ఘనంగా 'GTA మెగా కన్వెన్షన్ 2025' | GTA Mega Convention 2025 | Sakshi
Sakshi News home page

ఘనంగా 'GTA మెగా కన్వెన్షన్ 2025'

Dec 29 2025 1:17 PM | Updated on Dec 29 2025 1:52 PM

GTA Mega Convention 2025

హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలను ఒకే వేదికపైకి తీసుకురావడమే లక్ష్యంగా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) ఆధ్వర్యంలో 'GTA మెగా కన్వెన్షన్ 2025' వేడుకలు ఘనంగా జరిగాయి. గండిపేట మండలం ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ లోని అక్షయ కన్వెన్షన్‌లో శని, ఆదివారం పలు కార్యక్రమాలతో  వేడుకలు ఘనంగా జరిగాయి.

కార్యక్రమంలో త్రిదండి చినజీయర్ స్వామి, హంపి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి వివేక్ వెంకట్ స్వామి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణా రెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, పాల్వాయి హరీష్ బాబు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, పెద్దిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, గువ్వల బాలరాజు, బొల్లం మల్లయ్య యాదవ్ తదితర రాజకీయ, ఆధ్యాత్మిక ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ కాన్వెన్షన్ కేవలం ఒక వేడుక మాత్రమే కాకుండా తెలంగాణ భవిష్యత్తు కోసం ప్రవాస భారతీయుల మేధస్సు, వనరులు, నెట్వర్క్ శక్తిని అనుసంధానం చేసే మహోద్యమమని జిటీఎ ఫౌండర్ అండ్ గ్లోబల్ చైర్మన్ అలుమల్ల మల్లారెడ్డి పేర్కొన్నారు. ఈ వేడుకలకు ప్రపంచ వ్యాప్తంగా సుమారు 30 దేశాల నుండి వేలాది మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు.

జీటీఏ ఫౌండర్ అండ్ గ్లోబల్ చైర్మన్ అలుమల్ల మల్లారెడ్డి, యూఎస్ఏ ఫౌండర్ చైర్మన్ విశ్వేశ్వర్ రెడ్డి కల్వల, ఇండియా ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి పాడురి, ప్రెసిడెంట్ ఎలక్ట్ కంకణాల అభిషేక్ రెడ్డి, అడ్వైజరీ చైర్ ప్రతాప్ రెడ్డి పెండ్యాల, సహ వ్యవస్థాపకుడు శ్రవణ్ రెడ్డి పాడురు, యూఎస్ఎ ప్రెసిడెంట్ ప్రవీణ్ రెడ్డి, వాషింగ్టన్ ప్రెసిడెంట్ రాము ముండ్రాతి, తదితరులు GTA లో కీలక పాత్ర పోషిస్తూ ఈ వేడుకలను విజయవంతం చేయడంలో తోడ్పాడ్డారు.

తెలంగాణలో జిల్లాల వారిగా GTA చాప్టర్లు ప్రారంభించారు. జిల్లాల కార్యవర్గాన్ని ఈ వేదికపై పరిచయం చేశారు. కార్యక్రమంలో 100 మందికి పైగా కళాకారులతో తెలంగాణ జానపద, శాస్త్రీయ కళారూపాల ప్రదర్శనలు జరిగాయి. మిట్ట‌ప‌ల్లి సురేంద‌ర్, రసమయి బాలకిషన్, మంగ్లీ లైవ్ మ్యూజికల్ నైట్, మోహన భోగరాజు ప్రత్యేక ప్రదర్శన జరిగింది. ఆహా ఇండియన్ ఐడల్ గ్రాండ్ ఎంటర్టైన్‌మెంట్ షో నిర్వహించారు.

రియల్ ఎస్టేట్, స్టార్టప్‌లు, ఎన్ఆర్ఐ లీగల్ అంశాలు, ఆరోగ్య రంగ ఆవిష్కరణలపై ప్రత్యేక సెషన్లు ఏర్పాటు చేయడం విశేషం. “తెలంగాణ రైజింగ్ 2047” విజన్ కింద - రాష్ట్ర అభివృద్ధి, గ్లోబల్ భాగస్వామ్యం, పెట్టుబడుల ఆహ్వానం వంటి అంశాలపై లోతైన చర్చలు జరిగాయి. లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు, జిటీఎ కొత్త నాయకత్వ ప్రమాణ స్వీకారం, గ్రాండ్ లైవ్ కన్సర్ట్‌తో ఈ వేడుకలు ఘనంగా ముగిసాయి. ప్రపంచ తెలంగాణ బిడ్డలను ఒకే తాటిపైకి తెచ్చేందుకు ఈ మహాసభలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement