అంబటి, జోగి ఇళ్లపై దాడి.. ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ | Riyadh Ysrcp Nri Wing Condemns Attack On Ambati And Jogi Houses | Sakshi
Sakshi News home page

అంబటి, జోగి ఇళ్లపై దాడి.. ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ

Feb 4 2026 9:47 PM | Updated on Feb 4 2026 9:51 PM

Riyadh Ysrcp Nri Wing Condemns Attack On Ambati And Jogi Houses

వైఎస్సార్‌సీపీ నేతలు అంబటి రాంబాబు, జోగి రమేష్‌ ఇళ్లపై టీడీపీ గూండాల దాడిని  వైఎస్సార్‌సీపీ సెంట్రల్ సౌదీ అరేబియా ఎన్‌ఆర్‌ఐ వింగ్‌ తీవ్రంగా ఖండించింది. ప్రపంచంలోని వివిధ దేశాల్లో తెలుగు ప్రజలు.. ఏపీలో జరుగుతున్న చంద్రబాబు సర్కార్‌ అరాచకాలను గమనిస్తున్నారని పేర్కొంది. కూటమి సర్కార్‌.. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, అభివృద్ధిని అడ్డుకుందని.. కేవలం రాజకీయ కక్ష సాధింపులకే ప్రాధాన్యం ఇస్తోందని వైఎస్సార్‌సీపీ సెంట్రల్ సౌదీ అరేబియా ఎన్‌ఆర్‌ఐ  బృందం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుపేదలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.

అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై జరిగిన విధ్వంసం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని పార్టీ కన్వీనర్‌ సయ్యద్ రబ్బానీ మండిపడ్డారు. ఈ అక్రమ చర్యలకు పాల్పడిన ప్రతి ఒక్కరూ భవిష్యత్తులో చట్టం ముందు తప్పకుండా జవాబుదారీగా నిలబడాల్సిందేనన్నారు. న్యాయం తప్పక గెలుస్తుందని మేము దృ ఢంగా విశ్వసిస్తున్నామన్నారు. ఇవాళ వైఎస్‌ జగన్‌ గుంటూరు పర్యటనకు మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. ప్రజలు ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ముందడుగు వేసి.. ఈ అన్యాయ ప్రభుత్వాన్ని రాజకీయంగా ఎదుర్కొని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. వైఎస్‌ జగన్‌ చూపిన సంక్షేమ మార్గమే.. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అని.. మేమంతా ఆయన వెంటే ఉంటామని  సయ్యద్ రబ్బానీ ఒక ప్రకటనలో తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement