
హనుమకొండ హౌసింగ్ బోర్డ్ ప్రాంతంలో పిట్టల సునీల్ కుమార్ మరియు భూపతి శంకర్ న్యాయవాదుల ఆధ్వర్యంలో నడుస్తున్న సునీల్ అసోసియేట్స్ సంస్థతో కరీంనగర్ వాస్తవ్యులు, సీనియర్ న్యాయవాది ప్రస్తుతం అమెరికన్ పౌరసత్వం కలిగి ఉన్న అమెరికన్ సొలిసిటర్ కావేటి శ్రీనివాసరావు ఒప్పందం కుదుర్చుకొని, హనుమకొండలో కావేటి ఇంటర్నేషనల్ లా ఫర్మ్ నూతన శాఖను ప్రారంభించారు.
ఈ సందర్భంగా కావేటి శ్రీనివాసరావు మాట్లాడుతూ..తాను ప్రస్తుతం అమెరికా పౌరసత్వం కలిగి ఉన్నానని అక్కడ సొలిసిటర్‌గా , బ్రిటన్‌లో అటార్నీగా బాధ్యతలు నిర్వహిస్తున్నానని, వివిధ దేశాలలో తమ శాఖలు ఉన్నాయని తెలిపారు. హనుమకొండలో కూడా సునీల్ అసోసియేట్స్ సహకారంతో నూతన శాఖను ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. అలాగే ఈ రోజుల్లో ప్రతి ఇంటి నుండి విదేశాలకు వెళ్తున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిందన్నారు. వారిలో చాలామంది విదేశాలలో ఇమిగ్రేషన్ , వీసా, పాస్పోర్టు మరియు ఎంబసీ సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. వాటితో పాటు భార్య భర్తలు వైవాహిక సమస్యలతో అక్కడ కోర్టు మెట్లు ఎక్కుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిందన్నారు.
అలాగే అక్కడ రోడ్డు, ఇతర ప్రమాదాలలో మరణిస్తున్న భారతీయుల సంఖ్య పెరిగిందని అలాంటి సమస్యలకు తాము పరిష్కారం చూపేలా, దేశంలో శాఖలను విస్తరిస్తున్నామని బాధితులకు అండగా ఉంటామన్నారు. వారికి సంబంధించిన ఎలాంటి సమస్యలనైనా పరిష్కరిస్తామని.. అందుకోసం బాధితులు తమ ప్రాంతంలో గల కావేటి లా ఫర్మ్ సంప్రదించి తమ సందేహాలు నివృత్తి చేసుకోవాలని, విదేశాలలో గల చట్టపరమైన సమస్యలకు తాము పరిష్కార మార్గం చూపిస్తామని తెలియజేశారు. ఈ అవకాశాన్ని బాధితులు ఉపయోగించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియన్ కన్జ్యూమర్ కౌన్సిల్ చైర్మన్ పల్లెపాడు దామోదర్, లా కాలేజ్ సీనియర్ ప్రొఫెసర్ జెట్లింగ్ ఎల్లోసా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. హన్మకొండ వరంగల్ సీనియర్ న్యాయవాదులు వరంగల్ ప్రస్తుత జనరల్ సెక్రెటరీ డి. రమాకాంత్, హనుమకొండ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు మాతంగి రమేష్ బాబు, మాజీ ఉపాధ్యక్షులు తాటికొండ కృష్ణమూర్తి, మాజీ పీపీ గుర్రాల వినోద్ కుమార్, స్పెషల్ జిపి మహాత్మ, సీనియర్ న్యాయవాది కె.వి.కె గుప్తా, కేశవ్, వేల్పుల రమేష్, మామిడాలగిరి, సత్యనారాయణ, మొలుగురి రాజు , సూరయ్య, శీలం అఖిల్ రావు ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు.