breaking news
Saudi Arabia
-
మిడిల్ఈస్ట్లో బిగ్ ట్విస్ట్.. ఇరాన్ నిర్ణయంపై ఉత్కంఠ
దశాబ్దాలుగా సాగుతున్న వైరం.. ఎప్పుడూ ప్రత్యర్థులుగా కనిపించిన దేశాలు.. ఇప్పుడు ఒకే వేదికపైకి వస్తాయా? మిడిల్ఈస్ట్ రాజకీయాల్లో ఇదే ఇప్పుడు అతిపెద్ద చర్చ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిళ్లు, ఇరాన్‌పై పెరుగుతున్న ఆంక్షలు, ప్రాంతీయ భద్రతా ఆందోళనల మధ్య అనూహ్య పరిణామం తెరపైకి వచ్చింది. సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కీ ఏర్పాటు చేసిన మక్కా రక్షణ కూటమిలో చేరాలని ఇరాన్‌కు ఆహ్వానం అందినట్లు వచ్చిన వార్తలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇరాన్-సౌదీ అరేబియా.. ఈ రెండు పేర్లు వినగానే గుర్తొచ్చేది ఆధిపత్య పోరు. గల్ఫ్ ప్రాంతంలో ప్రభావం కోసం ఇరు దేశాల మధ్య ఏళ్లుగా సాగుతున్న పోటీ. యెమెన్‌లో హౌతీల అంశం నుంచి సిరియా, లెబనాన్ వరకు పలు పరిణామాల్లో ఈ విభేదాలు బయటపడ్డాయి. అలాంటి రెండు దేశాలు భద్రతా వేదికపై దగ్గరవుతాయా? అనే ప్రశ్న ఇప్పుడు మిడిల్ఈస్ట్లో కొత్త చర్చకు తెరతీసింది. ఒకప్పుడు ఒకరిపై ఒకరు అనుమానంతో చూసుకున్న దేశాలు.. ఇప్పుడు ఒకే భద్రతా గొడుగు కిందకు వస్తాయా? అనేది ఆసక్తికరంగా మారింది. అమెరికా ప్రభావం, ప్రాంతీయ భద్రతా పరిణామాలు, మారుతున్న ప్రపంచ రాజకీయాల నేపథ్యంలో ఈ పరిణామం మిడిల్ఈస్ట్ భవిష్యత్ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశముంది.మక్కా కూటమిలోకి ఇరాన్?సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కీ ఆగస్టు 7న మక్కా సంయుక్త రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం.. ఈ మూడు దేశాల్లో ఏదో ఒక దేశంపై సాయుధ దాడి జరిగితే, అది మిగిలిన దేశాలపై జరిగిన దాడిగానే పరిగణిస్తారు. రక్షణ సహకారం, వ్యూహాత్మక సమన్వయం, సంయుక్త భద్రతా చర్యలు ఈ ఒప్పందంలో భాగంగా ఉంటాయని ప్రకటించారు. అయితే ఈ కూటమి ఏర్పడిన కొద్ది రోజులకే మరో ఆసక్తికర పరిణామం తెరపైకి వచ్చింది. మక్కా ఒప్పందంలో చేరాలని ఇరాన్‌కు ఆహ్వానం అందినట్లు ‘అల్ మయదీన్’ నివేదించింది. ఇరాన్ పార్లమెంట్‌కు అనుబంధంగా ఉన్న ఖానే మెల్లత్ వార్తా సంస్థ అధిపతి మెహదీ రహీమి ఈ విషయాన్ని వెల్లడించినట్లు పేర్కొంది. ఆ ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని ఆయన చెప్పినట్లు సమాచారం. అయితే ఇరాన్ ప్రభుత్వం గానీ, సౌదీ, పాకిస్థాన్, టర్కీ ప్రభుత్వాలు గానీ దీనిపై అధికారిక ప్రకటన చేయలేదు.ట్రంప్ ప్రభావమేనా?ఈ పరిణామాల వెనుక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాల ప్రభావం ఉందా? అన్న చర్చ కూడా మొదలైంది. ఇరాన్‌పై అమెరికా ఒత్తిడి పెరగడం, ఆంక్షల భయం, గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడంతో ప్రాంతీయ దేశాలు తమ భద్రతా వ్యూహాలను పునరాలోచిస్తున్నాయి. ఇప్పటివరకు మిడిల్ఈస్ట్లో భద్రతకు అమెరికా కీలక శక్తిగా ఉండేది. అయితే ఇటీవలి పరిణామాల్లో ప్రాంతీయ దేశాలే తమ రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలనే ఆలోచనలోకి వచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మక్కా కూటమి కూడా ఇదే దిశలో మరో అడుగుగా భావిస్తున్నారు. శత్రువుల మధ్య కొత్త స్నేహమా?ఇరాన్ నిజంగా మక్కా కూటమిలో చేరితే అది సాధారణ పరిణామం కాదు. ఎందుకంటే ఈ కూటమిలో ప్రధాన దేశమైన సౌదీ అరేబియాతో ఇరాన్‌కు గతంలో తీవ్ర విభేదాలున్నాయి. 2016లో తెగిపోయిన దౌత్య సంబంధాలు 2023లో చైనా మధ్యవర్తిత్వంతో తిరిగి ప్రారంభమైనప్పటికీ.. అనుమానాలు పూర్తిగా తొలగిపోలేదు.యెమెన్‌లో ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలు, సౌదీ ప్రయోజనాల మధ్య ఉన్న విభేదాలు కూడా ఈ సంబంధాలకు సవాలుగా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఒకే రక్షణ వేదికపైకి రావడం జరిగితే.. అది మిడిల్ఈస్ట్ రాజకీయాల్లో భారీ మార్పుగా మారే అవకాశం ఉంది.ఇరాన్ లెక్కలు ఏంటి?ఇరాన్ మాత్రం ఈ పరిణామాన్ని పూర్తిగా వ్యతిరేకించలేదు. ప్రాంతీయ దేశాలు తమ స్వంత భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. మరోవైపు ట్రంప్ ప్రభుత్వం నుంచి వస్తున్న ఒత్తిళ్ల నేపథ్యంలో తనకు అనుకూలమైన కొత్త వ్యూహాలను రూపొందించుకోవాల్సిన పరిస్థితిలో టెహ్రాన్ ఉంది.అయితే.. మక్కా కూటమిలో చేరడం ద్వారా ఇరాన్‌కు లాభమా? లేదంటే తన పాత మిత్ర, ప్రత్యర్థి సమీకరణాలను మార్చుకోవాల్సి వస్తుందా? అన్నది కీలక ప్రశ్న.ఇరాన్ తీసుకునే నిర్ణయంపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఒకప్పుడు ప్రత్యర్థులుగా ఉన్న దేశాలు నిజంగా చేతులు కలిపితే.. అది ట్రంప్ హయాంలో మిడిల్ఈస్ట్లో అతిపెద్ద దౌత్య మలుపుగా నిలిచే అవకాశం ఉంది.ఇదీ చదవండి: అమెరికాలో కాల్పులు.. భారతీయుడి దుర్మరణం -
బిచ్చగాళ్ల దేశమనుకుంటున్నారు.. పరువు తీయొద్దు!: పాక్
విదేశాల్లో పాకిస్థానీయుల భిక్షాటన, అక్రమ వలసల వ్యవహారం ఆ దేశ ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతోంది. ముఖ్యంగా సౌదీ అరేబియా సహా గల్ఫ్ దేశాల్లో పాక్ పౌరులపై భిక్షాటన, వీసా నిబంధనల ఉల్లంఘన, అక్రమ నివాసం వంటి ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఇస్లామాబాద్ అప్రమత్తమైంది. తాజాగా హజ్, ఉమ్రా యాత్రల పేరిట సౌదీ అరేబియాకు వెళ్లే తమ పౌరులు.. భిక్షాటనకు పాల్పడొద్దంటూ బతిమాలినంత పని చేస్తోంది.పాకిస్థాన్ ఎంబసీ సౌదీ అరేబియాలోని తమ పౌరులను ఉద్దేశించి ఈ సూచనలు చేసింది. హజ్, ఉమ్రా యాత్రికులతో పాటు సౌదీలో పనిచేస్తున్న పాకిస్థానీయులు కూడా స్థానిక చట్టాలను, తమ వీసా నిబంధనలను కచ్చితంగా పాటించాలని కోరింది. ముఖ్యంగా మక్కా, మదీనా పవిత్ర ప్రాంతాల పరిసరాల్లో భిక్షాటన, అనధికారికంగా విరాళాలు లేదా డబ్బులు సేకరించడంపై సౌదీ అధికారులు ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అమలు చేస్తున్నారని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే అరెస్టు, నిర్బంధం, డిపోర్టేషన్ వంటి కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.ఏఐ వీడియోతో..తమ హెచ్చరికను మరింత బలంగా తెలియజేసేందుకు పాకిస్థాన్ ఎంబసీ సోషల్ మీడియాలో ఓ ఏఐ రూపొందించిన వీడియోను కూడా విడుదల చేసింది. అందులో ఓ వ్యక్తిని సౌదీ అధికారులు అరెస్టు చేసి జైలుకు తరలిస్తున్నట్లు చూపించారు. స్థానిక చట్టాలను ఉల్లంఘిస్తే ఎదురయ్యే పరిణామాలను ఈ వీడియో ద్వారా యాత్రికులకు వివరించారు. అనుమతి లేని సేవలను వినియోగించుకోవద్దని, చట్టబద్ధమైన మార్గాల్లోనే ఆర్థిక సహాయం, విరాళాల సేకరణ చేపట్టాలని సూచించారు.దేశ పరువు దెబ్బతినేలా వ్యవహరించవద్దని పరోక్షంగా గట్టి సందేశం ఇచ్చింది.پاکستان سے انے والے تمام عمرہ زائرین اور ورکرز کے نام اہم پیغام pic.twitter.com/BzOScR3lFP— Pakistan Embassy Saudi Arabia (@PakinSaudiArab) August 16, 2026సౌదీ నుంచే వేలాది మంది వెనక్కి..విదేశాల్లో పాక్ పౌరుల భిక్షాటన వ్యవహారం కొత్తది కాదు. పాక్ అధికారులు వెల్లడించిన గణాంకాల ప్రకారం.. 2025లో సౌదీ అరేబియా నుంచి సుమారు 24 వేల మంది పాకిస్థానీయులను భిక్షాటనకు సంబంధించిన ఆరోపణలపై వెనక్కి పంపినట్లు సమాచారం. యూఏఈ నుంచి దాదాపు 6 వేల మంది, అజర్బైజాన్ నుంచి సుమారు 2,500 మంది పాక్ పౌరులను కూడా వెనక్కి పంపినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఇందులో భిక్షాటన సంబంధిత కేసులే కాదు.. వీసా నిబంధనల ఉల్లంఘన, అక్రమ నివాసం, ఇతర ఇమ్మిగ్రేషన్ ఉల్లంఘనలు, నేరాలకు సంబంధించిన కేసులు కూడా డిపోర్టేషన్లకు కారణాలుగా ఉన్నాయి.38 వేలకుపైగా డిపోర్ట్పాక్ ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2025లో సౌదీ అరేబియా సహా గల్ఫ్ సహకార మండలి (GCC) దేశాల నుంచి వివిధ కారణాలతో 38,616 మంది పాకిస్థానీయులు డిపోర్ట్ అయ్యారు. వీరిలో సౌదీ అరేబియా నుంచి 27,692 మంది, యూఏఈ నుంచి 6,794 మంది, ఒమన్ నుంచి 2,537 మంది ఉన్నారు. అయితే వీరంతా భిక్షాటన కేసుల్లోనే వెనక్కి పంపినవారు కాదని పాక్ ప్రభుత్వం స్పష్టం చేసింది.విమానాశ్రయాల్లోనే అడ్డుకట్టవిదేశాల్లో సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో పాక్ ప్రభుత్వం దేశంలోనే చర్యలు ప్రారంభించింది. 2025లో విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన 66,154 మందిని పాక్ విమానాశ్రయాల్లోనే ‘ఆఫ్‌లోడ్’ చేసినట్లు ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA) వెల్లడించింది. సరైన పత్రాలు లేకపోవడం, ప్రయాణ ఉద్దేశంపై అనుమానాలు, ఇతర ఇమ్మిగ్రేషన్ సమస్యల కారణంగా పలువురిని నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.ఈ వ్యవహారంలో ఆర్గనైజ్డ్ బెగ్గింగ్ నెట్‌వర్క్‌లు, అక్రమ వలసలకు సహకరిస్తున్న ఏజెంట్లపై కూడా FIA దృష్టి పెట్టింది. కొందరు ఉమ్రా వీసాలను ఉపయోగించుకుని సౌదీకి వెళ్లి అక్కడ భిక్షాటనకు పాల్పడుతున్నట్లు, మరికొందరు అక్కడి నుంచి ఇతర దేశాలకు అక్రమంగా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు పాక్ అధికారులు గుర్తించిన సందర్భాలు ఉన్నాయి.2024లోనే సౌదీ హెచ్చరికభిక్షాటన వ్యవహారంపై సౌదీ అరేబియా 2024లోనే పాకిస్థాన్‌ను హెచ్చరించింది. ఉమ్రా వీసాలను భిక్షాటన కోసం దుర్వినియోగం చేయొద్దని పాక్ ప్రభుత్వం తమ పౌరులకు స్పష్టంగా చెప్పాలని సూచించింది. మక్కా, మదీనా వంటి పవిత్ర ప్రాంతాల్లో భిక్షాటనపై సౌదీ కఠిన వైఖరి అవలంబిస్తోంది. అయినప్పటికీ సమస్య కొనసాగుతుండటంతో తాజాగా మరోసారి పాక్ తన పౌరులను అప్రమత్తం చేసింది.విదేశాల్లో భిక్షాటన, అక్రమ వలస నెట్‌వర్క్‌లు పాకిస్థాన్ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నాయని ఆ దేశ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాక్ సెనేట్ కమిటీకి సమర్పించిన వివరాల ప్రకారం.. 2019 నుంచి 2025 మధ్య వివిధ దేశాల నుంచి 7,873 మంది పాకిస్థానీయులు డిపోర్ట్ కాగా.. వారిలో 1,064 మంది భిక్షాటన కారణంగా వెనక్కి పంపబడ్డారు. ఈ నేపథ్యంలో హజ్, ఉమ్రా యాత్రికులకు పాక్ తాజా హెచ్చరిక ప్రాధాన్యం సంతరించుకుంది. విదేశాల్లో భిక్షాటనకు పాల్పడి దేశ ప్రతిష్ఠను దెబ్బతీయొద్దని, సౌదీ చట్టాలను కచ్చితంగా పాటించాలని ఇస్లామాబాద్ స్పష్టం చేస్తోంది. హజ్–ఉమ్రా యాత్రల సమయంలో జరిగే ఒక్కో ఘటన మొత్తం పాకిస్థాన్ పౌరులపై ప్రతికూల ప్రభావం చూపకుండా ముందుగానే నియంత్రించేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతోంది. -
సౌదీతో పాక్ దోస్తీ ఎఫెక్ట్.. గల్ఫ్‌లో కొత్త చిచ్చు!
పశ్చిమాసియాలో ఇప్పటికే ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. మరో కొత్త సమీకరణం తెరపైకి వచ్చింది. సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ కలిసి కుదుర్చుకున్న మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం ఇప్పుడు గల్ఫ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒప్పందంపై సంతకాలు జరిగి కొన్ని రోజులే అవుతున్నా.. అప్పుడే దాని ప్రభావం మరో వైపు కనిపిస్తోంది. ముఖ్యంగా సౌదీ అరేబియా-యూఏఈ మధ్య దూరం మరింత పెరుగుతోందా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి.అసలు ఏం జరిగింది?ఆగస్టు 7న పవిత్ర మక్కా నగరంలో సౌదీ యువరాజు, ప్రధాని మహ్మద్ బిన్ సల్మాన్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఒప్పందంలోని ప్రధాన సూత్రం ఒక్కటే.. ముగ్గురిలో ఏదో ఒక దేశంపై దాడి జరిగితే.. మిగిలిన రెండు దేశాలపై దాడిగా పరిగణించడం. అంటే.. చమురు సంపదతో బలమైన సౌదీ, అణ్వాయుధ సామర్థ్యం ఉన్న పాకిస్తాన్, నాటోలో రెండో అతిపెద్ద సైనిక బలగం ఉన్న టర్కీ ఒకే రక్షణ గొడుగు కిందకు వచ్చినట్లే అయ్యింది. ఇదే కారణంగా కొందరు నిపుణులు దీనిని ఇప్పటికే ‘ఇస్లామిక్ నాటో’గా పిలవడం మొదలుపెట్టారు.కూటమి ఇంతటితో ఆగదా?మక్కా ఒప్పందం ముగ్గురు దేశాలకే పరిమితం కాదనే సంకేతాలు కూడా వెలువడుతున్నాయి. ఈజిప్ట్, ఖతార్, కువైట్, జోర్డాన్, అజర్బైజాన్, సిరియా వంటి దేశాలను భవిష్యత్‌లో కూటమిలోకి తీసుకురావచ్చనే ప్రచారం జరుగుతోంది. అంటే.. పశ్చిమాసియాలో కొత్త భద్రతా బ్లాక్ రూపుదిద్దుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడే అసలు కథ మొదలైంది.‘GCC ఉండగా కొత్త కూటమి ఎందుకు?’సౌదీ నిర్ణయంపై యూఏఈకి చెందిన ప్రముఖ స్వరాలు ప్రశ్నలు సంధిస్తున్నాయి. సౌదీ, యూఏఈ, ఖతార్, కువైట్, బహ్రెయిన్, ఒమన్ సభ్యులుగా ఉన్న గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) ఇప్పటికే ఉంది. అంతేకాదు.. సభ్య దేశాలపై దాడిని మొత్తం కూటమిపై దాడిగా పరిగణించే సంయుక్త రక్షణ వ్యవస్థ కూడా ఉంది. అలాంటప్పుడు.. గల్ఫ్ వెలుపల ఉన్న టర్కీ, పాకిస్తాన్లతో కలిసి సౌదీ కొత్త రక్షణ కూటమిని ఎందుకు ఏర్పాటు చేసిందన్నది యూఏఈ వర్గాల ప్రశ్న. యూఏఈ రాజకీయ విశ్లేషకుడు, ఆ దేశ అధ్యక్షుడి మాజీ సలహాదారు అబ్దుల్ఖలీఖ్ అబ్దుల్లా కూడా ఇదే అంశాన్ని లేవనెత్తారు. గల్ఫ్ దేశాల మధ్య ఐక్యతను బలోపేతం చేయడమే ముఖ్యమని వ్యాఖ్యానించారు.సౌదీ కూడా తగ్గలేదు!యూఏఈ నుంచి విమర్శలు రావడంతో సౌదీ వర్గాలు కూడా వెంటనే కౌంటర్ ఇచ్చాయి. ప్రతి దేశానికీ తన జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఇతర దేశాలతో ఒప్పందాలు చేసుకునే హక్కు ఉంది అంటూ సౌదీ యువరాజు అబ్దుల్రహ్మాన్ బిన్ ముసైద్ ప్రశ్నించారు. అంతేకాదు.. సౌదీ నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్న యూఏఈ తన భద్రతా భాగస్వామ్యాలను ఒకసారి చూసుకోవాలని సౌదీ వ్యాఖ్యాతలు సూచించారు.భారత్, ఇజ్రాయెల్ పేర్లు ఎందుకొచ్చాయి?ఇక్కడే ఈ వివాదం మరో ఆసక్తికర మలుపు తిరిగింది. సౌదీ వ్యాఖ్యాతలు.. యూఏఈ-భారత్ రక్షణ సహకారం, యూఏఈ-ఇజ్రాయెల్ భద్రతా సంబంధాలను ప్రస్తావించారు. యూఏఈ ఇతర దేశాలతో భద్రతా భాగస్వామ్యాలు పెట్టుకోవచ్చు.. కానీ సౌదీ టర్కీ, పాకిస్తాన్‌తో ఒప్పందం చేసుకుంటే మాత్రం ఎందుకు అభ్యంతరం ఎందుకు? అన్నది వారి వాదన. అయితే ఇక్కడ ఒక కీలక విషయం ఉంది. భారత్, యూఏఈ మధ్య సంయుక్త రక్షణ ఒప్పందం లేదు. కానీ ఇరు దేశాల మధ్య చాలాకాలంగా రక్షణ సహకారం కొనసాగుతోంది. 2026 జనవరిలో ఈ సహకారాన్ని మరింత విస్తరించేలా వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యానికి కూడా ఇరు దేశాలు రూపకల్పన చేశాయి. ఇజ్రాయెల్‌తో మాత్రం యూఏఈ 2020లో అబ్రహామ్ ఒప్పందాల ద్వారా సంబంధాలను సాధారణీకరించింది.యెమెన్లోనే అసలు విభేదాల బీజాలు!సౌదీ-యూఏఈ మధ్య విభేదాలు ఇప్పుడే మొదలైనవి కావు. యెమెన్ విషయంలోనే ఇరు దేశాల వ్యూహాలు చాలా కాలంగా వేర్వేరు మార్గాల్లో సాగుతున్నాయి. సౌదీ అరేబియా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన యెమెన్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తుండగా.. యూఏఈ దక్షిణాది వేర్పాటువాద శక్తులకు మద్దతుగా నిలిచింది. అంటే.. బయటకు మిత్రదేశాలుగానే కనిపిస్తున్నా, కీలకమైన ప్రాంతీయ అంశాల్లో ఇరు దేశాల ప్రయోజనాలు వేర్వేరుగా మారుతున్నాయి.ముందు ఏం జరగబోతోంది?మక్కా ఒప్పందం మరిన్ని దేశాలకు విస్తరిస్తే.. మధ్యప్రాచ్యంలో కొత్త శక్తి సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉంది. ఒకవైపు సౌదీ-టర్కీ-పాకిస్థాన్ అక్షం బలపడుతుంటే.. మరోవైపు యూఏఈ తన భారత్, ఇజ్రాయెల్ సహా ఇతర వ్యూహాత్మక భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేసే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు అసలు ప్రశ్న ఒక్కటే.. మక్కాలో పుట్టిన ఈ కొత్త రక్షణ కూటమి.. ఇస్లామిక్ ప్రపంచానికి భద్రతా కవచమా? లేక గల్ఫ్‌లోనే కొత్త విభేదాలకు కారణమా?. రాబోయే రోజుల్లో ఈ సమీకరణం ఎటువైపు మలుపు తిరుగుతుందో చూడాలి. -
పాత ఒప్పందానికి పాతర
అనిశ్చిత ప్రపంచంలో మరో కొత్త రక్షణ ఒప్పందం ఉనికిలోకొచ్చింది. తుర్కియే, సౌదీ అరేబియా, పాకిస్తాన్‌లు గత శుక్రవారం ‘మక్కా రక్షణ ఒప్పందం’ పేరిట ఒక ఒడంబడిక కుదుర్చుకున్నాయి. పూర్తి పాఠాన్ని బయటపెట్టలేదు గనుక దీని లోతుపాతులు తెలియవు. కానీ పాకిస్తాన్ విదేశాంగ శాఖ ‘ఈ మూడు దేశాల్లో ఏ ఒక్కరిపై దాడి జరిగినా అది అందరిపైనా జరిగిన దాడిగా పరిగణించాల’ని నిర్ణయించుకున్నట్టు ఒక ప్రకటన విడుదల చేసింది. తుర్కియే అధ్యక్షుడు రిసెప్ తయీప్ ఎర్డోగాన్ మాత్రం ‘ఈ ఒప్పందం కింద ఉమ్మడిగా రక్షణ పరిశ్రమ ప్రాజెక్టులు చేపట్టడం, ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో పాలుపంచుకోవటం ఉంటాయ’ని ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఒప్పందం విషయంలో అమెరికాకు ఆగ్రహం కలుగుతుందని సౌదీ భావించినట్టుంది. అందుకే ‘ఈ మూడు దేశా లకూ ఇప్పటికే ఉన్న ఇతర రక్షణ ఒప్పందాలు దీనికి అడ్డురాబోవ’ని సౌదీ ఉపమంత్రి రేయాద్ క్రిమ్లీ వివరణనిచ్చారు. ఒప్పందంపై కొద్ది నెలలుగా సాగిన చర్చల్లో పాల్గొన్న ఈజిప్టు చివరన ముఖం చాటేసింది. ఇంతకూ ఇస్లామిక్ దేశాల సహకార సంస్థ (ఓఐసీ) సదస్సులో గతంలో కుదిరిన ‘మక్కా ఒప్పందం’ ఏమైంది?ఈ మూడు దేశాలకూ ఇరుగుపొరుగుతో వాటి వాటి సొంత ఘర్షణలున్నాయి. తమలో తమకున్న పొరపొచ్చాలు వీటికి అదనం. నాటోలో భాగస్వామిగా ఉన్న తుర్కియేకు ఎజియన్ సముద్రంలో మరో సభ్య దేశం గ్రీస్‌తో సరిహద్దు లడాయి వుంది. ఇజ్రాయెల్‌తో వైరం సరేసరి. పాకిస్తాన్ అయితే ఇటు మన దేశంతోపాటు అఫ్గానిస్తాన్‌తో కూడా కలహిస్తోంది. ఇరాన్‌పై అమెరికా దాడుల్ని సమర్థించటమేకాక... దాని అభీష్టం మేరకు ఇజ్రాయెల్‌తో అవగాహన కుదుర్చుకున్న చరిత్ర సౌదీది. పర్యవసానంగా ఇరాన్ నుంచీ, ఎర్ర సముద్రంలో ఇరాన్ మద్దతుదార్లయిన హౌతీలనుంచీ సమస్యలు ఎదుర్కొంటోంది. ఇక 2018లో తుర్కియే గడ్డపై జర్నలిస్టు ఖషోగ్గిని కిరాయి హంతకులతో సౌదీ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ హత్య చేయించారన్న ఆరోపణలున్నాయి. ఈ విషయంలో రెండు దేశాల సంబంధాలూ దెబ్బతిన్నాయి. అమెరికా ప్రాపకంతో తెరవెనక సర్దుబాట్లు కుదిరినా తుర్కియే ఆగ్రహం చల్లారలేదు.ఇలా ఎవరికి వారు సక్రమంగా లేకుండా, ఎవరిపై దాడి జరిగినా అందరం ఏకమవు తామనటంలోని సహేతుకత ఏమిటో అర్థంకాదు. దేశంలో అమెరికా స్థావరాలుంటే భద్రతకు తిరుగులేదని ఇతర గల్ఫ్ దేశాలతోపాటు సౌదీ కూడా అమాయకంగా అనుకున్నది. అమెరికా వేరేవారిపై దాడి చేస్తే దాని అధునాతన రక్షణ వ్యవస్థవల్ల ఒక్క క్షిపణి కూడా తమ గడ్డపై పడబోదని నమ్మింది. అదంతా ఉత్త భ్రమగా తేలింది. ఇరాన్ వల్లకాడు కావటానికి తోడ్పడుతూ తమ జోలికి మాత్రం అది రాకూడదని కోరుకోవటం అత్యాశ అని అర్థమైంది. అందుకే రక్షణ ఒప్పందాలు కుదుర్చుకుని అందరినీ హడలెత్తించాలని ఆ దేశం నిర్ణయించుకున్నట్టు కనబడుతోంది. నిరుడు పాక్‌తో కుదిరిన రక్షణ ఒప్పందం తాజా యుద్ధంలో కొరగాకుండా పోయింది. ఇరాన్‌తో అంటకాగిన పాక్... కనీసం సౌదీపై అది చేసిన దాడుల్ని ఖండించటానికి కూడా సిద్ధపడలేదు. తీరు మారకపోతే ఈ త్రైపాక్షిక ఒప్పందానికీ అదే గతి పడుతుంది. ఇస్లామిక్ దేశాలు 2005లో ‘మక్కా ఒప్పందం’ కుదుర్చుకున్నాయి. ఆ సంగతి ముగ్గురిలో ఎవరికైనా గుర్తుందా? పదేళ్లపాటు కొనసాగాల్సిన ఆ ఒప్పందాన్ని మరో పదేళ్లు పొడిగించారు కూడా. దాని అతీగతీ తెలియదు. 21వ శతాబ్దంలో ఇస్లాంకు ఎదురవుతున్న సవాళ్లపై జరిపిన సదస్సులో ఈ ఒప్పందం కుదిరింది. ఇస్లామిక్ ప్రపంచంలో సంయమనం, సౌభ్రాతృత్వం, మానవ హక్కులు, సుపరిపాలన, ఆర్థిక సహకారం, ఘర్షణల నివారణ, పేదరిక నిర్మూలన, ఉన్నత విద్య, శాస్త్ర సాంకేతికతలు, మహిళల హక్కులు దాని ప్రధానాంశాలు. ఇందులో పాలస్తీనా కూడా ఉంది. వినడానికి భేషుగ్గా ఉంది. కానీ ఆచరణ? తాజా ఒప్పందంతో వాటన్నిటినీ పర్షియన్ గల్ఫ్‌లో నిండా ముంచినట్టేనా? ఇతరుల్ని ఇబ్బందుల్లోకి నెడుతూ, వారినుంచి తమకేమీ కాకూడదని ఆశించటం వ్యర్థ ప్రయత్నమని ఈ దేశాలు గుర్తించాలి. ఇందుకు బదులు 2005 నాటి ఒప్పందం అమలుకు చిత్తశుద్ధితో కృషిచేయాలి. అప్పుడు మాత్రమే వాటికి కోరుకున్న శాంతి లభిస్తుంది. -
పాక్.. సౌదీ.. టర్కీ ఒప్పందం ఒక్కటైన మూడు ముస్లిం దేశాలు..
-
సంకేతమే అయినా మున్ముందు సవాలే!
సౌదీ అరేబియా, పాకిస్తాన్, తుర్కియే ఆగస్ట్ 7న ‘మక్కా రక్షణ ఒడంబడిక’పై రియాద్‌లో సంతకాలు చేశాయి. దీనికి సైనికపరంగాకన్నా ఇతరత్రా ఎక్కువ ప్రాధాన్యం ఉంది. ఇది పశ్చిమాసియాలో నీరుగారుతున్న అమెరికా ప్రాభవాన్ని వెల్లడిస్తోంది. భద్రతా ప్రాధాన్యాల రీత్యా ఈ మూడు దేశాల మధ్యనున్న సారూప్యత బహు స్వల్పం. అమెరికా– ఇరాన్ మధ్య యుద్ధ పర్యవసానాలు సౌదీకి తలనొప్పిగా పరిణమించాయి. ఇరాన్‌తో దాని వైరం 1979 నుంచి సాగుతోంది. పాక్ దృష్టంతా భారత్‌పైనే. ‘నాటో’ కూటమిలో ఒకటిగా ఉన్న తుర్కియే అటు పశ్చిమాసియాలోనూ, ఇటు ఉత్తరాఫ్రికాలోనూ తన పలుకుబడిని పెంచుకోవాలని చూస్తోంది. ఆ ప్రాంతంలో నమ్మదగిన రక్షణ సామగ్రి ఎగుమతి దారుగా అవతరించాలని కోరుకుంటోంది. ఇలా వైరుధ్యాలున్నా రక్షణ కోసం ఈ మూడు దేశాలు ఒక వర్గంగా ఏర్పడటం ప్రతీకాత్మకంగా గణనీయమైనదే. ఇది మూడు భారీ మార్పులను ప్రతిబింబిస్తోంది: భిన్నమైన వ్యూహాత్మక, భద్రతా ప్రాధాన్యతలు; నూతన భద్రతా భాగస్వామ్యాల కోసం అన్వేషణ; అమెరికాపై ఇన్నాళ్ళూ ఉన్న నమ్మకం సడలిపోవడం.అమెరికాపై పోతున్న ఆశలుపశ్చిమాసియా, దానిని అనుకుని ఉన్న ప్రాంతాలు ఒక భద్రతా చట్రాన్ని కల్పించుకోవడంలో కొన్ని దశాబ్దాలుగా వాషింగ్టన్‌పైనే ఆధారపడుతూ వచ్చాయి. అమెరికా నుంచి ఆయుధాలు కొని సౌదీ అరేబియా దాని నుంచి భద్రతాపరమైన పూచీకత్తులు సంపాదించింది. తుర్కియే ఎలాగూ ‘నాటో’లో సభ్యురాలు. పాకిస్తాన్ ‘‘నాటో’యేతర ప్రధాన మిత్రపక్షం’.ఆరామ్‌కోపై జరిగిన ఇటీవలి దాడులపైనా, హౌతీలను కట్టడి చేయడంపైనా అమెరికా స్పందన పేలవంగా ఉందని సౌదీ భావిస్తోంది. సిరియా విషయంలో ‘నాటో’తో తుర్కియే చాలా ఏళ్లుగా ఘర్షణపడుతోంది. ఎఫ్–35 యుద్ధ విమానాల విక్రయాలు, కుర్దుల అంశం కూడా దాన్ని చిరాకుపరుస్తున్నాయి. అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా సేనలు వైదొలగడం, 2009 తర్వాత అమెరికా క్రమంగా భారత్ వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపించడంతో వ్యూహాత్మకంగా ఏకాకినవుతున్నానని పాక్ భావిస్తూ ఉండవచ్చు. రియాద్, అంకారా, ఇస్లామాబాద్ ఒకదానికొకటి రక్షణగా నిల వాలని నిర్ణయించుకోవడం గణనీయమైన పరిణామమే. ఈ ఒడంబడిక ప్రస్తుతానికి పస లేనిదిగా కనిపించవచ్చుకానీ, ఇక్కడ సంకే తానికే ఎక్కువ ప్రాధాన్యం. మూడు ప్రధాన ముస్లిం మెజారిటీ సైనిక శక్తులు చేతులు కలుపుతున్నాయి. పాకిస్తాన్ అమ్ములపొదిలో అణ్వస్త్రం ఉంది. తుర్కియేలో ప్రధాన రక్షణ సామగ్రి పరిశ్రమలు న్నాయి. సౌదీ అరేబియాకు చమురు నిల్వలు పుష్కలం.ఇజ్రాయెల్‌కు సంకటమే!ఈ మూడు దేశాల్లో ఏ దేశంపైన దాడి జరిగినా మిగిలిన రెండు దేశాలపైన కూడా దాడి జరిగినట్లుగానే భావించాలని పేర్కొంటున్న క్లాజు మక్కా ఒప్పందానికి ప్రాముఖ్యతను సంతరిస్తోంది. కాకపోతే, భాష అస్పష్టంగా ఉంది. ‘నాటో’ ఆర్టికల్ 5 తరహాలో, ఆటోమే టిక్‌గా యుద్ధానికి దిగుతామనే నిర్దుష్టమైన పదజాలాన్ని చేర్చలేదు. సమైక్య కమాండ్ల ప్రస్తావన లేదు. సంయుక్తంగా స్థావరాలు నిర్వహిస్తామని ఎక్కడా ప్రకటించలేదు. ఈ ఒడంబడిక తక్షణ సైనిక ప్రభావం పరిమితం కావచ్చు. కానీ, అస్పష్టతకు కూడా భౌగోళిక రాజకీయాల్లో ప్రాధాన్యం ఉంటుంది. ఇది శత్రు దేశాల్లో అయోమయాన్ని సృష్టిస్తుంది. వాటి రక్షణ సన్నద్ధత ఖర్చును పెంచుతుంది. పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు సంబంధించిన భద్రతా చర్చల్లో తల దూర్చాలని తుర్కియే చాలా కాలంగా అభిలషిస్తోంది. కానీ, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్, అమెరికా దాన్ని దూరంపెడుతూ వచ్చాయి. ఇపుడు మక్కా ఒడంబడికతో తుర్కియే ఆ రకమైన చర్చల్లో పాల్గొనేందుకు ప్రవేశార్హత సంపాదించుకున్నట్లు అయింది. ఇది ఇజ్రాయెల్‌కు కంటక ప్రాయంగా మారడం ఖాయం. గాజాలో ఇజ్రాయెల్ చర్యలను తుర్కియే బాహాటంగా విమర్శిస్తోంది. మక్కా రక్షణ ఒడంబడికతో అటు తుర్కియే, ఇటు అణ్వస్త్ర సహిత పాకిస్తాన్ పశ్చిమాసియా భద్రతకు సంబంధించిన అధికారిక చర్చల్లో మొదటిసారిగా పాల్గొనేందుకు ప్రయత్నించవచ్చు. ఇంత కాలం అమెరికా నేతృత్వంలోని అబ్రహాం ఒప్పందాల గొడుగు నీడన ఇజ్రాయెల్ పనులు చక్కబెట్టుకుంటూ వస్తోంది. గల్ఫ్ కౌన్సి ల్తో సన్నిహిత సంబంధాలు నెరపుతోంది. ఇరాన్‌కు వ్యతిరేకంగా భద్రతాపరమైన సహకారాన్ని గుట్టుచప్పుడు కాకుండా అందిస్తోంది. తద్వారా, పాక్‌ను ఆమడదూరంలో ఉంచుతూ వస్తోంది. తాజా ఒడంబడిక ఈ సూత్రీకరణలన్నింటినీ అస్తవ్యస్తం చేస్తోంది. ఇజ్రాయెల్‌ను గుర్తించని పాక్‌కు గల్ఫ్ భద్రతా చర్చల బల్ల వద్ద కుర్చీ కల్పిస్తోంది. పాలస్తీనియన్ల తరఫున వకాల్తా పుచ్చుకున్నదిగా తనను చాటుకునే తుర్కియేకు సంస్థాపరమైన పరపతిని తెచ్చిపెడుతోంది. భారత్ ఎందుకు జాగ్రత్తపడాలి?ఈ ఒడంబడికతో న్యూఢిల్లీకి సంబంధం లేదని అనడానికి లేదు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో సిసలైన కాపలాదారుగా భారత్ తనను తాను చాటుకుంటూ వస్తోంది. సాగర జలాలకు సంబంధించినంతవరకు భద్రతకు నికరంగా భారత్ పైనే ఆధారపడ టానికి ప్రాధాన్యం ఇస్తారనే భావనపైనే ప్రధాని నరేంద్ర మోదీ తన ‘సాగర్’, ‘మహాసాగర్’ విధానాలను నిర్మించుకుంటూ వచ్చారు. సౌదీ అరేబియా 14 దేశాలతో కలసి జూలై 30న ఒక మారిటైమ్ సెక్యూరిటీ క్లస్టర్‌ను ప్రారంభించింది. కానీ ఈ గ్రూపులో భారత్ భాగంగా లేదు. భారతదేశానికి బదులుగా పాక్, తుర్కియేలతో రక్షణ అవగాహన కల్పించుకునేందుకు సౌదీ మొగ్గు చూపడాన్నే ఒక భౌగోళిక రాజకీయ సంకేతంగా తీసుకోవాలి. భారత్‌తో ఆర్థిక సంబంధాలు, ఇంధన వర్తకం వృద్ధి చెందుతున్నా, సంక్షోభం ముంచుకొస్తే, భారతదేశాన్ని ఒక ముఖ్యమైన భద్రతా భాగ స్వామిగా రియాద్ చూడదని దీన్ని బట్టి స్పష్టమవుతోంది. పాకిస్తాన్ పరపతి పెరుగుతూండటం రెండవ అంశం. రెండు పవిత్ర మసీదులకు రక్షణదారుగా ఉన్న దేశంతోనూ, ఒక ‘నాటో’ సైనిక శక్తితోనూ రక్షణ ఒడంబడిక కుదుర్చుకోవడం ఇస్లామాబాద్‌కు దౌత్యపరమైన విలువ తెచ్చిపెడుతోంది. అంతర్జాతీయంగా పాక్ ఏకాకి అయిందనే కథనానికి ఇది గండికొడుతోంది. బలాబలాల మధ్య సమతూకాన్ని మక్కా రక్షణ ఒడంబడిక రాత్రికి రాత్రి మార్చేయకపోవచ్చు. సంయుక్త సున్నీ సైనిక శక్తి రేపటికి రేపే అవతరించకపోవచ్చు. కానీ, ఈ ఒడంబడిక రెండు చేదు వాస్తవాలను వెల్లడిస్తోంది. ఒకటి– కీలకమైన మధ్యవర్గ శక్తులు కేవలం అమెరికాపై ఆధారపడే ధోరణి నుంచి దూరం జరుగుతున్నాయి. రెండు– ఈ వైవిధ్యీకరణలో సిద్ధాంతాన్ని పక్కనపెట్టి, తక్షణ ఆచరణాత్మక దృక్పథంతో నూతన కూటములు ఏర్పడుతున్నాయి. ఢిల్లీ ఎదుట సునిశితమైన సవాల్ ఉంది. గల్ఫ్ నుంచి ఆగ్నేయాసియా వరకు భద్రతను కల్పించగల శక్తిగా అవతరించాలని కోరుకుంటున్న భారత్ తన ‘సాగర్’, ‘మహాసాగర్’ విధానాలను సౌదీ అరేబియా వంటి దేశాలు అక్కున చేర్చుకోగలిగినవిగా మలచాలి. సి. ఉదయ్ భాస్కర్వ్యాసకర్త ‘సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్’ డైరెక్టర్, న్యూఢిల్లీ -
బయటికి రావాలంటే రూ.84 లక్షల బ్లడ్‌మనీ చెల్లించాల్సిందే..
నిజామాబాద్: పొట్టకూటి కోసం వలస వెళ్లిన యువకుడు సౌదీ అరేబియా దేశంలోని రియాద్ జైలులో మగ్గుతున్నాడు. అతడిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న దివ్యాంగురాలైన భార్య చంటి బిడ్డను పట్టుకుని భర్త రాకకోసం వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. తమ బిడ్డ తిరిగి రావాలని ఆ యువకుడి తల్లిదండ్రులు దేవుళ్లను వేడుకుంటున్నారు. కుటుంబాన్ని కష్టాల నుంచి గట్టెక్కిస్తాననే ఆశతో వలస వెళ్లిన యువకుడు శ్రావణ్‌కుమార్ కుటుంబ పరిస్థితి ఇది. సాలూర మండలం కుమ్మన్‌పల్లి గ్రామానికి చెందిన కుమ్మరి రామయ్య, రాజమణి దంపతుల కుమారుడు శ్రావణ్‌కుమార్ (32). జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం చింతల్‌పేటకు చెందిన దివ్యాంగురాలు మమతను 2022లో శ్రావణ్ పెళ్లి చేసుకున్నాడు. 2023 నవంబర్‌లో ఉపాధి కోసం సౌదీ అరేబియా దేశం రియాద్‌కు వెళ్లిన శ్రావణ్ అక్కడి ఓ ప్రైవేట్ మెడికల్ రీసెర్చ్ కంపెనీలో అంబులెన్స్ డ్రైవర్‌గా పనిలో చేరాడు. మంచి ఉద్యోగం రావడంతో తన కలలు సాకరమవుతాయని సంబురపడిన శ్రావణ్‌పై కోలుకోలేని దెబ్బపడింది. 2024 మే 6వ తేదీన శ్రావణ్ నడుపుతున్న అంబులెన్స వాహనం రోడ్డు ప్రమాదానికి గురికాగా.. ఈ ప్రమాదంలో స్థానికులైన భార్యాభర్తలు మృతి చెందారు. ఇద్దరు పిల్లలకు తీవ్రగాయాలయ్యాయి. అక్కడి పోలీసులు శ్రావణ్‌ను అరెస్టు చేసి జైలు తరలించారు. కొన్ని నెలల్లోనే అక్కడి న్యాయస్థానం తీర్పు వెలువరించింది. రోడ్డు ప్రమాద ఘటనకు శ్రావణ్‌కుమార్‌ను నేరస్థుడిగా నిర్ధారించింది. రూ.3.30 లక్షల సౌదీ రియాళ్లు (బ్లడ్ మనీ – రక్తపరిహారం) బాధితకుటుంబానికి చెల్లించాలని తీర్పులో పేర్కొంది. మన దేశ కరెన్సీలో ఆ మొత్తం సుమారు రూ.84 లక్షలు. బాధిత కుటుంబాల అంగీకారం మేరకు పరిహారం చెల్లిస్తే శ్రావణ్‌కుమార్‌కు జైలు నుంచి విముక్తి పొందే అవకాశం కలుగుతుంది. పరిహారం చెల్లించకపోతే జైలు నుంచి విడుదలయ్యే పరిస్థితి ఉండదు. అంత పెద్ద మొత్తంలో పరిహారం చెల్లించే ఆర్థిక స్థోమత లేక శ్రావణ్‌కుమార్ కుటుంబీకులు నిస్సహాయ స్థితిలో ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. శ్రావణ్‌కుమార్ పై అక్కడి దేశం ట్రావెలింగ్ బ్యాన్ ఆంక్షలు పెట్టింది. గడపగడపకు వెళ్తున్న మమత తన భర్తను జైలు నుంచి విడిపించాలని దివ్యాంగురాలైన మమత కొన్ని నెలలుగా ప్రజాప్రతినిధులను వేడుకుంటోంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌తోపాటు నిజామాబాద్, జగిత్యాల జిల్లాకు చెందిన ఎంపీకి, పలువురు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు వినతి పత్రాలు అందజేసింది. ఈ ఏడాది మే 29న హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రవాసీ ప్రజావాణిలో తమ పరిస్థితిని వివరించింది. తన భర్తను తీసుకురావాలని వేడుకుంది. ప్రభుత్వం ఆదుకోవాలి మాది నిరుపేద కుటుంబం. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న నా కొడుకు రెండేళ్ల నుంచి సౌదీ అరేబియా జైలులో ఉన్నాడు. రెక్కల కష్టంపై బతుకుతున్నాం. మాకు ఎలాంటి ఆస్తులు లేవు. లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకురావాలి. – కుమ్మరి రామయ్య, శ్రావణ్‌కుమార్ తండ్రి మమ్మల్ని ఆదుకోండి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, మానవతావాదులు స్పందిస్తేనే మా కుటుంబం ఈ గండం నుంచి గట్టెక్కుతుంది. నేనే దివ్యాంగురాలిని చంటి బిడ్డను పట్టుకుని తిరుగుతున్నా. మా అత్తామామలు తల్లడిల్లుతున్నారు. సౌదీ అరేబియా కోర్టు చెప్పిన జరిమానా చెల్లించే స్థోమత మాకు లేదు. – మమత, శ్రావణ్‌కుమార్ భార్య -
పశ్చిమాసియాలో మరో యుద్ధం తప్పదా?
ఇంతకాలం పశ్చిమాసియా యుద్ధం అనగానే మనం ఇజ్రాయెల్, హమాస్ లేదా ఇరాన్ గురించే మాట్లాడుకుంటాం. కానీ తెర వెనుక అంతకంటే ప్రమాదకరమైన మరో యుద్ధం మొదలైంది..! అదే.. ఎర్ర సముద్రంలో సౌదీ అరేబియా - యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల మధ్య జరుగుతున్న మరో భీకర యుద్ధం.. దాని గురించి తెలుసుకోవాలనుందా అయితే ఈ స్టోరీపై ఓ లుక్కేయ్యండీ!కొన్ని నెలల క్రితం ఇజ్రాయెల్ షిప్పింగ్‌ను లక్ష్యంగా చేసుకున్న హౌతీలు.. ఇప్పుడు నేరుగా సౌదీ అరేబియాను టార్గెట్‌గా మార్చుకున్నారు. జూలై 20న సౌదీ నౌకలపై ఏకంగా ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు. కేవలం రెండు రోజుల్లోనే సౌదీ ఆయిల్ ట్యాంకర్లపై మిస్సైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడ్డారు. దీంతో సౌదీకి వెళ్లాల్సిన ఓడలకు బ్రేకులు పడ్డాయి. అసలు సౌదీకి, హౌతీలకు మధ్య వైరానికి కారణం ఏమిటి? ఈ సరికొత్త ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను, ముఖ్యంగా చమురు మార్కెట్లను ఎలా ప్రభావితం చేయబోతున్నాయనే వివరాలు ఇప్పుడు ఆసక్తిగా మారాయి.హౌతీలు – సౌదీ మధ్య వివాదం కొత్తదేం కాదు. దీని మూలాలు దశాబ్దాల నాటివి. 2015లో యెమెన్ అంతర్యుద్ధంలోకి సౌదీ అరేబియా నేరుగా జోక్యం చేసుకుంది. ఉత్తర యెమెన్‌ను హౌతీలు ఆక్రమించుకున్న తర్వాత, అక్కడ చట్టబద్ధమైన ప్రభుత్వాన్ని మళ్ళీ నిలబెట్టడానికి సౌదీ సైన్యం భారీ వైమానిక దాడికి దిగింది. ఆ తర్వాత ఏడేళ్ల పాటు దారుణమైన యుద్ధం జరిగింది. సౌదీ విమానాలు యెమెన్‌పై బాంబుల వర్షం కురిపిస్తే.. హౌతీలు డ్రోన్లు, క్షిపణులతో సౌదీ నగరాలు, విమానాశ్రయాలు, ఆయిల్ రిఫైనరీలను టార్గెట్ చేశారు. చివరకు 2022లో ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వంతో ఒక తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. కానీ, యెమెన్‌పై ఉన్న ఆర్థిక.. రవాణా ఆంక్షలను సౌదీ పూర్తిగా ఎత్తివేయలేదు. సరిగ్గా ఇదే ఇప్పుడు హౌతీలకు కోపం తెప్పించింది. ‘‘మీరు మా గగనతలాన్ని, సముద్ర మార్గాలను దిగ్బంధిస్తే.. మేం కూడా మీ షిప్పింగ్‌ను అడ్డుకుంటాం’’ అంటూ హూతీలు కవ్వింపు చర్యలకు దిగారు.ఇక్కడ అసలు సమస్య భౌగోళిక వ్యూహానిది అంటే.. Geopoliticsది. ప్రపంచ వాణిజ్యానికి, ముఖ్యంగా ఆయిల్ రవాణాకు 'బాబ్ అల్-మందబ్' (Bab el-Mandeb) జలసంధి ఎంతో ముఖ్యం. హిందూ మహాసముద్రం నుంచి సూయజ్ కాలువకు వెళ్లాలన్నా, ఐరోపా మార్కెట్లకు చేరుకోవాలన్నా ఈ సన్నని జలసంధి మీదుగానే ఓడలు ప్రయాణించాలి. ఇరాన్‌తో జరుగుతున్న ప్రస్తుత ఉద్రిక్తతల వల్ల సౌదీ తన ప్రధాన ఆయిల్ ఎగుమతి మార్గమైన Strait of Hormuz ద్వారా రవాణాను తగ్గించుకుంది. దానికి బదులు.. దేశం తూర్పు భాగం నుంచి పశ్చిమాన ఉన్న ఎర్ర సముద్ర తీరంలోని 'యాన్బు' పోర్టుకు ఆయిల్‌ను చేరవేసే ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌పై ఎక్కువగా ఆధారపడుతోంది. దీంతో జూన్ నుంచి యాన్బు పోర్టు ద్వారా రోజుకు దాదాపు 4 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్ ఎగుమతి అవుతోంది. అంటే.. సౌదీ తన ఆయిల్ ఎగుమతులను ఒక ప్రమాదకర చోక్పాయింట్ నుంచి తప్పించి, మరో చోక్‌పాయింట్‌పై అంటే.. ఎర్ర సముద్రం మార్గంపై ఎక్కువగా ఆధారపడేలా చేసుకుంది. హౌతీలు సరిగ్గా ఇదే బలహీనతను పట్టుకున్నారు..! సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే దాడులు చేస్తూ సౌదీ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టాలని చూస్తున్నారు.ఈ ఉద్రిక్తతల వెనుక ఇరాన్ ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే.. ట్రిపుల్ హెచ్ అని పిలిచే మిలిటెంట్ సంస్థలు.. అవే.. హమాస్, హిజ్బుల్లా, హౌతీలను పెంచి పోషిస్తోంది ఇరాన్ అనేది బహిరంగ రహస్యం..! అమెరికా వైమానిక దాడులు, ఇరాన్‌తో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో.. ఇరాన్ తన మిత్రపక్షమైన హౌతీలను ఉసిగొల్పుతోందన్న వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు.. పరిస్థితుల ప్రతికూలతల కారణంగా.. సౌదీ అరేబియా మరో యుద్ధానికి వెళ్లేందుకు సుముఖంగా లేదు. గత నాలుగేళ్లుగా ఆ యుద్ధం నుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్న రియాద్‌కు, ఇప్పుడు హౌతీల నుంచి వస్తున్న ఈ సవాళ్లు పెనుభారంగా మారాయి. మరి సౌదీ దీనికి ఎలా స్పందిస్తుంది?ఒకటి.. పరిమిత దాడుల ఆలోచనకు దిగొచ్చు. అంటే.. హౌతీల లాంచర్లు, డ్రోన్ బేస్‌లపై మాత్రమే చిన్నపాటి దాడులు చేసి ఊరుకోవడం. రెండోది.. పెద్ద ఎత్తున ప్రతీకార దాడులకు దిగడం. ఒకవేళ సౌదీ గనుక సనా ఎయిర్‌పోర్టు లేదా హౌతీ నేతలపై సర్వశక్తులతో విరుచుకుపడితే.. అది మరోసారి పూర్తిస్థాయి అంతర్యుద్ధానికి దారితీస్తుంది. అంతేకాదు, అమెరికా.. ఇజ్రాయెల్ కూడా ఇందులో నేరుగా జోక్యం చేసుకునే ప్రమాదం లేకపోలేదు. అప్పుడు ఈ ప్రాంతంలో శాంతి కలకాలం మృగ్యమౌతుంది. ప్రస్తుతానికైతే.. ఇటు సౌదీ అరేబియా.. అటు హౌతీలు.. ఇద్దరూ కూడా పూర్తి స్థాయి యుద్ధానికి దిగే ప్రమాదాలు పెద్దగా లేవుహౌతీలు సౌదీతో చర్చలు జరిపి Funds లేదా Airport restrictions తొలగింపు వంటి కొన్ని వెసులుబాట్లను పొందాలని చూస్తున్నారు. మరోవైపు సౌదీ తన ఆయిల్ ట్రేడ్‌ను, నగరాలను రక్షించుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. కాని ఇక్కడ మార్జిన్ చాలా తక్కువ..! ఇక్కడ జరిగే ఒక చిన్న తప్పు లేదా పొరపాటు మొత్తం పశ్చిమాసియాను మరోసారి అగ్నిగుండంలోకి నెట్టగలదు.సౌదీ అరేబియా తన చమురు మార్గాలను ఎలా కాపాడుకుంటుంది? హౌతీల దూకుడుకు అమెరికా ఎలా స్పందిస్తుంది?’’ అనే దానిపైనే రాబోయే కాలంలో అంతర్జాతీయ ఆయిల్ ధరలు, గ్లోబల్ పాలిటిక్స్ ఆధారపడి ఉంటాయి.-సాక్షివెబ్‌డెస్క్ -
అమెరికానే కాపాడలేకపోయింది.. ఇంక పాక్-టర్కీ ఏం చేస్తాయి?
పశ్చిమాసియాలో మారుతున్న భద్రతా సమీకరణాలకు సంకేతంగా పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ మూడు దేశాలు కీలక రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో కుదిరిన ఈ ఒప్పందం ప్రాంతీయ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. ఒక దేశంపై దాడిని మిగిలిన రెండు దేశాలపై దాడిగా పరిగణించేలా రూపొందించిన ఈ రక్షణ కూటమి.. సౌదీ భద్రతా వ్యూహంలో కీలక మార్పుగా మారింది. అయితే ఈ ఒప్పందంపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది.టర్కీ, పాకిస్థాన్‌తో చేసుకున్న రక్షణ ఒప్పందాలు సౌదీ అరేబియాకు శాశ్వత భద్రతను అందించలేవని ఇరాన్ విమర్శించింది. అమెరికానే కాపాడలేకపోతోంది.. ఇంక పాక్ టర్కీలు వచ్చి ఏం చేస్తాయి?.. ఏం సాధిస్తాయి? అంటూ డీల్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రత, విదేశీ వ్యవహారాల కమిషన్ సభ్యుడు ఎబ్రహీం రెజాయీ ఈ మేరకు ఘాటు వ్యాఖ్యలు చేశారు.‘కాగితపు ఒప్పందాలతో భద్రత రాదు’సోషల్ మీడియా వేదికగా స్పందించిన రెజాయీ.. “టర్కీ, పాకిస్థాన్‌తో కుదుర్చుకున్న కాగితపు ఒప్పందాలు సౌదీకి భద్రతను తీసుకురావు. అమెరికాతో ఎన్నో ఏళ్లుగా కొనసాగించిన సంబంధాలు కూడా సౌదీకి భద్రత ఇవ్వలేదు” అని వ్యాఖ్యానించారు. సౌదీ తన విధానాలను మార్చుకుంటే ఇతర దేశాల నుంచి భద్రత కోసం ఆధారపడాల్సిన అవసరం ఉండదని ఆయన పేర్కొన్నారు. గతంలో సౌదీ భద్రత కోసం అమెరికాపై ఆధారపడిన తీరును ప్రస్తావిస్తూ ఇరాన్ ఈ విమర్శలు చేసింది.మక్కా వేదికగా మూడు దేశాల డిఫెన్స్ డీల్అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ మధ్య ఈ రక్షణ ఒప్పందం కుదిరింది. ఇస్లాం పవిత్ర నగరమైన మక్కాలో జరిగిన సమావేశంలో మూడు దేశాల నేతలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భేటీ సందర్భంగా ఈ ఒప్పందం ఖరారైంది. మూడు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, ఉమ్మడి భద్రతా వ్యూహాలను రూపొందించడం ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యాలుగా పేర్కొన్నారు.ఒకరిపై దాడి.. ముగ్గురిపై దాడిగానే!ఈ రక్షణ ఒప్పందంలోని కీలక అంశం పరస్పర భద్రత. మూడు దేశాల్లో ఏ ఒక్క దేశంపై అయినా సాయుధ దాడి జరిగితే.. దాన్ని మిగిలిన రెండు దేశాలపై జరిగిన దాడిగా పరిగణించేలా నిబంధనలు రూపొందించారు. దాడి జరిగిన సమయంలో పరస్పర సహకారం, రక్షణ రంగంలో సమన్వయం పెంచుకోవడం ఈ ఒప్పందం లక్ష్యమని పాకిస్థాన్ విదేశాంగ శాఖ వెల్లడించింది. మూడు దేశాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలు, ఉమ్మడి వ్యూహాత్మక ప్రయోజనాల ఆధారంగా ఈ ఒప్పందం కుదిరినట్లు తెలిపింది.సౌదీ ఎందుకు కొత్త రక్షణ భాగస్వామ్యాల వైపు?ఇరాన్‌తో పెరుగుతున్న ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో సౌదీ అరేబియా తన రక్షణ భాగస్వామ్యాలను విస్తరిస్తోంది. గతంలో సౌదీ చమురు కేంద్రాలు, కీలక మౌలిక వసతులపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు జరిగాయి. ఈ దాడుల వెనుక ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు, ఇరాక్‌లోని మిలీషియా గ్రూపులు ఉన్నాయని సౌదీ ఆరోపించింది. దీంతో భద్రత విషయంలో కేవలం ఒకే దేశంపై ఆధారపడకుండా కొత్త భాగస్వామ్యాలను పెంచుకోవాలని రియాద్ భావిస్తోంది.ఇటీవల అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడం, గల్ఫ్ ప్రాంతంలో నౌకాయానం ప్రభావితమవడం వంటి పరిణామాలు కూడా ఈ రక్షణ ఒప్పందానికి కారణాలుగా మారాయి.భారత్-పాక్ కోణంలోనూ చర్చఈ ఒప్పందం మరో కోణంలోనూ చర్చకు దారితీస్తోంది. ఒకవేళ భవిష్యత్‌లో పాకిస్థాన్‌పై భారత్ సైనిక చర్య చేపడితే ఈ రక్షణ ఒప్పందం ఎలా ప్రభావితం చేస్తుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒప్పందంలోని పరస్పర రక్షణ నిబంధన ప్రకారం.. పాకిస్థాన్‌పై జరిగే దాడిని మిగిలిన దేశాలు ఎలా పరిగణిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఇలాంటి రక్షణ ఒప్పందాల్లో ప్రతిస్పందన విధానం, సైనిక సహాయం, దౌత్య మద్దతు వంటి అంశాలు ఆయా దేశాల నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయి. ఆ లెక్కన.. ఈ ఒప్పందం ఉన్నంత మాత్రాన సౌదీ అరేబియా, టర్కీ వెంటనే ఏదైనా ఘర్షణలోకి దిగాల్సిందేనని స్పష్టమైన హామీ లేదు.మారుతున్న సమీకరణాలుపాక్, సౌదీ, టర్కీ రక్షణ ఒప్పందం మధ్యప్రాచ్య రాజకీయాల్లో కొత్త మార్పులకు సంకేతంగా మారింది. ఒకవైపు ఇరాన్ తన ప్రాంతీయ ప్రభావాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తుండగా.. మరోవైపు సౌదీ తన భద్రతా వ్యవస్థను విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో మూడు దేశాల కొత్త రక్షణ కూటమి భవిష్యత్‌లో పశ్చిమాసియా శక్తి సమీకరణాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది. -
పాకిస్థాన్, సౌదీ, తుర్కియే కీలక ఒప్పందం
పశ్చిమాసియా యుద్ధ వాతావరణం నేపథ్యంలో పాకిస్థాన్, సౌదీ అరేబియా, తుర్కియే కీలక రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ‘మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ (Mecca Joint Defence Agreement) పేరుతో త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్న ఆ దేశాలు.. ఏ దేశంపై దాడి జరిగినా మూడింటిపై జరిగిన దాడిగానే పరిగణించనున్నాయి. ఈ కీలక రక్షణ ఒప్పందంపై ఆ దేశాలు సంతకాలు చేశాయి. పెరుగుతున్న భద్రతా ఆందోళనల వేళ ఈ ఒప్పందం మూడు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం.. మూడు దేశాలలో ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా.. అది మిగతా అన్ని దేశాలపై జరిగిన దాడిగానే పరిగణనలోకి తీసుకోనున్నాయి. మూడు దేశాలలో ఏ ఒక్క దానిపై సాయుధ దాడి జరిగినా.. అది మూడింటిపై జరిగిన దాడిగానే భావిస్తారు. అలాగే మూడు దేశాల మధ్య రక్షణ సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను మరింత పెంపొందించడానికి ఇది తోడ్పడుతుందని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.సౌదీ అరేబియాలో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్, తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ల మధ్య జరిగిన సమావేశంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. సైనిక దళాల అధిపతి (ఆర్మీ చీఫ్) ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌తో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో కలిసి షరీఫ్ గురువారం మూడు రోజుల పర్యటన నిమిత్తం అక్కడకు చేరుకున్నారు.ఇరాన్ యుద్ధంలో భాగంగా పలుమార్లు దాడులను ఎదుర్కొన్న సౌదీ అరేబియా, తన రక్షణ భాగస్వామ్యాలను విస్తరించుకోవాలని భావిస్తోంది. తుర్కియేకి చెందిన 'హేబర్ టర్క్' మీడియా కథనం ప్రకారం.. ఈ ఒప్పందం ఉమ్మడి సైనిక విన్యాసాలు, శిక్షణ, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, నిఘా సమాచారాన్ని పంచుకోవడానికి వీలు కల్పిస్తుంది. గాజా, ఇరాన్, లెబనాన్లలో జరుగుతున్న ఇతర ప్రాంతీయ పోరాటాల విషయంలో టర్కీ, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో కూడా ఈ ఒప్పందం ప్రాధాన్యత సంతరించుకుంది.అమెరికా ఈ ప్రాంతంలో తన స్వంత ప్రయోజనాలతో పాటు ఇజ్రాయెల్ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో.. మారుతున్న ప్రాంతీయ పరిస్థితులు, ఘర్షణల ప్రభావం వలన కొత్త మిత్రులను, శత్రువులను గుర్తించడానికి దేశాలు కొత్త వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటున్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. సెప్టెంబరులో కూడా పాకిస్తాన్, సౌదీ అరేబియాలు ఒక వ్యూహాత్మక రక్షణ ఒప్పందంపై సంతకం చేయడం గమనార్హం. ఆ సమయంలో ఒక దేశంపై దాడి జరిగితే రెండింటిపై జరిగిన దాడిగా పరిగణిస్తామని తెలిపాయి. ఇస్లామాబాద్ దశాబ్దాలుగా సౌదీ అరేబియాతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉంది. సుమారు 25 లక్షలకు పైగా పాకిస్తానీయులు ఈ దేశంలో పనిచేస్తున్నారని అంచనా. పాకిస్తాన్ క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడానికి సౌదీ అరేబియా ఆర్థిక సాయాన్ని అందిస్తూ వస్తోంది. -
ట్రంప్ వెనక్కి తగ్గేలా.. సౌదీ వ్యూహం
పశ్చిమాసియా యుద్ధంలో ఇప్పుడు సౌదీ రంగప్రవేశం ఆసక్తిగా మారింది. ఇరాక్‌లో అమెరికాతో కలిసి ఇరాన్ ప్రాక్సీలపై విరుచుకపడ్డ సౌదీ అంతలోనే.. ఇరాన్‌పై పెద్దఎత్తున దాడులు చేయవద్దని ట్రంప్‌కు విజ్ఞప్తి చేసింది. దీనికి తల ఊపిన ట్రంప్ సౌదీ ఎంట్రీతో తాత్కాలికంగా దాడుల ఆలోచన విరమిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అంతా ఆశ్చర్యపోయారు. అయితే అమెరికాని ఒప్పించేలా సౌదీ మధ్యవర్తిత్వం చేయడంపై ఒక పెద్దకారణం దాగున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ట్రంప్ ఇరాన్‌కు భారీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ సారి కనీవినీ ఎరుగని రీతిలో అమెరికాపై దాడులు చేస్తామని హెచ్చరించారు. అయితే ఇంతలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై మరిన్ని దాడులు చేయకుండా నివారించాలని సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ (ఎంబీఎస్) కోరినట్లు అమెరికా అధికారులు తెలిపారు. దీంతో ట్రంప్ వెనక్కి తగ్గుతున్నట్లు ప్రకటించారు. అయితే దీని వెనుక "క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ చేపట్టిన ప్రతిష్టాత్మక ఆర్థిక ప్రణాళిక 'విజన్ 2030' కారణమని తెలుస్తోంది.రిటైర్డ్ బ్రిగేడియర్ జనరల్ అబ్దుల్లా బిన్ ఫరాహ్ అల్-షయా మాట్లాడుతూ.. "రాజ్యంలోని విజన్ 2030 అనేది కేవలం ఒక ఆర్థిక ప్రణాళిక మాత్రమే కాదు. విభిన్నమైన, స్థిరమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికి, అలాగే పెట్టుబడులు, ఇంధనం, లాజిస్టిక్స్, పర్యాటకం ఆవిష్కరణలకు గ్లోబల్ హబ్‌గా సౌదీ స్థానాన్ని బలోపేతం చేయడానికి ఇదొక సమగ్ర జాతీయ ప్రాజెక్ట్" అని పేర్కొన్నారు. ఇరాన్‌పై ఏవైనా పెద్ద దాడులు జరిగితే గల్ఫ్ ప్రాంతం తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటుందని, ఇది తమ ఆర్థిక ప్రణాళికను దెబ్బతీస్తుందని సౌదీ ఆందోళన చెందుతోందని పేర్కొన్నారు.మాజీ యూఎస్ రక్షణ శాఖ అధికారి, మిడిల్ ఈస్ట్ నిపుణురాలు డానా స్ట్రౌల్ మాట్లాడుతూ.. యెమెన్ హూతీ తిరుగుబాటుదారుల ముప్పును తొలగించడానికి కేవలం సైనిక బలప్రయోగం మాత్రమే సరిపోదని సౌదీ అరేబియా చాలా కష్టపడి నేర్చుకుందని తెలిపారు. అమెరికా, ఇజ్రాయెల్ ఎన్నిసార్లు సైనిక చర్యలు చేపట్టినా హూతీల ముప్పును పూర్తిగా తొలగించలేకపోయాయని, సౌదీ మళ్లీ అటువంటి పెద్ద సంఘర్షణలోకి దిగితే అది 'విజన్ 2030'పై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆమె పేర్కొన్నారు.మరోవైపు, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి పాకిస్థాన్, టర్కీ, సౌదీ అరేబియా అధికారులతో చర్చలు జరిపారు. అమెరికా లేదా ఇజ్రాయెల్ దాడి చేస్తే లేదా అలాంటి దాడులకు ఇతర దేశాలు మద్దతు ఇస్తే ఇరాన్ నుంచి బలమైన ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా యుఎస్‌ను బుజ్జగించాల్సి వస్తోంది. -
పశ్చిమాసియాలో ప్రమాదకర పాచికలాట
సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ 2025 నవంబర్ 18న అమెరికా సందర్శించారు. పౌర అణు శక్తి వినియోగ సహకారంపై సంప్రదింపులు పూర్తయ్యాయని అదే రోజు సంయుక్త ప్రకటన వెలువడింది. ఆ మేరకు ఒప్పందంపై రెండు దేశాలు సంతకాలు చేశాయి. దశాబ్దాలుగా కొనసాగుతున్న కోట్లాది డాలర్ల పౌర అణు శక్తి భాగస్వా మ్యానికి దీనితో చట్టపరమైన పునాది ఏర్పడిందని వైట్ హౌస్ పేర్కొంది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ప్రమాణాలను పకడ్బందీగా పాటిస్తూ సహకారాన్ని ఇచ్చిపుచ్చు కోనున్నట్లు ప్రకటించారు. అయినా, అణ్వస్త్ర నిర్మాణ వ్యాప్తిపై ఇది అటు ఇజ్రాయెల్, ఇటు యూఏఈలలో ఆందోళనను రేకెత్తించడంతో ఈ అంశం మరింత జటిలంగా మారింది. అబ్రహాం ఒప్పందాలతో ముడిఇపుడు అమెరికా–సౌదీ ఒప్పందాన్ని సౌదీ అరేబియా అబ్రహాం ఒప్పందాలకు కట్టుబడి ఉండే అంశంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ముడిపెట్టారు. పౌర అణు ఒప్పందానికి ఆమోదం తెలుపడం చిటికెలో పని. కాకపోతే ‘చాలా మన్నన పొందిన, సఫలమైన అబ్రహాం ఒప్పందాలకు సౌదీ అరేబియా పూర్తిగా కట్టుబడి ఉండాలి’ అని ట్రంప్ జూలై 23న బాహాటంగానే వెల్లడించారు. యురేనియంను ‘శుద్ధి చేసే సామగ్రి’ ఉండబోదని కూడా ట్రంప్ తెలిపారు. కానీ, యురేనియంను శుద్ధి చేయడాన్ని నివారించే నియమ నిబంధనలు ఒప్పందం ముసాయిదాలో కొరవడ్డాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా రెండింటిని ముడిపెట్టడంతో మొత్తం పరిస్థితి మారి పోయినట్లు అయింది. ఇది ఇక ఎంతమాత్రం అణు శక్తిని పౌర అవస రాలకు వినియోగించుకునేందుకు సంబంధించినదిగానో లేదా రష్యా, చైనాలను దూరం పెట్టేందుకు కుదుర్చుకున్నదిగానో లేదు. దౌత్యం ఒక లావాదేవీగా తయారైంది. అసలే అణు శక్తి చిక్కు ముడులతో కూడుకున్న దక్షిణాసియాలో ఇది ఇంకా గుబులు రేపు తోంది. ట్రంప్ నిర్ణయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కార్యాలయం వెంటనే స్వాగతించింది. సౌదీ గుర్తింపు ‘మధ్య ప్రాచ్యంలో శాంతి స్థాపనకు సంబంధించి ఒక చారిత్రక ముంద డుగు’ అని అది జూలై 23న వ్యాఖ్యానించింది. ఇజ్రాయెల్ అంగీకరించినట్టేనా?తెరవెనుక పరిస్థితులను బట్టి ఈ సమన్వయం ఒక ఎత్తుగడగా కనిపిస్తోంది. తుర్కియేకు అధునాతన ఎఫ్–35 విమానాల విక్ర యాన్ని వ్యతిరేకించాలని నెతన్యాహు కోరుకుంటున్నారనీ, సౌదీ అణు ఒప్పందం ఈ ప్రాంతంలో ఆయుధ పోటీని రేకెత్తిస్తుందని ఆందోళన చెందుతున్నారనీ ఇజ్రాయెలీ అధికారులు మీడియాకు తెలిపారు. ఇటీవల ట్రంప్‌ను కలుసుకునేందుకు ముందు నెతన్యాహు తన మనసులో మాటను వెల్లడించారు. సౌదీ అరేబి యాతో అమెరికా అణు సహకారం సైనిక శక్తి విషయంలో ఇజ్రా యెల్కున్న గుణాత్మక పైచేయిపై రాజీపడేటట్లు చేయదని హామీ లభించాలని ఆయన అన్నారు. ఏదైతేనేం జెరూసలెం కోరుకున్నది సాధించింది. సౌదీ అణు ఒప్పందం ఇజ్రాయెల్‌తో ముడిపడినఅంశమని ఇపుడు తేటతెల్లమైంది. రెండవసారి అధికారానికి వచ్చినప్పటి నుంచి కూడా అబ్రహాం ఒప్పందాలను మరింత విస్తరించాలని ట్రంప్ కోరుకున్నారు. సాధా రణ పరిస్థితులు నెలకొనాలంటే ‘పాలస్తీనా ఒక ప్రత్యేక రాజ్యంగా అవతరించేందుకు స్పష్టమైన బాటలు పరవా’లని సౌదీలు స్పష్టం చేశారు. గాజాలో పరిస్థితులు క్షీణించాక సౌదీ మరింత పట్టుసడలని వైఖరిని కనబరచింది. సాధారణ పరిస్థితుల స్థాపనపై చర్చలను అది 2023 అక్టోబర్ 14న విరమించుకుంది. ‘పాలస్తీనా రాజ్య స్థాప నను వ్యతిరేకిస్తున్న ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రస్తుత ప్రభు త్వాన్ని శాంతి స్థాపనకు చిత్తశుద్ధితో పనిచేసే భాగస్వామిగా’ చూడ లేమనే మొన్నీమధ్య జూలై 25 వరకు రియాద్ భావిస్తూ వచ్చింది. మారిన అమెరికా తీరుఅణ్వస్త్ర వ్యాప్తి నిరోధక విధానం విషయంలో అమెరికాలో వచ్చిన మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గల్ఫ్‌లో యురేనియం శుద్ధికి అనుమతించకూడదనే వైఖరినే అమెరికా 15 ఏళ్ళుగా అనుస రిస్తూ వచ్చింది. యూఏఈ కూడా 2009లోనే దాన్ని విరమించుకుంది. తాజా అమెరికా ఒప్పందం కింద సౌదీ ఆ నిబంధనను తిర స్కరించింది. అంతర్జాతీయ అణు శక్తి సంస్థ అదే పనిగా పర్యవేక్షించడాలు, పరిశీలించడాలు చేయకూడదని కూడా సౌదీ పేర్కొంది. తెహ్రాన్ రహస్యంగా యురేనియంను శుద్ధి చేసే సదుపా యా లను నిర్వహిస్తోందనే కారణంతోనే ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడికి దిగాయి. ఈ ఒప్పందం ఏ విధంగా ఆవిష్కృత మవుతుందోనని అబుదాబి, కైరో, అమ్మాన్, అంకారా ఎదురు చూస్తున్నాయి. ఇంతవరకు యురేనియంను శుద్ధి చేసే శక్తి పశ్చిమా సియాలో ఒక్క ఇరాన్‌కే పరిమితం అనుకున్నారు. ఇపుడు యురేని యంను శుద్ధి చేయగల సామర్థ్యాన్ని ఆ ప్రాంతంలో దాదాపు ఐదు దేశాలు సంతరించుకోగలవని కొత్త ఆందోళనలు మొదలయ్యాయి. ‘‘ఇజ్రాయెల్ వద్ద బాంబు ఉందనుకుందాం. ఇపుడు అమెరికా ఆమోదంతో సౌదీ అరేబియా కూడా యురేనియంను శుద్ధి చేయగల శక్తిని సంతరించుకుంటుంది. మరి మేం మాత్రం ఆ పని ఎందుకు చేయకూడదు?’’ అని ఇరాన్ వాదిస్తోంది. ఇరాన్‌తో అమెరికా కుదు ర్చుకోవాలని భావించిన అణు ఒప్పందం అటకెక్కింది. ఇరాన్ లోపలికి వెళ్ళి తనిఖీలు జరపడానికి అంతర్జాతీయ అణుశక్తి సంస్థకు ఉన్న అవకాశం పరిమితం. ఇటువంటి పరిస్థితుల్లో అమెరికా ఆశీర్వా దంతో సౌదీ అరేబియా నిర్వహించే అణుశక్తి కార్యక్రమం పూర్తి ఆత్మవంచన, ద్వంద్వ ప్రమాణాల కిందకే వస్తుంది. ఇజ్రాయెల్ వైపు నుంచి చూస్తే ఈ ఒప్పందం దాని చాపకిందకు నీరు తేవడమే. అణ్వాయుధాలు కలిగిన దేశంగా ఇజ్రాయెల్ 50 ఏళ్ళుగా గుత్తాధిపత్యాన్నే అనుభవిస్తూ వచ్చింది. అది ఆ పనిని చాటుమాటునే నిర్వహిస్తూ వచ్చి ఉండవచ్చు. సౌదీ పౌర అణుశక్తి కార్యక్రమాన్ని అబ్రహాం ఒప్పందాలతో ముడిపెట్టడాన్ని పైకి స్వాగ తించి ఉండవచ్చు. కానీ, లోలోపల అణ్వస్త్ర నిర్మాణ సామర్థ్యం కలి గిన మరో అరబ్ దేశం అవతరిస్తోందని మథన పడుతోంది. సుస్థిరతకు అవకాశమెక్కడ? తాజా ఒప్పందంతో ఆ ప్రాంతంలో ఏ దేశానికాదేశం రక్షణకంచెలు ఏర్పాటు చేసుకోవాలని భావిస్తాయి. ఆయుధాల సమీకర ణకు పోటీపడతాయి. తప్పుడు అంచనాలు ప్రమాదకర స్థితినిసృష్టిస్తాయి. ఇంక ప్రాంతీయ సుస్థిరతకు అవకాశమెక్కడ? రష్యా అణు శక్తి సంస్థ రోసటామ్, చైనా నేషనల్ న్యూక్లియర్ కార్పొరేషన్లను కట్టడి చేయడానికి సౌదీ అణు కార్యక్రమం దోహద పడుతుందనీ, అమెరికా విస్తృత వ్యూహాత్మక ప్రయోజనాలను నెరవేరుస్తుందనీ అమెరికా మొదట్లో భావించింది. ఇపుడు అబ్రహాం ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని చెప్పడం ద్వారా సౌదీ–ఇజ్రా యెల్ మధ్య కూడా రాజీ కుదిర్చినట్లు అవడం తన విదేశాంగ విధానానికి కలికితురాయిగా మారుతుందని ట్రంప్ సంబరపడు తున్నారు. అందుకు రియాద్‌కు పౌర అణు శక్తి పేరుతో తీపిని తిని పిస్తున్నారు. ఈ క్రమంలో, నియమ నిబంధనలను తుంగలో తొక్కారు. పౌర అణు శక్తి వినియోగానికి సౌదీకున్న హక్కును కాదనలేం. రష్యా–చైనాలతో పోటీ పడేందుకు అమెరికాకు ఉన్న హక్కును కూడా తోసిపుచ్చలేం. కానీ, ఉద్రిక్తతలతో అట్టుడుకుతున్న ప్రాంతంలో యురేనియం శుద్ధికి ద్వారాలు తెరవడం ఎంతవరకు సబబు? ఇజ్రాయెల్‌తో సయోధ్య కుదుర్చుకోవాలనీ, సాధారణ పరిస్థితుల స్థాపనకు తోడ్ప డాలనీ అమెరికా పెడుతున్న షరతును సౌదీ ఇప్పటికే తిరస్కరించింది. ఒకవేళ ఒప్పందం మూలపడ్డా, అది తెచ్చిన ప్రమాణం నిలిచే ఉంటుంది: అణు శక్తిని సంపాదించుకునేటట్లు చేయడంలో అమెరికా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. రాజకీయ ప్రయోజనాలు చూసు కుంటోంది. ఒకసారి భూతాన్ని బయటకు తెస్తే, దాన్ని తిరిగి సీసాలో బంధించడం కష్టం. -వ్యాసకర్త ‘సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్’ డైరెక్టర్, న్యూఢిల్లీ-సి. ఉదయ్ భాస్కర్ -
యుద్ధ రంగంలోకి సౌదీ ఎంట్రీ.. ఉద్రిక్తతలు మరింత పెరిగేనా?
-
అమెరికా ‘హెవీ వేవ్’ దాడులు.. విస్తరిస్తున్న యుద్ధం!
మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ మేఘాలు మరింత కమ్ముకుంటున్నాయి. అమెరికా–ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు ప్రాంతీయ యుద్ధం దిశగా సాగుతున్నాయి. ఇరాన్ నుంచి అమెరికా స్థావరాలపై జరిగిన క్షిపణి దాడులకు ప్రతీకారంగా అమెరికా భారీ వైమానిక దాడులు చేపట్టింది. దక్షిణ ఇరాన్‌లోని కీలక ప్రాంతాలపై ‘హెవీ వేవ్’ పేరుతో దాడులు నిర్వహించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఈ దాడులతో పాటు ఇరాక్‌లో ఇరాన్ అనుకూల మిలీషియాలపై అమెరికా, సౌదీ అరేబియా సంయుక్త చర్యలు చేపట్టడం, యెమెన్‌లో హౌతీల కదలికలు, హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు పెరగడం.. మొత్తం ప్రాంతాన్ని యుద్ధ వాతావరణంలోకి నెట్టాయి.ఇరాన్‌లోని రెవల్యూషనరీ గార్డ్ (IRGC)కు చెందిన స్థావరాలే లక్ష్యంగా తాజాగా అమెరికా దాడులు జరిపింది. సైనిక కమాండ్ కేంద్రాలు, మిసైల్, డ్రోన్ సదుపాయాలు, తీర రక్షణ వ్యవస్థలు, సముద్ర కార్యకలాపాలకు సంబంధించిన కేంద్రాలను టార్గెట్ చేసినట్లు అమెరికా వెల్లడించింది. అబాదాన్, బుషెహర్, కిష్, క్విష్మ్ దీవులు, ఖుజెస్తాన్ ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. కిష్ దీవిలోని కజెరూన్ ప్రాంతంలోనూ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు సమాచారం.క్విష్మ్లో నివాస భవనంపై మిసైల్.. రెస్క్యూ కొనసాగింపుఅమెరికా దాడుల్లో క్విష్మ్ దీవిలోని ఓ నివాస భవనం దెబ్బతింది. మిసైల్ దాడితో భవనం కూలిపోవడంతో పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. సహాయక బృందాలు రంగంలోకి దిగి ఇద్దరు చిన్నారులను రక్షించి ఆస్పత్రికి తరలించాయి. మరో ముగ్గురి కోసం శిథిలాల తొలగింపు, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఘటన యుద్ధంలో పౌర ప్రాంతాలు కూడా ప్రభావితమవుతున్నాయన్న ఆందోళనలను పెంచింది.‘ఇప్పుడు మా వంతు’.. ట్రంప్ హెచ్చరికల తర్వాతే దాడులుఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా బలగాలపై దాడులకు ప్రతిస్పందన తప్పదని స్పష్టం చేసిన ఆయన.. “ఇప్పుడు కొట్టే వంతు మాది” అనే సంకేతాలు ఇచ్చారు. ఇరాన్ నుంచి దాడులను ఆపాలని కోరినా అమెరికా చర్యలు తప్పవని ట్రంప్ వ్యాఖ్యానించిన కొద్దిసేపటికే వైమానిక దాడులు ప్రారంభమయ్యాయి.జోర్డాన్‌లో అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులుఇటీవల జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసినట్లు అమెరికా ఆరోపించింది. దీనికి ప్రతీకారంగానే తాజా ఆపరేషన్ చేపట్టినట్లు వాషింగ్టన్ వెల్లడించింది. మరోవైపు ఇరాన్ మాత్రం తమ చర్యలను అమెరికా బెదిరింపులకు ప్రతిస్పందనగా సమర్థించుకుంది. అమెరికా ఒత్తిడి కొనసాగితే ప్రతిఘటన కూడా కొనసాగుతుందని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ హెచ్చరించింది.ఇరాక్‌లో అమెరికా–సౌదీ దాడులు.. తీవ్ర ఉద్రిక్తతయుద్ధ ప్రభావం ఇరాక్‌కు కూడా చేరింది. ఇరాన్‌కు అనుబంధంగా ఉన్న మిలీషియా గ్రూపుల స్థావరాలపై అమెరికా, సౌదీ అరేబియా సంయుక్త దాడులు జరిపాయి. ఈ దాడుల్లో పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్ (PMF)కు చెందిన పలువురు సభ్యులు మరణించినట్లు సమాచారం. కనీసం 20 మంది మృతి చెందినట్లు ఆ సంస్థ ప్రకటించింది. అయితే ఇరాక్ ప్రభుత్వం ఈ చర్యలను తీవ్రంగా ఖండించింది. తమ దేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించారని, అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించింది.రంగంలోకి హౌతీలు.. యెమెన్ నుంచి మరో ముప్పుఇరాన్కు మద్దతుగా వ్యవహరిస్తున్న యెమెన్‌లోని హౌతీ గ్రూపు కూడా ఈ ఘర్షణలో కీలక పాత్ర పోషిస్తోంది. సౌదీ అరేబియా చమురు రవాణా వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని హౌతీలు దాడులు చేసినట్లు సమాచారం. దీనికి ప్రతిగా హోడెయిడా ప్రావిన్స్‌లోని హౌతీ స్థావరాలపై దాడులు జరిగినట్లు తెలుస్తోంది. దీంతో యుద్ధ ప్రభావం గల్ఫ్ ప్రాంతం దాటి యెమెన్ వరకు విస్తరించింది.హర్ముజ్ జలసంధిలో పెరుగుతున్న టెన్షన్ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి మరోసారి యుద్ధ కేంద్రంగా మారింది. ఈ మార్గంలో ప్రయాణించే నౌకలపై ఇరాన్ ఆంక్షలు విధించడం, అనుమతి లేని మార్గాల్లో వెళ్లే ట్యాంకర్లను అడ్డుకుంటామని హెచ్చరించడం ఉద్రిక్తతలకు కారణమైంది. ఇరాన్ నౌకాదళం మూడు చమురు ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రకటించింది. మరోవైపు అమెరికా మాత్రం అంతర్జాతీయ నౌకాయానానికి ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది. హర్ముజ్‌లో అమెరికా ఆంక్షలను దిక్కరించిన లావిన్ ట్యాంకర్‌పై దాడి జరిగింది. ఇంజిన్ రూమ్‌పై కాల్పులు జరపడంతో నౌక దెబ్బతింది. ఈజిప్ట్ పోర్టులో డ్రోన్ దాడి కలకలం?యుద్ధం కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోందన్న సంకేతంగా ఈజిప్ట్‌లోని డమియెట్టా పోర్టులో అమెరికాకు చెందిన ఎల్ఎన్జీ ట్యాంకర్‌పై డ్రోన్ దాడి ఘటన కలకలం రేపింది. దాడి తర్వాత నౌకలో మంటలు చెలరేగాయి. మంటలు మరో నౌకకు కూడా వ్యాపించాయి. అత్యవసర సిబ్బంది రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఇది ఇరాన్ జరిపిన డ్రోన్ దాడియేనా?.. లేదంటే అగ్నిప్రమాదమా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. చమురు ధరలకు యుద్ధ సెగమిడిల్ ఈస్ట్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావం అంతర్జాతీయ చమురు మార్కెట్లపై పడుతోంది. యుద్ధ భయాలతో క్రూడాయిల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఏకంగా సెంచరీ దాటేశాయి. ఇరాన్ చమురు స్థావరాలు, హర్ముజ్ జలసంధి భద్రతపై అనిశ్చితి కొనసాగితే ప్రపంచ ఇంధన సరఫరాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ప్రాంతీయ యుద్ధంగా మారుతున్న ఘర్షణఅమెరికా–ఇరాన్ మధ్య మొదలైన పోరు ఇప్పుడు ఇరాక్, యెమెన్, సౌదీ అరేబియా, సముద్ర మార్గాల వరకు విస్తరించింది. ఒకవైపు ప్రతీకార దాడులు.. మరోవైపు చమురు మార్గాలపై ముప్పు.. ఇంకోవైపు మిత్ర దేశాల జోక్యం.. ఇవన్నీ కలిసి మిడిల్ ఈస్ట్‌లో పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చుతున్నాయి. -
ఇరాన్ మిలిటెంట్లపై అమెరికా–సౌదీ దాడి
కైరో: పశ్చిమాసియాలో దాడుల పరంపర ఆగడం లేదు. ఇరాక్ భూభాగంలో ఇరాన్ మద్దతుగల మిలిటెంట్లపై సౌదీ అరేబియాతో కలిసి మంగళవారం అర్ధరాత్రి తర్వాత అమెరికా దాడి చేయగా.. బుధవారం తెల్లవారుజామున ఇరాన్ సైన్యం గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా బలగాలపై క్షిపణుల వర్షం కురిపించింది. అమెరికా–సౌదీ అరేబియా దాడిలో కనీసం 20 మంది మరణించారు. 32 మంది గాయపడ్డారు. ఈ దాడిలో ఆరుగురు ఇరాన్ సలహాదారులు మరణించారని ఇరాకీ మిలీíÙయా సిబ్బంది తెలిపారు. మరణించిన 20 మందిలో ఈ సలహాదారులు కూడా ఉన్నారా లేదా అనేది తెలియరాలేదు. పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా ఉద్రిక్తతలు పెరగడం చూస్తూ మళ్లీ పూర్తిస్థాయి యుద్ధం జరుగుతుందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మరోవైపు అమెరికా వద్ద అత్యాధునిక ఆయుధ నిల్వలు ఇప్పటికే తగ్గిపోయినట్లు తెలుస్తోంది. గత రెండు రోజులుగా తమ చమురు కేంద్రాలపై ఇరాకీ మిలిటెంట్లు డ్రోన్లతో దాడులు చేశాయని సౌదీ అరేబియా ఆరోపించింది. సౌదీ అరేబియాపై జరిగినట్లు చెబుతున్న డ్రోన్ దాడులకు ప్రతిస్పందనగా, తమ యుద్ధ విమానాలు తూర్పు ఇరాక్‌లోని పలు రవాణా, ఆయుధ స్థావరాలపై దాడి చేశాయని అమెరికా సైన్యం తేల్చిచెప్పింది. జోర్డాన్‌లోని అమెరికా సైనిక కేంద్రమైన మువఫాక్ సాల్టి వైమానిక స్థావరంపై బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు ఇరాన్ ఇస్లామిక్ పారామిలటరీ రివల్యూషనరీ గార్డ్ వెల్లడించింది. మరోవైపు ఐదు ఇరాన్ క్షిపణులను అడ్డుకుని ధ్వంసం చేసినట్లు జోర్డాన్ సైన్యం స్పష్టంచేసింది. ఇరాన్‌కు చావుదెబ్బలు తప్పవు: ట్రంప్ పశ్చిమాసియాలో తమ సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు చేయడం, బాలిస్టిక్ క్షిపణులు పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గట్టిగా స్పందిస్తామని, ఇరాన్‌ను తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఇరాన్‌కు చావుదెబ్బలు తప్పవని బుధవారం ప్రతిజ్ఞ చేశారు. జోర్డాన్‌లోని అమెరికా స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకున్నట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. అనంతరం దీనిపై ట్రంప్ మాట్లాడారు. ఇరాన్ గట్టిగా విరుచుకుపడతామని, మర్చిపోలేని రీతితో దెబ్బకొడతామని స్పష్టంచేశారు. -
ఇరాక్‌పై దాడులు.. 20 మంది మృతి, మరో 32 మందికి గాయాలు
బాగ్దాద్: ఇరాక్‌కు చెందిన పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్ (పీఎంఎఫ్)పై అమెరికా-సౌదీ దాడుల్లో దాదాపు 20 మంది ఫైటర్స్ మరణించారు. మరో 32 మంది గాయపడ్డారు. తమ దళాలు పూర్తి అప్రమత్త స్థితిలో ఉన్నాయని పీఎంఎఫ్ ప్రకటించింది. టెలిగ్రామ్‌లో విడుదల చేసిన ప్రకటనలో పీఎంఎఫ్ స్పందిస్తూ.. "పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్ ప్రధాన కార్యాలయాలు, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని సౌదీ అరేబియా, అమెరికా చేపట్టిన ద్రోహపూరిత ఉగ్రదాడిని ఖండిస్తున్నాం" అని పేర్కొంది.పీఎంఎఫ్‌కు ఇరాన్ మద్దతు ఉంది. పీఎంఎఫ్ అనేది శిక్షణ పొందిన ఇరాకీ మిలీషియాల సమాఖ్య. ఈ దాడులు అత్యంత ప్రమాదకర ఉద్రిక్తతకు దారితీస్తున్నాయని పీఎంఎఫ్ తెలిపింది. అంతేగాక, ఇవి ఇరాక్ సార్వభౌమాధికారంపై దాడితో పాటు అధికారిక భద్రతా సంస్థల ఉల్లంఘన అని ఆరోపించింది. 2026 ఏప్రిల్ 2న, ఇరాన్‌తో అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతున్న సమయంలో, మొసుల్ పశ్చిమ ప్రాంతంలో వైమానిక దాడుల్లో మరణించిన పీఎంఎఫ్ ఫైటర్ భౌతికకాయాన్ని బాగ్దాద్‌లో పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్ సభ్యుడు మోస్తూ కనిపించాడు.అమెరికా, సౌదీ అరేబియా సంయుక్తంగా విడుదల చేసిన వివరాల ప్రకారం.. అమెరికా దళాలు, సౌదీ చమురు కేంద్రాలపై జరిగిన దాడులకు ప్రతిస్పందనగా మిలిటెంట్లపై ఇరాక్‌లో దాడులు చేపట్టాయి. సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కీ అల్-మాలికీ కూడా ఇరాన్ మద్దతు ఉన్న ఉగ్ర మిలీషియాలు సోమవారం, మంగళవారం ఇరాక్ భూభాగం నుంచి డ్రోన్లను ప్రయోగించి తూర్పు ప్రాంతం, రియాద్ ప్రాంతాల్లోని చమురు కేంద్రాలపై దాడులు చేశాయని ఆరోపించారు.సౌదీ అరేబియా తన ఆత్మరక్షణ హక్కు ప్రకారం స్పందిస్తూ ఆ మిలీషియాలకు చెందిన నిర్దిష్ట లక్ష్యాలపై దాడులు నిర్వహించిందని ఆయన చెప్పారు. "సౌదీ అరేబియా రాజ్యం ఉద్రిక్తతలను కోరుకోవడం లేదు. అయితే తమపై జరిగే ఏ దాడికైనా కఠినంగా ప్రతిస్పందిస్తుంది" అని ఆయన అన్నారు. బుధవారం ఉదయం విడుదల చేసిన ప్రకటనలో, బాగ్దాద్, వాసిత్, నైనెవెహ్, బస్రా, కిర్కుక్, కర్బలా, దియాలా ప్రావిన్సుల్లోని తమ పలు ప్రధాన కార్యాలయాలపై అమెరికా-సౌదీ దాడులు జరిగాయని పీఎంఎఫ్ తెలిపింది. ఉత్తర ఇరాక్‌లోని నైనెవెహ్, మధ్య ఇరాక్‌లోని దియాలా ప్రాంతాల్లో జరిగిన దాడులే అత్యంత ప్రాణనష్టం కలిగించాయని ఒక అధికారి తెలిపారు. -
అమెరికా-సౌదీ అణు ఒప్పందంలో ఊహించని మలుపు!
వాషింగ్టన్: అమెరికా-సౌదీ అరేబియా మధ్య కుదిరిన పౌర అణు ఒప్పందంపై ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇజ్రాయెల్‌తో సంబంధాలను సాధారణీకరిస్తేనే ఈ ఒప్పందం అమలవుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అబ్రహాం ఒప్పందంలో భాగంగా సౌదీ అరేబియా ఇజ్రాయెల్‌ను అధికారికంగా గుర్తించాలని ఆయన షరతు విధించారు. ఈ అనూహ్య నిర్ణయంపై సర్వత్రా చర్చనీయాంశమవుతుండగా, వైట్‌హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీఫెన్ మిల్లర్ దీనిని గట్టిగా సమర్థించారు.సౌదీ అరేబియా మనస్తత్వాన్ని, అక్కడి నాయకుల విధానాలను ట్రంప్ అద్భుతంగా అర్థం చేసుకున్నారని మిల్లర్ తెలిపారు. ‘అమెరికాలో మరే ఇతర నాయకుడికన్నా ట్రంప్‌కు సౌదీ మనస్తత్వంపై సంపూర్ణ అవగాహన ఉంది. ఆయన నిర్ణయాలపై ప్రజలు ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా నమ్మకం ఉంచాలి’ అని ఆయన పేర్కొన్నారు. వాషింగ్టన్, రియాద్ దేశాలు అణు సహకార ఒప్పందంపై సంతకాలు చేసిన మరునాడే ట్రంప్ ఈ కొత్త షరతును తెరపైకి తేవడం గమనార్హం.మరోవైపు పాలస్తీనా సమస్యకు స్పష్టమైన పరిష్కారం లభించే వరకు ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు నెరకొనే ప్రసక్తే లేదని సౌదీ అరేబియా స్పష్టం చేసింది. ప్రస్తుత పరిణామాలపై సౌదీ వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని సమాచారం. ఈ తాజా పరిణామం మధ్యప్రాచ్య రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ అణు ఒప్పందం అమలు కావాలంటే అమెరికా కాంగ్రెస్ ఆమోదం కూడా తప్పనిసరి కావడంతో, భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.ఇది కూడా చదవండి: ఇరాన్ డేంజర్ ప్లాన్.. అమెరికా సంచలన నివేదిక! -
పాకిస్తాన్‌కు కొత్త చిక్కులు.. 2015 నాటి పరిస్థితి మళ్లీ వస్తుందా?
మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు పాకిస్తాన్‌ను మరోసారి క్లిష్ట పరిస్థితిలోకి నెడుతున్నాయి. ఇరాన్-అమెరికా ఘర్షణలు, హౌతీ తిరుగుబాటుదారుల కదలికలు, సౌదీ అరేబియా భద్రతపై ముప్పు నేపథ్యంలో పాకిస్తాన్‌పై సైనికంగా స్పందించాలనే ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2015లో యెమెన్ యుద్ధ సమయంలో కూడా ఇలాంటి పరిస్థితినే పాకిస్తాన్ ఎదుర్కొంది. సౌదీ అరేబియా నేతృత్వంలోని కూటమి హౌతీలపై యుద్ధం ప్రారంభించినప్పుడు, తమకు మద్దతుగా పాకిస్తాన్ సైన్యాన్ని పంపాలని రియాద్ కోరింది. అయితే పాకిస్థాన్ పార్లమెంట్ విస్తృత చర్చల అనంతరం యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనకూడదని నిర్ణయించింది.అప్పట్లో పాకిస్తాన్‌కు రెండు వైపులా సవాళ్లు ఎదురయ్యాయి. ఒకవైపు సౌదీ అరేబియాతో దశాబ్దాలుగా కొనసాగుతున్న రక్షణ, ఆర్థిక సంబంధాలు ఉండగా, మరోవైపు ఇరాన్ పొరుగుదేశంగా ఉండటంతో ఆ దేశంతో సంబంధాలను దెబ్బతీయాలని ఇస్లామాబాద్ కోరుకోలేదు. తాజాగా మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మళ్లీ వేడెక్కుతున్నాయి. హౌతీలు సౌదీ లక్ష్యాలను టార్గెట్ చేస్తున్నట్లు వచ్చిన వార్తలు, ఎర్ర సముద్రంలో నౌకాయాన భద్రతపై ఆందోళనలు ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచుతున్నాయి.ఈ నేపథ్యంలో పాకిస్తాన్ దౌత్యపరంగా సమతుల్య వైఖరిని కొనసాగించేందుకు ప్రయత్నిస్తోంది. ఒకవైపు సౌదీ అరేబియాకు మద్దతు ప్రకటిస్తూనే, మరోవైపు ఇరాన్‌తో సంబంధాలను కొనసాగించాలని చూస్తోంది. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సౌదీ నాయకత్వంతో సంప్రదింపులు జరుపుతూ, సౌదీ భద్రతకు మద్దతు ఉంటుందని స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే, యుద్ధ పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చితే పాకిస్తాన్‌పై ప్రత్యక్షంగా రంగంలోకి దిగాలనే ఒత్తిడి పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2015లో యెమెన్ యుద్ధానికి దూరంగా నిలిచిన పాకిస్థాన్.. ఇప్పుడు మరోసారి అదే నిర్ణయాన్ని కొనసాగించగలదా? లేక మారిన పరిస్థితులు దాని విధానాన్ని మార్చేలా చేస్తాయా? అన్నది ఆసక్తికరంగా మారింది.పాకిస్తాన్‌కు మూడు ప్రధాన సవాళ్లు..సౌదీతో వ్యూహాత్మక సంబంధాలను కాపాడుకోవడంఇరాన్తో పొరుగుదేశ సంబంధాలను కొనసాగించడంప్రత్యక్ష యుద్ధంలో చిక్కుకోకుండా దేశ ఆర్థిక, భద్రతా ప్రయోజనాలను రక్షించడంఅయితే, పాకిస్తాన్ ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో పోరాడుతోంది. మరోవైపు, సైనికంగా ఏదైనా చర్య తీసుకుంటే అది దేశీయంగా, అంతర్జాతీయంగా పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ఇస్లామాబాద్ ప్రస్తుతం "దౌత్య సమతుల్యత" విధానాన్నే అనుసరిస్తోంది. యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనకుండా, అవసరమైతే మధ్యవర్తిత్వ పాత్ర పోషించాలని ప్రయత్నిస్తోంది. -
వీడిన సౌదీ యువరాజు డెత్ మిస్టరీ.. షాకింగ్ విషయాలు వెలుగులోకి!
సౌదీ రాజకుటుంబంలో నెలకొన్న డెత్ మిస్టరీ దాదాపుగా వీడింది. లండన్‌లోని ఓ విలాసవంతమైన హోటల్లో గతేడాది చివర్లో సౌదీ ప్రిన్స్ అబ్దుల్లా బిన్ ఫహాద్ అల్ సౌద్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆయన గుండె ఆగిపోవడంతోనే మరణించారని ప్రాథమిక విచారణలో తేలింది. అయితే.. మృతికి గల కారణాలపై ఇప్పుడు ఓ స్పష్టత వచ్చింది. మద్యం పార్టీలో డ్రగ్స్ కలిపిన డ్రింక్స్ సేవించడం.. అది ఓవర్‌డోస్ కావడం వల్లే అతను చనిపోయినట్లు బ్రిటన్ కోర్టు విచారణలో వెల్లడి కావడం కలకలం రేపుతోంది. 29 ఏళ్ల సౌదీ యువరాజు అబ్దుల్లా బిన్ ఫహాద్ బిన్ అబ్దుల్లా బిన్ అబ్దులజీజ్ బిన్ జలావి అల్ సౌద్.. లండన్‌లోని కెన్సింగ్టన్ ప్రాంతంలోని మారియట్ హోటల్లో నవంబర్ 25న మృతి చెందారు. రాజకుటుంబం కావడంతో.. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచి దర్యాప్తు జరిపారు. దీంతో విషయం చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది. హోటల్ గదిలో చివరి క్షణాలు..వారానికి పైగా ఉండేందుకు నవంబర్ 19న ఆయన హోటల్లో దిగినట్లు విచారణలో తేలింది. మరణానికి ముందు రోజు రాత్రి యువరాజు సిగరెట్ తాగేందుకు హోటల్ బయటకు వెళ్లిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఆ తర్వాత ఆయన గదికే వెళ్లిపోయారు. మరుసటి రోజు హోటల్ సిబ్బంది గదిని శుభ్రం చేసేందుకు వెళ్లగా.. బాత్రూమ్లో ఆయన అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే అత్యవసర సిబ్బందికి సమాచారం అందించినా.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.మద్యం, డ్రగ్స్ కలయికే కారణమా?మరణంపై నిర్వహించిన టాక్సికాలజీ పరీక్షల్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. యువరాజు రక్తంలో మద్యం స్థాయి అత్యంత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అది ఒక్కటే ప్రమాదకర స్థాయిలో ఉందని నిపుణులు తెలిపారు. అంతేకాకుండా పార్టీ డ్రగ్‌గా పిలిచే గామా హైడ్రాక్సీబ్యూటిరేట్ (GHB), గంజాయి ఆనవాళ్లు, ఆందోళన తగ్గించే మందుల అవశేషాలు కూడా గుర్తించారు. వీటి కలయిక వల్ల గుండె ఆగిపోయి మరణం సంభవించినట్లు వైద్య నిపుణులు కోర్టుకు తెలిపారు.గతంలోనూ వ్యసన సమస్యలుయువరాజు అబ్దుల్లా గతంలో మద్యం, కొన్ని ప్రిస్క్రిప్షన్ మందులపై ఆధారపడే సమస్యతో చికిత్స పొందినట్లు విచారణలో వెల్లడైంది. 2025లో బ్రిటన్‌లోని ఓ డీ-అడిక్షన్ క్లినిక్‌లో చేరి చికిత్స తీసుకున్నారని, అక్కడ డీటాక్స్ కార్యక్రమాన్ని పూర్తి చేశారని వైద్యులు తెలిపారు. అయితే చికిత్స అనంతరం నిర్ణీత ఫాలోఅప్ అపాయింట్మెంట్లకు హాజరు కాలేదని చెప్పారు.ఆత్మహత్య కాదు.. ప్రమాదవశాత్తు మరణంఈ ఘటనపై విచారణ జరిపిన అసిస్టెంట్ కరోనర్ జీన్ హార్కిన్.. యువరాజు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. సూసైడ్ నోట్ కూడా లభించలేదని, మూడో వ్యక్తి ప్రమేయానికి ఆధారాలు కనిపించలేదని తెలిపారు. మత్తు పదార్థాల మిశ్రమ ప్రభావంతో జరిగిన “ప్రమాదవశాత్తు మరణం” (Death by misadventure) గా తీర్పు నమోదు చేశారు.రాజకుటుంబంలో విషాదంసౌదీ రాజదర్బార్ కూడా యువరాజు అబ్దుల్లా మృతిని అధికారికంగా ధ్రువీకరించింది. రియాద్‌లోని వీఐపీ ఇమామ్ తుర్కీ బిన్ అబ్దుల్లా మసీదులో అంత్యక్రియల ప్రార్థనలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. రాజకుటుంబానికి చెందిన యువరాజు.. లండన్ లగ్జరీ హోటల్లో ఇలా విషాదాంతం చెందడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. -
సౌదీ ఆఫర్‌తో కొత్త పవర్ గేమ్... పాక్ ఎంట్రీతో బిగ్ ట్విస్ట్!
ప్రపంచ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా, సౌదీ అరేబియా మధ్య కుదిరిన కొత్త పౌర అణు ఒప్పందం మధ్యప్రాచ్య శక్తి సమీకరణాలను మార్చే అంశంగా మారింది. బయటకు చూస్తే ఇది అణు విద్యుత్ అవసరాల కోసం కుదిరిన ఒప్పందంలా కనిపిస్తున్నా, దీని వెనుక ఉన్న వ్యూహాత్మక అవకాశాలే ఇప్పుడు అంతర్జాతీయ చర్చకు కారణమవుతున్నాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదించిన ఈ ఒప్పందం ద్వారా సౌదీ అరేబియాకు తన దేశంలోనే యురేనియం శుద్ధి చేసే సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం లభించవచ్చని తెలుస్తోంది. అణు విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన ఈ సాంకేతికతను ఒక నిర్దిష్ట స్థాయికి మించి అభివృద్ధి చేస్తే, అణు ఆయుధాల తయారీకి అవసరమైన పదార్థాలను కూడా ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. అందుకే ఈ ఒప్పందం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది.ఈ పరిణామం ఇజ్రాయెల్‌లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. ఇప్పటికే ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ ఉద్రిక్తతలు, భద్రతా సవాళ్లను ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్, సౌదీ భవిష్యత్తులో అణు సామర్థ్యం సాధించే అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తోంది. ఒక దేశం అణు సాంకేతికతను అభివృద్ధి చేసిన తర్వాత దాని వినియోగం పూర్తిగా శాంతియుతంగానే ఉంటుందని ఎప్పటికీ హామీ ఇవ్వలేమన్నది ఇజ్రాయెల్ వాదన. సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ గతంలో చేసిన ఒక వ్యాఖ్య కూడా ఇప్పుడు మళ్లీ చర్చకు వచ్చింది. ఇరాన్ అణు ఆయుధాన్ని అభివృద్ధి చేస్తే, సౌదీ కూడా అదే దిశలో అడుగులు వేయాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే సౌదీ అణు కార్యక్రమంపై ఇజ్రాయెల్ అప్రమత్తంగా ఉంది.ఈ పరిణామంలో మరో దేశం పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. అదే పాకిస్థాన్. సౌదీ అరేబియా, పాకిస్థాన్ మధ్య దశాబ్దాలుగా బలమైన వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయి. రక్షణ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో రెండు దేశాలు సన్నిహితంగా వ్యవహరిస్తున్నాయి. పాకిస్థాన్ అణు కార్యక్రమానికి గతంలో సౌదీ మద్దతు ఇచ్చిందనే ఆరోపణలు అంతర్జాతీయ స్థాయిలో వినిపించినప్పటికీ, ఇరు దేశాలు వాటిని అధికారికంగా అంగీకరించలేదు. 1980లలో పాకిస్థాన్ అణు కార్యక్రమం వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో సౌదీతో రహస్య అవగాహన ఉందనే వార్తలు వచ్చాయి. భవిష్యత్తులో ప్రాంతీయ సంక్షోభం ఏర్పడితే పాకిస్థాన్ నుంచి అణు సహకారం పొందే అవకాశం ఉందనే ఊహాగానాలు అప్పటి నుంచి కొనసాగుతున్నాయి. ఇప్పుడు సౌదీకి అణు సాంకేతికతపై మరింత సానుకూలత లభించే అవకాశం రావడంతో ఈ పాత చర్చలు మరోసారి తెరపైకి వచ్చాయి.అయితే ఒక దేశం అణు ఆయుధాన్ని తయారు చేయడం అంత సులభమైన ప్రక్రియ కాదు. యురేనియం శుద్ధి సామర్థ్యం ఒక భాగం మాత్రమే. దానికి తోడు అణు వార్‌హెడ్ రూపకల్పన, క్షిపణి వ్యవస్థల అభివృద్ధి, సాంకేతిక పరీక్షలు, భద్రతా వ్యవస్థలు వంటి అనేక అంశాలు అవసరం. అయినప్పటికీ, అణు సామర్థ్యానికి దారితీసే సాంకేతిక మార్గం తెరుచుకోవడం కూడా అంతర్జాతీయ భద్రతలో కీలక పరిణామంగానే పరిగణిస్తారు. అమెరికా దృష్టిలో ఈ ఒప్పందం కేవలం అణు విద్యుత్ ప్రాజెక్టు కాదు. మధ్యప్రాచ్యంలో తన ప్రభావాన్ని కొనసాగించడం, సౌదీతో సంబంధాలను మరింత బలోపేతం చేయడం, చైనా వంటి దేశాల ప్రభావాన్ని పరిమితం చేయడం వంటి వ్యూహాత్మక లక్ష్యాలు కూడా ఇందులో భాగమని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇక ఇజ్రాయెల్ మాత్రం భద్రతా కోణంలో ఈ పరిణామాన్ని చూస్తోంది. భవిష్యత్తులో సౌదీ అణు సామర్థ్యం ప్రాంతీయ శక్తి సమతుల్యతను మార్చే అవకాశం ఉందని ఆ దేశంలోని పలువురు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఒప్పందం ఇంకా పూర్తి స్థాయిలో అమల్లోకి రావాల్సి ఉంది. అమెరికా కాంగ్రెస్ పరిశీలన, అంతర్జాతీయ పర్యవేక్షణ, భద్రతా నిబంధనలు వంటి అనేక దశలు ముందున్నాయి. అయినప్పటికీ, ఈ పరిణామం ఒక విషయం స్పష్టం చేస్తోంది. -
సౌదీలో ‘అణు’కుంపటి
అందరి సలహాలూ బేఖాతరు చేసి ఇరాన్‌పై యుద్ధ భేరి మోగించి పశ్చిమాసియాను అగ్నిగుండంగా మార్చిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్... ఇప్పుడు మరో ప్రమాదకర క్రీడకు సిద్ధపడ్డారు. సౌదీ అరేబియాతో తమకు ‘శాంతియుత అణు సహకార ఒప్పందం’ కుదిరిందంటూ అమెరికా ఇంధన శాఖ విడుదల చేసిన తాజా ప్రకటన ప్రకంపనలు రేపుతోంది. తన నిర్ణయం పర్యవసానాలూ, పరిణామాల గురించి పూర్తిగా తెలిసే ట్రంప్ ఇందుకు సిద్ధపడ్డారా అనే సందేహం అందరిలో తలెత్తుతోంది. ఇది పశ్చిమాసియా అమరికను సంపూర్ణంగా మార్చే... ఇప్పటికే సాగుతున్న ఆయుధ పోటీని మరింత పెంచే ప్రమాదకర నిర్ణయం. 30 యేళ్లపాటు కొనసాగే ఈ ఒప్పందం కింద యురేనియం శుద్ధికి అవసరమైన సామర్థ్యాన్ని సౌదీ సంతరించుకుంటుందని, అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ప్రమాణాలను సాధించటంతోపాటు ప్రాంతీయ భద్రతకూ, అమెరికా భద్రతకూ కూడా తోడ్పడుతుందని అమెరికా అంటోంది. రాగలకాలంలో దేశానికి ఇది వందలకోట్ల వాణిజ్యాన్ని తీసుకొస్తుందనీ... దేశ ఆర్థిక, వ్యూహాత్మక లక్ష్యాలు నెరవేరటానికి దోహదపడుతుందనీ కూడా చెప్పుకుంటోంది. ఒకపక్క తన చర్యల ద్వారా అణ్వాయుధ తయారీకి దోహదపడుతూ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధమే ధ్యేయమని చెప్పటం ఉత్త వంచన. ఈ అణు ఒప్పందం 2008లో మన్మోహన్ సింగ్ తొలి ఏలుబడిలో మన దేశంతో అమెరికా కుదుర్చుకున్న ‘123’ ఒప్పందమే కదా అనిపిస్తుంది. అగ్రరాజ్యాలతోపాటు మనతోసహా పలు దేశాల దగ్గర అణ్వాయుధాలున్నాయి. అదనంగా సౌదీ దగ్గర ఉంటే నష్టమేమిటన్న సందేహాలు కూడా కలుగుతాయి. పైగా ఇది పౌర అణు ఒప్పందమే అనిపిస్తుంది. కానీ తరచిచూస్తే ఇందులో లొసుగులు బయటపడతాయి. సౌదీ అణువిద్యుత్ ప్రాజెక్టులు స్థాపించుకోవటానికే ఇది ఉపయోగపడుతుందని అమెరికా వాదన. ప్రకృతిలో లభించే యురేనియంలోని రెండు ఐసోటోపుల్లో ఒకటైన యూ– 235 మాత్రమే అణు విచ్ఛేదనానికీ, గొలుసు చర్య జరిగి అపారమైన శక్తి విడుదలకూ తోడ్పడు తుంది. యురేనియంను 3 నుంచి 5 శాతంవరకూ శుద్ధి చేస్తే అణు విద్యుత్ ఉత్పాదన సాధ్యమవుతుంది. శుద్ధి 90 శాతానికి చేరితే అణుబాంబు తయారీకి ఉపయోగపడుతుంది. అయితే విద్యుదుత్పాదన తర్వాత వాడేసిన ఇంధనంతో ప్లూటోనియం తయారీ అవకాశం ఎప్పుడూ ఉంటుంది. దాన్ని నిరోధించేందుకే ‘గోల్డ్ స్టాండర్డ్’ పేరుతో అమెరికా కఠినమైన షరతు విధిస్తోంది. దాన్నుంచి సౌదీకి మినహాయింపు ఇవ్వటం పైనే అందరికీ ఆందోళన. ఆ షరతు ఉంటుందని తాజాగా అమెరికా ఇస్తున్న వివరణ నమ్మశక్యంగా లేదు. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్పీటీ)పై ఇరాన్ సంతకం చేసినా, అణుబాంబు తయారీకి వ్యతిరేకంగా అక్కడ ఫత్వా అమల్లో ఉన్నా ఆ దేశం అణు బాంబుకు సిద్ధపడుతోందన్న సంశయాలు అమెరికాకూ, ఇజ్రాయెల్‌కూ ఉన్నాయి. తరచు ఇరాన్‌పై అమెరికా విరుచుకుపడటానికి కారణం అదే. ‘ఇరాన్ ఆ పని చేస్తే... మేం సైతం ఆ బాటలోనే వెళ్తాం’ అని సౌదీ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ గత కొన్నేళ్లుగా పదే పదే చెబుతున్నారు. అలాంటి దేశానికి మినహాయింపు ఇవ్వటమంటే బాహాటంగా దాన్ని అణ్వస్త్ర దేశంగా మారడానికి ప్రోత్సహించటమే అవుతుంది. అమెరికా మిత్రులు ఏం చేసుకున్నా మినహాయింపునిస్తాం... శత్రుదేశాలను మాత్రం నిరుత్సాహపరుస్తాం’ అనే నైజం అత్యంత ప్రమాదకరమైనది. ‘మనిషి అణుబాంబును కనిపెట్టాడు. కానీ ప్రపంచంలో ఏ ఎలుకా ఎలుకలబోను తయారుచేసుకోదు’ అని ఐన్‌స్టీన్ చేసిన వ్యాఖ్య ఆంతర్యం స్పష్టమే. ఇది స్వీయ హననానికి దారితీసే తెలివిమాలిన చర్య. భవిష్యత్తులో అణుశక్తి దేశంగా మారాక సౌదీ, అమెరికా చెప్పుచేతల్లో ఉండదు. తాము చేస్తే తప్పేమిటని ఇరాన్ సైతం ఆ బాట పడుతుంది. చిన్న నిప్పురవ్వ కూడా ఆ ప్రాంతాన్ని ఇప్పుడే భగ్గున మండిస్తుంటే ఇక అణ్వాయుధాలుంటే చెప్పేదేముంది? ఇప్పటికే ఇజ్రాయెల్ స్వీయరక్షణకంటూ అమెరికా దానికి అణ్వాయుధాలు సరఫరా చేసింది. దాని రక్షణ పేరుచెప్పే తరచు ఇరాన్‌పై దాడులు చేస్తోంది. నిజానికి స్వతంత్ర పాలస్తీనా ఆవిర్భవిస్తే ఇజ్రాయెల్‌కు ఇలాంటి రక్షణల అవసరమే ఉండదు. దాన్ని సాకారం చేయకుండా ఈ ప్రాంతాన్ని అణ్వస్త్రాల మయం చేయటం క్షమించరాని నేరం. -
చారిత్రాత్మక అణు డీల్‌పై అమెరికా-సౌదీ సంతకం
వాషింగ్టన్ : పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. సౌదీ అరేబియాతో పౌర అణు సహకార ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంపై అమెరికా ఇంధన కార్యదర్శి క్రిస్ రైట్, సౌదీ మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్‌లు సంతకాలు చేశారు. ఈ వివరాలను యుఎస్ఏ అధికారికంగా ప్రకటించింది.ఈ అంశంమై అమెరికా ఇంధన మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో "ఈ రెండు ఒప్పందాలు దశాబ్దాల పాటు కొనసాగే, బిలియన్ల డాలర్ల భాగస్వామ్యానికి చట్టపరమైన పునాదిని వేస్తాయి. అణు వ్యాప్తి నిరోధకత సహా పలు ముఖ్యమైన ఆర్థిక, వ్యూహాత్మక లక్ష్యాలను ఇవి ముందుకు తీసుకెళ్తాయి" అని ఒక ప్రకటనలో తెలిపింది.ఈ ఒప్పందంలో భాగమైన "ద్వైపాక్షిక భద్రతా ఒప్పందం" ప్రకారం, సౌదీ అరేబియా తన అణు ప్లాంట్లలో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ అమెరికా అధికారుల తనిఖీలకు అంగీకరించాల్సి ఉంటుంది. దీనివల్ల అణు ప్లాంట్లలో ఏం జరుగుతోంది, ఎంత ఇంధనం వాడుతున్నారు అనేది పారదర్శకంగా తెలుస్తుంది. రహస్యంగా అణ్వాయుధాలు తయారు చేసే అవకాశం ఉండదు.సాధారణంగా అమెరికా ఇచ్చే పౌర అణు ఒప్పందాలలో ఇతర దేశాలు తమ సొంత భూభాగంలో యురేనియాన్ని శుద్ధి చేయడానికి అనుమతించవు (దీనినే అణు నియమాలలో 'గోల్డ్ స్టాండర్డ్' అంటారు).కానీ ఈ ఒప్పందం ప్రకారం, అమెరికా-సౌదీల సంయుక్త అధ్యయనం తర్వాత సౌదీ అరేబియా తన సొంత భూభాగంలోనే యురేనియం శుద్ధి ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకునేందుకు మార్గం సుగమమవుతుంది.'గోల్డ్ స్టాండర్డ్' నియమాల మినహాయింపుగతంలో అమెరికా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో ఒప్పందం చేసుకున్నప్పుడు యురేనియం శుద్ధి చేయకూడదని, వాడేసిన ఇంధనాన్ని రీ-ప్రాసెస్ చేయకూడదని కఠినమైన నిబంధన విధించింది. అయితే సౌదీ విషయంలో ఈ ముందస్తు నిషేధాలను సడలించడం ఒక ప్రధాన మార్పుగా అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
ట్రంప్ నిర్ణయంతో మిడిల్ ఈస్ట్‌లో కొత్త టెన్షన్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సౌదీ అరేబియాతో న్యూక్లియర్ డీల్‌కు ఆమోదం తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా సౌదీ తన భూభాగంలోనే యురేనియం శుద్ధి (ఎన్రిచ్మెంట్) చేపట్టే అవకాశం లభించనుంది. అయితే గతంలో అమెరికా కుదుర్చుకున్న అణు ఒప్పందాలతో పోలిస్తే.. సౌదీ డీల్‌లో కీలక భద్రతా నిబంధనలు లేకపోవడంపై అంతర్జాతీయంగా కలకలం రేగింది.ట్రంప్ ప్రభుత్వం ఆమోదించిన ఈ ఒప్పందం దాదాపు 30 ఏళ్ల పాటు కొనసాగనున్నట్లు సమాచారం. దీని విలువ పదుల బిలియన్ల డాలర్లుగా ఉండనుంది. ఈ ఒప్పందం అమలైతే సౌదీ అరేబియాలో పౌర అణు విద్యుత్ కార్యక్రమాల నిర్మాణంలో అమెరికా కంపెనీలు కీలక పాత్ర పోషించనున్నాయి. ఇతర దేశాల కంపెనీలకు అవకాశాలు తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. అణు ఇంధన రంగంలో అమెరికా ఆధిపత్యాన్ని పెంచే వ్యూహంలో భాగంగానే ఈ ఒప్పందాన్ని చూస్తున్నారు.సంప్రదాయ భద్రతా నిబంధనలు లేవా?అమెరికా గతంలో కుదుర్చుకున్న అణు ఒప్పందాల్లో.. అణు సాంకేతికత దుర్వినియోగం కాకుండా కఠినమైన నిబంధనలు ఉండేవి. కానీ సౌదీతో కుదుర్చుకున్న తాజా ఒప్పందంలో అలాంటి కొన్ని కీలక రక్షణ చర్యలు లేకపోవడం చర్చకు దారితీసింది. ముఖ్యంగా యురేనియం ఎన్రిచ్మెంట్ అనుమతి ఇవ్వడం భవిష్యత్ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.వైట్‌హౌస్‌లో కీలక భేటీ తర్వాత నిర్ణయంఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌తో వైట్‌హౌస్‌లో సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం అణు ఒప్పందంపై ముందడుగు పడింది. ఈ ఒప్పందానికి సంబంధించిన ప్యాకేజీని త్వరలోనే అమెరికా కాంగ్రెస్ పరిశీలనకు పంపనున్నట్లు సమాచారం.‘123 అగ్రిమెంట్’లో భాగంగా..అమెరికా విదేశీ దేశాలతో అణు సహకారం కోసం రూపొందించే ప్రత్యేక ఒప్పందాన్ని సాధారణంగా ‘123 Agreement’ అని పిలుస్తారు. తాజా ఒప్పందంలో భాగంగా అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్ రైట్, సౌదీ ఇంధన మంత్రి ప్రిన్స్ అబ్దుల్అజీజ్ బిన్ సల్మాన్ సంతకాలు చేసినట్లు సమాచారం.మిడిల్ ఈస్ట్‌లో కొత్త అణు సమీకరణాలు?చమురు సంపదతో ప్రపంచంలో కీలక శక్తిగా ఉన్న సౌదీ.. ఇప్పుడు అణు ఇంధన రంగంలో అడుగులు వేయడం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. అమెరికా-సౌదీ అణు ఒప్పందం మిడిల్ ఈస్ట్ వ్యూహాత్మక సమీకరణాలను మార్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఇరాన్ అణు కార్యక్రమం నేపథ్యంలో ఈ ఒప్పందం ప్రాధాన్యత సంతరించుకుంది. -
చిన్న దేశం.. అతిపెద్ద విజయం.. సరికొత్త చరిత్ర
ఫిఫా ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో సంచలనం నమోదైంది. తొలిసారి ఈ మెగా ఈవెంట్‌కు అర్హత సాధించిన కేప్ వెర్డె అనూహ్య రీతిలో నాకౌట్లోనూ అడుగుపెట్టింది. అయితే, ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించకుండానే కేప్ వెర్డే తదుపరి దశకు చేరుకోవడం మరో విశేషం. అదెలా అంటారా?!గెలవలేదు.. నిలువరించిందిగ్రూప్- ‘H’లో భాగంగా స్పెయిన్, ఉరుగ్వే, సౌదీ అరేబియా జట్లతో కలిసి కేప్ వెర్డె ఫిఫా ప్రపంచకప్ బరిలో దిగింది. ఈ క్రమంలో స్పెయిన్‌తో మ్యాచ్ (0-0)ను డ్రా చేసుకుని కేప్ వెర్డె తొలుత సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఉరుగ్వే (2-2)తో మ్యాచ్‌నూ డ్రా చేసుకుంది.తాజాగా లీగ్ దశలో ఆఖరిగా సౌదీ అరేబియాతో హూస్టన్ వేదికగా తలపడ్డ కేప్ వెర్డే.. ఈ మ్యాచ్‌ను 0-0తో డ్రా చేసుకుంది. ఈ క్రమంలో కేప్ వెర్డె ఖాతాలో మూడు పాయింట్లు చేరాయి. గ్రూప్- H టాపర్‌గా స్పెయిన్ ఏడు పాయింట్లతో ఇప్పటికే నాకౌట్‌కు చేరగా.. కేప్ వెర్డే రెండో స్థానంలో నిలిచి నాకౌట్లో అడుగుపెట్టింది. అతి చిన్న దేశంమూడింట ఒక్కో మ్యాచ్ గెలిచిన ఉరుగ్వే, సౌదీ అరేబియా టోర్నీ నుంచి నిష్క్రమించాయి. కాగా నాకౌట్ దశలో కేప్ వెర్డేకు అర్జెంటీనా రూపంలో అతిపెద్ద సవాలు ఎదురుకానుంది. ఇక పశ్చిమ ఆఫ్రికాలోని ఐలాండ్ అయిన కేప్ వెర్డే.. కాబో వెర్డె పేరుతో దేశంగా గుర్తింపు పొందింది. ఇక్కడి జనాభా కేవలం 5.30 లక్షలు మాత్రమే!.. అనూహ్య రీతిలో తొలిసారి ఫిఫా ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించిన కాబో వెర్డె ఏకంగా నాకౌట్లోనూ అడుగుపెట్టి చరిత్ర సృష్టించింది. చదవండి: అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ రద్దు.. ఎందుకంటే? -
ఆఖరి నిమిషంలో గోల్.. ఓటమి తప్పించుకున్న మాజీ చాంపియన్
ఫిఫా ప్రపంచకప్ 2026లో భాగంగా రెండుసార్లు చాంపియన్స్ అయిన ఉరుగ్వే తృటిలో ఓటమి నుంచి తప్పించుకుంది. గ్రూప్-హెచ్లో భాగంగా సౌదీ అరేబియాతో జరిగిన మ్యాచ్‌ను ఉరుగ్వే 1-1తో డ్రా చేసుకుంది. సౌదీ అరేబియా తరఫున ఆట 41వ నిమిషంలో అబ్దులేలాహ్ అల్ అమ్రి గోల్ చేయగా, ఉరుగ్వే తరఫున ఆట 80వ నిమిషంలో మాక్సీ అరౌజో గోల్ కొట్టడంతో ఉరుగ్వే బతికిపోయింది. లేదంటే సౌదీ అరేబియాకు మరో అద్భుత విజయం ఖాతాలో పడేదే. 2022లో ఖతార్ వేదికగా జరిగిన ప్రపంచకప్ లీగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాను ఓడించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇరుజట్లు మ్యాచ్ డ్రా చేసుకోవడంతో చెరో పాయింట్ పంచుకున్నాయి. మ్యాచ్ ప్రారంభమైన ఐదవ నిమిషంలోనే ఉరుగ్వే గోల్‌కొట్టే అవకాశాన్ని మిస్ చేసుకుంది. బాక్స్ అంచు నుంచి మాక్సీ అరౌజో కొట్టిన షాట్‌ను గోల్ కీపర్ మొహమ్మద్ అలోవైస్ సమర్థంగా అడ్డుకున్నాడు. ఆ తర్వాత ఉరుగ్వేకు కార్నర్ లభించినా, గోల్ చేయడంలో విఫలమైంది. 18వ నిమిషంలో ఉరుగ్వే కొట్టిన మొదటి షాట్ గోల్‌పోస్టు తగులుకుంటూ వెళ్లిపోయింది తగిలింది. ఆ తర్వాత 30వ నిమిషంలో మరోసారి గోల్‌కొట్టే ప్రయత్నం చేసినప్పటికీ ఈసారి కూడా సౌదీ గోల్ కీపర్ అడ్డుగోడలా నిలబడ్డాడు. ఆ తర్వాత నుంచి సౌదీ ఆటగాళ్లు ఉరుగ్వే గోల్‌పోస్ట్‌పై దాడులు చేయడం ప్రారంభించారు.అలా మ్యాచ్ 41వ నిమిషంలో మిడ్ ఫీల్డర్ అబ్దుల్లా అల్-అమ్రీ గోల్ కొట్టడంతో తొలి హాఫ్ ముగిసేసరికి సౌదీ ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో హాఫ్లోనూ ఉరుగ్వే పలుమార్లు గోల్‌పోస్ట్‌లపై దాడులు చేసినప్పటికీ సఫలం కాలేకపోయింది. ఇక మ్యాచ్‌లో ఓటమి ఖాయమనుకున్న దశలో 80వ నిమిషంలో మాక్సి అరౌజ్ గోల్ కొట్టి స్కోరును సమం చేశాడు. -
భారత్ మార్కెట్‌పై ఎల్జీ ఫోకస్
సియోల్: దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీ ఎల్రక్టానిక్స్ తన భవిష్యత్ వ్యాపార వృద్ధికి భారత్‌ను కీలక కేంద్రంగా చూస్తోంది. భారత్‌తోపాటు సౌదీ అరేబియా, బ్రెజిల్ మార్కెట్ల నుంచి ఆదాయాన్ని 2030 నాటికి రెట్టింపు చేసుకోవాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు సంస్థ సీఈవో ల్యూ జే చియోల్ తెలిపారు. ముఖ్యంగా భారత్ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుండడం, అతిపెద్ద వినియోగ మార్కెట్ కూడా కావడంతో.. ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండీషనర్ల (ఏసీలు) వినియోగం ఇంకా విస్తృతంగా పెరిగే అవకాశం ఉంటుందని కంపెనీ అంచనా వేస్తోంది. దీంతో ఎల్జీ బ్రాండ్‌కు ఉన్న ఆదరణ దృష్ట్యా తన మార్కెట్‌ను మరింత పెంచుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగా కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత గృహోపకరణాల విస్తరణపై ఎల్జీ దృష్టి సారించింది. వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్‌లు, ఎయిర్ కండీషనర్లు, కిచెన్ ఉత్పత్తుల్లో ఏఐతోపాటు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఎగుమతులకూ ప్రాధాన్యం.. 2025లో భారత్, సౌదీ అరేబియా, బ్రెజిల్ దేశాల నుంచి ఎల్జీకి 6.2 ట్రిలియన్ కొరియన్ వోన్ల ఆదాయం లభించగా, 2023తో పోలిస్తే ఇది 20 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసింది. గతేడాది సంస్థ మొత్తం ఆదాయం 89.2 ట్రిలియన్ వోన్ల్లో 8 శాతానికి సమానం. ప్రపంచ వ్యాప్తంగా ఎల్జీ సంస్థ సాధించిన వృద్ధితో పోలి్చతే ఇది రెండింతలకుపైగా కావడం విశేషం. ఇంత భారీ వృద్ధి అవకాశాల నేపథ్యంలో భారత్‌ను ‘గ్లోబల్ సౌత్’ వ్యూహానికి కేంద్రబిందువుగా పరిగణిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌లో తన ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని నిర్ణయించినట్టు ఎల్జీ వెల్లడించింది. ప్రస్తుతం ఈ సంస్థకు ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా, మహారాష్ట్రలోని పుణేలో ప్లాంట్లు ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సిటీలో మూడో తయారీ కేంద్రాన్ని నిర్మిస్తోంది. ఇది 2026 చివరినాటికి కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. ఈ కొత్త ప్లాంట్ ద్వారా ఆసియా, ఆఫ్రికా దేశాలకు ఎగుమతులను పెంచుకోవాలని చూస్తున్నట్టు తెలిపింది. భవిష్యత్తులో అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలకు సైతం భారత్‌లో తయారైన ఉత్పత్తులను ఎగుమతి చేయాలన్న ప్రణాళికతో ఉన్నట్టు పేర్కొంది. యూకే, ఈయూతో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకోగా, వీటిని అనుకూలంగా చేసుకోవడాన్ని పరిశీలించనున్నట్టు తెలిపింది. ప్రీమియం ఉత్పత్తులపై దృష్టిప్రస్తుతం భారత్‌లో మధ్యస్థ, తక్కువ ధరల ఉత్పత్తుల తయారీపైనే ఎక్కువగా దృష్టి పెట్టిన ఎల్జీ, ఇకపై నాలుగు డోర్ల ఫ్రిజ్‌లు, ఫ్రెంచ్ డోర్ ఫ్రిజ్‌లు వంటి ప్రీమియం ఉత్పత్తుల తయారీని పెంచనున్నట్టు వెల్లడించింది. పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) సామర్థ్యాలను బలోపేతం చేసుకోవడం, నైపుణ్యం కలిగిన సిబ్బందిని నియమించుకోవడం, స్థానిక సంస్థలను కొనుగోలు చేయడం లేదా విలీన అవకాశాలను సైతం పరిశీలించనున్నట్టు పేర్కొంది. హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండీషనింగ్ (హెచ్‌వీఏసీ) విభాగంలోకీ విస్తరించనున్నట్టు ప్రకటించింది. భారత వినియోగదారులు సాధారణ ఉత్పత్తుల కంటే ఇంటెలిజెంట్, కనెక్టెడ్ (ఒకదానితో ఒకటి అనుసంధానిత) గృహోపకరణాల వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపింది. ఈ నేపథ్యంలో కృత్రిమ మేధస్సు ఆధారిత గృహోపకరణాలు, వాటిని అనుసంధానించే స్మార్ట్ వ్యవస్థలను అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నట్టు వెల్లడించింది. -
సౌదీ నుంచి సజీవంగా వస్తాడనుకోలేదు..!
రెండు దశాబ్దాల ఆ తల్లి నిరీక్షణకు తెరపడింది. కోట్ల రూపాయల ‘బ్లడ్ మనీ’.. దీర్ఘకాల న్యాయపోరాటం, అంతర్జాతీయ స్థాయిలో సాగిన చర్చల అనంతరం అబ్దుల్ రహీమ్ చివరికి స్వదేశానికి చేరాడు. అదీ ఈద్ అల్ అదా రోజున!. ఇంకేం కోజికోడ్ విమానాశ్రయంలో ఆయన్ని చూసి కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. “ఇన్ని సంవత్సరాల ప్రార్థనలకు అల్లా సమాధానం ఇచ్చాడు” అంటూ తల్లి ఫాతిమా చేసిన వ్యాఖ్యలు అక్కడున్న వారిని కదిలించాయి.కేరళలోని కోజికోడ్ జిల్లా ఫెరోక్‌కు చెందిన అబ్దుల్ రహీమ్ 2006లో ఉపాధి కోసం సౌదీ అరేబియాకు వెళ్లారు. అక్కడ ఆయన డ్రైవర్‌గా పనిచేస్తున్న సమయంలో, ఆయన సంరక్షణలో ఉన్న ఓ ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారి మరణించిన ఘటన ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. సౌదీ మీడియాలో వచ్చిన వివరాల ప్రకారం.. ఆ చిన్నారి సౌదీ వ్యాపారవేత్త అబ్దుల్లా అబ్దురహ్మాన్ అల్ షహ్రి కొడుకు. ఆ బాలుడు తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో, వైద్య సహాయక పరికరాలపై ఆధారపడి చికిత్స పొందుతున్నాడు. ఒక సందర్భంలో ఆ చిన్నారికి అమర్చిన వైద్య సహాయక పరికరాన్ని రహీమ్ అనుకోకుండా తాకాడు. దీంతో అస్వస్థతకు గురైన ఆ బాలుడు.. మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు అయింది.తాను కావాలని చేయలేదని రహీమ్ చెప్పినా కోర్టులు వినలేదు. ఈ ఘటనపై సౌదీ కోర్టు విచారణ జరిపి 2012లో ఆయనకు మరణశిక్ష విధించింది. ఈ తీర్పు తర్వాత కేసు ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. కొడుకు మీద ఆశలు వదిలేసుకున్న టైంలో.. దగ్గరి బంధువు ద్వారా బ్లడ్ మనీ గురించి తెలుసుకుంది రహీమ్ తల్లి ఫాతిమా. కొందరు అధికారులు, మత పెద్దలు ద్వారా కొడుకు విడుదల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అలా నెలల తరబడి చర్చల తర్వాత.. రహీమ్‌కు క్షమాభిక్ష ప్రసాదించేందుకు అబ్దుల్లా అబ్దురహ్మాన్ అల్ షహ్రి బ్లడ్‌మనీకి అంగీకరించింది. కేరళలో పెద్ద ఎత్తున మానవతా సహాయ ప్రచారం ప్రారంభమైంది. ప్రవాస భారతీయులు, వ్యాపారులు, విద్యార్థులు కలిసి నిధులు సేకరించారు. మొత్తం సుమారు రూ.47 కోట్లు సమీకరించగా, అందులో రూ.34 కోట్లు ‘బ్లడ్ మనీ’గా బాధిత కుటుంబానికి చెల్లించారు. అనంతరం బాధిత కుటుంబం క్షమాభిక్ష ఇవ్వడంతో 2014లో మరణశిక్ష రద్దయింది. అయితే.. ఇక్కడే మరో ట్విస్ట్ చోటు చేసుకుంది.సౌదీ చట్టాల ప్రకారం పబ్లిక్ రైట్స్ కింద ఆయనకు అప్పటికే 20 ఏళ్ల జైలు శిక్ష విధించబడింది. దీంతో.. ఆ శిక్ష పూర్తయ్యేదాకా ఆయన ఆగాల్సి వచ్చింది. ఇటీవల ఆ శిక్షపూర్తి కావడంతో రహీమ్ విడుదల అయ్యాడు. ఈద్ పండుగ రోజున ఆయన కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగా, వందలాది మంది కుటుంబ సభ్యులు, మద్దతుదారులు అక్కడికి వచ్చి ఘన స్వాగతం పలికారు. రెండు దశాబ్దాల తర్వాత ఇంటికి చేరిన ఆ క్షణం అందరినీ భావోద్వేగానికి గురిచేసింది.ఇంటివద్ద కూడా భావోద్వేగ దృశ్యాలు కనిపించాయి. తల్లి ఫాతిమా కన్నీళ్లతో కుమారుడిని ఆలింగనం చేసుకుని, “ఇన్ని సంవత్సరాల ప్రార్థనలకు ఈ రోజు సమాధానం లభించింది” అని చెప్పిన మాటలు అందరినీ కదిలించాయి. భారత రాయబార కార్యాలయం, లీగల్ కమిటీ సహకారంతో అన్ని న్యాయపరమైన ప్రక్రియలు పూర్తిచేసి ఆయన స్వదేశానికి రప్పించడంలో కీలక పాత్ర పోషించాయి. ఈ ఘటన కేరళలోనే కాకుండా విదేశాల్లో ఉన్న మలయాళీ సమాజంలో కూడా పెద్ద చర్చకు దారితీసింది.నిమిషా ప్రియా పరిస్థితి?రహీమ్ ఘటన నేపథ్యంలో.. యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిషా ప్రియా కేసు కూడా కొనసాగుతోంది. 2017లో ఓ యెమెన్ పౌరుడి మరణ ఘటనలో ఆమెపై కేసు నమోదై కోర్టు మరణశిక్ష విధించింది. అయితే కుటుంబ సభ్యులు, మానవ హక్కుల సంఘాలు, భారత ప్రభుత్వ వర్గాలు కలిసి ఆమె శిక్షను నిలిపివేయడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ‘బ్లడ్ మనీ’ ద్వారా క్షమాభిక్ష సాధించే అవకాశాలపై చర్చలు జరుగుతున్నప్పటికీ, కేసు ఇంకా తుది దశకు చేరలేదు. -
సౌదీ కొత్త వ్యూహం.. ప్రపంచానికే బిగ్ అలర్ట్
పశ్చిమాసియాలో ఇప్పుడు యుద్ధం అంటే కేవలం క్షిపణులు, ఫైటర్ జెట్లు కాదు.. “డ్రోన్ వార్” అనేది కొత్త భయంగా మారింది. ముఖ్యంగా ఇరాన్ ఉపయోగిస్తున్న “షాహెద్” కామికాజే డ్రోన్లు ప్రపంచ రక్షణ వ్యవస్థలకే సవాల్‌గా మారాయి. ఇప్పుడు అదే మోడల్‌ను సౌదీ అరేబియా కూడా అనుసరించే ప్రయత్నంలో ఉందన్న వార్తలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి.ఇరాన్ తయారు చేసిన షాహెద్-136 డ్రోన్లు తక్కువ ఖర్చుతో తయారవుతాయి. కానీ వీటి దాడి ప్రభావం మాత్రం భారీగా ఉంటుంది. చాలా తక్కువ ఎత్తులో నెమ్మదిగా ప్రయాణించే ఈ డ్రోన్లు రాడార్లకు చిక్కకుండా టార్గెట్‌పై నేరుగా దూసుకెళ్తాయి. ఒకేసారి వందల సంఖ్యలో డ్రోన్లు ప్రయోగించడం వల్ల అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లు కూడా ఓవర్‌లోడ్ అవుతున్నాయి. ఇదే ఇప్పుడు ఇరాన్ ప్రధాన యుద్ధ వ్యూహంగా మారింది.ఇటీవల అమెరికా–ఇజ్రాయెల్–ఇరాన్ ఉద్రిక్తతల సమయంలో గల్ఫ్ దేశాలపై వరుసగా డ్రోన్, క్షిపణి దాడులు జరిగాయి. సౌదీ చమురు క్షేత్రాలు, రియాద్ సమీప ప్రాంతాలు, ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్‌బేస్, అరాంకో ఆయిల్ ఫెసిలిటీలపై దాడుల ప్రయత్నాలు చోటుచేసుకున్నాయి. అనేక డ్రోన్లు, క్షిపణులను సౌదీ ఎయిర్ డిఫెన్స్ కూల్చివేసినప్పటికీ ఈ దాడులు రియాద్‌ను తీవ్రంగా ఆందోళనకు గురిచేశాయి.ఈ నేపథ్యంలోనే సౌదీ అరేబియా కొత్త వ్యూహంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. రియాద్ సమీపంలో భారీ డ్రోన్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసి, ఇరాన్ షాహెద్ తరహా లాంగ్ రేంజ్ అటాక్ డ్రోన్ల తయారీకి సన్నాహాలు చేస్తున్నట్లు అంతర్జాతీయ రక్షణ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అమెరికా–సౌదీ డిఫెన్స్ కంపెనీలు కలిసి ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. అయితే, ఇది కేవలం రక్షణ చర్య మాత్రమే కాదని నిపుణులు అంటున్నారు. ఇరాన్ “స్వార్మ్ డ్రోన్ స్ట్రాటజీ” ప్రపంచ యుద్ధ విధానాన్నే మార్చేసిందని వారు చెబుతున్నారు. తక్కువ ఖర్చుతో వేల డ్రోన్లు ప్రయోగించి శత్రువు రక్షణ వ్యవస్థను చేధించడం, ఆర్థిక నష్టం కలిగించడం, చమురు ఉత్పత్తిని దెబ్బతీయడం.. ఇదే కొత్త యుద్ధ ఫార్ములాగా మారుతోంది. ఇప్పుడు అదే పద్ధతిని సౌదీ కూడా అధ్యయనం చేస్తోందని విశ్లేషణలు సూచిస్తున్నాయి.ఇక, ఇప్పటివరకు పూర్తిగా రక్షణాత్మక వైఖరిలో కనిపించిన సౌదీ.. ఇప్పుడు ప్రతీకార దాడుల దిశగా కూడా అడుగులు వేస్తోందని వార్తలు బయటకు వస్తున్నాయి. ఇరాన్ డ్రోన్, క్షిపణి లాంచ్ సైట్లపై సౌదీ సీక్రెట్‌గా వైమానిక దాడులు నిర్వహించిందని అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. ఇది మధ్యప్రాచ్య రాజకీయాల్లో పెద్ద వ్యూహాత్మక మార్పుగా భావిస్తున్నారు. ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతం మొత్తం “డ్రోన్ కోల్డ్‌వార్” దిశగా వెళ్తోందన్న ఆందోళనలు పెరుగుతున్నాయి. భారీ యుద్ధ విమానాల కంటే ఇప్పుడు చౌకైన డ్రోన్లే ఎక్కువ ప్రమాదకరంగా మారుతున్నాయని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు కేవలం ఇరాన్ ప్రత్యేకతగా భావించిన డ్రోన్ వార్ఫేర్.. ఇప్పుడు సౌదీతో పాటు ఇతర దేశాలు కూడా అనుసరించే స్థాయికి చేరుకోవడం ప్రపంచ భద్రతా సమీకరణాల్లో పెద్ద మార్పుగా కనిపిస్తోంది.డ్రోన్ స్వార్మ్ అంటే ఏమిటి?ఒకేసారి డజన్ల నుంచి వందల సంఖ్యలో డ్రోన్లు ప్రయోగించడంరాడార్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లను గందరగోళానికి గురిచేయడంఒకటి కాదు.. వరుస దాడులతో శత్రువును అలసటకు గురిచేయడంతక్కువ ఖర్చుతో భారీ నష్టం కలిగించే కొత్త యుద్ధ వ్యూహంసౌదీకి అసలు భయం ఏంటి?చమురు క్షేత్రాలపై దాడులు జరిగితే ప్రపంచ ఆయిల్ మార్కెట్ దెబ్బతింటుందిఅరాంకో వంటి కంపెనీలకు భారీ నష్టం వచ్చే ప్రమాదంగల్ఫ్ ప్రాంత భద్రతపై ప్రపంచ పెట్టుబడిదారుల్లో భయం పెరుగుతుందిసౌదీ ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావం పడే అవకాశంఅమెరికా ఎందుకు అలర్ట్?గల్ఫ్‌లో అమెరికా మిలిటరీ బేస్‌లు ఉన్నాయిఇరాన్ డ్రోన్ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోందిఅమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లకే సవాల్‌గా మారుతోందిగల్ఫ్లో యుద్ధం పెరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే ప్రమాదం -
రెండు దశాబ్దాల తరువాత..
కేరళలోని కోజికోడ్ సమీపంలో ఉన్న ఫెరోక్లోని ఆ ఇంట్లో బక్రీద్ నాడు అసలైన వేడుక జరిగింది. సౌదీ జైలులో రెండు దశాబ్దాలు గడిపి, మరణశిక్షను ఎదుర్కొన్న వ్యక్తి కేరళకు తిరిగి వచ్చాడు. టీనేజర్ మృతికి కారణమయ్యారనే అభియోగంతో మరణశిక్ష పడిన వ్యక్తి.. ఉరిశిక్ష నుంచి తృటిలో తప్పించుకుని ఇంటికి తిరిగొచ్చాడు. డ్రైవర్‌గా వెళ్లి కేర్ టేకర్‌గా..సౌదీ అరేబియాకు వెళ్లడానికి ముందు రహీం కేరళలో ఆటోరిక్షా, స్కూల్ బస్సు నడిపాడు. ఆరుగురు తోబుట్టువులలో అందరికంటే చిన్న వాడైన అతను, డ్రైవర్‌గా ఉద్యోగం సంపాదించి తర్వాత 2006 నవంబర్ 28న రియాద్‌కు వెళ్లాడు. కానీ, పక్షవాతంతో బాధపడుతూ శ్వాస పరికరంపై ఆధారపడి జీవిస్తున్న 17 ఏళ్ల వ్యక్తికి కేర్‌టేకర్‌గా పని ఇచ్చారు. 2006 డిసెంబర్ 24న, ఆ బాలుడిని వెనుక కూర్చో బెట్టుకుని రహీమ్ వాహనం నడుపుతుండగా శ్వాస సహాయక పరికరం ఊడిపోవడంతో ఆ బాలుడు మరణించాడు. అప్పుడు 26 ఏళ్ల వయసున్న రహీం, సౌదీ అరేబియాకు వచ్చిన కేవలం 28 రోజులకే అరెస్టయ్యాడు. 2011లో సౌదీ కోర్టు అతనికి మరణశిక్ష విధించింది. ఉన్నత న్యాయస్థానాలు కూడా ఈ శిక్షను సమర్థించాయి.పరిహారంతో పరిష్కారం...అతనికి మరణశిక్ష ఎప్పుడైనా పడొచ్చని అతని కుటుంబం అనుక్షణం భయంతో జీవించింది. అయితే రూ. 34 కోట్ల పరిహారం ఇస్తే రహీంను క్షమించడానికి ఆ కుటుంబం అంగీకరించింది. దీంతో అతని మరణ శిక్షను రద్దు చేశారు. పొట్టకూటి కోసం అంతదూరం వెళ్లిన రహీం అంతమొత్తాన్ని ఎలా ఇవ్వగలడు? ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీ సమాజం అతనికి సాయం చేసింది. భారీ క్రౌడ్‌ఫండింగ్‌తో విరాళాలు వెల్లువెత్తాయి. నాలుగు రోజుల్లోనే విరాళాలు సేకరించి పరిహారం పూర్తిగా చెల్లించారు. అయితే, రహీం 20 ఏళ్ల జైలు శిక్షను పూర్తి చేయాలని సౌదీ అధికారులు ఆదేశించారు. అరబిక్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది మే 20న ఆ శిక్ష ముగిసింది.తండ్రిని కోల్పోయి.. కోజికోడ్‌లో రహీం కుటుంబానికి ఈ సమయం పరీక్షలా నిలిచింది. అతను జైలు పాలైన ఆరు నెలలకే తండ్రి ముహమ్మద్కుట్టి మరణించారు. క్షమాభిక్ష మంజూరైన తర్వాత 2024 నవంబర్‌లో తల్లి ఫాతిమా అతన్ని ఒక్కసారి మాత్రమే కలవగలిగింది. వీడియో కాల్స్ వారికి ఊరటనిచ్చాయి. ఈ సుదీర్ఘ నిరీక్షణకు గురువారం తెరపడింది. తనకు పునర్జన్మను ప్రసాదించిన వారందరికీ రహీం కృతజ్ఞతలు తెలిపాడు. ఇంటికి చేరుకున్న రహీం ఆనందంతో కన్నీరు పెట్టుకున్నాడు. తన ప్రాణాలు నిలబెట్టి, తన విడుదలను సుసాధ్యం చేసిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేరళీయులందరికీ రహీం ధన్యవాదాలు తెలిపాడు. బక్రీద్ పండుగ సమయంలోనే రహీం తిరిగి రావడం తమ ఆనందాన్ని రెట్టింపు చేసిందని అతని స్నేహితులు, స్థానికులు తెలిపారు.– సాక్షి, నేషనల్ డెస్క్ఇది కూడా చదవండి: పడవ బోల్తా పడి ఇద్దరు మృతి.. ఐదుగురు గల్లంతు -
యా అల్లా... సబ్ కా భలా కరో! (ఫొటోలు)
-
సౌదీలో 7,200 వర్క్ వీసాలు రద్దు
జెడ్డా: సౌదీ అరేబియాలో నకిలీ “సౌదీకరణ” (fake saudization)కు పాల్పడుతున్న సంస్థలపై కేంద్ర మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ కఠిన చర్యలు చేపట్టింది. ఈ ఏడాది తొలి మూడు నెలల్లో నిర్వహించిన విస్తృత తనిఖీల్లో 7,200కు పైగా వర్క్ వీసా ఉల్లంఘనలు వెలుగులోకి రావడంతో, సంబంధిత ప్రైవేట్ సంస్థలకు జారీ చేసిన 7,200కు పైగా వర్క్ వీసాలను అధికారులు రద్దు చేశారు. అదనంగా, నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై మంత్రిత్వ శాఖ సేవలపై తాత్కాలిక నిషేధం కూడా విధించారు.స్మార్ట్ నిఘా వ్యవస్థల సహాయంతో మొత్తం 91 వేల అనుమానిత కేసులను పరిశీలించగా, అందులో 13,509 నకిలీ సౌదీకరణ కేసులను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని సంస్థలు సౌదీ పౌరులను కేవలం పేరుకే ఉద్యోగాల్లో చూపించి “నితాఖత్” పథకం ప్రయోజనాలు పొందుతున్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో మోసపూరితంగా నమోదు చేసిన ఉద్యోగులను నితాఖత్ జాబితా నుంచి తొలగించి, వారికి నిజమైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మానవ వనరుల అభివృద్ధి నిధికి బదిలీ చేశారు.మొదటి త్రైమాసికంలో మంత్రిత్వ శాఖ తనిఖీ బృందాలు సుమారు 2.5 లక్షల సంస్థలను ప్రత్యక్షంగా పరిశీలించాయి. ఈ తనిఖీల్లో మొత్తం 1.68 లక్షల కార్మిక నిబంధనల ఉల్లంఘనలు గుర్తించాయి. సంస్థలు తమ హోదాను సరిచేసుకోవాలని ఆదేశిస్తూ 2.30 లక్షల సంస్థలకు హెచ్చరిక నోటీసులు జారీ చేశారు.ఇక రిక్రూట్మెంట్ కార్యాలయాలపై నిర్వహించిన తనిఖీల్లో 3,522 ఉల్లంఘనలు బయటపడినట్లు అధికారులు తెలిపారు. గృహ కార్మికుల సేవలను చట్టవిరుద్ధంగా ప్రచారం చేసినందుకు 238 సోషల్ మీడియా ఖాతాలపై కూడా చర్యలు తీసుకున్నారు.అదేవిధంగా, అనుమానిత మానవ అక్రమ రవాణాకు సంబంధించిన 54 వేల కేసులను మంత్రిత్వ శాఖ దర్యాప్తు చేసినట్లు వెల్లడించింది. ప్రజల నుంచి వచ్చిన 15,563 ఫిర్యాదుల్లో ఎక్కువ భాగాన్ని నిర్ణీత గడువులో పరిష్కరించినట్లు అధికారులు తెలిపారు. -
సౌదీ హజ్ యాత్రికులకు అలర్ట్: పేమెంట్ గడువులో మార్పు
దుబాయ్: పవిత్ర హజ్ యాత్రకు సిద్ధమవుతున్న స్వదేశీ యాత్రికులకు సౌదీ అరేబియా ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ మే 15 (శుక్రవారం) నుంచి దేశీయ హజ్ బుకింగ్ చెల్లింపుల రెండో దశను ప్రారంభించనుంది. అయితే, ఈ దఫా సీట్ల లభ్యతను పెంచేందుకు చెల్లింపుల గడువు విషయంలో నిబంధనలను కఠినతరం చేసింది.గడువు 72 గంటల నుంచి 6 గంటలకు..ప్రస్తుతం ప్రాథమిక రిజర్వేషన్ పొందిన వారికి ఇన్వాయిస్ చెల్లించడానికి 72 గంటల సమయం ఇస్తుండగా, మే 15 నుంచి ఈ విధానంలో మార్పులు రానున్నాయి. మే 15 నుంచి రిజర్వేషన్ పొందిన వారు కేవలం 6 గంటలలోపే చెల్లింపులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎవరైనా బుక్ చేసుకుని చెల్లింపులు చేయకపోతే, ఆ సీటు బ్లాక్ అవ్వకుండా వెంటనే వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ఇతర దరఖాస్తుదారులకు అవకాశం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. నిర్ణీత గడువు (6 గంటలు) ముగిసిన వెంటనే చెల్లించని రిజర్వేషన్లు సాఫ్ట్వేర్ ద్వారా స్వయంచాలకంగా రద్దవుతాయి.సదాద్ ద్వారానే చెల్లింపులుఇప్పటికే 'నుసుక్' (Nusuk) ప్లాట్‌ఫామ్ ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న సౌదీ పౌరులు, నివాసితులు 'సదాద్' (SADAD) డిజిటల్ సిస్టమ్ ద్వారానే ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. యాత్రికుల సౌకర్యార్థం మినాలో 24,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అత్యాధునిక హంగులతో కొత్త గుర్తింపు కలిగిన గుడారాలను ఏర్పాటు చేస్తున్నారు. హజ్ 2026 సీజన్ కోసం చేపడుతున్న ఈ ఆధునికీకరణ పనుల వల్ల యాత్రికులకు మెరుగైన వసతులు లభించనున్నాయి. -
ఖర్చు రూ.1400 కోట్లు.. వచ్చింది రూ.6 కోట్లు!
ఒకప్పటితో పోలిస్తే సినిమాలకు క్రమక్రమంగా ఆదరణ తగ్గుతూ వస్తోంది. స్టార్ వాల్యూ ఉన్నాసరే కంటెంట్ అద్భుతంగా ఉందా లేదా అనేది ప్రేక్షకులు చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇదే ట్రెండ్ నడుస్తోంది. అలాంటిది సౌదీ అరేబియాలో ప్రతిష్ఠాత్మకంగా తీసిన పీరియాడిక్ యాక్షన్ మూవీ ప్రపంచంలోనే అరివీర భయంకరమైన డిజాస్టర్‌గా నిలిచింది. ఇప్పుడీ విషయం సినీ వర్గాల్లో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.(ఇదీ చదవండి: విజయ్-త్రిష పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది: నటి)'డిసర్ట్ వారియర్' పేరుతో రూ.1400 కోట్లు ఖర్చు పెట్టి తీసిన ఈ సినిమాకు రూపర్ట్ వ్యాట్ దర్శకత్వం వహించగా.. హాలీవుడ్ నటులైన ఆంటోనీ మాకీ, బెన్ కింగ్స్లే ప్రధాన పాత్రలు పోషించారు. సౌదీ ప్రభుత్వం మద్దతుతో నిర్మించడం అంతర్జాతీయ స్థాయిలో సౌదీ సినిమా ఇండస్ట్రీని నిలబెట్టే ప్రాజెక్ట్ అని ప్రచారం చేశారు. తీరా చూస్తే రిలీజ్ తర్వాత పూర్తిగా తేలిపోయింది.ప్రేక్షకుల్ని ఏ మాత్రం ఆకట్టుకోని ఈ సినిమాలో బలహీనమైన స్టోరీ, గందరగోళమైన స్క్రీన్ ప్లే, ఎమోషన్స్ సరిగా లేకపోవడం లాంటివి మైనస్ అయ్యాయని విమర్శకులు చెప్పుకొచ్చారు. ఉత్తర అమెరికాలో 1000కి పైగా థియేటర్లలో రిలీజైతే ఒక్కో థియేటర్ నుంచి 500 డాలర్ల కంటే తక్కువ కలెక్షన్ రావడం సినిమా పరిస్థితి ఏంటో చెప్పకనే చెప్పింది. అలా గత నెల 24న థియేటర్లలో రిలీజైతే రూ.6 కోట్ల లోపు వసూళ్లు వచ్చినట్లు సమాచారం.ఈ సినిమా ఫలితం బట్టి అర్థమైంది ఏంటంటే.. భారీ బడ్జెట్, స్టార్ నటీనటులు ఉన్నాంత మాత్రాన మూవీ హిట్ అవ్వదని, వందల కోట్ల రావు అని తేలింది. చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోని వరస్ట్ రికార్డ్ ఈ సినిమా సొంతం చేసుకుంది!(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగు రివ్యూ) -
ట్రంప్ మైండ్ గేమ్.. ఇరాన్ యుద్ధంలో మరో ట్విస్ట్
ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరిగే అవకాశం కనిపిస్తోంది. తాజాగా పర్షియన్ గల్ఫ్ వేదికగా మరోసారి ఇరు దేశాలకు దాడులు మొదలయ్యాయి. కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘన పేరిట పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. అయితే ఇరాన్ చర్చలకు దిగొచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేసిన కొన్ని గంటలకే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం. హర్ముజ్‌లో యూఎస్ యుద్ధనౌకలపై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడింది. జలసంధిలో గస్తీ కాస్తున్న ట్రక్ట్సన్, మాసన్ లక్ష్యంగా దాడులు చేసింది. అమెరికా రక్షణ వ్యవస్థ ఆ దాడుల్ని సమర్థవంతంగా తిప్పి కొట్టింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధృవీకరించారు. అయితే కాల్పుల విరమణ కొనసాగుతోందని.. జరిగింది చిన్నస్థాయి దాడులని ఆయన అన్నారు. అయితే ఆ వెంటనే. ఇరాన్‌లోని క్షిపణి లాంచ్ సైట్లు, కమాండ్ సెంటర్లపై అమెరికా దాడికి దిగింది. మరోవైపు.. హర్ముజ్ జలసంధిలో వెళ్తున్న ఇరాన్ ట్యాంకర్‌పై అమెరికా సైన్యం కాల్పులు జరిపింది. క్విష్మ్, బందర్ అబ్బాస్ నగరాల్లోనూ దాడులు కొనసాగుతున్నట్లు సమాచారం. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై క్షిపణులు విరుచుకుపడడంతో భారీ శబ్దాలు వినిపిస్తున్నాయని పలు మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి!. ఈ దాడుల వెనుక యూఏఈ పాత్ర ఉందని ఇరాన్ అనుమానిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్నిఅమెరికా తుంగలో తొక్కిందని విమర్శిస్తూనే.. ప్రతిఘటన తీవ్ర స్థాయిలో ఉంటుందని హెచ్చరించింది. దీంతో శాంతి చర్చలకు విఘాతం కలిగే అకాశం కనిపిస్తోంది.ఇరాన్‌కు సాలిడ్ వార్నింగ్!ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ‘‘ఇరాన్ వెంటనే శాంతి ఒప్పందానికి రావాలి. లేదంటే భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఇరాన్ సాధారణ దేశం కాదు.. అది ఉన్మాదుల చేతుల్లో ఉంది. గాలిలోనే వాళ్ల డ్రోన్లు దగ్గం అయ్యాయి. సీతాకోకచిలుకల్లా సముద్రంలో రాలిపోయాయి. శాంతి ఒప్పందంపై త్వరగా సంతకం చేయాలి. లేదంటే భవిష్యత్తు మరింత భయంకరంగా ఉంటుంది’’ అని అన్నారు.ట్రంప్ తీరు బాగోలేదు!ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలకు పాక్‌తో కలిసి సౌదీ అరేబియా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అయితే హర్ముజ్ జలసంధిలో నౌకల కోసం చేపట్టిన ఎస్కార్ట్ ఆపరేషన్‌ను ట్రంప్ 24 గంటలు గడవక ముందే ఆపేశారు. ఆయన ఇలా అనూహ్య నిర్ణయాలు తీసుకుంటుండడంపై సౌదీ అరేబియా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే అమెరికాకు గగనతల అనుమతులు నిరాకరిస్తూ నిర్ణయం తీసుకుంది. -
పాపం.. సౌదీ అరేబియా.. వరల్డ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీ..!
భారీ బడ్జెట్ సినిమాలు తీయాలంటేమన తెలుగులో రాజమౌళికి మాత్రమే సాధ్యం. వెయ్యి కోట్లకు పైగా బడ్జెట్ ప్రస్తుతం వారణాసి మూవీని తెరకెక్కిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ చిత్రాలపై అంతకుమించిన వసూళ్లు వస్తాయనే ఆశ మేకర్స్‌కు ఉంటుంది. దర్శకుడు, నటీనటులు, కథపై వసూళ్లు అనేది ఆధారపడి ఉంటుంది. కేవలం బడ్జెట్ పెట్టి సినిమా తీస్తే సరిపోదు. మేకింగ్ కూడా ఆ రేంజ్లో ఉంటేనే వర్కవుట్ అవుతుంది. కానీ ఈ విషయంలో మన రాజమౌళికి వచ్చిన ఇబ్బందేం లేదు. ఆయన తీసిన భారీ బడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయ్యాయి.అయితే పులికి చూసి నక్క వాత పెట్టుకున్నట్లు అనే సామెత మన వినే ఉంటాం. అలా ఇతర దేశాల్లాగే సినీరంగంలో తాము కూడా ప్రపంచస్థాయికి ఎదగాలని సౌదీ అరేబియా ఆశలు పెట్టుకుంది. అనుకోవడమే కాదు.. భారీ బడ్జెట్‌తో డెజర్ట్ వారియర్ అనే మూవీని నిర్మించింది. ప్రపంచంలోనే ఫేమస్ అయిన స్టార్స్‌ను పెట్టి ఈ సినిమా కోసం ఏకంగా రూ.1400 కోట్ల ఖర్చు చేసింది. కట్ చేస్తే.. సీన్ అంతా రివర్స్ అయింది. అనుకున్నది ఒక్కటీ.. అయిందొక్కటి అన్న తీరుగా మారిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా కేవలం రూ.6 కోట్లు మాత్రమే సాధించింది. ఈ వసూళ్లతో ప్రపంచంలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా రికార్డ్ సృష్టించింది. మొత్తం బడ్జెట్లో కేవలం 0.4 శాతం వాటా మాత్రమే వసూలు చేయగలిగింది. అంటే ఏకంగా 99.6 శాతం నష్టాలు తెచ్చిపెట్టింది. అయితే కొవిడ్ కారణంగా ఆలస్యం కావడం, భారీ సెట్లు, అంతర్జాతీయ సాంకేతిక నిపుణులతో మూవీని తెరకెక్కించడంతో బడ్జెట్ పెరిగినట్లు తెలుస్తోంది.ఏదేమైనా ప్రపంచవ్యాప్తంగా సినీ ఇండస్ట్రీలో సౌదీ అరేబియా పేరును తీసుకు రావాలని అనుకోవడం మంచిదే. అయితే భారీ బడ్జెట్ మాత్రమే కాకుండా కథపై కూడా దృష్టి పెట్టి ఉంటే మరింత బాగుండేదని సినీ ప్రియులు అంటున్నారు. ఈ డిజాస్టర్ మూవీతో తమ దేశంలోనూ సినీ పరిశ్రమ అభివృద్ధి కావాలని సౌదీ అరేబియా చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఇక నుంచైనా సౌదీ అరేబియా మన దర్శకధీరుడు రాజమౌళి సలహాలు తీసుకుంటే మంచిదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. సౌదీ అరేబియా ఏంబీసీ గ్రూప్ ద్వారా 'డెజర్ట్ వారియర్' లాంటి చారిత్రక వార్ మూవీని నిర్మించింది. దాదాపు 7వ శతాబ్దపు అరేబియా నేపథ్యంలో సాగే కథగా ఈ సినిమాను తెరకెక్కించారు. అప్పటి చక్రవర్తి కిస్రాకు వ్యతిరేకంగా యువరాణి హింద్ సాగించిన పోరాటం నేపథ్యంలో ఈ సినిమాకు రూపొందించారు. ఈ మూవీకి రూపెర్ట్ వ్యాట్ (రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ ఫేమ్) దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మార్వెల్ నటుడు ఆంథోనీ మాకీ, ఆస్కార్ విజేత బెన్ కింగ్స్లీ, ఐషా హార్ట్, షార్ల్టో కోప్లీ లాంటి సూపర్ స్టార్స్ నటించారు. -
సౌదీ అరేబియా, యూఏఈ బహిరంగంగా సవాల్
-
యూఏఈ సంచలన నిర్ణయం.. పాకిస్తాన్‌కు బిగ్ షాక్!
ఇరాన్, అమెరికా మధ్య చర్చలు జరుగుతున్న వేళ పశ్చిమాసియాలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. గల్ఫ్ దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. చమురు ఉత్పత్తి చేసే దేశాల కూటమి అయిన ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్-ఒపెక్ (OPEC), ఒపెక్+ (OPEC+) నుంచి బయటకు వచ్చేస్తున్నట్టు తాజాగా ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, దీనికి సౌదీ అరేబియా, పాకిస్తానే ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇదే సమయంలో పాకిస్తాన్‌కు యూఏఈ ఊహించని షాకిచ్చింది.కాగా, మే 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ఒపెక్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని యూఏఈ తెలిపింది. మార్కెట్ డిమాండ్, పరిస్థితులకు అనుగుణంగా చమురు ఉత్పత్తిని క్రమంగా పెంచుతామని యూఏఈ ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశీయ ఇంధన ఉత్పత్తిపై పెట్టుబడులను మరింత వేగవంతం చేస్తామని వెల్లడించింది. ఈ నిర్ణయం చమురు ఎగుమతి దేశాల కూటమికి, దానికి నాయకత్వం వహిస్తున్న సౌదీ అరేబియాకు ఇది అతిపెద్ద దెబ్బ అయ్యే అవకాశం ఉంది. ఒపెక్‌కు ఝలక్..1967లో యూఏఈ ఒపెక్ కూటమిలో చేరింది. ఒపెక్‌లో సౌదీ అరేబియా, ఇరాక్ తర్వాత మూడో అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా ఉంది. ఒపెక్ నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ వస్తోంది. సుదీర్ఘ కాలంపాటు సభ్యదేశంగా కొనసాగిన యూఏఈ.. అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకోవడం ప్రపంచ దేశాలను షాక్‌కు గురి చేసింది. దీనివల్ల భవిష్యత్‌లో ఒపెక్ బలహీనం అవుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇప్పటికే హార్మూజ్ మూసివేతతో చమురు ఎగుమతిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఒపెక్ దేశాలకు.. యూఏఈ రూపంలో మరో షాక్ తగిలింది. దేశ ప్రయోజనాల రీత్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపినప్పటికీ సౌదీ, పాకిస్తానే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఇరాన్ దాడులు కూడా ఇందులో మరో కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు.ఇరాన్ ఎఫెక్ట్.. ఇరాన్ దాడుల విషయంలో సౌదీ అరేబియా వంటి తన ప్రాంతీయ మిత్రదేశాలు సరైన రీతిలో స్పందించకపోవడం పట్ల యూఏఈ అసంతృప్తితో ఉంది. ఈ నేపథ్యంలో ఒపెక్ నుంచి యూఏఈ బయటకు వచ్చిందనే వాదన కూడా ఉంది. అలాగే, గల్ఫ్ ప్రాంతంలో యూఏఈ, సౌదీ అరేబియా, పాకిస్తాన్ మధ్య సంబంధాలు గత కొన్నేళ్లుగా మారుతూ వచ్చాయి. ఇటీవల ఇరాన్ యుద్ధం దాడుల సందర్భంగా యూఏఈపై ఇరాన్ ఇటీవల 537 బాలిస్టిక్ క్షిపణులు, 26 క్రూయిజ్ మిసైళ్లు, 2,256 డ్రోన్లతో దాడులు చేసింది. ఈ దాడులు యూఏఈ మౌలిక వసతులను తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ క్రమంలో అమెరికా మరియు ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై చర్యలు చేపట్టింది కానీ ప్రతిగా ఎక్కువ నష్టాన్ని చవిచూసింది. ఇదే సమయంలో పాకిస్తాన్ మధ్యవర్తి వ్యవహారంపై యూఏఈ ఆగ్రహం వ్యక్తం చేసింది.పాకిస్తాన్ పాత్ర..అమెరికా–ఇరాన్ మధ్య మధ్యవర్తిగా పాకిస్తాన్ వ్యవహరించింది.యూఏఈ మాత్రం పాకిస్తాన్ ఇరాన్‌పై కఠిన వైఖరి తీసుకోవాలని కోరింది.పాకిస్తాన్ తటస్థంగా ఉండటంతో యూఏఈ అసంతృప్తి చెందింది.ప్రతిగా యూఏఈ $3.5 బిలియన్ రుణం తక్షణమే తిరిగి చెల్లించమని డిమాండ్ చేసింది.దీంతో, 2026 ఏప్రిల్‌లో పాకిస్తాన్ యూఏఈకి $3.45 బిలియన్ రుణం తిరిగి చెల్లించింది.ఇందులో $1 బిలియన్ అబుదాబి ఫండ్ ఫర్ డెవలప్మెంట్కి చెల్లించబడింది.ఇది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బగా మిగిలింది.యూఏఈలో 1.6 మిలియన్‌కి పైగా పాకిస్తానీలు నివసిస్తున్నారు.వీరి రిమిటెన్సులు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు కీలకం.తాజాగా యూఏఈ, పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇది పాకిస్తానీలకు ఎదురుదెబ్బ కానుంది.సౌదీ-పాకిస్తాన్ బంధం..యూఏఈ డిమాండ్ తర్వాత సౌదీ అరేబియా వెంటనే పాకిస్తాన్‌కు $3 బిలియన్ రుణం ఇచ్చింది.అదనంగా $5 బిలియన్ క్రెడిట్ లైన్ వాగ్దానం చేసింది.అంతకుముందు 2025లో సౌదీ–పాకిస్తాన్ రక్షణ ఒప్పందం కుదిరింది.ఈ ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ తన అణు ఆయుధాలు, క్షిపణులు సౌదీ రక్షణ కోసం ఉపయోగించగలదు.దీంతో, పాకిస్తాన్ తనను పక్కన పెట్టినట్లు యూఏఈ భావించింది.యూఏఈ నిర్ణయం ప్రభావం..ఆర్థికంగా: యూఏఈ ఇకపై రోజుకు 3 మిలియన్ బ్యారెల్స్ ఉత్పత్తిని కోటా పరిమితులు లేకుండా పెంచుకోగలదు.రాజకీయంగా: ఇది సౌదీ ఆధిపత్యానికి బహిరంగ సవాలు.ప్రపంచవ్యాప్తంగా: అమెరికా, చైనా, రష్యా తమ వ్యూహాలను మళ్లీ ఆలోచించాల్సి వస్తుంది. పశ్చిమాసియాలో యూఏఈ తన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించడానికి ఎక్కువగా ప్రయత్నిస్తోంది. 2015లో ఇరాన్ మద్దతు ఉన్న యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా పోరాడటానికి యూఏఈ, సౌదీ అరేబియా కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాయి. అయితే, యూఏఈ మద్దతు ఉన్న యెమెన్ వేర్పాటువాదులకు ఆయుధాల రవాణా జరుగుతోందని ఆరోపిస్తూ సౌదీ అరేబియా బాంబు దాడి చేయడంతో కూటమిలో విభేదాలు తలెత్తాయి. కాలక్రమేణా రియాద్ కొన్ని వైఖరులకు విరుద్ధంగా ఉంది. గత కొన్నేళ్లుగా అమెరికా తన చమురు ఉత్పత్తిని పెంచుకోవడంతో వియన్నా కేంద్రంగా పనిచేసే 'ఒపెక్' మార్కెట్ పవర్ క్రమంగా తగ్గుముఖం పట్టింది.ఇదిలా ఉండగా.. యూఏఈకి భారత్‌తో బలమైన సంబంధాలు ఉన్నాయి. అయితే, సౌదీ అరేబియా, పాకిస్తాన్ మరియు టర్కీ ఒక కూటమిగా ఏర్పడుతున్నాయి. వారి మధ్య త్రైపాక్షిక సైనిక ఒప్పందంపై చర్చ జరుగుతోంది.భారత్‌కి అవకాశాలు:తక్కువ ధరలు: యూఏఈ ఉత్పత్తి కోటాల నుండి విముక్తి పొందడంతో రోజుకు 4.8 మిలియన్ బ్యారెల్స్ వరకు ఉత్పత్తి పెంచే అవకాశం ఉంది. ఇది గ్లోబల్ మార్కెట్లో సరఫరా పెంచి ధరలను తగ్గిస్తుంది.దిగుమతి బిల్లు తగ్గింపు: భారత్‌కి క్రూడ్ ఆయిల్ దిగుమతి ఖర్చు తగ్గి, ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉండే అవకాశం ఉంది.ఇంధన ధరలు: పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉంది, ఇది వినియోగదారులకు నేరుగా లాభం జరుగుతుంది.2022లో భారత్ యూఏఈ నుండి $11 బిలియన్ విలువైన క్రూడ్ దిగుమతి చేసుకోగా, 2026లో ఇది $14 బిలియన్కి పెరిగింది.యూఏఈ వాటా భారత్ క్రూడ్ దిగుమతుల్లో 10.3% నుండి 11.4%కి పెరిగింది.దీర్ఘకాల ఒప్పందాలు: ఒపెక్ కోటాల పరిమితులు లేకుండా భారత్ యూఏఈతో దీర్ఘకాల సరఫరా ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. యూఏఈతో ఎనర్జీ భాగస్వామ్యం మరింత బలపడుతుంది. LNG, LPG రంగాల్లో కూడా కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. -
గల్ఫ్ దేశాలకు తగ్గిపోయిన ఇంజనీరింగ్ ఎగుమతులు
న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం దేశ ఇంజనీరింగ్ ఎగుమతులపై ప్రభావం చూపిస్తోంది. ఇంజనీరింగ్ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఈఈపీసీ)గణాంకాల ప్రకారం.. మార్చి నెలలో యూఏఈకి ఎగుమతులు 237 మిలియన్ డాలర్లకు తగ్గాయి. 2025 మార్చిలో ఎగుమతులు 715 మిలియన్ డాలర్లతో పోల్చితే 66.8 శాతం పడిపోయాయి. సౌదీ అరేబియాకు సైతం మార్చి నెలలో ఎగుమతులు 248 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.క్రితం ఏడాది ఇదే నెలలో ఈ దేశానికి ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు 450 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అంటే 45 శాతం తగ్గినట్టు తెలుస్తోంది. మొత్తం మీద మార్చి నెలలో దేశ ఇంజనీరింగ్ ఎగుమతులు క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చిచూసినప్పుడు 1 శాతం పెరిగి 10.94 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2025–26) మొత్తం మీద ఇంజనీరింగ్ ఎగుమతులు అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే 5 శాతం వృద్ధితో 122.43 బిలియన్ డాలర్లకు చేరాయి. 2030 నాటికి ఇంజనీరింగ్ ఎగుమతులను 250 బిలియన్ డాలర్లకు (రెట్టింపు) చేర్చాలన్నది లక్ష్యం.గత ఆర్థిక సంవత్సరం వస్తు ఎగుమతుల్లో ఇంజనీరింగ్ వాటా 27.71 శాతంగా ఉంది. అమెరికా టారిఫ్‌లు బాదేసినా ఆ దేశానికి గత ఆర్థిక సంవత్సరంలో ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు 2.3 శాతం పెరిగి 19.6 బిలియన్ డాలర్లకు చేరాయి. జర్మనీకి 14.6 శాతం అధికంగా 4.96 బిలియన్ డాలర్లు, యూకేకి 18.2 శాతం అధికంగా 4.74 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయి. చైనాకు 32 శాతం అధికంగా 3.53 బిలియన్ డాలర్లు, కొరియాకి 3 బిలియన్ డాలర్లు (16.7 శాతం అధికం) చొప్పున ఎగుమతులు వెళ్లాయి. ఇవి ఎక్కువ – ఇవి తక్కువ గత ఆర్థిక సంవత్సరంలో మోటారు వాహనాలు, కార్లు, టూ వీలర్లు, రాగి, ఐరన్ అండ్ స్టీల్, ఎలక్టరిక్ మెషినరీ ఎగుమతులు ఎక్కువగా జరిగాయి. అదే సమయంలో ఎయిర్‌క్రాఫ్ట్, స్పేస్‌క్రాఫ్ట్ విడిభాగాలు, మెడికల్, సైంటిఫిక్ ఇనుస్ట్రుమెంట్ల ఎగుమతులు తగ్గాయి. -
సౌదీని ముంచెత్తిన వరదలు.. పరుగో పరుగు
ఎడారి దేశం సౌదీ అరేబియాను వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలు, తుపానుల బీభత్సానికి రాజధాని రియాద్‌తో పాటు పలు కీలక ప్రావిన్సుల్లో జనజీవనం అతలాకుతలమైంది. పరిస్థితులు తీవ్రంగా ఉండడంతో అక్కడి ప్రభుత్వం విద్యార్థుల భద్రతను దృష్టా పాఠశాలలకు, కాలేజీలకు సెలవు ప్రకటించింది. అత్యవసర సేవల విభాగాలను హై అలర్ట్‌లో ఉంచింది.రాజధాని రియాద్‌లో గత రెండురోజులుగా కురుస్తున్న వర్షానికి రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. వర్షంతో పాటు బలమైన ధూళి తుపానులు రావడంతో వాహనదారులకు రోడ్లు సరిగ్గా కనిపించక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అల్-అహసా ప్రావిన్సులో రహదారులు జలమయం కావడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది.వరదలు, అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి సౌదీ రెడ్ క్రిసెంట్ అథారిటీ సర్వసన్నద్ధమైంది. రియాద్‌లో దాదాపు 143 అంబులెన్స్ యూనిట్లను, 25 రాఫ్ (RAF) బృందాలను సిద్ధంగా ఉంచారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నారు. వారికోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు.కాగా ఇన్ని రోజుల పాటు యుద్దం నేపథ్యంలో అట్టుడికిపోయిన సౌదీ అరేబియా సీజ్ఫైర్ నేపథ్యంలో కాస్త పరిస్థితులు సద్దుమణిగాయి అనే లోగా అకస్మిక వరదలు ఆ దేశంలో కల్లోలం సృష్టిస్తున్నాయి.Massive flooding caused by intense rainfall in Riyadh, Saudi Arabia 🇸🇦 pic.twitter.com/OfjWoaSOUl— Disaster News (@Top_Disaster) April 12, 2026 -
సౌదీ యువరాజుకు మోదీ ఫోన్.. ఏమన్నారంటే?
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఇంధన, పౌర మౌలిక వసతులపై జరుగుతున్న దాడులను ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ఖండించారు. ఆయన శనివారం సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్‌తో ఫోన్లో మాట్లాడారు. పశ్చిమాసియా పరిణామాలపై చర్చించారు. ఆ ప్రాంతంలో స్వేచ్ఛాయుత నౌకాయానానికి వీలు కల్పించాల్సిన అవసరం ఉందని ఇరువురు నేతలు తేల్చిచెప్పారు.నౌకా మార్గాలను తెరిచి ఉంచాలని, తగిన భద్రత కల్పించాలని పేర్కొన్నారు. సౌదీ అరేబియాలో నివసిస్తున్న భారతీయులకు సంక్షేమానికి తోడ్పాటు అందిస్తున్నందుకు యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్‌కు కృతజ్ఞతలు తెలియజేశానని మోదీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. పశ్చిమాసియాలో ప్రస్తుత సంక్షోభంపై అభిప్రాయాలు పంచుకున్నామని తెలిపారు. ఇరాన్లో యుద్ధం మొదలైన తర్వాత ప్రధాని మోదీ, సౌదీ యువరాజు ఫోన్లో మాట్లాడుకోవడం ఇది రెండోసారి. మోదీ ఇప్పటికే యూఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్, జోర్డాన్, ఇరాన్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, మలేషియా, అమెరికా తదితర దేశాల పాలకులతో సంభాషించారు. -
సౌదీపై భీకర దాడి.. 10 మంది అమెరికా సైనికులు..
-
ఇరాన్ పతనమే లక్ష్యంగా ? సౌదీ బిగ్ ప్లాన్
-
అందాల పోటీల్లో ఒంటెలపై అనర్హత
ఒమన్‌లో ఇటీవల ఒంటెలకు అందాల పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో పెద్దసంఖ్యలో ఒంటెలు క్యామెల్ వాక్ చేస్తూ వయ్యారాలు ఒలకబోశాయి. వేలాది మంది జనాలు ఈ పోటీలను అబ్బురంగా తిలకించారు. న్యాయ నిర్ణేతలు ఒక్కొక్క ఒంటెనూ నిశితంగా పరిశీలించారు.పోటీల్లో పాల్గొన్నవాటిలో ఇరవై ఒంటెలపై అనర్హత వేటు వేశారు. ఎందుకంటారా? తమ ఒంటెలు అందంగా కనిపించడానికి యజమానులు వాటికి బోటాక్స్ ఇంజెక్షన్లు ఇప్పించారు. బోటాక్స్ ఇంజెక్షన్లతో వాటి పెదవులు, చెక్కిళ్లు ప్రస్ఫుటంగా కనిపించేలా తీర్చిదిద్దించి మరీ పోటీకి తీసుకొచ్చారు. ఈ సంగతి కనిపెట్టిన న్యాయనిర్ణేతలు, అందాల పోటీల్లో కృత్రిమ సౌందర్యానికి చోటులేదని కరాఖండిగా తేల్చి చెప్పి, ఇరవై ఒంటెలను పోటీ బరి నుంచి తప్పించారు. -
సౌదీపై ఇరాన్ దాడుల్లో.. తెలంగాణ వాసి మృతి
న్యూఢిల్లీ: సౌదీ అరేబియాపై ఇరాన్ జరిపిన దాడుల్లో భారతీయుడొకరు ప్రాణాలు కోల్పోయారని విదేశాంగ శాఖ ప్రకటించింది. దీంతో, పశి్చమాసియా సంక్షోభం కారణంగా ఇప్పటివరకు వివిధ ఘటనల్లో చనిపోయిన భారతీయుల సంఖ్య ఆరుకు చేరుకోగా మరొకరు గల్లంతయ్యారని విదేశాంగ శాఖ అధికారి అసీమ్ మహాజన్ శుక్రవారం చెప్పారు. తాజా మరణానికి దారి తీసిన కారణాలను మాత్రం ఆయన వివరించలేదు.భారత్‌లోని మృతుడి కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతున్నామని, వారికి అవసరమైన అన్ని రకాల సాయాన్ని అందిస్తామని వివరించారు. ఈ నెల 18వ తేదీ రాత్రి రియాద్‌లోని లక్ష్యాలపై ఇరాన్ నాలుగు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. వీటిని సౌదీ గగనతల రక్షణ వ్యవస్థలు కూలి్చవేశాయి. రియాద్‌లోని ఓ రిఫైనరీ సమీపంలో ఈ క్షిపణుల శకలాలు పడ్డాయి. శకలాలు తగలడంతోనే భారతీయుడు చనిపోయి ఉంటారని భావిస్తున్నారు.కాగా మృతిచెందిన వ్యక్తి తెలంగాణకు మహాబూబాబాద్‌కు చెందిన రవిగోపాల్గా సమాచారం. దీనిపై వారి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ " 18 వతారీఖు రాత్రి. 9.30 గంటలకు చివరి సారిగా రవితో మాట్లాడాము 20 నిమిషాలు మాట్లాడిన అనంతరం కాల్ కట్ అయ్యింది. తిరిగి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. అక్కడే ఉన్న వేరేవారితోనూ మాట్లాడానికి ప్రయత్నించాము వారు సైతం కాల్లోకి రాలేదు" అని వారి కుటుంబసభ్యులు తెలిపారు.అయితే సౌదీపై జరిగిన దాడుల్లో రవి మరణించినట్లు మరుసటి రోజు రామ్ నివాస్ అనే వ్యక్తి ఫోన్ చేసి చెప్పినట్లు వారు పేర్కొన్నారు. కాగా కుటుంబంలో రవి ఒక్కరే ఉద్యోగం చేస్తారని అతని కుటుంబసభ్యులు తెలిపారు. అతనికి నాలుగేళ్ల కుమారుడని పేర్కొన్నారు. దయచేసి అతని మృతదేహాన్ని తమకు అప్పగించాలని తమకు పరిహారం ఇప్పించాలని కుటుంబసభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. -
రియాద్ పై ఇరాన్ దాడి తిప్పికొట్టిన సౌదీ
-
హెచ్చరించిన విధంగానే ఇరాన్ దాడి
గంటల వ్యవధిలో ముగ్గురు కీలక నేతలను కోల్పోయిన ఇరాన్ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతుంది. వార్నింగ్ ఇచ్చిన విధంగానే గల్ఫ్ దేశాలపై దాడులను ప్రారంభించింది. ఇందులో భాగంగా సౌదీ అరేబియా రాజధాని రియాద్‌పై నాలుగు బాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగించింది. అయితే వీటిని సౌదీ రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకుంది.సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం.. రియాద్ వైపు ప్రయోగించబడిన నాలుగు బాలిస్టిక్ మిసైళ్లు విజయవంతంగా అడ్డుకోబడ్డాయి.మిసైళ్లను అడ్డుకునే ప్రక్రియలో ఏర్పడిన శకలాలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో పడ్డాయి. అయితే ఇందులో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదని స్పష్టం చేసింది. కాగా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ గూఢచార మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్, ఆ దేశ కీలక సైనికాధికారి అలీ లారిజానీ, ఐఆర్‌జీసీకి చెందిన బసిజ్ పారామిలటరీ ఫోర్స్ కమాండర్ జనరల్ ఘోలమ్రెజా సులేమానీ మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా అమెరికా-ఇజ్రాయెల్ దళాలు బుషేర్ ఫ్రావిన్స్‌లోని ఇరాన్ నేచురల్ గ్యాస్ ఫీల్డ్ అయిన సౌత్ పర్స్‌పై కూడా దాడులు చేశాయి. వీటికి ప్రతీకారంగానే ఇరాన్ గల్ఫ్ దేశాల ఇంధన స్థావరాలపై దాడులు చేస్తామని హెచ్చరించింది. -
గల్ఫ్ ఉద్రిక్తతలు : సౌదీకు పాకిస్థాన్ బాసట
అమెరికా, ఇజ్రాయెల్ బీకర దాడులకు ప్రతిగా ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలో ప్రతీకార దాడులతో విరుచుకు పడుతోంది. దీంతో చమురు లభ్యతపై తీవ్ర సంక్షోభం నెలకొంది. ప్రపంచ ఇంధన ధరలపై ప్రపంచ వ్యాప్తం తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో, పాకిస్తాన్‌కు భారీ ఊరట లభించింది. పాక్‌కు ఇంధన అవసరాలకు మద్దతు ఇవ్వడానికి సౌదీ అరేబియా ముందుకు వచ్చింది. ఎప్పుడు, ఏ సమయంలోనైనా సౌదీ అరేబియాకుతాము అండగా ఉంటాం, ఇందులో ఎలాంటి సందేహం లేదని పాక్ బహిరంగంగా ప్రకటించింది. తద్వారా రక్షణ మరియు ఇంధన రంగాల్లో పాక్, సౌదీ మధ్య ఉన్న దశాబ్దాల కాలపు మైత్రిని మరింత బలోపేతం చేసుకుంటున్నాయి.పెరుగుతున్న ప్రపంచ ఇంధన ధరలు దాని ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి తెస్తున్నందున అవసరమైనప్పుడు సౌదీ అరేబియాకు ఖచ్చితంగా మద్దతు ఇస్తామని పాకిస్థాన్ ప్రకటించింది. గల్ఫ్ సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు భారీగా పెరిగిన వేళ, పాకిస్థాన్‌కు సౌదీ అరేబియా భారీ ఊరటనిచ్చింది. పాకిస్థాన్ ఇంధన అవసరాలను తీర్చడానికి చమురు మరియు డీజిల్ సరఫరా చేసేందుకు సౌదీ అరేబియా ఏర్పాట్లు చేసినట్టు పాకిస్థాన్ ప్రభుత్వ ప్రతినిధి ముషారఫ్ జైదీ మీడియా ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.ఇది ఇలా ఉంటే గత ఏడాది సెప్టెంబర్‌లో ఇరు దేశాలు కుదుర్చుకున్న రక్షణ ఒప్పందానికి ప్రస్తుత పరిస్థితులు ఒక చాలెంజ్‌గా మారాయి. ఈ ఒప్పందం ప్రకారం, సౌదీ రక్షణ కోసం పాకిస్థాన్ తన సైనిక సహకారాన్ని అందించాల్సి ఉంటుంది. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఇటీవల సౌదీ రక్షణ మంత్రితో భేటీ అయ్యారు. ఇరాన్ నుండి ఎదురవుతున్న క్షిపణి , డ్రోన్ దాడులను ఎదుర్కోవడానికి ఉమ్మడి రక్షణ ప్రణాళికలపై చర్చించారు. రక్షణ ఒప్పందంపై సంతకం చేయడానికి ముందే, తమ మధ్య సంబంధం పరస్పర మద్దతుపై ఆధారపడి ఉందని రెండు దేశాలు ఎల్లప్పుడూ ఒకరికొకరు అండగా ఉండాలనే సూత్రంపై పనిచేస్తున్నాయని జైదీ పేర్కొన్నారు.ఒకవైపు సౌదీకి మద్దతు ఇస్తూనే, మరోవైపు ఇరాన్ విదేశాంగ మంత్రితో కూడా పాకిస్థాన్ సంప్రదింపులు జరుపుతోంది. ప్రాంతీయ స్థిరత్వాన్ని కాపాడడమే తమ ప్రాధాన్యత అని పాకిస్థాన్ పేర్కొంది. -
ఇరాన్ వార్ యూటర్న్.. గల్ఫ్‌లో నీటి యుద్ధం మొదలైందా?
ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం నేపథ్యంలో కొత్త చర్చ తెరపైకి వచ్చింది. మూడో ప్రపంచ యుద్ధమే కనుక జరిగితే అది నీటి కోసమే అని పలువురు నిపుణులు చాలాకాలంగా చెబుతున్న క్రమంలో అది వాస్తవమే అనే విధంగా ఇరాన్ యుద్ధం టర్న్ తీసుకుంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఇరాన్ యుద్ధంలో భాగంగా నీటిశుద్ధి ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులు చూస్తుంటే తాగునీరు యుద్ధానికి లక్ష్యంగా మారుతుందనే విషయం స్పష్టమైంది. రెండు వైపుల వారు ఆయా దేశాల్లోని నీటి వనరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది.గల్ఫ్ దేశాల బలం చమురు అయితే.. బలహీనత నీరు. ఇరాన్-అమెరికా యుద్ధం గల్ఫ్ దేశ దుర్భలత్వాన్ని బయటపెట్టింది. ఎడారి వాతావరణం ఉన్న గల్ఫ్ దేశాల్లో నీటికొరత చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఇరాన్ యుద్ధంలో భాగంగా నీటిశుద్ధి ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి. తమ నీటి శుద్ధి ప్లాంట్‌పై దాడి చేశారని ఇరాన్ ఆరోపించగా, తమ ప్లాంట్‌పై ఇరాన్ దాడి చేసిందని బహ్రెయిన్ తెలిపింది. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైన తర్వాత గ్లోబల్ మార్కెట్లు ఆత్రుతగా పర్షియన్ గల్ఫ్ ఇంధన మౌలిక సౌకర్యాలను పరిశీలించడం ప్రారంభించాయి. అయితే యుద్ధం తీవ్రమవుతున్న కొద్దీ రెండు ప్రాంతాల్లో దుర్బలమైన తాగు నీటి అంశం అతిపెద్ద సమస్యగా ఉద్భవించింది. దీంతో రెండు వైపుల వారు ఆయా దేశాల్లోని నీటి వనరులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. దీనిలో భాగంగా నీటి శుద్ది ప్లాంట్లపై దాడులు ప్రారంభించారు. ఆయా దేశ పౌరులను తీవ్ర ఇక్కట్లలోకి నెట్టాలన్నది వారి వ్యూహంగా తెలుస్తోంది.పశ్చిమాసియాలోనే అధికం..గల్ఫ్ దేశాల్లో తాగునీటి కొరత అత్యంత తీవ్రంగా ఉంది. పశ్చిమాసియాలో మంచినీటి కొరత కారణంగా ఉప్పు శాతం ఎక్కువగా ఉన్న నీటిని శుద్ధి చేసి మంచినీటిగా మార్చేందుకు నీటి శుద్ధి ప్లాంట్లను (డీసాలినేషన్ ప్లాంట్స్.. ఉప్పునీటిని తాగునీటిగా మార్చే యంత్రాలు) ఆయా దేశాలు విస్తృతంగా ఏర్పాటు చేసుకున్నాయి. దీంతో ప్రపంచంలోని 60 శాతం నీటి శుద్ధి యూనిట్లు ఈ ప్రాంతాల్లోనే ఉన్నాయి. యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్ తదితర అరబ్ దేశాల వారు అత్యధికంగా వీటిపైనే ఆధారపడటంతో శత్రు దేశానికి ఇప్పుడు అవే అత్యంత విలువైన లక్ష్యాలుగా మారాయి. అలాగే ఇరాన్‌లోని ప్లాంట్లను అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకున్నాయి. కాగా, ఒక పెద్ద ప్లాంట్ దెబ్బతింటే కొన్ని రోజుల్లోనే రాజధానులు ఖాళీ చేయాల్సిన పరిస్థితి వస్తుందని అమెరికాకు చెందిన కొన్ని రహస్య నివేదికలు హెచ్చరించాయి.గల్ఫ్ దేశాలు ఆధారపడే స్థితి ఇలా.. కువైట్: 90% నీరు డీసాలినేషన్ ద్వారా మంచి నీరుయుఏఈ: 90% నీరు డీసాలినేషన్ ద్వారా తాగునీరు ఒమాన్: 86% నీరు డీసాలినేషన్ ద్వారా మంచి నీరు దొరుకుతుంది.బహ్రెయిన్: 80 శాతం.. అత్యధికంగా డీసాలినేషన్ మీద ఆధారపడుతోంది. సౌదీ అరేబియా: 70% నీరు డీసాలినేషన్ ద్వారా తాగు నీరు ఖతార్: 70 శాతం చిన్న దేశం కావడంతో నిల్వలు తక్కువ, ప్లాంట్లపై అధికంగా ఆధారపడే పరిస్థితి.నీటిపై యుద్ధ ప్రభావం.. యుద్ధం నేపథ్యంలో ప్లాంట్లకు ప్రమాదం జరిగి నీటి సరఫరా ఆగిపోతే, ఆహార సంక్షోభం మరింత పెరుగుతుంది. గల్ఫ్ దేశాలు 80–90% ఆహారాన్ని దిగుమతి చేసుకుంటాయి. నీరు లేకపోతే ఆహారం కూడా నిల్వ చేయలేరు. ఆరోగ్య బీమా కంపెనీలు యుద్ధ ప్రమాద కవరేజీ తొలగించడంతో సరుకు రవాణా కూడా ఆగిపోతోంది.ఇరాన్‌కు నష్టం తక్కువే.. ఇరాన్ తాగునీటి కోసం ప్రధానంగా డ్యామ్‌లు, భూగర్భ జలాలు మీద ఆధారపడుతుంది. అందువల్ల తీరప్రాంత డీసాలినేషన్ ప్లాంట్లపై దాడులు జరిగినా, ఇరాన్‌కు పెద్ద నష్టం ఉండదు. కానీ గల్ఫ్ దేశాలకు ఇది ప్రాణాంతక సమస్యగా ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాలు నీటి భద్రతను జాతీయ భద్రత స్థాయిలో చూడాల్సిన సమయం వచ్చింది. -
సౌదీ అరేబియాపై దాడి.. భారత్ స్పందన
పశ్చిమాసియాలో యుద్ధం నానాటికీ తీవ్రతరమవుతుంది. ఇరాన్, గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలతో పాటు జనావాసాలపై సైతం దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియాలో జరిగిన దాడి ఘటనపై అక్కడి భారత ఎంబసీ స్పందించింది. ఆ ఘటనలో భారతీయులెవరూ మృతిచెందలేదని ప్రకటించింది.ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడులు చేయడం భారత్‌కు తీవ్ర ఆందోళనకరంగా మారింది. మన దేశం నుంచి అధిక సంఖ్యలో ప్రజలు ఆ దేశాలలోకి జీవనోపాధి కోసం వలస వెళుతుంటారు. ప్రస్తుతం యుద్ధం జరుగుతుండడంతో వారి భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఈ అంశమై ఇది వరకే భారత ప్రధాని మోదీ గల్ఫ్ దేశాల అధినేతలతో ఫోన్లో సంభాషించారు. అక్కడి ఇండియా ఎంబసీలు సైతం తగిన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే సౌదీ అరేబియాలోని భారత్ రాయబార కార్యాలయం స్పందించింది." నిన్న సాయంత్రం ఆల్ఖర్జ్లో జరిగిన ప్రమాదంలో భారతీయులెవరూ మరణించలేదు. ఇది ఉపశమనం కలిగించే అంశం. ఈ ప్రమాదంలో మన దేశానికి చెందిన ఒక వ్యక్తి గాయపడ్డారు. అతనిని కౌన్సిలర్ షబీర్ కలిశారు. ఇది చాలా ప్రమాదకర మైన ఘటన" అని ఎక్స్‌లో పోస్ట్ చేసింది. అయితే నిన్న ఇరాన్ జరిపిన దాడుల్లో ఒక భారతీయుడితో పాటు బంగ్లాదేశ్ దేశస్థుడు మృతి చెందినట్లు సౌదీ అరేబియా పేర్కొనగా తాజాగా భారత్ దానిని ఖండించింది. -
సౌదీ అరేబియాపై ఇరాన్ బాంబుల వర్షం
-
యుద్ధకాండ.. ముదురుతున్న పశ్చిమాసియా కల్లోలం
దుబాయ్: పశ్చిమాసియాలో పోరు తారస్థాయికి చేరుతోంది. సుప్రీం నేత ఖమేనీ హత్యతో రెచ్చిపోయిన ఇరాన్ ప్రతీకార దాడుల తీవ్రతను నానాటికీ పెంచుతోంది. ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలపై మరింతగా విరుచుకుపడుతోంది. మంగళవారం సౌదీ అరేబియాలోని రియాద్‌లో ఉన్న అమెరికా దౌత్య కార్యాలయంపై డ్రోన్ దాడులకు దిగింది. దాంతో భారీగా మంటలంటుకుని కార్యాలయ భవనం దెబ్బ తిన్నట్టు సమాచారం. యూఏఈలో ఫుజైరాలోని చమురు కేంద్రంపైనా ఇరాన్ డ్రోన్ దాడికి దిగింది.ఖతర్‌లో అల్ ఉదెయిద్‌లోని అమెరికా వైమానిక స్థావరాన్ని రెండు క్షిపణులు తాకాయి. ఈ నేపథ్యంలో కువైట్, బహ్రెయిన్, ఇరాక్, ఖతర్, జోర్డాన్, యూఏఈల్లోని తమ దౌత్య కార్యాలయాల నుంచి సిబ్బందిని అమెరికా ఉపసంహరిస్తోంది. దాదాపు పశ్చిమాసియా దేశాల్లోని అమెరికన్లు తక్షణం ఆయా దేశాలను వీడాలని సూచించింది.ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా దాడులు రెండో రోజూ కొనసాగాయి. దాంతో ఇజ్రాయెల్ సైనిక దళాలు మంగళవారం దక్షిణ లెబనాన్‌లోకి ప్రవేశించి భూతల దాడులకు దిగడంతో పోరు కీలక మలుపు తిరిగింది. 80కి పైగా సరిహద్దు గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలాలని లెబనాన్ సూచించింది. ఇప్పటిదాకా 55 మందికి పైగా మరణించినట్టు లెబనాన్ పేర్కొంది. ఇజ్రాయెల్‌తో బహిరంగ యుద్ధానికి సిద్ధమని హెజ్బొల్లా ప్రకటించింది.రాత్రంతా దాడులే ఇరాన్ ఎయిర్, నేవీ డిఫెన్స్ వ్యవస్థలను ఇప్పటికే తుత్తునియలు చేసినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ‘‘పరిస్థితి చాలా దూరం వెళ్లింది. ఈ దశలో చర్చలకు ఆస్కారమే లేదు’’ అంటూ కుండబద్దలు కొట్టారు. అవసరమైతే ఇరాన్లో భూతల పోరుకు కూడా వెనకాడబోమని సంకేతాలిచ్చారు! దాడులను మున్ముందు మరింత తీవ్రతరం చేస్తామని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రకటించారు. అమెరికాతో కలిసి ఇరాన్‌పై సోమవారం రాత్రంతా ఇజ్రాయెల్ నిరంతరాయంగా దాడులు కొనసాగించింది. దాంతో బాంబులు, క్షిపణి దాడులతో టెహ్రాన్ దద్దరిల్లిపోయింది. నగరంలో ఎక్కడ చూసినా భారీగా వెలువడుతున్న మంటలు, ఎగసిపడుతున్న పొగ కనిపిస్తున్నాయి.ఇరాన్ అధ్యక్ష భవన ప్రాంగణంతో పాటు దేశ అత్యున్నత జాతీయ భద్రతా మండలి ప్రధాన కార్యాలయం తదితరాలపై పెద్దపెట్టున దాడులు జరిగాయి. యునెస్కో వారసత్వ కట్టడాల జాబితాలోని చారిత్రక గోలెస్తాన్ ప్యాలెస్ కూడా దాడుల్లో బాగా దెబ్బతింది. రివల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్జీసీ) కమాండ్ సెంటర్‌ను కూడా భస్మీపటలం చేసినట్టు అమెరికా ప్రకటించింది. కెర్మన్ ప్రావిన్సులో సైనిక స్థావరంపై జరిగిన దాడిలో 13 మంది సైనికులు మరణించినట్టు ఇరాన్ పేర్కొంది. ఇరాన్లో మృతులు 787కు చేరినట్టు స్థానిక రెడ్‌క్రాస్ సొసైటీ ప్రకటించింది. కువైట్‌పై ఆదివారం నాటి ఇరాన్ దాడుల్లో గాయపడ్డ మరో ఇద్దరు అమెరికా సైనికులు మంగళవారం మరణించారు. దాంతో ఇప్పటిదాకా మరణించిన అమెరికా సైనికుల సంఖ్య ఆరుకు పెరిగింది.సుప్రీం నేత ఎన్నికకు జరిగిన భేటీపై దాడిచాలామంది చనిపోయారు: ఇజ్రాయెల్ జెరూసలేం: ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌ను ఎన్నుకునేందుకు ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్’ సమావేశమైన భవనంపై ఇజ్రాయెల్, అమెరికా మంగళవారం రాత్రి భారీ స్థాయిలో బాంబు దాడులు జరిపాయి. ఇజ్రాయెల్‌తో పాటు ఇరాన్ స్థానిక మీడియా సంస్థలు కూడా దీన్ని ధ్రువీకరించాయి. కమిటీలోని 88 మంది సభ్యుల్లో చాలామంది దాడిలో చనిపోయినట్టు ఇజ్రాయెల్ వార్తా సంస్థ జెరూసలేం పోస్ట్ చెప్పుకొచ్చింది. ఇరాన్ మాత్రం ఆ వార్తలను ధ్రువీకరించలేదు. దాడి సమయంలో భవనంలో ఎవరూ లేరని కూడా వార్తలొస్తున్నాయి. ఇజ్రాయెల్ దాడుల భయంతో టెహ్రాన్‌లో కాకుండా దక్షిణాది నగరమైన కోమ్‌లో ఈ భేటీ జరిగినట్టు చెబుతున్నారు. దాడుల్లో పూర్తిగా దెబ్బతిన్న భవనం తాలూకు వీడియో ఫుటేజీ స్థానిక మీడియాలో దర్శనమిచ్చింది. హార్మూజ్ మూసివేత నిలిచిన చమురు రవాణా ప్రపంచ చమురు రవాణా లో 20 శాతం దాకా జరిగే కీలక హార్మూజ్ జలసంధిని మూ సేస్తున్నట్టు ఇరాన్ ప్రకటించింది. నిషేధాన్ని ఉల్లంఘించి ఆ మార్గం గుండా వెళ్లేందు కు ప్రయతి్నంచే నౌకలకు నిప్పు పెట్టి ముంచేస్తామని రివల్యూషనరీ గార్డ్స్ సలహా దారు బ్రిగేడియన్ జనరల్ ఇబ్రహీం జబ్బా రీ హెచ్చరించారు. దాంతో హా ర్మూజ్ గుండా చమురు రవా ణా పూర్తిగా నిలిచిపోయింది. 220 పై చిలుకు చమురు నౌకలు అక్కడికి సమీపంలోనే ఆగిపోయాయి. ఈ పరిణామంతో అంతర్జాతీయంగా చమురు ధరలకు మరింతగా రెక్క లు రావడం ఖాయ మని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.నతాంజ్‌పై దాడులు నిజమే: ఐఏఈఏ ఇరాన్‌లోని నతాంజ్ అణుకేంద్రంపై దాడులు నిజమేనని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) పేర్కొంది. వాటిలో అణు కేంద్రానికి స్వల్ప నష్టం వాటిల్లినట్టు ధ్రువీకరించింది. అయితే అక్కడ అణు ధార్మికతలో అసాధారణ పెరుగుదల వంటిదేమీ నమోదు కాలేదని తెలిపింది. సైప్రస్‌కు బ్రిటన్ యుద్ధ నౌకలండన్: పశ్చిమాసియాలో తాజా పరిణామాల నేపథ్యంలో సైప్రస్‌కు ఒక యుద్ధ నౌకతో పాటు పలు సైనిక హెలికాప్టర్లను తరలిస్తున్నట్టు బ్రిటన్ ప్రకటించింది. ఎయిర్ డిఫెన్స్ డిస్ట్రాయర్ యుద్ధ నౌక హెచ్ఎంఎస్ డ్రాగన్ ఇప్పటికే సైప్రస్కేసి కదిలిందని ప్రధాని కియర్ స్టార్మర్ తెలిపారు. సైప్రస్‌లోని బ్రిటన్ సైనిక స్థావరంపై ఇరాన్ తాజాగా డ్రోన్ దాడికి దిగడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. -
భారతీయులను రప్పించే యత్నాలు షురూ
న్యూఢిల్లీ: గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న భారతీయులను రప్పించేందుకు కేంద్రం ప్రయత్నాలు మొదలెట్టింది. ఇందుకోసం మంగళవారం నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డా నుంచి పది ఇండిగో విమాన సరీ్వసులను ఆరంభించనుంది. జెడ్డా నుంచి హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్‌లకు సర్వీసులు ఆరంభం కానున్నాయి. ‘‘ప్రత్యేక విమానాల్లో సౌదీ నుంచి భారతీయులను మంగళవారం నుంచి తీసుకొస్తాం. జెడ్డాలోని ఇండియా కాన్సులేట్ జనరల్‌తో ఇండిగో సమన్వయంతో పనిచేస్తుంది’’ అని పౌర విమానయాన శాఖ పేర్కొంది. వారిని వీలైనంత త్వరగా వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రయతి్నస్తున్నామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. జల్నా ఎంపీ కల్యాణ్ కాలే, మరో 9 మంది పర్యాటకులు దుబాయ్, అబూదాబిలో చిక్కుకున్నారని ఎంపీ సోదరుడు జగన్నాథ్ చెప్పారు. పుణె సమీప పింప్రీ చింద్వాడ్లోని ఇందిరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌కు చెందిన నలుగురు అధ్యాపకులు, 84 మంది విద్యార్థులు దుబాయ్‌లో చిక్కుకుపోయారు. ఫిబ్రవరి 26న పుణె జిల్లా నుంచి వెళ్లిన 300 మంది ప్రయాణికులూ దుబాయ్‌లోనే చిక్కుకున్నారు. కన్నడిగులను ఎలాగైనా వెనక్కి తీసుకురావాలని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కోరారు. -
40 దేశాల కోళ్లు, గుడ్లపై సౌదీ అరేబియా నిషేధం.. ఈ జాబితాలో భారత్!
న్యూఢిల్లీ: అరబిక్ కంట్రీ సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. 40 దేశాలకు చెందిన కోళ్లు, గుడ్లపై పూర్తిగా నిషేధం విధించింది. ప్రజారోగ్యం, ఆహార భద్రత వంటి తదితర కారణాలతో 40 దేశాల కోళ్లు, గుడ్ల దిగుమతులపై నిషేధం విధించింది. ఈ నిషేధిత జాబితాల భారత్ కూడా ఉంది. ఇటీవల కాలంలో కోళ్లకు వస్తున్న రోగాల కారణంగా సౌదీ అరేబియా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని సౌదీ అరేబియా డ్రగ్ అథారిటీ(ఎస్ఎఫ్డీఏ) స్పష్టం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆరోగ్య పరిణామాలతో పాటు అంటు వ్యాధులు కూడా ఎక్కువగా ఉండటంతో సౌదీ అరేబియా ఈ నిర్ణయం తీసుకుంది. 40 దేశాల ఫౌల్ట్రీ, గుడ్లపై ఈ నిషేధం అమల్లో ఉంటుందని ఎస్ఎఫ్డీఏ పేర్కొంది. 2004 నుంచి పలు దేశాలపై ఈ నిషేధం అమల్లో ఉండగా, అందులో ఇప్పుడు భారత్ కూడా చేరింది. ఈ జాబితాలో భారత్‌తో పాటు అఫ్గనిస్తాన్, అజర్బైజాన్, జర్మనీ, ఇండోనేషియా, ఇరాన్, బోస్నియా, హర్జేగోవినా, బల్గేరియా, బంగ్లాదేశ్, తైవాన్, డిజిబౌటి, దక్షిణాఫ్రికా, చైనా, ఇరాక్, ఘనా, పాలస్తీనా, వియత్నాం, కంబోడియా, కజక్‌స్తాన్, కామెరూన్, దక్షిణ కొరియా, లావోస్, లిబియా, మయన్మార్, ద యునైటెడ్ కింగ్డమ్, ఈజిప్టు, మెక్సికో, మంగోలియా, నేపాల్, నైగర్, నైజీరియా, హాంకాంగ్, జపాన్, బుర్కినా ఫాసో, సెర్బియా, స్లోవెనియా, ఇవారీ కోస్ట్ తదితర దేశాలున్నాయి. భారత పౌల్ట్రీపై తీవ్ర ప్రభావం?ఇది భారత పౌల్ట్రీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. భారతీయ గుడ్లు, కోడి ఉత్పత్తుల ప్రధాన మార్కెట్లలో సౌదీ అరేబియా ఒకటి. ఈ నిషేధం వల్ల భారతీయ ఎగుమతిదారులు తీవ్ర ప్రభావం ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎగుమతి ఆగిపోవడంతో దేశీయ మార్కెట్లో గుడ్లు, కోడి మాంసం సరఫరా పెరుగుతుంది. అధిక సరఫరా కారణంగా రైతులు, ఉత్పత్తిదారులు తక్కువ ధరలకు అమ్మకాలు చేయాల్సి రావచ్చు. -
గిఫ్ట్‌గా 24 క్యారెట్ల బంగారు బిస్కెట్లు..! ఎక్కడంటే..
బంగారం ధర ఏ రేంజ్లో ఉందంటే..కొనాలనే ఆలోచన కూడా మనసులోకి రావడం లేదు. అంతగా భయపెడుతున్నాయ్ దాని ధరలు. అలాంటిది ఇక్కడొక పెళ్లి వేడుకలో ఏకంగా 24 క్యారెట్ల బంగారు బిస్కెట్లను గిఫ్ట్‌గా అందిస్తున్నారు. ఎంత ధనవంతులైనా..బంగారం గిఫ్ట్‌గా ఇవ్వడమా..?! అని సందేహం వస్తుంది కదా..!. కానీ ఇది నమ్మక తప్పని నిజం. ఈ విచిత్ర ఘటన సౌదీ అరేబియాలో చోటు చేసుకుంది. ఒక వివాహంలో వధువు కుటుంబం వరుడి కుటంబానికి బంగారు బిస్కెట్లను బహుమతిగా ఇస్తోంది. అవి కూడా 24 క్యారెట్ల బంగారు బిస్కెట్లను ఏదో చాక్లెట్లను పంచినట్లుగా ఇస్తున్న తీరు చూస్తే మతిపోతుంది. విలాసవంతమైన పెళ్లిళ్లు ఎన్నో చూసుంటాం గానీ..ఇలా బంగారు బిస్కెట్లను బహుమతులుగా ఇవ్వడg ఇదే తొలిసారేమో కాబోలు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. 33 సెకన్ల ఆ వీడియో క్లిప్‌లో ఒక వ్యక్తి ఒక బాక్స్ నిండుగా బంగారు బిస్కెట్లను తీసుకొచ్చి ..అక్కడున్న మగవాళ్ల ముందు పెట్టడం..వాళ్లు తీసుకోవడం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే నెటిజన్లు అవి బంగారం కాదని వాదిస్తున్నారు. మరికొందరు దీనిని దుబారా లేదా తమ ఐశ్వర్యాన్ని ప్రదర్శించుకోవడంగా విమర్శిస్తే..చాలామంది మాత్రం..బంగారు రేకుతో చుట్టబడిన లగ్జరీ చాక్లెట్లని, మధ్యప్రాచ్యంలోని కొన్ని ప్రాంతాలలో, ముఖ్యంగా వివాహాలు, పండుగ సమావేశాల ఇలాంటి చాక్లెట్లని పంచడం ఆచారమని పేర్కొనడం గమనార్హం. అలాగే ఆరేబియాలో గోల్డ్ రేకుతో చుట్టబడిన పాచీ వంటి లగ్జరీ చాక్లెట్ బ్రాండ్లు బాగా ఫేమస్ కూడా. దాంతో చాలామంది అవి బంగారం కాదని తేల్చి చేప్పేస్తుండటం గమనార్హం.Saudi wedding ceremonyBride’s brother offers 24 karat Gold biscuits to Groom’s family 😳pic.twitter.com/2lOAZwUhoi— Frontalforce 🇮🇳 (@FrontalForce) February 11, 2026 (చదవండి: ఆ పెంగ్విన్ని చూసి కన్నీళ్లొచ్చేశాయ్..! ఆలుమగలకు అసలైన అర్థం..) -
సౌదీ కీలక నిర్ణయం.. ఒంటెలకు పాస్‌పోర్టు
సౌదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట నుంచి ఆ దేశంలోని ఒంటెలకు ప్రత్యేక ఫోటోతో కూడిన పాస్‌పోర్టులు మంజూరు చేయనున్నట్లు తెలిపింది. ప్రపంచంలో సౌదీ ఒంటెలకున్న ప్రత్యేకతను తెలియజేయడానికే ఈ ప్రత్యేక ప్రాజెక్టుకు చేపట్టనున్నట్లు అక్కడి మంత్రిత్వశాఖ తెలిపింది.సౌదీ విజన్ 2030లో భాగంగా అక్కడి సాంస్కృతిక చిహ్నామైన ఒంటెలకు ప్రత్యేక గుర్తింపు కలిపించనున్నట్లు అక్కడి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ గుర్తింపుతో ఆ దేశంలో ఒంటెల పెంపకం రంగం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొంది. ఈ పాస్‌పోర్టులో మైక్రోచిప్ నెంబర్, దాని పేరు, పుట్టిని తేదీ, రంగు, జాతితో పాటు ఆ వివరాలిచ్చిన పశువైద్యుని సంతకం కూడా ఉండనున్నట్లు అక్కడి ప్రభుత్వం పేర్కొంది.దీనివల్ల ఒంటెలకు సంబంధించిన యజమాన్య హక్కుల విషయంలో వివాదం తలెత్తదని అంతేకాకుండా వాటికి ఆరోగ్యపరమైన విషయాలు తెలుసుకోవడం సులభతరం అవుతుందని పేర్కొన్నారు. ఈ చర్యలతో అంతర్జాతీయ మార్కెట్లో సౌదీ ఒంటెలకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని అక్కడి మంత్రిత్వ శాఖ తెలిపింది. -
అంబటి, జోగి ఇళ్లపై దాడి.. ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ
వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై టీడీపీ గూండాల దాడిని వైఎస్సార్సీపీ సెంట్రల్ సౌదీ అరేబియా ఎన్ఆర్ఐ వింగ్ తీవ్రంగా ఖండించింది. ప్రపంచంలోని వివిధ దేశాల్లో తెలుగు ప్రజలు.. ఏపీలో జరుగుతున్న చంద్రబాబు సర్కార్ అరాచకాలను గమనిస్తున్నారని పేర్కొంది. కూటమి సర్కార్.. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, అభివృద్ధిని అడ్డుకుందని.. కేవలం రాజకీయ కక్ష సాధింపులకే ప్రాధాన్యం ఇస్తోందని వైఎస్సార్సీపీ సెంట్రల్ సౌదీ అరేబియా ఎన్ఆర్ఐ బృందం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుపేదలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై జరిగిన విధ్వంసం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని పార్టీ కన్వీనర్ సయ్యద్ రబ్బానీ మండిపడ్డారు. ఈ అక్రమ చర్యలకు పాల్పడిన ప్రతి ఒక్కరూ భవిష్యత్తులో చట్టం ముందు తప్పకుండా జవాబుదారీగా నిలబడాల్సిందేనన్నారు. న్యాయం తప్పక గెలుస్తుందని మేము దృ ఢంగా విశ్వసిస్తున్నామన్నారు. ఇవాళ వైఎస్ జగన్ గుంటూరు పర్యటనకు మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. ప్రజలు ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ముందడుగు వేసి.. ఈ అన్యాయ ప్రభుత్వాన్ని రాజకీయంగా ఎదుర్కొని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. వైఎస్ జగన్ చూపిన సంక్షేమ మార్గమే.. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అని.. మేమంతా ఆయన వెంటే ఉంటామని సయ్యద్ రబ్బానీ ఒక ప్రకటనలో తెలిపారు. -
31 ఏళ్ల తర్వాత ఫిబ్రవరిలో రంజాన్.. ఉపవాసం దీక్ష ఎప్పుడంటే?
ముస్లింలందరూ పవిత్రంగా భావించే రంజాన్ మాసం ఈ ఏడాది ఫిబ్రవరి 18 లేదా 19వ తేదీన ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీంతో, అదే రోజు నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే, దాదాపు 31 ఏళ్ల తర్వాత రంజాన్ మాసం ఫిబ్రవరిలో ప్రారంభం కానుండటం విశేషం. చివరగా 1995లో ఫిబ్రవరి ఒకటో తేదీన రంజాన్ మాసం మొదలైంది. మళ్లీ 2026లో ఫిబ్రవరి నెలలో రంజాన్ మాసం ప్రారంభమవనుంది. ఇక, ఇస్లాం మతాన్ని అనుసరించే ముస్లింలకు రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనది. ఈ మాసంలో ప్రపంచవ్యాప్తంగా ముస్లిలందరూ ఉపవాస దీక్షలను ఆచరిస్తారు. ఈ రంజాన్ మాసం నెలవంక దర్శనం తర్వాతే ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మన దేశంలో ఫిబ్రవరి 18 లేదా 19వ తేదీన రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. దీంతో, రంజాన్ మార్చి 20 లేదా 21 తేదీన వచ్చే అవకాశం ఉంది. ఇస్లాం మతం ఆచారాల ప్రకారం, ఉపవాసాన్ని విరమించడానికి, ఉపవాసం ప్రారంభించే ముందు సెహ్రీ, ఇఫ్తార్ నిర్వహిస్తారు.ఇస్లాం క్యాలెండర్ ప్రకారం, రంజాన్ నెలవంక దర్శనం తర్వాతే ప్రారంభమవుతుంది. ముస్లిం మత విశ్వాసాల ప్రకారం రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలను పాటించాలి. వీటిని మూడు అష్రాలుగా విభజించారు. తొలి పది రోజుల ఉపవాస కాలాన్ని రహ్మత్ అని, రెండోసారి వచ్చే 10 రోజుల కాలాన్ని బర్కత్ అని, చివరి 10 రోజుల్లో వచ్చే ఉపవాస కాలాన్ని మగ్ఫిరత్ అని అంటారు. ఈ సందర్భంగా రంజాన్ మాసాన్ని ముస్లింలు ఎందుకని పవిత్ర మాసంగా పరిగణిస్తారు. సూర్యోదయానికి ముందు సెహ్రీ, సూర్యాస్తమయం తర్వాత ఇఫ్తార్ ఎందుకు పాటిస్తారు.అయితే, రంజాన్ అనేది ఓ నెల పేరు. మనకు జనవరి నుండి డిసెంబర్ వరకు ఉన్నట్లే. రంజాన్ లేదా రమదాన్ అనేది ముస్లిం క్యాలెండర్లో తొమ్మిదో నెల. ముస్లింలు ఆచరించేది చంద్రమాన క్యాలెండర్. ముస్లిం క్యాలెండర్ అనేది ఎలా ఏర్పడిందంటే.. మహమ్మద్ ప్రవక్త మక్కా నుండి మదీనా వెళ్లడం జరిగింది. దీన్నే హిజ్రత్ అని కూడా అంటారు. క్రీస్తు శకం లేదా సామాన్య శకం 622లో ఇది జరిగినట్లు చెబుతారు. దీన్నే హిజ్రీ శకం అని అంటారు.మొదటి నెల మొహరంక్రీస్తు శకం లేదా సామాన్య శకం 638లో ఈ ఇస్లామిక్ క్యాలెండర్ ప్రారంభమైనట్టు చరిత్ర చెబుతోంది. ఈ క్యాలెండర్ ప్రకారం మొదటి నెల మొహరం, రెండో నెల సఫర్, మూడో నెల రబీ ఉల్ - అవ్వల్, నాలుగో నెల రబీ ఉల్ -ఆఖిర్, ఐదో నెల జమాది ఉల్ - అవ్వల్, ఆరో నెల జమాది ఉస్- సాని, ఏడో నెల రజబ్, ఎనిమిదో నెల షాబాన్, తొమ్మిదో నెల రంజాన్, పదో నెల షవ్వాల్, పదకొండో నెల జుల్ - ఖాదా, పన్నెండో నెల జుల్ - హిజ్జా. అయితే తొమ్మిదో నెల రంజాన్. ఈ నెలలోనే పవిత్ర ఖురాన్ అవతరించిందని ముస్లిం పండితులు చెబుతారు. అందుకే ఈ రంజాన్ నెలను పవిత్ర మాసంగా, పవిత్ర పండుగగా ప్రతీ ముస్లింలు ఆచరిస్తారు. ఈ పండుగనే ఈద్-ఉల్-ఫిత్ర అని కూడా పిలుస్తారు. -
సౌదీ, ఇజ్రాయెల్‌లకు అమెరికా ఆయుధాలు
వాషింగ్టన్: ఇజ్రాయెల్, సౌదీ అరేబియాలకు భారీగా ఆయుధాలను విక్రయించేందుకు అమెరికా సిద్ధమైంది. ఇజ్రాయెల్‌కు 667 కోట్ల డాలర్లు, సౌదీకి 900 కోట్ల డాలర్ల విలువైన అత్యాధునిక ఆయుధాలను పెద్ద మొత్తంలో విక్రయించేందుకు ట్రంప్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.ఇరాన్‌పై అమెరికా సైనిక దాడులు చేసే అవకాశం ఉందన్న వార్తలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. శుక్రవారం ఈ విషయాన్ని కాంగ్రెస్‌కు తెలిపిన విదేశాంగ శాఖ, ఆ వెంటనే ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. విదేశాంగ విధానానికి అనుగుణంగా, అమెరికా ప్రయోజనాలరీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో తెలిపింది. సౌదీకి విక్రయించే వాటిలో 730 పేట్రియాట్ క్షిపణులు, సంబంధిత పరికరాలున్నాయి. వీటితో సౌదీ అరేబియా క్షిపణి రక్షణ వ్యవస్థ మెరుగుపడుతుందని తెలిపింది. అదేవిధంగా, 30 అపాచీ అటాక్ హెలికాప్టర్లు, సంబంధిత సామగ్రి, 3,250 లైట్ టాక్టికల్ వాహనాలను ఇజ్రాయెల్‌కు విక్రయించనున్నామని వివరించింది. -
సౌదీలో వారంలో 18,200 మంది అరెస్ట్.. ఎందుకో తెలుసా?
సౌదీ అరేబియా చట్టాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోనే అత్యంత కఠిన చట్టాలు అమలు చేసే దేశంలో సౌదీ ముందు వరుసలో ఉంటుంది. తాజా నివేదికలు సైతం అదే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. కేవలం ఒక్క వారంలోనే ఇమ్మిగ్రేషన్ చట్టాలు ఉల్లంఘించినందుకు 18 వేలకు పైగా కార్మికులను అరెస్టు చేసినట్లు అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు తెలిపారు.గతవారం సౌదీ అరేబియాలో ఇమ్మిగ్రేషన్ అధికారులు భారీ స్థాయిలో ఆపరేషన్ చేపట్టి 18,200 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 11,422 మంది వలసదారుల చట్టాలను ఉల్లంఘించినందుకు అరెస్టు చేసినట్లు తెలిపారు. 3,858 మందిని సరిహద్దు భద్రతా చట్టాలను 3,951 మంది కార్మిక చట్టాలు అతిక్రమించినట్లు పేర్కొన్నారు. వీరితో పాటు అక్రమంగా సౌదీలోకి ప్రవేశించడానికి యత్నించిన 2,827మందిని బంధించినట్లు తెలిపారు. అయితే ఇదివరకే 14,451 మందిని ఇప్పటికే దేశం నుంచి బహిష్కరించినట్లు అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు పేర్కొన్నారు. చట్టాలను అతిక్రమించిన వారిలో దాదాపు 53 శాతం ప్రజలు ఇథియోపియా దేశానికి చెందిన వారు కాగా 46 శాతం మంది యెమెన్‌కు చెందిన వారు. సౌదీలో చట్టాలను అతిక్రమించిన వారికి ఆశ్రయం కల్పించినా ఏదైనా సహాయం చేసినా తీవ్ర నేరంగా పరిగణిస్తారు. వారికి జైలుశిక్ష వేయడంతో పాటు వారి ఆస్తులు జప్తుచేస్తారు. అయితే ఇటీవల సౌదీలో పనిచేస్తున్న ఓ భారతీయుడు ఆ దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వ్యక్తికి లిప్ట్ ఇచ్చాడు. ఆ విషయం అతనికి తెలియదు. అయితే ఆ సమయంలోనే భద్రతా అధికారులు తనిఖీలు జరిపగా ఆ విదేశీయుడు అక్రమంగా సౌదీలోకి ప్రవేశించినట్లు తేలింది. దీంతో అక్రమంగా ప్రవేశించిన వ్యక్తితో పాటు అతనికి లిఫ్ట్ ఇచ్చినందుకు ఆ భారతీయున్ని అరెస్టు చేశారు. అనంతరం అతడి ఉద్యోగం సైతం పోయింది.దీంతో ఆ బాధితుడు ఇండియాకు తిరిగి వచ్చాడు. కనుక జీవనోపాధి కోసం సౌదీ వెళ్లేవారు అక్కడి చట్టాలపై అవగాహనతో ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. -
సౌదీలో కొత్త స్మార్ట్ సిటీ.. టెక్నాలజీ, ప్లానింగ్ హైలైట్
సౌదీ అరేబియా.. అత్యంత ధనిక దేశం.. చమురు నిల్వలకు కొదవలేదు. బంగారపు కొండలూ ఉన్నాయి. మక్కాలాంటి పవిత్ర స్థలం ఉండటంతో ప్రపంచ దేశాలకు చెందిన కోట్లాది మంది ముస్లింలు పర్యటిస్తుంటారు. సాంప్రదాయాలకు అధిక విలువనిస్తూ.. మత పరమైన రాజ్యంగా గుర్తింపు పొందిన సౌదీ అరేబియాలో ఓ కొత్త నగరం సిద్ధమవుతోంది. నగరం సిద్ధం కావడమేంటా? అని ఆశ్చర్యపోతున్నారా?. అవును.. నియోమ్ సిటీగా దీనికి నామకరణం చేశారు.నియోమ్ స్మార్ట్ సిటీ నిర్మాణానికి సౌదీ ప్రభుత్వం నాంది పలికింది. ప్రపంచంలోనే అత్యాధునిక, అధునాతన టెక్నాలజీతో ఆ పట్టణాన్ని తయారు చేస్తున్నారు. ఆ సిటీ తయారీ కోసం కొన్ని వేల కంపెనీలు రేయింబవళ్లు పని చేస్తున్నాయంటే సిద్ధమవుతున్న ఆ సిటీ ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టమే.. వాస్తవంగా ఆ నగరం చూడటానికి ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాలో భాగంలా కనిపిస్తుంది. అసలు ఆ నగరానికి సంబంధించిన అద్భుతమైన ప్రపోజల్ పరిశీలిస్తే.. ఈ నగరం నిజంగా రెడీ అవుతుందా?. ఇది సాధ్యమేనా?. ఈ డిజైన్‌లో నిజంగా ఏ ప్రయోజనాలున్నాయి?. ఎలాంటి నష్టాలు ఉంటాయి?. ఇలాంటి మెగా ప్రాజెక్ట్ ప్రపంచంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అనుమానాలు తలెత్తడం సహజమే.సౌదీ అరేబియా దేశం పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేవి రెండు అంశాలు.. ఒకటి ఎడారి.. రెండోది చమురు నిల్వలు. ఎందుకంటే.. ఈ దేశం ఎక్కువగా ఎడారులతో చుట్టుముట్టి... సౌదీలో ఎటు చూసినా సాధారణ ఎడారి వాతావరణం కనిపిస్తుంది. ఎడారి దేశాన్ని.. ప్రపంచంలోనే అతి పెద్ద పర్యాటక సిటీగా మార్చాలనే ఆలోచనతో ‘నియోమ్’ అనే స్మార్ట్ సిటీని నిర్మించాలని సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ నిర్ణయించుకున్నారు. తన దేశంలోని ఒక పెద్ద ప్రాంతంలో ఆ సిటీని డెవలప్ చేయాలని దానికి ‘నియోమ్’ సిటీ అని నామకరణం చేశారు. నియోమ్ అనేది ఒక స్మార్ట్ సిటీ మాత్రమే కాదు.. ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్ పేరు.3/15 NEOMThe $1.5 trillion project isn't projected to be complete until at least 2045.This Megacity Neom is currently using 20% of all the steel in the world. pic.twitter.com/3QPjgfs6eP— ZOYA ✪ (@HeyZoyaKhan) December 8, 2024సౌదీ అరేబియాలో ఉత్తర–పశ్చిమ భాగంలో రెడ్ సీ ఉత్తరాన ఉన్న ప్రాంతాన్ని ఈ సిటీ నిర్మాణానికి ఎంచుకున్నారు. సిటీ పరిమాణం దాదాపు ఉత్తరాఖండ్ రాష్ట్ర పరిమాణానికి సగానికి సమానం అని చెప్పవచ్చు. అసలు సౌదీలో అదే ప్రాంతాన్ని ఎంచుకోవడానికి కారణమేంటంటే అక్కడి వాతావరణం సౌదీ దేశంలో ఉండే వేడి వాతావరణంగా కాకుండా నార్మల్‌గా ఉంటుంది. ఆ సిటీకి నియోమ్ పేరు పెట్టడానికి కారణాలేంటని విశ్లేషిస్తే... ప్రిన్స్ పేరు మహమ్మద్ బిన్ సల్మాన్ పేరు నుంచి అరబిక్ భాష ఆధారంగా అక్షరాలు సేకరించినట్లు సమాచారం.నియోమ్ సిటీ సౌదీ అరేబియాలోని అత్యంత ఎత్తైన పర్వత ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ శీతాకాలంలో ఉష్ణోగ్రతలు 0°C కంటే తక్కువకు పడిపోతాయి. ఇక్కడి మంచును కూడా వినియోగంలోకి తీసుకోనున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే.. దీని డిజైన్. 170 కిలోమీటర్ల పొడవైన ఒక లైన్. ఈ నగరం 200–500 మీటర్ల ఎత్తైన స్కై స్క్రేపర్ల మధ్య నిర్మించనున్నారు. ఇవి లీనియర్ ఫార్మ్‌లో ఉంటాయి. ఈ నగరం బయట వాతావరణం నుండి పూర్తిగా సంబంధం లేకుండా లోపలే స్వయం సమృద్ధిగా ఉండేలా డిజైన్ చేస్తున్నారు. న్యూయార్క్ నగర పరిమాణం కంటే దాదాపు 20 రెట్లు పెద్ద నగరం ఇది. 26,500 చదరపు కిలోమీటర్లు.. 10,500 చదరపు మైళ్ల వైశాల్యంలో ఈ నగరం సిద్ధమవుతోంది. కాబట్టి ఫుట్‌ప్రింట్ చాలా పెద్దది. నగరంలో మల్టిపుల్ లేయర్లు ఉంటాయి. పార్కులు, గ్రీన్ స్పేస్‌లు ఉంటాయి. 170 కిలోమీటర్ల పొడవైన లైన్ కావడంతో హై-స్పీడ్ రవాణా వ్యవస్థను వినియోగిస్తున్నారు.అయితే ఈ ప్రాజెక్ట్‌లో సమస్యలు కూడా ఉన్నాయి. అందులో ప్రధాన సమస్య ఫైనాన్స్. కొన్ని నివేదికల పరిశీలనల ఆధారంగా ఈ ప్రాజెక్ట్ 2050 వరకు కూడా పూర్తికాకపోవచ్చు. సిటీ నిర్మాణానికి మొత్తం ఖర్చు 1 ట్రిలియన్ డాలర్ల దాకా.. అంటే ఇండియన్ కరెన్సీలో 85 లక్షల కోట్ల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. దానికోసం సౌదీ వద్ద వనరులు సిద్ధంగా లేకపోవడంతో పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు.. ప్లానింగ్‌కు అనుగుణంగా వినియోగించాల్సిన టెక్నాలజీ కూడా ఓ సవాలుగా మారింది. నియోమ్ సిటీలో ఒక చివర నుండి మరో చివర వరకు 20 నిమిషాల్లో ప్రయాణం చేయాలని నిర్ణయించారు. అంటే ప్రతి గంటకు 500 కంటే ఎక్కువ వేగం ఉండాలి.. కానీ ఇంత వేగం ఇచ్చే టెక్నాలజీ ఇప్పటివరకు లేదు. 2015లో జపాన్‌లో మాగ్లేవ్ ట్రైన్ టెస్ట్ రన్లో గంటకు 603 కిలోమీటర్ ప్రయాణించినప్పటికీ.. రెగ్యులర్ ఆపరేషన్లలో గంటకు 430 కిలోమీటర్లు మాత్రమే వేగం ఉంటుంది.మరో విషయం ఏమిటంటే నియోమ్ సిటీలో 500 మీటర్ల ఎత్తైన గాజుతో కప్పే భవనాలను నిర్మించడం. దాని కోసం తక్కువ మోతాదులో కార్బన్ మెటీరియల్స్ వినియోగించడం దాదాపు అసాధ్యం. ఓవరాల్‌గా సిటీ నిర్మాణంతో స్థలం ఆదా అవుతున్నప్పటికీ.. సమస్యలు పెరిగే అవకాశముంది. ఇక సౌదీ ప్రజలు ఇన్ని సవాళ్లను అధిగమించినా, ప్రజలు నిజంగా ఇక్కడ నివసించాలనుకుంటారా? అనేదీ ఇంకా ప్రశ్నగానే మిగిలి ఉంది. -
సౌదీ కఠిన చట్టాలు.. వలస కార్మికుల బహిష్కరణ
సౌదీ అరేబియా చట్టాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కఠినమైన షరియత్ నియామాలను అమలు చేసే ఆ దేశంలో చిన్న తప్పుచేసినా శిక్షలు తీవ్రంగా ఉంటాయి. తాజాగా ఇమ్మిగ్రేషన్, కార్మిక భద్రతా చట్టాలను ఉల్లంఘించిన 14 వేలకు పైగా కార్మికులను సౌదీ నుండి బహిష్కరించినట్లు అక్కడి మీడియా కథనాలు పేర్కొన్నాయి.ఇమ్మిగ్రేషన్ చట్టం ప్రకారం వివిధ చట్టాలు ఉల్లంఘించిన 14,621 విదేశీ కార్మికులను దేశం నుంచి బహిష్కరించినట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. వీరితో పాటు చట్టాలు ఉల్లంఘించిన 18,054 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. అరెస్టైయిన వారిలో 3,853 మందిని చట్టాలు పాటించనందుకు అదుపులోకి తీసుకోగా సరిహద్దు భద్రతా నియమాలను ఉల్లంఘించినందుకు 2,853మంది మందిని, అక్రమంగా దేశంలోకి చొరబడే యత్నం చేసినందుకు 1,491 మంది విదేశీయులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. వీరిలో అధికంగా ఇథియోపియన్లు 59 శాతం, యెమెన్ పౌరులు 40శాతం ఉన్నట్లు పేర్కొన్నారు.కాగా ఇటీవల అక్రమంగా సౌదీలోకి ప్రవేశించిన వ్యక్తికి అక్కడే పనిచేసే ఓ భారతీయుడు అతని సమాచారం తెలియక లిప్ట్ ఇచ్చాడు. అనంతరం అధికారులు అతనిని పట్టుకున్నారు. దీంతో అక్రమంగా ప్రవేశించిన వ్యక్తికి లిఫ్ట్ ఇచ్చాడని అతనిని జైలులో వేశారు. అనంతరం అతని ఉద్యోగం సైతం ఊడింది. కనుక సౌదీలో ఉండే విదేశీ కార్మికులు అప్రమత్తంగా ఉండాలని పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని అక్కడ ఉండే భారతీయులు సూచిస్తున్నారు. -
సౌదీలో అపరిచితుడికి లిఫ్ట్ ఇస్తే.. ఉన్న ఉద్యోగం ఊడింది
"కాపురం కాపాడడానికి పోతే కాలు తెగింది" అన్న నానుడి ఈ బాధితుడి వ్యవహారంలో సరిగ్గా సరిపోతుంది. పాపం రోడ్డుపై ఒంటరిగా ఉన్నాడనే ఒక వ్యక్తికి లిప్ట్ ఇచ్చాడు. తీరా చూస్తే అక్కడి అధికారులు చేసిన తనిఖీల్లో లిప్ట్ ఇచ్చిన వ్యక్తి అక్రమంగా సౌదీ అరేబియాలోకి ప్రవేశించాడని తేలింది. దీంతో నేరస్థునితో పాటు లిప్ట్ ఇచ్చిన వ్యక్తిని జైలులో తోశారు.సౌదీ అరేబీయాలోని జిజాన్‌లో ప్రసాద్ అనే వ్యక్తి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతని విధి నిర్వహణలో భాగంగా వాహనంలో వెళుతున్నాడు. అయితే అప్పుడు రోడ్డుపై ఓ వ్యక్తి లిప్ట్ అడిగాడు. దీంతో అతనికి సహాయం చేద్దామనే ఉద్దేశంతో అతనిని వాహనంలోకి ఎక్కించాడు. తీరా కొద్దిదూరం వెళ్లేసరికి పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. వీరిద్దరిని ఆపి పత్రాలు చూపించమని అడగగా ఆవ్యక్తి వద్ద సరైన పత్రాలు లేవు. దీంతో అతను యెమన్‌కు చెందిన వ్యక్తి అని అతను అక్రమంగా సౌదీ అరేబియాలోకి ప్రవేశించాడని పోలీసులు గుర్తించారు.దీంతో యెమన్‌కు చెందిన వ్యక్తితో పాటు అతనికి లిప్ట్ ఇచ్చినందుకు ఆ డ్రైవర్‌ను అరెస్టు చేసి నెలరోజుల పాటు జైలులో ఉంచారు. అనంతరం ఆ సదరు ఉద్యోగి తను పనిచేసే సంస్థకు వెళ్లగా కంపెనీ వెహికిల్‌ను ప్రజలను ఎక్కించుకున్నారనే అభియోగంతో వారు ఉద్యోగంలో నుంచి తొలగించారు. అనంతరం అతనికి జీతంతో పాటు అతనికి రావాల్సిన కంపెనీ బెనిఫిట్స్‌ను కూడా ఇవ్వలేదు. దీంతో సదరు ఉద్యోగి తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాడు.విపరీతమైన ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావడంతో అక్కడి భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు. అక్కడి నుండి కేలి సాంస్కృతిక కేంద్రాన్ని సంప్రదించాడు. దీంతో వారు అతనిని తిరిగి భారత్‌కు పంపించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేశారు. అయితే ఇటువంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయని సరైన పత్రాలు లేని వారిని వాహనాల్లో ఎక్కించుకున్నందుకు ఇదివరకూ ఎంతో మంది జైలుపాలయ్యారన్నారు. కనుక సౌదీలో ఉండేవారు ఎవరినైనా వాహనంలో ఎక్కించుకునే సమయంలో జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా వారు సూచించారు. -
హజ్ యాత్రకు ఈ 6 వర్గాలకు నో ఛాన్స్: సౌదీ సర్కారు
హజ్ యాత్రకు అనుమతులపై సౌదీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆరు కేటగిరీలకు చెందిన వారిని హజ్ మంత్రిత్వ శాఖ అనర్హులుగా ప్రకటించింది. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఎంట్రీ నిరాకరిస్తున్నట్లు ప్రకటించింది. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారకి హజ్ యాత్రకు అనుమతి లేదని సౌదీ ప్రభుత్వం వెల్లడించింది. వీరిలో మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, వైకల్యంతో బాధపడుతున్నవారు, అంటు వ్యాధులు, తీవ్రమైన క్యాన్సర్‌తో సహా 6 కేటగిరీల వారిని అనర్హులుగా ప్రకటించింది. అయితే ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇప్పటికే ఆంక్షలు ఉన్నప్పటికీ.. స్పష్టమైన సూచనలు జారీ చేయడం ఇదే మొదటిసారి.తాజా నిబంధనల ప్రకారం డయాలసిస్ రోగులు, తీవ్రమైన గుండె జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులు, తీవ్రమైన కాలేయ వ్యాధి, వైకల్యంతో బాధపడేవారు, కీమోథెరపీ చేయించుకున్న రోగులు హజ్ యాత్రకు వెళ్లేందుకు అనుమతించేది లేదని సౌదీ ప్రభుత్వం తెలిపింది. అలాగే 28 వారాలు నిండిన గర్భిణీ స్త్రీలు కూడా అనర్హులేనని ప్రకటించింది.15 లోపు బుకింగ్‌లు..ప్రైవేట్ గ్రూపుల ద్వారా హజ్ యాత్రకు వెళ్లే వారు ఈ నెల 15 లోపు తమ బుకింగ్‌లను పూర్తి చేయాలని ఇండియన్ హజ్, ఉమ్రా గ్రూప్ అసోసియేషన్ తెలిపింది. హజ్ తీర్థయాత్రకు ఎంపికైన ప్రైవేట్ గ్రూపులు కేంద్ర ప్రభుత్వం నుంచి హజ్ లైసెన్స్ కలిగి ఉన్నాయో లేదో దరఖాస్తుదారులు నిర్ధారించుకోవాలని సూచించింది. -
యెమెన్ ఎఫెక్ట్.. యూఏఈకి సౌదీ హెచ్చరిక..
దుబాయ్: సౌదీ అరేబియా, యెమెన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. యెమెన్‌లోని తీర ప్రాంత నగరం ముకల్లాపై మంగళవారం సౌదీ అరేబియా బాంబుల వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో యెమెన్‌కు మద్దతుగా నిలుస్తున్న యూఏఈకి సౌదీ హెచ్చరికలు జారీ చేసింది. 24 గంట్లలో యెమెన్ నుంచి దళాలను ఉపసంహరించుకోవాలని సౌదీ వార్నింగ్ ఇచ్చింది.ఇక, అంతకుముందు.. యెమెన్‌లోని వేర్పాటువాదుల కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) పంపిన ఆయుధ నౌకలపై దాడి చేసినట్లు సౌదీ తెలిపింది. యూఏఈ చర్యలు అత్యంత ప్రమాదకరమైనవంటూ వ్యాఖ్యానించింది. యూఏఈ మద్దతు కలిగిన సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్‌కు చెందిన వేర్పాటువాదులు ఇటీవలి కాలంలో యెమెన్‌లో పలు ప్రాంతాలను ఆక్రమించుకుంటున్నారు. దీనిపై సౌదీ, దాని మిత్ర దేశాలు గుర్రుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సౌదీ అరేబియా దాడికి దిగింది.Saudi Arabia bombs a UAE convoy in Yemen meant to establish a Zionist friendly state called 'South Arabia'. Saudi has issued a warning to the UAE to remove it's presence in Yemen within 24 hours. pic.twitter.com/QelYcZkC69— Israel Exposed (@xIsraelExposedx) December 30, 2025యూఏఈ తీర నగరం పుజైరాహ్ నుంచి ఆయుధాలతో ముకల్లాకు వచ్చిన రెండు నౌకల నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలను, మిలటరీ వాహనాలను కిందికి దించుతున్న సమయంలోనే మిత్ర కూటమి విమానాలు బాంబులతో దాడి జరిపాయని సౌదీ తెలిపింది. అదే సమయంలో, 24 గంటల్లోగా యెమెన్ నుంచి బలగాలను ఉపసంహరించుకోవాలని యూఏఈకి తీవ్ర హెచ్చరికలు చేసింది. ఈ పరిణామంపై యూఏఈ స్పందించింది. సహనం, వివేకంతో వ్యవహరించాలంటూ సౌదీకి హితవు పలికింది. యెమెన్ నుంచి బలగాలను వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్‌పై మాత్రం ఆ దేశం స్పందించలేదు. యెమెన్‌లోని తమ బలగాలకు అవసరమైన వాహనాలను మాత్రమే ఆ నౌకల్లో పంపామని, ఆయుధాలు లేవని యూఏఈ అంటోంది.సౌదీ ఆగ్రహం.. కాగా, యెమెన్‌లో వేర్పాటు వాదులు ఇటీవల సాధించిన పైచేయికి యూఏఈ కారణమని సౌదీ స్పష్టంచేసింది. దక్షిణ యెమెన్‌కు ప్రత్యేక దేశ స్థాయి కల్పించేందుకు పోరాటం సాగిస్తున్న సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్(ఎస్టీసీ)కు యూఏఈ మద్దతు తెలుపుతోంది. వేర్పాటు వాద సంస్థ ఎస్టీసీని సౌదీ అరేబియా వ్యతిరేకిస్తోంది. ఆ సంస్థకు మద్దతుగా యూఏఈ తీసుకుంటున్న చర్యలు అత్యంత ప్రమాదకరమైనవని సౌదీ పేర్కొంది. సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్‌కు మద్దతుగా యూఏఈ నౌకలు ఆయుధాలు చేరవేశాయని ప్రకటన వివరించింది. తాజా పరిణామాలు సౌదీ అరేబియాకు, యూఏఈకీ మధ్య ఉద్రిక్తతల్ని పెంచేలా ఉన్నాయి. పశ్చిమాసియాకు సంబంధించిన అనేక ఇతర విషయాలపై కలసికట్టుగా పనిచేస్తున్న ఈ రెండు దేశాల మధ్య ఆర్థిక, రాజకీయ విషయాల్లో విభేదాలు ఉన్నాయి.రంగంలోకి అమెరికా..ఇదిలా ఉండగా.. సౌదీ, యెమెన్ వ్యవహారంపై అమెరికా ఫోకస్ పెట్టింది. తాజాగా యెమెన్ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో అమెరికా విదేశాంగమంత్రి మార్కో రూబియో మాట్లాడినట్టు తెలిపారు. యెమెన్ పరిస్థితి, మధ్య ప్రాచ్య భద్రత, స్థిరత్వాన్ని ప్రభావితం చేసే విస్తృత సమస్యల గురించి ఇద్దరూ చర్చించారని సమాచారం. -
యెమెన్‌లోని ముకల్లాపై సౌదీ వైమానిక దాడులు
సనా: యెమెన్‌లోని ఓడరేవు నగరం ముకల్లాపై సౌదీ అరేబియా వైమానిక దాడులు జరిపింది. మంగళవారం జరిపిన ఈ దాడులపై గల్ఫ్ వార్తాసంస్థలు కథనాలను ప్రచురించాయి. యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్(యూఏఈ)కి వ్యతిరేకంగా వేర్పాటువాద సమూహానికి ఆయుధాలు, సైనిక వాహనాలను అందజేస్తున్నారనే ఆరోపణలపై ఈ దాడులు జరిపినట్లు సౌదీ అరేబియా అధికారిక వార్తాసంస్థ స్పష్టం చేసింది. వేర్పాటు వాదుల చేతికి ఆయుధాలు చిక్కడం ఈ ప్రాంతంలో శాంతికి ముప్పుగా పేర్కొంది. అందుకే వైమానిక దళం నిర్ణీత లక్ష్యాలపై దాడులు జరిపిందని, పౌరులకు ఎలాంటి హాని జరగకుండా జాగ్రత్తలు తీసుకుందని వెల్లడించింది.ఈ దాడులపై అటు యెమెన్ సీరియస్‌గా స్పందించింది. యూఏఈతో ఉన్న రక్షణ ఒప్పందాన్ని తక్షణం రద్దు చేసింది. తమ సార్వభౌమాధికారం, దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు యెమెన్ కౌన్సిల్ అధిపతి రషాద్ అల్-అలీమి ప్రకటించారు. ఈ మేరకు ఆయన జాతినుద్దేశించి టీవీలో మాట్లాడారు. యెమెన్‌లో ఉన్న యూఏఈ దళాలు(అల్-అలీమీ) తమ భూభాగాన్ని 24 గంటల్లో విడిచి వెళ్లాలని ఆదేశించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు మూడ్రోజులపాటు నోఫ్లై జోన్‌గా ప్రకటించారు. 90 రోజుల అత్యయిక స్థితిని ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
భారతీయులను వెనక్కి పంపేస్తున్నాయ్..
సాక్షి, అమరావతి: సరైన పత్రాలు లేకుండా విదేశాలకు వెళ్లిన అనేక మంది భారతీయులను పలు దేశాలు తిరిగి వెనక్కి పంపుతున్నాయి. 2025లో ప్రపంచవ్యాప్తంగా 24,600 మంది భారతీయులు ఇలా వెనక్కి వచ్చారు. భారతీయులను వెనక్కి పంపిన దేశాల్లో సౌదీ అరేబియా అగ్రస్థానంలో ఉంది. ఒక్క సౌదీ అరేబియానే 11,000 మంది భారతీయులను సరైన పత్రాలు లేకపోవడం, వీసా గడువు తీరినా ఆ దేశంలో ఉండడం, కార్మిక చట్టాలు ఉల్లంఘించడం వంటి కారణాలతో వెనక్కి పంపేసింది. ఆ తర్వాతి స్థానంలో అమెరికా ఉంది. ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అక్రమ వలసదారులను బయటకు పంపుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ ఏడాది అమెరికా నుంచి 3,800 మంది ఇలా వెనక్కి వచ్చేయగా అందులో ఒక్క వాషింగ్టన్ నుంచే 3,414 మంది, హోస్టన్ నుంచి 234 మంది ఉన్నట్లు కేంద్ర విదేశాంగమంత్రి తాజాగా రాజ్యసభకు ఇచ్చిన సమాచారంలో వెల్లడించింది. ఏజెంట్ల చేతిలో మోసపోయిన వారే అత్యధికం.. విదేశాలకు భవన నిర్మాణ పనులు చేయడానికి వెళ్తున్నవారిలో అత్యధికమంది ఏజెంట్ల చేతిలో మోసపోయినవారే. మయన్మార్ నుంచి 1,591, మలేíÙయా నుంచి 1,485, యూఏఈ నుంచి 1,469, బహ్రెయిన్ నుంచి 769 మంది వెనక్కి వచ్చారు. సరైన పత్రాలు లేకుండా ఆయా దేశాల్లోకి అడుగు పెట్టారంటూ వెనక్కి పంపించేశాయి. కేవలం ఉపాధి కోసం వెళ్లిన వారే కాకుండా విద్యార్థులు కూడా మోసపోయిన వారి జాబితాలో ఉన్నారు. ఉన్నత చదువుల కోసం వెళ్లిన వారిలో అత్యధికంగా 170 మందిని బ్రిటన్ వెనక్కి పంపింది. ఆ తర్వాత ఆ్రస్టేలియా 114 మందిని, రష్యా 82, అమెరికా 45 మంది విద్యార్థులను వెనక్కి పంపాయి. -
ముంచనున్న మంచు!
ఫక్తు ఎడారి దేశమైన సౌదీ అరేబియాలో మంచు తుఫాన్. ఎవరూ ఊహించని ఈ పరిణామం ఇప్పుడు గుబులు రేపుతోంది. అంతర్జాతీయంగా పర్యావరణవేత్తల్లో ఇది పెద్ద చర్చకే దారితీసింది. భూ వాతావరణ వ్యవస్థలోనే అవాంఛనీయమైన మౌలిక మార్పులు భారీ స్థాయిలో చోటు చేసుకుంటున్నాయని చెప్పేందుకు ఇది ప్రబల సాక్ష్యమని వారు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. దీని నుంచి ముఖ్యంగా భారత్ నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు... సౌదీ అరేబియాలోని ఉత్తరాది ప్రాంతాలు తాజాగా మంచులో తడిసి ముద్దయిపోయాయి. ముఖ్యంగా టాబుక్, దాని సమీప పర్వత ప్రాంతా లు పూర్తిగా మంచు దుప్పటి కప్పుకున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు ఎన్నడూ లేనంతగా పడిపోయాయి. ప్రపంచమంతటికీ ఆశ్చర్యం కలిగించేలా అచ్చం శీతల దేశాల్లో మాదిరి పరిస్థితులు నెలకొన్నాయి. మంచుమయంగా మారిన సౌదీ ఎడారుల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారా యి. పర్యావరణ మార్పులు ఇంకెంతమాత్రమూ సుదూర, లేదా కాల్పనిక ముప్పు కాదని, అన్ని దేశాలనూ తీవ్రంగా పట్టి పీడించబోతున్న పెను సమస్య అనీ ఈ పరిణామం స్పష్టంగా చాటింది. విపరీత పరిస్థితులు వాతావరణ మార్పులు అనగానే కేవలం ఎండ ప్రచండంగా మండిపోయే రోజుల సంఖ్య పెరుగుతుందని చాలామంది భావిస్తారు. వాస్తవానికి చాలాసార్లు అందుకు విరుద్ధంగా జరుగుతుందని సైంటిస్టుల మాట. భూమి వేడెక్కిన కొద్దీ వాతావరణం మరింత తేమను, శక్తిని సంగ్రహిస్తుంది. వాటి దెబ్బకు చిరకాలం స్థిరంగా కొనసాగుతూ వస్తున్న వాతావరణ ధోరణులు కాస్తా గాడి తప్పుతాయి. ఫలితంగా ఇలా అప్పుడే ప్రచండంగా ఎండ, కొద్దికాలానికే విపరీతమైన కుండపోత వానలు, ఆ వెంటనే వణికించే చలి, ఊహించని ప్రాంతాల్లో హిమపాతం... భారత్ తో సహా ప్రపంచవ్యాప్తంగా కొన్నేళ్లుగా ఈ ధోరణులు పెరిగిపోతున్నాయి. మనకు వారి్నంగ్ బెల్స్ సౌదీ మంచు తుఫాన్ ఉదంతం నుంచి భారత్ తక్షణం నేర్వాల్సిన పాఠాలు ఉన్నాయి. ఎందుకంటే పర్యావరణ మార్పుల తాలూకు దు్రష్పభావం కొన్నేళ్లు మన దేశంపై తీవ్రంగానే ప్రభావం చూపు తూ వస్తోంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా కనిపించిన విపరీత వాతావరణ ధోరణులే ఇందుకు రుజువు. తొలుత ఉత్తర, మధ్య భారతంలో రికార్డు స్థాయి ఎండలు కాచాయి. ఆ వెంటనే ఉత్తరాఖండ్ మొద లుకుని హిమాచల్ ప్రదేశ్, సిక్కిం దాకా క్లౌడ్ బరస్ట్ విలయమే సృష్టించింది. చాలా రాష్ట్రాల్లో వర్షాకా లం ఆలస్యంగా వస్తే కొన్నింటిలో విపరీతమైన వరదలు అపార నష్టం కలుగజేశాయి. ఇవేవీ యా దృచ్చిక ఘటనలు కాదు. వాతావరణ వ్యవస్థ తీవ్ర ఒత్తిడిలో ఉండనేందుకు స్పష్టమైన సంకేతాలు. తక్షణం మేల్కొనాలి ప్రభుత్వాలు ఇప్పటికీ మేల్కొనకపోతే భారత్‌లో పర్యావరణ వ్యవస్థే పూర్తిగా కుప్పకూలే ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే సాగు సీజన్లు, నీటి యాజమాన్యం, పట్టణ ప్రణాళికలు మొదలుకుని విద్యుత్ డిమాండ్ దాకా అన్నింటికీ సజావైన వాతావరణ వ్యవస్థే మూలం. అదే దెబ్బ తింటే పంటల వైఫల్యం మొదలుకుని అన్నీ వినాశకర పరిణామాలే తలెత్తుతాయి. దేశవ్యాప్తంగా కాలుష్యాన్ని కట్టడి చేసే చర్యలను చిత్తశుద్ధితో అమలు చేయడం అత్యవసరం. అలాగే వాతావరణానికి తగ్గట్టుగా సాగు పద్ధతులు, ధోరణులను కూడా మార్చుకుంటూ పోవడం ప్రస్తుత అవసరం. లేదంటే పరిస్థితి చూస్తుండగానే చేయి దాటిపోతుంది. అప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమే అవుతుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘యూనివర్సల్ స్టూడియోస్’ మెగా థీమ్ ప్రాజెక్ట్.. ఎక్కడంటే..
ప్రపంచ పర్యాటకాన్ని ఆకర్షించేలా సౌదీ అరేబియాలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పట్టాలెక్కబోతోంది. వివిధ దేశాల్లోని పర్యాటకులను అలరించే ‘యూనివర్సల్ స్టూడియోస్’ థీమ్ పార్క్ ఇప్పుడు సౌదీలో ఏర్పాటు కానుంది. రియాద్ సమీపంలోని ఖిద్దియా ఈ ప్రాజెక్టుకు వేదిక కానుంది.వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదికల ప్రకారం, యూనివర్సల్ స్టూడియోస్ మాతృ సంస్థ కామ్ కాస్ట్ (Comcast) ప్రతినిధులు ఈ థీమ్ పార్క్ ఏర్పాటుకు సంబంధించి సౌదీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. కామ్ కాస్ట్ సీఈఓ బ్రియాన్ రాబర్ట్స్ ఇటీవల స్వయంగా ఖిద్దియా సైట్‌ను సందర్శించి అక్కడి వసతులను పరిశీలించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రాథమిక దశలో ఉందని, నిర్మాణానికి సంబంధించి తుది అనుమతులు రావాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.334 చదరపు కిలోమీటర్లుఈ థీమ్ పార్క్ ఏర్పాటు కానున్న ఖిద్దియా ప్రాజెక్ట్ విస్తీర్ణం 334 చదరపు కిలోమీటర్లుగా ఉందని అంచనా. ఇది ఫ్లోరిడాలోని ప్రఖ్యాత డిస్నీ వరల్డ్ కంటే రెండున్నర రెట్లు పెద్దది కావడం గమనార్హం. ఏటా 4.8 కోట్ల మంది సందర్శకులను ఆకర్షించడం దీని లక్ష్యం. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే సౌదీ జీడీపీకి సుమారు 4.5 బిలియన్ల డాలర్ల అదనపు ఆదాయం సమకూరుతుంది.పర్యాటక రంగంలో దూసుకుపోతున్న సౌదీసౌదీ అరేబియా తన ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం కేవలం చమురుపైనే ఆధారపడకుండా వైవిధ్యీకరించాలని చూస్తోంది. గతేడాది 10 కోట్ల మందికిపైగా సందర్శకులు సౌదీని సందర్శించారు. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే 6.09 కోట్ల మంది పర్యాటకులు రావడం గమనార్హం. 2030 నాటికి ఏడాదికి 15 కోట్ల మంది పర్యాటకులను రప్పించాలని సౌదీ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (PIF) లక్ష్యంగా పెట్టుకుంది.ఇదీ చదవండి: ప్రయాణికులు గాల్లో తేలాల్సిందే! -
సౌదీపై మంచు దుప్పటి
రియాద్: ఎటుచూసినా ఇసుక తిన్నెలు, భగభగమండే భానుడి సెగలు, భరించరాని వేడి, అత్యధిక ఉష్ణోగ్రతలకు చిరునామాగా నిలిచే సౌదీ అరేబియా ఎడారుల్లో ఇప్పుడు లెక్కలేనంత మంచు కుప్పలుతెప్పలుగా కనిపిస్తోంది. భారీ వర్షాలతో ముంపు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. చలికాలం కావడంతో రాత్రిపూట ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్టాలకు పడిపోతున్నాయి. దీంతో తమ ఎడారుల్లో మంచు దుప్పట్లు పర్చుకోవడంతో సౌదీ స్థానికులు ఒకింత ఆశ్చర్యానికి, మరికొంద గందరగోళానికి గురవుతున్నారు. వాతావరణ మార్పుల విపరిణామాల కారణంగానే ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తుంటాయని వాతావరణ శాస్త్రవేత్తలు వ్యాఖ్యానించారు. ఈశాన్య సౌదీలో అత్యధికంగా మంచు కురుస్తోంది. తబుక్ ప్రావిన్స్‌లోని పర్వతాలన్నీ ఇసుకరేణువులపై పడిన మంచుతో దవళవర్ణ శోభను సంతరించుకున్నాయి. జిబేల్ అల్–లావాజ్ పరిధిలో సముద్రమట్టానికి 2,600 మీటర్ల ఎత్తులోని ప్రఖ్యాత ట్రోజెనా ప్రాంతం మొత్తం మంచుతో నిండిపోయింది. ఎడారి ఓడగా వినతికెక్కిన ఒంటెలన్నీ ఇప్పుడు మంచు చల్లదనాన్ని తెగ ఆస్వాదిస్తున్నాయి. ఎడారి ఇసుకతిన్నెలన్నీ తెలుపురంగులో మిలమిలా మెరిసిపోవడం, ఒంటెల శరీరాల మీదుగా మంచు పేరుకుపోయిన దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. సముద్రమట్టం నుంచి అత్యంత ఎత్తయిన ప్రదేశాల్లో తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు ఏకంగా సున్నా డిగ్రీసెల్సియస్కు పడిపోవడం విశేషం. పలు రీజియన్లలో వర్షాలు పడటంతో వాటికి చల్లటిగాలులు తోడై ఉష్ణోగ్రతలను కనిష్టాలకు పరిమితంచేస్తున్నాయి. సౌదీ అరేబియాలో ఇంతటి స్థాయిలో మంచు కురవడం గత 30 ఏళ్లలో ఇదే తొలిసారికావడం గమనార్హం. -
సౌదీలో ‘మధు’మాసం!
ఇస్లాం పవిత్ర పుణ్యక్షేత్రాలకు నిలయమైన సౌదీ అరేబియాలో ఒకప్పుడు ’మద్యం’ మాట వినిపిస్తేనే కఠిన శిక్షలు ఉండేవి. కానీ, ఇప్పుడక్కడ క్రమేపీ వాతావరణం మారుతోంది. దశాబ్దాల నిషేధాన్ని పక్కన పెట్టి, అత్యంత రహస్యంగా మద్యం విక్రయాలను విస్తరిస్తోంది సౌదీ ప్రభుత్వం.నిశ్శబ్దంగా.. నిషా వైపు! రియాద్‌లోని ’డిప్లొమాటిక్ క్వార్టర్’లో ఒక గుర్తు తెలియని దుకాణం ఉంది.. బయట బోర్డు ఉండదు. లోపలికి కెమెరాలను రానివ్వరు. 2024 జనవరిలో కేవలం ముస్లిమేతర దౌత్యవేత్తల కోసం మొదలైన ఈ దుకాణం తలుపులు ఇప్పుడు మరికొందరికి తెరుచుకున్నాయి. ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే, ’ప్రీమియం రెసిడెన్సీ’ ఉన్న విదేశీయులకు కూడా ఇక్కడ మద్యం కొనుగోలు చేసే అవకాశం కల్పించారు. రక్షణ మామూలుగా లేదు! ఈ దుకాణంలోకి వెళ్లడం అంత సులభం కాదు. ప్రవేశ ద్వారం దగ్గర క్షుణ్ణంగా తనిఖీలు చేస్తారు. ఫోన్లు, కెమెరాలను అనుమతించరు. ఆఖరికి మీరు పెట్టుకున్న కళ్లద్దాలు కూడా ’స్మార్ట్ గ్లాసెస్’ ఏమో అని సిబ్బంది తనిఖీ చేస్తారు. ధరల విషయానికి వస్తే.. దౌత్యవే త్తలకు పన్ను ఉండదు కానీ, ఈ కొత్త వినియోగదారులకు మాత్రం జేబులు ఖాళీ కావల్సిందే.ఇప్పుడిక రియాద్‌లోనే ‘కిక్కు’ ఇప్పటి వరకు మందు తాగాలనిపిస్తే సౌదీ వాసులు పక్కనే ఉన్న బహ్రెయిన్ ద్వీపానికో లేదా దుబాయ్‌కో వెళ్లేవారు. కొంతమంది స్మగ్లింగ్ చేసిన మందును భారీ ధరకు కొనేవారు. కానీ, తాజా మార్పులతో ధనవంతులైన విదేశీయులకు ఇప్పుడు రియాద్‌లోనే ’కిక్కు’ దొరుకుతోంది. సౌదీలో సినిమాలు వచ్చాయి, మహిళలు డ్రైవింగ్ సీట్ ఎక్కారు, ఇప్పుడు మద్యం దుకాణాలు కూడా వచ్చేశాయి. అయితే ఇది కేవలం విదేశీయులకే పరిమితమా? లేక భవిష్యత్తులో అందరికీ అందుబాటులోకి వస్తుందా?.. అన్నది వేచి చూడాలి. ఏది ఏమైనా, సౌదీలో ఈ ’లిక్కర్ ఎక్స్పెరిమెంట్’ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.దశాబ్దాల నిషేధం! సౌదీలో మద్యం ఎందుకు నిషేధించారో తెలుసా? 1951లో సౌదీ వ్యవస్థాపక రాజు అబ్దుల్ అజీజ్ కుమారుడు ప్రిన్స్ మిషారీ, మద్యం మత్తులో జెడ్డాలోని బ్రిటిష్ వైస్ కాన్సుల్‌ను కాల్చి చంపాడు. ఆ చేదు జ్ఞాపకంతో అప్పట్లో మద్యంపై కఠిన నిషేధం విధించారు. ఇప్పుడు విజన్ 2030లో భాగంగా మొహమ్మద్ బిన్ సల్మాన్ మళ్లీ మెల్లమెల్లగా నిబంధనలను సడలిస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
పాక్ పరువు తీస్తున్న అరబ్ కంట్రీస్
అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ ఇమేజ్ మరోసారి దెబ్బ తింది. ఆ దేశ పౌరులను అరబ్ దేశాలు బలవంతంగా వెనక్కి పంపించేస్తున్నాయి. పైగా వాళ్ల మీద బిచ్చగాళ్లు.. నేరగాళ్లు అనే ముద్ర వేయడం ఆసక్తికర చర్చకు దారి తీసింది ఇప్పుడు.. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌కు కొత్త తలనొప్పి వచ్చి పడుతోంది. వలస వెళ్లిన తమ పౌరులను ఆ దేశాలు వెనక్కి పంపించేస్తున్నాయి. పాక్ పౌరుల వల్ల తమ దేశాల్లో నేరాలు పెరుగుతున్నాయని.. పైగా భిక్షాటనతో తమ దేశ పర్యాటక రంగాన్ని దెబ్బ తీస్తున్నారని ఆయా దేశాలు భావిస్తున్నాయి. దీంతో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ల నుంచి పెద్ద సంఖ్యలో పాక్ పౌరులను వెనక్కి పంపించేస్తున్నారు. యూరప్-ఆసియా సరిహద్దులోని.. కాకేసస్ దేశం అజర్ బైజాన్ కూడా ఇలాంటి చర్యలే చేపట్టింది. ఇందులో సౌదీ అరేబియా నుంచి వచ్చిన 24,000 మంది ఉన్నారు. దుబాయ్ నుంచి 6,000 మంది, అజర్బైజాన్ నుంచి వచ్చిన 2,500 మందిని పాక్‌కు తిప్పి పంపించారు. ఆర్గనైజ్డ్ బెగ్గింగ్ మాఫియాలో భాగంగా ఆయా దేశాలకు వెళ్లినట్లు నిర్ధారణ అయ్యింది. అయితే వీళ్ల వల్ల విద్య, ఉద్యోగాల నిమిత్తం ఆయా దేశాలకు వెళ్లిన వాళ్లను కూడా వెనక్కి పంపుతున్నారని పాక్ ఆవేదన వ్యక్తం చేస్తోంది.హెచ్చరించినా కూడా.. 2024లో సౌదీ అరేబియా పాక్‌కు ఓ ప్రకటన జారీ చేసింది. ఉమ్రా వీసాలను భిక్షాటన కోసం దుర్వినియోగం చేయొద్దని తమ పౌరులకు గట్టిగా చెప్పాలని పాకిస్తాన్‌ను హెచ్చరించింది. నియంత్రించకపోతే హజ్, ఉమ్రా యాత్రికులపై ప్రతికూల ప్రభావం ఉంటుందని తెలిపింది. అయినా కూడా ఆ వ్యవహారం కొనసాగుతూ వస్తోంది. ఇక యూఏఈ ఏమో అదనంగా ఇంకో వాదనను తెరపైకి తెచ్చింది. తమ దేశంలో జరుగుతున్న నేరాల్లో పాక్ పౌరుల వాటా కూడా ఉంటోందని.. వివిధ ఉద్దేశాలతో వచ్చి చాలామంది నేరాలకు పాలపడుతున్నారని యూఏఈ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో కిందటి ఏడాది ఆ పాక్ పౌరులపై వీసా పరిమితులు విధించింది. అరబ్ దేశాలు మాత్రమే కాదు.. ఆఫ్రికా, యూరప్ ఖండాల్లోని పలు దేశాల్లో.. ఆసియాలో కాంబోడియా, థాయ్‌లాండ్ వంటి దేశాల్లో కూడా పాక్ పౌరులు బిచ్చగాళ్లుగా అక్కడి ప్రభుత్వాలకు తలనొప్పులుగా మారుతున్నారు. ఈ క్రమంలో ఆర్గనైజ్డ్ భిక్షాటన గ్యాంగ్‌లను అడ్డుకోవడం, అక్రమ వలసలను నిరోధించడం కోసం వాళ్లను వెనక్కి పంపించేస్తున్నాయని ఆయా దేశాలు. అయితే.. పశ్చిమాసియాలో పట్టుబడ్డ ముఠాల్లో 90 శాతం బిచ్చగాళ్లు పాక్‌కు చెందిన వాళ్లే ఉన్నారని ఆ దేశ విదేశాంగ అధికారి జీషాన్ ఖంజాదా చెబుతుండడం గమనార్హం. వేల మంది ముఠాగా..ఈ ఏడాదిలో ఇప్పటిదాకా పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(FIA) విమానాశ్రయాల్లో 66,154 మందిని విదేశాలకు వెళ్లకుండా ఆపగలిగింది. మక్కా, మదీనా పవిత్ర స్థలాల వద్ద కూడా పాకిస్తానీ భిక్షాటనకారులు యాత్రికులను వేధిస్తున్నారని పాక్‌కు చెందిన డాన్ పత్రిక ఈ మధ్యే ఓ కథనం ప్రచురించడం గమనార్హం. ఈ పరిణామాలపై ఎఫ్ఐఏ డీజీ స్పందిస్తూ.. ఈ నెట్‌వర్క్‌ల వల్ల పాక్ పరువు పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సైన్యం సాయంతో ఇలాంటి ముఠాలను అడ్డుకోవాలని షెహబాజ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలితం ఇవ్వడం లేదు. -
సౌదీ సంచలన నిర్ణయం.. వారికి ఇక రోజూ పండగే..
రియాద్: సౌదీ అరేబియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోని ముస్లిమేతర నివాసితులకు మద్యం విక్రయించాలని నిర్ణయించింది. అయితే ఇందుకు పలు కఠిన నిబంధనలు విధించింది. దేశీయంగా తీసుకున్న ఆర్థిక పరివర్తన లక్ష్యాలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నది. విదేశీ మూలధనాన్ని ఆకర్షించేందుకు సౌదీ ప్రయత్నిస్తోంది. దేశంలోని రియాద్‌లో ఏర్పాటు చేసిన ఏకైక మద్యం దుకాణంలోకి ప్రవేశించేందుకు ముస్లిమేతర నివాసితులు తమ ధృవీకరణ పత్రాన్ని చూపించాల్ని ఉంటుంది. అంతకుముందు విదేశీ దౌత్యవేత్తల కోసం ప్రారంభించిన ఈ దుకాణం ఇటీవల ప్రీమియం రెసిడెన్సీ హోదా కలిగిన ముస్లిమేతరులకు కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ దుకాణంలో కొనుగోళ్లు కేవలం నెలవారీ పాయింట్-బేస్డ్ అలవెన్స్ సిస్టమ్ కింద మాత్రమే చేయవచ్చని సమాచారం. కాగా సౌదీ అరేబియా రాజధాని రియాద్‌తో పాటు ఇతర నగరాల్లో కూడా కొత్త మద్యం దుకాణాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నిబంధనలు మద్యం యాక్సెస్‌ను సులభతరం చేసే దిశగా తీసుకుంటున్న చర్యలలో భాగమని విశ్లేషకులు అంటున్నారు. అయితే ప్రభుత్వం నుండి ఈ మార్పులపై ఎటువంటి అధికారిక ధృవీకరణ లేదు.రియాద్‌ను వ్యాపార, పెట్టుబడులకు పోటీ కేంద్రంగా మార్చడానికి సౌదీ అరేబియా విస్తృత ప్రయత్నాలు చేస్తోంది. విదేశీ మూలధనాన్ని ఆకర్షించడం అనేది విజన్ 2030 లో భాగంగా ఉంది. ఆర్థిక పరివర్తన లక్ష్యాలకు దీనిని కీలకంగా సౌదీ అరేబియా భావిస్తోంది. మరోవైపు సౌదీ అరేబియా ప్రభుత్వం ఇటీవల మహిళల డ్రైవింగ్‌పై నిషేధాన్ని రద్దు చేసింది. అలాగే ప్రజా వినోదం, సంగీతం తదితర రంగాలలో మహిళల ప్రవేశానికి అనుమతులు మంజూరు చేసింది. దేశంలోని పర్యాటక రంగాన్ని కూడా మరింతగా ప్రోత్సహిస్తోంది. ఇది కూడా చదవండి: లడఖ్‌లో చైనా గూఢచారి?.. ఫోరెన్సిక్ పరీక్షకు ఫోన్ -
నేను చచ్చి బతికాను ఏడ్చేసిన సౌదీ మృత్యుంజయుడు
-
నైపుణ్యం కలిగిన వలసదారులను స్వాగతిస్తాం: ట్రంప్
వాషింగ్టన్: వలసదారులపై ఇన్నాళ్లూ కఠిన వైఖరి ప్రదర్శించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మనసు మార్చుకున్నారు. అమెరికాకు వారి అవసరమేంటో ఆయనకు ఎట్టకేలకు తెలిసొచ్చింది. నైపుణ్యం కలిగిన వలసదారులను కచ్చితంగా స్వాగతిస్తామని చెప్పారు. కంప్యూటర్ చిప్స్, క్షిపణులు లాంటి సంక్లిష్టమైన ఉత్పత్తుల అభివృద్ధి విషయంలో అమెరికన్ కార్మీకులకు వలసదారులు శిక్షణ ఇవ్వాలని కోరారు. ఇమ్మిగ్రేషన్ నిబంధనలకు గతంలో మద్దతు ఇచ్చానని గుర్తుచేశారు. ఇప్పుడు వలసదారులకు పెద్దపీట వేస్తే స్వదేశంలో కొందరి నుంచి వ్యతిరేకత రావొచ్చని అన్నారు. వ్యతిరేకతను భరిస్తానని చెప్పారు. బుధవారం యూఎస్–సౌదీ అరేబియా ఇన్వెస్ట్మెంట్ ఫోరమ్‌లో ట్రంప్ మాట్లాడారు. దేశ ఆర్థిక ప్రగతి కోసం పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సెల్ఫోన్లు, కంప్యూటర్లు, మిస్సైల్స్ వంటి కంపెనీల్లో పని చేయడానికి నిపుణులైన వలసదారులు కావాలని తెలిపారు. వారి పరిజ్ఞానం తమ కార్మీకులకు ఎంతగానో తోడ్పడుతుందని వివరించారు. వస్తువుల ఉత్పత్తికి అవసరమైన మానవ వనరులను విదేశాల నుంచి రప్పించుకోవచ్చని అమెరికా సంస్థలకు ట్రంప్ సూచించారు. వేలాది మంది వచ్చినా తప్పకుండా స్వాగతిస్తామని వ్యాఖ్యానించారు.ఈ విషయంలో నన్ను క్షమించాలి వలసదారుల రాకను వ్యతిరేకించేవారు నిజంగా చాలా తెలివైనవారు, నమ్మశక్యంకాని దేశభక్తులు అని డొనాల్డ్ ట్రంప్ కొనియాడారు. అయితే, అమెరికా కార్మీకులకు నైపుణ్యాలు నేరి్పంచాల్సిన అవసరం ఎంతో ఉందని, ఈ విషయం అందరూ అర్థం చేసుకోవాలని కోరారు. మన కంపెనీల్లో బిలియన్ల డాలర్లు పెట్టుబడులు పెట్టేవారిని అనుమతించకపోతే మనం విజయవంతమైన వ్యక్తులుగా ఎప్పటికీ ఎదగలేమని తేలి్చచెప్పారు. ఒక పెద్ద కంపెనీ ఏర్పాటై, ఉత్పత్తి ప్రారంభం కావాలంటే విదేశాల నుంచి భారీగా పెట్టుబడులు, ఉద్యోగులు రావాల్సిందేనని స్పష్టంచేశారు. ఈ విషయంలో తనను క్షమించాలని కోరారు. మాగా(మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్)ను ఇప్పటికీ ఆరాధిస్తున్నానని, విదేశాల నుంచి మనకు కావాల్సిన నిపుణులను రప్పించుకోవడం కూడా ‘మాగా’అవుతుందని అమెరికా అధ్యక్షుడు వివరించారు. తనకు ఓటు వేసేవారి సంఖ్య తగ్గినా పట్టించుకోబోనని, చివరకు వారే అర్థం చేసుకుంటారని వ్యాఖ్యానించారు. -
ట్రంప్ కొత్త డ్రామా.. డీల్స్ కోసం ‘ఎంబీఎస్’కు క్లీన్చిట్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కొత్త డ్రామాకు తెరలేపారు. తమ స్వప్రయోజనాల కోసం సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ (ఎంబీఎస్)ను వెనుకేసుకొచ్చారు. 2018లో జరిగిన జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి హత్య గురించి సౌదీ క్రౌన్ ప్రిన్స్ ఎంబీఎస్‌కు ఏమీ తెలియదన్నారు. ఖషోగ్గి చాలా వివాదాస్పదుడని, చాలా మందికి నచ్చని వ్యక్తి అని అభివర్ణించారు. ఖషోగ్గి హత్యపై ఓవల్ కార్యాలయంలో యువరాజును ప్రశ్నించిన జర్నలిస్ట్‌పై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు అలాంటి ప్రశ్నలతో తమ అతిథిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదని ట్రంప్ అన్నారు.ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు 2021 నాటి యూఎస్ నిఘా అంచనాలకు విరుద్ధంగా ఉన్నాయి. నాటి వివరాల ప్రకారం ఖషోగ్గిని చంపడానికి ప్రిన్స్ మొహమ్మద్ ఆదేశించినట్లు తేలింది. కాగా అమెరికా తొలి పర్యటనలో ఉన్న ఎంబీఎస్ మాట్లాడుతూ ఖషోగ్గి హత్య బాధాకరమైనదని, అదొక పెద్ద తప్పిదం అని పేర్కొన్నారు. అయితే దీనిపై ఖషోగ్గి భార్య హనన్ ఎలాటర్ ఖషోగ్గి స్పందిస్తూ, ఎంబీఎస్ తనను కలిసి క్షమాపణ చెప్పి, పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాగా ఈ వివాదాన్ని పక్కన పెడుతూ అమెరికా- సౌదీ అరేబియా తమ సంబంధాలను బలోపేతం చేసుకుంటూ పలు కీలక ఒప్పందాలకు ఆమోదం తెలిపాయి.ఇందులో పౌర అణుశక్తి సహకార ఒప్పందం, భవిష్యత్తులో ఎఫ్-35 స్టెల్త్ ఫైటర్ జెట్ల అమ్మకం మొదలైనవి ఉన్నాయి. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ ఎంబీఎస్ తనకు మంచి స్నేహితుడని ప్రశంసించారు. అలాగే మానవ హక్కులను కాపాడేవాడని కూడా అని కొనియాడారు. కాగా గతంలో సౌదీతో తలెత్తిన దౌత్య సంక్షోభానికి కారణమైన ఖషోగ్గి హత్యను పక్కన పెట్టేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నట్లుందని విమర్శకులు అంటున్నారు. ట్రంప్ వ్యాపార ప్రయోజనాలు ఈ సమావేశంలో ప్రధాన అంశంగా మారాయి. ట్రంప్ ఆర్గనైజేషన్‌తో సౌదీ డెవలపర్ కొత్త హోటల్ భాగస్వామ్యాన్ని ప్రకటించిన ఒక రోజు తరువాత ట్రంప్ ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. కాగా ప్రాంతీయ శాంతి, ఇజ్రాయెల్‌తో సంబంధాల సాధారణీకరణ (అబ్రహం ఒప్పందాలు) గురించి కూడా ట్రంప్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్‌తో చర్చించారు.ఇది కూడా చదవండి: Bihar: ‘ఇళ్లా.. ఇంద్ర భవనాలా?’.. కొత్త ఎమ్మెల్యేలకు పండుగే! -
ప్రాణాలతో బతికి బయట పడ్డాడు.. కానీ ఇంకా షాక్‌లోనే..!
సౌదీ అరేబియా మదీనా సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంలో 45 మంది భారతీయ ఉమ్రా యాత్రికులు సజీవ దహనమైన తెలిసిందే. మృతుల్లో అత్యధికంగా తెలంగాణ హైదరాబాద్‌కు చెందినవాళ్లే ఉన్నారు. అయితే హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ షోయబ్ అనే యువకుడు సురక్షితంగా బయటపడ్డాడు. ప్రమాదం నుంచి బయటపడిన ఏకైక వ్యక్తి అతనే.అతను ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదం జరిగిన బస్సు డ్రైవర్‌తో పాటు అతను బయటపడ్డాడు,. బస్సు ప్రమాదానికి గురైన సమయంలో అతను కిందకు పడిపోవడంతోనే అతను సురక్షితంగా బయటపడ్డాడు. ఐసీయూలో చికిత్స పొందుతున్న షోయబ్.. ఇంకా షాక్‌లోనే ఉన్నాడు. బస్సు ప్రమాదం జరిగి అగ్ని గోళంగా మారిపోవడంతో ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు. తన కళ్లు ముందు బస్సు అగ్ని ఆహుతి కావడంతో అలా చూస్తూ ఉండిపోయాడు తప్ప చేసేదేమీ లేకుండా పోయింది.హైదరాబాద్ అసిఫ్ నగర్, హబీబ్ నగర్‌కు చెందిన 44 మంది మక్కా యాత్ర కోసం అల్ మక్కా, ఫ్లై జోన్ ట్రావెల్స్ నుంచి టికెట్లు బుక్ చేసుకున్నారు. ఈ నెల 9వ తేదీన వాళ్లు అక్కడికి వెళ్లారు. మొత్తం 46 మంది ప్రయాణికులతో కూడిన బస్సు మక్కా యాత్ర తర్వాత గత రాత్రి మదీనాకు వెళ్తోంది. వాళ్లు ప్రయాణిస్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీ కొట్టింది. ప్రమాదంలో షోయబ్ మినహా అందరూ మరణించడం తీవ్ర విషాదం నెలకొంది. -
జగన్ షాక్ ఒకే కుటుంబంలో 18 మంది....
-
మృత్యుంజయుడు!
సాక్షి, హైదరాబాద్: సౌదీ ఆరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నగరంలోని జిర్రా నటరాజ్‌నగర్‌కు చెందిన మహమ్మద్ అబ్దుల్ షోయబ్ ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు. గాయాల పాలైన 24 ఏళ్ల షోయబ్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. డ్రైవర్ పక్కన కూర్చోవడంతో ఆయన ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఆయన షోయబ్ తండ్రి మహమ్మద్ అబ్దుల్ ఖదీర్, తల్లి గౌసియా బేగం, తాత మహమ్మద్ మౌలానా మరణించారు. మక్కాలో ఆదివారం ప్రార్ధనలు పూర్తి చేసుకొని రాత్రి 12 గంటలకు ప్రత్యేక బస్సులో బయలు దేరారు.అందరూ గాఢ నిద్రలో ఉండగా ప్రమాదం జరిగింది. డ్రైవర్ బస్సును నిలిపివేసి కిందకు దూకగా, ఆయనతో పాటు షోయబ్ కూడా కిందకు దూకి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఉమ్రా యాత్రకు వచ్చి మక్కాలో ఆగిపోయిన తన సోదరుడు సమీర్‌కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. తర్వాత షోయబ్ తీవ్ర గాయాలతో కింద పడిపోగా డ్రైవర్ పూర్తి సమాచారం అందించాడు. సౌదీ పోలీసులు షోయబ్‌ను ఆసుపత్రికి తరలించారు. -
మక్కా యాత్రే చివరి ప్రయాణం..
ముషీరాబాద్: సౌదీలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి చెందడం నగరవాసుల్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా వారి జీవిత ప్రయాణం ముగిసింది. విద్యానగర్ ఏడవ వీధి మార్క్స్ భవన్ పక్కన గల 1–9–295/11/ఏ/1 ఇంటి యజమాని ఎస్కే నసీరుద్దీన్ (70) తన కుటుంబ సభ్యులతో కలిసి ఉమ్రా యాత్రకు వెళ్లారు. ఆయన రైల్వే ఉద్యోగి. భార్య అక్తర్ బేగం (60), ఆమెజాన్లో మేనేజర్‌గా పని చేసే రెండవ కుమారుడు సలావుద్దీన్ (40), భార్య ఫర్హానాతో పాటు వీరి ముగ్గురు పిల్లలు జైన్ (5), రిదా(6), షీజా(7) వెంట ఉన్నారు.అమెరికాలో సాప్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న నసీరుద్దీన్ పెద్ద కుమారుడు సిరాజుద్దీన్ భార్య సనా, ఆమె ముగ్గురు పిల్లలు హుజేర్, మెహరీష్, హుమేజాలు కూడా వీరికి తోడయ్యారు. అలాగే అప్పటికే వివాహమై నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న ఆయన ముగ్గురు కుమార్తెల్లో పెద్ద కూతురు అమీనాబేగం (మూసారాంబాగ్), ఆమె కుమార్తె అనీస్ (21), రెండవ కుమార్తె షబానా బేగం (హిమాయత్‌నగర్), ఆమె కుమారుడు జాఫర్, మూడవ కుమార్తె రిజ్వానా బేగం, ఆమె ఇద్దరు పిల్లలు మరియన్, షాజహాన్..మొత్తం 18 మంది అల్ మక్కా ట్రావెల్స్ ద్వారా సౌదీ వెళ్లారు. అమెరికాలో నివసించే పెద్ద కుమారుడు సిరాజుద్దీన్‌తో పాటు ముగ్గురు కూతుళ్ల భర్తలు మాత్రం ఇళ్ల వద్ద ఉండిపోయారు.‘తల్లి’డిల్లిన వయో వృద్ధురాలునసీరుద్దీన్ కుటుంబ సభ్యులు 18 మంది అగ్నికి ఆహుతి కాగా, ఆయన తల్లి రోషన్‌బీ, పెద్ద కుమారుడు సిరాజుద్దీన్ ఒక్కడు మాత్రమే మిగి లాడు. ఇతను గత కొంత కాలంగా అమెరికాలో ఉద్యోగం చేస్తూ అక్కడే ఉంటున్నాడు. భార్య సనా, ముగ్గురు పిల్లలు మాత్రం విద్యానగర్‌లోని తల్లిదండ్రుల వద్ద నివసిస్తున్నారు. సిరాజుద్దీన్ తన సమీప బంధువులతో అమెరికా నుంచి మాట్లాడుతూ పెద్దపెట్టున రోదించాడు. నసీరుద్దీన తల్లి రోషన్‌బీ తల్లడిల్లిపోయింది. కాగా 18 మందిలో 10 మంది చిన్నారులే ఉండడం స్థానికుల హృదయాన్ని కలచి వేసింది. వీరంతా ఏడాది నుంచి 10 సంవత్సరాల లోపు వారే కావడం గమనార్హం. నసీరుద్దీన తల్లి 90 ఏళ్లు పైబడిన రోషన్‌బీ తల్లడిల్లిపోయింది. ఆమెను ఓదార్చడం ఎవరితరం కాలేదు. తమ కుటుంబసభ్యులు తమ చివరి మజిలీని ముస్లింలకు పవిత్ర స్థలమైన మక్కాలోనే ముగించారు కాబట్టి వారి అంత్యక్రియలను కూడా అక్కడే నిర్వహిస్తే వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని, కాబట్టి 18 మంది అంత్యక్రియలు అక్కడే నిర్వహించాలని బంధువులు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఆ మేరకు వహీద్, మునీర్‌లతో పాటు మరో ఐదుగురు మక్కాకు వెళ్లేందుకు పాస్‌పోర్టులను హజ్ కమిటీకి అందజేశారు. మౌన సాక్షిగా మిగిలిన ఇల్లునసీరుద్దీన్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు మొత్తం 18 మంది మృతి చెందడంతో కనీసం ఆయన ఇంటి తలుపులు తెరిచే వారు కూడా లేకుండా పోయారు. సమీప బంధువులు వచ్చినా అక్కడ నిలబడి ఆ ఇంటి వైపు మౌనంగా చూస్తున్నారు తప్ప ఏమి చేయలేకపోతున్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పరామర్శవిషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్‌లు నసీరుద్దీన్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నాగోల్‌లో అల్మారా దుకాణం నిర్వహించే అబ్దుల్ రషీద్ భార్య అమీనాబేగం, వారి కుమార్తె అనీస్ ఫాతిమా సౌదీలో మరణించడంతో మూసారాంబాగ్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల తదితరులు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
యా అల్లా!.. సౌదీలో మృత్యు ఘోష
న్యూఢిల్లీ/సాక్షి, నెట్వర్క్/సాక్షి,న్యూఢిల్లీ: సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మక్కా, మదీనా సందర్శించుకోవాలనే తమ చిరకాల వాంఛను తీర్చుకునేందుకు హైదరాబాద్ నుంచి వెళ్లిన 45 మంది ఉమ్రా యాత్రికులు దుర్మరణం పాలయ్యారు. వీరిలో 43 మంది నగరానికే చెందిన వారు కాగా, మరో ఇద్దరు కర్ణాటకకు చెందినవారు. వీరు ప్రయాణిస్తున్న బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టగా మంటలు చెలరేగడంతో అంతా సజీవ దహనమయ్యారు. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా సోమవారం తెల్లవారుజామున మదీనాకు సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ఉదయాన్నే అందిన పిడుగుపాటు లాంటి వార్త నగర వాసుల్ని కలచివేసింది. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులు, వారి కుమారులు, కుమార్తెలు, వారి పిల్లలు సహా ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. మొత్తం 46 మంది బస్సులో ప్రయాణిస్తుండగా ఒక్కరు మాత్రం ఈ ప్రమాదం నుంచి బయటపడినట్లు సమాచారం. మరణించిన నగర వాసుల్లో 18 మంది పురుషులు, 26 మంది మహిళలు కాగా వీరిలో 10 మంది చిన్నారులు ఉన్నారు. వీరి మృతదేహాలను జెడ్డాలోని కింగ్ ఫహద్, కింగ్ సల్మాన్, అల్ మిఖత్ ఆస్పత్రులకు తరలించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. జెడ్డాలోని భారత రాయబార కార్యాలయ అధికారులు అక్కడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మృతదేహాలను మదీనాలోనే స్థానిక సంప్రదాయాల మేరకు ఖననం చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, హైదరాబాద్ సమీపంలోని చేవెళ్ల వద్ద జరిగిన రెండు ఘోర బస్సు ప్రమాదాలను మరిచిపోక ముందే మరో దుర్ఘటన జరగడం, ఏకంగా 44 మంది హైదరాబాదీలు మరణించడం నగరాన్ని కుదిపేసింది. సౌదీ ప్రమాదంలో బతికి బయటపడింది ఇతను ఒక్కడే.. ప్రయాణంలో డ్రైవర్ పక్కన కూర్చున్న అబ్దుల్ షోయబ్ మొత్తం 54 మంది యాత్రికులు ఉమ్రా యాత్ర కోసం నగరంలోని వివిధ ట్రావెల్ ఏజెన్సీల నుంచి మొత్తం 54 మంది ఈ నెల 9న బయలుదేరి వెళ్లారు. మక్కా సందర్శన అనంతరం నలుగురు అక్కడే ఆగిపోగా.. మరో నలుగురు కారులో మదీనాకు వెళ్లారు. మిగిలిన 46 మందీ బస్సులో మదీనా వెళ్తుండగా గమ్య స్థానానికి 25 కి.మీ దూరంలో, భారత కాలమానం ప్రకారం ఉదయం 1:30 గంటల సమయంలో ఈ ఘోరం జరిగింది. బస్సు రోడ్డు పక్కన ఆగి ఉండగా, ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో పేలుడు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. అయితే ప్రమాదానికి కారణాలను సౌదీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. జెడ్డాలో ఉన్న భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు త్రెలిపారు. 8002440003 (టోల్ ఫ్రీ), 00966122614093, 00966126614276 00966556122301 (వాట్సాప్) హెల్ప్‌లైన్ నంబర్లను ప్రకటించారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే జెడ్డా నుంచి అధికారుల బృందం ఘటనా స్థలికి, ఆస్పత్రులకు వెళ్లినట్లు అక్కడి కార్యాలయ వర్గాలు తెలిపాయి. రియాద్‌లోని ఎంబసీ కార్యాలయం కూడా సౌదీ అధికారులతో కలిసి పని చేస్తోంది. సౌదీ ప్రమాదం నేపథ్యంలో న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో కూడా అధికారులు కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. (కాంటాక్ట్ నంబర్లు.. వందన, పీఎస్ టు రెసిడెంట్ కమిషనర్, లైజన్ హెడ్ –+91 98719 99044, సీహెచ్. చక్రవర్తి, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ – +91 99583 22143, రక్షిత్ నాయక్, లైజన్ ఆఫీసర్ –+91 96437 23157). ఇలావుండగా షెడ్యూల్ ప్రకారం యాత్రికుల బృందం ఈనెల 23న జెడ్డా నుంచి హైదరాబాద్‌కు బయలుదేరాల్సి ఉంది. ఈ మేరకు వీరికి విమాన టిక్కెట్లు సైతం బుక్ అయ్యాయి. ఉమ్రా యాత్ర సందర్భంగా ఎయిర్‌పోర్ట్‌లో ఒకే కుటుంబంలోని 18 మంది గ్రూప్ ఫొటో ప్రధాని మోదీ సంతాపం ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ‘నేను తీవ్ర విచారంలో మునిగిపోయా. నా ఆలోచనలన్నీ ఆప్తుల్ని కోల్పోయిన వారి చుట్టూనే ఉన్నాయి. జెడ్డాలోని మన కాన్సులేట్, రియాద్‌లోని ఎంబసీ అవసరమైన సహాయ కార్యక్రమాలన్నీ చేపడుతున్నాయి. ఇక్కడి మన అధికారులు కూడా సౌదీ అధికారులతో కలిసి పని చేస్తున్నారు..’ అంటూ మోదీ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. రష్యా పర్యటనలో ఉన్న కేంద్రమంత్రి జైశంకర్ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి సౌదీ ప్రమాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే స్థానిక అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు తీవ్ర సంతాపం తెలిపారు. ఢిల్లీలోని అధికారులు, సౌదీలోని రాయబారితోనూ మాట్లాడాలని, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని సహాయకచర్యలు తీసుకోవాలని సీఎస్ కె.రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డిని ఆదేశించారు. కాగా మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ నేతృత్వంలో ఎంఐఎం ఎమ్మెల్యే, మైనారిటీ శాఖ అధికారితో కూడిన ప్రతినిధి బృందం తక్షణమే సౌదీ అరేబియాకు బయలుదేరి వెళ్లనుంది. మృతుల కుటుంబాలను ముఖ్యమంత్రి సూచనల మేరకు అన్ని రకాలుగా అదుకుంటామని, యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చెప్పాట్టాలని సౌదీ అధికారులను కోరినట్లు మంత్రి అజారుద్దీన్ తెలిపారు. మృతులకు అక్కడే అంత్యక్రియలు నిర్వహించాలని, వారి కుటుంబాల నుంచి ఇద్దరిని అక్కడికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎస్ ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ సమన్వయ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్‌తో మాట్లాడి తగు ఆదేశాలిచ్చారు. రాష్ట్ర సచివాలయంలో మృతుల కుటుంబసభ్యులకు అవసరమైన సమాచారం అందించేందుకు వీలుగా 79979 59754, 99129 19545 టోల్ ఫ్రీ నంబర్లతో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ప్రమాదానికి సంబంధించిన సహాయ సహకారాల కోసం పోలీసు విభాగం తరఫున సంయుక్త పోలీసు కమిషనర్ (శాంతిభద్రతలు) తఫ్సీర్ ఇక్బాల్ పని చేస్తున్నట్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఎప్పుడూ ప్రమాదకరమే.. సౌదీ అరేబియాలోని పవిత్ర స్థలాల నుంచి యాత్రికుల తరలింపు కొన్నిసార్లు ప్రమాదకరంగా మారుతోంది. ముఖ్యంగా హజ్ యాత్ర సమయంలో రోడ్లన్నీ బస్సులతో కిటకిటలాడుతుంటాయి. ట్రాఫిక్ జామ్‌లు ఎక్కువగా ఉంటాయి. 2023లో మక్కా నుంచి వెళ్తున్న ఓ బస్సును బ్రిడ్జిని ఢీకొట్టి మంటల్లో చిక్కుకోవడంతో 20 మంది మృత్యువాత పడ్డారు. సుమారు 25 మంది గాయపడ్డారు. 2019లో ఓ బస్సు మరో భారీ వాహనాన్ని ఢీకొట్టడంతో 35 మంది చనిపోయారు. సౌదీ ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం సాక్షి, అమరావతి: సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉమ్రా యాత్రకు వెళ్లిన వారు మరణించడం విచారకరమన్నారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలన్నారు. వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 45 మంది మృతి బాధాకరంఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 45 మంది భారతీయులు దుర్మరణం చెందడం బాధాకరమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘మృతిచెందిన వారిలో అత్యధిక మంది హైదరాబాద్‌కు చెందిన ముస్లిం యాత్రికులు ఉన్నట్లు తెలిసింది. వారి మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని పేర్కొన్నారు. దిగ్భ్రాంతికి గురి చేసింది: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఒక ప్రకటనలో తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన భారతీయ కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఉమ్రా యాత్రలో దుర్ఘటన దురదృష్టకరం రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి ఫరూక్ సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాద దుర్ఘటనపై రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబాలకు మనోస్థైర్యాన్ని ప్రసాదించాలని ప్రారి్థస్తున్నట్లు పేర్కొన్నారు.ఏపీ వక్ఫ్‌బోర్డు చైర్మన్ సంతాపంసౌదీ అరేబియా ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు.మృతుల కుటుంబాలకు పరిహారం అందించాలి: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అదేవిధంగా సౌదీ అరేబియాలో జరిగిన ప్రమాదంలో 45 మంది మృతి చెందడం బాధాకరమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. మృతుల కుటుంబాలకు తగిన పరిహారం అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన కోరారు. -
సౌదీ ప్రమాదం: మృతదేహాలకు అక్కడే ఖననం?
రియాద్: సౌదీఅరేబియాలోని మదీనా సమీపంలో చోటుచేసుకున్న ప్రమాదంలో 42 మంది భారతీయులు మృతిచెందగా.. వారి మృతదేహాలు గుర్తించలేని విధంగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో మృతిచెందిన హైదరాబాదీల మృతదేహాలను వెనక్కి రప్పిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినా.. సౌదీ చట్టాల ప్రకారం ఈ ప్రక్రియ కొంత క్లిష్టమైనదేనని తెలుస్తోంది. సౌదీలో మరణిస్తే.. పరిస్థితులు ఏమిటనేదానిపై ‘సాక్షి వెబ్’ ప్రత్యేక కథనం..సౌదీఅరేబియాతోపాటు.. ఇతర గల్ఫ్ దేశాల్లో చట్టాలు ఒకేలా ఉంటాయి. అక్కడ ఎవరైనా మరణిస్తే.. వారి రక్తసంబంధీకుల అనుమతితోనే మృతదేహాల తరలింపు ఉంటుంది. లేనిపక్షంలో.. ఎన్ని సంవత్సరాలైనా అక్కడి ప్రభుత్వాలు మృతదేహాలను మార్చురీల్లో భద్రపరుస్తాయి. ఇటీవల బహ్రెయిన్‌లో ఇద్దరు తెలంగాణ, మరో ఇద్దరు ఆంధ్రప్రదేశ్ పౌరుల మృతదేహాలు ఐదేళ్లుగా అక్కడి మార్చురీల్లో ఉన్న వార్తలు పతాకశీర్షికలకెక్కిన విషయం తెలిసిందే..! రక్తసంబంధీకులు ప్రభుత్వాలను సంప్రదించాక.. భారతీయ ఎంబసీల నుంచి నిరభ్యంతర పత్రం(ఎన్ఓసీ) తప్పనిసరి. ఆ తర్వాతే గల్ఫ్ దేశాల ప్రభుత్వాలు మృతదేహాల తరలింపునకు అనుమతినిస్తాయి. ఆ అనుమతులు ఉంటేనే.. విమానయాన సంస్థలు మృతదేహాలను తరలించేందుకు అంగీకరిస్తాయి.మదీనా ప్రమాదంలో..మదీనా ప్రమాదంలో బస్సు ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొనడంతో ఐదారు గంటల పాటు అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. మృతదేహాలు గుర్తించలేనంతగా కాలిపోయినట్లు సౌదీలోని భారతీయులు ‘సాక్షి’కి వివరించారు. ఇప్పుడు మృతదేహాలను గుర్తించాలంటే.. డీఎన్ఏ పరీక్షలు మాత్రమే మార్గంగా ఉన్నాయి. అయితే.. ముస్లింలు ఎంతో ఖర్చును భరించి ఉమ్రా, హజ్ యాత్రలు చేస్తుంటారు.అలాంటి పరిస్థితుల్లో డీఎన్ఏ పరీక్షల కోసం మృతుల సంబంధీకులు సౌదీ వరకు వెళ్లడం ఖర్చుతో కూడుకున్న విషయమే..! అయితే.. ఇక్కడ ఓ వెసులుబాటు ఉందని సౌదీలో పనిచేస్తున్న భారతీయులు చెబుతున్నారు. మన ప్రభుత్వాలు సౌదీ సర్కారును సంప్రదిస్తే.. మన దగ్గర ఉండే సౌదీఅరేబియా ఎంబసీ అధికారులు ఇక్కడే డీఎన్ఏ పరీక్షలు జరిపించి, వాటి నివేదికలను సౌదీకి పంపే అవకాశాలున్నాయంటున్నారు. సౌదీలో మరణించిన భారతీయుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అన్నిరకాల చర్యలు తీసుకుంటోంది.అక్కడే అంత్యక్రియలు?ముస్లింల పంచసూత్రాల్లో రోజుకు ఐదుపూటలా నమాజు చేయడం, రంజాన్ మాసంలో ఉపవాసాలు, పేదలకు దానాలు(జకాత్)తోపాటు.. మక్కా యాత్ర కూడా ఒకటి. సౌదీ అరేబియాలోని మక్కా, మదీనాలను ప్రపంచవ్యాప్తంగా ముస్లింలంతా అత్యంత పవిత్ర ప్రదేశాలుగా భావిస్తారు. అక్కడ మృతిచెందితే.. అది జన్నత్(స్వర్గం)కు మార్గంగా భావిస్తారు. ‘‘మక్కా యాత్ర సందర్భంగా అరాఫత్ పర్వతం వద్ద జరిగే తొక్కిసలాటలో ఎవరైనా మరణిస్తే.. మృతుల కుటుంబీకులు ఇక్కడే ఖననం చేయాలని నిర్ణయిస్తారు.90% మంది భావన ఇదే. నాకు తెలిసి.. గత మక్కా యాత్ర సందర్భంగా మృతిచెందిన వారిలో చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే మృతదేహాలను వేర్వేరు దేశాలకు తరలించారు’’ అని సౌదీలో ఉంటున్న కరీంనగర్ వాసి ఒకరు తెలిపారు. మదీనా సమీపంలో జరిగిన ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలు పూర్తిగా కాలిపోయిన నేపథ్యంలో.. బంధుమిత్రులు మిగిలిన అవశేషాలను సౌదీలోనే ఖననం చేసే అవకాశాలున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘సౌదీలోనే ఖననం చేయాలంటే.. మృతుల బంధుమిత్రులు ఇక్కడి వరకు రావాల్సిన అవసరం లేదు. సౌదీ అధికారులు ఖననం చేయవచ్చంటూ ఇక్కడి ప్రొఫార్మాలో సమ్మతిపత్రాన్ని సమర్పిస్తే సరిపోతుంది. ప్రభుత్వమే అన్ని లాంఛనాలతో ఖననాలు జరుపుతుంది’’ అని ఆయన వివరించారు. -
సౌదీ బస్సు ప్రమాదం..ఒకే కుటుంబంలో 18 మంది మృతి
సాక్షి,హైదరాబాద్: సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ విద్యానగర్‌కు చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి నసీరుద్దీన్ కుటుంబానికి చెందిన 18 మంది సభ్యులు ఈ ప్రమాదంలో మృతి చెందారు. దీంతో విద్యానగర్ ప్రాంతంలో విషాద చాయలు అలుముకున్నాయి. సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదం నసీరుద్దీన్ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. నసీరుద్దీన్‌తో సహా అతని కుమారులు, కూతుళ్లు, కోడళ్లు, మనవళు, మనవరాళ్లు ఇలా వారి కుటుంబానికి చెందిన మూడు తరాలవారు ఈ ప్రమాదంలో మృతిచెందారు. దీంతో వారి బంధువులు తీవ్రంగా విలపిస్త్నున్నారు.నసీరుద్దీన్ తమతో ఎంతో బాగా ఉండేవారని మక్కా వెళ్లి వస్తానన్న కుటుంబసభ్యులు ఇలా అకాల మరణం చెందడం తమను ఎంతో కలిచి వేస్తోందని బాధపడుతున్నారు.సౌదీ అరేబియాలో మదీనా నుంచి మక్కా వెళుతున్న సమయంలో బస్సుప్రమాదం జరిగి 45 మంది మృతిచెందారు. వారిలో 18 మంది నసిరుద్దీన్ కుటుంబ సభ్యులున్నారు.రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన నసీరుద్దీన్ కుటుంబ సభ్యులందరికీ సౌదీలోనే అంత్యక్రియలు నిర్వహించాలని వారి బంధువులు నిర్ణయించినట్లు సమాచారం. అంత్యక్రియలపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
Saudi Bus : మృతుల కుటుంబాలకు రూ .5 లక్షల చొప్పు న పరిహారం
-
సౌదీ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి
-
Saudi Arabia: ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకోవాలని CS, DGPకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
-
సౌదీ ప్రమాద ఘటనపై అసుదుద్దీన్ స్పందన
సౌదీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఈ ప్రమాద ఘటనపై రియాద్ లోని భారత ఎంబసీ అధికారులతో మాట్లాడానని అధికారులు ప్రమాద ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నామని తెలిపారన్నారు. ఘటన వివరాలు సేకరిస్తున్నామని హామీ ఇచ్చారని ఎంపీ అసదుద్దీన్ తెలిపారు.సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 45మంది హైదరాబాదీయులు మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై ఎంఐఏం చీఫ్ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. "ఈ ఘటనపై రియాద్ లోని ఇండియన్ డిప్యూటీ చీఫ్ ఎంబసీతో మాట్లాడాను. ఈ ప్రమాద ఘటనపై పూర్తిస్థాయిలో వివరాలు సేకరిస్తామని ఆయన నాకు హామీ ఇచ్చారు. అదే విధంగా ట్రావెల్ ఏజెన్సీలతో మాట్లాడి యాత్రికుల వివరాలు వారికి అందజేశాను" అని అన్నారు. మృతుల పార్థివదేహాలను వీలైనంత త్వరగా భారత్ వచ్చేలా ఏర్పాట్లు చేయాలని భారత ప్రభుత్వానికి ఒవైసీ విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని కోరారు. మరోవైపు సౌదీ అరేబియా బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానూభూతి తెలిపారు. ఈ విషయమై భారత అధికారులు సౌదీ అరెబీయా అధికారులతో సంప్రదిస్తున్నారని తెలిపారు.భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఈ ఘటన తనను షాక్‌కు గురిచేసిందన్నారు. మృతుల కుటుంబాలకు తన సానూభూతి తెలిపారు. బాధితులకు రియాద్‌లోని ఇండియన్ ఎంబసీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. సౌదీ అరేబియాలో మక్కా నుంచి మదీనాకు బస్సు అగ్నిప్రమాదానికి గురవగా అందులోని 45 మంది సజీవ దహనమయ్యారు. ఒక్కరు ప్రాణాలతో బయిటపడగా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నట్లు సమాచారం. మృతులంతా హైదరాబాదీ వాసులే. -
సౌదీ ప్రమాదంపై YSRCP అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
-
సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం
-
సౌదీ ప్రమాదంలో మృతులంతా హైదరాబాదీలే!
హైదరాబాద్: సౌదీ అరేబియా బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్యపై గందరగోళం నెలకొంది. అయితే ఈ ప్రమాదంపై తెలంగాణ హజ్ కమిటీ స్పందించింది. ఘటనలో 45 మంది మరణించారని.. అంతా హైదరాబాద్‌కు చెందిన వాళ్లేనని స్పష్టత ఇచ్చింది. మరోవైపు మృతుల పూర్తి వివరాలను సమర్పిస్తామని పోలీసులు అంటున్నారు.నాలుగు ఏజెన్సీల ద్వారా యాత్రికులు అక్కడికి వెళ్లారు. మక్కా యాత్ర తర్వాత మదీనాకు బయల్దేరారు. మదీనాకు 25కి.మీ. దూరంలో ముఫ్రిహాత్ వద్ద యాత్రికుల బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ఉన్నారు. ప్రమాదంలో అంతా మరణించారు. మృతుల్లో 17 మంది పురుషులు, 28 మంది మహిళలు ఉన్నారు. అంతా హైదరాబాద్‌కు చెందిన వాళ్లే అని హజ్ కమిటీ పేర్కొంది. మృతుల్లో మల్లేపల్లి, బజార్‌ఘాట్, ఆసిఫ్‌నగర్ తదితర ప్రాంతాలకు చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది.మరోవైపు.. ఈ ఘోర ప్రమాదంపై నగర పోలీసులు ప్రకటన చేశారు. మొత్తం 54 మంది బృందం నవంబరు 9న హైదరాబాద్ నుంచి జెడ్డాకు వెళ్లింది. నవంబరు 23 వరకు టూర్ ప్లాన్ చేశారు. వీరిలో నలుగురు వ్యక్తులు నిన్న కారులో మదీనాకు వెళ్లారు. మరో నలుగురు మక్కాలోనే ఉండిపోయారు. మిగతా 46 మంది మక్కా నుంచి మదీనాకు బస్సులో బయల్దేరారు. మదీనాకు 25 కిలోమీటర్ల దూరంలో ఈ బస్సు చమురు ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో 45 మంది చనిపోయారు. అబ్దుల్ షోయబ్ అనే వ్యక్తి ఒక్కరే బయటపడ్డారు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో ఉన్నాడు అని సజ్జనార్ తెలిపారు. సోమవారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో (భారత కాలమానం ప్రకారం) ఈ ఘటన చోటుచేసుకుంది. డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొనగానే మంటలు చెలరేగి బస్సు మొత్తం వ్యాపించాయి. ప్రమాద సమయంలో యాత్రికులంతా గాఢ నిద్రలో ఉండటంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం నేపథ్యంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు జెడ్డాలోని భారత ఎంబసీ వెల్లడించింది.ప్రధాని సహా పలువురి దిగ్భ్రాంతిసౌదీ అరేబియాలో జరిగిన ఘోర ప్రమాదంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. రియాద్‌లోని ఎంబసీ, జెడ్డాలోని కాన్సులేట్ కావాల్సిన సహాయం అందిస్తున్నాయని ప్రధాని మోదీ తన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. సౌదీ అరేబియా ప్రభుత్వ అధికారులతో భారత ప్రతినిధులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. -
మక్కా టు మదీనా.. గమ్యానికి కాస్త దూరంలోనే.. ఇంతలో జరిగిన ఘోరం..
-
సౌదీ బస్సు ప్రమాదంలో బయటపడ్డ యువకుని బంధువులు చెప్పిన నిజాలు
-
సౌదీ ఘటనపై ఓవైసీ దిగ్భ్రాంతి
-
మక్కా వెళ్లి వస్తుండగా.. ఒక్కరు కూడా మిగల్లేదు.. ఎక్కువ మంది హైదరాబాదీలే
-
సౌదీ ఘటనలో హైదరాబాదీ యువకుడు సురక్షితం
సౌదీ అరేబియా మదీనా సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంలో 42 మంది భారతీయ ఉమ్రా యాత్రికులు సజీవ దహనం అయ్యింది తెలిసిందే. మృతుల్లో అత్యధికంగా తెలంగాణ హైదరాబాద్‌కు చెందినవాళ్లే ఉన్నారు. అయితే ఈ ప్రమాదం నుంచి ఇద్దరు సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది.హైదరాబాద్ అసిఫ్ నగర్, హబీబ్ నగర్‌కు చెందిన 44 మంది మక్కా యాత్ర కోసం అల్ మక్కా, ఫ్లై జోన్ ట్రావెల్స్ నుంచి టికెట్లు బుక్ చేసుకున్నారు. ఈ నెల 9వ తేదీన వాళ్లు అక్కడికి వెళ్లారు. మొత్తం 46 మంది ప్రయాణికులతో కూడిన బస్సు మక్కా యాత్ర తర్వాత గత రాత్రి మదీనాకు వెళ్తోంది. ఆ సమయంలో దాటాక వాళ్లు ప్రయాణిస్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో 42 మంది మరణించగా.. మృతుల్లో హైదరాబాద్‌కు చెందిన వాళ్లే 16 మంది ఉన్నారు. అయితే మృతుల్లో నగరానికి రెండు కుటుంబాలకు చెందిన 15 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఒక కుటుంబంలో 8 మంది, మరో కుటుంబంలో ఏడుగురు ప్రమాదంలో సజీవ దహనం అయ్యారు. ఆ కుటుంబాల వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది. బస్సు డ్రైవర్‌తో పాటు హైదరాబాద్‌కు చెందిన షోయబ్ అనే యువకుడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ విషయాన్ని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ధృవీకరించారు.‘‘మక్కా యాత్రికులు మరణించడం దురదృష్టకరం. హైదరాబాద్ నుంచి 44 మంది యాత్రికులు వెళ్లారు. ప్రమాద సమయంలో బస్సులో 46 మంది ఉన్నారు. నగరానికి చెందిన 16 మంది మరణించారు. వాళ్ల వివరాలు సేకరిస్తున్నాం. షోయబ్ అనే యువకుడు మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు’’ అని తెలిపారు. మరోవైపు.. ప్రమాద సమాచారం అందుకున్న బంధువులు ట్రావెల్ ఏజెన్సీలకు వద్దకు చేరుకుంటున్నారు. అయితే ఫ్లై జోన్ ట్రావెల్స్ నిర్వాహకులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.సాయంత్రానికే ఆ స్పష్టత: నాంపల్లి ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదం దిగ్భ్రాంతిని గురిచేసింది. మెహదీపట్నం నుంచి ఒక యువకుడు ఉదయాన్నే నాకు కాల్ చేశాడు. ఇక్కడ బాధిత కుటుంబాలను కలిసాను. సంబంధిత ట్రావెల్స్ నుంచి బాధిత కుటుంబాలకు సరైన సమాచారం ఇవ్వడం లేదు. మా పార్టీ అధినేత, ఎంపీ అసరుద్దీన్ ఓవైసీ ఇండియన్ ఎంబసీ, సౌదీ ఎంబసీతో మాట్లాడుతున్నారు. బాధ్యత కుటుంబాలను ఆదుకుంటాం. ప్రతి కుటుంబాన్ని స్వయంగా వెళ్లి కలుస్తాం. మృతదేహాలను ఇక్కడికి రప్పించడంపై సందేహాలు నెలకొన్నాయి. మా బృందం ఒకటి సాయంత్రానికి సౌదీ చేరుకుంటుంది. ఆ తర్వాతే మృతదేహాల తరలింపునకు అవకాశం ఉందా? లేదా? అనే దానిపై క్లారిటీ వస్తుంది. -
నిద్రలోనే 42 మంది సజీవదహనం అంతా హైదరాబాద్ వారే..!
-
సౌదీ ప్రమాదం: మృతి చెందిన హైదరాబాదీలు వీళ్లే..
సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదంలో ఉమ్రా యాత్రికులు దుర్మరణం పాలయ్యారు. బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీ కొట్టి మంటలు చెలరేగడం.. అంతా గాఢ నిద్రలో ఉండడంతో సజీవ దహనం అయ్యారు. వీళ్లంతా భారత్ నుంచే అక్కడికి వెళ్లినట్లు సమాచారం. అయితే మృతులు హైదరాబాద్‌కు చెందిన యాత్రికులే. ‘‘సీఎం ఆదేశాల మేరకు మృతుల వివరాల కోసం సౌదీ ఎంబసీని సంప్రదించాం. ఇప్పటిదాకా అందిన నివేదికల ప్రకారం మృతుల్లో దాదాపు 16 మంది తెలంగాణ వాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. ’’ అని మంత్రి దుదిళ్ల శ్రీధర్‌బాబు చెబుతున్నారు. Click here for the list of Passengers Detailsహైదరాబాద్ నుంచి మొత్తం 44 మంది యాత్రికులు అక్కడికి వెళ్లారు. మరణించిన 16 మంది మల్లేపల్లి బజార్‌ఘాట్ ప్రాంతానికి చెందిన వాళ్లని తెలుస్తోంది. రహీమున్నీసా, అబ్దుల్ ఖాదీర్ మహమ్మద్, ఫర్హీన్ బేగం, మహ్మద్ మస్తాన్, గౌసియా బేగం, మహ్మద్ మౌలానా, ఫర్వీన్ బేగం, షెహనాజ్ బేగం, షౌకత్ బేగం, మహ్మద్ సోహైల్, జకీన్ బేగం, జహీయా బేగం, మరో నలుగురు మల్లేపల్లి నుంచి వెళ్లినట్లు తెలుస్తోంది. పైన చిత్రాల్లో ఉన్నవాళ్లంతా హైదరాబాద్ నుంచి ఉమ్రా యాత్రకు వెళ్లినవాళ్లే. వీళ్లలో చాలా మంది తమ బంధువుల ఫోన్లకు స్పందించడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరణించిన వివరాలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ట్రావెల్ ఏజెన్సీ వద్దకు బంధువులుహైదరాబాద్ నుంచి మొత్తం 44 మంది ఉమ్రా యాత్రకు వెళ్లారు. మల్లేపల్లిలోని అల్ మీనా ట్రావెల్స్ నుంచి 20 మంది, ఫ్లైజోన్స్ ట్రావెల్స్ నుంచి 24 మంది టికెట్లు బుక్ చేసుకున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రమాదం నేపథ్యంలో ఏజెన్సీల వద్దకు వద్దకు జనాల తాకిడి పెరిగింది. తమ వాళ్లు ఎలా ఉన్నారనే ఆందోళనతో పలువురు అక్కడికి చేరుకుని ఆరా తీస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఘటన నుంచి బస్సు డ్రైవర్‌తో పాటు హైదరాబాద్‌కు చెందిన షోయబ్ అనే వ్యక్తి సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది.ఈ ఘోర ప్రమాదంపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ‘‘ఈ ఘటనపై రియాద్‌లోని భారత రాయబార కార్యాలయంలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అయిన అబూ మాథెన్ జార్జ్‌తో నేను మాట్లాడా. వారు ఈ ఘటనపై సమాచారం సేకరిస్తున్నామని చెప్పారు. హైదరాబాదుకు చెందిన రెండు ట్రావెల్ ఏజెన్సీలను నేను సంప్రదించాను. ప్రయాణికుల వివరాలను రియాద్ ఎంబసీకి, విదేశాంగ కార్యదర్శికి పంపించాను. మృతదేహాలను భారత్‌కు తీసుకురావాలని, ఎవరైనా గాయపడినట్లయితే వారికి తగిన వైద్య చికిత్స అందేలా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా విదేశాంగ మంత్రి డా. ఎస్. జైశంకర్‌ను కోరుతున్నా అని అన్నారు. #WATCH | Delhi | On the bus accident in Saudi Arabia, Hyderabad MP Asaduddin Owaisi says, "...Forty-two Hajj pilgrims who were travelling from Mecca to Medina were on a bus that caught fire...I spoke to Abu Mathen George, Deputy Chief of Mission (DCM) at the Indian Embassy in… pic.twitter.com/z88Pa8GmsS— OTV (@otvnews) November 17, 2025స్పందించిన విదేశాంగ శాఖసౌదీ అరేబియా మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని, తగిన సహాయ సహకారాలు అందిస్తామని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ భరోసా ఇచ్చారు. మరోవైపు.. సౌదీలో జరిగిన బస్సు ప్రమాదంపై ఉన్నతాధికారులు అప్రమత్తం అయ్యారు. జెడ్డాలో ఉన్న కాన్సులేట్ జనరల్, రియాద్‌లోని డిప్యూటీ అంబాసిడర్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. యాత్రికుల వివరాలపై పూర్తి సమాచారం తెలియజేయాలని కోరారు. మరోపక్క.. విదేశీ వ్యవహారాల శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని పూర్తి వివరాలు అందజేయాలని ఢిల్లీలో ఉన్న రెసిడెంట్ కమిషనర్, కో ఆర్డినేషన్ సెక్రెటరీకి తెలంగాణ ప్రభుత్వం నుంచి అదేశాలు జారీ అయ్యాయి. -
డీజిల్ ట్యాంకర్ ను ఢీకొట్టిన బస్సు.. స్పాట్ లోనే 42 మంది..
-
సౌదీలో ఘోర ప్రమాదం.. హైదరాబాదీలు దుర్మరణం!
సాక్షి, ఢిల్లీ/హైదరాబాద్: సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం సంభవించింది(Saudi Arabia Bus Accident). మక్కా నుండి మదీనాకు ఉమ్రా యాత్రికులతో వెళ్తున్న బస్సు అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలిపోయి అందులోని 45 మంది సజీవ దహనం అయ్యారు. మృతులంతా హైదరాబాద్(తెలంగాణ) వాసులేనని తేలింది.స్థానిక కాలమానం ప్రకారం.. ఆదివారం అర్ధరాత్రి దాటాక 1.30గం. ప్రాంతంలో ముఫ్రిహాత్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. డీజిల్ ట్యాంకర్‌ను బస్సు ఢీ కొట్టడంతో రెండు వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండడంతో అగ్నికి ఆహుతి అయ్యారు. మక్కా యాత్ర ముగించుకుని మదీనాకు వెళ్తున్న సమయంలో ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది. మృతుల్లో 11 మంది మహిళలు, 10 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. ప్రమాద స్థలంలో అత్యవసర సేవలు కొనసాగుతున్నాయి. డ్రైవర్‌తో పాటు షోయబ్ అనే యువకుడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ప్రస్తుతం యువకుడికి ఐసీయూలో చికిత్స అందుతోంది.సీఎం రేవంత్ దిగ్భ్రాంతిఈ ఘోర ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. కేంద్రం, సౌదీ ఎంబసీతో మాట్లాడాలని సూచించారు. ఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రిత్వ శాఖతో ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సంప్రదింపులు జరుపుతున్నారు. కంట్రోల్ రూమ్ నెంబర్లు సౌదీలో బస్సు ప్రమాదానికి సంబంధించిన వివరాలు, సహయచ చర్యల వివరాలు తెలుసుకునేందుకు తెలంగాణ సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. బాధిత కుటుంబాలు 24X7 సమాచారం కోసం +91 79979 59754, +91 99129 19545 ఫోన్నెంబర్లను ఆశ్రయించాలని అధికారులు సూచిస్తున్నారు. ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్‌తో సమన్వయం చేయాలని అధికారులకు ఇప్పటికే సీఎస్ అదేశాలు జారీ చేశారు. జెడ్డా హెల్ప్‌లైన్ నెంబర్ ఇదే.. సౌదీ అరేబియాలో మదీనా సమీపంలో జరిగిన దుర్ఘటనలో భారతీయ ఉమ్రా యాత్రికులు దుర్మరణం పాలయ్యారు. ఈ నేపథ్యంలో జెడ్డాలోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో 24x7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నంబర్: 8002440003 ద్వారా బాధితుల సమాచారం కోసం ఎప్పుడైనా సంప్రదించవచ్చని అధికారులు సూచిస్తున్నారు. -
‘హజ్’ కోటా నిర్థారణ.. ఎందరు వెళ్లొచ్చంటే..
న్యూఢిల్లీ: హజ్ యాత్ర-2026కు సంబంధించి భారత్ కొటా ఎంతనేది నిర్ణారణ అయ్యింది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు సౌదీ అరేబియాలో తన అధికారిక పర్యటన సందర్భంగా జెడ్డాలో ద్వైపాక్షిక హజ్ ఒప్పందంపై సంతకం చేశారు. 2026 హజ్ యాత్రకు భారత యాత్రికుల కోటా ఇప్పుడు 1,75,025గా నిర్ధారణ అయ్యింది. మంత్రి రిజిజు నవంబర్ 7 నుండి 9 వరకు సౌదీ అరేబియాలో అధికారిక పర్యటన చేస్తున్నారు. ఈ సందర్భంగా సౌదీ హజ్, ఉమ్రా మంత్రి తౌఫిక్ బిన్ ఫౌజాన్ అల్ రబియాతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఇరుదేశాల సమన్వయం, లాజిస్టిక్స్ ఏర్పాట్లు మొదలైన అంశాలపై దీనిలో చర్చించారు. భారత యాత్రికుల కోసం అవసరమైన ప్రక్రియను క్రమబద్ధీకరించేందుకు ఇరుపక్షాలు తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయని ఒక అధికారిక ప్రకటన తెలిపింది. A significant step in deepening the India–Saudi Arabia ties 🇮🇳🤝🇸🇦Held a Bilateral Meeting & signed the Bilateral Haj Agreement with H.E. Dr. Tawfiq bin Fawzan Al-Rabiah, Minister of Hajj & Umrah, Kingdom of Saudi Arabia. Haj Quota of 175,025 has been secured for Indian Pilgrims… pic.twitter.com/Yonkj8U0LT— Kiren Rijiju (@KirenRijiju) November 9, 2025ఈ సమావేశం తర్వాత, రెండు దేశాల ప్రతినిధులు హజ్- 2026 కోసం ద్వైపాక్షిక హజ్ ఒప్పందంపై సంతకం చేశారు. హజ్లో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలను, టెర్మినల్ వన్, హరమైన్ స్టేషన్‌తో సహా జెడ్డా, తైఫ్‌లోని హజ్, ఉమ్రా తదితర ప్రదేశాలను మంత్రి సందర్శించారు. భారత్-సౌదీ అరేబియా సంబంధాలను మరింతగా పెంచుకోవడంలో ఇది ఒక ముఖ్యమైన అడుగు అని రిజిజు ‘ఎక్స్’ లో రాశారు.ఇది కూడా చదవండి: ఆ రాష్ట్రాల్లో కేరళ బస్సులు బంద్ -
మరో అద్భుతానికి శ్రీకారం, సౌదీలో తొలి స్కై స్టేడియం
అబ్బుర పరిచే వింతలకు, లగ్జరీ భవనాలకు విశేషాలకు నిలయం సౌదీ అరేబియా. తాజాగా సౌదీ అరేబియా ప్రపంచంలోనే తొలి "స్కై స్టేడియం" నిర్మాణానికి సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది. సౌదీ అరేబియా తన నియోమ్ మెగాసిటీ ప్రాజెక్ట్, ది లైన్లో భాగంగా 'నియోమ్ స్టేడియం' పేరుతో ఈ స్కై స్టేడియాన్ని నిర్మించనుంది.సోషల్‌లో షేర్ అవుతున్న నివేదికల ప్రకారం 2034 FIFA (FIFA World Cup 2034) ప్రపంచ కప్ కోసం మ్యాచ్‌లను నిర్వహించడానికి ఈ స్టేడియం 2027లో నిర్మాణాన్నిప్రారంభించి 2032 నాటికి పూర్తి చేయనుంది. ఎడారి దేశంలో భూమికి దాదాపు 350 మీటర్ల ఎత్తులో నిర్మించననున్న ఏ స్టేడియం 2034 ఫీఫా ప్రపంచకప్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుందని తెలుస్తోంది. 46,000 మంది కూర్చోవచ్చట. 48-జట్ల టోర్నమెంట్‌ను నిర్వహించడానికి సౌదీ అరేబియా నిర్వహించే గ్లోబల్ ఈవెంట్‌కు ఇది మరింత వన్నె తెస్తుందని అంచనా. 🚨Saudi Arabia is set to construct the planet's inaugural "sky stadium," dubbed the NEOM Stadium, seamlessly embedded within the visionary metropolis of The Line. Elevated an astonishing 350 meters (1,150 feet) in the air, this innovative venue will boast 46,000 seats and rely… pic.twitter.com/Djn8QZsyPB— KILOWI BLOG ⚽🏀🥊 (@larry_graphics_) October 22, 2025మరోవై పుప్రపంచ కప్ నాటికి ఈ నిర్మాణం పూర్తవుతుందా అనేదానిపై చాలా మంది నిపుణులు సందేహాలు వ్యక్తం చేశారు. 2017లో ప్రారంభించబడిన నియోమ్, ఇప్పటికే జాప్యాలు, లాజిస్టికల్ సవాళ్లు, మానవ హక్కులు మరియు పర్యావరణ సమస్యలపై విమర్శలను ఎదుర్కొంది. అయితే దీనిపై సౌదీ అధికారులు మాత్రం ఆశాజనకంగానే ఉన్నారు. ఇది సాకారం అయితే, స్కై స్టేడియం చరిత్రలో అత్యంత అద్భుతమైన క్రీడా వేదికలలో ఒకటిగా మారనుంది. ప్రపంచ వేదికపై సౌదీ అరేబియా రియల్ ఎస్టేట్ అభివృద్ధికి మచ్చుతునకగా మిగిపోనుంది. కాగా 2034 ఫిఫా ప్రపంచ కప్ నిర్వహణకు బిడ్ సమర్పించిన ఏకైక దేశం సౌదీ అరేబియా. ఇంతకు ముందు ఎన్నడూ లేని నిర్వహించనున్న ప్రపంచ కప్ ఈవెంట్లో ఇదే స్పెషల్ కానుందని భావిస్తున్నారు. ఇదీ చదవండి: బిగ్‌బీ దివాలీ గిఫ్ట్ : నెట్టింట ట్రోలింగ్ మామూలుగా లేదుగా! -
కాపాడకపోతే చావే గతి
న్యూఢిల్లీ: గల్ఫ్ కష్టాలకు అడ్డకట్ట పడడం లేదు. ఉపాధి కోసం వెళ్లిన భారతీయులు అక్కడి యజమానుల చేతుల్లో అష్టకష్టాలు పడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయా గ్రాజ్ (అలహాబాద్)కు చెందిన ఓ వ్యక్తి తన కన్నీటి గాథను వినిపించాడు. సౌదీ అరేబియాలో ఉండిపోయానని, తనను ఈ చెర నుంచి విడిపించి, ఎలాగైనా స్వదేశానికి చేర్చాలని, లేకపోతే చావుతప్ప మరో మార్గం లేదని కన్నీటితో వేడుకున్నాడు. తన పాస్‌పోర్టు లాక్కున్నారని చెప్పాడు. తనను కాపాడాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరాడు. వీడియోలో అతడి వెనుక ఒంటె కనిపిస్తోంది. అతడి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఢిల్లీకి చెందిన ఓ న్యాయవాది ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టుచేశారు. బాధితుడిని రక్షించాలని విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్‌కు విన్నవించారు. వీడియోలో బాధితుడు భోజ్‌పురి భాషలో మాట్లాడుతూ ఏం చెప్పాడంటే... ‘‘మా ఊరు అలహాబాద్ జిల్లాలోని హండియా. పని కోసం సౌదీ అరేబియాకు వచ్చా. నా పాస్‌పోర్టును యజమాని లాక్కున్నాడు. ఇంటికి తిరిగి వెళ్తానని చెబితే చంపేస్తానని బెదిరించాడు. నా తల్లిని చూడాలని ఉంది. ఈ వీడియోను మీరంతా షేర్ చేయండి. నా ఆవేదన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చేరాలన్నదే నా కోరిక. మీరంతా నాకు సహకరించండి. మీరు ముస్లిం అయినా, హిందూ అయినా ఎవరైనా సరే నాకు అండగా ఉండండి. దయచేసి నన్ను ఆదుకోండి. నాకు జీవితం ప్రసాదించండి. లేకపోతే మరణమే గతి’’ అని అభ్యర్థించాడు. ఈ వ్యవహారంపై సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. బాధితుడి జాడ తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించింది. అతడికి సంబంధించిన వివరాలు అందుబాటులో లేకపోవడంతో ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకోవడం సాధ్యం కావడం లేదని పేర్కొంది. అయితే, బాధితుడి ఆవేదనను సౌదీ అరేబియా సెక్యూరిటీ డిపార్టుమెంట్ కొట్టిపారేసింది. అతడి ఆరోపణలకు ఆధారాల్లేవని తేల్చిచెప్పింది. సోషల్ మీడియాలో వీక్షణలు (వ్యూస్), తద్వారా ఆదాయం పెంచుకోవడానికి ఈ ఎత్తుగడ వేశారని అనుమానం వ్యక్తం చేసింది.కఫాలా వ్యవస్థ రద్దయినా..సౌదీ అరేబియాలో కఫాలా వ్యవస్థను రద్దు చేసిన తర్వాత కూడా భారతీయుడు యజమాని చెరలో చిక్కుకుపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆధునిక బానిసత్వంగా విమర్శలు ఎదుర్కొంటున్న కఫాలా వ్యవస్థను సౌదీ ప్రభుత్వం ఇటీవలే రద్దు చేసింది. విదేశీ కార్మికులు పాస్‌పోర్టు లాక్కోవడం, నిర్బంధించడం, వేధించడం నేరమే అవుతుంది. వలస కార్మికుల హక్కుల విషయంలో ఇదొక కీలకమైన సంస్కరణగా చెబుతున్నారు. సౌదీ అరేబియాలోని కార్మికుల్లో ఎక్కువ మంది భారతీయులే కావడం గమనార్హం. -
టూరిస్టు వీసాపై సౌదీ వెళ్తున్నారా? ఇవి తెలియకపోతే అంతే..
ముస్లింలు పవిత్రంగా భావించే మక్కా యాత్రలో ఉమ్రాహ్‌కు ప్రత్యేకత ఉంది. రంజాన్ పర్వదినం తర్వాత హజ్ యాత్ర నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో తబాబ్, అరాఫత్ పర్వత సందర్శన.. సైతానుపై రాళ్లను విసరడం.. అక్కడే ఒక నిద్ర చేయడం వంటి క్రతువులు ఉంటాయి. హజ్ సీజన్లో కాకుండా.. మక్కా యాత్ర చేయడాన్ని ఉమ్రాహ్ అంటారు. ఇప్పుడు ఉమ్రాహ్ విషయంలో సౌదీ సర్కారు కొత్త నిబంధనలను ప్రకటించింది. టూరిస్టు వీసాపై వచ్చేవారికి ఉమ్రాహ్‌కు అవకాశం ఉండదని తేల్చిచెప్పింది.ఏమిటీ ఉమ్రాహ్హజ్లో మాదిరిగానే ఉమ్రాహ్లోనూ క్రతువులుంటాయి. అయితే.. అరాఫత్ సందర్శన, సైతానుపై రాళ్లు వేయడం ఉండదు. ఉమ్రాహ్‌కు వెళ్లేవారు దోవతి, ఉత్తరీయం మాదిరి తెలుపురంగు దుస్తులను ధరించాలి. దీన్ని దీక్షగా భావిస్తారు. నిజానికి మక్కాకు 30కిలోమీటర్ల దూరంలోనే ఈ రీతిలో వస్త్రధారణ చేసి.. యాత్రను ప్రారంభించాలి. భారతీయులు మాత్రం విమానాశ్రయంలోనే ఈ దుస్తులను ధరిస్తారు. మక్కాలోని కాబా చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేశాక.. బయటకు వచ్చి, శిరోముండనం చేయించుకుంటే.. ఉమ్రాహ్ పూర్తవుతుంది. మహిళా భక్తులు శిరోముండనం చేయించుకోరు. కానీ, మూడు లేదా ఐదు కత్తెరలు ఇస్తారు.ఉమ్రాహ్ ప్రయాణాన్ని ప్లాన్ చేయడానికి విదేశాల నుంచి వెళ్లేవారు తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన మార్పులను అసా టూర్స్ అండ్ ట్రావెల్స్ ఓనర్ కైసర్ మహమూద్ తెలిపారు.వీసా దరఖాస్తు చేసేటప్పుడే వసతి బుకింగ్యాత్రికులు ఇకపై వసతిని ధ్రువీకరించకుండా ఉమ్రాహ్ వీసా కోసం దరఖాస్తు చేసుకోలేరు. నుసుక్ యాప్‌కు అనుసంధానించబడిన మసర్ వ్యవస్థ ద్వారా ప్రయాణికులు వీసా దరఖాస్తు సమయంలో ఆమోదించిన హోటల్‌ను ఎంచుకోవాలి. లేదా వారు సౌదీ అరేబియాలోని బంధువులతో ఉంటారని ధ్రువీకరించుకోవాలి. హోటళ్లు, రవాణా మసర్ అని పిలువబడే సౌదీ వ్యవస్థతో అనుసంధానించబడి ఉంటుంది. టాక్సీలను కూడా పోర్టల్ ద్వారానే బుక్ చేసుకోవాలి.బంధువులతో ఉండటానికి హోస్ట్ ఐడీ అవసరంప్రయాణికులు స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఉండాలని ప్లాన్ చేస్తే హోస్ట్ ఏకీకృత సౌదీ ఐడీ నంబర్‌ను అందించాలి. ఈ ఐడీ మీ వీసాకు డిజిటల్‌కు అటాచ్ చేస్తారు. ప్లాన్‌లో ఏదైనా మార్పు ఉంటే వసతి రుజువుగా అదే ఐడీతో సిస్టమ్‌లో అప్ డేట్ చేయాలి.టూరిస్ట్ వీసాలపై ఉమ్రాహ్ చేయకూడదు..టూరిస్ట్ వీసాపై ఉమ్రాహ్ చేయడం నిషేధించారు. ఒకవేళ ఇందుకోసం ప్రయత్నించే యాత్రికులను మదీనాలోని రియాజ్ ఉల్ జన్నా వంటి కీలక ప్రదేశాల్లో ప్రవేశం నిరాకరిస్తారు.డెడికేటెడ్ ఉమ్రాహ్ వీసా తప్పనిసరినుసక్ ప్లాట్‌ఫామ్ ద్వారా లేదా లైసెన్స్ పొందిన ఆపరేటర్ల ద్వారా దరఖాస్తు చేసుకున్న డెడికేటెడ్ ఉమ్రాహ్ వీసా మాత్రమే చెల్లుబాటు అవుతుంది.ప్రయాణ మార్పులు అనుమతించరు..వీసా దరఖాస్తు సమయంలో యాత్రికులందరూ వివరణాత్మక ప్రయాణ ప్రణాళికను అప్లోడ్ చేయాలి. దీన్ని సబ్మిట్ చేసిన తరువాత ఎలాంటి మార్పులు లేదా వాయిదాలకు అవకాశం ఉండదు. ప్రయాణ తేదీలను మార్చడం కుదరవు. తిరుగు ప్రయాణాన్ని వాయిదా వేస్తే ఏజెంట్లకు ఒక్కొక్కరికి కనీసం 734(రూ.18 వేలు) దిర్హమ్లు జరిమానా విధిస్తారు.వీసా ఆన్ అరైవల్యూకే, యూఎస్, కెనడా లేదా షెంజెన్ వీసాలు కలిగి ఉన్నవారు లేదా ఆ దేశాల్లో నివాసితులుగా ఉన్నవారు వీసా ఆన్ అరైవల్ కోసం అర్హులు. ఈ వీసా ఒక సంవత్సరం చెల్లుబాటు అవుతుంది.హోటల్, ట్రాన్స్పోర్ట్ బుకింగ్స్ కోసం తనిఖీలుసౌదీ విమానాశ్రయాల్లో అధికారులు నుసక్ లేదా మసార్ వ్యవస్థల ద్వారా చేసిన అన్ని బుకింగ్‌లను ధ్రువీకరిస్తారు. చెల్లని బుకింగ్‌లు తిరస్కరిస్తారు. దాంతోపాటు అక్కడికక్కడే జరిమానాలు విధించే అవకాశం ఉంటుంది.అధీకృత రవాణాకు మాత్రమే అనుమతియాత్రికులు రవాణాను ముందస్తుగా బుక్ చేసుకోవాలి. టాక్సీలు, బస్సులు లేదా హరమైన్ రైలుతో సహా అధీకృత ఛానెళ్ల ద్వారా ముందే బుక్ చేయాలి. రిజిస్టర్ కాని సర్వీసులు అనుమతించరు.హరామైన్ రైలు టైమింగ్స్మక్కా, మదీనా మధ్య సులువైన రవాణా మార్గం అయిన హరామైన్ హై-స్పీడ్ రైలు ప్రతిరోజూ రాత్రి 9 గంటల వరకు మాత్రమే నడుస్తుంది. దీని తర్వాత వచ్చే ప్రయాణికులు ముందుగానే ప్రత్యామ్నాయ రవాణాను ఏర్పాటు చేయాలి.భారీ జరిమానాలుఈ కొత్త నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే.. అంటే ఎక్కువ కాలం ఉండటం, అనధికార రవాణాను ఉపయోగించడం లేదా తప్పుడు సమాచారంతో దరఖాస్తు చేయడం.. వంటి వాటికి కనీసం 734 దిర్హమ్ల నుంచి జరిమానాలు ఉంటాయి. ఏజెంట్లను కూడా సస్పెండ్ చేసే అధికారం ఉంటుంది.ఇదీ చదవండి: లద్ధాఖ్‌లో వాణిజ్య అవకాశాలు ఇవే.. -
ఒప్పందమా? వ్యూహాత్మకమా!
పాకిస్తాన్, సౌదీ అరేబియాల మధ్య అనూహ్యమైన రీతిలో ఈనెల 17న జరిగిన రక్షణ ఒప్పందం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. రెండు దేశాల రక్షణ సంబంధాలు కొన్ని దశాబ్దాలుగా ఉన్నవే. సౌదీ రాజు ఫైజల్, పాక్ అప్పటి ప్రధాని అయూబ్ ఖాన్ల మధ్య 1967 లోనూ ఒక రక్షణ ఒప్పందం కుదిరింది. కానీ అప్పటి పరిస్థితులు, అవసరాలు సాధారణ స్థాయివి. అప్పటికి పాకిస్తాన్ అణ్వాయుధ దేశం కూడా కాదు. నాటి నుంచి 58 సంవత్సరాల సుదీర్ఘకాలంలో అన్నీ మారాయి. అరబ్ దేశాలు, ముస్లిం దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగానూ ఎంతో సంక్లిష్టంగా కూడా అయ్యాయి. అందువల్లనే ప్రస్తుత ఒప్పందం గమనార్హమైనది అవుతున్నది.దాడి తర్వాతే కుదిరిన ఒప్పందం! ఒప్పందం జరిగిన తక్షణ పరిణామాలు కూడా ప్రాముఖ్యం కలిగినవి. ఈ నెల 9న గల్ఫ్ దేశమైన ఖతార్‌పై ఇజ్రాయెల్ క్షిపణి దాడి జరిపి అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. అమెరికాతో వ్యూహా త్మక సంబంధం గల అరబ్ దేశాలు, తమ ప్రాంతంలో అర డజను అమెరికన్ సైనిక స్థావరాలకు ఆశ్రయం ఇస్తున్నవి అయినప్పటికీ ఈ దాడి జరగటం ఒకటైతే, మళ్లీ దాడులకు వెనుకాడబోమని ఇజ్రాయెల్ ప్రకటించింది. అది చాలదన్నట్లు అమెరికా విదేశాంగమంత్రి మార్కో రూబియో స్వయంగా టెల్ అవీవ్‌కు వెళ్లి ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించటం సౌదీతో పాటుగా సహ గల్ఫ్ దేశాలన్నింటిని తీవ్రమైన అభద్రతా భావానికి గురిచేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అర్ధోక్తులు వాటికి తోడయ్యాయి. ఈ తక్షణ నేపథ్యంలో జరి గిందే పాకిస్తాన్‌తో సౌదీ రక్షణ ఒప్పందం.అక్కరకు రాని అగ్రరాజ్యంఒప్పందం అనంతరం మీడియా ప్రశ్నలకు సౌదీ ప్రభుత్వం ప్రతినిధి ఇచ్చిన ఒక సమాధానం ఇదే స్థితిని ధ్రువీకరిస్తున్నది. ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలు కొన్ని దశాబ్దాలుగా ఉండి, 1967 నాటి ఒప్పందం కూడా ఒకటి ఉన్నప్పుడు తిరిగి ఈ ఒప్పందం ఎందుకన్న ప్రశ్నకు ఆ ప్రతినిధి ఇచ్చిన సమాధానం – ‘అనిశ్చితంగా మారిన భవిష్యత్ అవసరాల కోసం’ అని! పైన ప్రస్తావించిన పరి ణామాల కారణంగా భవిష్యత్తు ఎందుకు అనిశ్చితంగా మారిందో వేరే వివరణ అవసరం లేదు. ఇక్కడ గుర్తించవలసిన మరొక విషయం ఏమంటే, అటువంటి అనిశ్చిత పరిస్థితులలో ఒక అణ్వస్త్ర దేశంతో సౌదీకి ఒప్పందం అవసరమైంది. సాటి గల్ఫ్ దేశం అయిన ఖతార్‌పై ఇజ్రాయెల్ అనే ఒక అణ్వస్త్ర దేశం దాడి జరిపినప్పుడు మరొక అణ్వస్త్ర దేశమైన అమెరికాతో తమకు గల వ్యూహాత్మక సంబంధం సౌదీకి కొరగానిది అయింది. దాంతో ఇస్లామిక్ దేశమైన పాకిస్తాన్‌తో పరస్పర రక్షణ ఒప్పందం అనివార్యం అయినట్లుగా కనిపిస్తోంది. మిగతా దేశాలూ చేరుతాయా?!ఒప్పంద పాఠం వెల్లడి కాలేదు గానీ, వారు అధికారికంగా ఒక ప్రకటనలో తెలియజేసిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి: ‘రెండి టిలో ఏ దేశం పైన బయటి నుండి ఎవరు దాడి జరిపినా రెండవ దేశంపై కూడా జరిపినట్లే పరిగణించి, దాడికి గురైన దేశానికి తోడుగా నిలుస్తారు. ఉభయుల రక్షణకు అవసరమైన పరస్పర సహ కార చర్యలు ఇప్పటికన్నా మరింతగా తీసుకుంటారు’. ఈ ఒప్పందం పరిధిలోకి పాకిస్తాన్ అణ్వస్త్రాలు కూడా వస్తాయా అన్న సూటి ప్రశ్నకు రెండు దేశాల ప్రతినిధులు కూడా... పాకిస్తాన్‌కు గల ఆయుధశక్తి మొత్తం వస్తుందని స్పష్టం చేశారు. పాకిస్తాన్ అణు దేశమే గాక ముస్లిం ప్రపంచంలో అతిపెద్ద సైనిక శక్తి. ఇజ్రాయెల్ నుంచి ముప్పు ఎదుర్కొంటున్న ఇతర గల్ఫ్ దేశాలు సైతం ఈ ఒప్పందంలో చేరవచ్చునా అన్న ప్రశ్నకు పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్, తమ ద్వారాలు ఎవరికీ మూసుకుపోలేదన్నారు. ఖతార్‌పై ఇజ్రాయెల్ దాడి 9న; అరబ్, ఇస్లామిక్ దేశాల శిఖరాగ్ర సమావేశం 15న జరిగిన తర్వాత, 17న ఈ ఒప్పందం కుదిరినప్పటి నుంచి వారం రోజులలో ఆ సమావేశ దేశాలు గాని; ఇజ్రాయెల్, అమెరికా, యూరప్‌లు గాని స్పందించలేదు. భారత ప్రభుత్వ ప్రతినిధి మాత్రం, ‘మా మనోభావాలను సౌదీ నాయకత్వం మన్నించగలదని ఆశిస్తున్నా’మన్నది. అయితే, వెంటనే తలెత్తుతున్న ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. ఒకవేళ సౌదీపై ఇజ్రాయెల్ దాడి జరిపితే పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొంటుందా? పాల్గొంటే అమెరికా ఏం చేయవచ్చు? అదే విధంగా ఇండియా–పాక్‌ల మధ్య సాయుధ ఘర్షణ, లేదా యుద్ధం జరిగితే సౌదీ ప్రభుత్వం తన అపారమైన ఆయుధ సంపత్తిని పాకిస్తాన్‌కు సమకూర్చుతుందా... అన్నవి ఆ ప్రశ్నలు. ఇక్కడ పాక్ రక్షణ మంత్రి 20వ తేదీన చెప్పిన మాటను గమనించాలి. తమ ఒప్పందం ఇరువురి ఆత్మరక్షణకే తప్ప ఇత రులపై దాడి చేసేందుకు కాదని, ఒకవేళ తమపై భారతదేశం దాడి జరిపితే మాత్రం సౌదీ అరేబియా తప్పక రంగంలోకి వస్తుందని, ఆ విషయమై ఎంత మాత్రం సందేహం అక్కర లేదని అన్నారాయన. ఊహకందని పర్యవసానాలుభారత ప్రభుత్వం ఈ అసాధారణ పరిణామాన్ని అనివార్యంగా గమనికలోకి తీసుకోవలసి ఉంటుంది. ఒకవేళ రాగల రోజులలో మరిన్ని అరబ్, ముస్లిం దేశాలు ఈ ఒప్పందంలో చేరితే పరిస్థితి తీవ్రత ఆ మేరకు పెరుగుతుంది. ఇజ్రాయెల్, అమెరికా తీరును బట్టి అది జరగవచ్చు కూడా! ఒప్పందానికి ఇది ఒక కోణం కాగా, ఇజ్రాయెల్ వైఖరిలో గమనించవలసిన మరొక కోణం ఉంది. వారి దాడులు ఖతార్‌తో ఆగుతాయా లేక ఇతర గల్ఫ్ దేశాలకు విస్తరించే అవకాశం ఉందా? ఈ దేశాలకు అమెరికాతో గల వ్యూహాత్మక సంబంధాలు, ఆ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాల పరిస్థితి ఏమిటి? ప్రస్తుత ఒప్పందాన్ని ప్రభావితం చేసి నిరుపయోగంగా మార్చేందుకు అమెరికా ప్రయత్నిస్తుందా? ఇటువంటి ఒప్పందం మూలంగా రాజకీయంగా పాకిస్తాన్ పాత్ర బలోపేతంగా మారే అవకాశం ఉంది గనుక ఆ ప్రభావం భారత్‌పై ఏ విధంగా ఉండవచ్చు?... అన్నీ ప్రశ్నలే. మున్ముందు అనేక మలుపులుఏమైనా... ఖతార్‌పై దాడి, అమెరికా మౌనం, దోహా శిఖరాగ్ర సమావేశం, సౌదీ–పాక్ ఒప్పందం అనే నాలుగు పరిణామాలు మాత్రం అసాధారణమైనవి. కేవలం 9 రోజుల పరిధిలో చోటు చేసుకున్న ఈ పరిణామాల అర్థం మున్ముందు అనేక రూపాలలో ఉంటుంది. ఈ పరిణామ పరంపరకంతా మూలకారణమైన పాలస్తీనా సమస్య ఏమి కానున్నదనేది అన్నింటికీ మించిన ప్రశ్న. వాస్త వానికి ఆ సమస్య కొనసాగటంలో ఇజ్రాయెల్, అమెరికాల బాధ్యత ఎంతున్నా, పరిష్కారం కోసం కచ్చితమైన వైఖరితో పట్టుదలగా ప్రయత్నించని దోషం మాత్రం అరబ్ దేశాలదే! వారు ఇప్పటికైనా ఆ పని చేయనట్లయితే, అన్ని దాడులు, పాలస్తీనా హత్యాకాండల దోషం వారిదే అవుతుంది.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
పేపర్ పువ్వులతో భారత సంతతి మహిళ గిన్నిస్ రికార్డు..!
చాలామంది ఏదో ఒక కళ నేర్చుకుంటుంటారు. అయితే దాన్ని ఏవో కారణాలతో వదిలేయాల్సి రావొచ్చు. అయితే కొందరూ సమయం దొరికితే ఆ కళకు పదును పెట్టుకుంటూ..తనకు సాటిలేరెవ్వరూ అన్నట్లుగా ఆరితేరిపోతారు. ఆ టాలెంట్ ఊరికేపోదు ప్రపంచ మొత్తం ఆశ్చర్యపోయే రేంజ్లో రికార్డు సృష్టించి శెభాష్ అనిపించుకుంటారు. అలాంటి కోవకు చెందించే సౌది అరేబియాలో ఉంటున్న ఈ భారత సంతతి మహిళ నీను ప్రదీప్.కేరళకు చెందిన నీనుకి చిన్నప్పటి నుంచి చేతికళల పట్ల అమితాసక్తి. అయితే ఉన్నత చదువులు అభ్యసించడం వల్ల ఆ కళను కొనసాగించ లేకపోయింది. అలా ఆమె బీకామ్, ఎంకామ్ పూర్తి చేసిన అనంతరం పెళ్లి చేసుకుని సౌదీ అరేబియాకు వెళ్లిపోయింది. ఆ దంపతుల ప్రేమనురాగాలకు గుర్తుగా అరోనా, అలీనా ఇద్దరు పిల్లలు పుట్టడంతో క్షణం తీరిక లేకుండా గడిపింది. ఎప్పుడైతే పిల్లలు పెద్దవాళ్లై స్కూళ్లకు వెళ్లడం ప్రారంభించారో అప్పటి నుంచి మంచి తీరిక దొరికింది ఆమెకు. ఉదయమే భర్త సామ్సన్ జాకబ్ ఉద్యోగానికి, పిల్లలు స్కూల్‌కి వెళ్లిన తర్వాత చాలా ఖాళీ సమయం దొరికేది. ఆ సమయాన్ని అలా వృధాగా జారిపోనీకూడదని, తనకు ఎంతో ఇష్టమైన అభిరుచి అయిన హ్యాండ్ ఆర్ట్‌కి మళ్లీ పదును పెట్టుకునేందుకు రెడీ అయ్యింది. అయితే అందుకు అవసరమయ్యే ఫ్యాన్సీ క్రాఫ్ట్ టూల్స్, ఆర్ట్‌పరికరాలు చాలా ఖరీదుగా ఉండటమేగాక అందుబాటులో కూడా ఉండేవి కాదు. దాంతో ఆమె ఇంట్లో దొరికే వేస్ట్ మెటీరియల్స్ ఎగ్‌షెల్, పిస్తా షెల్‌లతో తన కళను మరింత సృజనాత్మక ధోరణిని జోడించి మెరుగులు పెట్టుకుంది. చెప్పాలంటే వేస్ట్‌తో ఇంటి అలంకార వస్తువులను తయారు చేసే స్థాయికి చేరుకుంది. అలా ఆమె పేపర్ పువ్వులు తయారు చేసే కాగితపు ఆర్ట్‌లో ఆరితేరిపోయింది. ఫలితంగా ఇల్లంతా నీను చేసిన పేపర్ కళాకృతులతో నిండిపోయింది. ఇక కొన్నింటిని ఈవెంట్లలోనూ, పలు స్టాల్స్ తన కళను ప్రదర్శించేది. అలా ఆమె కళ ప్రజలను ఇంప్రెస్ చేయడమే కాదు నేర్చుకునేలా ప్రేరేపించింది. ఇంతలో కోవిడ్ 19 రావడంతో తన పనికి బ్రేక్‌పడినా..ఆ లాక్‌డౌన్‌ని కూడా నీను సద్వినియోగం చేసుకునేలా మరింత వేగవంతంగా చేయడంపై పట్టు సంపాదించింది. రికార్డుల స్థాయికి..అలా ఆ నైపుణ్యం ఆసియా బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు దక్కించుకునేందుకు దారితీసింది. క్రేప్ పేపర్ ఉపయోగించి ఒక వ్యక్తి తయారు చేసే వివిధ రకాల గరిష్ట పువ్వులకు మించి చేసే సామర్థ్యం నీనులో రికార్డు స్థాయిలో ఉందని ప్రశంసలందుకుంది. అది ఆమెకు గిన్నిస్ టైటిల్‌కు మార్గం సుగమం చేసింది. తన సామర్థ్యంపై ఉన్న నమ్మకంతో నీను 2023లో గిన్నిస్ టైటిల్ కోసం దరఖాస్తు చేసుకుంది. దాదాపు రెండేళ్ల తర్వాత గిన్నిస్ వాళ్లు స్పందించడంతో ఆ సాహసానికి పూనుకుంది. అలా ఆమె కేవలం 4 గంటల 39 నిమిషాల్లో ఒక వెయ్య నూటొక్క(1101) కాగితపు పువ్వులతో కూడిన 574 అడుగుల పూల ఫ్రేమ్‌ని తయారు చేసి గిన్నిస్ రికార్డులకెక్కింది. అభిరుచిగా మొదలైన ఆర్ట్..రికార్డుల సృష్టించే స్థాయికి దారితీసింది. అదీగాక ఈ కళలు మానసిక ఉల్లాసం తోపాటు మనపై మనకు నమ్మకాన్ని అందిస్తాయి కూడా.(చదవండి: కర్ణుని మాదిరి జననం..! కట్‌చేస్తే ఇవాళ స్టార్ రేంజ్ క్రేజ్..) -
పాకిస్తాన్‌కు చీప్‌గా అప్పు ఇస్తున్నది ఈ దేశమే..
నగదు కొరతతో బాధపడుతున్న పాకిస్తాన్ (Pakistan) ఇతర దేశాలు, అంతర్జాతీయ సంస్థల సహాయంపై తీవ్రంగా ఆధారపడుతుంది. ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్, చైనా, అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) కీలక భూమిక వహిస్తున్నా, మరో ముస్లిం దేశమైన సౌదీ అరేబియా కూడా పాకిస్తాన్‌కు స్థిరమైన ఆర్థిక మద్దతును అందిస్తోంది.తక్కువ వడ్డీకే రుణాలుసౌదీ అరేబియా (Saudi Arabia) పాకిస్తాన్‌కు కేవలం 4 శాతం వడ్డీకే రుణాలు అందిస్తోంది. ఇది చైనా, ఇతర అంతర్జాతీయ రుణదాతలతో పోల్చితే చాలా తక్కువ. సౌదీ రుణాల వడ్డీ రేటు చైనాకు చెల్లించే నగదు డిపాజిట్ వడ్డీ కంటే మూడింట ఒక వంతు మాత్రమే. విదేశీ వాణిజ్య రుణాల ఖర్చుతో పోలిస్తే కూడా సౌదీ రుణ ఖర్చు సగం కంటే తక్కువ.పాకిస్తాన్ రుణాలను సకాలంలో తిరిగి చెల్లించకపోయినా, సౌదీ అరేబియా అదనపు రుసుములు లేకుండా ప్రతి సంవత్సరం రుణ గడువును పొడిగిస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్‌కు సౌదీ అరేబియా ఇచ్చిన 2 బిలియన్ డాలర్ల రుణం గడువు డిసెంబర్లో ముగియనుంది. అయితే సౌదీ ఆర్థిక మంత్రిత్వ శాఖ దీన్ని మళ్లీ పొడిగించాలనే యోచనలో ఉంది.ఐఎంఎఫ్ ప్రోగ్రాం కింద పాకిస్తాన్‌కు సౌదీ అరేబియా ఇచ్చిన మరో 3 బిలియన్ డాలర్ల రుణానికి వచ్చే ఏడాది జూన్‌లో గడువు ముగుస్తుంది. పాకిస్తాన్ తన బాహ్య ఆర్థిక లోటును పూడ్చుకోవడానికి ఈ రుణాన్ని తీసుకుంది.ఇదీ చదవండి: అమెరికా పెంచితే మేం రద్దు చేస్తాం..! -
భారత్ దాడి చేస్తే.. సౌదీ మాకు అండగా వస్తుంది
న్యూఢిల్లీ: సౌదీ అరేబియాతో చేసుకున్న రక్షణ ఒప్పందం ఫలితంగా భారత్ తమపై దాడి చేసిన పక్షంలో ఆ దేశం రంగంలోకి దిగుతుందని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేదని స్పష్టం చేశారు. ‘ఈ ఒప్పందం ఏ ఒక్క దేశాన్నో లక్ష్యంగా చేసుకున్నది కాదు. ఉమ్మడి రక్షణకు కుదిరిన అంగీకారం. దురాక్రమణ కోసం దీనిని వాడుకోబోం’అని ఆయన జియో టీవీకిచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ‘మా అణు విధానం ప్రత్యేకంగా భారత్నుద్దేశించిందే అయినప్పటికీ సౌదీ అరేబియా అత్యవసరమైన పక్షంలో మా అణు పాటవం సహా సైనిక సామర్థ్యాలను అన్నింటినీ వాడుకునేందుకు ఈ సమగ్ర ఒప్పందంలో ఏర్పాట్లున్నాయి’అని ఆయన వివరించారు. రెండు దేశాల్లో ఏ ఒక్క దేశంపై దురాక్రమణ జరిగినా దానిని ఉమ్మడి దురాక్రమణగా పరిగణించేందుకు ఈ ఒప్పందంలో నిబంధనలున్నాయన్నారు. ఇలా ఉండగా, పాక్ ఆర్మీతో మరో దఫా తలపడాల్సి వస్తే భారత్ ఇప్పుడు సౌదీ అరేబియాను సైతం ఎదుర్కోవాల్సి ఉంటుందని భౌగోళిక రాజకీయ విశ్లేషకుడు ఇయాన్ బ్రెమ్మర్ చెబుతున్నారు. -
భారత్ టార్గెట్‌గా పాక్ చర్యలు.. ఆ దేశంతో సంచలన ఒప్పందం
ఇస్లామాబాద్: భారత్ విషయంలో దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. పాకిస్తాన్-సౌదీ అరేబియా మధ్య ఇటీవల కుదిరిన వ్యూహాత్మక రక్షణ ఒప్పందం నేపథ్యంలో పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ భారత్‌తో యుద్ధ పరిస్థితులు తలెత్తితే.. సౌదీ తప్పకుండా పాక్‌కు అండగా పోరాడుతుంది అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై చర్చ నడుస్తోంది.పాకిస్తాన్-సౌదీ అరేబియా మధ్య ఇటీవలే ఓ రక్షణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం రెండు దేశాల్లో ఏ దేశంపై దాడి జరిగినా రెండింటిపై దాడిగా భావించి ఎదుర్కొంటారు. ఈ నేపథ్యంలో పాక్-సౌదీ మధ్య కుదిరిన ఒప్పందంపై పాకిస్తాన్ రక్షణ మంత్రి స్పందిస్తూ..‘ఒకవేళ పాకిస్తాన్, భారత్ మధ్య యుద్ధం తలెత్తే పరిస్థితులు ఎదురైతే.. మాకు సౌదీ అండగా పోరాడుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఒప్పందంలో భాగంగా వ్యూహాత్మక పరస్పర సహాయం ఉంటుంది. ఈ ఒప్పందం కింద అణ్వాయుధాలు వాడకూడదన్న నిబంధన ఏమీ లేదు. మాకు ఉన్న అన్ని సామర్థ్యాలను వినియోగిస్తాం. పాకిస్తాన్ అణ్వాయుధ తనిఖీలకు ఎప్పుడూ సహకరిస్తుందని.. నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడదని పేర్కొన్నారు. అయితే, ఇది కేవలం రక్షణాత్మక ఒప్పందం మాత్రమే అని పేర్కొన్నారు.Pakistan Defence Minister Khawaja Asif claims that Saudi Arabian troops will get involved if there is a military confrontation between India and Pakistan as part of new Pakistan-Saudi Military pact even though no countries have been named in the pact as aggressors. pic.twitter.com/AxPwHTNOef— Aditya Raj Kaul (@AdityaRajKaul) September 19, 2025చాలా ఏళ్లుగా తాము సౌదీ సైనికులకు శిక్షణ ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. దానికి పొడిగింపుగా ఈ ఒప్పందాన్ని అభివర్ణించారు. ఇరు దేశాల్లో దేనిపై దాడి జరిగినా.. సమష్టిగా ఎదుర్కొంటాయని పేర్కొన్నారు. అలాగే, అఫ్గానిస్థాన్‌ను తమ ప్రత్యర్థి దేశంగా అభివర్ణించారు. ఇదే సమయంలో అరబ్ దేశాలు కూడా ఈ డీల్ భాగం అవుతాయా అని ప్రశ్నించగా.. ముందస్తుగా దీనికి నేనేమీ సమాధానం చెప్పలేను అని క్లారిటీ ఇచ్చారు. ఈ ఒప్పందంలో మూడో దేశం చేరకుండా.. లేదా మరో దేశంతో ఇలాంటి అగ్రిమెంట్ చేసుకోకూడదని ఎటువంటి క్లాజు లేదని చెప్పారు. పాకిస్తాన్‌కు బలహీనతలు ఉండటంతో.. నాటో వంటి ఏర్పాట్లు ఉండాలని తాను చాలా కాలంగా చెబుతున్నానన్నారు. ముఖ్యంగా ముస్లిం ప్రజలు, దేశాలు ఉన్నచోట సమష్టిగా దేశాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.🇵🇰🇸🇦 Saudis are under defense by nuclear missiles now!Pakistani Defense Minister Khawaja Asif said Pakistan’s nuclear capabilities would be available under the new Pakistan-Saudi mutual defence pact“What we have, our capabilities, will absolutely be available under this pact” pic.twitter.com/V5MJrnKtDw— Unbiased, Unreported News (@Kiraguri254) September 20, 2025ఇక, కొన్ని నెలల క్రితం భారత్-పాక్ (India-Pakistan) మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడి బదులుగా మన బలగాలు పాక్‌లోని ఉగ్రమూకలను మట్టుపెట్టాయి. దాని తర్వాత రెండు దేశాల మధ్య కొన్నిరోజుల పాటు ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ఒప్పందం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. తాజాగా మరోసారి భారత్‌తో యుద్ధం విషయాన్ని ప్రస్తావించడం గమనార్హం. -
నిస్సాన్ మాగ్నైట్‌కు రీకాల్: 1500 కార్లు వెనక్కి!
నిస్సాన్ కంపెనీ అక్టోబర్ 2024లో మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేసింది. దీంతో సంస్థ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ సెటప్‌తో భారతదేశంలో తయారు చేసిన మాగ్నైట్‌ను సౌదీ అరేబియాకు ఎగుమతి చేయడం ప్రారంభించింది. అదే సమయంలో దేశీయ విఫణిలో విక్రయించడానికి కూడా ఉత్పత్తి చేస్తోంది. కాగా ఇప్పుడు సౌదీ అరేబియా మార్కెట్లో విక్రయించిన నిస్సాన్ మాగ్నైట్ కోసం బ్రాండ్ రీకాల్ జారీ చేసింది.బ్రేక్ పైపు, హీట్ షీల్డ్ మధ్య తగినంత ఖాళీ లేకపోవడం వల్ల కలిగే భద్రతా సమస్యను నిస్సాన్ గుర్తించింది. ఇది బ్రేక్ పెడల్ పనితీరును దెబ్బతీస్తుందని.. ప్రమాదానికి కారణమవుతుందని కంపెనీ వెల్లడించింది. బ్రేక్ ఫ్లూయిడ్ లీకేజీకి కూడా దారితీస్తుందని కూడా సంస్థ పేర్కొంది. ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించడానికి నిస్సాన్ రీకాల్ జారీచేసింది. ఈ రీకాల్ నిర్ణయం సౌదీ అరేబియాలోని మొత్తం 1,552 యూనిట్ల మాగ్నైట్ ను ప్రభావితం చేయబోతోంది. అయితే నిస్సాన్ మోటార్ ఇండియా భారతదేశానికి సంబంధించిన మోడళ్లకు ఎటువంటి రీకాల్ జారీ చేయలేదు.ఇదీ చదవండి: ఈ20 ఫ్యూయెల్ ఎఫెక్ట్.. ఫెరారీ స్టార్ట్ అవ్వడం లేదట!!భారతదేశం, సౌదీ అరేబియాలో విక్రయించే నిస్సాన్ మాగ్నైట్ మోడల్‌లు ఒకే విధమైన స్పెసిఫికేషన్లను పంచుకుంటాయి. తేడా ఏమిటంటే ఇండియాలో రైట్ హ్యాండ్ డ్రైవ్ కాన్ఫిగరేషన్ అయితే.. సౌదీ అరేబియాలో లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్. ఈ కారణంగానే బ్రేక్ ఫ్లూయిడ్ పైపుల రూటింగ్ అనేది కొంత భిన్నంగా ఉంటుంది. ఇదే సమస్యకు దారితీసినట్లు స్పష్టమవుతోంది. -
పాక్, సౌదీ అరేబియా రక్షణ ఒప్పందం...
దుబాయ్/ఇస్లామాబాద్: పాకిస్తాన్, సౌదీ అరేబియాల రక్షణ ఒప్పందం వల్ల భారత్‌పై ప్రభావం ఏమేరకు ఉంటుందన్నది చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ భారత్‌పై తమపై దాడికి దిగితే ఒప్పందం ప్రకారం సౌదీ అరేబియా సైన్యం తమకు మద్దతుగా నిలస్తుందని పాకిస్తాన్ విశ్వసిస్తోంది. కానీ, క్షేత్రస్థాయి పరిస్థితులను గమనిస్తే పాక్ ఆశలు నెరవేరే అవకాశం లేదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే భారత్, సౌదీ అరేబియాల మధ్య బలమైన స్నేహ సంబంధాలున్నాయి. ఇరుదేశాల మధ్య దశాబ్దాలుగా వాణిజ్య బంధం కొనసాగుతోంది. ఏ దేశమైనా తమపై దాడికి దిగితే ఉమ్మడిగా ఎదుర్కొంటామని ఒప్పందంలో పేర్కొన్నారు. కానీ, ఫలానా దేశం అంటూ పేర్లు ప్రస్తావించలేదు. ఇండియాకు నాలుగో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి సౌదీ అరేబియా. సౌదీ అరేబియాకు రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి ఇండియా. 2024–25లో ఇరుదేశాల మధ్య 41.88 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది. పాక్–సౌదీ అరేబియాల మధ్య వాణిజ్యం దాదాపు 4 బిలియన్ డాలర్లే. పాకిస్తాన్ కోసం భారత్‌పై సౌదీ అరేబియా యుద్ధం చేసే అవకాశం లేదన్నది నిపుణుల అంచనా. పాక్, సౌదీ అరేబియా తాజా ఒప్పందాన్ని ఇజ్రాయెల్ కోణంలో చూడాలని చెబుతున్నారు. ఇజ్రాయెల్ గనుక పాక్‌పై దాడికి పాల్పడితే ఒప్పందం ప్రకారం పాక్‌కు మద్దతుగా సౌదీ అరేబియా సైన్యం రంగంలోకి దిగుతుందని పేర్కొంటున్నారు. ఇటీవలి కాలంలో అరబ్ దేశాలు–ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. భారత్, పాక్ మధ్య ఇప్పటిదాకా నాలుగు యుద్ధాలు జరిగాయి. మూడుసార్లు భీకర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పాక్‌కు అండగా సౌదీ అరేబియా ఏనాడూ జోక్యం చేసుకోలేదన్న సంగతి తెలిసిందే. ఇదీ ఒప్పందంఅణ్వాయుధ దేశం పాకిస్తాన్, సౌదీ అరేబియాల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ‘వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందం’పై రెండు దేశాలు బుధవారం సంతకాలు చేశాయి. దీనివల్ల ఇరుదేశాల మధ్య రక్షణ బంధం మరింత బలపడనుంది. ఒక దేశంపై దాడి జరిగితే మరో దేశం అండగా నిలుస్తుంది. పాక్, సౌదీ అరేబియాల్లో ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా రెండు దేశాలపై జరిగినట్లేనని పరిగణిస్తాయి. రక్షణ రంగంలో పాక్, సౌదీ అరేబియా దశాబ్దాలుగా సహకరించుకుంటున్నాయి. ఈ సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్, పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ పరస్పర రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రక్షణ సహకారాన్ని బలోపేతం చేసుకోవడం, ఎవరైనా దురాక్రమణకు పాల్పడినప్పుడు ఉమ్మడి పోరాటం సాగించడం ఒప్పందం అసలు ఉద్దేశమని పాకిస్తాన్ ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. భద్రత విషయంలో అమెరికాపై ఆధారపడడం తగ్గించుకోవాలని గల్ఫ్ అరబ్ దేశాలు భావిస్తున్నాయి. అమెరికా మిత్రదేశమైన ఇజ్రాయెల్ గతవారం ఖతార్‌లోని దోహా నగరంలో వైమానిక దాడులకు పాల్పడింది. కాల్పుల విరమణ ప్రతిపాదనపై చర్చల్లో పాల్గొన్న హమాస్ నేతలను అంతం చేసేందుకు ప్రయతి్నంచింది. ఈ దాడులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుమతి ఉన్నట్లు అరబ్ దేశాలు భావిస్తున్నాయి. హమాస్–ఇజ్రాయెల్ యుద్ధంతోపాటు తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా నుంచి సెక్యూరిటీ గ్యారంటీ ఇకపై ఆశించినంతగా ఉండకపోవచ్చని అంచనాకొచ్చాయి. అందుకే పొరుగు దేశాలతో రక్షణ ఒప్పందాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే పాక్, సౌదీ అరేబియాల మధ్య ఒప్పందం కుదరడం గమనార్హం. భారత్‌తో సంబంధాలకు అధిక ప్రాధాన్యం: సౌదీ అధికారి ఎన్నో ఏళ్ల చర్చల తర్వాతే పాకిస్తాన్‌తో రక్షణ ఒప్పందం కుదిరినట్లు సౌదీ అరేబియా సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఏవో కొన్ని దేశాలు లేదా కొన్ని ఘటనలను దృష్టిలో పెట్టుకొని జరిగిన ఒప్పందం కాదని స్పష్టంచేశారు. తమ రెండు దేశాల మధ్యనున్న దీర్ఘకాల, లోతైన సహకారాన్ని వ్యవస్థీకృతంగా మార్చుకోవాలన్నదే అసలు లక్ష్యమని వివరించారు. భారత్‌తో సంబంధాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఉద్ఘాటించారు. భారత్–సౌదీ అరేబియాల మధ్య గతంలో ఎన్నడూ లేనంతగా బలమైన సంబంధాలు ఇప్పుడున్నాయని వెల్లడించారు. ప్రాంతీయంగా శాంతి, స్థిరత్వం కోసం భారత్‌తో కలిసి పని చేస్తామన్నారు. భారత్, పాకిస్తాన్లతో సంబంధాల విషయంలో సమతూకం పాటించాలన్నదే తమ విధానమని తెలిపారు. పాక్ ప్రభుత్వం అణు శక్తిని సౌదీ అరేబియాకు అందజేయడానికి అంగీకరించిందా? అని ప్రశ్నించగా.. ఇది సమగ్ర రక్షణ ఒప్పందమని, సైనికపరంగా అన్ని అంశాలూ దీని పరిధిలోకి వస్తాయని స్పష్టంచేశారు. అధ్యయనం చేస్తాం: రణదీర్ జైస్వాల్ పాక్, సౌదీ అరేబియాల రక్షణ ఒప్పందంపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ«దీర్ జైస్వాల్ స్పందించారు. ఈ పరిణామంపై తమకు అవగాహన ఉందని వెల్లడించారు. భారతదేశ భద్రత, ప్రాంతీయ స్థిరత్వంపై ఈ ఒప్పందం చూపే ప్రభావాన్ని అధ్యయనం చేస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఎక్స్’లో పోస్టు చేశారు. -
అద్దెకు అణుబాంబు! సౌదీకి పాక్ అణ్వాయుధాలు?
రక్షణ ఒప్పందంపై షరీఫ్, సల్మాన్ సంతకాలు. ‘ఇస్లామిక్ నాటో’ దిశగా ముందడుగు? భావి విపరిణామాలపై భారత్ అధ్యయనం. మధ్యప్రాచ్యం, దక్షిణాసియాల్లో మారనున్న సమీకరణాలు పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్, సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ (ఎంబీఎస్) తమ ఇరు దేశాల మధ్య ‘వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందం’ (ఎస్ఎండీఏ) కుదుర్చుకున్నారు. ఇది ‘నాటో’ కూటమి నిబంధనల్లోని ఆర్టికల్ 5 లాంటిదే. పాక్, సౌదీ... ఈ రెండు దేశాల్లో ఏ ఒక్క దేశంపై ఎవరు దాడికి దిగినా ఆ రెండు దేశాలపై దాడికి పాల్పడినట్టే. సౌదీపై ఏ దేశమైనా దాడికి తెగబడితే పాకిస్థాన్ మీదా దండెత్తినట్టే. పాక్ మీద ఏ దేశమైనా దాడికి దిగితే సౌదీపైనా యుద్ధం ప్రకటించినట్టే. సౌదీ అరేబియాతో పాక్ తాజాగా కుదుర్చుకున్న ఒప్పందం సారాంశమిదే. ఇరాన్ కనుక అణ్వాయుధం తయారుచేస్తే, తాము కూడా సాధ్యమైనత త్వరలో అణుబాంబు రూపొందిస్తామని 2018లో ‘సీబీఎస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సల్మాన్ ప్రకటించడం ఇక్కడ ప్రస్తావనార్హం. ఆయన ప్రకటన అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తించింది. ఇరాన్-సౌదీ అరేబియా నడుమ శతృత్వం ఉంది. అటు ఇజ్రాయెల్-ఇరాన్ నడుమ పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇదే సమయంలో ఇరుగుపొరుగు దేశాలైన భారత్-పాక్ దాయాదులనే అంశాన్ని విస్మరించకూడదు. పాక్-సౌదీ తాజా ఒప్పందాన్ని పరిశీలిస్తే... ‘భవిష్యత్తులో ఆపరేషన్ సిందూర్’ లాంటి సందర్భాల్లో పాక్ కు సౌదీ సాయం చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. పాక్-సౌదీ తాజా ఒప్పందం ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో అధ్యయనం చేసే పనిలో భారత్ పడింది. మొత్తంమీద ఈ పరిణామం అటు మధ్యప్రాచ్యంలో, ఇటు దక్షిణాసియాలో మిలిటరీ సమీకరణాలపై ప్రభావం చూపిస్తుందనే చెప్పాలి. పాక్-సౌదీ ‘అణు’బంధం ఏనాటిదో! సౌదీ అరేబియాకు అణ్వాయుధాలను గానీ, అణు పరిజ్ఞానాన్ని గానీ పాక్ బదిలీ చేసినట్టు ఆధారాలు లేకపోయినప్పటికీ ... అందుకు గల అవకాశాలపై మాత్రం రక్షణ వర్గాల్లో దశాబ్దాలుగా చర్చ సాగుతోంది. సౌదీ-ఇరాన్ వైరం, మధ్యప్రాచ్యంలో ప్రస్తుతం భౌగోళికంగా చోటుచేసుకుంటున్న రాజకీయ మార్పుల నేపథ్యంలో తాజా ఒప్పందం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరాన్, ఇరాక్ వంటి శత్రుదేశాలు సౌదీ చుట్టూ మోహరించాయి. మరోవైపు సౌదీ కూడా ఏదైనా సున్నీ ముస్లిం దేశపు గట్టి భాగస్వామ్యం కోసం నిరీక్షిస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలతో శాంతి, సామరస్యాల కోసం ఇటీవల మొహమ్మద్ బిన్ సల్మాన్ ప్రయత్నాలు చేసినప్పటికీ 2023 అక్టోబరు నుంచి గాజాలో మొదలైన యుద్ధం, అమెరికా మళ్లీ అనుసరిస్తున్న ‘అమెరికా ఫస్ట్’ విధానం వంటివి మధ్యప్రాచ్యంలో పెను మార్పులకు దోహదం చేశాయి. నిఘా సమాచారం పంచుకోవడం, సైబర్ సెక్యూరిటీ పరంగా సహకారం, సంయుక్త సైనిక విన్యాసాల నిర్వహణ వంటి అంశాలు పాక్-సౌదీ తాజా ఒప్పందంలో ఉన్నాయి. అణ్వాయుధాల ప్రస్తావన ఒప్పందంలో లేకున్నప్పటికీ భవిష్యత్తులో ప్రాంతీయంగా ముప్పు తలెత్తితే అది అణు సహకారానికి కూడా దారితీయవచ్చనేది విశ్లేషకుల భావన. అంటే తమకు ముప్పు వాటిల్లే పక్షంలో రక్షణార్థం అమెరికా యుద్ధనౌకల కోసం సౌదీ ఎదురుచూడాల్సిన అగత్యం ఉండబోదు. తనకంటూ తన చేతిలో ఓ ఆయుధాన్ని సౌదీ సిద్ధం చేసుకునే ప్రయత్నమే ఇది. ట్రంప్ పాలనా యంత్రాంగానికి ఇది ఎదురుదెబ్బ మాత్రమే కాదు... చెంపపెట్టు కూడా! చారిత్రకంగా చూస్తే పాక్-సౌదీ నడుమ 1970ల నుంచే సత్సంబంధాలు ఉన్నాయి. పాక్ కు ఆర్థిక సాయం, చౌకగా చమురు, సైనిక తోడ్పాటును సౌదీ అరేబియా అందించింది. ప్రతిగా పాక్ వేలాదిగా తమ సైనిక బలగాలను సౌదీలో మోహరించి ఆ దేశ సైనికులకు శిక్షణ ఇచ్చింది. మక్కా, మదీనా పరిరక్షణ కోసం తమ జవాన్లను తరలించింది. పాక్ రక్షణ రంగంలో సౌదీ భారీగా పెట్టుబడులు పెట్టింది. పాక్ అణు కార్యక్రమానికి వంద కోట్ల డాలర్ల పైగా నిధులను సౌదీ సమకూర్చినట్టు సీఐఏ అధికారి ఒకరు 1980లలో పేర్కొన్నారు. 1980ల నుంచి పాకిస్థాన్ ఆర్థిక, సైనిక రంగాలకు 30 బిలియన్ డాలర్లకు పైగా సౌదీ సాయం చేసినట్టు ‘ది యూరేషియన్ టైమ్స్’ వెల్లడించింది. ఆయుధాలు, ప్రాజెక్టుల రూపేణా 5-10 బిలియన్ డాలర్ల మేర సౌదీ అరేబియా కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవచ్చని, 100 బిలియన్ డాలర్ల అప్పుల్లో కూరుకుపోయిన పాక్ కు ఇది ఉపశమనం కలిగించవచ్చని అంచనా. అలాగని ఇది సౌదీ సాయం చేసినట్టేమీ కాదు! పాక్ నియంత్రణ సౌదీ చేతిలోనే ఉంటుంది. కారుకు ఇంధనం నింపి తాళంచెవిని సౌదీ తన చేతిలో పెట్టుకోవడం లాంటిది ఇది! ఇటు పాక్ వైపు నుంచి కూడా పోయేదేమీ లేదు. దాని వైమానిక దళానికి సౌదీ సాంకేతికత అందుతుంది. ప్రమాదాలను గుర్తించేలా రాడార్స్ అమర్చిన విమానాలు, సరిహద్దుల్లో తాలిబాన్ గ్రూపులకు సంబంధించిన నిఘా సమాచారం లభిస్తాయి. పాక్ వైమానిక బలహీనతలను భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ ఎత్తిచూపింది. ఈ నేపథ్యంలో సౌదీతో సరికొత్త చెలిమి దానికి బలం కల్పించేదే. ఇక్కడ కేవలం విశ్వసనీయతే కాదు... డబ్బు అంశమూ ముడిపడివుంది. ఒకవేళ సౌదీ అరేబియాపై ఇజ్రాయెల్ దాడి చేసిందనుకుందాం. అప్పుడు సౌదీకి మద్దతుగా పాక్ ఎంత దీటుగా పోరాడుతుందనేది సౌదీ నుంచి ఆ దేశానికి పారే ‘నిధుల ప్రవాహం’పై ఆధారపడి ఉంటుంది! సౌదీకి పాక్ అణు కవచం!భవిష్యత్తులో తనకు అవసరమైతే పాక్ నుంచి అణ్వాయుధాలను పొందేలా సౌదీకి రహస్య ఒప్పందం ఉందన్న ఊహాగానాలు ఈనాటివి కావు. 2003లో అప్పటి సౌదీ యువరాజు అబ్దుల్లా పాక్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య రహస్య అణు ఒప్పందంపై చర్చలు సాగినట్టు పాక్ వర్గాలు 2003లో వెల్లడించాయి. ‘సౌదీకి పాక్ అణ్వాయుధాలు- బదులుగా పాక్ కు సౌదీ చమురు’… ఆ చర్చల ప్రధానాంశమని నాడు వార్తలు వెలువడ్డాయి. అయితే తమ మధ్య అలాంటి ఒప్పందమేదీ కుదరలేదని రెండు దేశాలు స్పష్టీకరించాయి. శాంతియుత ప్రయోజనాల కోసమే తమకు అణుశక్తి అవసరమని సౌదీ చెబుతూ వస్తోంది. 16 అణు రియాక్టర్లు నిర్మించాలన్న తన ప్రణాళికలను అది 2010లో ప్రకటించింది. అయితే ఈ అంశంలో పెద్ద పురోగతి లేదు. విశేషమేమిటంటే... ‘అణ్వాయుధ వ్యాప్తి నిరోధక ఒప్పందం (న్యూక్లియర్ నాన్-ప్రాలిఫరేషన్ ట్రీటీ- ఎన్పీటీ) అడిషనల్ ప్రొటోకాల్ మీద సౌదీ అరేబియా నేటి వరకు సంతకాలు చేయలేదు. దీని ప్రకారం కట్టుదిట్టమైన అంతర్జాతీయ తనిఖీలు ఎదుర్కోవాల్సివుంటుంది. చైనా సహకారంతో యురేనియం వెలికితీత కేంద్రాన్ని సౌదీ అరేబియా నిర్మించినట్టు 2020లో ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ ఓ వార్తాకథనం ప్రచురించింది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఈ చర్య అనుమతించదగ్గదే అయినప్పటికీ ఇది ‘రెండు రకాల ప్రయోజనాల’ (అణు విద్యుదుత్పత్తి, అణ్వాయుధాల తయారీ) కోసం ఉద్దేశించినదన్న అనుమానాలు మరింత బలపడ్డాయి. అవసరమైతే పాక్ అణు వార్ హెడ్లను మోసుకెళ్లే విధంగానే తమ క్షిపణులను సౌదీ సిద్ధం చేస్తున్నట్టు 1988 నాటి పత్రాలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం అణ్వాయుధాలు కలిగిన అతి కొద్ది ముస్లిం దేశాల్లో పాక్ ఒకటి. ఉత్తర కొరియా, ఇరాన్, లిబియాలతో పాక్ కు చెందిన ‘అబ్దుల్ ఖదీర్ ఖాన్ నెట్వర్క్’ అణు సంబంధాలు నెరపినట్టు గతంలోనే ఆరోపణలు వచ్చాయి. ఇరాన్ కనుక అణ్వాయుధాలను తయారుచేసే పక్షంలో సౌదీ అరేబియా కూడా పాక్ నుంచి ‘అణు వార్ హెడ్స్’ను కొనుగోలు చేయడమో, వాటిని ‘అప్పు/అద్దె ప్రాతిపదికన తీసుకోవడమో’ చేస్తుందని నిపుణుల అంచనా. ‘ముస్లిం దేశాల రక్షణకర్త’ పాత్రను పాక్ రక్తి కట్టిస్తోందా? పాక్ నేతృత్వంలోని ‘ఇస్లామిక్ నాటో’ కూటమిలో చేరిన తొలి సభ్యదేశంగా సౌదీ అరేబియాను చూడవచ్చా?! - జమ్ముల శ్రీకాంత్ (Source: The EurAsian Times, WION). -
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంపై భారత్ స్పందన ఇదే..
న్యూఢిల్లీ: పాకిస్తాన్- సౌదీ అరేబియా మధ్య వ్యూహాత్మక రక్షణ ఒప్పందం కుదరడంపై భారత్ స్పందించింది. ఆ ఇరు దేశాల ఒప్పందంలో వివరాల ప్రకారం.. ఇరు దేశాలలోని ఎవరిపైన దాడి జరిగినా.. అది ఇరు పక్షాలపైన జరిగిన దాడిగానే పరిగణిస్తారు. అప్పుడు ఆ ఇరు పక్షాలు సమానంగా ప్రత్యర్థితో పోరాడుతాయని పేర్కొన్నారు. దీనిపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఆ ఒప్పందపు పరిణామాలను అర్థం చేసుకునేందుకు అధ్యయనం చేస్తామని వెల్లడించింది. ‘సౌదీ అరేబియా- పాకిస్తాన్ మధ్య కుదిరిన పరస్పర వ్యూహాత్మక రక్షణ ఒప్పందంపై సంతకం చేసినట్లు వచ్చిన నివేదికలను చూశాం. రెండు దేశాల మధ్య కుదిరిన దీర్ఘకాలిక ఒప్పందాన్ని అధికారికం చేసే పరిణామ ప్రక్రియ పరిశీలనలో ఉందని భారత ప్రభుత్వానికి తెలుసు. మన జాతీయ భద్రతతో పాటు ప్రాంతీయ, ప్రపంచ స్థిరత్వంపై ఈ పరిణామం వలన వచ్చే చిక్కులపై అధ్యయనం చేస్తాం. భారతదేశ జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు, అన్ని రంగాలలో సమగ్ర జాతీయ భద్రతను నిర్ధారించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని మీడియా ప్రశ్నకు సమాధానంగా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు పాకిస్తాన్ ప్రధాని.. రియాద్‌ను సందర్శించారు అక్కడి అల్-యమామా ప్యాలెస్‌లో సౌదీ యువరాజు షరీఫ్‌ను కలిశారు. సౌదీ అరేబియా - పాకిస్తాన్ మధ్య పరస్పర రక్షణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం, రెండు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని అభివృద్ధి చేయడం, ఏదైనా దురాక్రమణకు వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుందని ఒప్పందపు ప్రకటన వెల్లడించింది. పహల్గామ్ ఉగ్రదాడి.. భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత.. పాక్- సౌదీల మధ్య కుదిరిన ఈ ఒప్పందం కీలకమైనదిగా భావిస్తున్నారు. -
Pak-Saudi Deal: ‘ఒకరిపై దాడి.. ఇరువురి పోరాటం’
న్యూఢిల్లీ: పాకిస్తాన్- సౌదీ అరేబియా మధ్య వ్యూహాత్మక రక్షణ ఒప్పందం కుదిరింది. ఖతార్ రాజధాని దోహాలో హమాస్ నేతలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడి జరిపిన కొద్దిరోజులకే ఈ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఇరుపక్షాలలో ఎవరిపైన దాడి జరిగినా.. అది ఇద్దరిపైన జరిగిన దాడిగానే గుర్తిస్తారు. అప్పుడు ఇరు పక్షాలు సమానంగా ప్రత్యర్థితో పోరాడుతాయి.సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్- పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ రక్షణ ఒప్పందంపై సంతకం చేశాక, ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. యువరాజు ఆహ్వానం మేరకు పాక్ ప్రదాని షరీఫ్ సౌదీ అరేబియాకు వెళ్లారని పాక్ ఒక ప్రకటనలో తెలిపింది. ‘ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని పెంపొందించడం, ఏదైనా దురాక్రమణ ఎదురైనప్పుడు దానికి వ్యతిరేకంగా ఉమ్మడిగా పోరాడటాన్ని లక్ష్యంగా పెట్టుకుంది’ అని సౌదీ ప్రెస్ ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది.ఒక దేశంపై ఏదైనా దాడి జరిగితే అది ఇరు దేశాలపై జరిగిన దాడిగా పరిగణించాలని ఆ ఒప్పందంలో పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్లో గత ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సాయుధ దళాలు ‘ఆపరేషన్ సిందూర్’ నిర్వహించాయి. ఇది జరిగిన తరువాత సౌదీ-పాక్‌ల మధ్య ఈ తరహా ఒప్పందం కుదరడం గమనార్హం. మరోవైపు ఖతార్- యునైటెడ్ స్టేట్స్ మెరుగైన రక్షణ సహకార ఒప్పందాన్ని ఖరారు చేసే దశలో ఉన్నాయని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో తెలిపారు. -
ఎర్ర సముద్రం అడుగున తెగిన కేబుళ్లు
దుబాయ్: ఎర్ర సముద్రం అడుగున్న కేబుళ్లు తెగడంతో భారత్ సహా పలు ఆసియా దేశాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. సౌదీ అరేబియాలోని జెడ్డా సమీపంలో ఎస్ఎండబ్ల్యూ4, ఐఎంఈడబ్లూఈ కేబుల్ వ్యవస్థలు స్తంభించాయని ఇంటర్నెట్ పర్యవేక్షక సంస్థ నెట్‌బ్లాక్స్ తెలిపింది. గాజా యుద్ధాన్ని ఆపేసేలా ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెంచేందుకే కేబుళ్లకు నష్టం కలిగించి ఉండొచ్చంటున్నారు. ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్యం, పశ్చిమ ఐరోపా4 కేబుల్‌ను టాటా కమ్యూనికేషన్స్.. భారత్, పశ్చిమాసియా, పశ్చిమ యూరప్ కేబుళ్లను అల్కాటెల్ లూసెంట్ నిర్వహిసతఉన్నాయి. ఈ పరిణామంపై సౌదీ మౌనం వహించగా, నెట్ వేగం తగ్గిందని యూఈఏ తెలిపింది. -
20 ఏళ్లుగా కోమాలో.. సౌదీ ‘స్లీపింగ్ ప్రిన్స్’ కన్నుమూత
సౌదీ అరేబియా ప్రిన్స్ అల్వలీద్ బిన్ ఖలెద్(36) ఇక లేరు. గత 20 ఏళ్లుగా కోమాలో ఉన్న ఆయన.. శనివారం కన్నుమూశారు. ఈ కారణంగానే సౌదీ అరేబియా స్లీపింగ్ ప్రిన్స్‌గా ఈయనకంటూ ఓ పేరు ముద్రపడిపోయింది. ప్రిన్స్ అల్వలీద్ బిన్ ఖలెద్ సౌదీ అరేబియా రాజ కుటుంబానికి చెందినవారు. ఆయన ప్రిన్స్ ఖలెద్ బిన్ తలాల్ అల్ సౌద్ పెద్ద కుమారుడు. 2005లో లండన్‌లోని మిలిటరీ అకాడమీలో చదువుకుంటున్న టైంలో ఖలెద్ కారు ప్రమాదంలో గాయపడ్డాడు. మెదడులో రక్తస్రావం జరిగి.. వెంటిలేటర్‌పై కోమాలో ఉంటూ ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఖలెద్ కోసం అమెరికా, స్పెయిన్ నుండి నిపుణులు కూడా చికిత్స అందించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. జూలై 20న రియాద్‌లో అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. Statement On the Passing of Prince Alwaleed bin Khaled bin Talal Al Saud pic.twitter.com/st19kxb7lC— Global Imams Council (GIC) (@ImamsOrg) July 19, 2025 View this post on Instagram A post shared by @arabianroyalagency -
Ronaldo: ఏడాదికి రూ. 2000 కోట్లు, ప్రైవేట్ జెట్.. ఇంకా..!
