిరీష దంపతుల మనవడైన క్రిష్ కొర్రపాటి, డాక్టర్ వినీత్ కొర్రపాటి, స్మితల కుమారుడు. అమెరికాలో ప్రతిష్టాత్మకమైన "బాయ్స్ నేషన్" ఉపాధ్యక్ష పదవిని కైవసం చేసుకుని తెలుగు వారి కీర్తిని అమెరికాలో రెపరెపలాడించాడు. ఈ అరుదైన విజయం ద్వారా క్రిష్ కొర్రపాటి క్యాపిటల్ హిల్ లో ఫెడరల్ అధికారులను కలవడంతో పాటు దేశ అత్యున్నత వేదికలపై తన గళాన్ని వినిపించే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. -
హైదరాబాద్ వీరుడికి ఆస్ట్రేలియా శాశ్వత పౌరసత్వం
సాక్షి, హైదరాబాద్: ఆ్రస్టేలియాలోని బాండీ బీచ్‌లో గతేడాది డిసెంబర్ 14న యూదులు లక్ష్యంగా ఐసిస్ సానుభూతిపరులైన సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్ మారణహోమానికి తెగబడ్డ వేళ 20 మందిని కాపాడిన హైదరాబాదీ వీరుడు రెహ్మత్ పాషాకు ఆ దేశ ప్రభుత్వం అరుదైన గౌరవం అందించింది. క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్న రెహ్మత్ పాషా ప్రదర్శించిన తెగువను పరిగణనలోకి తీసుకొని అతనికి శాశ్వత పౌరసత్వం కల్పించింది. అలాగే అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించే వారికి అందించే ఓజెడ్ బ్రేవరీ అవార్డుకు సైతం నామినేట్ చేసింది. ప్రజలను కాపాడే సమయంలో పాషా వినియోగించిన టోపీని మ్యూజియంలో పెట్టింది. వీలున్నంత వరకు సహకరించాలని... బాండీ బీచ్‌లో హనుక్కా వేడుకలు జరుపుకుంటున్న స్థానిక యూదులు లక్ష్యంగా ఇద్దరు దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతుండటంతో అప్రమత్తమైన రెహ్మత్ పాషా క్షతగాత్రులను కాపాడాలని నిర్ణయించుకున్నారు. క్షతగాత్రులను చెట్లు, బెంచీలు, స్టీల్ కిచెన్ నిర్మాణాల వెనుకకు ఈడ్చుకెళ్లారు. బాధితులను అంబులెన్సుల వరకు తరలించడంలోనూ కీలకపాత్ర పోషించారు. కానీ ఆ తర్వాత పాషా పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (పీడీఎస్డీ) బారినపడ్డారు. దీంతో తాత్కాలికంగా క్యాబ్ డ్రైవర్ ఉద్యోగానికి సైతం దూరమయ్యారు.దీనిపై స్పందించిన ఆ్రస్టేలియా ప్రభుత్వం.. పాషాకు ఆర్థిక సాయం, వైద్య చికిత్స, కౌన్సెలింగ్ అందించింది. తాజాగా ఆ్రస్టేలియా మంత్రి టోనీ బర్క్ స్వయంగా పాషాకు ఫోన్ చేసి పర్మనెంట్ రెసిడెన్సీ మంజూరు చేస్తున్నట్లు, ‘ఓజెడ్ బ్రేవరీ అవార్డు కోసం సిఫార్సు చేసినట్లు తెలిపారు. కాగా, ఈ మారణహోమానికి పాల్పడ్డ సాజిద్, నవీద్‌లు సైతం హైదరాబాదీలే కావడం గమనార్హం. పోలీసుల ఎదురుకాల్పుల్లో సాజిద్ మృతిచెందగా నవీద్ జైల్లో ఉన్నాడు. -
రెస్ట్ రూంలో కెమెరా : భారతీయ సంతతి వైద్యుడికి జైలు
అమెరికాలో వైద్య వృత్తిలో ఉంటూ భారతీయ సంతతికి చెందిన వైద్యుడు తన వక్రబుద్ధిని చాటుకున్నాడు. ఆసుపత్రిలోని విశ్రాంతి గది (Restroom)లో రహస్యంగా కెమెరా అమర్చి, రికార్డ్ చేసి, పైశాచిక ఆనందం పొందేవాడు. చివరికి కటకటాల వెనక్కి వెళ్లాడు. ఈ కేసులో వైద్యుడికి ఆరు నెలల జైలు శిక్ష పడింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.నేరస్తుడు అద్వైత్ దేశ్‌ముఖ్ (Advait Deshmukh) టోలెడో యూనివర్విటీలో ఎండోయూరాలజీ, యూరోలాజిక్ ఆంకాలజీ విభాగంలో మూడో సంవత్సరం మెడికల్ రెసిడెంట్‌గా పనిచేసేవారు. జూన్ 2025లో ఓహియోలోని ప్రోమెడికా టోలెడో ఆసుపత్రిలోని ఒక యూనిసెక్స్ విశ్రాంతి గదిలో దాచి ఉంచిన ఒక సెల్‌ఫోన్‌ను ఒక ఉద్యోగి గుర్తించారు. ఆమె దాన్ని తీయడానికి ప్రయత్నించినప్పుడు, దేశ్‌ముఖ్ దానిని లాక్కొని అది తనదేనని చెప్పాడని ప్రాసిక్యూటర్లు తెలిపారు. ప్రోమెడికా, టోలెడో పోలీసు బృందం సంయుక్తంగా దర్యాప్తు చేపట్టింది.ఇదీ చదవండి: ఉద్యోగిని పెర్ఫామెన్స్ బాలేదని పెయిడ్ లీవ్ : కంపెనీకి భారీ క్రేజ్వీరి విచారణలో ఆ ఫోన్లో 2025 ఫిబ్రవరి - మే మధ్య తీసిన 80కి పైగా ఫోటోలు, వీడియోలు లభించాయి. కనీసం ఆరుగురు బాధితులను పోలీసులు గుర్తించారు. ఇతగాడి పైశాచికం 2018 నుంచే జరుగుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితులు ఇంకా ఎక్కువ మందే ఉండవచ్చని తెలిపారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే విశ్వవిద్యాలయం దేశ్‌ముఖ్‌ను సస్పెండ్ చేసింది. అనంతరం ఆయన మెడికల్ రెసిడెన్సీని రద్దు చేసింది. అయితే అంతర్గత విచారణ అనంతరం రెసిడెన్సీ నియామకాన్ని పునరుద్ధరించ లేదని వెల్లడించింది. కోర్టులో శిక్ష ఖరారయ్యే ముందు దేశ్‌ముఖ్ బాధితులకు క్షమాపణలు చెప్పాడు.టోలెడో ఆసుపత్రి ఉద్యోగి బాధితుల్లో ఒకరైన లిండ్సే ఈ సంఘటన తనను ఎంత కుంగదీసిందో వివరించారు. తాను ఇప్పటికీ బాత్రూమ్లలో రహస్య కెమెరాల కోసం తనిఖీ చేస్తానని, ఆ చిత్రాలు ఎక్కడికి చేరాయోనన్న ఆందోళనన తనను వెంటాడుతూనే ఉందంటూకోర్టు ముందు ఆవేదన వ్యక్తంచేశారు. సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నించిన ఒక అభియోగం, రహస్యంగా వీడియో తీసిన ఏడు అభియోగాలను అంగీకరించిన తర్వాత, దేశ్‌ముఖ్‌కు జూన్‌లో కోర్టు ఈయనకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు మూడేళ్ల ప్రొబేషన్ విధించింది. అంతేకాకుండా 15 ఏళ్ల పాటు 'సెక్స్ అఫెండర్' (లైంగిక నేరస్థుడిగా) నమోదు చేసుకోవాలని, మానసిక ఆరోగ్య చికిత్స పొందాలని ఆదేశించింది.ఇదీ చదవండి: ఒకే కాన్పులో నలుగురు అమ్మాయిలు : 10 సీటర్ కారు కావాలి -
జర్మనీలో ఘనంగా బోనాల సంబురాలు
తెలంగాణ అసోసియేషన్ ఎన్ఆర్ఐ హ్యాంబర్గ్ (TANH) ఆధ్వర్యంలో జర్మనీలోని హ్యాంబర్గ్ నగరంలో తొలిసారిగా బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ మహాకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు, బోనం సమర్పణ, డప్పు వాయిద్యాలు, లాస్య నృత్యాలు తదితర సాంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించగా, తెలంగాణ కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ జర్మనీ అధ్యక్షులు డాక్టర్ రఘు చాలిగంటి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విదేశాల్లోని తెలంగాణ సంఘాలు కేవలం సాంస్కృతిక కార్యక్రమాలకే పరిమితం కాకుండా భావితరాలకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను అందించడంతో పాటు, జర్మనీకి వచ్చే తెలంగాణ విద్యార్థులు, ఉద్యోగార్థులకు మార్గదర్శకత్వం, వృత్తిపరమైన సహకారం అందించాలని సూచించారు.హ్యాంబర్గ్ తెలంగాణ అసోసియేషన్ సభ్యులు అందించిన ఆత్మీయ ఆతిథ్యాన్ని ఆయన అభినందిస్తూ, జర్మనీలోని అన్ని నగరాల్లో ఇలాంటి బోనాల వేడుకలు నిర్వహించాలని, అలాగే ప్రతి ఏడాది ఒక నగరంలో తెలంగాణ కుటుంబాల కోసం “Meet & Greet” కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రతిపాదించారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన శ్రీనివాస్ బసవరాజు నాయకత్వాన్ని అభినందించిన ఆయన, హ్యాంబర్గ్ తెలంగాణ అసోసియేషన్ ఏర్పాటుకు కృషి చేసిన అంపన్న రెడ్డి వుటుకూరి, రాహుల్ తుల, ఉదయ్ రెడ్డి కుడుముల, వినీత్ రెడ్డి, సత్యనారాయణ, రామ్ తదితర నిర్వాహకులు, వాలంటీర్ల సేవలను ప్రశంసించారు.(చదవండి: సాధారణ బైక్ నుంచి బీఎండబ్ల్యూ రేంజ్‌కి..! వైరల్‌గా ఎన్నారై పోస్ట్) -
వీడియో కాల్స్‌లో కాదు : ఆరేళ్ల కెనడా జీవితాన్ని వీడి ఇండియాకు
ఉన్నత చదువులకోసం విదేశాలకు ఎగిరిపోవడం, వేల డాలర్లు సంపాదిస్తూ అక్కడే సెటిల్ అయిపోవడం సర్వసాధారణం. అలాగే వృద్ధులైన తల్లి దండ్రులను సైతం పట్టించుకోకుండా, వారిని వృద్ధాశ్రమాల్లో చేర్పించడం లాంటి హృదయవిదారకమైన కథనాలను చాలా చదివాం. కానీ విదేశాల్లోని సౌకర్యవంతమైన జీవితం కంటే, తల్లిదండ్రులకు భౌతికంగా దగ్గరగా ఉండటమే ముఖ్యం అని భావించి, కెనడా నుంచి బెంగళూరుకు తిరిగి వచ్చిన కొడుకు గురించి విన్నారా?పదండి వివరాలు తెలుసుకుందాం ఈ కథనంలో. కెనడాలో ఉన్నత ఉద్యోగాన్ని వీడి, వయోవృద్ధులైన తన తల్లిదండ్రులను చూసుకునేందుకు భారత్‌కు తిరిగి వచ్చేశారు టెకీ రమేష్ ఎన్.ఎన్. ఈయన ప్రస్తుతం బెంగళూరులోని 'కోర్సెంట్రిక్' (Corcentric) ఐటీ సంస్థలో ఇంజనీరింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. వేల కిలోమీటర్లు దూరంలో ఉంటూ వీడియో కాల్స్ ద్వారా చూస్తూ కాలం గడపడం కంటే, కుటుంబంతో రోజూ గడిపే క్షణాలు ఎంతో విలువైనవని, కుటుంబంతో గడిపే సమయాన్ని ఎప్పటికీ వాయిదా వేయలేమని ఆయన తన లింక్డ్ఇన్ (LinkedIn) పోస్ట్‌లో పంచుకున్నారు. దీంతో ఇది సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది. విదేశాలలోని సౌకర్యాలు, ఊహించదగిన జీవితం వదులుకోవడం, ఇక్కడి మౌలిక వసతులకు మళ్లీ అలవాటు పడటం కొంత కష్టంగా అనిపించినా, కుటుంబం ఇచ్చే తృప్తి ముందు అవేవీ పెద్ద కష్టంగా అనిపించలేదని రమేష్ చెప్పుకొచ్చారు. అలాగే భారత్‌కు రావడం కెరీర్‌కు ఎటువంటి ఆటంకం కలిగించలేదని, పైగా బెంగళూరులోని టెక్నాలజీ, స్టార్టప్ వాతావరణం, ప్రతిభా వంతులైన నెట్వర్క్ తనకు మరింత ఉత్తేజాన్నిచ్చాయని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఒకే కాన్పులో నలుగురు అమ్మాయిలు : 10 సీటర్ కారు కావాలిఈ పోస్ట్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు విశేషంగా స్పందించారు. విదేశాల్లో జీవితం, సంపాదన కాదు, మనం కుటుంబంతో పెంచుకునే అనుబంధాలే నిజమైన విజయానికి నిర్వచనమని నెటిజన్లు వ్యాఖ్యానించారు. మొదటి ఏడాది సర్దుబాటు కావడం కష్టంగా ఉన్నప్పటికీ, ఆ తర్వాత ఇక్కడి జీవితంతో చాలా ప్రశాంతత లభించిందని 2015లో అమెరికా నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన మరొక టెకీ స్పందించడం విశేషం.ఇదీ చదవండి: ఉద్యోగిని పెర్ఫామెన్స్ బాలేదని పెయిడ్ లీవ్ : కంపెనీకి భారీ క్రేజ్10 వేల మెట్లు, నలుగురు మనుషులు : భారీ కాయుడి డోలీ వీడియో వైరల్ -
సాధారణ బైక్ నుంచి బీఎండబ్ల్యూ రేంజ్‌కి..!
సాధారణ స్థితి నుంచి ఉన్నత స్థాయికి చేరుకుంటే ఆ ఫీల్ ఆ ఆనందం మాటలకందనిది. ఒక్కసారిగి వెనుతిరిగి చూసుకుంటే..ఇంత పెద్దస్థాయికి ఎలా చేరుకున్నాను అని ఆశ్చర్యం, గర్వం ఒకేసారి కలుగుతాయి. అంతేగాదు అందుకోసం మనవాళ్లు చేసిన త్యాగాలు కళ్లుముందు మెదలడమే కాదు..అందుకు తగ్గట్టుగా ప్రయోజకుడై వాళ్లను బాగా చూసుకుంటే..అంతకుమించిన సంతృప్తి ఇంకొకటి ఉండదు. ఆ ఆనందాన్నే ఓఎన్నారై ఇన్స్టాగ్రామ్ వేదికగా వీడియో షేర్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది.మధురకు చెందిన ఎన్నారై అమిత్ కశ్యప్ షేర్ చేసిన వీడియో నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. భారతదేశంలోని సాధారణ బైక్ నుంచి అమెరికాలో బీఎండబ్ల్యూ కొనుగోలు చేసే రేంజ్‌కి తాను ఎలా చేరుకున్నాడో ఇన్స్టాగ్రామ్ రీల్లో పంచుకున్నాడు. ఒకప్పుడు భారతదేశంలో తన వద్ద ఒక బైక్ మాత్రమే ఉండేదని, కానీ ఈరోజు అమెరికాలో తన సొంత ఇంటి గ్యారేజ్‌లో కారుని పార్క్ చేస్తున్నానని అని చెప్పడం ఎంతో గర్వంగా ఉంది అన్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని మధురకు చెందిన తాను ప్రస్తుతం అమెరికాలో టెక్సాస్‌లో నివశిస్తున్నట్లు పేర్కొన్నాడు. తన పేరెంట్స్ కోసం అమెరికాలో ఒక ఇల్లు కొన్నట్లు తెలిపాడు. అమెరికా రోడ్లపై బీఎండబ్ల్యూ కారుని నడపడమే కాదు, అందులో మా అమ్మనాన్నలతో కలిసి ప్రయాణిస్తున్నానని అన్నారు. అంతేగాదు తాను కట్టిన ఇల్లుని అమ్మకు బహుమతిగా ఇచ్చినట్లు తెలిపారు కూడా. తను ఈ రోజు ఈ ఉన్నత స్థాయిలో ఉన్నానంటే అందుకు తన పేరెంట్స్ చేసిన త్యాగాలేనని గుర్తుచేసుక్న్ననారు. డబ్బు ఆదా చేసేందుకు తన తల్లి మట్టిపొయ్యి మీద వంట చేయడంతో సహా, ఎన్నెన్నో త్యాగాలు చేశారు. తమ సొత ఖర్చులు తగ్గించుకుని, అప్పులు చేసి మరి మంచి స్కూల్‌కి పంపించారని, అలాగే ఇంజనీరింగ్ ఫీజుల కోసం ప్రతి పైసాను ఎలా కూడబెట్టేవారో తాను ఇప్పటికీ మర్చిపోనని అన్నారు. అంతేగాదు అలా మట్టిపోయ్యి మీద వండుతున్నప్పుడు ఆ పొగతో ఆమె పడ్డ బాధ ఇప్పటికీ గుర్తుందని భావోద్వేగంగా మాట్లాడారు. అంతేగాదు ఆ పరిస్థితుల్లో ఏదో ఒక రోజు మంచి స్థాయికి చేరుకుని మా కుటుంబానికి ఉన్న మధ్యతరగతి అన్న ముద్రను మార్చేయాలని ఎంత బలంగా అనుకునేవాడో నాటి సంఘటనలను గుర్తుతెచ్చుకుని మరీ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇవాళ తాను మంచిహోదాకు చేరుకుని ఆ కలను నిజం చేసుకున్నా.. అని సగర్వంగా చెబుతూ వీడియోని ముగించారు. అంతేగాదు కశ్యప్ సక్సెస్ జర్నీపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. ఓపికగా, నిలకడగా ఉంటే విజయ తథ్యం అదే కశ్యప్ చేసి చూపించారని పలువురు పొగడ్తల వర్షం కురిపించారు. View this post on Instagram A post shared by Amit Kashyap (@amitkashyap._) (చదవండి: రన్నింగ్ జస్ట్ ఫిట్నెస్ కాదు! అంతకుమించి..) -
నన్ను టార్చర్ చేస్తున్నారు.. స్వదేశానికి తీసుకెళ్లండి!
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీ పహాడీషరీఫ్ నుంచి బతుకుతెరువు కోసం ఒమన్ వెళ్లిన మహిళ షబ్నం బేగంకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. ఏజెంట్ చెప్పినట్లు అక్కడ జరగకపోవడంతో పాటు పగలూ రాత్రీ తేడా లేకుండా పని, హింస ఎదుర్కొంది. దీంతో యజమాని నుంచి తప్పించుకుని అక్కడి భారత ఎంబసీకి చేరిన షబ్నంబేగం తనను రక్షించాలంటూ నగరానికి చెందిన ఎంబీటీ నాయకుడు అమ్జదుల్లా ఖాన్‌కు సెల్ఫీ వీడియో పంపింది. దీన్ని ఆయన తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా ఒమన్‌లోని భారత ఎంబసీతో పాటు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) దృష్టికి తీసుకువెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది.షబ్నం సెల్ఫీ వీడియోలో మాట్లాడుతూ.. ‘నా పేరు షబ్నంబేగం. మార్చి 26న ఏజెంట్ ద్వారా ఒమన్ వచ్చా. ఉద్యోగం పేరుతో ఇక్కడకు పంపాడు. ఇక్కడ పగలు–రాత్రి పని చేయిస్తున్నారు. మూడు నెలలుగా జీతం ఇవ్వట్లేదు. కనీసం మొబైల్ ఫోన్ కూడా అందుబాటులో ఉండనీయట్లేదు. నాకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. వీరంతా చిన్న పిల్లలు. ఇక్కడ నా యజమానులు చాలా టార్చర్ చేస్తున్నారు. సరిగా తిండి కూడా పెట్టకుండా వేధిస్తున్నారు. తరచూ కొడుతుండటంతో తట్టుకోలేక పారిపోయి ఒమన్‌లోని ఇండియన్ ఎంబసీకి వచ్చి ఎనిమిది రోజులుగా తలదాచుకున్నా. ఇక్కడ ఇలా 130 మంది మహిళలం ఉన్నాం. ఏజెంట్ నా పాస్‌పోర్టు తీసుకుని తిరిగి ఇవ్వట్లేదు. దయచేసి నన్ను ఇక్కడ నుంచి తీసుకువెళ్లండి’ అంటూ వేడుకున్నారు. షబ్నం బేగంను వెంటనే హైదరాబాద్‌కు తరలించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ను ఎంబీటీ నాయకుడు అమ్జదుల్లా ఖాన్ కోరారు. మాయ మాటలతో మోసం చేసిన ఏజెంట్ పైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఉషా వాన్స్
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్ దంపతుల ఇంట్లో కొత్త ఆనందం వెల్లివిరిసింది. ఉషా వాన్స్ నాలుగో సంతానానికి జన్మనిచ్చారు. పుట్టింది మగ బిడ్డ అని, అతడికి ‘అలెక్ నీల్ వాన్స్’ అని పేరు పెట్టినట్లు జేడీ వాన్స్ స్వయంగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆ పేరు వెనుక ఉన్న అర్థం ఏమిటి? ముఖ్యంగా భారతీయ మూలాలున్న ఉషా వాన్స్ కుటుంబ నేపథ్యంతో ‘నీల్’ పేరుకు ఏమైనా సాంస్కృతిక అనుబంధం ఉందా? అనే ఆసక్తి నెలకొంది.జేడీ వాన్స్ సోషల్ మీడియా వేదికగా శుభవార్తను పంచుకున్నారు. “ఉషా, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. మా పిల్లలు తమ చిన్ని తమ్ముడిని కలుసుకోవడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు” అంటూ ఆయన పేర్కొన్నారు. బిడ్డకు వైద్యం అందించిన వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్ వైద్యులు, సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.pic.twitter.com/VMCGCCRd7s— JD Vance (@JDVance) July 19, 2026ఆ పేరుకు అర్థం ఏంటంటే.. వాన్స్ దంపతులు తమ నాలుగో బిడ్డకు పెట్టిన అలెక్ నీల్ వాన్స్(Alec Neel Vance) ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అలెక్ (Alec) అనేది సాధారణంగా అలెగ్జాండర్ (Alexander) అనే పేరుకు సంక్షిప్త రూపంగా భావిస్తారు. గ్రీకు మూలాలున్న ఈ పేరుకు “రక్షకుడు”, “ప్రజలను కాపాడేవాడు” అనే అర్థాలు ఉన్నాయి.ఇక నీల్ (Neel) అనే పేరు భారతీయులకు సుపరిచితమైనది. సంస్కృతంలోని “నీల” అనే పదం నుంచి వచ్చిన ఈ పేరుకు నీలం రంగు, ఆకాశం, నీలి వర్ణం వంటి అర్థాలు ఉన్నాయి. భారత్‌లో ఈ పేరును ఎంతోమంది ఉపయోగిస్తారు. అయితే జేడీ వాన్స్, ఉషా వాన్స్‌లు ఈ పేరును ప్రత్యేకంగా భారతీయ మూలాలతో పెట్టారా? లేదంటే కుటుంబానికి సంబంధించిన మరేదైనా కారణం ఉందా? అనే విషయాన్ని అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. అయినప్పటికీ ఉషా వాన్స్ భారతీయ మూలాలున్న వ్యక్తి కావడంతో.. ‘నీల్’ పేరు సాంస్కృతికంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.ఆరుగురితో వాన్స్ కుటుంబంఅలెక్ రాకతో జేడీ వాన్స్, ఉషా వాన్స్‌ల కుటుంబం ఆరుగురు సభ్యులుగా మారింది. ఇప్పటికే ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెద్ద కుమారుడు ఈవాన్ (Ewan) 2017లో జన్మించాడు. రెండో కుమారుడు వివేక్ (Vivek) 2020లో జన్మించగా.. కుమార్తె మిరాబెల్ (Mirabel) 2021లో జన్మించింది. ఇప్పుడు అలెక్ కుటుంబంలో నాలుగో చిన్నారి సభ్యుడిగా చేరాడు.నాలుగో బిడ్డ కోసం ఆసక్తికర కథనాలుగో సంతానం విషయంలో జేడీ వాన్స్ గతంలో ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసే ముందు తన భార్య ఉషాతో ఈ విషయం గురించి మాట్లాడినట్లు తెలిపారు. “నాకు నాలుగో బిడ్డ కావాలని ఉషాతో చెప్పాను. అందుకు ఆమె.. ‘సరే.. కానీ నువ్వు అమెరికా ఉపాధ్యక్షుడవుతావా? లేక నాలుగో బిడ్డను పొందుతావా? రెండూ ఒకేసారి సాధ్యం కాదు’ అని చెప్పింది” అంటూ వాన్స్ సరదాగా వ్యాఖ్యానించారు. చివరకు తనకు ఉపాధ్యక్ష పదవి, నాలుగో బిడ్డ రెండూ లభించాయని ఆయన అన్నారు.ఉషా వాన్స్‌కు ఆంధ్రా మూలాలుజేడీ వాన్స్ భార్య ఉషా వాన్స్ భారతీయ మూలాలున్న అమెరికన్. ఆమె తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగు కుటుంబ నేపథ్యానికి చెందినవారు. ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల కోసం వారు అమెరికాకు వెళ్లారు. కాలిఫోర్నియాలో పెరిగిన ఉషా.. చిన్ననాటి నుంచే అమెరికా వాతావరణంలో పెరిగినా, కుటుంబం ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలతో అనుబంధాన్ని కొనసాగించారు.అమెరికాలోని ప్రతిష్టాత్మక యేల్ లా స్కూల్ (Yale Law School)లో న్యాయ విద్య అభ్యసిస్తున్న సమయంలో ఉషాకు జేడీ వాన్స్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ 2013లో న్యాయ విద్య పూర్తి చేసి, 2014లో వివాహం చేసుకున్నారు. వీరి వివాహ వేడుక కూడా ప్రత్యేకతను సంతరించుకుంది. హిందూ, క్రైస్తవ సంప్రదాయాలను కలిపి వివాహం చేసుకున్నారు.అత్తగారి కుటుంబంపై ప్రశంసలుజేడీ వాన్స్ గతంలో పలుమార్లు తన భార్య ఉషా కుటుంబం గురించి ప్రస్తావించారు. భారతీయ వలసదారులు అమెరికా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన ప్రశంసించారు. తన అత్తమామలు అమెరికా సమాజానికి ఎంతో సేవ చేశారని, కష్టపడి తమ స్థానాన్ని సంపాదించుకున్నారని పేర్కొన్నారు. -
18 ఏళ్ల ఎన్ఆర్ఐ జీవితం నుంచి : మెటా టెకీ ఎమోషనల్ పోస్ట్ వైరల్
అమెరికాలో సుమారు రెండు దశాబ్దాలు గడిపిన తర్వాత ఒక టెకీ భారత దేశానికి తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. వృద్ధాప్యంలో ఉన్న తన తల్లిదండ్రులను చూసుకోవడం కోసం మాతృదేశానికి వచ్చానంటూ మెటా (Meta) ఇంజనీరింగ్ లీడర్ సోషల్ మీడియా పోస్ట్ వైరల్‌గా మారింది. తన 18 ఏళ్ల అమెరికా జీవితాన్ని డజనుకు పైగా సూట్‌కేసులలో సర్దేసి, బెంగళూరుకు మారిపోయినట్లు ఒక ఎయిర్పోర్ట్ ట్రాలీ ఫోటోను ఆయన షేర్ చేశారు.మెటాలో సీనియర్ ఇంజనీరింగ్ లీడర్‌గా పనిచేసిన బాలాజీ గురురాజన్, లింక్డ్ఇన్ పోస్ట్‌లో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తన నిర్ణయంతో పెద్దవాళ్లైపోయిన తన కన్నవాళ్లకు దగ్గరగా ఉండటంతోపాటు, పిల్లలు తమ గ్రాండ్ పేరెంట్స్‌ను ఎక్కడో దూరం నుంచి చూస్తూ ఉండేకన్నా, ఉమ్మడి కుటుంబంలో కలిసి పెరిగే అవకాశం కల్పించాలని తాను కోరుకుంటున్నట్లు వివరించారు.18 ఏళ్ల ప్రయాణంమైక్రోసాఫ్ట్, లింక్డ్ఇన్, మెటా వంటి దిగ్గజ సంస్థలలో పనిచేసిన ఆయన, అమెరికా తనకు కెరీర్‌ను, మంచి స్నేహితులను ఇచ్చిందని చెబుతూ, అక్కడ తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇపుడిక తన పుట్టిన నేల, చిన్న వయసులో చూసిన బెంగళూరు నగరంలో ఇప్పుడు పిల్లల స్కూళ్లు, ఇల్లు, నిత్య జీవితాన్ని మళ్లీ మొదటి నుండి ప్రారంభించడం ఒక సరికొత్త అనుభవమని పేర్కొన్నారు.ఇదీ చదవండి: 5 రకాల ఫుడ్స్ కంప్లీట్ బంద్ : 11 నెలల్లో 32 కిలోలు తగ్గిందినెటిజన్ల స్పందనఈ పోస్ట్‌కు నెటిజన్ల నుండి భారీగా మద్దతు, ప్రశంసలు లభించాయి. ఒక యూజర్ స్పందిస్తూ, బెంగళూరులోని సాంకేతిక పురోగతి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుందని, ఇది "రివర్స్ బ్రెయిన్ డ్రెయిన్" (ప్రతిభావంతులు తిరిగి స్వదేశానికి రావడం) కు సంకేతమని పేర్కొన్నారు.తల్లిదండ్రుల కళ్లలో కనిపించే ఆనందాన్ని డాలర్లతో కొనలేం మంచి నిర్ణయం తీసుకున్నారని కొంతమంది ఆయన నిర్ణయాన్ని అభినందించారు. అంతేకాదు గతంలోనే భారత్‌కు తిరిగి వచ్చిన పలువురు నెటిజన్లు ఆయనకు స్వాగతం పలుకుతూ, ఇక్కడి వాతావరణానికి అలవాటు పడటానికి కొన్ని చిట్కాలను కూడా పంచుకోవడం విశేషం.ఇదీ చదవండి: ఘనంగా పెళ్లి : రూ. కోటి నగలు, నగదుతో రాత్రికి రాత్రే వధువు జంప్ -
రాహుల్, ఖర్గేకు ఓపెన్ లెటర్.. క్షమాపణ చెప్పాల్సిందే!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఆస్ట్రేలియాలో నిర్వహించిన 'మెల్బోర్న్ మీట్స్ మోదీ' కార్యక్రమం రాజకీయ దుమారం రేపుతోంది. ఆ సభకు వచ్చినవారిని 'పెయిడ్ క్రౌడ్'(డబ్బులిస్తే వచ్చారు) అంటూ కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆ కార్యక్రమం నిర్వాహకులు తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు బహిరంగ లేఖ ద్వారా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. జూలై 9న మెల్బోర్న్లోని మార్వెల్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 30 వేల మంది హాజరయ్యారు. సభకు హాజరైన వారిని డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారంటూ కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఆరోపించారు. విదేశీ మీడియా కథనాలను ప్రస్తావిస్తూ చార్టర్డ్ విమానాల ద్వారా ప్రజలను తరలించారని, ఇందుకోసం నిధులు వినియోగించారని విమర్శించారు. అయితే ఈ ఆరోపణలను నిర్వాహకులు పూర్తిగా ఖండించారు. 'మోదీ ఎయిర్వేస్' పేరుతో సిడ్నీ నుంచి మెల్బోర్న్కు ప్రత్యేక చార్టర్ విమానాన్ని సమన్వయం చేసిన కమ్యూనిటీ ప్రతినిధులు.. సభకు వచ్చిన వారంతా స్వచ్ఛందంగానే వచ్చారని స్పష్టం చేశారు. ప్రయాణం, వసతి, ఇతర ఖర్చులను ఎక్కువ మంది స్వయంగా భరించారని, మరికొందరికి స్థానిక భారతీయ సంఘాలు మాత్రమే సహకరించాయని పేర్కొన్నారు.నిర్వాహకుల్లో ఒకరైన అమిత్ కరంత్ మాట్లాడుతూ.. "ఆస్ట్రేలియాలోని సిడ్నీ, అడిలైడ్, బ్రిస్బేన్, పెర్త్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో ఒక్కరికీ కూడా బీజేపీ, భారత ప్రభుత్వం, ఆస్ట్రేలియా ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు. వారంతా స్వచ్ఛందంగా వచ్చారు. 'పెయిడ్ క్రౌడ్' అనడం వేలాది మంది భారతీయ-ఆస్ట్రేలియన్లను అవమానించడమే అని అన్నారు.బహిరంగ లేఖలో నిర్వాహకులు మూడు ప్రధాన డిమాండ్లు చేశారు. చార్టర్ విమానానికి బీజేపీ, భారత ప్రభుత్వం నిధులు సమకూర్చిందనే ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని కాంగ్రెస్ అంగీకరించాలి. సభకు వచ్చినవారిని 'పెయిడ్ క్రౌడ్'గా అభివర్ణించిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. నిర్వాహకులు, వాలంటీర్లు, ప్రయాణికులు, భారతీయ-ఆస్ట్రేలియన్ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి అని కోరారు.అలాగే భారతీయ-ఆస్ట్రేలియన్ సమాజం ఏ ఒక్క రాజకీయ పార్టీకి చెందినది కాదని కూడా వారు స్పష్టం చేశారు. కొందరు కాంగ్రెస్‌కు, మరికొందరు బీజేపీకి, ఇంకొందరు ఇతర పార్టీలకు మద్దతు ఇస్తారని, చాలా మందికి ఎలాంటి రాజకీయ అనుబంధం కూడా ఉండదని పేర్కొన్నారు. అందువల్ల దేశీయ రాజకీయాల కోసం ప్రవాస భారతీయులను లక్ష్యంగా చేసుకుని విమర్శించడం తగదని సూచించారు.కాగా, మెల్బోర్న్లో జరిగిన 'మెల్బోర్న్ మీట్స్ మోదీ' కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, విక్టోరియా రాష్ట్ర ప్రీమియర్ జసింటా అలన్ కూడా పాల్గొన్నారు. భారత్-ఆస్ట్రేలియా సంబంధాలు, ప్రవాస భారతీయుల సేవలను ఈ కార్యక్రమంలో ప్రస్తావించారు. -
భారత సంతతి గూగుల్ లీడ్ ఇంజినీర్ దారుణ హత్య
అట్లాంటా: అమెరికాలో భారతీయ సంతతి మహిళ గృహ హింసకు బలయ్యారు. జార్జియాలో గూగుల్ సీనియర్ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న భారతీయ అమెరికన్ మహిళను ఆమె భర్త తుపాకీతో కాల్చి చంపాడు. ఈ కాల్పుల్లో వారి కుమారుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. భార్యాభర్తల మధ్య చిన్న గొడవ చివరకు హత్యకు దారితీసింది. భర్త ఆవేశంలో తుపాకితో కాల్పులు జరపగా.. అడ్డుకోడానికి ప్రయత్నించిన కుమారుడ్ని కూడా చంపేందుకు తండ్రి ప్రయత్నించాడు.ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడు కిర్క్ బి. వ్రజెసిన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. జార్జియాలోని స్మిర్నా సిటీలో ఉన్న ఒక ఇంట్లో కాల్పులు జరిగినట్లు స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8:00 గంటలకు ముందు పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు 57 ఏళ్ల శీతల్ వ్రజెసిన్ ఇంట్లో బుల్లెట్ గాయాలతో పడి ఉండటం కనిపించింది. తీవ్ర గాయాలతో ఆమె కన్నుమూశారు.గాయపడిన కుమారుడు జేసన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. హత్యకు గురైన శీతల్ వ్రజెసిన్ గూగుల్‌లో ఇంజనీరింగ్ లీడర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. టెక్నాలజీ రంగంలో వివిధ విభాగాల్లో ఆమెకు రెండు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ అనుభవం ఉంది. గూగుల్‌లో చేరడానికి ముందు, ఆమె హోమ్ డిపోలో మొబైల్, డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ ప్రాజెక్ట్‌లకు నాయకత్వం వహించారు. కంపెనీ డిజిటల్ హోమ్ డెకర్, ఫర్నిషింగ్స్ వ్యాపార విస్తరణలో కీలక పాత్ర పోషించారు.ఇంగ్లాండ్, భారత్, ఘనా దేశాలలో పెరిగిన శీతల్.. ఆ తర్వాత కంప్యూటర్ సైన్స్‌లో ఉన్నత చదువుల కోసం అమెరికాలోని ప్రతిష్టాత్మక 'జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ'కి వెళ్లారు. ఆమె అట్లాంటాలో తన భర్త మరియు ఇద్దరు పిల్లలు (జేసన్, జెస్సికా)లతో కలిసి నివసిస్తున్నారు. సాఫ్ట్వేర్ పేటెంట్లలో ఆమె రెండు పేటెంట్లకు ఇన్వెంటర్‌గా గుర్తింపు పొందారు. -
డబ్లిన్‌లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
దివంగత మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐర్లాండ్ నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో డబ్లిన్ నగరంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కటింగ్, వైఎస్సార్ జీవిత విశేషాలను ప్రతిబింబించే ప్రత్యేక ఆడియో–విజువల్ ప్రదర్శన, నాయకుల ప్రసంగాలు, విందుతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్సార్సీపీ గ్లోబల్ ఎన్ఆర్ఐ వింగ్ అధ్యక్షులు ఆలూరి సాంబశివ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెవిరెడ్డి భాస్కర రెడ్డి హాజరై, వైఎస్సార్‌తో తమకున్న అనుబంధాన్ని, ఆయనతో గడిపిన మధుర స్మృతులను పంచుకున్నారు. అలాగే పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సందేశాన్ని అందరికీ చేరవేస్తూ, పార్టీ ఆశయాలు, వైఎస్సార్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐర్లాండ్ కన్వీనర్ కిషోర్ ఆకేపాటి మాట్లాడుతూ, పార్టీని మరింత బలోపేతం చేయడంలో ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని, సేవా కార్యక్రమాల ద్వారా వైఎస్సార్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో ఐర్లాండ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, మహిళలు, చిన్నారులు, విద్యార్థులు, ఐటీ, ఇతర రంగాలకు చెందిన ప్రవాస తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. -
యూఏఈ టాపర్లకు భారీ కానుక.. ఒక్కొక్కరికి లక్ష దిర్హమ్లు
దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో 2025–26 విద్యా సంవత్సరానికి చెందిన సెకండరీ (హైస్కూల్) పరీక్షల్లో జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధానమంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఎంపికైన అగ్రశ్రేణి విద్యార్థులకు ఒక్కొక్కరికి 100,000 దిర్హమ్లు (సుమారు రూ.23 లక్షలు) నగదు ప్రోత్సాహకాన్ని అందజేస్తూ వారి ప్రతిభను గౌరవించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు పంపిన ప్రత్యేక సందేశంలో షేక్ మొహమ్మద్, "మీ అద్భుత విజయానికి అభినందనలు. మీ కుటుంబ సభ్యులతో కలిసి ఈ గర్వకారణమైన క్షణాన్ని మేమూ పంచుకుంటున్నాం. మీ విజయాలు దేశ భవిష్యత్తు నిర్మాణానికి మరో బలమైన పునాది" అని పేర్కొన్నారు. అలాగే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కృషిని కూడా ప్రత్యేకంగా ప్రశంసించారు.విద్యార్థులకు అందించిన గిఫ్ట్ బాక్స్‌లో "మేము మిమ్మల్ని చూసి గర్విస్తున్నాం... మేము మీపై విశ్వాసం ఉంచుతున్నాం" అనే సందేశం కూడా ఉండటం విశేషం. ఈ మాటలు తమకు జీవితాంతం స్ఫూర్తినిస్తాయని, నగదు బహుమతి కంటే నాయకత్వం నుంచి లభించిన ఈ గుర్తింపే అత్యంత విలువైనదని పలువురు టాపర్లు భావోద్వేగంగా వెల్లడించారు.విద్యా రంగంలో ప్రతిభను ప్రోత్సహించడం, యువతను ప్రపంచ స్థాయి నైపుణ్యాలతో తీర్చిదిద్దడం యూఏఈ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని షేక్ మొహమ్మద్ మరోసారి స్పష్టం చేశారు. దేశ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని, నాయకత్వం ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని అవార్డు గ్రహీతలు ప్రతిజ్ఞ చేశారు.هدية الشيخ محمد بن راشد آل مكتوملأوائل الثانوية العامة في الدولة 🇦🇪 pic.twitter.com/3fIOjZ8vTI— 𝐌𝐨𝐡𝐚𝐦𝐦𝐞𝐝 𝐑𝐚𝐬𝐡𝐢𝐝 (@M___R1212) July 11, 2026 -
అమెరికాలో బెజవాడ యువతిని హత్య చేసిన భర్త
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): విజయవాడకు చెందిన సబ్బినేని రజిత గతేడాది అక్టోబర్ 27న అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మరణించింది. అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్ బెల్వ్యూ పోలీసులు జరిపిన విచారణలో..రజితను అమె భర్త నార్నే అవినాష్ చంపాడని వెల్లడవడంతో కేసును హత్య కేసుగా మార్చారు. గాయత్రీనగర్‌కు చెందిన సబ్బినేని కృష్ణారావుకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె రజితను గతేడాది తెలంగాణకు చెందిన నార్నే అవినాష్ కు ఇచ్చి హైదరాబాద్‌లో పెళ్లి చేశారు. జులైలో ఈ జంట అమెరికాలోని వాషింగ్టన్కు వెళ్లిపోయారు. పెళ్ళికి ముందుగానే అవినాష్‌కు భారత్‌కు చెందిన మరో మహిళతో సంబంధం ఏర్పరుచుకున్నాడు. ఈ కారణంగా రజితను చంపాలని ప్రణాళిక రూపొందించుకున్నాడు. భార్యను ఎలా చంపితే పోలీసులకు దొరక్కుండా ఉంటారనే విషయంపై ఇంటర్నెట్లో వెతికాడు. గాలి ఆడకుండా చేస్తే ఎంత సమయానికి మనిషి ప్రాణాలు పోతాయనే విషయాలను వెతికి, గతేడాది అక్టోబర్ 27న రజితను గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. వెంటనే మృతదేహాన్ని ఫొటో తీసి తన ప్రియురాలికి వాట్సాప్‌లో పంపాడు. రజిత బాత్రూమ్లోకి వెళ్ళి లాక్ చేసుకుందని, ఎంత పిలిచినా రావడం లేదని పోలీసులకు ఫోన్ చేసి అవినాష్ చెప్పాడు. పోలీసులు వచ్చేలోపే రజిత అపస్మారకస్థితిలో పడిఉంది. వైద్యులు పరిశీలించి ఆమె మరణించిందని చెప్పారు. ఆ సమయంలోనే రజిత మృతిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. డిజిటల్ ఫోరెన్సిక్స్ ద్వారా రజితను ష్ష్ చంపాడని గుర్తించారు. ఈ విషయం తెలిసిన వెంటనే రజిత తల్లిదండ్రులు అమెరికాకు బయలుదేరారు. అమెరికా పోలీసులు అవినా షను అరెస్ట్ చేశారు. -
శంకరనేత్రాలయ అమెరికా సలహామండలి సభ్యుడిగా లక్ష్మీనరసింహన్ వాసన్
లాస్ ఏంజెలెస్: లాస్ ఏంజెలెస్: శంకర నేత్రాలయ సంస్థ అమెరికా సలహా మండలి (అడ్వైజరీ బోర్డు) సభ్యుడిగా లక్ష్మీ నరసింహన్ వాసన్‌ను నియమితులయ్యారు. అమెరికన్ కిచెన్ ఎక్విప్మెంట్ రంగంలో స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగిన ఆయన ఎన్నో సమాజ సేవ, దాతృత్వ కార్యక్రమాలు చేపట్టారు. ఆయనను ప్రతీష్టాత్మకమైన అడ్వైజరీ బోర్డులో సభ్యుడిగా నియమించామని సంస్థ అధ్యక్షులు బాలరెడ్డి ఇందుర్తి తెలియచేశారు.ఈ సందర్భంగా శంకర నేత్రాలయ యూఎస్ఏ నాయకత్వ బృందం, ఇతర సలహా మండలి సభ్యులు, శంకర నేత్రాలయ ఇండియా అధ్యక్షులు డాక్టర్ గిరీష్ రావు తదితరులు లక్ష్మీ నరసింహన్ వాసన్, ఆయన సతీమణి డాక్టర్ బృందా సుబ్రహ్మణియన్‌కు స్వాగతాభినందనలు తెలియచేశారు. లక్ష్మీ నరసింహన్ వాసన్ తమిళనాడులోని ఈరోడ్ సమీపంలోని పసూర్ గ్రామంలో జన్మించి, హైదరాబాద్‌లో పెరిగారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఇంజినీరింగ్ పట్టా పొందిన అనంతరం, 1981లో ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికాకు వెళ్లారు. అనంతరం విజయవంతమైన పారిశ్రామికవేత్తగా ఎదిగి, ఇటీవల దక్షిణ కాలిఫోర్నియాలోని రాయల్ కిచెన్ ఎక్విప్మెంట్ కంపెనీ ప్రధాన కార్యనిర్వాహణ అధికారి (CEO)గా సేవలందించారు.ఆయనకు క్రీడారంగంలో కూడా విశిష్టమైన ప్రస్థానం ఉంది. అమెరికాకు వెళ్లే ముందు ఆయన భారతదేశంలో ఫస్ట్ క్లాస్ క్రికెటర్‌గా రాణించి, హైదరాబాద్ రంజీ ట్రోఫీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఆయన నాయకత్వంలోని జట్టులో మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి, మహ్మద్ అజహరుద్దీన్, శివలాల్ యాదవ్ వంటి ప్రముఖ ఆటగాళ్లు సభ్యులుగా ఉన్నారు. భారతదేశంలో జరిగిన వివిధ క్రికెట్ మ్యాచ్‌లలో కూడా పాల్గొన్న ఆయన, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, కృష్ణమాచారి శ్రీకాంత్, సయ్యద్ కిర్మాణి, ఎస్. వెంకటరాఘవన్ వంటి భారత క్రికెట్ దిగ్గజాలతో కలిసి మైదానాన్ని పంచుకున్నారు.లక్ష్మీ నరసింహన్ వాసన్ 1988లో డాక్టర్ బృందా సుబ్రహ్మణియన్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. కుమారుడు డాక్టర్ కార్తీక్ వాసన్ వైద్య పరిశోధనలో పీహెచ్డీ. పూర్తి చేయగా, కుమార్తె మయూరి వాసన్ ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలిగా గుర్తింపు పొందారు.దాతృత్వ సేవలను జీవిత ధ్యేయంగా భావించిన లక్ష్మీ నరసింహన్, భారతదేశం, అమెరికాలో అనేక సేవా కార్యక్రమాలకు ఆర్ధిక సహాయం అందిస్తున్నారు. ఇటీవల శంకరనేత్రాలయా సంస్థకు నాలుగు లక్షల ఇరవై ఐదు వేల డాలర్ల విరాళం ప్రకటించారు. ఈ విరాళంతో, శంకరనేత్రాలయ సంస్థ మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ ప్రాంతంలో పూర్తిస్థాయి సౌకర్యాలతో కూడిన మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. దీనివల్ల మధ్యప్రదేశ్, సమీప ఐదు రాష్ట్రాల పేదప్రజలకు కంటిచూపు సంబందించిన వ్యాధుల నివారణకు సహాయపడుతుంది. ఈ యూనిట్ ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన నేత్ర వైద్య సేవలు మరింత విస్తృతంగా అందించే అవకాశం కల్పిస్తుంది.శంకర నేత్రాలయ యూఎస్ఏ వ్యవస్థాపకులు, ప్రెసిడెంట్ ఎమిరిటస్ ఎస్ వి ఆచార్య, పద్మభూషణ్ డాక్టర్ జగదీశ్ సేథ్, ప్రసాద్ రెడ్డి కాటంరెడ్డి, శ్రీమతి లీల క్రిష్ణమూర్తి , డాక్టర్ రాజ్ మోదీ, డాక్టర్ కిశోర్ చివుకుల , ఉదయ భాస్కర్ గంటి, శ్యామ్ అప్పలి, శ్రీ మూర్తి రేకపల్లి, వంశీకృష్ణ ఏరువరం, డాక్టర్ రెడ్డి ఊరిమిండి, వాసన్ కుటుంబం అందిస్తున్న విశేష దాతృత్వ సేవలను, సంకర నేత్రాలయ లక్ష్య సాధనకు వారు అందిస్తున్న సహకారాన్ని హృదయపూర్వకంగా అభినందించారు. -
యూఏఈలో లాంగ్ జర్నీ.. ప్రభుత్వం కీలక సూచనలు
అబుదాబి: యూఏఈలో తీవ్ర వేసవి వేడి కొనసాగుతున్న నేపథ్యంలో రహదారి ప్రమాదాలు, వాహనాల యాంత్రిక లోపాలను నివారించేందుకు అంతర్గత మంత్రిత్వ శాఖ (MoI) వాహనదారులకు కీలక భద్రతా సూచనలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న ‘ప్రమాద రహిత వేసవి’ రహదారి భద్రతా ప్రచారంలో భాగంగా, ప్రయాణానికి ముందు వాహనాన్ని పూర్తిగా తనిఖీ చేయాలని సూచించింది.ముఖ్యంగా ఇంజిన్ కూలింగ్ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తోందో లేదో నిర్ధారించుకోవాలని, రేడియేటర్లో కూలెంట్ లేదా నీటి స్థాయిని పరిశీలించాలని అధికారులు తెలిపారు. అలాగే ఇంజిన్ ఆయిల్ సరిపడా ఉందో లేదో చెక్ చేయడంతో పాటు, టైర్ల పరిస్థితి, గాలి ఒత్తిడి, బ్రేకుల పనితీరును తప్పనిసరిగా పరీక్షించాలని సూచించారు. రాత్రి ప్రయాణాలు లేదా సుదూర ప్రయాణాల ముందు హెడ్లైట్లు, బ్రేక్ లైట్లు, టర్న్ ఇండికేటర్లు సరిగా పనిచేస్తున్నాయో లేదో కూడా నిర్ధారించుకోవాలని పేర్కొన్నారు.అంతేకాకుండా వాహనంలో అవసరమైన అత్యవసర భద్రతా పరికరాలు అందుబాటులో ఉంచాలని, ఎండలో కారులో సులభంగా మంటలు అంటుకునే వస్తువులు, ప్రెషరైజ్డ్ కంటైనర్లు, లైటర్లు లేదా సువాసన స్ప్రేలు వంటి వస్తువులను వదిలివేయొద్దని హెచ్చరించింది. వీలైనంత వరకు వాహనాన్ని నీడ ఉన్న ప్రదేశాల్లో పార్క్ చేయాలని, స్టీరింగ్ వీల్ అధికంగా వేడిగా ఉంటే వెంటనే ప్రయాణం ప్రారంభించకుండా కొంతసేపు చల్లబడిన తర్వాతే డ్రైవ్ చేయాలని సూచించింది.ఈ ముందుజాగ్రత్తలు పాటించడం వల్ల ఓవర్‌హీటింగ్, టైర్ పేలిపోవడం, ఆకస్మిక యాంత్రిక వైఫల్యాలు వంటి సమస్యలను గణనీయంగా తగ్గించవచ్చని అధికారులు తెలిపారు. ముఖ్యంగా సుదూర ప్రయాణాలకు ముందు వాహనం పూర్తిగా రోడ్డుకు అనుకూల స్థితిలో ఉందని నిర్ధారించుకోవడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని అంతర్గత మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. -
సౌదీలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
రియాద్: మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 77వ జయంతిని పురస్కరించుకొని సౌదీ అరేబియా సెంట్రల్ కోర్ కమిటీ ఆధ్వర్యంలో రియాద్ నగరంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, ప్రవాసాంధ్రులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సౌదీ అరేబియా సెంట్రల్ కమిటీ కన్వీనర్ రబ్బానీ సయ్యద్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయాయని కొనియాడారు. వైఎస్సార్సీపీ ఘన విజయం కోసం కార్యకర్తలు, నాయకులు ఏ విధంగా కలిసికట్టుగా పని చేయాలో దిశా నిర్దేశం చేశారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ‘మావిగన్’ కార్యక్రమం గురించి రబ్బానీ సయ్యద్ ఈ వేదికపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘మావిగన్’కు పూర్తి మద్దతు ప్రకటిస్తూ రియాద్ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు చేసిన కరతాళ ధ్వనులు, ‘జై మావిగన్’ నినాదాలతో ఆడిటోరియం మార్మోగింది.ఈ వేడుకల్లో పార్టీ ముఖ్య నాయకులు సిరుమల సుబ్బారెడ్డి, పట్లోళ్ల శ్రీకాంత్ రెడ్డి, కరీముల్లా బాషా షేక్, వెలంపాటి వేణుగోపాల్ రెడ్డి, గంగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, గొల్ల విజయ్, గానుగపెంట శ్రీకాంత్, సుభాన్ ఖాన్ పఠాన్, నాగినేని ఉదయ్ కృష్ణ చౌదరి, షేక్ షాదక్ వలి, కంది శశిధర్ రెడ్డితో పాటు వందలాది మంది వైఎస్సార్ అభిమానులు, కార్యకర్తలు పాల్గొని ఈ జయంతి వేడుకలను విజయవంతం చేశారు. -
YSRCP ఫీనిక్స్ ఎన్నారై కమిటీ ఆధ్వర్యంలో డా. వై.ఎస్.ఆర్ జయంతి వేడుకలు
ఫీనిక్స్, అరిజోనా : మహానేత డాక్టర్ వై.యస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతిని YSRCP ఫీనిక్స్ ఎన్నారై కమిటీ ఘనంగా నిర్వహించింది. YSRCP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, YSRCP ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్ చ ముఖ్యమంత్రి మాజీ సలహాదారు (విద్య) ఆలూరు సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (ఎన్ఆర్ఐ వ్యవహారాలు) డాక్టర్ ప్రదీప్ చింతా గారు హాజరయ్యారు. డాక్టర్ వై.ఎస్‌కు పుష్పాంజలి ఘటించడంతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం, ఆయన అద్భుతమైన జీవితం, దార్శనిక నాయకత్వం, ప్రజా సంక్షేమం పట్ల అచంచలమైన నిబద్ధతను తెలియజేస్తూ ఒక ప్రత్యేక ఆడియో-విజువల్ ప్రదర్శన జరిగింది.డా. వైయస్సార్‌తో తమ జ్ఞాపకాలను పలువురు పంచుకున్నారు. ఆయన వినయం, కరుణ, ధైర్యం, ప్రజా సేవ పట్ల అచంచలమైన అంకితభావాన్ని వారు గుర్తు చేసుకున్నారు. డాక్టర్ వైఎస్ఆర్ను నిజమైన ప్రజానాయకుడు అంటూ ముఖ్య అతిథి ఆలూరు సాంబ శివారెడ్డి అభివర్ణించారు. సామాన్య పౌరులతో ఆయనకున్న అసాధారణ అనుబంధాన్ని, పరిపాలన పట్ల ఆయన అనుసరించిన పరివర్తనాత్మక విధానాన్ని ఆయన నొక్కిచెప్పారు. ఆంధ్రప్రదేశ్ నిరంతర సంక్షేమం, అభివృద్ధి కోసం డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి ఆదర్శాలను, దార్శనికతను ముందుకు తీసుకెళ్లడంలో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి అందరూ అండగా నిలవాలని ఆయన కోరారు.ప్రపంచవ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఎన్నారై చాప్టర్లను బలోపేతం చేసే లక్ష్యంతో చేపట్టిన జగనన్న టెక్‌ఫోర్స్ కార్యక్రమాల గురించి కూడా ఆయన వివరించారు. సాఫ్ట్వేర్ నిపుణులు మరియు ఎన్నారైల కీలక పాత్రను నొక్కిచెబుతూ, పార్టీ ప్రపంచవ్యాప్త విస్తరణ,భాగస్వామ్యానికి సభ్యులు చురుకుగా పాల్గొని, తమ వంతు సహకారం అందించాలని ఆయన ప్రోత్సహించారు.అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని తమ కుటుంబ సభ్యులు , స్నేహితులలో అవగాహన కల్పించడం ద్వారా ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (SIR)లో ఎన్నారైలు చురుకుగా పాల్గొనాలని ఆయన కోరారు. ప్రతి అర్హతగల ఓటరు తమ వివరాలను సరిచూసుకుని, నమోదు ప్రక్రియను సరిగ్గా పూర్తి చేయడం యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు.ముఖ్య అతిథి డా. ప్రదీప్ చింత, దివంగత డా. వై.ఎస్. స్ఫూర్తిదాయక వ్యక్తిత్వం మరియు శాశ్వత వారసత్వం గురించి ప్రస్తావించారు. ఆయన పదవీకాలంలో ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. అలాగే, వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలో, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ మరియు గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థలో అమలు చేసిన పరివర్తనాత్మక సంస్కరణల గురించి మాట్లాడారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంలో సోషల్ మీడియా కార్యకర్తలపై జరుగుతున్న అణచివేతపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువలకు, ప్రజా చైతన్యానికి మద్దతుగా సోషల్ మీడియా వేదికల ద్వారా చురుకుగా పాల్గొనాలని ఎన్నారైలకు పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో ధీరజ్ పోల SIR పథకంపై ఒక వాక్‌త్రూ సెషన్‌ను నిర్వహించారు. SIR పథకం కింద ఓటరు వివరాలను ధృవీకరించుకోవడానికి, గణన పత్రాలను సరిగ్గా పూరించడానికి అవసరమైన దశలవారీ ప్రక్రియను ఆయన వివరించారు. నిర్దేశించిన కాలపరిమితిలోగా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు తమ కుటుంబ సభ్యులకు, స్థానిక సమాజాలకు మార్గనిర్దేశం చేయాలని పాల్గొన్నవారిని ప్రోత్సహించారు.డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని పరిరక్షించడానికి, ప్రోత్సహించడానికి కమిటీ కట్టుబడి ఉందని పునరుద్ఘాటిస్తూ ఈ సమావేశం ముగిసింది. డాక్టర్ వై.ఎస్.ఆర్. ఆశించిన సమ్మిళిత అభివృద్ధి, సామాజిక న్యాయం, సంక్షేమ ఆధారిత పాలన అనే ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి మద్దతు కొనసాగించాల్సిన ప్రాముఖ్యతను వక్తలు నొక్కి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల అత్యంత ప్రియమైన నాయకులలో ఒకరికి ఈ కార్యక్రమాన్ని ఒక అర్థవంతమైన నివాళిగా మార్చడంలో పాల్గొన్న సభ్యులు, మద్దతుదారులు మరియు సామాజిక నాయకులందరికీ వైఎస్సార్సీపీ ఫీనిక్స్ ఎన్ఆర్ఐ కమిటీ ధన్యవాదాలు తెలిపింది.ఈ కార్యక్రమంలో ధీరజ్ పోల, వంశీ ఏరువరం, చెన్నారెడ్డి మద్దూరి, సోమ శేఖర్ రెడ్డి యర్రపురెడ్డి, బోగారపు లక్ష్మీ & గురు, బలరాంరెడ్డి, శ్రీధర్ లక్కిరెడ్డి, రమేష్, శ్రీధర్ చెమిడ్తి, అంజిరెడ్డి, విఘ్నేష్, కొండారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, కొండారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, శ్రీనివాసరెడ్డి, నాగేష్పొర్లక్లు పాల్గొన్నారు. శిరసనంబేడు, సాయి రోహిత్ చెరుకుమిల్లి, శ్రవణ్, విష్ణు చొప్పా, విజయ్, ప్రవీణ్, ప్రక్ష్, పురంధర్, శివ కోడూరు, నాగరాజు దాసరి, ప్రక్షా, లోకనాధ్, అనిల్ ప్రవీణ్ అవుతారు తదితరులు పాల్గొన్నారు. వాలంటీర్లందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ కార్యక్రమం ముగిసింది. -
రూ.70 కోట్ల లాటరీ.. ఆ అదృష్టవంతుడు భారతీయుడే!
అబుదాబిలో నివసిస్తున్న ప్రవాస భారతీయుడు సునీల్ కుమార్ సదాశివన్ (52) యూఏఈ లాటరీలో ఏకంగా 30 మిలియన్ దిర్హామ్‌లు (సుమారు రూ.70 కోట్లు) గెలుచుకుని ఒక్కసారిగా కోటీశ్వరుడయ్యాడు. జూలై 1న జరిగిన 'లక్కీ డే' డ్రాలో ప్రకటించిన ఏడు విజేత సంఖ్యలను సరిగ్గా సరిపోల్చడంతో ఈ భారీ జాక్‌పాట్ అతని సొంతమైంది. ఈ విషయాన్ని యూఏఈ లాటరీ నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు.విజయం గురించి స్పందించిన సునీల్ కుమార్.. తొలిసారి ఫలితాలు చూసినప్పుడు సంఖ్యలను తప్పుగా చదివానేమో అనిపించిందని, మరోసారి టికెట్‌ను పరిశీలించిన తర్వాతే తాను నిజంగానే గెలిచానని అర్థమైందన్నారు. "మొదట నమ్మలేకపోయాను. మళ్లీ చూసిన తర్వాతే ఇది నిజమని గ్రహించాను" అని ఆయన పేర్కొన్నారు.యూఏఈ లాటరీలో గత ఐదు వారాల వ్యవధిలో ప్రకటించిన రెండో 30 మిలియన్ దిర్హామ్‌ల గ్రాండ్ ప్రైజ్ విజేత సునీల్ కుమారే. అంతకుముందు మే నెలలో నేపాల్‌కు చెందిన టయాబ్ ఖాన్ తన స్నేహితులతో కలిసి ఇదే జాక్‌పాట్‌ను గెలుచుకున్నాడు. అలాగే 2025లో ప్రవాస భారతీయుడు అనిల్‌కుమార్ బొల్లా 100 మిలియన్ దిర్హామ్‌ల తొలి గ్రాండ్ ప్రైజ్‌ను దక్కించుకున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం యూఏఈ లాటరీ ప్రతి బుధవారం, శనివారం 'లక్కీ డే' డ్రాలను నిర్వహిస్తోంది. ప్రతి డ్రాలో 30 మిలియన్ దిర్హామ్‌ల గ్రాండ్ ప్రైజ్, 5 మిలియన్ దిర్హామ్‌ల రెండో బహుమతి, అలాగే ముగ్గురు అదృష్టవంతులకు 50 వేల దిర్హామ్‌ల చొప్పున 'లక్కీ ఛాన్స్' నగదు బహుమతులు అందజేస్తున్నారు. ఈ డ్రాలో పాల్గొనడానికి టికెట్ ధర 50 దిర్హామ్‌లు. -
విదేశాల్లో ఘనంగా డాక్టర్ వైఎస్సార్ జయంతి
సాక్షి, అమరావతి/తిరుపతి మంగళం: మహానేత, దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతిని విదేశాల్లో ప్రవాసాంధ్రులు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా ఆధ్వ ర్యంలో జోహన్నెస్‌బర్గ్‌లోని మిడ్రాండ్లో జరిగిన కార్యక్రమానికి వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా కన్వీనర్ విక్రమ్ రెడ్డి పెట్లూరు అధ్యక్షత వహించారు. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్‌ను కట్ చేసి అన్నదానం చేపట్టారు. కెనడాలోని టొరొంటో నగరంలో వైభవంగా వైఎస్సార్ జయంతి వేడుకలు కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా ప్రతినిధులు నరసింహ రెడ్డి కల్లా, సూర్య రామిరెడ్డి, మురళి సోమిశెట్టి, శివ రాజవరపు, బి వెంకట సుబ్బా రెడ్డి , వాసు సింగారెడ్డి , వీరయ్య కట్టెపోగు, ఆంజనేయులు బిక్కా, మోహన్ పోలుబోయెన, అంజలి అవనిగడ్డ, మధుసూదన్ రెడ్డి పల్లె, అంజిరెడ్డి, వెంకట్ రెడ్డి ఎనుముల, శ్రీకృష్ణ రెడ్డి గరిస, కృష్ణమోహన్ రెడ్డి, సుధాకర్ కుప్పిరెడ్డి, కిషోర్ మారంరెడ్డి, హరీష్ గోరంట్ల, హరి ఆత్మకూరి, వెంకట్ మాగంటి, రాజేష్ యార్లగడ్డ , శ్రీమతి కల్పన జోసెఫ్, శివమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు కెనడాలో.. కెనడాలోని టొరంటోలో వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ కమిటీ సభ్యులు కేక్ కట్ చేసి వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు అలూరు సాంబశివరెడ్డి, చల్లా మధుసూదన్ రెడ్డి, కార్తీక్ ఎల్లాప్రగడ, డాక్టర్ జగన్మోహన్ రెడ్డి, డాక్టర్ ప్రదీప్ చింతా, పార్టీ కెనడా కన్వీనర్ వేణు చుక్కలూరు వర్చువల్‌గా పాల్గొన్నారు. టొరంటోలో జరిగిన కార్యక్రమంలో నరసింహ రెడ్డి గుట్టిరెడ్డి, చెన్న కేశవ, ప్రతాప్ బొల్లారం, ఆరిఫ్, నూర్, శ్రీనివాస్ రెడ్డి మరెక్కగారి, చంద్రహాస్ చల్లా, శాలిని బెక్కం, కృష్ణ రెడ్డి అల్లంపాటి, కృష్ణ చిదిరాల, శ్రీకాంత్ మద్దిరెడ్డి, రమేష్ తుంపర, సుబ్బా రావు, గుణశేఖర్ కొనపల్లి, విష్ణు వంగాల, కల్యాణ్ గుర్రంకొండ, శైలేష్ పాల్యం తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా ఆధ్వర్యంలో జోహన్నెస్‌బర్గ్‌లో భారీ కేక్ కట్ చేస్తున్న అభిమానులు ఆస్ట్రేలియాలో.. ఆ్రస్టేలియాలోని బ్రిస్బేన్‌లో వైఎస్సార్సీపీ స్థానిక నాయకులు, అభిమానులు వైఎస్సార్ చిత్రపటానికి నివాళులు అరి్పంచారు. అనంతరం కేక్‌ను కట్ చేశారు. ఈ వేడుకల్లో బ్రహ్మరెడ్డి ఎరువూరి, కిషోర్, జస్వంత్ బొమ్మిరెడ్డి, వంశీ చాగంటి, శ్రీనివాసులు రెడ్డి, చిన్నప్ప, శౌర్య పాల్గొన్నారు. అలాగే, కందుల భరత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలోని అన్ని రాష్ట్రాల్లో వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నార్తన్ టెరిటోరీలోని డారి్వన్ నగరంలో కొమ్మిరెడ్డి చంద్ర శేఖర్ రెడ్డి, శివ హర్షవర్థన్ రెడ్డి వంగ, లక్ష్మణ్ రెడ్డి, రాఘవేంద్ర రావు, శ్యామ్ సుందర్ రెడ్డి, రవితేజ మదినేని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెర్త్‌లో జరిగిన కార్యక్రమంలో వంశీ కృష్ణా రెడ్డి, యశ్వంత్, సతీష్ త్రినాథ్, వినయ్, శరత్ తదితరులు పాల్గొన్నారు. ఆస్ట్రేలియాలోని డార్విన్ నగరంలో కేక్ కట్ చేస్తున్న వైఎస్సార్ అభిమానులు మెల్బోర్న్లో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఆ్రస్టేలియా కన్వీనర్ భరత్, విక్టోరియా కన్వీనర్ కృష్ణా రెడ్డి, సహ కన్వీనర్ రామాంజి, కోర్ టీమ్ సభ్యులు శిరీష, స్వాతి, యశు, బ్రహ్మ రెడ్డి, పవన్, సురేష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, అబ్దుల్, రవి వర్మ, తేరా జయవర్ధన్ రెడ్డి, శ్రీనాథ్, నితీష్, ప్రణీత్, రోహిత్, అభిష్క్, ఉదయ్, భార్గవ్, యశ్వంత్, దశరథ్ రెడ్డి, పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం గ్లోబల్ కో–ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి, పార్టీ నేతలు నూర్ ఫాతిమా, గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, కారుమూరి వెంకటరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని ప్రసంగించారు.ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో వైఎస్సార్ జయంతి వేడుకలు -
విదేశాల్లో ఘనంగా డాక్టర్ వైఎస్సార్ జయంతి
సాక్షి,అమరావతి/తిరుపతి మంగళం: మహానేత, దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతిని విదేశాల్లో ప్రవాసాంధ్రులు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా ఆధ్వ ర్యంలో జోహన్నెస్‌బర్గ్‌లోని మిడ్రాండ్లో జరిగిన కార్యక్రమానికి వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా కన్వినర్ విక్రమ్ రెడ్డి పెట్లూరు అధ్యక్షత వహించారు. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్‌ను కట్ చేసి అన్నదానం చేపట్టారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా ప్రతినిధులు నరసింహ రెడ్డి కల్లా, సూర్య రామిరెడ్డి, మురళి సోమిశెట్టి, శివ రాజవరపు, బి వెంకట సుబ్బా రెడ్డి , వాసు సింగారెడ్డి , వీరయ్య కట్టెపోగు, ఆంజనేయులు బిక్కా, మోహన్ పోలుబోయెన, అంజలి అవనిగడ్డ, మధుసూదన్ రెడ్డి పల్లె, అంజిరెడ్డి, వెంకట్ రెడ్డి ఎనుముల, శ్రీకృష్ణ రెడ్డి గరిస, కృష్ణమోహన్ రెడ్డి, సుధాకర్ కుప్పిరెడ్డి, కిషోర్ మారంరెడ్డి, హరీష్ గోరంట్ల, హరి ఆత్మకూరి, వెంకట్ మాగంటి, రాజేష్ యార్లగడ్డ , శ్రీమతి కల్పన జోసెఫ్, శివమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కెనడాలో.. కెనడాలోని టొరంటోలో వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ కమిటీ సభ్యులు కేక్ కట్ చేసి వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు అలూరు సాంబశివరెడ్డి, చల్లా మధుసూదన్ రెడ్డి, కార్తీక్ ఎల్లాప్రగడ, డాక్టర్ జగన్మోహన్ రెడ్డి, డాక్టర్ ప్రదీప్ చింతా, పార్టీ కెనడా కన్వినర్ వేణు చుక్కలూరు వర్చువల్‌గా పాల్గొన్నారు. టొరంటోలో జరిగిన కార్యక్రమంలో నరసింహ రెడ్డి గుట్టిరెడ్డి, చెన్న కేశవ, ప్రతాప్ బొల్లారం, ఆరిఫ్, నూర్, శ్రీనివాస్ రెడ్డి మరెక్కగారి, చంద్రహాస్ చల్లా, శాలిని బెక్కం, కృష్ణ రెడ్డి అల్లంపాటి, కృష్ణ చిదిరాల, శ్రీకాంత్ మద్దిరెడ్డి, రమేష్ తుంపర, సుబ్బా రావు, గుణశేఖర్ కొనపల్లి, విష్ణు వంగాల, కల్యాణ్ గుర్రంకొండ, శైలేష్ పాల్యం తదితరులు పాల్గొన్నారు. ఆస్ట్రేలియాలో.. ఆ్రస్టేలియాలోని బ్రిస్బేన్‌లో వైఎస్సార్సీపీ స్థానిక నాయకులు, అభిమానులు వైఎస్సార్ చిత్రపటానికి నివాళులు అరి్పంచారు. అనంతరం కేక్‌ను కట్ చేశారు. ఈ వేడుకల్లో బ్రహ్మరెడ్డి ఎరువూరి, కిషోర్, జస్వంత్ బొమ్మిరెడ్డి, వంశీ చాగంటి, శ్రీనివాసులు రెడ్డి, చిన్నప్ప, శౌర్య పాల్గొన్నారు. అలాగే, కందుల భరత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలోని అన్ని రాష్ట్రాల్లో వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నార్తన్ టెరిటోరీలోని డారి్వన్ నగరంలో కొమ్మిరెడ్డి చంద్ర శేఖర్ రెడ్డి, శివ హర్షవర్థన్ రెడ్డి వంగ, లక్ష్మణ్ రెడ్డి, రాఘవేంద్ర రావు, శ్యామ్ సుందర్ రెడ్డి, రవితేజ మదినేని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు పెర్త్‌లో జరిగిన కార్యక్రమంలో వంశీ కృష్ణా రెడ్డి, యశ్వంత్, సతీష్, త్రినాథ్, వినయ్, శరత్ తదితరులు పాల్గొన్నారు. మెల్బోర్న్లో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఆ్రస్టేలియా కన్వినర్ భరత్, విక్టోరియా కన్వినర్ కృష్ణా రెడ్డి, సహ కన్వినర్ రామాంజి, కోర్ టీమ్ సభ్యులు శిరీష, స్వాతి, యశు, బ్రహ్మ రెడ్డి, పవన్, సురేష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, అబ్దుల్, రవి వర్మ, తేరా జయవర్ధన్ రెడ్డి, శ్రీనాథ్, నితీష్, ప్రణీత్, రోహిత్, అభిషేక్, ఉదయ్, భార్గవ్, యశ్వంత్, దశరథ్ రెడ్డి, పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం గ్లోబల్ కో–ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి, పార్టీ నేతలు నూర్ ఫాతిమా, గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, కారుమూరి వెంకటరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని ప్రసంగించారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో వైఎస్సార్ జయంతి వేడుకలు -
దుబాయ్ భారత కాన్సులేట్‌లోకి ఇక నేరుగా నో ఎంట్రీ!
దుబాయ్‌లోని భారత కాన్సులేట్ పాస్‌పోర్ట్, వీసా, అటెస్టేషన్ తదితర కాన్సులర్ సేవల కోసం వాక్-ఇన్ ప్రవేశాన్ని నిలిపివేసింది. ఇకపై ముందస్తుగా ఆన్లైన్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నవారికే కాన్సులేట్‌లో ప్రవేశం కల్పించనున్నట్లు కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. కొత్తగా ప్రారంభించిన book.passportindiauae.com పోర్టల్ ద్వారా ధ్రువీకరించిన అపాయింట్మెంట్ తప్పనిసరిగా ఉండాలి.అబుదాబిలోని భారత రాయబార కార్యాలయంలో మాత్రం పరిమిత స్థాయిలో వాక్-ఇన్ సేవలు కొనసాగుతాయి. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఇటీవల దరఖాస్తుదారుల సంఖ్య భారీగా పెరగడంతో సేవలను క్రమబద్ధీకరించేందుకు ఈ మార్పులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.అపాయింట్మెంట్ స్లాట్లు ప్రతి రోజు రాత్రి 8 గంటలకు విడుదల చేయబడతాయి. అవి తదుపరి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్య సేవల కోసం చెల్లుబాటు అవుతాయి. అపాయింట్మెంట్ సమయానికి 15 నిమిషాల కంటే ముందుగా ప్రవేశం ఉండదని కాన్సులేట్ స్పష్టం చేసింది.రద్దీని తగ్గించేందుకు సాధారణంగా దరఖాస్తుదారులకే ప్రవేశం ఉంటుంది. అయితే ఇద్దరు తల్లిదండ్రులు హాజరు కావాల్సిన మైనర్ పిల్లల దరఖాస్తుల విషయంలో మినహాయింపు ఉంటుంది. దుబాయ్ కాన్సులేట్‌లో ప్రవేశం గేట్ నంబర్-1 ద్వారా కల్పించనున్నారు.నవజాత శిశువుల పాస్‌పోర్ట్ దరఖాస్తులు, అలాగే అత్యవసర ప్రయాణ పత్రం (ఎమర్జెన్సీ సర్టిఫికేట్) కోసం వచ్చే వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు వెల్లడించారు.దరఖాస్తుదారులు పూర్తిగా నింపిన ఫారమ్‌లు, అవసరమైన పత్రాలు, స్పష్టమైన ఫోటోలు, సంతకాలు/బొటనవేలు ముద్రలను ముందుగానే అప్లోడ్ చేసి రావాలని సూచించారు. పాస్‌పోర్ట్ దరఖాస్తులు అధికారిక పోర్టల్ mportal.passportindia.gov.in/mission లో సమర్పించవచ్చు.మరోవైపు, జూలై 1, 2026 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త పాస్‌పోర్ట్ ఫీజు నిర్మాణాన్ని కూడా కాన్సులేట్ గుర్తుచేసింది. ప్రస్తుతం వర్తించే ఫీజులు నగదు రూపంలో మాత్రమే స్వీకరిస్తున్నందున ఖచ్చితమైన చిల్లరతో రావాలని దరఖాస్తుదారులకు సూచించింది. -
ప్రజల హృదయాల్లో వైఎస్ చెరగని ముద్ర
సాక్షి, అమరావతి : మాట ఇస్తే మడమ తిప్పని నైజం.. కలిసిన ప్రతి ఒక్కరినీ పేరుతో పలకరింపు.. ఇలా ఎన్నో లక్షణాలు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని జననేతగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేశాయని వైఎస్సార్సీపీ జాతీయ అధికార ప్రతినిధి కార్తీక్ యల్లాప్రగడ కొనియాడారు. జర్మనీలోని ఇన్గాల్స్ట్యాట్ నగరంలో ఆదివారం వైఎస్ జయంతిని ఘనంగా నిర్వహించి భారీ కేక్‌ను కట్ చేశారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న కార్తీక్ మాట్లాడుతూ.. జన సంక్షేమమే ధ్యేయంగా.. ప్రాంతాలకతీతంగా అభివృద్ధి చెందాలనే తలంపు.. సాగునీటితోనే సమగ్రాభివృద్ధి అనే ప్రగాఢ విశ్వాసం.. ఇవన్నీ కలగలిపిన రూపం మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ప్రవాసాంధ్రులు మాట్లాడుతూ.. డాక్టర్ వైఎస్సార్ ఏపీ అభివృద్ధికి చేసిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. మరోవైపు.. వైఎస్ జగన్ కూడా తన ఐదేళ్ల పాలనలో తండ్రిని తలపించేలా పాలన అందించారని చెప్పారు. మాజీమంత్రి పేర్ని నాని, వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ కో–ఆర్డినేటర్ సాంబశివారెడ్డి వర్చువల్‌గా పాల్గొని మాట్లాడారు. జర్మనీ, ఐర్లాండ్, పోలాండ్, డెన్మార్క్, ఇటలీతో పాటు యూరప్‌లోని పలు దేశాల నుంచి వచ్చిన తెలుగు ప్రజలు ఈ వేడుకల్లో పాల్గొని వైఎస్సార్‌కు నివాళులర్పించారు. వైఎస్ ఆశయాలు, దార్శనికతను మరింత విస్తృతంగా ప్రచారం చేయాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ జర్మనీ కమిటీ అధ్యక్షుడు కృష్ణతేజారెడ్డి గడ్డం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నెదర్లాండ్స్ కన్వీనర్ శరత్‌రెడ్డి వంగా, ఐర్లాండ్ కన్వీనర్ ఆకేపాటి కిషోర్‌రెడ్డి సమన్వయకర్తలుగా వ్యవహరించారు. -
NRI: గాంధీ మెమోరియల్.. ఘనంగా అమెరికా 250 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకలు!
డాలస్, టెక్సస్: మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సస్ ఆధ్వర్యంలో డాలస్ పరిసర ప్రాంతమైన ఇర్వింగ్ నగరంలో నెలకొనిఉన్న అమెరికా దేశంలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద అమెరికాదేశపు 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అతి వైభవంగా జరిగాయి. ముఖ్యఅతిథిగా హాజరైన ఇర్వింగ్ నగర మేయర్ యాల్ జపంటా మాట్లాడుతూ - అమెరికా జనజీవన స్రవంతిలో భాగం అవుతూ, అర్వింగ్ నగర ప్రగతికి తోడ్పడుతున్న ప్రవాస భారతీయులకు కృతజ్ఞతలు, దేశంలో కెల్లా ప్రతిష్టాత్మకమైన గాంధీ స్మారకం ఇర్వింగ్ నగరంలో ఏర్పాటు చేసినందులకు ధన్యవాదములు అంటూ అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రత్యేకఅతిథిగా హాజరైన టెక్సాస్ రాష్ట్ర ప్రతినిధి మ్యాట్ షాహీన్ తన సందేశంలో ఎన్నో దశాబ్దాలగా టెక్సాస్ రాష్ట్రంలో స్థిరపడిన ప్రవాస భారతీయులు టెక్నాలజీ, విద్యా, వైద్య రంగాలలో తమ ప్రతిభను చూపుతూ రాష్ట్ర ఆర్ధికాభివృద్ధికి తద్వారా అమెరికా జిడిపి ఎదుగుదలలో భాగస్వాములవడం అభినందనీయం అని ప్రశంసించారు. 50 మందికి పైగా “స్వర స్వాతి సింగింగ్ గ్రూప్” చిన్నారులు అమెరికా జాతీయగీతంతో సహా అనేక అమెరికా దేశభక్తి పూర్వక గీతాలు ఆలపించడం ఆనందగా ఉందని, ఈ దేశ భవిష్యత్ ఈ యువత చేతిలోనే ఉందని శుభాకాంక్షలు తెలియజేశారు.మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ – “ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన ప్రజాస్వామ్య దేశాలలో ఒకటైన అమెరికా స్వాతంత్ర్యానికి 250 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఒక చారిత్రక ఘట్టం అన్నారు. ఈ రెండున్నర శతాబ్దాల ప్రయాణంలో అమెరికా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. తమ కలలను సాకారం చేసుకునేందుకు ప్రపంచంలోని అనేక దేశాల నుంచి వచ్చిన ప్రజలు వారితో పాటు తీసుకు వచ్చిన తమ భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు, ప్రతిభతో ఈ దేశాన్ని మరింత సుసంపన్నం చేశారు. భారతీయ మూలాలున్న అమెరికన్లకు విద్య, ఉపాధి, వ్యాపారం, శాస్త్ర సాంకేతిక రంగాలు, వైద్యం, ప్రజాసేవ ఇలా ప్రతి రంగంలోనూ ఎదగడానికి ఈ దేశం విశాలమైన అవకాశాలను కల్పించింది అందుకు కృతజ్ఞతలు అన్నారు.మన భారతీయ సంస్కృతిని, విలువలను కాపాడుకుంటూ మనం అమెరికా సమాజంలో భాగస్వాములవ్వాలి. స్వాతంత్ర్యం మనకు హక్కులను మాత్రమే ఇవ్వదు; బాధ్యతలను కూడా గుర్తు చేస్తుంది. మనకు లభించిన స్వేచ్ఛను గౌరవించండి. వైవిధ్యాన్ని ఆదరించండి. నిజాయితీని ఆచరించండి. మానవత్వాన్ని పెంపొందించండి. విభేదాలకంటే ఐక్యతను, స్వార్థం కంటే సేవాభావాన్ని, ద్వేషం కంటే ప్రేమను ఎంచుకుని ముందుకు సాగాలి అన్నారు.”మహాత్మాగాంధీ మెమోరియల్ బోర్డ్ సభ్యులు రావు కల్వల, తయాబ్ కుండావాలా, మహేంద్ర రావు, రాజేంద్ర వంకా వాలా, రాంకీ చేబ్రోలు, దీపక్ కార్లా, అనంత మల్లవరపు, ముర్తుజా భాయ్, సోనిట్ సింగ్, కలై కృష్ణమూర్తితో సహా అనేక సంఘాల ప్రతినిధులు అధికసంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.అమెరికా 250 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం ప్రత్యేక గీతాలతో పిల్లకు తర్ఫీదు ఇచ్చి, 50 మందికి పైగా చిన్నపిల్లలతో దేశభక్తి గీతాలను పాడించిన స్వర స్వాతి సింగింగ్ గ్రూప్ అధినేత స్వాతి కుప్పిలికి, సహకరించిన పిల్లల తల్లిదండ్రులకు, కార్యకర్తలకు, ముఖ్యఅతిథిగా హాజరైన ఇర్వింగ్ మేయర్ యాల్ జపంటా, ప్రత్యేకఅతిథి టెక్సస్ రాష్ట్ర ప్రతినిధి మ్యాట్ షాహీన్ కు రావు కల్వల ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. -
సిడ్నీలో ఘనంగా వైఎస్సార్ జయంతి
సాక్షి, అమరావతి: ఆస్ట్రేలియాలోని సిడ్నీలో శనివారం వైఎస్సార్ జయంతి ఘనంగా నిర్వహించారు. భారీ కేక్ కట్ చేసి అక్కడ ఉన్న తెలుగు వారందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ వైఎస్సార్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసి సేవలను, అభివృద్ధి, సంక్షేమ పథకాలను గుర్తు చేసుకొంటూ ఘనంగా నివాళి అర్పించారు. వైఎస్సార్ ఆశయ సాధన కోసం వైఎస్ జగన్ ఎంతో కృషి చేస్తున్నారని వైఎస్సార్సీపీ సిడ్నీ కన్వీనర్ అమరనాథ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా నేతలు రాజశేఖర్ లంకెల, శివ రెడ్డి, సిడ్నీ నాయకులు రామనాథ రెడ్డి చల్లా, పెద్ది రెడ్డి, చంద్ర మౌళి, గోపాల్ రెడ్డి, మల్లికార్జున రెడ్డి, దీపు సిరిపురం, కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు. -
పెళ్లికాని ఎన్నారై ‘ప్రసాదు’.. ‘స్పష్టత’ లేకుంటే ఎలా?
అతను అమెరికాలో స్థిరపడిన సాఫ్ట్వేర్ ఇంజనీర్, లక్షల్లో జీతం వస్తుంది, పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అవ్వాలనుకుంటున్నాడు... ఒక అమ్మాయికి వరుడిలో ఇంతకంటే ఏం కావాలి? కానీ ఆ 34 ఏళ్ల ఒక ఎన్నారై యువకుడికి మాత్రం భారతీయ అమ్మాయిల నుంచి వరుసగా తిరస్కరణలే ఎదురవుతున్నాయి. అతను ఎంత ప్రయత్నించినా ఏ సంబంధం కూడా ముందుకు సాగలేదు. దీనికి గల కారణాన్ని ప్రముఖ మ్యాచ్‌మేకర్, డేటింగ్ కోచ్ అయిన ఓంద్రిలా కపూర్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో వెల్లడించారు. ఆ వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.విదేశీ అమ్మాయిలు వద్దనుకుని..సదరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ భవిష్యత్తులో ఎలాగైనా భారతదేశానికి తిరిగి వచ్చి శాశ్వతంగా ఇక్కడే స్థిరపడాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఈ కారణంగా, అతను విదేశాలలో నివసిస్తున్న భారతీయ అమ్మాయిలతో డేటింగ్ చేయడం లేదా పెళ్లి చేసుకోవడం పూర్తిగా పక్కన పెట్టేశాడు. ఎందుకంటే, ఇప్పటికే విదేశాల్లో సెటిల్ అయిన అమ్మాయిలు తిరిగి భారతదేశానికి రావడానికి ఆసక్తి చూపరని అతను భావించాడు.ఇండియా అమ్మాయిలతో పెళ్లి పెటాకులు ఆ తర్వాత అతను భారతదేశంలో ఉంటున్న అమ్మాయిలతో మాట్లాడటం ప్రారంభించాడు. కానీ, ఆ సంభాషణలు కూడా రెండు మూడు నెలల్లోనే ఆగిపోయేవి. దీనిపై డేటింగ్ కోచ్ ఓంద్రిలా కపూర్ అతడిని ప్రశ్నించగా ఒక కీలక అంశం వెలుగులోకి వచ్చింది. తాను ఇండియాకు తిరిగి వచ్చేస్తానని అమ్మాయిలకు చెబుతున్నానని, కానీ ఎప్పుడు వస్తాననే కాలపరిమితిని మాత్రం స్పష్టంగా చెప్పడం లేదని అతను ఒప్పుకున్నాడు. ‘ఈ ఏడాది చివర్లో కావచ్చు, లేదా వచ్చే ఏడాది కావచ్చు.. అంతా ఆఫీస్ వర్క్ బట్టి ఉంటుంది’ అనే అతడి సమాధానమే ఇక్కడ పెద్ద సమస్యగా మారింది.స్పష్టత లేకపోవడమే అతిపెద్ద లోపం అబ్బాయి వైపు నుంచి అతను నిజాయితీగానే ఉన్నప్పటికీ, అమ్మాయిల కోణం నుంచి చూస్తే పరిస్థితి వేరేలా ఉంది. ఎప్పుడు ఇండియాకు వస్తాడో తెలియని, కనీసం ఒక్కసారి కూడా ముఖాముఖి కలవని వ్యక్తి కోసం నెలల తరబడి సమయాన్ని వృథా చేయడానికి అమ్మాయిలు ఇష్టపడలేదు. పైగా లాంగ్ డిస్టెన్స్ మ్యారేజ్ చేసుకోవాల్సి వస్తుందేమోనన్న భయం వారిని వెనక్కి తగ్గేలా చేసింది. కేవలం కెరీర్లో సక్సెస్ సాధించి, పెళ్లి పట్ల సీరియస్‌గా ఉంటే సరిపోదని, భవిష్యత్తు ప్రణాళికలపై కచ్చితమైన స్పష్టత లేకపోతే అది భాగస్వామికి అభద్రతాభావాన్ని కలిగిస్తుందని ఓంద్రిలా చెబుతున్నారు. -
అమెరికా వరదల్లో గల్లంతైన దేవరపల్లి యువకుడు
పర్చూరు (చినగంజాం): విద్య, ఉద్యోగ రీత్యా బాపట్ల జిల్లా నుంచి అమెరికా వెళ్లిన ఓ యువకుడు శనివారం ఉదయం అమెరికాలో సంభవించిన భారీ వర్షాల కారణంగా వరదల్లో చిక్కుకొని గల్లంతయ్యాడు. బాపట్ల జిల్లా పర్చూరు మండలం దేవరపల్లి గ్రామానికి చెందిన దొప్పలపూడి రాంబాబు పెద్దకుమారుడు దొప్పలపూడి వెంకటేష్ (33) విదేశాల్లో విద్యనభ్యసించేందుకు గతంలో అమెరికా వెళ్లాడు. చదువు పూర్తి చేసుకొని అక్కడే ఉద్యోగం పొంది ఓక్లహామా సిటీలో ఉంటున్నాడు. అమెరికాలోని కాన్సాస్ వెల్లింగ్టన్కు వెళ్లిన వెంకటేష్ అక్కడ కురిసిన భారీ వర్షాల కారణంగా వరదల్లో చిక్కుకుని ప్రవాహానికి కొట్టుకొనిపోయాడు. అతడు గల్లంతయిన విషయం శనివారం రాత్రి తల్లిదండ్రులకు తెలిసింది. -
కలెక్టర్ గారూ..అదే నా చివరి కోరిక!
94 ఏళ్ల బామ్మ భారతీయ పౌరసత్వం కోసం కలెక్టర్‌ని ఆశ్రయించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆమె తన శేష జీవితం భారతీయురాలిగా గడపాలంటూ ఆయన వద్దకు వెళ్లి చెప్పిన తీరు అందర్నీ తెగ ఆకట్టుకుంది. ఇంతకీ ఆమె కథేంటంటే..ఆ బామ్మే ఆంద్రప్రదేశ్‌కు చెందిన 94 ఏళ్ల కొండ్రగుంట మహాలక్ష్మమ్మ. భర్త మరణానంతరం ఆమె అమెరికాకు వెళ్లారు. ఆ సమయంలో కుమారుడు బుచ్చయ్య చౌదరి వర్జీనియాలోని పీటర్స్‌బర్గ్‌లో ఆంకాలజిస్ట్‌గా (క్యాన్సర్ వైద్య నిపుణుడిగా) పనిచేసేవారు. 2000 సంవత్సరంలో మహాలక్ష్మమ్మ అమెరికా పౌరురాలిగా మారారు. ఆమె అక్కడ సుమారు 18 ఏళ్లు నివసించారు. ఆ తర్వాత తన కుమారుడు మంగళగిరిలోని ఎన్నారై ఆస్పత్రిలో చేరడంతో ఆమె 2018లో తిరిగి భారతదేశానికి వచ్చారు. దాంతో ఆమెకు మళ్లీ భారతీయ పౌరురాలిగా మారాలనే కోరిక కలిగింది. ఈ ప్రక్రియ వేగంతంగా అవ్వాలని కోరుతూ మహాలక్ష్మమ్మ కలెక్టర్ గారిని కలిశారు. ఆయనతో బామ్మ "కలెక్టర్ గారు నాకు 95 ఏళ్లు నిండనున్నాయి. నా చివరి రోజులను నా మాతృభూమిలో భారతీయ పౌరురాలిగా గడపడమే నా ఏకైక కోరిక. నా అంత్యక్రియలు నా సొంత గ్రామంలోనే జరగాలని నేను కోరుకుంటున్నాను. నేను ఇప్పటికే నా అమెరికా పౌరసత్వాన్ని వదులుకున్నాను. దయచేసి నాకు వీలైనంత త్వరగా భారతీయ పౌరసత్వం లభించేలా సహాయం చేయండి." అని కోరింది. తాను ఈ దేశ చట్టాలను గౌరవిస్తానని, రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేసింది. కేవలం తన మిగిలిన జీవితాన్ని తన జన్మస్థలంలోనే గడిపేందుకు చట్టపరమైన అనుమతి ఇవ్వాలని స్థానికి అధికారులను కోరారు. దీనికి జిల్లా కలెక్టర్‌గారు స్పందిస్తూ..పౌరసత్వంపై తుది సిఫార్సును కేంద్ర అధికారులకు పంపే ముందు స్థానిక విచారణ వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని, ఆ తర్వాత ఈ అభ్యర్థనపై నిర్ణీత విధానాల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆ బామ్మకు హామీ ఇచ్చారు. (చదవండి: ఒకప్పుడు చనిపోవాలనుకున్నాడు..ఇవాళ ప్రపంచాన్నే చుట్టేసి రికార్డు..!) -
అమెరికాలో ఘనంగా ‘మాటా’ మహాసభలు
ఫిలడెల్ఫియా(అమెరికా): ఉత్తర అమెరికాలో తెలుగు సంస్కృతి, సేవా కార్యక్రమాలు, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలిచిన మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (MATA) 2వ మహాసభలు ఘనంగా జరిగాయి. పెన్సిల్వేనియాలోని గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్పో సెంటర్, ఫెయిర్‌గ్రౌండ్స్‌లో రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ వేడుకల్లో సినీ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. 7,500 మందికి పైగా తెలుగు కుటుంబాలు పాల్గొనడంతో ఉత్తర అమెరికాలోనే అతిపెద్ద తెలుగు సమ్మేళనంగా నిలిచింది.సినీ ప్రముఖులు ఈ వేడుకలను మరింతా కలర్ఫుల్గా మార్చారు. నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్య రాజేష్, దేవీశ్రీ ప్రసాద్, జయప్రద, సుమన్, అలీ, యాంకర్ సుమ, యాంకర్ ప్రదీప్ మాచిరాజు, విషి అయ్యర్ (హాలీవుడ్ నటుడు), శివారెడ్డి, అధిరే అభి, సునామి సుధాకర్, మిమిక్రీ రమేష్ తదితరులు తమ ఫార్మార్మెన్స్తో ఆహూతులను అలరించారు. గాయకుడు రామ్ మిర్యాల లైవ్ సంగీత ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తొలి రోజు హోస్ట్ గా యాంకర్ నిఖిల్ విజయేంద్ర సింహా, రెండవ రోజు యాంకర్ సుమ, యాంకర్ ప్రదీప్ హోస్ట్ గా వ్యవహరించి వేడుకలను మరింతా ఉత్తేజ పరిచారు.ఈ వేడుకల్లో ప్రముఖ నటి జయప్రదకు MATA లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం చేశారు. అలాగే ‘ప్రైడ్ ఆఫ్ ఇండియా’ అవార్డులను డాక్టర్ ఎం.ఎస్. రెడ్డి, డాక్టర్ హరినాథ్ పోలిచర్లలకు అందజేశారు. సమాజ సేవ, వ్యాపారం, కళలు, వైద్యం, ఆవిష్కరణలు తదితర రంగాల్లో విశిష్ట సేవలు అందించిన పలువురికి MATA ఎక్సలెన్స్ అవార్డులు ప్రదానం చేశారు. టీ.పీ. శ్రీనివాస్ రావు (బిజినెస్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్), భాస్కర్ గంటి (ఫిలాంత్రఫీ), సాయినాథ్ కర్నాటి (యంగ్ ఎంటర్ప్రెన్యూర్), స్వాతి అట్లూరి (ఆర్ట్స్ & కల్చర్), 24. దాము గేదల (కమ్యూనిటీ సర్వీస్), డా. విజయ భాస్కర్ బొల్గం (హ్యూమానిటేరియన్ సర్వీస్), నాగేశ్వరరావు పూజారి (ఫిల్మ్ కేటగిరీ), రాజు చామర్తి (గ్లోబల్ తెలుగు హెరిటేజ్), కృష్ణ మద్దిపట్ల (కమ్యూనిటీ సర్వీస్) అవార్డులు అందుకున్నారు.ఈ వేడుకల్లో సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (డీఎస్పీ) లైవ్ కాన్సర్ట్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ప్రపంచ స్థాయి ఆడియో-విజువల్ సాంకేతికత, లైటింగ్, నిర్వహణతో ఈ కార్యక్రమం స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది.ఈ మహాసభలు గ్రాండ్ బ్యాంక్వెట్‌తో ప్రారంభమయ్యాయి. తెలుగు, భారతీయ, అంతర్జాతీయ వంటకాలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక విందు ఆకట్టుకుంది. ప్రధాన మహాసభ మత సామరస్యానికి ప్రతీకగా ఇమామ్, క్రైస్తవ పాస్టర్, హిందూ పూజారి సంయుక్త ప్రార్థనలతో ప్రారంభమైంది. అనంతరం శ్రీ సీతారామ శోభాయాత్ర, భద్రాచల సీతారామ కళ్యాణ మహోత్సవం, పట్టాభిషేక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.ఈ మహాసభల్లో నాయకత్వం, వ్యాపారం, కృత్రిమ మేధస్సు (AI), మహిళా సాధికారత, వైద్యం, న్యాయం, రాజకీయాలు, సాహిత్యం, యువజన అభివృద్ధి వంటి అంశాలపై ప్రత్యేక ఫోరమ్‌లు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, సెలబ్రిటీ ఇంటరాక్షన్లు, నెట్వర్కింగ్ సెషన్లు, ఎగ్జిబిషన్లు విశేష ఆదరణ పొందాయి.MATA సింగింగ్ స్టార్ మహాసభలోని ప్రధాన సాంస్కృతిక ఆకర్షణల్లో ఒకటిగా నిలిచి, ఉత్తర అమెరికా నలుమూలల నుంచి 300 మందికి పైగా గాయకుల పాల్గొనడం విశేషం.MATA అధ్యక్షుడు రమణ కిరణ్ దుద్దాగి, కన్వీనర్ శ్రీధర్ గూడల నాయకత్వంలో, వ్యవస్థాపకులు, అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు శ్రీనివాస్ గణగోని, ప్రదీప్ సామల, అలాగే అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు జితెందర్ రెడ్డి మార్గదర్శకత్వంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. కో-కన్వీనర్లు టోనీ జన్ను, దాము గేదల, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గుడూరు, జనరల్ సెక్రటరీ విజయ్ భాస్కర్ కలాల్, కన్వెన్షన్ కోఆర్డినేటర్ కళ్యాణి బెల్లంకొండ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాగేశ్ చిలకపాటి, ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మహేందర్ నారాల, స్పిరిచ్యువల్, మెంబర్షిప్ డైరెక్టర్ శిరీష గుండపునేని, ప్రోగ్రామ్స్ డైరెక్టర్ స్వాతి అట్లూరి, అడిషనల్ సెక్రటరీ శ్రీధర్ పెంట్యాల, ఇండియా కోఆర్డినేటర్ డా. విజయ భాస్కర్ బొల్గం, పబ్లిసిటీ, మీడియా డైరెక్టర్ ప్రశాంత్ శ్రీపెరంబుదూరు, స్పోర్ట్స్ డైరెక్టర్ సురేష్ ఖాజానా, తదితరుల సేవలు మహాసభల విజయానికి కీలకమైన పాత్ర వహించాయని 'మాటా' నిర్వహకులు ప్రకటించారు.సేవ, సంస్కృతి, సమానత్వం అనే MATA ఆశయాలను ప్రతిబింబిస్తూ జరిగిన ఈ మహాసభలు ప్రపంచ తెలుగు సమాజ ఐక్యతకు నిదర్శనంగా నిలిచింది. -
మనతోనే ధైర్యలక్ష్మి
‘నువ్వు చేయలేవు’ అని ఎవ్వరైనా అంటే... ఆ పనిని చేసి నిరూపించడమే నా పని’ అంటారు తెలంగాణలోనిపాలకుర్తి వాసి ఝాన్సీరెడ్డి. అమెరికాలో పురుషాధిక్య రంగమైన రియల్ఎస్టేట్ రంగంలో రాణించి, ‘వెటా’ స్వచ్ఛంద సంస్థ ద్వారా అక్కడి తెలుగు మహిళల సాధికారతకు కృషి చేస్తున్నారు. పుట్టినగడ్డకు సేవలు అందిస్తూ, తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. నేటినుంచి ‘విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ (వెటా) ఇండియా’ ద్వారా ఈ సేవలు దేశవ్యాప్తం చేయనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఝాన్సీరెడ్డి పంచుకున్న విషయాలు...‘‘పురుషాధిక్య సమాజంలో మహిళ ఎప్పుడూ అణచివేతకు గురవుతూనే ఉంటుంది అది ఏ దేశమైనా. కానీ, మహిళలు తమ శక్తిని తెలుసుకుంటూ, సత్తా చూపుతూ, ప్రత్యేకతను చాటుతూనే ఉండాలి. అప్పుడే భావి తరాలకు ఉపయోగపడేలా మన జీవనవిధానం రూపుదిద్దుకుంటుంది. సాధారణంగా ఏదైనా పనిని ఎంచుకున్నప్పుడు దానిని పూర్తి చేసేదాకా వదలని స్వభావం నాది. ఆ స్వభావమే నన్ను అన్నింటా ముందుంచింది. అమెరికాలో తెలుగు మహిళల సమస్యల గురించి ఎన్నో విషయాలు తెలుస్తూ ఉండేవి.దేశం కాని దేశంలో తమ వారికి దూరంగా ఉంటూ వారు పడుతున్న బాధలు విన్నప్పుడల్లా ఆలోచించేదాన్ని. వారికి అండగా ఉండేందుకు ‘వెటా’ అనే స్వచ్ఛంద సంస్థను 2019లో ప్రారంభించాను. దీని ద్వారా తెలుగు మహిళల హక్కులు, న్యాయ సమస్యలు, సాధికారత కోసం వర్క్ చేశాను. దీంతోపాటు పుట్టిల్లు, అత్తిల్లు ప్రాంతాలైన ఖమ్మం, వరంగల్ జిల్లాలోనూ సేవాకార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చాను. విద్య, వైద్యకేంద్రాలకు భవనాలు, తాగునీటి ట్యాంకులు.. అవసరం ఎంత వరకు ఉందో గుర్తించి, ఆ దిశగా పనులు చేస్తూ వచ్చాను.అడ్డుకుంటే .. మరింత శక్తిగా...సేవాకార్యక్రమాలలో చురుగ్గా ఉండే నాకు అనుకోని అవాంతరం కలిగింది. ఖమ్మం జిల్లాలోని స్కూల్, కాలేజీ విద్యార్థినులకు ఉచిత శానిటరీ ΄్యాడ్స్ పంపిణీని ఏర్పాటు చేశాం. దానిని కొందరు పెద్దలు అడ్డుకున్నారు. పేరు ప్రఖ్యాతులు ఆశించి ఈ పనులు చేస్తున్నారు అన్నారు. ఆడపిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్న ఓ మంచి పనికి రాజకీయ రంగు పులమడం బాధగా అనిపించింది. నా వరకు నేను అమెరికా నుంచి వర్క్ చేస్తున్నాను. కానీ,‘మంచి పనులకు కూడా అడ్డు పడుతుంటారా..’ అనేది నన్ను ఆలోచించేలా చేసింది. మహిళలు ఎక్కడైనా మహిళలే. అన్నిచోట్లా, అన్నివిధాలా, అన్నిరంగాలలోనూ వివక్షకు లోనవుతూనే ఉన్నారు. ఈ సమస్యను అధిగమించడానికి ‘వెటా’(విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ ఫర్ ఇండియా)ను విస్తృతం చేయాలనుకున్నాను. దాంట్లో భాగంగా అమెరికా నుంచి పూర్తిగా ఇండియాకు వచ్చేశాను.మరింత విస్తృతంగా..నా భర్త అమెరికాలో కార్డియాలజిస్ట్. ముగ్గురు కొడుకులూ వారి వారి జీవితాల్లో స్థిరపడ్డారు. చిన్నకొడుకు, కోడలు మినహా మిగతా అందరూ అమెరికాలోనే ఉన్నారు. పుట్టిన ప్రాంతానికి సేవలు అందించాలనే ఉద్దేశాన్ని వాళ్ల ముందుంచినప్పుడు ‘తమ పూర్తి మద్దతును ఇస్తామ’న్నారు. నా స్వశక్తినే పెట్టుబడిగా ఈ రోజు ‘వెటా’ ద్వారా సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నాం.దీంట్లో బాలికావిద్య, వైద్యం, మహిళల వృత్తి, ఉద్యోగాలలో స్థిరపడేలా చూడటం .. ముఖ్యమైనవి. బాలికల విద్య పట్ల వారి తల్లిదండ్రుల్లో అవగాహన తీసుకురావడం, కేంద్ర, రాష్ట్ర పథకాలు సవ్యంగా అందేలా చూడటం, మహిళ సాధికారత వెటా ముఖ్య ఉద్దేశం. దీనికి 300 మంది ఒక టీమ్‌గా ఏర్పడి పనులు చేయనున్నారు. మొదట తెలంగాణ మొత్తంగా జిల్లా, మండలస్థాయిలో ‘వెటా’ ద్వారా నూటికి నూరుశాతం సేవలు అందేలా చూస్తాం. కూతురుగా, భార్యగా, తల్లిగా.. మహిళలకు ఏ దశలో సమస్యలు ఎక్కువగా ఉన్నాయో గుర్తించి, వారికి చేయూతను అందివ్వడం ‘వెటా’ లక్ష్యం.సాధ్యం కానిదంటూ ఏమీ లేదు...నా విషయానికే వస్తే.. పదేళ్ల వయసులో తండ్రిని కోల్పోయాను. పెద్దనాన్నతోపాటు దేశం దాటి వెళ్లి పోయాను. ఎలా ఉండాలో తెలియని ప్రాంతంలో అక్కడి వాతావరణానికి తగ్గట్టు నన్ను నేను మలుచుకున్నాను. టెన్ ్త పూర్తయ్యాక సెలవుల్లో ఇండియాకు వచ్చినప్పుడు పదహారేళ్ల వయసులోనే పెళ్లి అయింది. నా భర్త డాక్టర్‌గా న్యూజెర్సీలో ప్రాక్టీస్ చేశారు. పెళ్లయ్యింది కాబట్టి ఇక ఇంట్లోనే కూర్చోవచ్చు కదా అనుకోలేదు. చదువుకుంటూనే ఉద్యోగం చేసేదాన్ని. ఏ దేశం లో ఉన్నా భార్యాభర్త ఇద్దరూ పనిచేస్తేనే వారి జీవితాలు కూడా వృద్ధిలోకి వస్తాయని నమ్ముతాను.అలా ప్లస్ టూ పూర్తవగానే బ్యాంకింగ్ రంగంలోకి వెళ్లాను. కానీ, పై చదువులు చదవాలన్న ఆసక్తితో సాయంత్రాలు చదువుకుంటూ, పగటివేళ ఉద్యోగం చేశాను. పిల్లలు పుట్టడంతో వారి బాగోగులు చూసుకునే క్రమంలో ఉద్యోగానికి ఫుల్స్టాప్ పడింది. అయినా ఖాళీగా లేకుండా మా వారి హాస్పిటల్ నిర్మాణాన్ని దగ్గరుండి చూసుకున్నాను. దీనివల్ల వచ్చిన అనుభవంతో రియల్ ఎస్టేట్ రంగంలోకి మారాను. పురుషాధిక్య రంగం అది. అయినా, వెనకంజ వేయలేదు. ఈ రంగంలోనూ నన్ను నేను వ్యాపారవేత్తగా నిరూపించుకున్నాను. చాలామంది అంటుంటారు డబ్బు ఉంటే ఏమైనా చేయవచ్చు అని. కానీ, ఉండాల్సింది మనో ధైర్యమే. చేయాల్సిన పని పట్ల నిబద్ధత, భవిష్యత్తు పట్ల ఫోకస్.. ఇవే మన విధిని నిర్దేశిస్తాయి. నా వరకు నేను సంపాదించేవారు ఉన్నారు కదా అని ఇంట్లో కూర్చోలేదు. నాకు నేనుగా సంపాదించుకున్న ఒక్క డాలర్ మిలియన్ డాలర్లతో సమానంగా భావించేదాన్ని. అందుకే ఏనాడూ ఖాళీగా లేను.ఉద్యోగినిగా, గృహిణిగా, ముగ్గురు పిల్లల తల్లిగా, వ్యాపారవేత్తగా.. నాపాత్రలకు సముచిత న్యాయం చేస్తూనే ఈ రోజు నా సాటివారికి చేయూతగా నిలుద్దామని మీ ముందుకు వచ్చాను. స్త్రీని లక్ష్మితో పోలుస్తారు. ధైర్యలక్ష్మి మనతో ఉంటే అన్నీ ఉన్నట్టే. మనతోపాటు మరికొంతమందిని వృద్ధిలోకి తీసుకురాగలం’’ అంటూ చేస్తున్న సేవాకార్యక్రమాలు, వాటి అమలు గురించి వివరించారు ఆమె.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: అనిల్ కుమార్ మోర్ల -
డాలర్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు
న్యూఢిల్లీ: ప్రవాస భారతీయుల నుంచి డాలర్లను ఆకర్షించే దిశగా కొత్త ఎఫ్సీఎన్ఆర్ (బి) డిపాజిట్లపై బ్యాంకులకు ఆర్బీఐ డాలర్–రూపీ ఫారెక్స్ స్వాప్ సదుపాయాన్ని ప్రకటించిన నేపథ్యంలో బ్యాంకులు సదరు ఖాతాలపై రేట్లను సవరించాయి. ఈ డిపాజిట్లపై బంధన్ బ్యాంక్ ఆకర్షణీయ వడ్డీ రేట్లను ప్రకటించింది. 3 నుంచి 5 ఏళ్ల వ్యవధికి 1 మిలియన్ డాలర్లకు పైగా డిపాజిట్లపై 7.1 శాతం వడ్డీ రేటు ఉంటుందని బ్యాంకు తెలిపింది. 1 మిలియన్ డాలర్ల వరకు డిపాజిట్లపై 7 శాతం ఉంటుందని పేర్కొంది. రూపాయి క్షీణతపరమైన రిసు్కలను అధిగమించి మెరుగైన రాబడులను అందుకునేలా ఎన్ఆర్ఐ కస్టమర్లకు ఇది సహాయకరంగా ఉంటుందని బ్యాంక్ ఈడీ రాజీందర్ కుమార్ బబ్బర్ తెలిపారు.మరోవైపు, బ్యాంక్ ఆఫ్ బరోడా .. తమ లెజెండ్ ఎఫ్సీఎన్ఆర్ (బి) డిపాజిట్ స్కీము కింద డాలర్ డిపాజిట్లపై 6.25 శాతం వరకు, బ్రిటీష్ పౌండ్ స్టెర్లింగ్ .. ఆస్ట్రేలియన్ డాలర్‌పై 4.75 శాతం, యూరో డిపాజిట్లపై 3.75 శాతం, కెనడియన్ డాలర్ డిపాజిట్లపై 5.15 శాతం వడ్డీ రేట్లను ప్రకటించింది. ఇవి మూడు నుంచి ఐదేళ్ల కాలవ్యవధికి వర్తిస్తాయి. అటు ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా ఈ డిపాజిట్లపై వడ్డీ రేటును 7.13 శాతం వరకు పెంచినట్లు తెలిపింది. ఇక సౌత్ ఇండియన్ బ్యాంక్ ఎఫ్సీఎన్ఆర్ (బి) డిపాజిట్లపై 6.50 శాతం వరకు వడ్డీ రేట్లు ఇస్తున్నట్లు వెల్లడించింది.సాధారణంగా ఈ విధానంలో ప్రవాస భారతీయులు డాలర్ల మారకంలో ఎఫ్సీఎన్ఆర్ (బి) ఖాతాలో డిపాజిట్ చేస్తారు. ఆ డాలర్లను సదరు బ్యాంకు నిర్దిష్ట రిఫరెన్స్ రేటుకు ఆర్బీఐకి విక్రయించి, రూపాయి మారకంలో నిధులు సమకూర్చుకుంటుంది. మెచ్యూరిటీ సమయంలో మళ్లీ అదే రేటుకి ఆర్బీఐ నుంచి డాలర్లను తిరిగి కొనుగోలు చేస్తుంది. ఈ క్రమంలో రూపాయి బలహీనపడితే బ్యాంకు నష్టపోకుండా ఆర్బీఐ ఆ రిసు్కను భరిస్తుంది. -
అమెరికాలో తెలంగాణా విద్యార్థి అరుణ్ సాయి రెడ్డి హఠాన్మరణం
మరో తెలుగు విద్యార్థి డాలర్ డ్రీమ్స్ చెదిరిపోయాయి. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలంగాణకు చెందిన అరుణ్ సాయిరెడ్డి బొల్లెందుల (26) ప్రాణాలు కోల్పోయాడు. అనారోగ్యంతో ఆకస్మికంగా కన్నుమూశాడు. దీంతో బాధిత కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.మహబూబ్‌నగర్‌కు చెందిన అరుణ్ సాయిరెడ్డి (జననం: ఆగష్టు 21, 1999) వెంకట్ రెడ్డి, సరళా దంపతుల ఏకైక కుమారుడు. అరుణ్ ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు. చదువు పూర్తి చేసుకున్న తర్వాత ఫ్లోరిడాలోని టెంపా నగరంలో ఉంటూ, స్టెమ్ ఓపీటీ (STEM OPT)లో భాగంగా ప్రాక్టికల్ ట్రైనింగ్ పొందుతున్నాడు. అంతలోనే అతని అకాల మరణం కుటుంబాన్ని, స్నేహితులను తీవ్ర దిగ్భ్రాంతికి, దుఃఖానికి గురిచేసింది. అతని పార్థివ దేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు గాను నిధుల సేకరణ కార్యక్రమం ప్రారంభించారు. -
గల్ఫ్‌లో పర్యటించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ సుముఖత
హైదరాబాద్: గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల ఓటు హక్కుల పరిరక్షణపై మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ ప్రతినిధులు ఆదివారం చర్చించారు. తెలంగాణ రాష్ట్ర 'గల్ఫ్ కాంగ్రెస్' ప్రతినిధి సుతారి సత్యనారాయణ పటేల్, తెలంగాణ రాష్ట్ర ఎన్నారై అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి ఆదివారం హుస్నాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిశారు. సమగ్ర ఓటరు జాబితా సవరణ (సర్) కార్యక్రమం వేళ.. విదేశాల్లో నివసిస్తున్న గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల పేర్లు ఓటర్ల జాబితాలో కొనసాగింపునకు తీసుకోవాల్సిన చర్యలపై పొన్నం ప్రభాకర్ తో వారు చర్చించారు.ఈ సందర్భంగా విదేశాల్లో ఉన్న తెలంగాణకు చెందిన గల్ఫ్ కార్మికులు, ఎన్నారైలు తమ ఓటరు నమోదును కొనసాగించుకునేలా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరాన్ని వారు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా ఆన్లైన్ జూమ్ సమావేశాలు, సోషల్ మీడియా వేదికల ద్వారా ఓటరు నమోదు, సవరణ ప్రక్రియలపై అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.ఈ ప్రతిపాదనలను మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్వీకరించినట్లు వారు తెలిపారు. అలాగే తెలంగాణకు చెందిన ప్రవాస భారతీయులు, గల్ఫ్ కార్మికులతో ప్రత్యక్షంగా మమేకమయ్యేందుకు గల్ఫ్ దేశాల్లో పర్యటించాల్సిందిగా మంత్రిని ఆహ్వానించారు. స్వయంగా గల్ఫ్ దేశాల్లో పర్యటించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ సుముఖత వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాస తెలంగాణ వాసుల పాత్ర ఎంతో కీలకమని, వారి సమస్యల పరిష్కారం, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. -
పోలీసులకు ఫిర్యాదు చేసినా.. చర్యలు తీసుకోవడం లేదంటూ
హస్తినాపురం: ఉన్నత చదువుల కోసం ఫిన్లాండ్ వెళ్లిన నగర విద్యార్థి అదృశ్యమయ్యాడు. 45 రోజులు గడుస్తున్నా ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీటీ పర్యంతమవుతున్నారు.వనస్థలిపురం వైదేహి నగర్‌కాలనీకి చెందిన మర్ణత, ముత్యంరెడ్డిల కుమారుడు మణిదీప్‌రెడ్డి ఫిన్లాండ్ లోని ఎల్‌యూటీ యూనివర్సిటీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గత నెల 4న తల్లిదండ్రులతో చివరిసారిగా మాట్లాడిన మణిదీప్ మే 5 నుంచి ఫోన్‌చేసినా స్పందించడం లేదు. దీంతో కుటుంబ సభ్యులలో ఆందోళన మొదలైంది. ఫిన్లాండ్లోని కుమారుడి స్నేహితులు, తెలిసిన వారిని నివాస ప్రాంతానికి, కాలేజీకి పంపించినా ఎలాంటి సమాచారం లభించకపోవడంతో అక్కడ మణిదీప్‌రెడ్డి అదృశ్యమైనట్లు కేసు నమోదు చేశారు. ఇప్పటికైనా తమ కుమారుడు మణిదీప్రెడ్డిని క్షేమంగా తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, అధికారులను తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశంఫిన్లాండ్లో తమ కుమారుడి అదృశ్యంపై తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదంటూ మణిదీప్‌రెడ్డి తల్లిదండ్రులు జి.మర్ణత, ముత్యంరెడ్డిలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో అదృశ్యంపై వివరణ ఇవ్వాలంటూ కేంద్రానికి హైకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. మణిదీప్‌రెడ్డి అదృశ్యంపై ఇచ్చిన ఫిర్యాదుపై తీసుకున్న చర్యలు వివరించాలంటూ కేంద్రం, ఫిన్లాండ్లోని భారత రాయబార కార్యాలయం, తెలంగాణ పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. న్యాయమూర్తి విచారణను ఈనెల 24కు వాయిదా వేశారు. -
వయసు 39, రూ. 46 కోట్లు ఆస్తి.. రిటైర్మెంట్ తీసుకోవచ్చా?
సోషల్ మీడియా పుణ్యమా అని తమకెదురైన ప్రతి సమస్యను షేర్ చేసుకుంటూ సలహాలు సూచనలు పొందడం ఓ ట్రెండ్‌గా మారింది. ఒకరకంగా దీనివల్ల ఇతరుల ఎంత పెద్ద సమస్యలు ఫేస్ చేస్తున్నారో తెలియడమేగాక, వ్యక్తిగతంగా ఒక సమస్యకు ఎలా సంయమనంగా ఓపిగ్గా ఉండాల్లో తెలుసుకునే వీలు లభించడం విశేషం. అలానే ఈసారి నెట్టింట వైరల్ అవుతున్న ఓ ఎన్నారై రెడిట్ పోస్ట్ నెటిజన్లను అమితంగా ఆకర్షించడమే కాదు ఆలోచింప చేస్తోంది. ఇంతకీ అందులో ఏముందంటే..ఆ ఎన్నారై రెడిట్ పోస్ట్‌లో ఇలా ఉంది. తన వయసు 39 ఏళ్లు అని, తాను దాదాపు 15 ఏళ్లుగా విదేశాల్లో పనిచేస్తున్నట్లు పోస్టులో రాసుకొచ్చాడు. తాను ప్రేమించి పెళ్లి చూసుకున్నానని, తామిద్దరం ఉద్యోగాల్లో మంచి ఉన్నతిని సాధించామని, సుమారు 46 కోట్లు ఆస్తులు ఉన్నాయని వెల్లడించారు. అయితే ఇటీవల తన భార్య కేన్సర్ బారిన పడిందని, ప్రస్తుతం ఆ వ్యాధి మరింతగా ముదిరిందని రాసుకొచ్చారు. తమకు పిల్లలు కూడా లేరని అన్నారు.దాదాపు ఐదేళ్లుగా తర భార్య కేన్సర్‌తో పోరాడుతున్నట్లు తెలిపారు. ఇప్పుడిదంతా ఎందుకంటే.. ఒకవేళ ఆమె ఆరోగ్యం క్షీణించి.. దాంతో మానసికంగా అలిసిపోయి ఇక పనిచేయకూడదు రిటైర్మెంట్ తీసుకోవాలి అనుకుంటే.. భారత్‌లో జీవించడానికి తన వద్ద ఉన్న ఆ రూ. 46 కోట్ల ఆస్తి సరిపోతుందా అని ప్రశ్నించాడు. అందుకు నెటిజన్ల నుంచి ఆచరణాత్మక ఆర్థిక సలహాలతో పాటు వ్యక్తిగత ధైర్యాన్ని నింపే సలహాలు సూచనలు కూడా అందించారు.వినడానికి బాధగా ఉన్నా.. తక్షణమే ఉద్యోగానికి రిజైన్ చేసి ఆమె చెంతే ఉండండి. మంచి వైద్యం అందించేలా ప్రముఖ వైద్యులను కలిసి సలహాలు సూచనలు తీసుకోండి. భారత్‌లో మెట్రో నగరాల్లో జీవించాలనుకున్నా అంత మొత్తం సరిపోతుందని అన్నారు. అంతేగాదు మీ భార్య కోసం చేయగలిగిందంతా ఇప్పుడే చేయండి. ఇది ఆర్థిక భద్రతకు సంబంధించింది కాదు.. అంతకుమించిన బంధానికి, భావోద్వేగానికి సంబంధించిందంటూ పోస్టులు పెట్టడం గమనార్హం.చదవండి: జీ7 సదస్సులో తొమ్మిదేళ్ల చిన్నారి..! పాపం కెమెరా కంట పడకూడదని.. -
న్యూయార్క్ టూర్ విషాదం : తల్లిని కాపాడబోయి యువకుడు దుర్మరణం
అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని ప్రసిద్ధ సెంట్రల్ పార్క్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గుర్రపు బగ్గీ నుండి కింద పడి పోయిన తల్లిని రక్షించే ప్రయత్నంలో ఒక భారతీయ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. గుర్రం అదుపు తప్పి ఒక్కసారిగా వేగంగా పరిగెత్తడంతో ఈ ప్రమాదం జరిగింది.'ది న్యూయార్క్ టైమ్స్' ప్రకారం కుటుంబంతో కలిసి న్యూయార్క్‌కు మొదటిసారి విహారయాత్రకు వచ్చిన 18 ఏళ్ల రోమాంచ్ మహాజన్‌కు బుధవారం జీవితంలోని మర్చిపోలేని శోకాన్ని మిగిల్చింది. కుటుంబ ఫోటో తీసుకోవడానికి డ్రైవర్ బండిని ఆపిన వెంటనే, గుర్రం ఒక్కసారిగా అదుపు తప్పి పరిగెత్తడం మొదలుపెట్టింది. అది వేగంగా దూసుకెళ్లి ఫుట్‌పాత్ ఎక్కి, గడ్డి ఉన్న ప్రదేశంలోకి దూసుకెళ్లింది. ‘‘రక్షించండి, రక్షించండి’’ అని అరుస్తూనే ఉన్నామని రోమాంచ్ తండ్రి దీపక్ మహాజన్ వాపోయారు. అందరమూ ఒకర్నొకరు గట్టిగా పట్టుకున్నప్పటికీ తన భార్య ప్రియ బగ్గీ నుండి కింద పడి పోవడంతో, ఆమెను రక్షించడానికి రోమాంచ్ కిందకు దూకి చనిపోయాడని కన్నీటి పర్యంతమయ్యాడు.కిందకు దూకిన రోమాంచ్ తల నేలకు బలంగా తగలడంతో అక్కడికక్కడే స్పృహతప్పి పడిపోయాడు. బుధవారం రాత్రి న్యూయార్క్-ప్రెస్బిటేరియన్ వీల్ కార్నెల్ మెడికల్ సెంటర్లో చికిత్సపొందుతూ చని పోయాడు. రోమాంచ్ తండ్రి తల్లి , తమ్ముడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. టావెర్న్ ఆన్ ది గ్రీన్ అనే హోటల్లో పనిచేసే టాటియానా బ్రెస్లర్ న్యూయార్క్ పోస్ట్‌తో మాట్లాడుతూ, గుర్రం భయంతో చాలా వేగంగా పరుగెత్తిందని, వెంటనే తాము 911కి ఫోన్ చేశారు. బగ్గీ బోల్తా పడకముందే ఒక ప్రత్యక్ష సాక్షి ఆ గుర్రాన్ని కట్టడి చేశాడని బ్రెస్లర్ తెలిపారు.ఇదీ చదవండి : 60 ఏళ్లకి లవ్, 75 రోజులకే పెళ్లి : నటి లవ్ స్టోరీగుర్రపు బగ్గీలతో జరుగుతున్న వరుస ప్రమాదాల్లో ఇది తాజాది. ఈ ప్రమాదంతో పార్కులో గుర్రపు బగ్గీలను నిషేధించాలనే డిమాండ్లు మళ్లీ ఊపందుకున్నాయి. బగ్గీ డ్రైవర్ల యూనియన్ కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసింది. గత ఏడాది మే నుండి పార్క్ లేదా దాని పరిసరాల్లో గుర్రాలకు సంబంధించిన ప్రమాదాలు ఎనిమిది జరిగాయని, గత నెలలో కూడా ఒక గుర్రం మరో బగ్గీని ఢీకొట్టడంతో అది బోల్తా పడిందని పార్క్ కన్సర్వెన్సీ తెలిపింది. సదరు డ్రైవర్‌ను యజమాని నిరవధికంగా సస్పెండ్ చేశారు.ఇదీ చదవండి: మాస్కోపై డ్రోన్లతో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ : తీవ్ర ఉద్రిక్తత -
ఎన్నారైల బ్యాంక్ డిపాజిట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం
భారత ఆర్థిక వ్యవస్థకు విదేశీ మారకద్రవ్య ప్రవాహాలను పెంచే దిశగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నారైలు (NRIs), ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (OCIs) నుంచి అధిక మొత్తంలో డిపాజిట్లను ఆకర్షించేందుకు ఎంపిక చేసిన నాన్-రెసిడెంట్ ఎక్స్టర్నల్ (NRE), ఫారిన్ కరెన్సీ నాన్-రెసిడెంట్ [FCNR(B)] డిపాజిట్లపై అమలులో ఉన్న వడ్డీ రేటు పరిమితులను తాత్కాలికంగా తొలగించింది. ఈ సడలింపు 2026 సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది.ఆర్బీఐ తాజా మార్గదర్శకాల ప్రకారం.. మూడు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలపరిమితి గల తాజా ఎన్ఆర్ఈ డిపాజిట్లపై బ్యాంకులు తమ అవసరాలకు అనుగుణంగా అధిక వడ్డీ రేట్లు ప్రకటించవచ్చు. అలాగే మూడు నుంచి ఐదు సంవత్సరాల కాలపరిమితి గల కొత్త ఎఫ్‌సీఎన్‌ఆర్‌బీ డిపాజిట్లపై కూడా ఇప్పటివరకు ఉన్న వడ్డీ పరిమితులు వర్తించవు. ఈ సడలింపు కొత్తగా సమీకరించే డిపాజిట్లకే కాకుండా, మెచ్యూరిటీ అనంతరం పునరుద్ధరించే అర్హత గల డిపాజిట్లకు కూడా వర్తిస్తుంది.ఇప్పటి వరకు ఎన్ఆర్ఈ డిపాజిట్లపై వడ్డీ రేట్లు సమాన కాలపరిమితి గల దేశీయ రూపాయి టర్మ్ డిపాజిట్ల కంటే ఎక్కువగా ఉండకూడదనే నిబంధన అమల్లో ఉండేది. అలాగే ఎఫ్‌సీఎన్‌ఆర్‌బీ డిపాజిట్లపై కూడా నిర్దిష్ట పరిమితులు ఉండేవి. ఇప్పుడు ఆ పరిమితులు తొలగించడంతో బ్యాంకులు ఎన్నారై డిపాజిట్ల కోసం మరింత పోటీగా వడ్డీ రేట్లు ప్రకటించే అవకాశం ఏర్పడింది.ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి, ముడి చమురు ధరల పెరుగుదల, విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి వంటి అంశాల నేపథ్యంలో విదేశీ కరెన్సీ ప్రవాహాలను పెంచేందుకు ఆర్బీఐ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే ఈ నెల ప్రారంభంలో మూడు నుంచి ఐదు సంవత్సరాల కాలపరిమితి గల తాజా ఎఫ్‌సీఎన్‌ఆర్‌బీ డిపాజిట్లకు సంబంధించిన పూర్తి హెడ్జింగ్ వ్యయాన్ని తానే భరిస్తామని కూడా ప్రకటించింది. అంతేకాకుండా ఈ డిపాజిట్లను సీఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ నిబంధనల నుంచి కూడా తాత్కాలికంగా మినహాయించింది.మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం.. ఇప్పటికే పలు బ్యాంకులు అమెరికన్ డాలర్ ఆధారిత ఎఫ్‌సీఎన్‌ఆర్‌బీ డిపాజిట్లపై 6 శాతం నుంచి 7 శాతం వరకు వడ్డీ రేట్లను ప్రకటించాయి. చిన్న, మధ్య తరహా బ్యాంకులు డిపాజిట్ల కోసం మరింత ఆకర్షణీయమైన రేట్లు ప్రకటించే అవకాశముందని బ్యాంకింగ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, ఎన్ఆర్వో ఖాతాల నుంచి ఎన్ఆర్ఈ ఖాతాలకు బదిలీ చేసిన నిధులకు ఈ ప్రత్యేక మినహాయింపు వర్తించదని ఆర్బీఐ స్పష్టం చేసింది. -
ఫిన్లాండ్లో విద్యార్థి మణిదీప్ రెడ్డి మిస్సింగ్
ఉన్నత విద్య కోసం ఫిన్లాండ్కు వెళ్లిన ఓ భారతీయ విద్యార్థి అదృశ్యమవడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ హైదరాబాద్‌కు చెందిన మణిదీప్ అనే యువకుడు దాదాపు నెలరోజులకు పైగా కనిపించకుండా పోయాడు. అతని నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కాలేజీ యాజమాన్యాన్ని సంప్రదించినా సరైన సమాధానం లభించకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.హైదరాబాద్‌కు చెందిన మణిదీప్ రెడ్డి గుజ్జా ఉన్నత చదువుల కోసం ఫిన్లాండ్కు వెళ్లాడు. లాహ్టి (Lahti) నగరంలో ఉన్న ఎల్‌యూటీ యూనివర్సిటిలో విద్యను అభ్యసిస్తున్నాడు. అయితే మే నెల 5వ తేదీ నుంచి కుటుంబ సభ్యులకు అందుబాటులో లేకపోయినట్లు తెలుస్తోంది. ఫోన్, సోషల్ మీడియా సహా ఏ మార్గంలోనూ అతనితో సంప్రదింపులు జరగకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.మణిదీప్ అదృశ్యమైన విషయం గురించి కాలేజీ యాజమాన్యాన్ని, సిబ్బందిని పలుమార్లు సంప్రదించినప్పటికీ స్పష్టమైన సమాచారం ఇవ్వలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థి గల్లంతైన విషయంపై కాలేజీ నుంచి కూడా ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని వారు చెబుతున్నారు.ఇప్పటికే పలు మార్గాల్లో అతడి ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్న కుటుంబ సభ్యులు, భారత విదేశాంగ శాఖతో పాటు ఫిన్లాండ్లోని భారత రాయబార కార్యాలయం జోక్యం చేసుకుని తమ కుమారుడి ఆచూకీ కనుగొనాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నెల 12వ తేదీనే హైదరాబాద్‌కు చెందిన ఓ లాయర్ మణిదీప్ మిస్సింగ్ మీద ఓ ట్వీట్ చేయడం గమనార్హం.. 🚨 MISSING IN FINLAND 🇫🇮Manideep Reddy Gujja has been missing in Finland.Family and friends are urgently seeking any information regarding his whereabouts.📍 Last Contacted: May 5, 2026🎓 University: LUT University📍 City: Lahti, FinlandContact +91 78932 87099— Nipun Tulsyan (@NipunTulsyan) June 12, 2026 -
మిస్సోరి విమాన ప్రమాదం : మృతుల్లో తెలుగు టెకీ సాయి కార్తీక వర్మ
వాషింగ్టన్: అమెరికాలో జరిగిన ఒక ఘోర విమాన ప్రమాదం ఘటనలో భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దుర్మరణం పాలైన ఘటన తీవ్ర దిగ్భ్రాంతి రేపింది. అమెరికాలోని మిస్సోరి (Missouri) రాష్ట్రంలో స్కైడైవింగ్ విమానం కుప్పకూలిన ప్రమాదంలో 24 ఏళ్ల భారతీయ సాఫ్ట్వేర్ ఉద్యోగి సాయి కార్తీక్ వర్మ దాట్ల కూడా ఉన్నారని అధికారులు ప్రకటించారు. ఈ ప్రమాదంలో మరణించిన మొత్తం 12 మందిలో ఆయన ఒక్కరే భారతీయుడు.ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాయి కార్తీక్ వర్మ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. అక్కడ 'యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిస్సోరి' నుండి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి, కాన్సాస్ సిటీలో హెల్త్‌కేర్ టెక్నాలజీ రంగంలో పనిచేస్తున్నారు. గతంలో కాప్జెమినీ (Capgemini) లో పనిచేసిన ఆయన, ప్రస్తుతం అడ్వెంట్‌హెల్త్ (AdventHealth) సంస్థలో క్లౌడ్ మైగ్రేషన్, ఆటోమేషన్ ప్రాజెక్టులపై పనిచేస్తున్నారు. ఇదీ చదవండి : రూ. 14 వేల నుంచి రూ. 10 లక్షల స్కాం : ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వార్నింగ్కాన్సాస్ సిటీకి దక్షిణంగా 80 మైళ్ల దూరంలో ఉన్న బట్లర్ మెమోరియల్ ఎయిర్పోర్ట్ నుండి ఆదివారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో విమానం టేకాఫ్ అయ్యింది. పైలట్‌తో పాటు 11 మంది స్కైడైవర్లతో ప్రయాణిస్తున్న 'పసిఫిక్ ఏరోస్పేస్ 750XL' విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. విమానం భూమికి దాదాపు 100 అడుగుల (30 మీటర్లు) ఎత్తులో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఎడమవైపునకు తిరిగి, పొలాల్లో కూలిపోవడంతో మంటలు చెలరేగాయి. విమానంలో ఇంజన్ పవర్ తగ్గిపోవడం వల్లే పైలట్ హైవేపై ల్యాండ్ చేయడానికి ప్రయత్నించి ఉండవచ్చని ఎయిర్పోర్ట్ మేనేజర్ అభిప్రాయపడ్డారు. దీంతో విమానంలోవారందరూ ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అమెరికా పారాచూట్ అసోసియేషన్ టెక్నాలజీ డైరెక్టర్ జెన్ షార్ప్ కూడా ఉన్నారు.ఇదీ చదవండి: ఒక్క రీల్‌కు రూ. 76 లక్షలు, లంచ్‌కి 20 లక్షలు : ఎలా?సాధారణ కమర్షియల్ విమానాల్లో ఉండేలాంటి 'బ్లాక్ బాక్స్' (డేటా రికార్డర్) ఈ చిన్న విమానంలో లభ్యం కాలేదు. దీంతో ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి ఇతర డిజిటల్ పరికరాలు, సాక్షుల ప్రకటనలు, వీడియోలను అధికారులు సేకరిస్తున్నారు. ప్రమాదానికి గురైన పసిఫిక్ ఏరోస్పేస్ 750XL అనేది సింగిల్-ఇంజిన్ టర్బోప్రాప్ విమానం. ఇది స్కైడైవింగ్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. ఈ విమానం ప్రమాదానికి ముందు కూడా తొమ్మిదిసార్లు విజయవంతంగా ప్రయాణించిందని విమాన ట్రాకింగ్ సంస్థ తెలిపింది.ఇదీ చదవండి: NEET UG Re-Exam 2026 మరో చదువుల తల్లి ఊపిరి ఆగిపోయింది! -
అబుదాబిలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
అబుదాబి భారత రాయబార కార్యాలయంలో జూన్ 13, 2026న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా సాంస్కృతిక శోభతో నిర్వహించారు. ఈ వేడుకలో తెలుగువారి ఐక్యత, తెలంగాణ సంస్కృతి, జానపద వైభవం, చిన్నారుల ప్రతిభ—అన్నీ ఒకే వేదికపై అద్భుతంగా ప్రదర్శించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జార్జీ జార్జ్ , గౌరవ అతిథిగా వి. ప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు. వివిధ భారతీయ సంఘాల ప్రముఖులు.. ఇండియా సోషల్ సెంటర్ నుంచి బిజీ థామస్, లింసన్, బీహార్, జార్కండ్ సమాజ్ దివాకర్, ఉత్తర ప్రదేశ్ సమాజ్ వివేక్, తెలుగు అసోసియెషన్ రమేష్, ఐఎఫ్‌సీఏ నుంచి వినాయక్ అవాటె, మహారాష్ట్ర మండల్ నుంచి సంజయ్, ఇటిసిఏ నుంచి కిరణ్ కుమార్, సంస్కృతీ నుంచి రాజశేఖర్, తల్లిదండ్రులు, పిల్లలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమం తెలంగాణ డప్పుల స్వాగతంతో ప్రారంభమై, దీపప్రజ్వలన, అరబిక్, భారత జాతీయ గీతాలు, తెలంగాణ రాష్ట్ర గీతంతో కొనసాగింది. అనంతరం డా. అందె శ్రీ, తెలంగాణ ఉద్యమ అమరులకు ఒక నిమిషం మౌనం పాటించారు.తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాజా శ్రీనివాసరావు ఐతా స్వాగత ప్రసంగం అందిస్తూ ప్రవాస తెలంగాణవాసుల ఐక్యత, సంస్కృతి పరిరక్షణ, యువతలో నాయకత్వ వికాసం వంటి అంశాలపై ప్రేరణాత్మకంగా మాట్లాడారు. చివరగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి అధ్యక్షులు రాజా శ్రీనివాసరావు ఐతా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: న్యూజిల్యాండ్‌లో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు) -
క్రికెట్ క్యాచ్‌తో చిన్నారి ప్రాణాలు కాపాడాడు!
కిటికీ అంచున వేలాడుతూ ఓ పసిప్రాణం.. తొమ్మిది నిమిషాల పాటు కొనసాగిన ఉత్కంఠ.. ఇక కిందపడిపోతుందనుకుని అంతా కళ్లు మూసుకున్న టైంలో.. అనూహ్యంగా ఓ భారతీయుడు ఆమె ప్రాణం కాపాడాడు. లండన్‌లో జరిగిన ఈ ఉత్కంఠభరిత ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.తూర్పు లండన్‌లోని ఇల్ఫోర్డ్ హైరోడ్ ప్రాంతంలో మంగళవారం మద్యాహ్నా సమయంలో.. ఓ భవనం కిటికీ అంచుపై మూడేళ్ల చిన్నారి ప్రమాదకరంగా వేలాడుతూ కనిపించింది. ఆమె ఎప్పుడు కిందపడిపోతుందోనన్న భయంతో స్థానికులు ఆందోళన చెందారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసు అధికారి, స్థానిక రెస్టారెంట్ మేనేజర్ మొహమ్మద్ జెసిల్ చిన్నారిని రక్షించేందుకు ప్రయత్నించారు.చిన్నారి పట్టును కోల్పోతున్న సమయంలో ఓ వ్యక్తి నిచ్చెన తీసుకొచ్చి సహాయం చేశాడు. అయితే పరిస్థితి అదుపు తప్పడంతో చిన్నారి కిందకు జారిపోయింది. అదే సమయంలో అప్రమత్తంగా ఉన్న జెసిల్ అనే భారతీయ వ్యక్తి.. ఆమెను అద్భుతంగా అందుకుని ప్రాణాలు కాపాడాడు. పక్కనే ఉన్న పోలీసు అధికారి కూడా అతడికి సహకరించడంతో ప్రమాదం తప్పింది. దీంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.ఈ ఘటనపై స్పందించిన జెసిల్.. తాను భారతదేశంలో క్రికెట్ ఆడిన అనుభవమే ఆ సమయంలో ఉపయోగపడిందని చెప్పారు. "ఆ క్షణంలో ఎక్కువగా ఆలోచించలేదు. ఓ తండ్రిగా అలా ముందుకు వెళ్లాను. క్రికెట్ ఆడిన అనుభవం వల్ల క్యాచ్‌పై దృష్టి పెట్టగలిగాను" అని తెలిపారు. ఇక చిన్నారి తండ్రి స్పందిస్తూ.. తన కుమార్తెను కాపాడిన జెసిల్, పోలీసు అధికారిని నిజమైన హీరోలుగా అభివర్ణించారు. ప్రమాదంలో చిన్నారికి ఎలాంటి గాయాలు కాలేదని.. ఆమె తిరిగి పాఠశాలకు కూడా వెళ్లిందని తెలిపారు.లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, తక్కువ టైంలోనే రెస్క్యూ ఆపరేషన్ ముగిందని ప్రకటించారు. మనోడు పాల్గొన్న ఈ రెస్క్యూ ఆపరేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో మీరూ చూసేయండి.. A tense situation in Ilford today ended safely after a young child was found in danger at a window and was quickly rescued through the combined efforts of a police officer and a member of the public. pic.twitter.com/4fmasluJj3— Harry Sawyer (@HSawyer11526) June 11, 2026 -
కెనడాలో భారత పౌరులకు హెచ్చరికలు
కెనడాలోని భారత పౌరులకు అక్కడి అధికార యంత్రాంగం కీలక అడ్వైజరీ జారీ చేసింది. వీసా, ఇమిగ్రేషన్ హోదా, శాశ్వత నివాసం, ఉద్యోగాల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కాన్సులేట్ అధికారులు లేదంటే ఇమిగ్రేషన్ విభాగం పేరుతో మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలోనే అత్యంత జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది.కెనడాలో నివసిస్తున్న భారతీయులే లక్ష్యంగా సైబర్ మోసగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. తాము కాన్సులేట్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామని చెప్పుకుంటూ కొందరు వ్యక్తులు ఫోన్ కాల్స్ చేస్తున్నారు. వీసా స్టేటస్ సమస్యలు ఉన్నాయని, ఇమిగ్రేషన్ పత్రాలు అప్డేట్ చేయాలని లేదంటే తక్షణమే డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని భయపెట్టి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అధికారులు హెచ్చరించారు.ఈ తరహా కాల్స్‌లో కొందరు మోసగాళ్లు ఉద్యోగ అవకాశాలు, పర్మనెంట్ రెసిడెన్సీ ప్రాసెసింగ్, లేదా డిపోర్టేషన్ బెదిరింపులు వంటి విషయాలను ప్రస్తావిస్తూ ఒత్తిడి తీసుకువస్తున్నారని సమాచారం. అధికారికంగా అయితే ఎటువంటి ప్రభుత్వ సంస్థలు ఫోన్ ద్వారా డబ్బులు డిమాండ్ చేయవని స్పష్టం చేయడం జరిగింది.ఈ నేపథ్యంలో కెనడా అధికారులు, భారత కాన్సులేట్ కార్యాలయాలు ప్రజలకు కీలక సూచనలు జారీ చేశాయి. అనుమానాస్పద ఫోన్ కాల్స్ వస్తే ఎలాంటి వ్యక్తిగత సమాచారం, పాస్‌పోర్ట్ వివరాలు, బ్యాంక్ డేటా లేదంటే ఓటీపీలు పంచుకోవద్దని గట్టిగా హెచ్చరించారు. అలాగే తక్షణ నిర్ణయాలు తీసుకోవద్దని, అధికారిక వెబ్సైట్ లేదంటే నేరుగా కాన్సులేట్‌ను సంప్రదించాలని సూచించారు.కెనడాలోని భారతీయులు ఈ తరహా మోసాలకు బలవకుండా ఉండేందుకు జాగ్రత్తలు పాటించాలని కెనడా ప్రభుత్వం, టొరంటోలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా అధికారులు స్పష్టం చేశారు. ప్రత్యేకంగా “మీ వీసా రద్దు అవుతుంది”, “తక్షణంగా ఫైన్ చెల్లించాలి”, “ఇమిగ్రేషన్ సమస్య ఉంది” వంటి మాటలు వినిపిస్తే అది మోసపూరిత కాల్‌గా భావించాలని సూచించారు.అధికారులు చెబుతున్నదాని ప్రకారం, ఇలాంటి కాల్స్‌కి స్పందించకుండా వెంటనే బ్లాక్ చేయడం, స్థానిక పోలీసులకు లేదంటే సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేయడం ఉత్తమ మార్గమని సూచిస్తున్నారు. కెనడాలో భారతీయ కమ్యూనిటీ పెద్ద సంఖ్యలో ఉండటంతో ఈ మోసాలు మరింత పెరిగే అవకాశం ఉందని, అందుకే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు మరోసారి హెచ్చరించారు. -
లండన్‌లో భారతీయ కుటుంబం అనుమానాస్పద మరణం
లండన్‌లో విషాదం చోటుచేసుకుంది. లండన్‌లోని ఒక విలాసవంతమైన నివాస భవనంలో 36వ అంతస్తు బాల్కనీ నుండి కింద పడి భారత సంతతికి చెందిన దంపతులు, వారి తొమ్మిదేళ్ల కుమారుడు అనుమానాస్పద స్థితిలో మరణించడం కలకలం రేపింది. ఈ ఘటన మే 27న దక్షిణ లండన్‌లోని 46 అంతస్తుల భవనంలో జరిగింది.మే 27న భవనం 36వ అంతస్తులపైనుంచి కింద పడ్డారని ప్రత్యక్ష సాక్షులు సమాచారం ఇవ్వడంతో అత్యవసర సేవా సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పారామెడిక్స్ వారిని బతికించడానికి ప్రయత్నించినప్పటికీ, రాకేష్ పై (47), ఆయన భార్య అదితి పరల్కర్ (46) తొమ్మిదేళ్ల కుమారుడు సిద్ (9) అక్కడికక్కడే మరణించినట్లు నిర్ధారించారు. ఇది ఆత్మహత్యా లేక హత్య అనే సందేహాలు వెల్లువెత్తాయి.సిద్‌కు తీవ్ర అనారోగ్య సమస్యలున్నాయని, ఇదే వారి ఆత్మహత్యకు ప్రేరేపించి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. రాకేశ్, ఆదితి 2020లో భారత్‌లో తమ కుమారుడికి వైద్యం చేయించారని, అయినప్పటికీ పరిస్థితి మెరుగు పడకపోవడం, ఇక దీనికి చికిత్స లేదని వైద్యులు తేల్చి చెప్పడంతో వారు లండన్‌కు తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది.ఘోర విషాదం, ఒక కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు మరణించడం చాలా బాధాకరం, తీవ్రమైన అనారోగ్య సమస్యలతో యూకేలోనే పుట్టాడని, ఆ సమస్యలే వారు ఈ ఘోరానికి దారితీసి ఉండవచ్చని స్థానిక ఎంపీ నీల్ కోయల్ ఆ భవన నివాసితులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.ఈ దంపతులు ఫైనాన్స్ , నిర్మాణ రంగ కన్సల్టింగ్ విభాగాల్లో పనిచేసేవారు. ఫ్రెండ్స్ అంతా వీరిని 'ఆది' 'రాబిన్' అని పిల్చుకునే వారు. అయితే వీరు ఆత్మహత్య చేసుకున్నారనే విషయాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. సిద్ అనారోగ్యం విషయంలో అదితి బాగా ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నట్టు అనిపించినా, రాబిన్ ప్రశాంతంగా, పరిస్థితులను మేనేజ్ చేసేవాడని గుర్తు చేసుకున్నారు.మరోవైపు ఈ విషాదానికి కొన్ని వారాల ముందు, వీరి ఇంటినుంచి అరుపులు కేకలు వినిపించాయని పొరుగువారు పోలీసులకు చెప్పారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నామని, కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని పోలీసులు ప్రకటించారు. ఇదీ చదవండి: రూ 19 కోట్లు దాచేసి : భార్యకు చుక్కలు చూపించిన భర్త -
అమెరికాలో మెరిసిన తెలుగు తేజం
టాంపా, ఫ్లోరిడా: అమెరికా జాతీయ స్థాయి ఇన్నోవేషన్ పోటీలో టాంపా తెలుగమ్మాయి విశేషగా నిలిచింది. అమెరికా స్టెయిన్ బ్రెన్నర్ హైస్కూల్ (ఫ్లోరిడా)లో 10వ తరగతి చదువుతున్న తెలుగు విద్యార్థిని ఇషాన్వి సబ్నివీసు అమెరికా జాతీయ స్థాయి ఇన్నోవేషన్ పోటీలో ద్వితీయ బహుమతి సాధించింది. అమెరికాలో అత్యంత ప్రతిష్టాత్మక విద్యార్థుల ఆవిష్కరణల పోటీలలో ఒకటైన ఇన్వెన్షన్ కన్వెన్షన్ యూఎస్ నేషనల్స్‌లో, 35 రాష్ట్రాల నుండి పాల్గొన్న 3 లక్షల మందికి పైగా విద్యార్థులతో పోటీపడి ఆమె ఈ ఘనత సాధించింది. దృష్టి లోపం ఉన్నవారి కోసం రూపొందించిన “ఏఐ-ఎనేబుల్డ్ స్మార్ట్ కేన్ (Smart Cane)” అనే వినూత్న ఆవిష్కరణకు గాను ఆమెకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే పేటెంట్ దరఖాస్తు దశలో ఉంది. ఇషాన్వి జాతీయ స్థాయి ప్రయాణం యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడాలో జరిగిన ప్రాంతీయ ఇన్వెన్షన్ కన్వెన్షన్ నుండి ప్రారంభమైంది.స్మార్ట్ కేన్ ప్రత్యేకతలుఈ స్మార్ట్ కేన్ దృష్టి లోపం ఉన్న వ్యక్తులు స్వతంత్రంగా, సురక్షితంగా ప్రయాణించేందుకు సహాయపడేలా ఆధునిక AI సాంకేతికతతో రూపొందించబడింది.రియల్ టైమ్ AI ఆధారిత వాతావరణ విశ్లేషణ వ్యవస్థఆన్-డివైస్ (Large Language Models) ద్వారా ప్రాసెసింగ్బ్లూటూత్ ఇయర్‌పీస్ ద్వారా వాయిస్ మార్గనిర్దేశంఇంటర్నెట్ అవసరం లేకుండా పూర్తిగా ఆఫ్‌లైన్‌లో పనిచేసే సామర్థ్యం కలిగి ఉంటుందిఅడ్డంకులను ముందుగానే గుర్తించే (Obstacle Detection) వ్యవస్థతప్పు గుర్తింపులను తగ్గించే False Detection Suppression టెక్నాలజీఒకే టచ్‌తో అత్యవసర కాల్స్ చేసే ఎమర్జెన్సీ ఫీచర్గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో కూడా ఇది సమర్థవంతంగా ఉపయోగపడే విధంగా రూపొందించబడింది. అంతేకాకుండా, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి మద్దతుగా ‘క్రానిక్ కనెక్ట్’ అనే నాన్-ప్రాఫిట్ కమ్యూనిటీని కూడా ఆమె స్థాపించారు. ఇషాన్వి విజయంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస తెలుగువారంతా ఆనందం వ్యక్తం చేశారు. ఆమె సాధించిన విజయం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ యువతకు స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు. మరోవైపు తెలుగు సమాజానికి గర్వకారణమవుతుందని విధ్యార్దిని ఇషాన్వి సబ్నివీసు తెలిపింది.దీనికి హైదరాబాద్‌కు చెందిన టెక్నాలజీ స్టార్టప్ క్వాడ్రిక్ ఐటీ యువ ఆవిష్కర్తలకు AI, టెక్నాలజీ మార్గదర్శకత్వం, సాంకేతిక సహాయం అందిందించింది. ఇషాన్వి లాంటి యువ ఆవిష్కర్తలు ప్రపంచ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు అందిస్తూ భవిష్యత్ టెక్నాలజీ దిశను నిర్దేశిస్తుందని నిర్వాహకులు ప్రకటించారు. -
‘అది మా 28 ఏళ్ల కష్టం.. కబ్జా చేయడానికి చూస్తున్నారు’
తాడేపల్లి: కూటమి నేతల దౌర్జన్య కాండపై ఓ ఎన్ఆర్ఐ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. తమ 28 ఏళ్ల కష్టాన్ని దోచుకోవడానికి అధికార పార్టీ నేతలు చూస్తున్నారని ఎన్ఆర్ఐ మురళి కుటుంబం.. వైఎస్సార్సీపీని ఆశ్రయించింది. దీనిలో భాగంగా తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఎన్ఆర్ఐ మురళీ భార్య కృష్ణకుమారి మీడియాతో మాట్లాడారు. ‘ 28 ఏళ్లుగా సంపాదించిన డబ్బుతో కాంప్లెక్స్ కట్టాం. సినిమా థియేటర్లు, మాల్స్ మేము నిర్మించాం. మా మాల్ ని ఆపేశారు. 90 లక్షలు మేము దాని కోసం అప్పులు చేశాం. మేము మోసం చేసామంటూ తప్పుడు ప్రచారం చేశారు. మా మాల్ చుట్టూ టెంట్లు వేసి, జనాన్ని పెట్టి బెదిరిస్తున్నారు. మేము పోలీసులు కి ఫిర్యాదు చేస్తే తిరిగి మాపై కేసు పెట్టారు. కోర్టు భద్రత కల్పించమని ఆదేశించినా పట్టించుకోవడం లేదు. మాకు పోలీసులు, ఎమ్మెల్యే, ప్రభుత్వం ఎవ్వరు రక్షణ ఇవ్వడం లేదు. ఎన్ఆర్ఐలకి ప్రభుత్వం ఇచ్చే సందేశం ఇదేనా?, దీని వెనుక స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన మద్దతు లేకపోతే ఇది జరుగుతుందా?, మా ప్రభుత్వం లో ఏం చేసినా చెల్లుతుంది అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. 2024, ఆగస్టు 4వ తేదీన ఎమ్మెల్యేకి చెప్పాము. వాళ్లంతా కుమ్మక్కై ఇదంతా చేస్తున్నారు. ఆ మాల్ని లాక్కోవాలని చూస్తున్నారు. నా భర్త దీనికోసం పోరాడుతున్నందుకు ఆయన్ని టార్గెట్ చేస్తున్నారు. ఆయన మీద డ్రగ్స్ కేసులు పెడతామని బెదిరించారు. చిలకలూరిపేటలో అడుగు పెడితే ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ.. ‘ కూటమిలో నేతలు నీచ, నికృష్టంగా ఉన్నారు. విపరీతంగా దోపిడీ, అవినీతికి పాల్పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భూములు కబ్జా చేస్తున్నారు. చిలకలూరిపేటలో ఎన్ఆర్ఐ ఆస్తులను అక్రమిస్తున్నారు. ప్రత్తిపాటి పుల్లారావు బుద్ధి లేకుండా కబ్జాలు చేస్తున్నారు. టెంట్లు వేసి మనుషులను పెట్టి కబ్జా చేశారు. కోట్ల అస్థిని కాజేయాలని పుల్లారావు చూస్తున్నారు. కోర్టు చెప్పినా కూడా ఆస్తిని కాజేయాలని చూస్తున్నారు’ అని ధ్వజమెత్తారు. -
కోటి రూపాయల ఉద్యోగం.. జాయినింగ్‌కు ముందే విషాదం..!
నల్గొండ జిల్లా: అమెరికాలో స్నేహితులతో కలిసి నది వద్దకు వెళ్లిన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండల కేంద్రానికి చెందిన యువకుడు నదిలో జారిపడిన ముగ్గురు స్నేహితులను కాపాడి తాను నీటిలో మునిగి మృతిచెందాడు. వివరాలు.. శాలిగౌరారం మండల కేంద్రానికి చెందిన చెందిన కోడూరు రాజేందర్‌రెడ్డి, దుర్గాభవాని దంపతులకు అశ్రిత్‌రెడ్డి, అనురూప్‌రెడ్డి(22) సంతానం. ప్రస్తుతం వారు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కవాడిపల్లిలో స్థిరపడ్డారు. రాజేందర్‌రెడ్డి ఇద్దరు కుమారులు ఉన్నత చదువుల కోసం అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రానికి వెళ్లారు. అశ్రిత్రెడ్డిది గతేడాది ఎంఎస్ పూర్తికాగా.. అనురూప్రెడ్డిది ఇటీవలే కంప్యూటర్ సైన్స్‌లో ఎంఎస్ పూర్తిచేశాడు. అశ్రిత్రెడ్డికి ఉద్యోగం రాకపోగా.. అనురూప్‌రెడ్డికి ఇటీవలే కోటి రూపాయల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. కానీ ఉద్యోగానికి సంబంధించిన ఓటీపీ రాకపోవడంతో ఉద్యోగంలో చేరలేదు.స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లి..అశ్రిత్‌రెడ్డి, అనురూప్రెడ్డితో పాటు మరో నలుగురు స్నేహితులు అమెరికాలో ఒకే ఇంట్లో నివాసముంటున్నారు. గత నెల 29న తన స్నేహితుడి పుట్టినరోజు వేడుక కోసమని అనురూప్‌రెడ్డి మరో ముగ్గురు స్నేహితులతో కలిసి టెక్సాస్–లూసియానా సరిహద్దులో ఉన్న ‘టొలెడోబెండ్ రిజర్వాయర్’ వద్దకు వెళ్లారు. అక్కడ అనురూప్‌రెడ్డి ఫోన్‌కాల్ మాట్లాడుతుండగా.. అతడి ముగ్గురు స్నేహితులు సరదాగా చేపలు పడుతూ కాలుజారి నది ప్రవాహంలో కొట్టుకుపోయారు. పక్కనే ఉన్న మరో స్నేహితుడు కేకలు వేయడంతో అనురూప్‌రెడ్డి వెంటనే నీటి ప్రవాహంలోకి దూకి ముగ్గురు స్నేహితులను ఒడ్డుకు చేర్చాడు. తాను కూడా ఒడ్డుకు చేరే క్రమంలో ఫిషింగ్ వైరు కాళ్లకు చుట్టుకుని నీటిలో మునిగి మృతిచెందాడు. అక్కడి రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి 20 అడుగుల లోతున ఉన్న అనురూప్‌రెడ్డి మృతదేహాన్ని బయటకు వెలికితీశాయి. చదువులో చురుకుఅనురూప్రెడ్డి హైదరాబాద్‌లోని గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. ఇంజనీరింగ్ మూడో సంవత్సరంలో ఉండగానే క్యాంపస్ సెలక్షన్లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీ రూ.40లక్షల వార్షిక వేతన ప్యాకేజీతో అనురూప్‌రెడ్డికి ఉద్యోగ ఆఫర్ ఇచ్చింది. కానీ ఆ ఆఫర్‌ను కాదని అతడు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు.నేడు హైదరాబాద్‌కు రానున్న మృతదేహం..అనురూప్‌రెడ్డి మృతదేహం మంగళవారం ఉద యం హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అక్కడి నుంచి మృతదేహాన్ని కవాడిపల్లిలోని వారి నివాసానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. -
పిజ్జా డెలివరీ కోసం వెళ్తే కాల్చిచంపారు
మేడ్చల్ రూరల్: అమెరికాలోని ఫిలడెల్ఫియాలో శుక్రవారం రాత్రి దుండగులు జరిపిన కాల్పుల్లో మేడ్చల్ జిల్లాకు చెందిన అన్షుల్ (28) మృతిచెందారు. ఆయన కుటుంబం గుండ్లపోచంపల్లి డివిజన్లో ఎప్సిలాన్లో ఉంటోంది. శనివారం ఉదయం కుమారుడి మరణవార్త తెలియగానే అన్షుల్ తల్లిదండ్రులు శ్రీనివాస్ గౌడ్, నీలిమ దంపతులు కుప్పకూలిపోయారు. హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేసిన అన్షుల్ ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లాడు. ఎంఎస్ పూర్తి చేశాక కేడబ్ల్యూసీ అనే కంపెనీలో ఉద్యోగం చేస్తూనే అదనపు సంపాదన కోసం ఖాళీ సమయాల్లో పిజ్జా డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఆ విధుల్లో భాగంగా భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో ఓ అపార్ట్మెంట్లో పిజ్జా డెలివరీ చేసి తిరిగి వెళ్తుండగా మాస్క్ వేసుకున్న ఇద్దరు దుండగులు వెనుక నుంచి అన్షుల్‌ను కాల్చి చంపారు. అతని తలతోపాటు మరో రెండు చోట్ల తూటా గాయాలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటన స్థలంలో ఎలాంటి దొంగతనం జరగలేదని.. అన్షుల్ మృతిపై తమకు అనుమానం ఉన్నట్లు చెప్పారు. ఎవరో కావాలని పిజ్జా డెలివరీ పేరుతో ఇంటి వద్దకు రప్పించి కాల్చి చంపి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. -
పెళ్లికి రావాల్సినవాడు.. శవమై వచ్చాడు
పశ్చిమాసియాలో ఉద్రికత్తల మధ్య కువైట్ విమానాశ్రయంపై ఇరాన్ చేసిన దాడిలో ఒక భారతీయుడు మరణించిన వైనం విషాదాన్ని నింపింది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి చెందిన మంజూర్ అహ్మద్ (55) దాదాపు 30 ఏళ్లుగా కువైట్‌లో టైలర్‌గా పని చేస్తున్నారు. మేనకోడలు వివాహానికి హాజరయ్యేందుకు వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. దీంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.జూన్ 8న రత్లాం జిల్లాలో జరగాల్సిన మేనకోడలు వివాహానికి హాజరయ్యేందుకు మంజూర్ ఇంటికి తిరిగి రావాలనుకున్నాడు. బుధవారం ఉదయం 7:30 గంటలకు ముంబైకి విమానంలో వచ్చి, అక్కడి నుండి రైలులో తన సొంత ఊరైన ఉజ్జయినికి వెళ్లాలని అనుకున్నారు. విమానం ఎక్కడానికి ఒక రోజు ముందు, తన కుమారుడు అనస్ అహ్మద్‌తో మాట్లాడి, రైల్వే స్టేషన్ నుండి తనను తీసుకువెళ్లడానికి రమ్మని చెప్పారు. గత ఏడాది అక్టోబర్ తర్వాత భారత్‌కు తిరిగి వస్తున్న అతనికి ఎంతో సంతోషంగా పూలమాలలతో స్వాగతం చెప్పేందుకు సిద్ధమవు తుండగా, ఈ విషాద వార్త వారి చెవిని పడిందని అహ్మద్ కుమారుడు అనస్, తండ్రితో జరిగిన ఆ చివరి ఫోన్ సంభాషణను గుర్తు చేసుకున్నారు. నాగదా రైల్లో వస్తానని చెప్పారు.. రిసీవ్ చేసుకోడానికి రమ్మన్నారు.. కానీ అది చివరి కాల్ అవుతుందని అనుకోలేదని కంటతడిపెట్టారు. ఆయనకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు, వృద్ధురాలైన తల్లి ఉన్నారు. శుక్రవారం ఆయన మృతదేహాన్ని అహ్మదాబాద్ విమానాశ్రయానికి తరలించారు, ఆ తర్వాత బంధువులు అంత్యక్రియల కోసం రోడ్డు మార్గంలో ఉజ్జయినికి తీసుకువెళ్లారు.మరోవైపు భారత్ ఈ దాడిని ఖండించింది. దాడులను నిలిపివేయాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) పిలుపునిచ్చింది.ఆ ప్రాంతంలోని భారతీయ రాయబార కార్యాలయాలు , కేంద్రాలు అప్రమత్తంగా ఉన్నాయని, అక్కడి భారతీయ సమాజానికి చురుకుగా మద్దతునిస్తూనే ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు ఇరాన్‌పై దాడి చేసి, 86 ఏళ్ల సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీని హతమార్చడంతో మధ్యప్రాచ్య యుద్ధం చెలరేగింది. దీనికి ప్రతిస్పందనగా, టెహ్రాన్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా, ఇజ్రాయెల్ ఆస్తులపై దాడులు ప్రారంభించింది. మార్చిలో కువైట్‌లోని ఒక విద్యుత్, నీటి శుద్ధి కర్మాగారంపై ఇరాన్ జరిపిన దాడుల్లో ఒకరు , అదే నెలలో యూఏఈ రాజధాని అబుదాబిలో క్షిపణిని అడ్డగించడం వల్ల వెలువడిన శకలాల కింద పడి మరికొరు ఇలా ఈ దాడుల్లో ఇప్పటివరకు 10 మంది భారతీయులు మృతి చెందారు. -
ప్రాణాలతో పోరాడుతుంటే.. సంకెళ్లు వేశారు!
కత్తిపోట్లకు గురై రక్తపు మడుగులో ప్రాణాలతో పోరాడుతున్న ఓ యువకుడికి సాయం చేయాల్సిన పోలీసులు.. అతడికే సంకెళ్లు వేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. బ్రిటన్‌లో వైరల్‌గా మారిన ఈ ఘటన.. ఇప్పుడు అట్లాంటిక్‌కు ఇరువైపులా రాజకీయ దుమారం రేపుతోంది. బాధితుడిని నిందితుడిగా భావించి పోలీసులు వ్యవహరించారంటూ విమర్శలు వెల్లువెత్తుతుండగా.. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన కేవలం ఒక హత్య కేసు మాత్రమే కాదని, పాశ్చాత్య సమాజాలు ఎదుర్కొంటున్న పెద్ద సమస్యలకు అద్దం పడుతోందని వ్యాఖ్యానించారు. గత ఏడాది డిసెంబర్లో బ్రిటన్‌లోని సౌతాంప్టన్ నగరంలో 18 ఏళ్ల హెన్రీ నోవాక్ అనే విద్యార్థిపై సిక్కు కమ్యూనిటీకి చెందిన విక్రమ్ దిగ్వా అనే 23 ఏళ్ల వ్యక్తి కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలతో నేలపై కుప్పకూలిన హెన్రీ ప్రాణాల కోసం పోరాడుతుండగా ఘటనాస్థలికి పోలీసులు చేరుకున్నారు. అయితే అక్కడ జరిగిన పరిణామాలు తర్వాత తీవ్ర వివాదానికి కారణమయ్యాయి.దాడి చేసిన విక్రమ్ దిగ్వా తానే బాధితుడినని, హెన్రీ తనపై జాత్యహంకార వ్యాఖ్యలు చేశాడని పోలీసులకు చెప్పినట్లు సమాచారం. దీంతో పోలీసులు తొలి దశలో హెన్రీనే అనుమానితుడిగా భావించినట్లు ఆరోపణలు వచ్చాయి. తీవ్రంగా గాయపడి కదలలేని స్థితిలో ఉన్న యువకుడికి బేడీలు వేసినట్లు వెలుగులోకి వచ్చిన వీడియోలు, నివేదికలు బ్రిటన్‌లో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. అనంతరం హెన్రీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.ఈ ఘటనపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఘాటుగా స్పందించారు. "హెన్రీ నోవాక్ మరణం విషాదకరమే కాదు.. ఆగ్రహం తెప్పించే ఘటన" అని పేర్కొన్నారు. అతడు చేయని నేరానికి ద్వేష నేరస్థుడిగా ముద్రవేశారని, అధికార యంత్రాంగం అతడిని విఫలమైందని విమర్శించారు. హెన్రీ మరణం ఒక వ్యక్తి విషాదం మాత్రమే కాదని, సమాజం ఎలా స్పందిస్తుందన్న ప్రశ్నను కూడా లేవనెత్తుతోందని వ్యాఖ్యానించారు.ఇదే సందర్భంగా యూరప్‌లో వలస విధానాలపై కూడా వాన్స్ విమర్శలు గుప్పించారు. గత కొన్ని దశాబ్దాలుగా తీసుకున్న రాజకీయ నిర్ణయాలు ఇలాంటి పరిస్థితులకు కారణమయ్యాయని అన్నారు. పాశ్చాత్య దేశాలు తమ విలువలను కాపాడుకోవడంలో విఫలమవుతున్నాయంటూ వ్యాఖ్యానించారు.వాన్స్ వ్యాఖ్యలకు ముందు అమెరికా విదేశాంగ శాఖ కూడా ఈ కేసుపై స్పందించింది. సిద్ధాంతపరమైన పక్షపాతం, రెండు రకాల పోలీసింగ్ విధానాల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించింది. దీంతో ఈ కేసు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.అయితే అమెరికా వ్యాఖ్యలను బ్రిటన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ప్రయత్నాలను అంగీకరించబోమని ప్రధాని కీర్ స్టార్మర్ కార్యాలయం స్పష్టం చేసింది. విద్వేషాన్ని, విభజనను రెచ్చగొట్టే వ్యాఖ్యలు బాధ్యతాయుతమైనవి కావని పేర్కొంది. మరోవైపు హెన్రీ నోవాక్ కుటుంబ సభ్యులు కూడా తమ కుమారుడి మరణాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించవద్దని కోరారు. ఈ విషాదం మరింత ద్వేషానికి, సామాజిక విభజనకు కారణం కాకూడదని విజ్ఞప్తి చేశారు.అయితే ఈ ఘటనపై చర్చ మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే ఎలాన్ మస్క్ సహా పలువురు ప్రముఖులు స్పందించగా.. ఇప్పుడు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యాఖ్యలతో ఈ కేసు మరోసారి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఒక యువకుడి హత్యగా మొదలైన ఈ వ్యవహారం ఇప్పుడు బ్రిటన్ పోలీసుల పనితీరు, వలస విధానాలు, సామాజిక ఉద్రిక్తతలపై పెద్ద చర్చకు దారితీసింది. -
వందలాది భారతీయుల డ్యాన్సింగ్ వీడియో : దుమారం, అసలు ట్విస్ట్ ఇదీ!
కెనడాలోని రద్దీగా ఉండే టొరంటో వీధుల్లో వందలాదిమంది భారతీయులు నృత్యం చేసిన ఘటన, దానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కెనడా భారతదేశపు వలసరాజ్యం లా మారిపోతోంది అంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ఆన్లైన్లో అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది. ముఖ్యంగా కెనడా స్థానికులు మాత్రం దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇలా జరగనివ్వమని స్థానికులు షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు ఒక చర్చకు దారితీసింది.ఒక యూజర్ వివాదాస్పదమైన క్యాప్షన్‌తో ఈ వీడియోను షేర్ చేయడంతో వివాదం మొదలైంది. కెనడా ఇప్పుడు భారతీయ వలసరాజ్యంగా మారిపోయింది. టొరంటోలో కెనడియన్లే ఇప్పుడు మైనారిటీలుగా మారిపోతున్నారు. వలసవచ్చిన వారి సంఖ్య గతంలో కంటే మునుపెన్నడూ లేనంతగా పెరిగిపోయింది. దీనిని మనం ఇలాగే వదిలేయ కూడదు. కెనడియన్లారా, ఇప్పటికైనా మేల్కోండి అంటూ ఎక్స్‌లో షేర్ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. అంతేకాదు రాబోయే కొద్ది సంవత్సరాల్లో కెనడాలోని 'బ్రాంప్టన్' నగరం పూర్తిగా భారతీయ మూలాలున్న వారితో నిండిపోయి, వారే మెజారిటీగా మారే నగరంగా రూపాంతరం చెందుతుంది. ఇది కెనడాపై జరుగుతున్న థర్డ్ వరల్డ్ (మూడో ప్రపంచ దేశాల) ఆక్రమణ అంటూ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు.This is neither Indian culture nor art. This is a disgusting display of a cheap Bollywood reel. Come to Canada and see how despised the community is becoming. https://t.co/PzV8uFX4dP— Ashis Basu 🇨🇦 ashis.bluesky.social (@BasuAshis) June 3, 2026 Until they aren’t creating a chaos in public, causing hindrance to people in general, no traffic snarls They are allowed to spread #IndianCulture #IndianHeritage and #IndianHistory across the globe - Period pic.twitter.com/ElBYbX2TOE— 𝐒𝐢𝐝𝐝 (@sidd_sharma01) June 3, 2026నెటిజన్ల స్పందనకల్చర్ మిస్ అవుతోంది, అసలు ఇది కెనడానా లేక ఇండియా అర్థం కావడం లేదు. కెనడా తన సొంత సంస్కృతిని కోల్పోతోంది. వలస వచ్చిన వారు ఇక్కడి సంస్కృతిని, పద్ధతులను గౌరవించాలంటూ ఒకరు అసహనం వ్యక్తం చేశారు. మరికొంతమంది ఇండియన్స్‌కు మద్దతుగా నిలిచారు. భారీగా పన్నులు చెల్లిస్తూ, కీలకమైన ఉద్యోగ కొరతను తీర్చే వలసదారుల కష్టంతోనే కెనడాఎదుగుతోందని విమర్శించారు. .మరికొందరు ఈ వేడుకల వల్ల ఎవరికి నష్టం జరిగింది. ప్రజలు ఆనందంగా గడపడం కూడా తప్పేనా అని ప్రశ్నించారు.ఇదీ చదవండి: రొటీన్ లైఫ్ బోర్ కొట్టి రెండు ఉద్యోగాలు : బైక్ రైడ్స్‌తో రోజుకు రూ. 1500మరోవైపు విదేశాల్లో భారతీయుల వ్యవహార శైలిపై కొంతమంది భారతీయులు విమర్శించారు. ఇది భారతీయ సంస్కృతీ కళ కానే కాదు. ఇది ఒక చౌకబారు బాలీవుడ్ రీల్స్ స్టంట్ అంటూ మండిపడుతూ ఆశిస్ బసు ట్వీట్ చేయగా, స్థానిక సంస్కృతిలో కలిసి పోకుండా విదేశాలలో తమ మాతృదేశ సంప్రదాయాలను ఎందుకు అనుకరిస్తున్నారని ప్రశ్నిస్తూ తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు. కొంతమందైతే, ఇటువంటి వేడుకలను పూర్తిగా నిషేధించాలని కూడా డిమాండ్ చేశారు.2024 ലെ ഒരു വീഡിയോ. കാനഡയിലെ ടോറോന്റോയിൽ നിന്നുള്ളത്. ഇന്ത്യക്കാരാണ് ഡാൻസ് ചെയ്യുന്നത്. പക്ഷെ രണ്ടു വർഷത്തിന് ശേഷം, ഇപ്പോൾ വീണ്ടും ഈ വീഡിയോ സോഷ്യൽ മീഡിയയിൽ വൈറലാകുന്നുണ്ട്. ഈ ഡാൻസ് വീഡിയോയുടെ കമന്റ് സെക്ഷൻ മുഴുവൻ, വംശീയ അധിക്ഷേപങ്ങൾ കൊണ്ട് നിറഞ്ഞതാണ്. #dance #toronto pic.twitter.com/XO1RRZjQAZ— OBC - OffBeat Concerns (@OffBeatConcerns) June 5, 2026ట్విస్ట్ ఏంటంటే..ఇది 2024 నాటి వీడియో. కానీ రెండు సంవత్సరాల తర్వాత, ఇప్పుడు మళ్ళీ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ డ్యాన్స్ వీడియో కామెంట్ సెక్షన్ మొత్తం జాతి వివక్షాపూరిత దూషణలతో నిండిపోయింది. ఇదీ చదవండి: ప్రముఖ హాలీవుడ్ నటుడి దారుణ హత్య : ప్రియురాలి కొడుకు అరెస్ట్ -
వాళ్లు మమ్మల్ని ఇలానే మోసం చేశారు.. నందుస్ వరల్డ్ బాధితులు
-
భారత సంతతి విద్యార్థికి ప్రతిష్టాత్మక హెన్రీ ఫోర్డ్ II స్కాలర్ అవార్డు..!
భారత సంతతి విద్యార్థి అవని అహుజాకి ప్రతిష్టాత్మక హెన్నీ ఫోర్డ్II స్కాలర్ అవార్డుని గెలుచుకుంది. ఎంఐటీలో అత్యున్నత పురస్కారాలలో ఒకటైన ఈ అవార్డుని సాధించిన ఎన్నారైగా ఘనత సృష్టించింది. అసాధారణమైన విద్యా ప్రతిభ, ఇంజనీరింగ్‌లలో బలమైన నాయకత్వ సామర్థ్యాన్ని ప్రదర్శించే సీనియర్ అండర్ గ్రాడ్యుయేట్లకు ఈ పురస్కారన్ని ప్రదానం చేస్తారు. ఈ అవార్డుతో ప్రతిష్టాత్మక ఎంఐటీ విద్యార్థుల ప్రత్యేక బృందంలో చేరారు. ఈ పురస్కారం ఇటీవల కోడే రీసెర్చ్ గ్రూప్‌లో ఆమె చేసి వర్క్ కెపాసిటివ్ వైర్లెస్ పవర్ ట్రాన్స్ఫర్ పరిశోధనకు గానూ లభించింది. ఈ సాంకేతికతను భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల వైర్‌లెస్‌గా ఛార్జ్ చేయడానికి, శరీరంలో అమర్చే వైద్య పరికరాలకు శక్తిని అందించడానికి ఉపయోగించవచ్చు. ఈ మేరకు అవని మాట్లాడుతూ.."ఈ అవార్డును అందుకోవడం నాకు చాలా గౌరవంగా, ఆనందంగా ఉంది. ముఖ్యంగా డీన్ హామండ్‌ను కలవడం ఒక గొప్ప గౌరవం." అని అన్నారామె. నిజానికి హెల్త్‌కేర్ టెక్నాలజీలు, రోబోటిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లలో పనిచేయగల సామర్థ్యమే, ఆమెను ఎంఐటీ అత్యంత ప్రతిభావంతులైన అండర్ గ్రాడ్యుయేట్ పరిశోధకులలో ఒకరిగా నిలబెట్టింది. అలాగే అవనికి అత్యంత ఆసక్తి ఉన్న రంగాలలో మహిళల ఆరోగ్య పరిశోధన ఒకటి. అంతేగాదు ఆమె రొమ్ము కేన్సర్ స్క్రీనింగ్‌ను మరింత సులభతరం చేయడానికి రూపొందించిన, ధరించగలిగే బ్రెస్ట్ అల్ట్రాసౌండ్ ప్యాచ్‌కు సంబంధించిన పరిశోధనలలో కూడా కీలకపాత్ర పోషించారామె. తాను పీహెచ్డీ పూర్తి అయిన వెంటనే మహిళల ఆరోగ్య పరిశోధన రంగంలో పవర్ ఎలక్ట్రానిక్స్‌ను అన్వయించాలని చూస్తున్నట్లు తెలిపారు.(చదవండి: నాడు నీట్ ఫెయిల్యూర్..ఇవాళ బయోటెక్నాలజీ నిపుణురాలు!) -
NRI : అమెరికాలో రోడ్డు ప్రమాదం..
సాక్షి, హైదరాబాద్/మన్సూరాబాద్: మాజీ ఎంపీ, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ సతీమణి డాక్టర్ సుచియాష్కీ అమెరికాలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తమ చిన్న కుమార్తె డాక్టర్ గగనయాష్కీని బోస్టన్లోని హార్వర్డ్ యూనివర్సిటీ అనుబంధ ఆసుపత్రిలో ఎండీ కోర్సులో జాయిన్ చేసి న్యూయార్క్‌కు వస్తుండగా భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు.ప్రమాద సమయంలో వర్షం కురుస్తుండటంతో ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా కొట్టిందని, ఈ ప్రమాదంలో డాక్టర్ సుచియాష్కీకి పక్కటెముకలు విరిగిపోయాయని వెల్లడించారు. ప్రస్తుతం ఆమె స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు చెప్పారు. కాగా, మధుయాష్కీ కూడా అమెరికాలోనే ఉన్నారు. చిన్న కుమార్తె డాక్టర్ గగన న్యూయార్క్ మెడికల్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగా, కాన్వొకేషన్‌కు హాజరయ్యేందుకు యాష్కీ దంపతులు అమెరికా వెళ్లారు.కుమార్తెను ఎండీ కోర్సులో జాయిన్ చేసి వచ్చే సమయంలో సుచి ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. ఆ సమయంలో వేరే కారులో మధుయాష్కీ కూడా ఉన్నారని, భార్యకు ప్రమాదం జరిగిన నేపథ్యంలో గురువారం ఇండియాకు రావాల్సిన యాష్కీ, అక్కడే ఉండిపోయారని కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది. కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ ఫోన్లో మధుయాష్కీని పరామర్శించారు. -
వీసా పేరుతో కోట్లలో వసూళ్లు.. నందుస్ వరల్డ్ స్కాం వెనుక షాకింగ్ నిజాలు
-
అమెరికాలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. నైటా (న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్) ఆధ్వర్యంలో బేత్ పేజ్ కమ్యూనిటీ సెంటర్లో ఈ ఉత్సవాలు జరిగాయి.ప్రవాస తెలంగాణవాదులు పెద్దసంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎన్ఆర్ఐ ప్రముఖులు డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి, వెంకట్ మారోజు, నారాయణస్వామి పాల్గొన్నారు. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. మిమిక్రీ కళాకారుడు రమేష్, సింగర్ అద్వైత్ బొందుగుల తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. అశోక్ చింతకుంట కొమరం భీమ్ ఏకపాత్రాభినయం అలరించింది. చిన్నారులు అదిరిపోయే ఫ్యాషన్ షోను ప్రదర్శించారు.ప్రజల ఆంకాక్షలకు అనుగుణంగా ఏర్పాటైన తెలంగాణ మరింత అభివృద్ది జరగాలని, అందుకోసం తమవంతు పాత్రపోషిస్తామని నైటా ప్రెసిడెంట్ రవీందర్ కోడెల తెలిపారు. నైటా కార్యవర్గం, బోర్డు ఆఫ్ డైరెక్టర్లు, సలహాసంఘం సభ్యులు కుటంబాలతో సహా హాజరై వేడుకలను విజయవంతం చేశారు.(చదవండి: ఐరోపాలో ఘనంగా శ్రీ అన్నమాచార్యుల 618వ జయంతి ఉత్సవాలు) -
ముగ్గురు స్నేహితులను కాపాడి! చివరికి..
అబ్దుల్లాపూర్‌మెట్: అమెరికాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లిన ముగ్గురు స్నేహితులను కాపాడిన అనురూప్‌రెడ్డి.. నీట మునిగి మృతి చెందాడు.మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికుల కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కోడూరి రాజేందర్‌రెడ్డి–దుర్గాభవాని దంపతులు కొన్నేళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కవాడిపల్లి గ్రామానికి వచ్చి స్థిరపడ్డారు. వారికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ఆశ్రిత్రెడ్డితోపాటు అనురూప్‌రెడ్డి (22) సైతం ఐదేళ్ల క్రితం అమెరికాకు వెళ్లారు. అనురూప్‌రెడ్డి యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్‌లో ఇటీవల మాస్టర్ డిగ్రీ పూర్తి చేశాడు.శనివారం లూసియానాలోని టోరోడో పార్క్‌లో ఉన్న సెబాన్ రివర్‌లో సరదాగా స్నేహితులతో ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈత కొట్టే సమయంలో అతనితోపాటు మరో ముగ్గురు స్నేహితులు ఉన్నారు. హఠాత్తుగా ముగ్గురూ లోతు ప్రదేశంలోకి వెళుతూ రక్షించండి అంటూ కేకలు వేశారు. అనురూప్‌రెడ్డి ఒక్కొక్కరిని పైకి లాగుతూ ఒడ్డుకు చేర్చారు. తను పైకి వచ్చే క్రమంలో చెరువులో ఉన్న ఫిషింగ్ వైర్ కాలికి చుట్టుకోవడంతోపాటు నీటి ప్రవాహం పెరగడంతో పైకి రాలేకపోయాడు. అక్కడున్న వారు రక్షించే ప్రయత్నం చేసినా, అప్పటికే నీటిని ఎక్కువగా మింగడంతో మృత్యువాత పడ్డాడు.ఉన్నత చదువుల కోసం వెళ్లిన కుమారుడు ఇలా విగతజీవిగా మారుతాడని అనుకోలేదని కుటుంబ సభ్యులు దు:ఖసాగరంలో మునిగారు. అనురూప్‌రెడ్డికి ఫొటోగ్రఫీ ఎంతో ఇష్టమని, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడని అతని సోదరుడు తెలిపారు. టీం ఎయిడ్ స్వచ్ఛంద సంస్థ, ఇండియన్ ఎంబసీ, లూసియానా కాన్సులేట్ సంయుక్త సహకారం అందించి వారం రోజుల్లో మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్టు సమాచారం. -
కెనడాలో భారతీయ విద్యార్థిని దారుణ హత్య
కెనడాలో గుజరాత్‌కు చెందిన 22 ఏళ్ల విద్యార్థిని దారుణ హత్యు గురైంది. మృతురాలిని గుజరాత్‌లోని ఆనంద్ జిల్లా, బోర్సాద్‌కు చెందిన విధి కల్పేష్‌భాయ్ మేఘానిగా గుర్తించారు. దుండుగులు విధి మేఘను దారుణంగా పొడిచి చంపారు. ఆమె మృతదేహం అమెరికా–కెనడా సరిహద్దులో లభ్యమైంది. అంతర్జాతీయ మీడియా ప్రకారం మేఘ గత నాలుగేళ్లుగా కెనడాలో నివసిస్తూ, తన చదువుతో పాటు, పార్ట్‌టైమ్ ఉద్యోగాన్ని కూడా చేసుకుంటూ ఉండేది. అంతేకాదు కెనడాలో శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకునేందుకు కూడా సిద్ధమైంది. ఈ క్రమంలో ఈ నెల 15నుంచి ఆమె కనిపించకుండా పోయింది. దీనిపై కుటుంబ సభ్యులు, ఆమె సన్నిహితులు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల గాలింపులో కెనడాలోని నయాగారా ప్రాంతంలో, కెనడా–అమెరికా సరిహద్దులో ఆమె మృతదేహం లభ్యమైంది. ఒంటిపై కత్తిపోట్లు ఆధారంగా ఆమెను ఎవరో పొడిచి చంపినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ దాడికి గల కారణాలు ఏంటి అనేది మాత్రం ఇంకా అస్పష్టంగానే ఉంది. ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.ఇదీ చదవండి: సీబీఎస్ఈ వివాదం : ఎట్టకేలకు మౌనం వీడిన ధరేంద్ర ప్రధాన్ఇదీ చదవండి: భారత మామిడి పళ్లపై జపాన్ బ్యాన్ : ఎందుకో తెలుసా? -
ఐరోపాలో ఘనంగా శ్రీ అన్నమాచార్యుల 618వ జయంతి ఉత్సవాలు
సాంస్కృతిక సామరస్యానికి అంకితమైన ఒక ప్రముఖ లాభాపేక్షలేని సంస్థ అయిన స్టిచింగ్ వసుధైవ కుటుంబకం (SVK), శ్రీ అన్నమాచార్యుల జీవితాన్ని, కాలాతీత వారసత్వాన్ని సంగీత ప్రతిభను ఘనంగా స్మరించుకుంది. మే 23న, ఆ సంగీత విద్వాంసుని 618వ జయంతి సందర్భంగా, SVK ఐండ్హోవెన్లో ఒక మహత్తరమైన శ్రీ అన్నమాచార్య ఆరాధనను నిర్వహించింది. ఈ సాంస్కృతిక మైలురాయి, పశ్చిమ ఐరోపా నలుమూలల నుంచి ఎన్నో ప్రఖ్యాత సంగీత, నృత్య పాఠశాలలను ఒకచోట చేర్చి, శ్రీ అన్నమాచార్యులువారికి కళ, సంగీతం, ప్రగాఢ భక్తితో కూడిన సామూహిక నివాళిని అర్పించింది. ఈ కార్యక్రమంలో 170 మంది కళాకారులు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. అంతేగాదు 75 ఏళ్ల వయసు ఉన్న అనుభవజ్ఞులైన కళాకారులతో పాటు, చిన్న పిల్లలు కూడా అన్నమాచార్యుల వారి క్లిష్టమైన ఆధ్యాత్మిక కార్యకలాపాలను, సంకీర్తనలను అలవోకగా పఠించడం, ప్రదర్శించడం చూడటం ప్రాచీన సంప్రదాయ పరిరక్షణకు ఒక నిదర్శనంగా నిలిచింది. తమ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహకరమైన మద్దతుతో మంత్రముగ్ధులైన ప్రేక్షకుల ముందు ప్రత్యక్ష ప్రదర్శన ఇస్తూ, గొప్ప వారసత్వాన్ని తర్వాతి తరానికి ఎలా విజయవంతంగా అందించవచ్చో కళాకారులు అద్భుతంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ఐండ్హోవెన్ నగర కౌన్సిలర్లు మిరియం ఫ్రోసీ, చైతాలి సేన్‌గుప్తాతో పాటు సంస్కృతి అండ్ సంస్కార్ సంస్థ అధిపతి వల్లభ్ పాండే, హెచ్ఎస్ఎస్ ఐండ్హోవెన్కు చెందిన శ్రీనివాస్ రెడ్డి వారిలో ఉన్నారు.అతిథులందరూ యువ కళాకారులను ఆశీర్వదించి.. వారి అసాధారణ క్రమశిక్షణను ప్రశంసించారు. శాస్త్రీయ కళల పట్ల వారి అంకితభావాన్ని అభినందిస్తూ ప్రశంసా పత్రాలను అందజేశారు. అన్నమాచార్యుల చారిత్రక పాత్రకు తగిన నివాళిగా.. సుందరంగా అలంకరించిన శ్రీ వెంకటేశ్వర స్వామి, అమ్మవారి విగ్రహాల పవిత్ర వాతావరణంలో ఈ కళా ప్రదర్శనలు జరిగాయి.(చదవండి: సందడిగా టీపాడ్ స్ప్రింగ్ ఫెస్ట్) -
నాడు నీట్ ఫెయిల్యూర్..ఇవాళ బయోటెక్నాలజీ నిపుణురాలు!
ఇవాళ భారతదేశంలో కాంపీటీటివ్ ఎగ్జామ్స్ సంస్కృతి ఏవిధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తల్లిదండ్రులు, యువతకు అదే జీవిత పరమావధి అన్నంతగా మారిపోయాయి పరిస్థితులు. ఒకవేళ అది ఫెయిలైతే జీవితం అయిపోయినట్లుగా లేదా ముగిసిపోయినట్లుగా భావిస్తారు. మరికొందరు ఎన్నటికీ విజయాన్ని అందుకోలేని పరాజితులుగా ముద్ర వేసుకుంటారు. ఇంకో రంగంలో లేదా మరేదైన అభిరుచినో ఎంచుకుని గమ్యం చేరుకునే యత్నం చేయరు. కానీ ఈ కంటెంట్ క్రియేటర్ తన సక్సెస్ స్టోరీతో ఆ ఆలోచన విధానమే తప్పు అని నొక్కి చెప్పింది. ఆ ఒక్క కాంపిటీటివ్ ఎగ్జామ్స్ మన జీవితాన్ని, సక్సెస్‌ని నిర్ణయించదని తన గెలుపుతో నిరూపించింది ఈ భారత సంతతి మహిళ. ఎవరంటే ఆమె..? అమెరికాలో నివసిస్తున్న భారతీయ కంటెంట్ క్రియేటర్ ప్రజ్ఞాగుప్తా. దాదాపు దశాబ్దం క్రితం నీట్ పరీక్షల్లో విఫలమవ్వడం ఆమెను ఊహించని విధంగా ఐవీ లీగ్ విద్యవైపు అడుగులు వేసి ఎలా బయోటెక్నాలజీ పరిశ్రమలో కెరీర్ నిర్మించుకునేలా చేసిందో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోవడంతో ఆమె కథ నెట్టింట వైరల్‌గా మారింది. ముఖ్యంగా భారతదేశంలో పోటీ ప్రవేశ పరీక్షల చుట్టూ ఉన్న తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్న విద్యార్థులకు ఆమె కథ ఆలోచింపచేసేలా ఆకర్షించింది. నిజానికి ప్రజ్ఞ 2016లో 17 ఏళ్ల వయసులో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) రాసింది, కానీ మెడికల్ లేదా డెంటల్ కళాశాలలో ప్రవేశం పొందడంలో విఫలమైంది. భారతదేశంలోని అత్యంత పోటీతత్వ విద్యా వాతావరణంలో పెరిగిన ప్రజ్ఞ కూడా చాలా మంది విద్యార్థుల మాదిరిగానే, ఈ ఎదురుదెబ్బ బయాలజీ, హెల్త్‌కేర్ రంగాలలో తన కెరీర్ ఆశయాలను ముగించిందని చాలా బాధపడింది. ఆమె ఓటమి తన కుటుంబాన్ని సైతం తీవ్రగా ప్రభావితం చేసింది. సైన్స్ చదివే విద్యార్థులు నీట్ పరీక్షని అత్యంత కీలకమైన వైద్య ప్రవేశ పరీక్షగా భావిస్తారు. అయితే ప్రజ్ఞ ఆ పరీక్షను మరోసారి ప్రయత్నించి చూడటం వంటి వాటికి బదులుగా జీవశాస్త్రంపై ఉన్న ఆసక్తికి సంబంధించిన ప్రత్యామ్నాయాలను అన్వేషించింది. ఆ క్రమంలోనే విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనే ఉద్దేశ్యంతో అమెరికాకు పయనమైంది. అక్కడ ప్రముఖ ఐవీ లీగ్ సంస్థలలో ఒకటైన కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రురాలైంది.ప్రస్తుతం ఆమె అమెరికాలోని కార్పొరేట్ బయోటెక్నాలజీ పరిశ్రమలో నిపుణురాలిగా పనిచేస్తోంది. అందరిలానే పాఠశాల విద్య తర్వాత డాక్టర్ అయ్యే సంప్రదాయ నీట్ ప్రవేశపరీక్ష వైపుకు వెళ్లింది..కానీ అనుకోని ఓటమి ఆ దారిని క్లోజ్ చేసింది. ఆ ఎదురుదెబ్బ తన జీవితాన్ని గొప్ప యూటర్న్ తిప్పే ప్రత్యామ్నాయం వైపు ఫోకస్ పెట్టింది. అలాగే తాను కోరుకున్నట్లుగానే ఆరోగ్య సంరక్షణ రంగంలోనే కెరీర్‌ని నిర్మించుకుంది. ఒక విద్యా పరీక్షలో వైఫల్యం ఒక వ్యక్తి భవిష్యత్తు విజయాన్ని లేదా ఆనందాన్ని నిర్ణయించదనే వాస్తవాన్ని తన గెలుపుతో చాటిచెప్పిందామె. కాగా, అత్యంత పోటీతత్వ, ప్రతిష్టాత్మకమైన ఈ ఎగ్జామ్‌లో ఫెయిల్ అవ్వడం వల్ల కలిగిన మానసిక వేదన..దాన్నుంచి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి డ్రీమ్ కెరీర్‌ని చేరుకోవడం వరకు సాగిన ఆమె కెరీర్ జర్నీ విద్యార్థులకు భరోసా ఇచ్చేలా ఉందంటూ నెటిజన్లు ప్రజ్ఞను ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. అంతేగాదు సైన్స్, హెల్త్‌కేర్, బయోటెక్నాలజీ రంగాలలో కెరీర్లు కేవలం నీట్ ద్వారా డాక్టర్ అవ్వడం వరకే పరిమితం కావు అనే విషయాన్ని అందరూ గ్రహించాలి. View this post on Instagram A post shared by Pragya Gupta (@pragya.gupta) (చదవండి: చెట్లు నాటడానికి రూ. 4.8 లక్షల విరాళం..! హృదయాన్ని కదిలించే స్టోరీ) -
బ్రిటన్‌లో ప్రవాస భారతీయల రికార్డు.. మేయర్లుగా తల్లీ తనయులు
లండన్: బ్రిటన్‌లో భారతీయ మూలాలున్న తల్లీ, తనయుడు మేయర్ ఎన్నికల్లో ఘన విజయాన్ని అందుకున్నారు. భారతీయ కుటుంబానికి చెందిన తల్లీకుమారులు ఇద్దరూ బ్రిటన్‌లో ఒకేసారి మేయర్లుగా ఎన్నిక కావడం విశేషం. వీరి కుటుంబం హర్యానాకు చెందినది.వివరాల ప్రకారం.. హర్యానాలోని రోహ్తక్ నుంచి పర్వీన్ రాణి కుటుంబం 2013లో బ్రిటన్‌కు వలస వెళ్లింది. పర్వీన్ రాణి కుమారుడు తుషార్ కుమార్ (23) లండన్‌లోని కింగ్స్ కళాశాలలో చదువుతున్నాడు. ఈ ఏడాది సెప్టెంబరులో పీజీ పూర్తి చేసుకోనున్నారు. అయితే, పర్వీన్ రాణి, తుషార్ కుమార్ ఎన్నికల్లో పోటీ చేశారు.ఈ క్రమంలో ఎల్స్ట్రీ అండ్ బోరమ్వుడ్ పట్టణ కౌన్సిల్‌కు తుషార్ మేయరుగా ఎన్నికయ్యారు. వారం రోజుల తర్వాత తుషార్ తల్లి పర్వీన్ రాణి హర్ట్స్‌మేర్ బరా కౌన్సిలుకు భారతీయ మూలాలున్న తొలి మేయరుగా ఎన్నికయ్యారు. ఇలా భారతీయ కుటుంబానికి చెందిన తల్లీకుమారులు ఇద్దరూ బ్రిటన్‌లో ఒకేసారి మేయర్లుగా ఎన్నిక కావడం విశేషం. ఇక, బ్రిటన్‌లో భారతీయ మూలాలున్న అతి తక్కువ వయసు గల మేయర్‌గా తుషార్ చరిత్ర సృష్టించారు. Historic moment in UK politics! For the first time an Indian origin mother and son have become Mayors in Britain. 23 years old Tushar Kumar created history by becoming the youngest Mayor of borehamwood town council, while his mother Praveen Rani was elected mayor of Hertsmere… pic.twitter.com/Z2de5J8z7x— Neeraj Ranjan (@NeerajRanjan84) May 25, 2026 -
సందడిగా టీపాడ్ స్ప్రింగ్ ఫెస్ట్
డాలస్‌లోని తెలుగు ప్రజల సగౌరవ వేదిక ‘తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ (TPAD)’.. స్ప్రింగ్ ఫెస్ట్‌ను వైభవంగా నిర్వహించింది. డాలస్ మెట్రోప్లెక్స్ మధ్యలో ఉన్న ‘ది కాలనీ’ నగరంలోని గ్రాండ్స్కేప్లో జరిగిన ఈ వేడుక రెండు వేలకుపైగా జనంతో సందడిగా సాగింది. వెండర్ బూత్‌లు, ఉచిత 360 స్టూడియో, ఫేస్ పెయింటింగ్ వంటి కార్యక్రమాలతో పిల్లలు, యువత థ్రిల్ ఫీలయ్యారు. కళాశాల విద్యార్థుల డ్యాన్స్ షోకు చప్పట్లు మారుమోగాయి. లైవ్ బ్యాండ్ మ్యూజిక్, రకరకాల ఎంటర్టైన్మెంట్ తో కూడిన ఈ స్ప్రింగ్ ఫెస్ట్ ను ప్రతి ఒక్కరు బాగా ఎంజాయ్ చేశారు.గ్రాండ్ స్కేప్ లో ఫుడ్ స్టాల్స్, ఐస్‌క్రీమ్ షాపులు ప్రత్యేకంగా కనిపించాయి. పలు ఆటలు, టాయ్ షాపుల వద్ద పిల్లలు ఉత్సాహంగా కనిపించారు. టీపాడ్ స్పెషల్ అయిన రాఫెల్ డ్రా బహుమతులతో జోష్ నింపింది.జాతీయ గీతాలతో ప్రారంభంఅమెరికా, భారత జాతీయ గీతాలతో ఆరంభమైన ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ లక్ష్మి పోరెడ్డి (అధ్యక్షురాలు), రవికాంత్ మామిడి (BOT చైర్మన్), రఘువీర్ బండారు (ఫౌండేషన్ చైర్మన్), లింగారెడ్డి అల్వా (కోఆర్డినేటర్) స్వాగతం పలికారు. యాంకర్ వీణ యలమంచిలి కార్యక్రమాన్ని షోను రన్ చేశారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన స్పాన్సర్లకు, మీడియా సంస్థలకు టీపాడ్ బృందం కృతజ్ఞతలు తెలిపింది. స్ప్రింగ్ ఫెస్ట్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపింది.(చదవండి: తెలంగాణ వాదులను గుండెల్లో పెట్టుకుంటా) -
తెలంగాణ వాదులను గుండెల్లో పెట్టుకుంటా
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పట్టుబట్టి పనిచేసిన తెలంగాణవాదులను గుర్తించి గుండెల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ నాయకుడు, ఎల్పీ డిప్యూటీ ప్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు అన్నారు. వ్యక్తిగత పర్యటనలో భాగంగా అమెరికాలో ఉన్న ఆయన న్యూయార్క్ లో తెలంగాణవాదుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. లాంగ్ ఐలాండ్ లో ప్రముఖ ఎన్ఆర్ఐ లక్ష్మణ్ ఏనుగు నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో న్యూయార్క్, న్యూజెర్సీ ప్రాంతంలో నివసిస్తున్న తెలంగాణ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రముఖ ఎన్నారై వ్యాపారవేత్త డాక్టర్ పైళ్ళ మల్లారెడ్డిని హరీష్ రావు ప్రత్యేకంగా ప్రశంసించారు. అమెరికాలో స్థిరపడి తెలుగు వారికి ఉద్యోగ ఉపాధి రంగాల్లో ఆయన అందిస్తున్న సహకారం గొప్పగా ఉందని అన్నారు.ఉద్యమకాలం నుంచి, ఆ తర్వాత కూడా తెలంగాణే లక్ష్యంగా చాలా మంది ఎన్ఆర్ఐలు పనిచేశారని హరీష్ రావు గుర్తుచేసుకున్నారు. తమకు అనేక పరిమితులు ఉన్నా లక్మణ్ ఏనుగు లాంటి సోదరులు అనేకమంది తెలంగాణ ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొన్నారని, తమ సమయంతో పాటు ఆర్థిక వనరులను కూడా వెచ్చించారని అన్నారు.పలువురు ఎన్ఆర్ఐలు మాట్లాడుతూ ముందు నుంచీ తాము పార్టీకి అండగా ఉన్నామని, తెలంగాణ భావజాలవ్యాప్తికి అన్నిరకాలుగా కృషి చేశామని తెలిపారు. ఉద్యమవాదుల్లో కొందరికి అన్యాయం జరిగిందని, మరికొందరిలో అసంతృప్తి గూడు కట్టుకొన్న విషయాన్ని హరీష్ రావుకు దృష్టికి తీసుకువచ్చారు. మరోసారి తెలంగాణవాదుల పునరేకీకరణ జరగాల్సిన అవసరం ఉందని, తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీలేని పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ కు అండగా నిలవాలని అమెరికా ఎన్ఆర్ఐలకు పిలుపునిచ్చారు.తెలంగాణ సాధనలో భూమి పుత్రుడైన లక్ష్మణ్ ఏనుగు రాజీలేని పోరాటం చేశారని, పదహారు ఏళ్ల కిందటే ధూమ్ ధామ్ లు నిర్వహించటంతో పాటు, అనేక మంది ప్రముఖ నాయకులు, తెలంగాణ కవులు కళాకారులను అమెరికాకు పరిచయం చేసిన ఘనత లక్ష్మణ్ కు దక్కిందని హరీష్ రావు ప్రశంసించారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఎన్ఆర్ఐలు డాక్టర్ రాజేందర్ రెడ్డి జిన్నా, శ్రీనివాస్ గూడూరు, సతీష్ కల్వ, సహోధర్ రెడ్డి, రవీందర్ కోడెల, హరిచరణ్ బొబ్బిలి, మల్లిక్ రెడ్డి, రమా వనమా, వాణి ఏనుగు, ఉషా మన్నెం, రంజీత్ క్యాతం, అమర్ లింగాల, సునీల్ మన్నెం, తన్నీరు మహేష్, నరసింహారావు, చందు తళ్ల, తిరుపతిరెడ్డి, శ్రీనివాస్ జక్కిడి, తదితరులు పాల్గొన్నారు.(చదవండి: ఘనంగా TAL ప్రీమియర్ లీగ్ ఆరంభం) -
'థాంక్యూ డియర్ పేరెంట్స్': ఒక తరం త్యాగ ఫలితమే..
మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్రామ నేపథ్యం నుంచి విదేశాలకు వలస వెళ్లి విజవయంతంగా స్థిరపడ్డాయి. వారిలో కొందరు తమ మూలాలను చూసుకునేందుకు వెనక్కి వచ్చి మరి భారతగడ్డపై అడుగుపెడుతుంటారు. పైగా తాము పుట్టి పెరిగిన ప్రాంతాలు, తమ పూర్వీకుల ఇళ్లను చూసి నాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు. నిజంగా నాడు వాళ్లు అభివృద్ది చెందాలని కష్టపడి ఉండకపోతే..తాము అక్కడ ఉండే వాళ్లం కాదన్న ఆలోచన ఉబ్బితబ్బిబైలా చేయడమే కాదు సగర్వంగా అనిపిస్తుంది. అలాంటి భావోద్వేగాన్నే పొందాడు ఈ భారత సంతతి వ్యక్తి. అందుకు సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. అసలేం జరిగిందంటే..గోల్డ్ వాటర్ వ్యవస్థాపకుడు విజయ్ తిరుమలై అమెరికాలో రోడ్‌షోకు వెళ్లేమందు వార్షిక చిత్తిరై ఉత్సవం నిమిత్తం ఆలయ పునరుద్ధరణ పనుల కోసం తన తండ్రి గ్రామాన్ని సందర్శించడానికి వెళ్లినట్లు తెలిపారు. అక్కడ తన నాన్న, మామయ్యలు పెరిగిన ఇల్లు తదితరాలను గుర్తు చేసుకుంటూ..ఆ టైంలో ఇక్కడ కరెంట్ లేదు, నీటి సరఫరా లేదని చెప్పారు. అయినప్పటికీ బాల్యంలో ఇక్కడే పాలిటెక్నిక్ చదవి ఈ చుట్టుపక్కలే ఆడుకుంటూ ఎంజాయ్ చేశారని అన్నారు. ఇక తన కుటుంబం ఏ స్థాయికి చేరుకుందో గుర్తుచేసుకుంటూ..తన కజిన్స్ , ఇతర కుటుంబసభ్యులు అమెరికాలో బే ఏరియా, టొరంటో తదితర ప్రాంతాల్లో స్టార్టప్‌లు, బిగ్టెక్ అండ్ ఫైనాన్స్ రంగాల్లో స్థిరపడ్డారని అన్నారు. తమ కెరీర్ ప్రారంభంలో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ..మమ్మల్ని మంచి స్థాయిలో స్థిరపడేలా పెంచినందుకు మా తల్లిదండ్రులకు, పెద్దలకు సదా కృతజ్ఞతలని పోస్ట్‌లో పేర్కొన్నారు. అలాగే తమ పూర్వీకుల ఇంటి ఫోటోని కూడా షేర్ చేశారు. ఈ ఇంటిలోనే తన తండ్రి, మామయ్యల బాల్యం సాగిందని చెప్పారు. అయితే నెటిజన్లు వలసలు, త్యాగాల ఫలితం ఉన్నత స్థాయికి ఎదగడంతో ముడిపడి ఉన్న కుటుంబ చరిత్రను ఈ ఇల్లు గుర్తు చేస్తుందని అన్నారు. మరొక నెటిజన్ శెభాష్ విజయం..ఒక తరం అభివృద్ధి చెందడం కోసం ఇంకో తరం కష్టపడి త్యాగాలు చేస్తుంది. ఇది అద్భుత కుటుంబ కథ అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.Yesterday took some time off ( before i head off for a US road show) to visit my dad's village for the annual festival ( Chittirai) to the temple where we do our part for renovations etcThis is the house my dad and my uncles grew up, no electricity, no running water, nothing,… pic.twitter.com/S8ZohHFMLM— Vijay Thirumalai (@vijaythirumalai) May 18, 2026 (చదవండి: ఆమె ఐస్‌క్రీమ్ బ్రాండ్‌కి అమెరికన్లే ఫిదా..! ఏడాదికి రూ. 2 వేల కోట్లు..) -
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ యువతి మృతి
సాక్షి, నల్లగొండ: విదేశాల్లో ఉన్నత చదువులు చదివి ప్రయోజకురాలై, తమకు చేదోడువాదోడుగా టుందనుకున్న కూతురు కానరాని లోకాలకు వెళ్లిపోయింది. రోడ్డు ప్రమాదం రూపంలో ఆ ఇంటి దీపం శాశ్వతంగా ఆరిపోయింది. రూ.50 లక్షలు అప్పు చేసి మరీ అమెరికా పంపిన కౌలు రైతు దంపతులకు తీరని శోకం మిగిలింది. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టుకు చెందిన నవ్య అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన యువతి అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైంది. చెర్వుగట్టు గ్రామానికి చెందిన గడుసు శ్రీనివాస్‌రెడ్డి, శోభ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. వారిలో పెద్ద కూతురు నవ్య (24) బీటెక్ పూర్తి చేయడంతో ఎంఎస్ కోసం రెండున్నర సంవత్సరాల క్రితం అమెరికాకు వెళ్లింది. చిన్న కూతురు ప్రస్తుతం బీటెక్ చదువుతోంది. నవ్య చికాగో రాష్ట్రంలోని రోజ్ వెల్ యూనివర్సిటీలో రెండున్నర సంవత్సరాల నుంచి ఎంఎస్ చదువుతోంది.శనివారం రాత్రి కారులో వెళ్తుండగా.. ప్రమాదవశాత్తు వెనుక నుంచి మరో కారు ఢీకొట్టడంతో నవ్య అక్కడికక్కడే మృతి చెందినట్లు స్నేహితురాలు ఆదివారం మధ్యాహ్నం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. నవ్య మృతి విషయాన్ని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశానికి సమాచారం అందించారు. తక్షణమే వారు స్పందించి అమెరికా నుంచి నవ్య మృతదేహాన్ని సొంతూరికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు నవ్య తల్లిదండ్రులు తెలిపారు.ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి.. నవ్య 10వ తరగతి నల్లగొండలోని ఎంవీఆర్ స్కూల్లో, ఇంటర్ గీతాంజలి కాలేజీలో, బీటెక్ హైదరాబాద్‌లోని విజ్ఞాన్ కళాశాలలో పూర్తి చేసింది. ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లి ఎంఎస్ చదువుతోంది. తన కూతురు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వార్త తెలుసుకున్న శ్రీనివాస్‌రెడ్డి కుప్పకూలిపోయాడు. తన కూతురు ఉన్నత విద్యావంతురాలై విదేశంలో ఉద్యోగం చేసి ఇంటి దీపంగా వెలుగుతుంది అనుకుంటే రోడ్డు ప్రమాదం ఇంటి దీపాన్ని ఆర్పిందని నవ్య తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. చేసిన అప్పులు తీరకముందే.. గడుసు శ్రీనివాసరెడ్డి, శోభ దంపతులు సొంతంగా భూమి లేకున్నా ప్రతి సంవత్సరం 10 నుంచి 15 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి పంట పడిస్తూ తమ ఇద్దరు కూతుళ్లను చదివిపిస్తున్నారు. రెండున్నర సంవత్సరాల క్రితం పెద్ద కూతురు నవ్యను ఉన్నత విద్య కోసం అమెరికా పంపేందుకు రూ.30 లక్షలు బ్యాంకు రుణం, రూ.20 లక్షలు ప్రైవేట్ అప్పు చేశారు. చేసిన అప్పు తీరక ముందే కుమార్తె కానరాని లోకానికి పోయిందని తల్లడిల్లిపోతున్నారు. పెద్ద కూతురు ఉన్నత విద్య చదివి ఉద్యోగం చేస్తే చిన్న కూతురికి, తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటుంది అనుకుంటే అప్పులతో పాటు కన్నీరే మిగిలిందని రోదిస్తున్నారు. -
గొప్ప కలలున్నాయి
ద హేగ్: భారత్ అంటే అవకాశాల గని అని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మార్పునకు లోనవుతోందని తెలిపారు. భారతదేశ ఆకాంక్షలు ఇకపై సరిహద్దులకే పరిమితం కాబోవని అన్నారు. ప్రధాని మోదీ శనివారం నెదర్లాండ్స్‌లో పర్యటించారు. రాజధాని ద హేగ్‌లో ప్రవాస భారతీయుల సదస్సులో ప్రసంగించారు. భారత్ నేడు గొప్ప కలలు కంటోందని, దేశ యువత ఆకాంక్షలు ఆకాశాన్నంటుతున్నాయని వ్యాఖ్యానించారు. 21వ శతాబ్దంలో దేశం అవకాశాలకు మారుపేరుగా మారిందన్నారు. సాంకేతికతతోపాటు మానవతా దృక్పథంతో భారత్ ముందుకు సాగుతోందన్నారు. మన దేశం ఎంత ప్రాచీనమైనదో, అంతే ఆధునికంగా కూడా ఎదుగుతోందని హర్షం వ్యక్తంచేశారు. భారత్‌లోని పూర్వీకుల స్వగ్రామాలతో మళ్లీ అనుబంధం పెంచుకోవాల్సిన సమయం వచ్చిందని ప్రవాస భారతీయులకు సూచించారు. ‘అభివృద్ధి చెందిన భారత్’దిశగా సాగుతున్న ప్రయాణంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. దీనివల్ల మన దేశ శక్తిసామర్థ్యాలు మరింత బలోపేతం అవుతాయని, మీ పెట్టుబడులకు గొప్ప ప్రతిఫలం లభిస్తుందని వెల్లడించారు. ‘ఇదీ మోదీ గ్యారంటీ’అంటూ నెదర్లాండ్స్‌లోని భారతీయులకు, భారత మూలాలున్న ప్రజలకు హామీ ఇచ్చారు. అద్భుతాలు సృష్టిస్తున్న స్టార్టప్‌లు ‘‘ఈ రోజు మన దేశం చాలా పెద్ద ఎత్తున కలలు కంటోంది. కేవలం మార్పును కాదు.. ఉత్తమమైన మార్పును కోరుతోంది. అత్యంత వేగవంతమైన మార్పు కావాలని ఆకాంక్షిస్తోంది. ఆకాశమే హద్దుగా ఉన్నతస్థాయికి ఎదగాలని యువత భావిస్తోంది. ఇండియాలో స్టార్టప్ వ్యవస్థ బలోపేతం కావడానికి ఇదే అసలు కారణం. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థ ఇండియాలో ఉంది. 2014లో కేవలం నాలుగు యూనికార్న్ సంస్థలు ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 125కి చేరుకుంది. తులిప్‌లు, తామర పువ్వులు భారతదేశ ఆకాంక్షలు కేవలం దాని సరిహద్దులకే పరిమితం కాలేదు. ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వాలని, ప్రపంచ తయారీ కేంద్రంగా ఎదగాలని, హరిత ఇంధన రంగంలో అగ్రగామిగా నిలవాలని, ప్రపంచ వృద్ధికి చోదక శక్తిగా మారాలని తపన పడుతోంది. దేశం నేడు గొప్ప మార్పును వీక్షిస్తోంది. ఇటీవలే ప్రపంచంలో అతిపెద్ద ఏఐ సదస్సును విజయవంతంగా నిర్వహించాం. అంతకంటే ముందు జీ20 సదస్సు జరిగింది. ఇవి కేవలం ఒక్కసారి జరిగిన సంఘటనలు కావు. అతిపెద్ద కార్యక్రమాలు నిర్వహించడం నేటి భారతదేశపు లక్షణంగా, విశ్వాసంగా మారింది. భారత్, నెదర్లాండ్స్ మధ్య బంధం విడదీయరానిది. ఇంధన భద్రత నుంచి జల భద్రత వరకు ఇరుదేశాలు సన్నిహితంగా సహకరించుకుంటున్నాయి. నెదర్లాండ్స్ తులిప్‌లకు, భారత్ తామర పువ్వులకు ప్రసిద్ధి. మూలాలు నీటిలో ఉన్నా, భూమిలో ఉన్నా.. సరైన పోషణతో వృద్ధి చెందగలవని తులిప్, తామర పువ్వులు మనకు సందేశాన్నిస్తున్నాయి. భారత్, నెదర్లాండ్స్ భాగస్వామ్యానికి కూడా ఇదే పునాది. ఓటింగ్‌లో కొత్త రికార్డులు గర్వకారణం అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో 80 శాతం నుంచి 90 శాతానికిపైగా ఓటింగ్ నమోదయ్యింది. ఎన్నికల ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది. ఓటింగ్‌లో కొత్త రికార్డులు నమోదవుతుండడం గర్వంగా ఉంది. బెంగాల్ చిరుతిండి ఝాల్మురీ నెదర్లాండ్స్ దాకా చేరిందో లేదో ఇక్కడి భారతీయులే చెప్పాలి. నేను ఇక్కడికి రాగానే నినాదాలతో నన్ను స్వాగతించిన విధానం అమితంగా ఆకట్టుకుంది’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రాజ దంపతులతో మోదీ భేటీ నెదర్లాండ్స్ రాజు విల్లెమ్–అలెగ్జాండర్, రాణి మక్సిమా దంపతులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. రాయల్ ప్యాలెస్‌లో జరిగిన ఈ భేటీలో భారత్–నెదర్లాండ్స్ సంబంధాలపై చర్చించారు. చోళుల రాగి ఫలకాలు భారత్‌కు అప్పగింత 11వ శతాబ్దానికి చెందిన చోళ రాజవంశపు రాగి ఫలకాలను నెదర్లాండ్స్ శనివారం భారత్‌కు అప్పగించింది. భారత ప్రధాని మోదీ, నెదర్లాండ్స్ ప్రధాని రోబ్ జెటెన్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. నెదర్లాండ్స్‌లో లీడెన్ ప్లేట్లుగా పిలిచే అనైమంగళం రాగి ఫలకాలను తిరిగి పొందాలని భారత్ 2012 నుంచి ప్రయత్నిస్తోంది. మొత్తం 21 పెద్ద ప్లేట్లు, మూడు చిన్న ప్లేట్లు ఉన్నాయి. బరువు 30 కిలోలు. వీటిపై తమిళ భాషలో అక్షరాలు చెక్కి ఉన్నాయి. రాజరాజ చోళ–1 తన కుమారుడైన రాజరాజ చోళ–2కు చేసిన వాగ్దానం ఇందులో ఉంది. ఈ ఫలకాలను తమిళ చోళ రాజవంశానికి చెందిన అత్యంత ముఖ్యమైన చారిత్రక ఆధారాలుగా పరిగణిస్తున్నారు. భారతదేశం వెలుపల తమిళ వారసత్వపు ముఖ్యమైన కళాఖండాల్లో ఇవి కూడా ఒకటి. ఇవి రాజరాజ చోళ–1 కాలానికి సంబంధించినవని చెబుతున్నారు. చోళుల రాజముద్ర కలిగిన కంచు తీగతో వీటిని కట్టి ఉంచారు. ఇవి శతాబ్దాల క్రితమే చేతులు మారి భారత్ నుంచి నెదర్లాండ్స్‌కు చేరాయి. రాగి ఫలకాలు తిరిగి భారత్‌కు అందడం ప్రతి భారతీయుడికి ఆనందకరమైన క్షణమని మోదీ అభివర్ణించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ఇన్నాళ్లూ ఈ రాగి ప్లేట్లను భద్రపర్చినందుకు నెదర్లాండ్స్ ప్రభుత్వానికి, లీడెన్ యూనివర్సిటీకి కృతజ్ఞతలు తెలియజేశారు. -
కువైట్‌లో విషాదం: భవనం పైనుంచి పడి భారతీయ విద్యార్థిని మృతి
కువైట్: కువైట్‌లో నివసిస్తున్న ఒక భారతీయ విద్యార్థిని ఎత్తైన నివాస భవనం పైనుంచి పడి ప్రాణాలు కోల్పోయింది. అబ్బాసియా ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.మృతురాలిని కేరళలోని ఎర్నాకులం జిల్లా, పెరుంబావూర్ సమీపంలోని చిరక్కర ముట్టం ప్రాంతానికి చెందిన ఫేబా బిజు మణి (14)గా గుర్తించారు. ఆమె అబ్బాసియాలోని 'యునైటెడ్ ఇండియన్ స్కూల్'లో 9వ తరగతి చదువుతోంది. అబ్బాసియా హైవే మార్కెట్ సమీపంలో ఉన్న ఒక నివాస భవనం పైనుంచి ఆమె కింద పడిపోయినట్లు సమాచారం.ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు, అధికారులు మృతదేహాన్ని తదుపరి న్యాయ, వైద్య ప్రక్రియల నిమిత్తం ఫర్వానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఆత్మహత్యా లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. విద్యార్థిని మృతితో స్థానిక భారతీయ సమాజంలో విషాద ఛాయలు అలముకున్నాయి. -
దుబాయ్ విడిచి.. విజయ్ వెంట నడిచి..
వెండితెరపై ‘దళపతి’గా వెలిగిన విజయ్, ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి. అయితే ‘తమిళక వెట్రి కజగం’ (టీవీకే) సారథిగా రాజకీయ క్షేత్రంలో కదం తొక్కిన విజయ్ ఎక్కడికి వెళ్లినా, ఏ బహిరంగ సభలో పాల్గొన్నా ఆయన పక్కనే నలుపు రంగు దుస్తుల్లో నిశితంగా గమనిస్తూ కనిపించే ఒక ‘మిస్టరీ మ్యాన్’ ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్. ఆయనే నయీమ్ మూసా. దుబాయ్‌లో భారీ వ్యాపార సామ్రాజ్యం ఉన్నప్పటికీ, కేవలం స్నేహం కోసం విజయ్ రక్షణ వలయాన్ని పర్యవేక్షిస్తున్న ఈ మలయాళీ పారిశ్రామికవేత్త ప్రయాణం ఒక సినిమా కథను తలపిస్తోంది.మాహే నుంచి దుబాయ్ వరకు..పుదుచ్చేరి పరిధిలోని మాహేలో జన్మించిన నయీమ్ మూసాకు చిన్నప్పటి నుంచే ఫిట్నెస్, బాడీబిల్డింగ్‌పై మక్కువ ఎక్కువ. ఉపాధి కోసం దుబాయ్‌కు వెళ్లిన ఆయన, అక్కడ కఠిన శ్రమతో తన శరీరాకృతిని మలచుకున్నారు. ఒక చిన్న సెక్యూరిటీ అసైన్మెంట్తో ప్రారంభమైన ఆయన ప్రస్థానం, నేడు గల్ఫ్ దేశాల్లోనే ప్రముఖ భద్రతా సంస్థ అయిన ‘జెండర్ సెక్యూరిటీ’ స్థాపనకు దారితీసింది.గ్లోబల్ స్టార్లకు రక్షణ కవచంనయీమ్ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. పాప్ సింగర్ జస్టిన్ బీబర్, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ వంటి హేమాహేమీలు దుబాయ్ వెళ్తే వారి భద్రత బాధ్యత నయీమ్దే. ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ వంటి భారీ క్రీడా వేడుకలకు యూఏఈ ప్రభుత్వం అధికారికంగా నయీమ్ ఏజెన్సీకే భద్రతా ఏర్పాట్లు అప్పగిస్తుంటుంది. ప్రస్తుతం తన వ్యాపారాన్ని భారత్‌కు విస్తరించి, చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఆయన వ్యాపారం కోట్లలో విస్తరించి ఉన్నప్పటికీ, దాని ఖచ్చితమైన విలువ వివరాలు తెలియవు.రాజకీయాల్లోనూ విజయ్ ‘రైట్ హ్యాండ్’విజయ్ సినిమాల్లో ఉన్నప్పుడు కేవలం షూటింగ్లకే పరిమితమైన నయీమ్, టీవీకే స్థాపన తర్వాత విజయ్‌కు అనివార్య వ్యక్తిగా మారారు. ‘నయీమ్ నా వెంట ఉన్నంత కాలం నా భద్రత గురించి నాకు చింత లేదు’ అని విజయ్ స్వయంగా పేర్కొనడం వారి మధ్య ఉన్న అనుబంధానికి నిదర్శనం.ముఖ్యమంత్రి కాకముందు ప్రభుత్వం విజయ్‌కు 'వై' కేటగిరీ భద్రత కల్పించిప్పటికీ, వ్యక్తిగతంగా నయీమ్ ఏర్పాటు చేసే రక్షణ వలయంపైనే దళపతికి గురి. తమిళనాడు రాజకీయ సభల కోసం కేరళ నుంచి ప్రత్యేకంగా శిక్షణ పొందిన నిపుణులను నయీమ్ రప్పిస్తుంటారు. ఆధునిక సాంకేతికతను, కట్టుదిట్టమైన క్రమశిక్షణను కలగలిపి ఆయన రూపొందించే భద్రతా వ్యూహాలు అజేయమైనవి. ఆడంబరాలకు దూరంగా, మీడియా వెలుగులోకి రాకుండా కేవలం తన క్లయింట్ భద్రత, గోప్యతకే నయీమ్ ప్రథమ ప్రాధాన్యం ఇస్తారు. -
కోటి రూపాయల శాలరీ నుంచి ఫ్లాట్లు శుభ్రం చేసే స్థాయికి..!
మనం జీవితంలో ఏదో ఒక దశలో ఎత్తుపల్లాలు చూస్తుంటాం. కానీ ఆ క్రిటికల్ టైంలో కూడా ధైర్యంగా నిలబడిన వాడే మనిషి. అదే చెబుతోంది ఈ భారత సంతతి మహిళ కథ. ఒక్కోసారి మన రేంజ్ ఆకాశమంత ఉంటే..అకస్మాత్తుగా విధి అథఃపాతాళానికి పడేస్తుంటుంది. మళ్లీ లేచి నిలబడలేనంతగా విపత్కర పరిస్థితి ఎదురవ్వతుంటుంది. ఆ సమయంలో చాకచక్యంగా మనకు దొరికిన చిన్న చిన్న అవకాశాల నుంచి మళ్లీ మొదలు పెడుతూ నిలబడ్డ వ్యక్తి సత్తా ఉన్న హీరో. ఆ మాటలకు నిలువెత్తు నిదర్శనం ఆమె.భారత సంతతి మహిళ శ్వేతా దేశాయ్ ఒకప్పుడు లండన్‌లోని ఒక ప్రముఖ వాణిజ్య వ్యాపార వెబ్సైట్లో హెడ్ ఆఫ్ ప్రొడక్ట్‌గా పనిచేశారు. ఏకంగా కోటి రూపాయల వేతనం అందుకుంటూ మంచి లగ్జరీ లైఫ్‌ని లీడ్ చేసేవారామె. అలాంటి 37 ఏళ్ల శ్వేతకు 2023 చివరలో తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి మెల్బోర్న్కు వెళ్లడంతో ఆమె పరిస్థితి తలకిందులైపోయింది. అక్కడ తన అర్హతలకు తగిన ఉద్యోగం దొరకడం చాలా కష్టమైపోయింది. మెల్బోర్న్ ఉద్యోగ మార్కెట్ అత్యంత చిన్నాభిన్నంగా ఉండటంతో జాబ్ వేట చుక్కలు చూపించిందామెకు. అప్పటి వరకు అంత పెద్ద హోదాలో ఉన్న శ్వేతకు తన గుర్తింపును కోల్పోతున్న వేదన ఎక్కువైంది. తన అర్హతలకు తగిన ఉద్యోగం దొరక్క చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసింది. దాంతో తనకు వస్తున్న ఉద్యోగాల ఆఫర్లలో జాయిన్ అయ్యేందుకు రెడీ అయిపోయింది. అదెలాంటి ఉద్యోగం అంటే..కార్పొరేట్ ఉద్యోగ జీవితం నుంచి అపార్ట్మెంట్లు శుభ్రం చేసే స్థాయికి చేరిపోవాల్సి వచ్చింది. ఆమెకు వచ్చిన తొలి జాబ్ ఆఫర్ Airbnb అపార్ట్మెంట్ల నిర్వహణనే నిర్వర్తించేందుకు రెడీ అయినట్లు తెలిపింది. ఇందులో భాగంగా ఆమె అపార్ట్మెంట్లు శుభ్రం చేయడం, బట్టలు ఉతకడం , అతిథుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం తదితరాలు ఉంటాయి. ఇక ముంబైలో పుట్టి పెరిగిన శ్వేత ఉన్నత చదువుల కోసం 2008లో లండన్‌కు వెళ్లింది. ఆ తర్వాత 15 సంవత్సరాలు బ్రిటిస్ రాజధానిలో ఒక ఇంటిని, జీవితాన్ని నిర్మించడంలో గడిపింది. 2023 నాటికి లండన్ బోటిక్ వెడ్డింగ్ రిజిస్ట్రీలో వార్షిక ఆదాయం దాదాపు రూ. కోట్లు ఆదాయం ఆర్చించేది. భర్త ఉద్యోగ రీత్యా మెల్బోర్న్కి వెళ్లడంతో పరిస్థితి అత్యంత విభిన్నంగా మారిపోయింది. ఈ మార్పు సహజంగానే ఆమె జీవనశైలిని తగ్గించుకునేలా చేసింది. లండన్‌లో, శ్వేతకు డిజైనర్ బ్యాగులు, ఫ్యాన్సీ మేకప్, ఆర్థిక స్వేచ్ఛ ఉండేవి. కానీ మెల్బోర్న్లో ఆమెకు అదే విలాసవంతమైన జీవితం దొరకలేదు. ఈ అనూహ్యమైన మార్పు తనను చాలా దారుణంగా కుంగదీసిందని చెప్పుకొచ్చింది. పైగా ఎవ్వరైన స్నేహితులు, బంధువుల ఏం చేస్తున్నావు అని అడిగినప్పుడూ ఏ చెప్పాలో తెలిసేది కాదు. ఒక్కోసారి హౌస్ వైఫ్ అని ముసుగు కప్పుకుని తిరగాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ఆ నేపథ్యంలో తనకు దొరికిన మొదటి ఉద్యోగ ఆఫర్లో వెంటనే చేరిపోయినట్లు చెప్పుకొచ్చింది. కానీ ఈ ఉద్యోగం కారణంగా మళ్లీ ఇదవరకటిలా ఆత్మవిశ్వాసంగా ఉండగలిగానంటోంది. తాను అపార్ట్మెంట్లు నిర్వహించడం తోపాటు పిల్లలకు ఇంగ్లీష్ బోధించడం, సొంతంగా వ్యాపారాన్ని, కోచింగ్ ప్రాక్టీస్ వంటి వాటిని నిర్వహిస్తున్నారామె. ఏ ఉద్యోగం దొరకలేదని ఆగిపోకుండా..దొరికిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ అందులో జాయిన్ అయిపోవడమే మేలని అంటోంది. చాలామంది డబ్బుకు అంత విలువలేదని ఏవేవో చెబుతుంటారు కానీ వాస్తవికంగా అది కరెక్ట్ కాదని అంటోందామె. అంతేగాదు ఆర్థిక స్వతంత్రను కలిగి ఉండటం అంటే తన ఇష్టానుసారం జీవితాన్ని గడిపే స్వేచ్ఛను కలిగి ఉండటం. డబ్బు అంటే ఎన్నో అవకాశాలు, స్వేచ్ఛ, కొన్నిసార్లు సంతోషం కూడా అని చెప్పుకొచ్చిందామె. ఒకప్పుడు అంత పెద్ద ఉద్యోగ హోదాతో చాలా బాగా బతికాను, పైగా తెలియకుండా ఆ లెవెల్ అహం నాలో చాలా పెరిగిపోయిందని తెలసుకున్నా అంటోందామె. ఇలా ఈ రేంజ్‌కి వచ్చేసినా..ప్రస్తుతం మూడు వేర్వరే పనులు చేస్తున్నట్లు తెలిపింది. ఇలా తనలా వేరేప్రాంతానికి మారడంతో ఉద్యోగం కోల్పోయి, ఐడెంటిటీని కోల్పోయి నరకం చూస్తున్న మహిళలకు కోసం “ది రీబిల్డ్ రూమ్” అనే వాట్సాప్ కమ్యూనిటీని ప్రారంభించానని, పైగా అలాంటివాళ్ల కోసం ప్రత్యేక కోచింగ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. View this post on Instagram A post shared by Shweta (@shweta_lifecoach) (చదవండి: అన్యోన్య దాంపత్యం అంటే ఇదే కదా..! బాధను సైతం..) -
కాన్వొకేషన్ ముగిసిన మరుక్షణమే కానరాని లోకాలకు..
లక్కిరెడ్డిపల్లె(అన్నమయ్య జిల్లా): కన్న కొడుకు విదేశాల్లో గొప్ప చదువులు చదివి, ఉన్నత శిఖరాలు అధిరోహిస్తాడని ఆశపడ్డ ఆ తల్లిదండ్రులకు విధి తీరని అన్యాయం చేసింది. ఎంఎస్ పూర్తి చేసి పట్టా అందుకున్న సంబరం నిండకముందే, అదే రాత్రి మృత్యువు గుండెపోటు రూపంలో వచ్చి ఆ యువకుడిని బలితీసుకుంది. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లెకు చెందిన షేక్ తాజ్ కుమారుడు మహమ్మద్ కుమేల్ షేక్ (28) అమెరికాలో గురువారం రాత్రి హఠాన్మరణం చెందాడు. కుమేల్ షేక్ ఇంజినీరింగ్ విద్యను చెన్నైలోని సత్యభామ వర్సిటీలో పూర్తి చేశారు. అనంతరం ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని గోల్డెన్ గేట్ వర్సిటీలో ఎంఎస్ పూర్తి చేసుకున్న ఆయన, గురువారం జరిగిన కాన్వొకేషన్ వేడుకలో పట్టా అందుకున్నారు. ఆ ఆనందంలో కుటుంబ సభ్యులతో మాట్లాడి, స్నేహితులతో కలిసి ఫంక్షన్ ముగించుకుని ఇంటికి వెళ్లారు. నిద్రలోనే గుండెపోటు రావడంతో ఆయన కన్నుమూశారు. మృతుడి తండ్రి స్టాంప్ రైటర్‌గా పనిచేస్తున్నారు. -
ఘనంగా స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడెమీ వార్షికోత్సవాలు
స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడెమీ తన సప్తమ వార్షికోత్సవం (ఏప్రిల్25, 2026) ఘనంగా జరుపుకుంది. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య వెలుదండ నిత్యానందరావు ముఖ్య అతిధిగా విచ్చేసిన ఈ కార్యక్రమం ప్రొఫెసర్ బి.వి.ఎస్. చౌదరి, రాజ్యలక్ష్మి చౌదరి సమక్షంలో సింగపూర్ శివకృష్ణ దేవాలయంవారి ఫంక్షన్ హాలు వేదికగా జరిగింది.స్వరలయ సంస్థ విద్యార్ధుల సంగీత మరియు కూచిపూడి నృత్య ప్రదర్శనలతో ఆహూతులను అలరించారు. కుమారి శ్రీవిద్య పంతువరాళి రాగంలో “ఎన్నగాను రామభజన” త్యాగరాజ కీర్తనను హృద్యంగా గానం చేశారు. స్వరలయ వ్యవస్థాపక అధ్యక్షురాలు, గురు శేషుకుమారి సంగీత ప్రదర్శనలో ఆలపించిన త్యాగరాజ కీర్తన “ప్రక్కల నిలబడి”, ఒక “మీరా భజన్” , విద్యార్థులతో కలిసి చేసిన జానపద గీతం ప్రేక్షకుల నుండి విశేష ప్రశంసలు అందుకున్నాయి.తరువాత తెలుగు విశ్వవిద్యాలయం గ్రేడ్ , యూనివర్సిటీ కోర్సులలో ఉత్తీర్ణులైన సంగీత విద్యార్ధులకు VC నిత్యానందరావు అర్హతాపత్రాలు, ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శేషుకుమారి సంగీత ప్రస్థానాన్ని ప్రశంసించారు. సంగీతకళను భావితరాలకి అందించేలా ఆమెను నడిపిస్తున్నాయన్నారు. స్వరలయ విద్యార్ధులు భవిష్యత్తులో కర్నాటక సంగీతరంగంలో తమవైన విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.హార్మనీ & హ్యూస్ అధ్యక్షురాలు శ్యామల ప్రసంగిస్తూ 2025లో తిరుపతిలో అన్నమాచార్య 500వ జయంతి ఉత్సవాలలో చేసిన సంగీత కచేరీ, శేషుకుమారి వంశీ-సీల్వెల్ ఫౌండేషన్ వారి మంగళంపల్లి బాలమురళీకృష్ణ అవార్డ్ అందుకోవడం స్వరలయసంస్థ సాధించిన కొత్త మైలురాళ్ళని కొనియాడారు.అలాగే కుమారి మనోజ్ఞ అనే గాత్రసంగీత విద్యార్ధి మాట్లాడుతూ కర్నాటక గాత్ర సంగీతాన్ని ఒక O-level ఆప్షనల్ సబ్జెక్టుగా తీసుకుని పరీక్షలు వ్రాసేందుకు MOE (సింగపూర్ విద్యాశాఖ) తాను అనుమతి సాధించగలగటం విశేషం అనీ, ఇది తన గురువు ఇచ్చిన స్ఫూర్తి, మార్గదర్శకత్వం వల్లనే సాధ్యమైందనీ, సంగీతం ఒక సబ్జెక్టుగా తీసుకోవడంతో ఇటు సంగీతంలో కృషి, అటు చదువుకునే సమయాన్ని సమర్ధవంతంగా వాడుకోవడం వీలవుతోందని చెప్పారు. ఈ వేడుకలో మరో ప్రత్యేక ఆకర్షణగా, గురు శేషుకుమారి తాళం మరియు రాగం నేర్పించేందుకు వినూత్నమైన సంగీత ఆటలను ప్రవేశపెట్టారు. ఇవి ప్రత్యక్షంగా వేదికపై నిర్వహించబడి, సంగీత శిక్షణలో ఒక కొత్త పోకడను పరిచయం చేశాయి.యూ.టీ.ఐ.ఏ.ఈ.సీ చైర్మన్ రాయ్, ట్రెజరర్ v. Adesh బాబు , కళ , శివ కృష్ణ ఆలయ చైర్మన్ ,మేనేజర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీసాంస్కృతిక కళాసారధి అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్, కాకతీయ సాంస్కృతిక పరివారం నుంచి సబ్బుపాలకుర్తి , సింగపూర్ తెలుగు వనితలు సమూహం నుంచి క్రాంతి, జయ, దీపు , రేఖ , రాణి, గాయత్రి వంటి అతిథుల సమక్షంలో ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. పిల్లల ఉత్సాహభరితమైన ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించి, వేడుకను విజయవంతంగా ముగించాయి. సౌజన్య చక్కటి వ్యాఖ్యానంతో కార్యక్రమాన్ని రక్తి కట్టించారు -
ఘనంగా తెలుగు సింగపూర్ ప్రీమియర్ లీగ్ 2026
తెలుగు సింగపూర్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్, మే డే సందర్భంగా Terusan Recreation Centre వద్ద ఘనంగా ముగిసింది. ఏప్రిల్ 18 నుంచి మే 1 వరకు నాలుగు వారాంతాల్లో నిర్వహించిన ఈ టోర్నమెంట్లో, సింగపూర్ నలుమూలల నుంచి వచ్చిన తెలుగు కార్మికులు, ఉద్యోగులు మరియు కుటుంబ సభ్యులు విశేషంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు .“సైట్లో కష్టం… గ్రౌండ్లో శక్తి” అనే నినాదంతో నిర్వహించిన ఈ టోర్నమెంట్, సింగపూర్ తెలుగు సమాజ ఐక్యత, శక్తి కృషికి ప్రతీకగా నిలిచింది.మొత్తం 18 జట్లు పోటీపడిన ఈ టోర్నమెంట్లో, లీలా నాగేశ్ నాయకత్వంలోని తెలుగు వారియర్స్ జట్టు విజేతగా నిలవగా, సాహు చంద్రశేఖర్ నాయకత్వంలోని మెగాయార్డ్ రైడర్స్ జట్టు ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 17 మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగగా, 250కి పైగా ఆటగాళ్లు తమ ప్రతిభను ప్రదర్శించారు. విజేతలకు వరుసగా SGD1,116 మరియు SGD558 నగదు బహుమతులతో పాటు ట్రోఫీలు అందజేశారు.వ్యక్తిగత విభాగంలో బండి శ్రీనివాస్ రెడ్డి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకోగా, శ్యామ్ ఉత్తమ ఆల్‌రౌండర్‌గా, ఆంథోనీ ఉత్తమ బౌలర్‌గా, విజ్జు ఉత్తమ బ్యాట్స్‌మన్‌గా ఎంపికయ్యారు. మెగాయార్డ్ రైడర్స్ జట్టుకు చెందిన ఇద్దరు ఆటగాళ్లు వ్యక్తిగత అవార్డులు గెలుచుకోవడం విశేషం.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సారిక ప్రసాద్ హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. అలాగే రాంబాబు పాతూరి (కాకతీయ కల్చరల్ అసోసియేషన్), రత్న కుమార్ కవుటూరు (శ్రీ సాంస్కృతిక కళాసారథి), సింగపూర్ తెలుగు సమాజం పూర్వ అధ్యక్ష్యులు రంగా రవి, చౌదరి జె తదితరులతో పాటు శేషారావు గూడూరి, వినయ్ కుమార్ సూర్యదేవర, సురేంద్ర చెబ్రోలు, చంద్రశేఖర్ చిలుకూరి, హనుమంతరావు మాదాల, అమ్మయ్య చౌదరి, గంగాధర్ తాటి, సతీష్ పారేపల్లి, వేణు నార్నే తదితర ప్రముఖులు విచ్చేసి నిర్వాహకులను మరియు క్రీడాకారులను అభినందించారు.శివ ప్రసాద్ కొల్లా నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో బి వర ప్రసాద్, గిరిధర్ సరాయి, అనిల్ కుమార్ బొమ్మారెడ్డి తదితరులతో పాటు కోఆర్డినేటర్లు, లాజిస్టిక్స్ టీమ్, అంపైర్లు, స్కోరర్లు, వాలంటీర్లు అహర్నిశలు శ్రమించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సురేంద్ర చేబ్రోలు, ఉమా మహేశ్వర రావు, గురురాజ్ బనకర్, శ్రీను యాదవ్, గొర్రెపాటి లక్ష్మీ రెడ్డి అంపైర్లుగా వ్యవహరించగా, రమేష్ వ్యాఖ్యాతగా కార్యక్రమానికి మరింత ఆకర్షణ తీసుకువచ్చారు.టీం శివప్రసాద్ ప్రతినిధులు మాట్లాడుతూ, ఈ టోర్నమెంట్ విజయవంతం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, వచ్చే ఏడాది టీంను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. మహిళల విభాగం ప్రవేశపెట్టడం, మెరుగైన లైవ్ స్ట్రీమింగ్, మరిన్ని సదుపాయాలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. -
అమెరికాలో కర్నూలు యువకుడి ఆత్మహత్య
ఎన్నో కలలతో విదేశాల్లో అడుగుపెడుతున్న భారతీయులకు.. వాస్తవ పరిస్థితులు విరుద్ధంగా మారి ఒత్తిళ్లకు గురి చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ట్రంప్ అధ్యక్ష పదవిలోకి వచ్చాక దారుణంగా మారింది. ఇప్పటికే పలువురు ఆ దేశం వీడుతుండగా.. మరికొందరు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించుకుంటున్నారు. ఈ క్రమంలో షికాగోలో విషాదం చోటు చేసుకుంది. షికాగోలో భారత్‌కు చెందిన ఓ టెక్కీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ యువకుడి పేరు చందు ఇరగనబోయిన(26). స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాగా దర్యాప్తు అధికారులు తెలిపారు. అతని కుటుంబ నేపథ్యం తెలియరావాల్సి ఉంది.ఇక్కడే ఓ ప్రముఖ కాలేజీలో బీటెక్ చేసిన చందు.. ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని అమెరికాకు వెళ్లాడు. చికాగోలో డీపౌల్ యూనివర్సిటిలో ఎమ్మెస్ పూర్తి చేసి కిందటి ఏడాది జూన్ నుంచి ఓ ప్రముఖ కంపెనీలో డెవలపర్‌గా పని చేస్తున్నాడు. అయితే.. ఒంటరితనం, ఆర్థిక ఇబ్బందులు తాళలేక పిస్టల్‌తో కాల్చుకుని ఏప్రిల్ 28న ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపంతో చనిపోయినట్లు కొన్ని మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నప్పటికీ.. స్థానిక పోలీసులు మాత్రం సూసైడ్‌కు గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉందని చెబుతున్నారు. అలాగే అతని ఉద్యోగం ఉందా? లేదా? అనే దానిపైనా ఓ క్లారిటీ రావాల్సి ఉంది. మృతదేహాన్ని భారత్‌కు పంపేందుకు తానా ఏర్పాట్లు చేస్తుండగా.. మరోవైపు చందు కుటుంబాన్ని ఆదుకునేందుకు అతని స్నేహితుడు రాజేష్ గుర్రం గోఫండ్‌మీ ద్వారా విరాళాలు సేకరిస్తున్నాడు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
అమెరికా నుంచి వచ్చి ఆరేళ్లు : గార్డ్స్పై కత్తితో దాడి, షాకింగ్ రీజన్?
సాక్షి, ముంబై: అమెరికా నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన వ్యక్తి అనూహ్యంగా సెక్యూరిటీ గార్డులపై దాడి చేసిన ఘటన కలకలం రేపింది. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ దాడి జరిగింది. పోలీసులు నిందితుడిని మూడు గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకున్నారు. అయితే దాడి చేసిన కారణం ఏంటి అనేదానిపై దర్యాప్తు జరుగుతోంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం 19 ఏళ్ల పాటు అమెరికాలో ఉండి జైబ్ అన్సారీ (31) అనే వ్యక్తి 2019లో భారతదేశానికి తిరిగి వచ్చాడు. కారణాలపై స్పష్టత లేనప్పటికీ, ముంబై సమీపంలోని మీరా రోడ్లో ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై కత్తితో దాడి చేయడం కలకలం రేపింది. ఒక మతపరమైన శ్లోకాన్ని పఠించడానికి నిరాకరించినందుకు ఇద్దరు గార్డులను కత్తితో పొడిచినట్టు తెలుస్తోంది. ఈ దాడిలో గాయపడిన ఇద్దరు గార్డులు రాజ్‌కుమార్ మిశ్రా, సుబ్రతో సేన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మీరా రోడ్ ఈస్ట్‌లోని నయా నగర్లో గల 'అస్మిత గ్రాండ్ మ్యాన్షన్' కన్స్ట్రక్షన్ సైట్ వద్ద ఈ ఘటన జరిగింది. నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు ఒక మతపరమైన శ్లోకాన్ని పఠించమని గార్డులను కోరాడని, వారు నిరాకరించడంతోనే దాడి చేశాడని కొన్ని హిందూ సంస్థలు ఆరోపిస్తున్నాయి. భజరంగ్ దళ్ వంటి సంస్థలు ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఈ కేసును మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం (ATS) థానే విభాగానికి బదిలీ చేశారు. అసలు దాడికి గల కారణంపై లోతైన దర్యాప్తు జరుపుతున్నామని పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటనతో మీరా రోడ్ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. పుకార్లు వ్యాపించకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకున్నారు. అలాగే ఈ ఆరోపణల వెనుక ఉన్న నిజాన్ని నిందితుడి నేపథ్యాన్ని ATS అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.ఇదీ చదవండి: వినాశకాలే విపరీత బుద్ధి : వీసీ సజ్జనార్ చీవాట్లు -
డబ్లిన్‌లో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతోత్సవాలు
ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ మహానగరమందు అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ వాసవి సమాఖ్య ఐర్లాండ్ వారి ఆధ్వర్యంలో విశ్వరూపిణి, శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి, లలితా చండీ స్వరూపిణి అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాన్ని వైశాఖ శుద్ధ దశమి నాడు స్థానిక VHCCI ఆలయం నందు ఘనంగా నిర్వహించారు.కార్యక్రమంలో భాగంగా ముందుగా గణపతి ప్రార్థనతో ప్రారంభించి, అమ్మవారికి విశేష అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పుష్పాలతో అద్భుతంగా అలంకరించి, “జై జై వాసవి మాత” నినాదాల మధ్య పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా రాజోపచార సేవ అయిన ఛత్ర సహిత పల్లకి సేవ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.సనాతన ధర్మంలో గోపూజకు విశిష్టమైన స్థానం ఉండటంతో, ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా శాస్త్రోక్తంగా గోపూజను నిర్వహించారు. భక్తులు గోమాత,దూడను దర్శించి పూజలు నిర్వహించి ఆశీర్వాదాలను పొందారు. పిల్లలకు మన సంస్కృతిని పరిచయం చేయాలనే ఉద్దేశంతో చిన్నారులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర వేషభూషణలతో పాటు అష్టలక్ష్మి స్వరూపాలలో దర్శనమిచ్చి, లక్ష్మి తత్వాన్ని అందరికీ వివరించారు. ఈ సందర్భంగా జ్యోతి గోస్వామి గారి నృత్య ప్రదర్శన, మహిళల భక్తి గానాలు, పిల్లలచే అన్నమాచార్య సంకీర్తనలు, ప్రస్తుత పరిస్థితులను అద్దంపట్టే విధంగా మన సంస్కృతిని సంప్రదాయాన్ని దైనందిన జీవితంలో ఎలా తీసుకోవాలనే అంశంపై చిన్నపిల్లల కార్యక్రమం, పిల్లలచే ఆలపించిన మంత్రపుష్పం వంటి సాంస్కృతిక మరియు దైవిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.తరువాత వాసవి స్వరూపమైన కన్యకలతో శాస్త్రోక్తంగా కన్యపూజ నిర్వహించబడింది. అనంతరం దుర్గాసహిత వాసవి అమ్మవారి కుంకుమార్చన పూజలో దంపతులందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. కార్యక్రమం చివరలో అన్నప్రసాద వితరణ జరగగా, కార్యక్రమానికి సహకరించిన ఉభయదారులు మరియు వ్యాపార సంస్థల యజమానులందరికి పినాక శర్మ గారు వేద ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన సేవాదళ సభ్యులను, ఉభయదారులను, హాజరైన సభ్యులందరినీ కార్యక్రమ నిర్వాహకులు అభినందించారు.(చదవండి: అమెరికాలో వివేకానందునికి అరుదైన గౌరవం) -
ఈ అనుభవంతో భారత్‌ను వెతుక్కుంటూ తిరిగొచ్చేసిన NRI
చాలామంది భారతీయులకు విదేశాల్లో ఉద్యోగాలు చేయడమంటే మహా ఇష్టం. ముఖ్యంగా అమెరికాకు వెళ్తే మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని, మెరుగైన జీవన ప్రమాణాలతో జీవించవచ్చని భావిస్తారు. కానీ, సంజుమ్ సింగ్ ధలీవాల్ అనే వ్యక్తికి అందుకు భిన్న పరిస్థితులు ఎదురయ్యాయి. ఆయన చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన అనుభవాన్ని పంచుకున్నాడు ధలీవాల్. అమెరికాలో మంచి ప్రాంతంలో నివసించినప్పటికీ ఎందుకు భారత్‌కు తిరిగి వచ్చానో వివరించాడు. తాను అమెరికాలో ఉండలేకపోవడానికి అమెరికాలోని ఆరోగ్య వ్యవస్థపై తనకున్న అసంతృప్తేనని స్పష్టం చేశాడు.తనకు రెండు సార్లు చేతికి గాయమైందని ఒకటి భారత్లోకాగా, మరొకటి అమెరికాలో అయిందని తెలిపాడు. భారత్‌లో వైద్య ప్రక్రియ వేగంగా, సులభంగా, తక్కువ ఖర్చుతో పూర్తయ్యిందని చెప్పాడు. కానీ, అమెరికాలో మాత్రం అటువంటి గాయానికే చికిత్స చేయించుకోవడానికి సమస్యలు ఎదురయ్యాయని తెలిపాడు.అమెరికాలో ఆసుపత్రిలో చికిత్స తీసుకునే ప్రక్రియ సంక్లిష్టంగా, చాలా ఖర్చుతో కూడుకుని ఉంటుందని తెలిపాడు. చికిత్స కోసం చాలా సమయం వేచిచూడాల్సి వచ్చిందని, అనేక దశలు ఉన్నాయని, ఖర్చు ఎక్కువగా ఉందని తెలిపాడు.విరిగిన ఎముకను పరీక్షించించుకోవడానికి డాక్టర్ అపాయింట్మెంట్ పొందేందుకు 2 నెలలకు పైగా వేచిచూడాల్సి వచ్చిందని ధలీవాల్ పేర్కొన్నాడు. ఈ ఆలస్యం, అమెరికా వైద్య వ్యవస్థ తనలో అసహనాన్ని కలిగించిందని చెప్పాడు. అమెరికాలో నివసించడం సాధ్యమేనా? అన్న అనుమానాన్ని కలిగిందని తెలిపాడు."భారత్‌లో ముందుగా చికిత్స చేశారు, తర్వాత ప్రశ్నలు అడిగారు. వైద్య పరంగా ఎలాంటి ఒత్తిడి లేదు. కానీ, అమెరికాలో కేవలం అపాయింట్మెంట్ పొందేందుకు 2 నెలలకు పైగా వేచిచూడాల్సి వచ్చింది. చివరికి వరుసగా 3 రోజుల పాటు నైట్ క్లినిక్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించాను. 10 రోజుల తర్వాత చికిత్స చేసే డాక్టర్ దొరికాడు" అని ధలీవాల్ చెప్పాడు.భారత్‌లో ఆరోగ్య సేవలు సులభంగా అందుబాటులో ఉన్నాయని, చివరకు తాను తిరిగి స్వదేశానికి రావడానికి ఇదే ప్రధాన కారణమైందని తెలిపాడు.ధలీవాల్ పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. భారతీయులు విదేశాల కంటే సొంత భారత్‌నే ఎక్కువగా విమర్శిస్తారని, విదేశాల్లో ఇటువంటి అనుభవాలు ఎదరవుతేనే మనదేశ విలువ తెలిసి వస్తుందని ఓ యూజర్ కామెంట్ చేశాడు. మరో యూజర్ స్పందిస్తూ "భారత్‌లో మధ్యతరగతి వారికి ఆరోగ్య సేవలు అమెరికాలో మధ్యతరగతి వారికంటే మెరుగ్గా అందుబాటులో ఉంటాయి" అని పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Sanjum Singh Dhaliwal | Certified Yapper (@_sangym_) -
భారతీయ మేధస్సుపై ట్రంప్ వ్యాఖ్యలు.. ఆత్మగౌరవానికి దెబ్బ
నేడు ప్రపంచ యవనికపై ఒక వికృత దృశ్యం ఆవిష్కృతమైంది. ఏ దేశమైతే స్వేచ్ఛకు, సమానత్వానికి కేరాఫ్ అడ్రస్ అని చెప్పుకుంటుందో.. ఏ దేశమైతే వలసదారుల రక్తం, చెమట మీద నిర్మించబడిందో.. ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ రోజు భారతీయ వలసదారులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అత్యంత దురదృష్టకరమైనవి. భారతీయులు నరకం నుంచి వస్తున్నారంటూ ఒక లేఖను సోషల్ మీడియాలో షేర్ చేయడం అత్యంత దారుణమైన విషయం. ఇది కేవలం ఒక దేశాధ్యక్షుడు చేయాల్సిన ప్రకటన కానే కాదు, ఇది ఒక జాతి మేధస్సుపై చేసిన దాడి. ఇది 140 కోట్ల మంది భారతీయుల ఆత్మగౌరవానికి తగిలిన గాయం. అధ్యక్షుడు ట్రంప్ గారూ మీరూ… ఒక్కసారి చరిత్ర పుటలు తిరగేయండి. మీ అహంకారపు పునాదుల కింద ఉన్నది భారతీయ మేధస్సు అని మర్చిపోకండి!అమెరికా వెన్నెముక.. భారతీయులే అన్న విషయాన్ని విస్మరించకండి. అసలు భారతీయులు లేని అమెరికాను ఊహించడం అసంభవం. గణాంకాలు ఏం చెబుతున్నాయో మీరే చూడండి. సుందర్ పిచాయి లేని గూగుల్, సత్య నాదెళ్ల లేని మైక్రోసాఫ్ట్, అరవింద్ కృష్ణ లేని IBM, శంతను నారాయణ్ లేని అడోబ్.. ఇవి కేవలం పేర్లు కావు, అమెరికాను ప్రపంచానికి నాయకుడిగా నిలబెట్టిన మేధావులు. మీరు ఈ రోజు వాడుతున్న విండోస్ నుంచి సెర్చ్ చేస్తున్న గూగుల్ వరకు ప్రతి అణువులోనూ భారతీయుడి మేధస్సు ఉంది. అమెరికాలోని అత్యంత శక్తివంతమైన 500 కంపెనీల్లో దాదాపు 35 శాతం కంపెనీల సారథులు భారతీయులే. సుందర్ పిచాయి, సత్య నాదెళ్ల మాత్రమే కాదు.. లీనా నాయర్ (చానెల్), రవి కుమార్ (కాగ్నిజెంట్), నిమేష్ షా.. ఇలా ఒక సుదీర్ఘమైన జాబితా ఉంది. వీరు లేకపోతే అమెరికా స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోతుంది.అమెరికా జనాభాలో భారతీయులు కేవలం 1.5 శాతం మాత్రమే. కానీ అమెరికా చెల్లించే మొత్తం ఆదాయపు పన్నులో భారతీయుల వాటా దాదాపు 6 శాతం. అంటే 300 పై చిలుకు బిలియన్ డాలర్లు. అంత పెద్ద మొత్తంలో ఖజానాకు పన్నుల రూపంలో ఇస్తున్నది భారతీయులే. అంతే కాదు అమెరికాలో ప్రతి నలుగురు వైద్యులలో ఒకరు భారతీయులే. భారతీయులు గనుక ఒక్క రోజు సమ్మె చేస్తే అమెరికా ఆస్పత్రుల్లో రోగుల పరిస్థితి ఏమిటో అమెరికా అధ్యక్షుడు ఒక సారి గుర్తు చేసుకుంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. ఒకవేళ భారతీయులు అక్కడ నరకాన్ని సృష్టిస్తే, ఆ నరకంలో నుంచి అమెరికన్లను కాపాడే దేవుళ్లు ఎవరు? అంతెందుకు మీరు గొప్పగా చెప్పుకునే నాసా లోని శాస్త్రవేత్తలలో 36 శాతం మంది భారతీయులే. అంటే అమెరికా జెండా అంతరిక్షంలో రెపరెపలాడాలన్నా, వెనక ఉండాల్సింది భారతీయుడి మేధస్సే.అమెరికా గత 50 ఏళ్లుగా గ్రీన్ కార్డ్ ఆశ చూపి మన దేశంలోని అత్యుత్తమ మేధస్సును దోచుకుంది. ఐఐటీలు, ఐఐఎంలలో మన ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చదివిస్తే.. ఆ మేధస్సును వాడుకుని అమెరికా లాభపడింది. తీరా పనయ్యాక, ఇప్పుడు నరకం అని ముద్ర వేస్తారా? ఇదేనా మీ సంస్కారం? గత అమెరికా అధ్యక్షులు తెలివైన వారు కాబట్టే భారత్ నుంచి మేధో వలసను ప్రోత్సహించారు. తద్వారా అమెరికా నేడు అగ్రరాజ్యమైంది. కానీ నేడు ట్రంప్ ఆ మేధావులను నరకం నుంచి వచ్చిన వారుగా సంబోధించడం ఆయన దిగజారుడుతనానికి పరాకాష్ఠ. ఏ నోటితో అయితే భారతీయులను దూషిస్తున్నారో, అదే నోటితో మళ్ళీ భారతీయ ఐటీ కంపెనీల సాయం కోరడం ఆయన ద్వంద్వ నీతికి నిదర్శనం. అమెరికా అభివృద్ధి చెందింది వారి సొంత తెలివితేటలతో కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులను, ముఖ్యంగా భారతీయులను ఆకర్షించి, వారిని వాడుకోవడం వల్ల మాత్రమే. ఈ విషయంలో భారత ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? మన దేశ గడ్డపై పుట్టి, ఇక్కడి నీరు తాగి, ఇక్కడ చదువుకుని.. అమెరికాను నిర్మిస్తున్న మన మేధావులను అవమానిస్తుంటే మన ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? ఇది దౌత్యపరమైన అంశం మాత్రమే కాదు, ఇది మన దేశ గౌరవానికి సంబంధించిన విషయం. మన టెక్కీలను, డాక్టర్లను, సైంటిస్టులను తిరిగి రండి.. మీ దేశాన్ని నిర్మించండని పిలిచే దమ్ము మన దేశ నాయకత్వానికి లేదా?పొరుగున ఉన్న చైనా గూగుల్ లేకుండా నడవగలుగుతోంది, వాట్సాప్ లేకుండా ఉండగలుగుతోంది. మరి భారత్ ఎందుకు గూగుల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి యాప్‌లపై ఆధారపడాలి? మన డేటాను వారు వాడుకుంటూ, మన దేశం నుంచి బిలియన్ డాలర్ల కొద్దీ వ్యాపారం చేస్తూ మనపైనే అహంకారం ప్రదర్శిస్తే ఎందుకు మౌనంగా ఉండాలి? మేకిన్ ఇండియా అనేది కేవలం నినాదం కాదు, అదొక నిప్పు కణిక కావాలి. మన మేధావులతో సరికొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ తీసుకురావాలి. భారతీయులను గౌరవించని దేశాల యాప్‌లను మన దేశంలో ఎందుకు అనుమతించాలి? చైనా తరహాలో మనం కూడా మన సొంత డిజిటల్ సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ కేవలం ఖండనలతో సరిపెట్టకూడదు. మా టెక్కీలను, మా డాక్టర్లను వెనక్కి రమ్మని భారత ప్రధాని ఎందుకు పిలుపు ఇవ్వకూడదు? గూగుల్ లేదా ఏఐ సెర్చ్ ఇంజన్లకు ప్రత్యామ్నాయంగా మనం సెర్చ్ ఇంజిన్ తయారు చేయలేమా? వాట్సాప్ కు బదులు మన సొంత మెసేజింగ్ యాప్ తీసుకురావడానికి ఇంకా ఎంతకాలం పడుతుంది? మన డేటాతో అమెరికా కంపెనీలు బిలియన్ల లాభాలు గడిస్తున్నాయి. ఆ డేటాను మన దేశంలోనే ఎందుకు భద్రపరచుకోకూడదు?మేకిన్ ఇండియా - ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? చైనా తన దేశంలో విదేశీ యాప్‌లను నిషేధించి సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకుంది. భారత్ ఆ సాహసం ఎందుకు చేయకూడదు? మన దగ్గర ప్రతిభ ఉంది, కోట్లాది మంది వినియోగదారులు ఉన్నారు. భారతీయులను అవమానించే నాయకులు ఉన్న దేశం నుంచి వస్తున్న టెక్నాలజీని మనం ఎందుకు నెత్తిన పెట్టుకోవాలి? ఆత్మనిర్భర్ భారత్ ఇది కేవలం వస్తువుల తయారీకే పరిమితం కాకూడదు. ఇది సాఫ్ట్వేర్, డిజిటల్ రంగాల్లో కూడా ప్రతిబింబించాలి.చివరగా, అధ్యక్షుడు ట్రంప్ గారూ.. వినండి! మీరు నిర్మిస్తున్న గోడలు మనుషులను వేరు చేయవచ్చు కానీ మేధస్సును ఆపలేవు. అమెరికా తన వినాశనాన్ని తనే కోరుకుంటుందని మీ వ్యాఖ్యలే నిరూపిస్తున్నాయి. భారతీయులు లేని అమెరికా ఒక శూన్యం. ఇకనైనా మన భారతీయ యువత ఆలోచించాలి. ఎన్నాళ్లు పరాయి దేశానికి ఊడిగం చేస్తాం? మన మేధస్సు మన దేశాభివృద్ధికి ఉపయోగపడాలి. విదేశీ యాప్‌లను బహిష్కరిద్దాం.. స్వదేశీ పరిజ్ఞానాన్ని వెలిగిద్దాం. మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే అమెరికా కల మనకు వద్దు! భారతీయ మేధస్సు.. ప్రపంచానికి దిక్సూచి కావాలి. - కంచర్ల యాదగిరిరెడ్డి, Managing Editor, సాక్షి టీవీ. -
అరవింద కృష్ణ స్వామికి అట్లాంటా శంకర నేత్రాలయ సత్కారం
అట్లాంటా: శంకర నేత్రాలయ USA (SNUSA) అట్లాంటా విభాగం Crowne Plaza Atlanta NE నార్క్రాస్లో అత్యంత ఉత్సాహభరితమైన, భారీ సంఖ్యలో ప్రజలు హాజరైన ఒక "Meet ’n Greet" (పరిచయ సమావేశం) కార్యక్రమాన్ని నిర్వహించింది. జార్జియా, పొరుగు రాష్ట్రాల నుండి 250 మందికి పైగా హాజరైన ఈ కార్యక్రమం, ఆ సంస్థ చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలిచింది. ఈ సందర్భంగా, Medlytix LLC CEO అయిన అరవింద్ కృష్ణ స్వామిని తమ సలహా మండలి (Board of Advisors)లో సరికొత్త సభ్యుడిగా సంస్థ అధికారికంగా ఆహ్వానించింది.అట్లాంటాలోని ప్రముఖ సంగీత, నృత్య అకాడమీల సాంస్కృతిక ప్రదర్శనలు పురోహిత నరసింహాచార్యులు దివ్య సన్నిధిలో, ఈ సమావేశం అర్థవంతంగా, విజయవంతంగా జరగాలని ఆశీస్సులు కోరుతూ, అధ్యక్షుడు బాలారెడ్డి ఇందుర్తి గారితో పాటు పద్మభూషణ్ అవార్డు గ్రహీత డా. జగదీష్ శెత్, మెగా దాతలు మరియు బ్రాండ్ అంబాసిడర్లు శ్రీ శంకర్ సుబ్రమణియన్, శ్రీ అరవింద్ కృష్ణస్వామి, శ్రీమతి జయ కృష్ణస్వామి, మరియు డా. కిషోర్ చివుకుల, సలహాదారుల మండలి సభ్యులు, కోశాధికారి మూర్తి రేకపల్లి; జె.సి. శేఖర్ రెడ్డి; పాలక మండలి సభ్యులు డా. రెడ్డి ఊరిమిండి మరియు మెహర్ లంక; సాంస్కృతిక సమన్వయకర్త నీలిమ గడ్డమనుగు; చాప్టర్ ఉపాధ్యక్షుడు వెంకీ నీలం; మరియు అట్లాంటా ఎస్ఎన్ బృందంలోని ఇతర అంకితభావం గల సభ్యులు పాల్గొన్న సాంప్రదాయ జ్యోతి ప్రజ్వలన, అనగా లాంఛనప్రాయంగా జ్యోతి ప్రజ్వలనంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.అట్లాంటాలోని నాలుగు ప్రముఖ శాస్త్రీయ నృత్య, సంగీత అకాడమీలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన ఉత్సాహభరితమైన సాంస్కృతిక కార్యక్రమంతో ఈవెంట్ ప్రారంభమైంది. సుస్వర సంగీత విద్యాలయంకు చెందిన శాంతి మెడిచెర్ల, భరత దర్శన్ స్కూల్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ డాన్స్ అండ్ మ్యూజిక్కు చెందిన సౌజన్య మధుసూదన్, కళాక్ష్య అకాడమీకి చెందిన మిటల్ పటేల్, మరియు నటరాజ నాట్యాంజలి కూచిపూడి డాన్స్ అకాడమీకి చెందిన నీలిమ గడ్డమనుగు దీనికి నాయకత్వం వహించారు. ఈ సాంస్కృతిక విభాగంలో భారత్‌కు చెందిన ప్రముఖ నేపథ్య గాయకుడు రాము (చెన్నై) అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. ప్రతిభావంతులైన స్థానిక గాయకులు శిల్పా ఉప్పులూరి (ఈమె కార్యక్రమ వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు), ఫణి డొక్కా, రామ్ దుర్వాసుల, ఉషా మోచర్ల, శాంతి మెడిచర్ల, మరియు అట్లాంటాకు చెందిన రాగ వాహినిలతో కలిసి, ఎంతో ఇష్టపడే క్లాసిక్ చిత్రాల నుండి హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో బహుభాషా మేళవింపును ప్రదర్శించి రాము ఆ సాయంత్రాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లారు. బహుభాషా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ప్రదర్శనకు, అధ్యక్షులు బాల ఇందుర్తి ఆయనను ఆప్యాయంగా “ఎస్పీబీ మానసపుత్ర” అని సంబోధించారు.మొబైల్ కంటి శస్త్రచికిత్స విభాగానికి భారీ విరాళంఅరవింద్ కృష్ణస్వామికి సంబంధించిన ఆడియో-విజువల్ (AV) ప్రజెంటేషన్ ప్రదర్శించినప్పుడు, ఆయన చేసిన అద్భుతమైన $555,000 విరాళాన్ని గుర్తించి, ప్రేక్షకులు కరతాళధ్వనులతో హోరెత్తిస్తూ, లేచి నిలబడి ఘన సన్మానం (standing ovation) చేశారు. 12 MESU (Mobile Eye Surgical Unit) 'Adopt-A-Village' కంటి వైద్య శిబిరాలకు మద్దతుగా అరవింద్ $155,000 విరాళం అందించారని అధ్యక్షుడు బాల ఇందుర్తి తెలియజేశారు. అంతేకాకుండా, భారతదేశంలో వైద్య సేవలు సరిగా అందని అత్యంత వెనుకబడిన ప్రాంతాలలో ఒకచోట కొత్త MESU కేంద్రాన్ని స్థాపించడానికి అరవింద్ ఉదారంగా ప్రకటించిన $400,000 విరాళం వినియోగించబడుతుంది.మహారాష్ట్ర మరియు గుజరాత్‌లలో అనువైన ప్రదేశాలను గుర్తించేందుకు అధ్యక్షుడు బాల, ప్రస్తుతం 'శంకర నేత్రాలయ ఇండియా' అధ్యక్షుడు డాక్టర్ గిరీష్ రావుతో కలిసి సన్నిహితంగా పనిచేస్తున్నారు. డల్లాస్‌కు చెందిన బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సభ్యులు మరియు SMUలో అరవింద్ కృష్ణస్వామికి పూర్వ సహవిద్యార్థి అయిన డాక్టర్ రెడ్డి ఊరిమిండి, అరవింద్‌ను 'శంకర నేత్రాలయ USA'కు పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. పరోపకార నాయకత్వంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తూ, ప్రసాద్ రెడ్డి కాటమ్రెడ్డితో పాటు అరవింద్ కూడా అర్ధ మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి ప్రవేశించడం చూడటం గర్వకారణం.ఈ కార్యక్రమంలో పాల్గొన్న శంకర నేత్రాలయ అట్లాంటా బృంద సభ్యులలో డా. కిషోర్ రెడ్డి రాసమల్లు; రమేష్ చాపరాల, గిరి కోటగిరి; ప్యాడీ రావు, సుబ్బారావు; శ్రీనివాస్ దుర్గం; చరిత్ర జూలపల్లి; మరియు చాప్టర్ లీడ్లు కార్తికేయన్ వినాయగం మరియు లోగియ అవిలినేలి ఉన్నారు. శంకర నేత్రాలయతో తన ప్రయాణం 2016లో అప్పటి ఉపాధ్యక్షుడు డాక్టర్ శేషు శర్మ చొరవతో ప్రారంభమైందని అధ్యక్షుడు బాల తెలిపారు. ఆ సమయంలో, సంస్థకు కేవలం ఏడు శాఖలు మాత్రమే ఉండేవి; నేడు, ఇది దేశవ్యాప్తంగా ముప్పై శాఖలకు విస్తరించింది. ఈ అద్భుతమైన విస్తరణకు అంకితభావం గల బలమైన వాలంటీర్ల బృందం, వ్యవస్థాపకులు, పద్మభూషణ్ దివంగత డాక్టర్ ఎస్. ఎస్. బద్రీనాథ్ మరియు SNUSA వ్యవస్థాపకులు శ్రీ ఎస్. వి. ఆచార్యల ఆశీస్సులే కారణమని ఆయన పేర్కొన్నారు. -
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు
న్యూయార్క్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 14న 2026న ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో స్మారక కార్యక్రమాన్ని నిర్వహించింది. ‘డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ రాజ్యాంగ నైతికతపై దార్శనికత మరియు బహుపాక్షికవాదానికి దాని ప్రాసంగికత’ అనే థీమ్‌తో ఈ ఈవెంట్‌ను నిర్వహించారు. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి,అంబాసిడర్ హరీష్ పార్వతనేని స్వాగతోపన్యాసం చేశారు. భారత పౌరులలో రాజ్యాంగ నైతికత స్ఫూర్తిని నింపడంలో డాక్టర్ అంబేద్కర్ కృషి చాలా ముఖ్యమైందన్నారు.ఈ సందర్భంగా భారత రాజ్యాంగానికి మరియు ఐక్యరాజ్యసమితి చార్టర్‌కు మధ్య ఉన్న ఉమ్మడి అంశాలను వివరించారు. రాజకీయ విభజన, నిరంతర సంఘర్షణలతో కూడిన ఈ క్లిష్ట సమయాల్లో రాజ్యాంగ నైతికతను పెంపొందించుకోవాలన్న డాక్టర్ అంబేద్కర్ పిలుపు ఎంతో సందర్భోచితమైనదని, ఇది బహుపాక్షికవాదాన్ని బలోపేతం చేయడానికి, ఐక్యరాజ్యసమితిలో సమర్థవంతమైన సంస్కరణలు తీసుకురావడానికి, దాని ప్రధాన విభాగాలకు పునరుజ్జీవం పోయడానికి, ఐక్యరాజ్యసమితిని దాని ఉద్దేశ్యానికి అనుగుణంగా తీర్చిదిద్దడానికి సహాయపడుతుందని రాయబారి హరీష్ చెప్పారు.ప్రముఖ సివిల్ సర్వెంట్, ప్రముఖ అంబేద్కర్ పండితుడు అయిన డాక్టర్ రాజా శేఖర్ వుండ్రు కీలకోపన్యాసం చేశారు. రెండు ప్రపంచ యుద్ధాలను, ఐక్యరాజ్యసమితి ఏర్పాటును ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిగా, డాక్టర్ అంబేద్కర్ బహుపాక్షికవాదం ప్రాముఖ్యతను గుర్తించారని ఆయన అన్నారు. భారత రాజ్యాంగం యొక్క కేంద్ర సూత్రాలను రూపొందించడంలో డాక్టర్ అంబేద్కర్ కీలక పాత్ర పోషించారని ఆయన తెలిపారు. ఐక్యరాజ్యసమితి చార్టర్లో పొందుపరిచిన అంతర్జాతీయ శాంతి పరిరక్షణ అనే ప్రాథమిక స్ఫూర్తి భారత రాజ్యాంగంలో కూడా ప్రతిబింబిస్తుంది. రాజ్యాంగ నైతికతను పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని డాక్టర్ అంబేద్కర్ నొక్కిచెప్పారని స్పష్టం చేశారు. ఈ సందర్భంలో, బహుపాక్షికవాదం మరియు ఐక్యరాజ్యసమితి చార్టర్ ఆధారంగా అంతర్జాతీయ రాజ్యాంగ నైతికతను పెంపొందించాల్సిన అవసరం ఉందని రాజా శేఖర్ వుండ్రు అన్నారు.డాక్టర్ అంబేద్కర్ జీవితం ఒక నైతిక నిదర్శనమని, అందులో ఆయన కేవలం బాధ నుండి తప్పించుకోవడమే కాకుండా, దానిని రూపాంతరం చెందించి, ఆ గాయాన్ని జ్ఞానంగా మార్చారని హార్వర్డ్ డివినిటీ స్కూల్ విజిటింగ్ ప్రొఫెసర్, అతిథి వక్త డాక్టర్ సంతోష్ రౌత్, అభిప్రాయపడ్డారు. నేటి ప్రపంచంలో, ముఖ్యంగా బహుపాక్షికత (multilateralism) విషయంలో, డాక్టర్ అంబేద్కర్ చేసిన కృషి మరియు ఆదర్శాల గాఢమైన ఔచిత్యాన్ని డాక్టర్ రౌత్ విశదీకరించారు. ఐక్యరాజ్యసమితి ఛార్టర్ వంటి లిఖితపూర్వక గ్రంథాల స్ఫూర్తిని ఆచరణలో పెట్టడానికి దోహదపడే శక్తిగా ఆయన నైతికతను అభివర్ణించారు.వివిధ రంగాలకు చెందిన ప్రజలు ఈ కార్యక్రమానికి ఉత్సాహంగా హాజరయ్యారు. -
తానా మిడ్ అట్లాంటిక్ నిర్వహణలో ఈస్టర్ ఎగ్ హంట్
ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ విభాగం చిన్న పిల్లలకోసం ఈస్టర్ ఎగ్ హంట్ కార్యక్రమాన్ని ఏప్రిల్ 12వతేదీన కాలేజ్విల్లేలోని ఎవాన్స్‌బర్గ్ స్టేట్ పార్క్‌లో విజయవంతంగా నిర్వహించింది. ఈ కార్యక్రమం ద్వారా వేర్వేరుచోట్ల నివసిస్తున్న తెలుగువాళ్లు తమ కుటుంబాలతో ఈ వేడుకల్లో పాల్గొని తమ ఆనందాన్ని అందరితో పంచుకున్నారు. ఈ వేడుక తెలుగువాళ్ళను ఒక వేదికపైకి తీసుకువచ్చిందని చెప్పవచ్చు. ఫుడ్, ఫన్, గేమ్స్ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలోనే పిల్లలు, పెద్దలు పాల్గొన్నారు.తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి మద్దతుతో తానా మిడ్-అట్లాంటిక్ ప్రాంతీయ ప్రతినిధి ఫణి కంతేటి, బెనిఫిట్ కోఆర్డినేటర్ వెంకట్ సింగు సమన్వయంతో మిడ్ అట్లాంటిక్ తానా నాయకులు, కమ్యూనిటీ లీడర్లు, వలంటీర్ల సహకారంతో విజయవంతంగా జరిగింది.ఈస్టర్ ఎగ్ హంట్ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణ పిల్లల ఈస్టర్ ఎగ్ హంట్. రంగురంగుల గుడ్లు, ప్రత్యేక ‘గోల్డెన్ ఎగ్స’ కోసం పిల్లలు ఎంతో ఉత్సాహంగా వెతికారు. వారి నవ్వులు, కేరింతలు వేడుకల్లో అసలైన పండుగ వాతావరణాన్ని తలపింపజేసింది. ఈ కార్యక్రమానికి వచ్చిన పిల్లలందరికీ పిజ్జా వడ్డించారు, ఇది వేడుకలో మరింత ఉత్సాహాన్ని నింపింది.ఈవెంట్ కోఆర్డినేటర్లు దీప్తి కోకా, భవాని మామిడి అద్భుతమైన ప్రణాళికతో ఈ ఆటలను నిర్వహించి, కార్యక్రమం విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారు. వీరు పెద్దలకు, పిల్లలకు నిర్వహించిన ఆటలు అందరినీ అలరించాయి.మిడ్-అట్లాంటిక్ బాయ్స్ అండ్ గర్ల్స్ క్లబ్ వారు అందించిన సహకారం మరువలేనిది. ఫుడ్ స్టాల్స్, నిధుల సేకరణ కోసం ఆటలను నిర్వహించడంలో వీరి ఉత్సాహం మరియు టీమ్ వర్క్ ప్రశంసనీయమని తానా నాయకులు అన్నారు. వాలంటీర్లు, పాల్గొనేవారి చెక్-ఇన్, చెక్-అవుట్ ప్రక్రియను సురేష్ యలమంచి ఎంతో సులభతరం చేశారు. అలాగే ఎంసీ గా తన వ్యాఖ్యానంతో అందరినీ ఉత్తేజపరిచారు. విశ్వనాథ్ కోగంటి ఈ వేడుకలోని మధుర క్షణాలను తన కెమెరాలో ఎంతో చక్కగా బంధించారు. తానా ఈస్టర్ బన్నీతో పిల్లలు ఫోటోలు దిగుతూ, ఆడుకుంటూ గడిపిన సమయం కుటుంబాలకు తీపి జ్ఞాపకాలను మిగిల్చింది. కాగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాలంటీర్లందరికీ వారి నిరంతర కృషికి గుర్తింపుగా ‘వాలంటీర్ అవర్ సర్టిఫికేట్లు’ అందజేశారు.ఈ కార్యక్రమంలో బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలు కేవలం ఆనందాన్ని ఇవ్వడమే కాకుండా, సమాజంతో మన సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయి. ఈ కార్యక్రమాన్ని ఇంతటి ఘనవిజయం చేసిన తానా ఫిలడెల్ఫియా టీమ్ కు వాలంటీర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. సేవ, సంతోషం మరియు సంఘీభావంతో మనం కలిaసి ముందుకు సాగుదామని ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినవారందరికీ తానా నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు. -
మూడు ఆపరేషన్లు : అయినా దక్కని ప్రాణం
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెంది విద్యార్థిని 23 ఏళ్ల నవ్య నీలకుడిటి అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. గతేడాది మాస్టర్స్ డిగ్రీ చదివేందుకు ఆమె అమెరికా వెళ్లారు. జీవితం స్థిరపడుతుందని ఆశపడుతున్న తరుణంలో రోడ్డు ప్రమాదం ఆ కుటుంబంలో తీరని దుఃఖాన్ని మిగిల్చింది.మిచిగాన్‌లో ఒక ఇంటర్వ్యూ ముగించుకుని తిరిగి వస్తుండగా పిట్స్‌బర్గ్‌లో నవ్య ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. తీవ్రంగా గాయపడిన నవ్యను పిట్స్‌బర్గ్‌లోని UPMC ప్రెస్బిటేరియన్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెకు మూడు ప్రధాన శస్త్రచికిత్సలు జరిగాయి. అయినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ ఏప్రిల్ 9న ఆమె మరణించారు.నవ్య భౌతికకాయాన్ని భారతదేశానికి తరలించేందుకు ఆసుపత్రి ఖర్చుల కోసం టెక్సాస్‌లో నివస్తున్న ఆమె సమీప బంధువు శిరీష నీలకుడిటి నిధుల సేకరణ (Fundraising) చేపట్టారు. ఇప్పటివరకు దాదాపు 85వేల డాలర్లు పైగా సాయం అందింది. నవ్య తల్లిదండ్రులు సాధారణ రైతులు. కుమార్తె ఉన్నత చదువుకోసం తమ దగ్గర ఉన్నదంతా ఖర్చు చేశారు. మంచి ఉద్యోగం సంపాదించి తన కుటుంబాన్ని ఆదుకోవాలని ఆశపడిన ఆమె కలలు ఆవిరై పోవడంతో కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది.కాగా ఇటీవల అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన తెలుగు విద్యార్థుల అకాల మరణం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మరో విషాదకర సంఘటనలో, 26 ఏళ్ల సింగిరెడ్డి సాయి శ్రీ హరికృష్ణ అనే యువకుడు మిస్సౌరీలో మరణించారు. ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ చేస్తున్న హరికృష్ణ, ఏప్రిల్ 11న తన పుట్టినరోజు వేడుకల కోసం వెళ్లి ప్రమాదవశాత్తూ మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారు. చదువుకుని ఉన్నత స్థితికి చేరుతారనుకున్న బిడ్డలు ఇలా విదేశీ గడ్డపై ప్రాణాలు కోల్పోవడం ఆ కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది.ఇదీ చదవండి: రూ.90 లక్షలు ఇస్తేనే ఫస్ట్‌నైట్ : తీవ్ర ఘర్షణ, కట్ చేస్తే! -
రిక్షా డ్రైవర్ కొడుకు, అమెరికాలో టెకీ, అంతలోనే విషాదం
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 26 ఏళ్ల సాఫ్ట్వేర్ నిపుణుడి అకాలమరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. అమెరికాలో స్నేహితులతో కలిసి తన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న సమయంలో ఈ విషాదం చోటు చేసుకోవడంతో అతని కుటుంబంలోతీవ్ర విషాదం నెలకొంది. అతని స్వగ్రామం విజయనగరం జిల్లా, బొబ్బిలి మండలం, పిరిడిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.ఏపికి చెందిన సింగిరెడ్డి సాయి శ్రీ హరి కృష్ణ, మిస్సోరీలోని Sullivan సమీపంలో ఉన్న Meramec State Park వద్ద తన స్నేహితులతో కలిసి బర్త్‌డే వేడుకలు జరుపుకునేందుకు వెళ్లాడు. ఈ సందర్భంగా స్నేహితులతో కలిసి ఒక రిసార్ట్‌లో బస చేశారు. ఆ తర్వాత హరి కృష్ణ ఈత కొట్టేందుకు Meramec నదిలోకి దిగాడు. అయితే నీటి అడుగున కలుపు మొక్కల్లో చిక్కుకున్న అతను పైకి రాలేక మృత్యవాతపడ్డాడు.టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం నీటి అడుగున ఉన్న కలుపు మొక్కల్లో చిక్కుకుపోవడంతో అవి అతన్ని నీటిలోకి లాగేశాయని అధికారులు తెలిపారు. అతను బయటపడేందుకు తీవ్రంగా పోరాడినా ఫలితం లేకపోయింది. అనంతరం Sullivan అగ్నిమాపక శాఖ సిబ్బంది అతని మృతదేహాన్ని వెలికితీశారని Missouri రాష్ట్ర రహదారి గస్తీ దళం (State Highway Patrol) తెలిపింది.విజయనగరంలోని ఒక ప్రైవేట్ కళాశాల నుండి BTech పూర్తి చేసిన తర్వాత, హరి కృష్ణ 2023లో అమెరికాకు వెళ్ళాడు. అక్కడ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి కొన్ని నెలల క్రితమే, St Louis నగరంలోని 'Elessent Clean Technologies' సంస్థలో ఉద్యోగంలో చేరాడు. ముగ్గురు తోబుట్టువులలో అందరికంటే చిన్నవాడైన హరి కృష్ణకు, తల్లిదండ్రులు , వివాహమైన ఇద్దరు అక్కలు ఉన్నారు. తండ్రి శ్రీనివాసరావు ఆటో-రిక్షా డ్రైవర్‌గా పనిచేస్తుండగా, తల్లి రమాదేవి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్నారు. ఆదుకుంటాడనుకున్న కుమారుడు అర్థాంతరంగా కన్నమూయడంతో అతని తల్లిదండ్రుల దుఃఖానికి అంతులేకుండా పోయింది. అతని మృతదేహాన్ని ఇండియాకు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
మిస్ తెలుగు యూఎస్ఏ పోటీల విజేత అమూల్య
అమెరికాలో జరిగిన మిస్ తెలుగు యూఎస్ఏ–2026 అందాల పోటీల్లో తెలుగు యువతులు సందడిచేశారు. టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ చార్లెస్ డబ్ల్యూఎస్సీమాన్ సెంటర్లో ఈ పోటీలు సందడిగా జరిగాయి. హైదరాబాద్ నగరంలోని అల్వాల్‌కు చెందిన అమూల్య బల్మూరి విజేతగా నిలిచింది. ప్రముఖ నటి లయ చేతుల మీదుగా అమూల్య టైటిల్ అందుకున్నారు. తమ కూతురు విజేతగా నిలవడం ఎంతో గర్వకారణమని తల్లిదండ్రులు శ్రీనివాస్‌రావు, రమలు తెలిపారు. ఇక మహిమ రన్నరప్ టైటిల్‌ను గెలుచుకున్నారు. గతంలో మిస్ ఫ్లోరిడా మెజెస్టిక్, ప్యూర్ ఇంటర్నేషనల్ అందాల పోటీల్లో కూడా మహిమ గుర్తింపు పొందారు. -
పచ్చ నేతల రౌడీయిజం 3 కోట్ల NRI భూమి కబ్జా
-
ప్రవాస భారతీయులకు వంశీ పురస్కారాలు
వంశీ ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇచ్చే ప్రతిష్టాత్మక ఉగాది పురస్కారాలలో భాగంగా, ఈ పరాభవ నామ సంవత్సర ఉగాదికి వివిధ దేశాల తెలుగు సంస్థలనుండి సాంస్కృతిక కళారంగ విభాగాలలో విభిన్న సేవలు అందిస్తున్నవారికి "వంశీ సీల్వెల్ ప్రవాస భారతీయ ఉగాది పురస్కారాలు" ఆదివారం హైదరాబాద్ త్యాగరాయ గానసభలో అందజేశారు.ప్రముఖ సినీ నటులు డా.రాజేంద్ర ప్రసాద్, నటీమణులు సంగీత, మంజుభార్గవి, దర్శకులు రేలంగి నరసింహారావు, సినీకవి వనమాలి,ప్రముఖ సాహితీవేత్తలు, రచయితలు, వివిధ రంగాల కళాకారులు కూడా ఈ ప్రతిష్టాత్మక ఉగాది పురస్కారాలతో వేదికపై సత్కరించారు.వంశీ వేదికపై 'శ్రీ సాంస్కృతిక కళాసారథి' సంస్థ ప్రధాన కార్యనిర్వాహక వర్గ సభ్యురాలు, రచయిత్రి రాధిక మంగిపూడికి "సభా భారతి" బిరుదు, సంస్థ సభ్యులైన యడవల్లి శేషు కుమారి శాస్త్రీయ సంగీతంలోనూ, తంగిరాల సౌభాగ్యలక్ష్మి లలిత సంగీత రంగంలోనూ, పావని చిలువేరు సాహిత్య రంగంలోను ఉగాది పురస్కారాలను అందుకోవడం తమకెంతో గర్వకారణమని సింగపూర్ నుండి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ పురస్కార గ్రహీతలను అభినందించారు. యూకే నుండి డా. బాబురావు చౌదరి చాపరాల & భారతి దంపతులు, హాంకాంగ్ నుండి జయ పీసపాటి, ఖతార్ నుండి సాహిత్య జ్యోత్స్న కొలిపాక, యూఏఈ నుండి శ్రీకాంత్ చిత్తర్వు, శ్రీనివాస లింగం, సౌదీ అరేబియా నుండి కొనేరు ఉమామహేశ్వరరావు, అనిల్ కుమార్ కడించెర్ల, అమెరికా నుండి శ్రీనివాస్ గూడూరు, వాణి దిట్టకవి, జయరాం ఎర్రమిల్లి తదితరులు కూడా ఈ పురస్కారాలను అందుకున్నారు.ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , డా.కె వి రమణాచారి ఐఏయస్, హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం హెడ్ కామేశ్వరి, డా. వంశీ రామరాజు ,ఇతర అతిథుల చేతుల మీదుగా ఈ పురస్కార ప్రదాన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. -
న్యూజిల్యాండ్‌లో ఉగాది సంబరాలు
న్యూజిల్యాండ్‌లోని తెలుగువారు ఉగాది పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిల్యాండ్ ఆధ్వర్యంలో ఆక్లాండ్ నగరంలో శ్రీ పరాభవ నామ సంవత్సరం వేడుకలను సంప్రదాయబద్దంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుతనం, తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా పంచాంగ శ్రవణంతో రాశి ఫలితాలను స్థితిగతులను తెలుసుకున్నారు.చిన్నారులు పెద్దలు తెలుగు సాంప్రదాయ పాటలు, నృత్యాలతో అలరించడమే కాకుండా సాంప్రదాయ పిండి వంటలతో సామూహిక భోజనం చేశారు. ఇండియన్ కాన్సులేట్ జనరల్ డాక్టర్ మదన్ మోహన్ సేథి ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో సామజికసేవలో ముందున్న తెలుగు ప్రతినిధులను ఉగాది పురస్కారాలతో సన్మానించారు. చిన్నారులకు, నృత్యకారులకు బహుమతులు అందజేశారు.అసోసియేషన్ అధ్యక్షుడు కోడూరి చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలో ప్రముఖ వ్యాపారవేత్త శివ కిలారి, యాదవ్, సత్యనారాయణ తట్టల, అసోసియేషన్ మాజీ అధ్యక్షులు పట్లోళ్ల నరేందర్ రెడ్డి, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విశ్వనాధు బాల, విజేత యాచమనేని, మధు ఎర్ర, కావ్య, వర్ష పట్లోళ్ల, మేకల స్వాతి, కిరణ్మయి, విశ్వనాథ్ అవిటి, మొహమ్మద్ బిలాలోద్దీన్, విజయ్ శ్రీరామ్, రమేష్ రామిండ్ల, మనోహర్ కన్నం, హరీష్, రమేష్ ఆడెపు, శ్రీనివాస్ పందిళ్ల, రవి కుమార్ వట్టం, మారుతి, ఆర్తి, భరత్ జవ్వాజి, మహేందర్ రెడ్డి, నిఖిత తదితరులతో పాటు పెద్ద ఎత్తున ప్రవాస తెలంగాణ బిడ్డలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. -
ఇంటిపై స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ..!
అమెరికా అనగానే గుర్తొచ్చేది స్టాట్యూ ఆఫ్ లిబర్టీ. యూఎస్‌లో అత్యంత సుపరిచితమైన చిహ్నాలలో ఒకటి ఈ స్మారక చిహ్నం. దీన్ని స్వేచ్ఛ, ఆశకు ప్రతీకగా చెబుతుంటారు. అయితే భారత్‌లోని ఓ వ్యక్తి ఏకంగా తన ఇంటిపైనే దీన్ని నిర్మించి వార్తల్లో నిలిచాడు. అంతేగాదు ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఈ ఇల్లు ఓ ఆకర్షణగా మారింది. ఎందుకిలా అంటే..పంజాబ్‌లోని ఎన్నారై గుర్జీత్ సింగ్ మథారు జలంధర్‌లోని కిషన్ పురా ప్రాంతంలో తన ఇంటి నాల్గో అంతస్థుపై ఈ ప్రసిద్ధ స్మారక చిహ్నం ప్రతిరూపాన్ని ఏర్పాటు చేశారు. దాంతో ఈ ఇల్లు అందరి దృష్టిని ఆకర్షించేలా హైల్గా మారింది. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు దీన్ని చూసేందుకు తండోపతండాలుగా తరలివస్తుంటారట కూడా. రీజన్ ఏంటంటే..గుర్జీత్ సింగ్ న్యూయార్క్‌లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని తరచుగా చూడటం, ప్రతి ఏడాది భారత పర్యటనకు వచ్చినప్పుడు ఆ నగరం జ్ఞాపకంగా ఏదైనా చేయాలన్న ఆలోచన నుంచి వచ్చిందే ఇది అని అన్నారు. 26 ఏళ్లుగా న్యూయార్క్‌లోనే నివశిస్తున్న గుర్జీత్ సింగ్‌కి ప్రతి ఏడాది భారత్ పర్యటనకు వచ్చినప్పుడు ఆ నగర జ్ఞాపకం ఉండేలా ఇలా ఆ స్మారక చిహ్నం ప్రతిరూపాన్ని ఇంటిపై ఏర్పాటు చేసుకున్నారు. దాంతో ఈ నిర్మాణం స్థానిక ఆకర్షణగా మారింది. ఇది ఒకరకంగా విదేశీ జీవితానికి, స్వదేశంలోని తన మూలాలకు ఒక వ్యక్తిగత వారధిని నిర్మించినట్లు కనిపిస్తోంది ఆ కట్టడం. నెటిజన్లు కూడా పంజాబ్‌లోని ఓ చిన్న సైజ్ న్యూయార్క్ అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. VIDEO | Punjab: Gurjeet Singh Matharu, an NRI living in New York for 26 years, has installed a Statue of Liberty replica on the fourth floor of his home in Jalandhar’s Kishanpura area, drawing visitors from nearby and far away.He said the idea came from seeing the Statue of… pic.twitter.com/7PkZaTzJFO— Press Trust of India (@PTI_News) March 21, 2026 (చదవండి: పైలట్ ఎప్పటికీ మర్చిపోలేని ఫ్లైట్ జర్నీలు ఏంటో తెలుసా ..!) -
న్యూజెర్సీలో ఘనంగా శంకర నేత్రాలయ సంగీత–నృత్య సేవా కార్యక్రమం
అమెరికాలోని శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత–నృత్య సేవా కార్యక్రమం న్యూజెర్సీ రాష్ట్రంలో ఘనంగా జరిగింది. మార్చి 14, 2026 శనివారం సాయంత్రం ఆల్బర్ట్ ప్యాలెస్‌లో జరిగిన ఈ కార్యక్రమం భారతీయ సాంప్రదాయ కళలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రసాద్ రెడ్డి కటమరెడ్డి హాజరై సేవా కార్యక్రమాల ప్రాముఖ్యతను వివరించారు. మాజీ కమిషనర్ ఉపేంద్ర చివుకుల కూడా కార్యక్రమంలో పాల్గొని సందేశం ఇచ్చారు. కార్యక్రమంలో ప్రముఖ గాయకులు రాము, అంజనా సౌమ్య తమ గాన ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. వారి సంగీత ప్రదర్శనలు సభలోని ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందాయి.అలాగే అనేక నృత్య సంస్థలు భారతీయ సాంప్రదాయ నృత్యాలను అద్భుతంగా ప్రదర్శించాయి. అందులో కళాగంగోత్రి ఫౌండేషన్, సౌపర్ణిక నృత్య అకాడమీ, కూచిపూడి నృత్య కేంద్రం, సిద్ధేంద్ర కూచిపూడి కళా అకాడమీ, నాట్య తత్వ శ్రీ సాయి వెంకటేశ్వర లలిత కళలు, చిన్మయి నృత్యాలయ, లిటిల్ మ్యూజీషియన్స్ అకాడమీ అమెరికా సంస్థలు పాల్గొని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.గ్రామీణ ప్రాంతాల్లో కంటి వైద్య సేవలను అందించేందుకు శంకర నేత్రాలయ సంస్థ మొబైల్ కంటి శస్త్రచికిత్స యూనిట్లను నిర్వహిస్తూ వేలాది మంది పేదలకు కంటి వెలుగు అందిస్తోంది. ఈ సేవా కార్యక్రమం ద్వారా సేకరించిన విరాళాలను పేదలకు కంటి శస్త్రచికిత్సలు, వైద్య సేవలు అందించేందుకు వినియోగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.అమెరికాలోని న్యూజెర్సీ బృంద సభ్యులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సేవా కార్యక్రమాలకు మద్దతుగా నిర్వహించిన ఈ వేడుకకు స్థానిక భారతీయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.(చదవండి: సింగపూర్‌లో ఘనంగా ఉగాది వేడుకలు) -
సింగపూర్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
సింగపూర్: దేశ విదేశాలు ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఇక్కడి పోటోన్గ్ పాసిర్లోని శ్రీ శివ దుర్గ ఆలయంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వదినాన సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో భాగంగా శ్రీ పేరి కృష్ణ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. ఈ వేడుకల్లో 300పైగా ప్రవాస తెలుగు భక్తులు పాల్గొన్నారు. సందర్భంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా తెలంగాణ కల్చరల్ సొసైటీ వారు చేస్తున్న కార్యక్రమాలు స్ఫూర్తి దాయకం అని వేడుకల్లో పాల్గొన్న భక్తులు కొనియాడారు.ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా ప్రాంతీయ కార్యదర్శులు సంతోష్ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గ ప్రసాద్ , సంతోష్ కుమార్ జూలూరి ప్రశాంత్ బసిక, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కార్యవర్గ సభ్యులు పెరుకు శివ రామ్ ప్రసాద్ తదితరులు వ్యవహరించారు. ఉగాది వేడుకలు విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన వారికి టీసీఎస్ఎస్ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కోశాధికారి నంగునూరి వెంకటరమణ, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, రవి కృష్ణ విజాపూర్, కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి, చల్ల కృష్ణ ధన్యవాదాలు తెలిపారు.