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo).. సౌదీ అరేబియాకు చెందిన ఫుట్‌బాల్ క్లబ్ అల్-నాస్ర్‌తో తెగదింపులు చేసుకున్నాడన్న వార్తలకు తెరపడింది. అల్-నాస్ర్ క్లబ్ తరపున మరో రెండేళ్ల పాటు ఆడేందుకు రొనాల్డో ఒప్పందం కుదుర్చుకున్నాడు.ఈ విషయాన్ని అల్-నాస్ర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. క్రిస్టియానో రొనాల్డో 2027 వరకు అల్-నాస్ర్ ఫుట్‌బాల్ క్లబ్లో కొనసాగనున్నాడు అని ఎక్స్‌లో రాసుకొచ్చింది. మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ నుంచి బయటకు వచ్చిన రొనాల్డో.. 2022 డిసెంబర్లో అల్-నాస్ర్ క్లబ్‌తో జతకట్టాడు.గత రెండు సీజన్లలో సౌదీ ప్రో లీగ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన రొనాల్డో, టైటిల్‌ను మాత్రం గెలుచుకోలేకపోయాడు. దీంతో ఈ పోర్చుగల్ కెప్టెన్ అల్ నాస్ర్‌కు వీడ్కోలు పలికి వేరో క్లబ్‌తో జతకట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు వార్తలు వినిపించాయి. కానీ అల్ నాస్ర్ క్లబ్ యాజమాన్యంతో చర్చలు అనంతరం రొనాల్డో తన నిర్ణయాన్నిమార్చుకున్నట్లు తెలుస్తోంది.అయితే సౌథీ ఫుట్‌బాల్ క్లబ్‌తో తన కాంట్రాక్ట్‌ను రెండేళ్ల పాటు పొడిగించుకున్నందుకు రోనాల్డో భారీ మొత్తాన్ని అందుకోనున్నట్లు తెలుస్తోంది.రొనాల్డోకు కళ్లే చెదిరే ఆఫర్..?👉టాక్ స్పోర్ట్ రిపోర్ట్ ప్రకారం.. అల్ నాస్ర్ క్లబ్ నుంచి రోనాల్డో ఏడాదికి 178 మిలియన్ పౌండ్లు(భారత కరెన్సీలో సుమారు. రూ.2000 కోట్లు) పారితోషికంగా తీసుకోనున్నట్లు సమాచారం. అదేవిధంగా మిగితా బెన్ఫిట్స్ కూడా రోనాల్డోకు ఉండనున్నాయి.👉సైనింగ్ బోనస్ కింద అతడికి తొలి ఏడాది 24.5 మిలియన్ పౌండ్లు(భారత కరెన్సీలో సుమారు రూ. 261 కోట్లు) అందుకోనున్నాడు.👉రెండో ఏడాదికి బోనస్ నగదు 30 మిలియన్ పౌండ్లు(రూ. 405 కోట్లు)కు పెరగనుంది.👉అల్ నాస్ర్ ఆసియా ఛాంపియన్స్ లీగ్ గెలిస్తే 5 మిలియన్ పౌండ్లు(రూ.53.4 కోట్లు) బోనస్ లభించనుంది.👉సౌదీ ప్రో లీగ్ ఛాంపియన్‌గా అల్ నాస్ర్ గెలిస్తే రొనాల్డోకు 8 మిలియన్ పౌండ్లు(రూ. 85 కోట్లు) బోనస్ లభించనుంది.👉గోల్డెన్ బూట్ గెలిస్తే రోనాల్డోకు 4 మిలియన్ పౌండ్ల(రూ. 42 కోట్లు) బోనస్ దక్కనుంది.👉అల్నాస్ర్లో ఓనర్షిప్ నుంచి 15 శాతం(అంచనా ప్రకారం 33 మిలియన్ పౌండ్లు) రొనాల్డో ఖాతాలో చేరనుంది.👉అదేవిధంగా ప్రతీ గోల్‌కు రొనాల్డోకు 80వేల ఫాండ్లు(భారత కరెన్సీలో సుమారు 85 లక్షలు) నగదు బహుమతిగా దక్కనుంది. ఈ బోనస్ రెండో ఏడాదికి 20 శాతం పెరగనుంది.👉 ప్రైవేట్ జెట్ ఖర్చులు కూడా అల్-నాస్ర్ క్లబ్ భరించనుంది. -
సౌదీ ఎయిర్‌లైన్స్ విమానానికి ప్రమాదం
-
ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాలు.. 2025లో భారత్ ఎక్కడంటే.. (ఫొటోలు)
-
గులాం నబీ ఆజాద్‌కు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక
ఢిల్లీ: జమ్ము కశ్మీర్ మాజీ సీఎం, డెమోక్రటిక్ ప్రోగ్రసీవ్ ఆజాద్ పార్టీ చీఫ్, మాజీ ఎంపీ గులాం నబీ ఆజాద్ అస్వస్థతకు గురయ్యారు. ఎంపీ బృందంతో సౌదీ పర్యటనలో ఉన్న ఆజాద్ అస్వస్థతకు గురి కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు బీజేపీ ఎంపీ జయంత్ పాండా వెల్లడించారు.వివరాల ప్రకారం.. ఉగ్రవాదంతో అంటకాగుతూ మన దేశంపై విషం చిమ్ముతున్న పాకిస్తాన్‌ను ఎండగట్టేందుకు వివిధ పార్టీల ఎంపీల నాయకత్వంలోని బృందాలు ప్రపంచదేశాలకు వెళ్లాయి. బీజేపీ నేత బైజయంతి పాండా నేతృత్వంలోని బృందం బహ్రెయిన్‌లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా బృంద సభ్యుల్లో గులాం నబీ ఆజాద్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో సౌదీలో పర్యటిస్తున్న సందర్బంగా ఆజాద్ అస్వస్థతకు గురయ్యారు.అనంతరం, ఆజాద్‌కు రియాజ్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు బీజేపీ ఎంపీ బైజయంతి పాండా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ క్రమంలో ఆజాద్ ఆరోగ్యం.. ఇప్పుడు స్థిరంగా ఉంది. ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. కొన్ని టెస్టులు చేయాల్సి ఉంది. సౌదీ పర్యటనలో ఉండగా ఆయన అనారోగ్యనికి గురి కావడం మమ్మల్ని తీవ్రంగా కలిచివేసింది. ఆయన సహాకారంతో ఇప్పటి వరకు బహ్రెయిన్, కువైట్లలో జరిగిన పర్యటనలు పూర్తిగా ఫలవంతమయ్యాయి. అల్జీరియా పర్యటనలో ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది’ అని చెప్పుకొచ్చారు.Halfway into our delegation's tour Ghulam Nabi azad has had to be admitted to hospital.His contributions to the metin Bahrain.Kuwait were highly impactful.he is disappointed at being bedridden.We will deeply miss his presence in Saudi Arabia,Algeria BJP MP Jay Panda @asadowaisi pic.twitter.com/YMDD4Qruch— Mohd Ateeq (@MohdAte48016039) May 27, 2025 -
ఇవేంటి! ఇంత అద్భుతంగా ఉన్నాయ్!
దోహా: ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశానికి అధ్యక్షుడు. అపర కుబేరుడు. అలాంటి ట్రంప్ సౌదీ అరేబియా, ఖతార్ అధినేతల ప్రాభవం చూసి నోరెళ్లబెట్టారు. వారి రాజభవనాలను చూసి అసూయపడ్డానని స్వయంగా చెప్పారు. ఖతార్ రాజప్రాసాదాల ఠీవి, సౌకర్యాలు చూసి, ‘‘ఇవేంటి ఇంత అద్భుతంగా ఉన్నాయి! వీటిని జీవితంలో కొనలేం’’ అని వ్యాఖ్యానించారు. తన అత్యాధునిక ‘ఎయిర్ ఫోర్స్ వన్’ విమానం కంటే అత్యంత విలాసవంత, అధునాతన బోయింగ్–747 రకం విమానాలను ఖతార్, సౌదీల్లో చూశానని చెప్పుకొచ్చారు. ఖతార్ నుంచి విమానాన్ని కానుకగా తీసుకోవడానికి సంకోచించబోనని బల్లగుద్దిమరీ చెప్పారు. ఖతార్ పాలకుడు అమీర్ తమీమ్ బిన్ హమాద్ అల్ థానీ రాజభవనం ‘అమీర్ దివాన్’ను చూసి దిగ్భ్రాంతికి లోనయ్యానని వెల్లడించారు. ‘‘స్వతహాగా నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని. నిర్మాణ నైపుణ్యం, కట్టడాల నేర్పు ఇట్టే పసిగడతా. మీ నివాసాలు భూలోక స్వర్గాలు. ఇంద్రభవనాలు. ఎంత పర్ఫెక్ట్గా కట్టారో!’’ అంటూ ప్రశంసల్లో ముంచెత్తారు. -
ఖతార్‌తో 200 బిలియన్ డాలర్ల డీల్
దోహా/రియాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సౌదీ అరేబి యా పర్యటన ముగించుకొని బుధవారం ఖతార్ చేరుకున్నారు. ఖతార్‌లో ఆయన ఘన స్వాగతం లభించింది. అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ నుంచి 160 విమానాలు కొనుగోలు చేసేందుకు ఖతార్ ఒప్పందం చేసుకున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఈ డీల్ విలువ 200 బిలియన్ డాలర్లు అని తెలిపారు. ఖతార్ పాలకుడు షేక్ తమిమ్ బిన్ హమద్ అల్–థానీ, డొనాల్డ్ ట్రంప్ మధ్య ఈ ఒప్పందం కుదిరింది. ఈ పర్యటన కంటే ముందు ట్రంప్ మాట్లాడుతూ.. ఖతార్ నుంచి ఒక విమానాన్ని బహుమతిగా స్వీకరించాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఖతార్ ఇచ్చే విమానాన్ని ఎయిర్‌ఫోర్స్ వన్‌గా వాడుకుంటానని వ్యాఖ్యానించారు. మరోవైపు తుర్కియేలో పర్యటించాలన్న ఆకాంక్షను ట్రంప్ వ్యక్తంచేశారు. ఉక్రెయిన్, రష్యా అధినేతలు జెలెన్స్కీ, పుతిన్ తుర్కియేలో ముఖాముఖి భేటీ కాబోతున్నట్లు ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ భేటీ పట్ల ట్రంప్ ఆసక్తి కనబరుస్తున్నారు. తాను తుర్కియేకు వెళ్తే పుతిన్ ఎంతగానో సంతోషిస్తారని ట్రంప్ చెప్పారు.ఒకప్పుడు ఉగ్రవాదుల జాబితాలో ఉన్న సిరియా అధ్యక్షుడితో ట్రంప్ సమావేశం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం సౌదీ అరేబియాలో సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్– షారాతో సమావేశమయ్యారు. రెండు దేశాల అధినేతలు కలుసుకోవడం గత 25 ఏళ్లలో ఇదే మొదటిసారి. 50 ఏళ్లుగా అస్సద్ కుటుంబ పాలనలో అంతర్యుద్ధంతో నలిగిపోయి న సిరియాకు ఇటీవలే విముక్తి లభించిన సంగతి తెలిసిందే. ట్రంప్‌తో అల్–షారా కీలక అంశాలపై చర్చించినట్లు తెలు స్తోంది. ఇజ్రాయెల్ దేశాన్ని అధికారికంగా గుర్తించాలని, సిరియా నుంచి విదేశీ ఉగ్రవాదులను బయటకు వెళ్లగొట్టాలని అల్–షారాను ట్రంప్ కోరినట్లు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లెవిట్ తెలిపారు. అల్– షారాతో భేటీ అనంతరం ఎయిర్‌ఫోర్స్ వన్‌లో డొనాల్డ్ ట్రంప్ మీడియాతో మాట్లాడారు. సిరియా అధ్యక్షు డిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన ఆకర్ష ణీయంగా కనిపిస్తున్న అందమైన యువకుడు అంటూ కొనియాడారు. బలమైన వ్యక్తి, ఫైటర్ అంటూ శ్లాఘించారు. సిరియాపై ఆంక్షలు రద్దు చేస్తున్నట్లు ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో సిరియా ప్రజలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. తమ కు మంచి రోజులు వచ్చా యని ఆనందం వ్యక్తంచేశారు. అస్సద్ ప్రభుత్వ హయాంలో తిరుగుబాటు నాయకుడిగా గుర్తింపు పొందిన అల్–షారాను అమెరికా ప్రభుత్వం 2013లో అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. ఆయనపై 10 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది. అదే అల్–షారా అధ్యక్షుడు కావడం, డొనల్డ్ ట్రంప్ ఆయనతో భేటీ కావడం విశేషం. -
‘శాంతిదూత’ ట్రంప్!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అంత సులభంగా అర్థం కారని ఆయన గల్ఫ్ దేశాల పర్యటన తీరుతెన్నులు చూస్తే తెలుస్తుంది. తాను అధికారంలోకొస్తే పశ్చిమాసియాలో సాగుతున్న ‘అంతూ దరీ లేని యుద్ధాలకు’ ముగింపు పలుకుతానని అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఆయన తరచు అనే వారు. ప్రస్తుతం కొనసాగుతున్న నాలుగు రోజుల గల్ఫ్ పర్యటనలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు గమనిస్తే ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేర్చదల్చుకున్నట్టు కనబడుతోంది. తన రెండో దశ పాలనలో ట్రంప్ మొదలెట్టిన తొలి విస్తృత విదేశీ పర్యటన ఇది. ఈ ప్రాంతంలోనే ఉన్న ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లకపోవటం ఆయన తాజా వైఖరికి సంకేతం. ఇది ఎన్నాళ్లుంటుందన్నది తెలియక పోయినా చేస్తున్న ప్రకటనలైతే భిన్నంగా ఉన్నాయి. ఇరాన్‌తో అమెరికా 46 ఏళ్లుగా సాగిస్తున్న ‘అప్రకటిత యుద్ధం’ ఇక కొనసాగనీయరాదన్న అభిప్రాయం ఉందని మంగళవారం సౌదీ అరే బియాలోని రియాద్‌లో ఆయన ప్రకటించారు. బుధవారం సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్– షారాతో భేటీ అయ్యారు. ఇజ్రాయెల్‌తో మంచి సంబంధాలు నెలకొల్పుకొనాలని సలహా ఇచ్చారు. అల్–షారాకు గతంలో అల్ కాయిదాతో, ఐఎస్‌తో సంబంధాలుండేవి. ఈ భేటీకి ముందే గల్ఫ్ సహకార మండలి(జీసీసీ) సదస్సులో సిరియాపై ఆంక్షలు ఎత్తేస్తున్నట్టు తెలియజేశారు. ఈ నిర్ణయాలపై ఇజ్రాయెల్ అలిగినా, మరొకరు అభ్యంతర పెట్టినా ఆయన ఖాతరు చేయదల్చుకున్నట్టు లేరు. గత నెలలో ట్రంప్‌ను కలిసి సిరియాపై ఆంక్షలు కొనసాగించాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ వేడుకున్నారు. ఇరాన్ విషయంలో అయితే చాలా చెప్పివుంటారు. సిరియాపై ఆంక్షలు ఎత్తేయటం, ఇరాన్‌తో చెలిమికి సిద్ధపడటం నెతన్యాహూకు ససేమిరా ఇష్టం లేదు. కానీ లీకుల ద్వారా తప్ప నేరుగా తన అసమ్మతిని ఇంతవరకూ తెలియజేయలేదు. ఆ మధ్య ట్రంప్ ఇందుకు భిన్నంగా మాట్లాడారు. అణు ఒప్పందాన్ని అంగీకరించి, శాంతికి సిద్ధపడకపోతే ఇరాన్ భారీ స్థాయి ఒత్తిడులు ఎదుర్కొనక తప్పదని హెచ్చరించారు. కానీ ట్రంప్ తాజా ధోరణి అందుకు భిన్నంగా ఉంది. ఇరాన్‌తో చెలిమి గురించి ఆయన ఏదో మాటవరసకు అనలేదు. ‘ప్రస్తుతం అమెరికాకు అత్యంత సన్నిహిత దేశాలు కొన్ని తరాల కిందట మాపై శత్రుత్వంతో చెలరేగినవే’ అని గుర్తుచేశారు. సిరియా, ఇరాన్‌ల విషయంలో తన వైఖరి మారటానికి సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ కారణమని ఆయన జీసీసీ వేదికపైనే ప్రకటించారు కూడా. యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదార్లు ఇజ్రాయెల్‌పై విరుచుకుపడుతూనే ఉన్నా ఈనెల 5న వారితో అవగాహనకొచ్చారు. స్నేహంలోనైనా, శత్రుత్వంలోనైనా ట్రంప్ తీరే వేరని ఆయన నిర్ణయాలు తెలియజేస్తున్నాయి. మూడేళ్లనాడు అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సౌదీ వచ్చినప్పుడు దేశంలో మానవహక్కులు అడుగంటుతున్న వైనంపై సౌదీ యువరాజును నేరుగా ప్రశ్నించారు. 2018లో జర్నలిస్టు జమాల్ ఖషోగ్గి ప్రాణం తీయించడాన్ని ప్రస్తావించారు. ఈ మాదిరి హత్యలు తమకు సమ్మతంకావని చెప్పారు. అందుకే కావొచ్చు... ఇప్పుడు ట్రంప్‌కు ఎదురైన స్వాగతసత్కారాల వంటివి బైడెన్‌కు లభించలేదు. సౌదీ గడ్డపై గతకాలపు అమెరికా అధ్యక్షుల్ని నిశితంగా విమర్శించటానికి ట్రంప్ వెన కాడలేదు. అమెరికన్ సమాజం గురించి కాస్తయినా తెలియనివారు ఎంతో జటిలమైన గల్ఫ్ సమా జాల్లో జోక్యం చేసుకోవటానికి ఎగబడ్డారని వ్యాఖ్యానించటం చిన్న విషయం కాదు. పశ్చిమాసియా దేశాలతో ఎన్ని వేల కోట్ల డాలర్ల ఒప్పందాలు కుదుర్చుకోగలమన్నదే ఆయన ఆరాటంగా కనబడు తోంది. దానికి తగ్గట్టే మంగళవారం సౌదీతో 14,200 కోట్ల డాలర్ల మేర ఆయుధ ఒప్పందంపై సంతకాలయ్యాయి. ఇదిగాక అమెరికాలో 60,000 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్టు యువరాజు ప్రకటించారు. ట్రంప్ దీంతో సంతృప్తిపడలేదు. దీన్ని లక్ష కోట్ల డాలర్లకు పెంచాలని ఆ వేదికపైనుంచే కోరారు. సౌదీతో అమెరికాకు ఎప్పుడూ మంచి స్నేహసంబంధాలేవున్నా ఈ స్థాయి ఒప్పందాలెప్పుడూ లేవు. ఒక పరిశోధక సంస్థ నివేదిక ప్రకారం 2010–20 మధ్య అమెరికాకు సౌదీతో 10,000 కోట్ల డాలర్ల విలువైన ఆయుధ ఒప్పందాలు మాత్రమే కుదిరాయి.స్నేహం పేరుతో అమెరికాను దోచుకుంటున్నారని నాటో భాగస్వామ్య దేశాలైన పాశ్చాత్య మిత్రులపై తరచూ విరుచుకుపడే ట్రంప్...పశ్చిమాసియా దేశాలకు ఏ కష్టమొచ్చినా అమెరికా దృఢంగా నిలబడుతుందని హామీ ఇవ్వటం గమనార్హం. ఇంధన అవసరాల్లోనూ, రక్షణరంగంలోనూ పనికొచ్చే అత్యంత విలువైన లిథియం, కోబాల్ట్‌లతోపాటు థోరియం వంటి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అన్వేషించి అమెరికా చేర్చటానికి సౌదీ–అమెరికా ఖనిజ సంస్థల మధ్య ఈ పర్యటనలో 900 కోట్ల డాలర్ల ఒప్పందం కుదరటంతో ట్రంప్ సంతోషానికి పట్టపగ్గాల్లేవు. అందువల్లే పశ్చిమాసియాకు శక్తి మంతమైన సెమీ కండక్టర్ చిప్స్, ఏఐ డేటా సెంటర్లకు పనికొచ్చే కీలక విడిభాగాల ఎగుమతులకు ఆయన పచ్చజెండా ఊపారు. ఇది సంప్రదాయ అమెరికా విదేశాంగ విధానానికి భిన్నం.ఈ పర్యటనలో ట్రంప్ స్వకార్యమూ నెరవేర్చుకుంటున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దేశ ప్రయోజనాలకూ, అధ్యక్షుడిగా ఆయన నిర్ణయాలకూ చుక్కెదురన్నది విమర్శకుల వాదన. ట్రంప్ సొంత సంస్థకు సారథ్యం వహిస్తున్న ఆయన కుమారులు గత కొన్నివారాలుగా గల్ఫ్‌లో తిష్ఠ వేసి తమ సంస్థ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారనీ, కుదిరిన ఒప్పందాలన్నీ వారికి మేలు కలిగించేవేననీ అంటున్నారు. ఏది ఏమైనా ట్రంప్ వైఖరి మళ్లీ మారేలోగా పశ్చిమాసియా చక్కబడితే ప్రపంచానికి అంతకన్నా కావాల్సిందేమీ లేదు. -
ఉన్నట్టుండి భారత్ వచ్చిన సౌదీ మంత్రి
న్యూఢిల్లీ: సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రి అదెల్ అల్ జుబేర్ ఉన్నట్టుండి భారత్‌లో ప్రత్యక్షమయ్యారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ జరిపిన సైనిక దాడులతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా మంత్రి అప్రకటిత పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.చెప్పాపెట్టకుండా భారత్ వచ్చిన అదెల్ అల్ జుబేర్ గురువారం న్యూఢిల్లీలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ను కలిశారు. సౌదీ అరేబియా వాతావరణ రాయబారి కూడా అయిన అదెల్ అల్ జుబేర్ తనను కలిసినట్లు జైశంకర్ నుండి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "ఈ ఉదయం సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రి అదెల్ అల్ జుబేర్‌తో మంచి సమావేశం జరిగింది" అని ఆయన అన్నారు. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని తొమ్మిది చోట్ల ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని బుధవారం భారత్ జరిపిన సైనిక దాడులను ప్రస్తావిస్తూ ఉగ్రవాదాన్ని గట్టిగా ఎదుర్కోవడంపై భారత్ దృక్పథాలను సౌదీ మంత్రితో పంచుకున్నట్లు జైశంకర్ పేర్కొన్నారు.భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తో ద్వైపాక్షిక జాయింట్ కమిషన్ సమావేశానికి సహ అధ్యక్షత వహించేందుకు ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చి బుధవారం అర్ధరాత్రి న్యూఢిల్లీకి చేరుకున్న కొద్ది గంటల్లోనే జైశంకర్ తో సౌదీ మంత్రి భేటీ కావడం గమనార్హం.A good meeting with @AdelAljubeir, Minister of State for Foreign Affairs of Saudi Arabia this morning. Shared India’s perspectives on firmly countering terrorism. 🇮🇳 🇸🇦 pic.twitter.com/GGTfItZ3If— Dr. S. Jaishankar (@DrSJaishankar) May 8, 2025 -
విశ్వసనీయ మిత్రదేశం
జెడ్డా: ‘‘భారత్–సౌదీ అరేబియా స్నేహ సంబంధాలు మరింత బలోపేతం కావాలి. అందుకు నా పర్యటన దోహదపడుతుంది’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తంచేశారు. సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆహా్వనం మేరకు ఆయన మంగళవారం సౌదీలో పర్యటించారు. మోదీ విమానం సౌదీ గగనతలంలోకి ప్రవేశించగానే రాయల్ సౌదీ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఆరు ఎఫ్–15 ఫైటర్ జెట్లు ఎస్కార్ట్‌గా నిలవడం విశేషం. సంబంధిత వీడియోను భారత విదేశాంగ శాఖ విడుదల చేసింది.మోదీకి లభించిన అపూర్వ ఆహ్వనం భారత్–సౌదీ అరేబియా మధ్య బలపడుతున్న రక్షణ సహకారానికి ప్రతీక అని పేర్కొంది. ఎయిర్‌పోర్టు నుంచి బస చేసే హోటల్‌కు చేరుకున్న మోదీకి సంప్రదాయ స్వాగతం లభించింది. సౌదీ గాయకుడు హషీం అబ్బాస్ ‘ఆయే వతన్ మేరే ఆబాద్ రాహే తూ’ హిందీ పాటను చక్కగా ఆలపించారు. మోదీ చప్పట్లతో ఆ గాయకుడిని అభినందించారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రవాస భారతీయులతో ఆప్యాయంగా మాట్లాడారు.సౌదీ యువరాజు నా సహోదరుడు భారత్‌కు సౌదీ అత్యంత విలువైన, విశ్వసనీయమైన మిత్రదేశమని మోదీ ఉద్ఘాటించారు. ఆయన మంగళవారం ‘అరబ్ న్యూస్’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆసియాలో శాంతి, స్థిరత్వాన్ని రెండు దేశాలు ప్రగాఢంగా కోరుకుంటున్నాయని మోదీ తెలిపారు. -
Saudi Arabia: 14 దేశాలకు వీసాల జారీ నిలిపివేత.. జాబితాలో భారత్
రియాద్: హజ్ యాత్ర సమీపిస్తున్న తరుణంలో సౌదీ అరేబియా ప్రభుత్వం(Kingdom of Saudi Arabia) (KSA) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జరగబోయే హజ్ యాత్రకు ముందుగానే 14 దేశాల పౌరులకు వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నిషేధం ఉమ్రా, బిజినెస్, కుటుంబ సందర్శన తదితర వీసాలపై జూన్ మధ్యకాలం వరకు అంటే హజ్ సమయం ముగిసే వరకు అమలులో ఉండనుంది. హజ్ యాత్ర(Hajj pilgrimage) సమయంలో రద్దీని నియంత్రించేందుకు, సరైన రిజిస్ట్రేషన్ లేకుండా హజ్ చేసేందుకు వచ్చేవారిని అడ్డుకునేందుకు ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకున్నదని సౌదీ అధికారులు తెలిపారు. గత ఏడాది హజ్ సమయంలో తీవ్రమైన వేడి వాతావరణం, రిజిస్ట్రర్డ్ కాని యాత్రికుల కారణంగా తొక్కిసలాట ఘటన చోటుచేసుకుంది. ఇటువంటివి పునరావృతం కాకుండా ఉండేందుకే సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే వీసా నిబంధనలను మెరుగుపరచాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.సౌదీ అరేబియా సవరించిన నిబంధనల ప్రకారం ఈ ఏడాది ఉమ్రా వీసా(Umrah Visa) కోసం కేటాయించిన గడువు 2025, ఏప్రిల్ 13తో ముగియనుంది. అలాగే హజ్ ముగిసే వరకు కొత్త ఉమ్రా వీసాలు జారీ చేయరు. ఈ నిషేధం కారణంగా భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌తో సహా పలు దేశాల నుంచి సౌదీ వెళ్దాలనుకునేవారికి నిరాశ ఎదురయ్యింది.వీసాలు నిషేధించిన దేశాలివే..1. భారత్2. బంగ్లాదేశ్3. పాకిస్తాన్4. అల్జీరియా5. ఈజిప్ట్6. ఇథియోపియా7. ఇండోనేషియా8. ఇరాక్9. జోర్డాన్10. మొరాకో11. నైజీరియా12. సుడాన్13. ట్యూనిషియా14. యెమెన్నిషేధం వెనుక కారణాలివే..సౌదీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం హజ్ సమయంలో భద్రత కల్పించేందుకు, రద్దీని నియంత్రించేందుకు సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 2024లో హజ్‌యాత్రలో పాల్గొన్న 1,200 మందికి పైగా యాత్రికులు వివిధ కారణాలతో మృతిచెందారు. రిజస్టర్డ్కాని యాత్రికుల కారణంగా హజ్లో తీవ్రమైన రద్దీ ఏర్పడిందని సౌదీ అరేబియా అధికారులు భావిస్తున్నారు. దీనిని నివారించేందుకే వివిధ రకాల వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే, హజ్ యాత్ర కోసం ప్రత్యేకంగా నమోదైన యాత్రికులకు ఈ నిషేధం వర్తించదు. దౌత్య వీసాలు, నివాస అనుమతులు, హజ్-నిర్దిష్ట వీసాలు యథావిధిగా కొనసాగుతాయి.ఇది కూడా చదవండి: ఆ రాష్ట్రాలపై బీజేపీ గురి.. రంగంలోకి అమిత్ షా -
ప్రాజెక్ట్ చీతా రూపకర్త అనుమానాస్పద మృతి
రియాద్: భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ కలల ‘ప్రాజెక్ట్ చీతా’లో కీలకంగా వ్యవహరించిన ప్రముఖ పర్యావరణ పరిరక్షకుడు విన్సెంట్ వాన్ డెర్ మార్వె అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. సౌదీ అరేబియా రియాద్‌లోని ఓ అపార్ట్మెంట్లో ఆయన విగతజీవిగా కనిపించడం.. పర్యావరణ ప్రేమికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.42 ఏళ్ల విన్సెంట్.. మార్చి 16వ తేదీన అపార్ట్మెంట్లోని హాలులో రక్తపు మడుగులో పడి కనిపించారు. ఆయన తలకు గాయం కావడంతోనే మరణించినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకి వచ్చారు. అయితే ఆయనపై మృతిపై అధికారులు స్పష్టమైన ప్రకటన చేయలేదు. మరోవైపు.. ఆయన మృతిపై అనుమానాలు ఉన్నాయని, అది ప్రమాదవశాత్తూ మరణం కాదని ఆయన కుటుంబ సభ్యులు ఫేస్బుక్లో ఓ పోస్ట్ చేశారు.దక్షిణాఫ్రికాకు చెందిన విన్సెంట్ వాన్ డెర్ మార్వె.. పర్యావరణహితం, అంతరించిపోతున్న జాతుల సంరక్షణ కోసం మెటాపాపులేషన్ ఇన్షియేటివ్(TMI) పేరిట ఓ ఫౌండేషన్ నెలకొల్పారు. దీని ద్వారా ఆసియాలోనే ఆఫ్రికాలోనూ ఆయన సేవలందించారు. మూడేళ్ల కిందట.. భారత ప్రధాని నరేంద్ర మోదీ తన పుట్టిన రోజున మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్క్‌లో ఆఫ్రికా దేశాల నుంచి రప్పించిన చీతాలను వదిలిన సంగతి తెలిసిందే. అంతరించిపోయిన ఈ జాతిని భారత్‌లో తిరిగి ప్రవేశపెట్టడం కోసం సుమారు రూ.91 కోట్ల దాకా ఖర్చు చేశారు. నమీబియా, సౌతాఫ్రికా నుంచి 20 చీతాలను రప్పించగా.. పలు కారణాలతో కొన్ని మరణించాయి. ప్రస్తుతం 12 కూనలతో కలిపి 24 చీతాలు ఉన్నాయి. A long wait is over, the Cheetahs have a home in India at the Kuno National Park. pic.twitter.com/8FqZAOi62F— Narendra Modi (@narendramodi) September 17, 2022 అయితే ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకంగా వ్యవహరింది విన్సెంట్ వాన్ డెర్ మార్వె కావడం గమనార్హం. జాతీయ పులుల సంరక్షణ సంస్థ(NTCA)తో సమన్వయమై ప్రాజెక్ట్ రూపొందించడం దగ్గరి నుంచి.. చీతాలను ఎంపిక చేసి ఇక్కడికి తీసుకురావడం దాకా అంతా ఈయన పర్యవేక్షణలో జరిగింది. తాజాగా.. సౌదీ అరేబియాలోనూ చీతాలను ప్రవేశపెట్టే ప్రాజెక్టును అక్కడి ప్రభుత్వం ప్రారంభించింది. అందుకోసమే రియాద్‌కు ఆయన వెళ్లగా.. ఈలోపు ఆయన శవమై కనిపించారు. -
అగ్ర రాజ్యాల స్నేహగీతం
రియాద్: డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పాలనా పగ్గాలు చేపట్టగానే అమెరికా విదేశాంగ విధానంలో కీలక మార్పుచేర్పులు చోటుచేసుకుంటున్నాయి. అందులో భాగంగా అన్నిరకాలుగానూ మూడేళ్లుగా దాదాపుగా వెలి వేసిన రష్యాతో ఏకంగా ఉన్నతస్థాయి చర్చలకు అమెరికా తెర తీసింది. దాని మిత్ర దేశం సౌదీ అరేబియా వేదికగా మంగళవారం జరిగిన ఈ చర్చలకు అమెరికా, రష్యా విదేశాంగ మంత్రులు మార్కో రూబియో, సెర్గీ లవ్రోవ్ స్వయంగా సారథ్యం వహించడం విశేషం. సౌదీ విదేశాంగ మంత్రి యువరాజు ఫైసల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్, అమెరికా, సౌదీ ఆ దేశ జాతీయ భద్రతా సలహాదార్లు తదితరులు ఇందులో పాల్గొన్నారు. ద్వైపాక్షిక బంధాలను మెరుగు పరుచుకోవడంతో పాటు ఉక్రెయిన్ యుద్ధానికి తెర దించడం ప్రధాన ఎజెండాగా చర్చలు జరిగాయి. కానీ ఈ కీలక చర్చల్లో ఉక్రెయిన్‌కే ప్రాతినిధ్యం కల్పించకపోవడం విశేషం. దీనిపై ఆ దేశం తీవ్ర అసంతృప్తి వెలిగక్కింది. తమ భాగస్వామ్యం లేకుండా తీసుకునే ఎలాంటి నిర్ణయాలనూ అంగీకరించబోయేది లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ కుండబద్దలు కొట్టారు.ఉక్రెయిన్‌పై జరుపుతున్న చర్చల్లో తమను పక్కన పెట్టడం ఏమేరకు సబబంటూ పలు యూరప్ దేశాలు కూడా నొసలు విరుస్తున్నాయి. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్‌కు అమెరికా దన్ను పూర్తిగా తగ్గిపోతున్న నేపథ్యంలో భావి కార్యాచరణపై యూరప్ దేశాలన్నీ సోమవారం కీలక సమావేశం జరపడం తెలిసిందే. ఈ పరిణామాలన్నీ అంతర్జాతీయంగా సరికొత్త సమీకరణాలకు, పునరేకీకరణలకు దారితీసేలా కనిపిస్తున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. త్వరలో ట్రంప్, పుతిన్ భేటీ ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో అమెరికాతో పాటు పలు యూరప్ దేశాలు రష్యాపై తీవ్ర ఆంక్షలు విధించడం, ఆ దేశాన్ని అంతర్జాతీయంగా దాదాపుగా ఏకాకిని చేయడం తెలిసిందే. అలా మూడేళ్లుగా అట్టడుగుకు దిగజారిన అమెరికా, రష్యా సంబంధాలను మెరుగుపరుచుకునే దిశగా రూబియో, లవ్రోవ్ భేటీలో పలు నిర్ణయాలు జరిగాయి. వాషింగ్టన్, మాస్కో రాయబార కార్యాలయాల్లో సిబ్బంది సంఖ్యను పెంచాలని నిర్ణయించినట్టు రూబియో మీడియాకు తెలిపారు.‘‘అలాగే ఇరు దేశాల అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ వీలైనంత త్వరగా భేటీ కానున్నారు. తేదీ తదితరాలు ఖరారు కావాల్సి ఉంది’’ అని వివరించారు. అధినేతలిద్దరూ గత వారం సుదీర్ఘంగా ఫోన్లో సంభాషించుకోవడం తెలిసిందే. ఈ పరిణామం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. ఆ వెంటనే రష్యాపై యుద్ధంలో ఇప్పటిదాకా ఉక్రెయిన్‌కు అమెరికా అందిస్తూ వస్తున్న సహాయ సహకారాలకు చాలావరకు తెర దించుతూ ట్రంప్ వరుస నిర్ణయాలు తీసుకున్నారు.ఈయూలో ఉక్రెయిన్ చేరికకు... అభ్యంతరం లేదు: రష్యాశాంతి చర్చలకు రష్యా ఎప్పుడూ సిద్ధమేనని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మీడియా కార్యదర్శి ద్మిత్రీ పెస్కోవ్ స్పష్టం చేశారు. అందులో భాగంగా అవసరమైతే జెలెన్స్కీతో చర్చలకు కూడా పుతిన్ సిద్ధమేనన్నారు. అయితే, ఉక్రెయిన్ అధ్యక్షునిగా జెలెన్స్కీ చట్టబద్ధతపైనే తమకు అభ్యంతరాలున్నాయంటూ మెలిక పెట్టారు. ఉక్రెయిన్ యూరోపియన్ యూనియన్‌లో చేరడంపై తమకు అభ్యంతరాలు లేవన్నారు. ‘‘ఇలాంటివి ఒక దేశ సార్వభౌమత్వానికి సంబంధించిన నిర్ణయాలు. వాటిలో వేలు పెట్టే ఉద్దేశం మాకు లేదు’’ అని చెప్పుకొచ్చారు. కానీ రష్యా భద్రత తదితరాల దృష్ట్యా ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదన్నారు. -
ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధం: పుతిన్
మాస్కో: ఉక్రెయిన్ సంక్షోభం మూడో ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్న వేళ.. కీలక పరిణామం చోటు చేసుకుంది. శాంతి చర్చల్లో రష్యా(Russia) ఓ అడుగు ముందుకు వేసింది. ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధమని ప్రకటించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో అవసమైతే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నారు అని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ వర్గాలు వెల్లడించాయి. సౌదీ అరేబియా వేదికగా అమెరికా దౌత్య వేత్తలతో రష్యా అధికారులు చర్చలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో.. మాస్కో నుంచి ఈ ప్రకటన వెలువడడం విశేషం.ఉక్రెయిన్ సంక్షోభం(Ukraine Crisis) ముగిసేలా ఓ ఒప్పందం కోసం ఈ సమావేశం జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఆ చర్చల అజెండాపై ఇప్పుడే ఎలాంటి ప్రకటన చేయబోమని క్రెమ్లిన్ వర్గాలు స్పష్టం చేశాయి. ఇక.. అమెరికాతో చర్చలు ఇరాన్‌తో సంబంధాలను దెబ్బ తీయొచ్చన్న వాదనను క్రెమ్లిన్ తోసిపుచ్చింది. అయితే తమ ప్రతినిధులు లేకుండానే శాంతి చర్చలు జరుపుతుండడంపై ఉక్రెయిన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తాము లేకుండా జరిపే ఎలాంటి చర్చలకు, ఒప్పందాలకు తాము గుర్తింపు ఇవ్వబోమని అధ్యక్షుడు జెలెన్స్కీ స్పష్టం చేశారు. మరోవైపు నాటో దేశాలు కూడా రియాద్ వేదికగా జరుగుతున్న ఈ సమావేశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఒకానొక దశలో.. ఇది మాస్కో-వాషింగ్టన్ మధ్య సంబంధాలు బలపర్చుకునే సమావేశాలుగానే నాటో మిత్రపక్షాలు భావిస్తున్నాయి. -
సౌదీ అరేబియాలో ఇ–స్పోర్ట్స్ ఒలింపిక్స్
లుసానే (స్విట్జర్లాండ్): మొట్టమొదటి ఒలింపిక్స్ ఇ–స్పోర్ట్స్‌కు సౌదీ అరేబియా ఆతిథ్యమివ్వబోతోంది. 2027లో సౌదీ రాజధాని రియాద్‌లో ఎలక్ట్రానిక్ స్పోర్ట్స్ విశ్వక్రీడలు జరుగనున్నాయి. గతేడాది పారిస్ ఒలింపిక్స్ సందర్భంగా ఈ ఏడాదే ఇ–స్పోర్ట్స్ మెగా ఈవెంట్ నిర్వహించాలని మొదట అనుకున్నారు. అయితే ఇది కార్యరూపం దాల్చేందుకు ఇంకో రెండేళ్లు ఆలస్యమవుతుంది. అయితే 2027 నుంచి రెగ్యులర్‌గా ప్రతీ రెండేళ్లకోసారి మెగా ఈవెంట్ ఇ–స్పోర్ట్స్ నిర్వహించేందుకు సౌదీ ప్రభుత్వం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)తో 12 ఏళ్ల ఒప్పందం చేసుకుంది. గతేడాది జూలై, ఆగస్టు నెలల్లో రియాద్‌లో ఇ–స్పోర్ట్స్ ప్రపంచకప్ జరిగింది. కాల్ ఆఫ్ డ్యూటీ, ఫోర్ట్‌నైట్, స్ట్రీట్ ఫైటర్ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. అయితే ఇందులో సాధారణ షూటర్లకు అనుమతించేది లేనిది తేలలేదు. త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుంది. సౌదీ క్రీడల మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజిజ్ బిన్ తుర్కీ అల్ ఫైజల్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ ఒలింపిక్స్ ఇ–స్పోర్ట్స్ క్రీడాంశాలపై చర్చించనుంది. ఇటీవల ఐఓసీ చైర్మన్ థామస్ బాచ్, సౌదీ రాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ల మధ్య చర్చలు ఫలప్రదంగా జరగడంతో తాజాగా ఇ–స్పోర్ట్స్ విశ్వక్రీడలపై ప్రకటన వెలువడింది. అయితే ఇంకో రెండేళ్లలో జరిగే ఈ పోటీల కోసం ఈ ఏడాది నుంచే క్వాలిఫయింగ్ పోటీలు మొదలవుతాయని ఐఓసీ వర్గాలు తెలిపాయి. -
దిరియాపై దేశీ దిగ్గజాల కన్ను
న్యూఢిల్లీ/దావోస్: సౌదీ అరేబియాలో దిరియా పేరుతో తలపెట్టిన అతిభారీ(గిగా) టూరిజం ప్రాజెక్టుపై దేశీ కార్పొరేట్ దిగ్గజ గ్రూప్‌లు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. 63 బిలియన్ డాలర్ల పెట్టుబడితో రూపొందనున్న ఈ ప్రాజెక్టులో దేశీ దిగ్గజాలు టాటా గ్రూప్, ఒబెరాయ్ గ్రూప్ తదితరాలు ఇన్వెస్ట్ చేయనున్నట్లు దిరియా సీఈవో జెర్రీ ఇన్‌జెరిల్లో పేర్కొన్నారు. సిటీ ఆఫ్ ఎర్త్‌గా పేర్కొంటున్న ఈ ప్రాజెక్టును సౌదీ అరేబియా రాజధాని రియాద్ చివర్లో నెలకొల్పుతున్నారు. లక్ష మంది ప్రజలకు గృహాలు, మరో లక్ష మందికి కార్యాలయ ప్రాంతాలతో ప్రాజెక్టు రూపొందనుంది. ఈ కొత్త నగరం 40 విలాసవంత హోటళ్లు, 1,000కుపైగా షాపులు, 150 రెస్టారెంట్లు, 20,000 సీట్ల సామర్థ్యంగల మలీ్టపర్పస్ ఈవెంట్లకు వీలయ్యే ఒపేరా హౌస్‌సహా గోల్ఫ్ కోర్స్, కేఫ్‌లు, యూనివర్శిటీలు, కల్చరల్ అసెట్స్, మ్యూజియంలు తదితరాలతో ఏర్పాటుకానుంది. -
వీడియో: సౌదీ ‘మక్కా’లో భారీ వర్షం.. కొట్టుకుపోయిన కార్లు, బస్సులు
జెడ్డా: సౌదీ అరేబియాలో అతి భారీ వర్షం కురిసింది. కుండపోత కారణంగా ముస్లిం పవిత్ర మక్కా నగరం చెరువును తలపిస్తోంది. ఒక్కసారిగా వచ్చిన వరదలతో మక్కా ప్రాంతం జలమయమైంది. వర్షం కారణంగా దర్శనానికి వచ్చిన లక్షలాది మంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.సౌదీ అరేబియాలో క్లౌడ్ బరస్ట్ కారణంగా భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో భారీ నష్టం జరిగింది. వరదల కారణంగా పలు ప్రాంతాల్లో కార్లు కొట్టుకుపోయాయి. మక్కా, మదీనా, జెడ్దాలో ఎడతెరిపలేని వర్షంతో భారీ వరదలు వచ్చాయి. ఉరుములు, మెరుపులతో సుడిగాలులు విరుచుకుపడ్డాయి. దీంతో జనజీవనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదే సమయంలో మక్కాలో ఉమ్రా యాత్రకు వచ్చిన భక్తులు ఇబ్బంది పడ్డారు.#Breaking: 🇸🇦 Mecca is floating: Torrential rain with hail have led to severe flooding in the holy city for Muslims in Saudi Arabia.😭May Allah protect us from this danger.pic.twitter.com/OgUwGwNhp6— Md.Sakib Ali (@iamsakibali1) January 7, 2025 Scenes of heavy rain falling on Mecca and Jeddah in the Kingdom of #SaudiArabia pic.twitter.com/2EsGyc3IC5— Hamdan News (@HamdanWahe57839) January 6, 2025 SAUDI ARABIA :📹 POWERFUL STORM HIT JEDDAH CITY TODAYScenes from KING ABDULAZIZ International Airport pic.twitter.com/KBta0A0gDD— 𝛎í⸦𝛋𝚼 (@iv1cky) January 7, 2025 మక్కా, మదీన, జెడ్దాలో ఊహించని విధంగా వరదనీరు ముంచెత్తడంతో అనేక కార్లు, టూరిస్ట్ బస్సులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. భారీ వర్షాలకు కూలిన చెట్లు వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఇక, మరో రెండు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మూడు నగరాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. వర్షాల నేపథ్యంలో సౌదీలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్టు అధికారులు చెబుతున్నారు. #Mecca after rain outside.Haram Shareef pic.twitter.com/XYrR0FNdep— Saeed Hameed (@urdujournosaeed) January 7, 2025 Mecca, Saudi Arabia, experienced heavy rainfall today, leading to significant flooding. The city received an unusually high amount of rain within a short time. Thankfully, emergency teams are working hard, and the situation is under control. Rain is rare in Mecca, but it’s always… pic.twitter.com/KNfJyy16My— مدقق لغوي 👓 (@Lang_checker) January 6, 2025 మక్కాకు సౌత్ సైడ్ ఉన్న అల్-అవాలి పరిసరాల్లో వరదల్లో చాలామంది చిక్కుకున్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని, గొలుసులు, తాళ్లతో రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వర్షం, వరదలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజా వర్షాల కారణంగా మరణాల సంఖ్య తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. గతంలో 2009లో సౌదీ కురిసిన వర్షం, వరదల కారణంగా దాదాపు 100 మంది చనిపోయారు. Heavy rainfall in the outskirts of *Al-Awali* near Mecca, Saudi Arabia, has caused many areas to flood. 🌧️🚗 Several vehicles were submerged in the floodwaters, and citizens faced severe difficult. #Flood #AlAwali #Rain pic.twitter.com/pOSvkaua1m— rebel (@Asifahm07207201) January 7, 2025 Heavy rain in Mecca.. pic.twitter.com/ciZh7odU66— TAJNIMUL (@tajnimul11606) January 6, 2025 Massive flooding due to extreme rainfall in Mecca, Saudi Arabia 🇸🇦 Today #Rain #macca #TodayNews #UPDATE pic.twitter.com/cCIRcbH0oL— ✩𝐒𝐇𝐀𝐇𝐈𝐃 𝐌𝐔𝐒𝐓𝐀𝐅𝐀✩ (@Shahidmustafa_m) January 6, 2025 -
సౌదీ అరేబియాకే ఆతిథ్య హక్కులు
జ్యూరిచ్: పుష్కర కాలం వ్యవధిలో ఆసియాలోని మరో అరబ్ దేశం ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వడం ఖాయమైంది. 2022లో ఖతర్‌లో ఈ మెగా ఈవెంట్ జరగ్గా... ఇప్పుడు సౌదీ అరేబియా ఆ అవకాశం దక్కించుకుంది. 2034లో జరిగే ప్రపంచ కప్‌ను సౌదీ అరేబియాలో నిర్వహించనున్నట్లు ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) అధికారికంగా ప్రకటించింది. 2034 వరల్డ్ కప్ కోసం ఒక్క సౌదీ మాత్రమే బిడ్ వేసింది. గత 15 నెలలుగా బిడ్డింగ్ ప్రక్రియ కొనసాగింది. మరే దేశం నుంచి పోటీ లేకపోవడంతో ఆ దేశానికే ఆతిథ్య హక్కులు గతంలోనే ఖాయమయ్యాయి. అయితే ‘ఫిఫా’ అధ్యక్షుడు గియానీ ఇన్‌ఫ్యాంటినో నేతృత్వంలో బుధవారం 200 మంది ‘ఫిఫా’ సభ్యులు ఆన్లైన్ ద్వారా సమావేశమై దీనికి ఆమోద ముద్ర వేశారు. ఖతర్ తరహాలోనే ఈ దేశంలోనూ మానవ హక్కుల ఉల్లంఘన సాగుతోందని, వరల్డ్ కప్ అవకాశం ఇవ్వరాదని విమర్శలు వచి్చనా... ‘ఫిఫా’ వీటిని లెక్క చేయకుండా ముందుకు సాగింది. దేశ రాజధాని రియాద్‌తో పాటు ఇంకా ఇప్పటికీ నిర్మాణం ప్రారంభించని కొత్త నగరం ‘నియోమ్’లో వరల్డ్ కప్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. మూడు దేశాల్లో 2030 టోర్నీ... ‘ఫిఫా’ సమావేశంలో 2030 వరల్డ్ కప్ ఆతిథ్య హక్కులను కూడా ఖాయం చేశారు. ఈ టోర్నీని యూరోప్ దేశాలు స్పెయిన్, పోర్చుగల్‌తో పాటు ఆఫ్రికా దేశం మొరాకో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తాయి. దీంతో పాటు 1930లో జరిగిన తొలి వరల్డ్ కప్‌కు వందేళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని దక్షిణ అమెరికాలోని మూడు దేశాల్లో తొలి మూడు మ్యాచ్‌లు జరుగుతాయి. 1930 విజేత ఉరుగ్వే, రన్నరప్ అర్జెంటీనాతో పాటు ప్రపంచంలోనే అతి పురాతనమైన ‘దక్షిణ అమెరికా ఫుట్‌బాల్ సమాఖ్య’ ప్రధాన కేంద్రం ఉన్న పరాగ్వేలో కూడా ఒక మ్యాచ్ జరుగుతుంది. టోర్నీలోని మొత్తం 104 మ్యాచ్‌లను మూడు వేర్వేరు ఖండాల్లో నిర్వహించనుండటం విశేషం. -
రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్ లో నటి శ్రద్ధా కపూర్ సందడి (ఫొటోలు)
-
ఆ 457 మంది పేర్లు చకచకా...
ముంబై: ఐపీఎల్–2025 సీజన్ కోసం ఈ నెల 24, 25 తేదీల్లో సౌదీ అరేబియా లోని జిద్దా నగరంలో వేలం జరగనుంది. వేలంలో మొత్తం 574 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. అయితే ఇంత మంది పేర్లను ఒక్కొక్కరిగా పిలిచి వేలం ప్రక్రియ కొనసాగించడం చాలా సుదీర్ఘంగా, కష్టతరంగా మారే అవకాశం ఉంది. దాంతో బీసీసీఐ ‘యాక్సిలరేటెడ్ ఆక్షన్’ అంటూ వేలాన్ని వేగంగా ముగించేందుకు సిద్ధమైంది. వేలంలో మొదటి 116 మంది కోసం మాత్రమే ఫ్రాంచైజీలు ముందుగా పోటీ పడతాయి. వరుసగా అంతర్జాతీయ క్రికెట్ ఆడిన మార్క్యూ ప్లేయర్లు, స్పెషలిస్ట్ బ్యాటర్లు, ఆల్‌రౌండర్లు, వికెట్‌కీపర్ బ్యాటర్లు, పేస్ బౌలర్లు, స్పిన్ బౌలర్లు... ఇలా వేలం సాగుతుంది. ఈ వరుసలో చివరగా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించని అన్క్యాప్డ్ ప్లేయర్లు వస్తారు. వీరి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. దాంతో 117 నుంచి 574 నంబర్ వరకు ఉన్న ఆటగాళ్లను ఎంచుకునే విషయంలో ఫ్రాంచైజీలకు ముందే ఒక అవకాశం ఇస్తున్నారు. తాము కోరుకుంటున్న ఆటగాళ్ల పేర్లను తొలి రోజు వేలం ముగిసిన తర్వాత రాత్రి 10 గంటల వరకు అందించాలి. వీరి పేర్లనే వేలంలో ప్రకటిస్తారు. అనంతరం అప్పటి వరకు అమ్ముడుపోని ఆటగాళ్లలో ఇంకా ఎవరినైనా తీసుకోవాలనే ఆలోచన ఉంటే వారి పేర్లను కూడా ఈ ‘యాక్సిలరేటెడ్ ఆక్షన్’లో చెప్పాల్సి ఉంటుంది. దీని వల్ల సమయం ఆదా అవుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు.ఈ జాబితాలో 117వ ఆటగాడిగా ఆంధ్ర క్రికెటర్ రికీ భుయ్ ఉండగా... మిగిలిన వారిలో మొయిన్ అలీ, టిమ్ డేవిడ్, స్పెన్సర్ జాన్సన్, ఉమ్రాన్ మలిక్, ముస్తఫిజుర్, సాంట్నర్, నబీ, స్టీవ్ స్మిత్, సర్ఫరాజ్ ఖాన్, జేమ్స్ అండర్సన్ తదితర గుర్తింపు పొందిన ఆటగాళ్లు ఉన్నారు. ఈ వేలం ప్రక్రియను ప్రముఖ ఆక్షనీర్ మల్లికా సాగర్ నిర్వహించనుంది. గత ఏడాది కూడా ఆమెనే ఆక్షనర్‌గా వ్యవహరించింది. మరోవైపు భారత్, ఆ్రస్టేలియా మధ్య జరిగే పెర్త్ టెస్టు మూడో, నాలుగో రోజుల్లో ఈ వేలం నిర్వహించడంపై కాస్త చర్చ జరిగింది. అయితే సమయం భిన్నంగా ఉండటం వల్ల ఆటగాళ్లు, అభిమానులు కూడా పూర్తి స్థాయిలో వేలం ప్రక్రియను అనుసరించవచ్చు. భారత కాలమానం ప్రకారం టెస్టు ఆట మధ్యాహ్నం గం. 2:50 నిమిషాలకు ముగుస్తుంది. వేలం మధ్యాహ్నం గం. 3:30 నిమిషాలకు ప్రారంభం కానుంది. -
బోర్డర్- గావస్కర్ ట్రోఫీ: కామెంటేటర్‌గా పాంటింగ్ అవుట్!
ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య జరిగే బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెండు మేటి జట్లు ఈ టెస్టు సిరీస్‌లో నువ్వా- నేనా అన్నట్లు పోటీ పడుతుంటే క్రికెట్ ప్రేమికులకు లభించే ఆ కిక్కే వేరు. ఆసీస్- భారత ఆటగాళ్ల మధ్య పరస్పర స్లెడ్జింగ్‌తో పాటు.. మ్యాచ్‌ను విశ్లేషిస్తూ కామెంటేటర్లు విసిరే ఛలోక్తులు, చమక్కులకు కూడా ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు.కామెంట్రీకి దూరంఇరుజట్లకు చెందిన మాజీ క్రికెటర్లలో చాలా మంది ఆసీస్ - భారత్ మధ్య ఈ టెస్టు సిరీస్‌ను తమ వ్యాఖ్యలతో మరింత ఆసక్తికరంగా మారుస్తూ ఉంటారు. ఆసీస్ దిగ్గజ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ కూడా ఈ కోవకు చెందినవాడే. అయితే, అతడు ఈసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీ తొలి టెస్టు కామెంట్రీకి దూరం కానున్నట్లు సమాచారం.కారణం ఇదేపాంటింగ్తో పాటు ఆసీస్ మరో మాజీ క్రికెటర్ జస్టిన్ లాంగర్ కూడా పెర్త్ మ్యాచ్‌కు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియన్ వార్తా పత్రిక ‘ది ఏజ్’ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) విధుల కారణంగా.. పాంటింగ్- లాంగర్ పెర్త్‌లో జరిగే.. మొదటి టెస్టు కామెంట్రీకి దూరంగా ఉండనున్నట్లు తెలిపింది.కాగా రిక్కీ పాంటింగ్ ఇటీవలే.. ఐపీఎల్ జట్టు పంజాబ్ కింగ్స్ హెడ్‌కోచ్‌గా నియమితుడైన విషయం తెలిసిందే. అదే విధంగా.. జస్టిన్ లాంగర్ సైతం లక్నో సూపర్ జెయింట్స్ శిక్షకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. నవంబరు 24, 25 తేదీల్లో ఐపీఎల్-2025 మెగా వేలం జరుగనుంది. సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో జరిగే ఆక్షన్‌కు కోచ్‌లు కూడా అందుబాటులో ఉంటారు.బీసీసీఐపై అక్కసు వెళ్లగక్కిన ఆసీస్ మీడియాఅయితే, అంతకు రెండు రోజుల ముందే.. అంటే నవంబరు 22న ఆసీస్- భారత్ మొదటి టెస్టు మొదలుకానుంది. ఈ నేపథ్యంలోనే ‘ది ఏజ్’ పాంటింగ్- లాంగర్‌ల గురించి ప్రస్తావిస్తూ.. బీసీసీఐపై పరోక్షంగా అక్కసు వెళ్లగక్కింది.‘‘సెవెన్ చానెల్, క్రికెట్ ఆస్ట్రేలియా గనుక.. ఇండియాలోని శక్తిమంతమైన క్రికెట్ అధికారుల నుంచి తమ ప్రయోజనాలను కాపాడుకోలేకపోతే.. పాంటింగ్, లాంగర్, ఆస్ట్రేలియా అసిస్టెంట్ కోచ్ డానియల్ వెటోరీ సైతం సౌదీ అరేబియాకు వెళ్లే పరిస్థితి ఉంది.అక్కడి జెద్దా నగరంలో ఐపీఎల్ మెగా వేలంలో పాల్గొంటూ.. ఆటగాళ్ల కోసం వీళ్లంతా కార్డులు చూపిస్తూ మనకు కనిపిస్తారు. అప్పటికి తొలి టెస్టు ముగింపునకు వస్తుంది’’ అని ‘ది ఏజ్’ పేర్కొంది.నేను కోహ్లిని అవమానించలేదు: పాంటింగ్ఇదిలా ఉంటే.. టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ వ్యాఖ్యలపై రిక్కీ పాంటింగ్ స్పందించాడు. తానేమీ భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిని అవమానించలేదని.. ఆస్ట్రేలియా గడ్డపై అతడు ఫామ్‌లోకి రావాలని మాత్రమే ఆశించానన్నాడు. ఏదేమైనా కోచ్‌గా గౌతీ తన జట్టును డిఫెండ్ చేసుకోవడంలో తప్పులేదని పేర్కొన్నాడు.కాగా కోహ్లి గత ఐదేళ్లలో కేవలం రెండే టెస్టు సెంచరీలు చేయడం ఏమిటని పాంటింగ్ విమర్శించగా.. మీడియా వేదికగా గౌతీ అతడికి కౌంటర్ ఇచ్చాడు. భారత క్రికెట్‌తో పాంటింగ్‌కు ఏం పని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతగా కావాలంటే.. ఆసీస్ ఆటగాళ్ల ఆట తీరును పరిశీలించుకోవాలని హితవు పలికాడు.చదవండి: BGT 2024: అతడి బ్యాటింగ్ అద్భుతం.. భారత తుదిజట్టులో చోటివ్వాల్సిందే: ఆసీస్ మాజీ కెప్టెన్ -
సౌదీలో ఎన్నడూ చూడని వింత.. తెగ ఆశ్చర్యపోతున్న జనం
రియాద్: సౌదీ అరేబియాలో ఎన్నడూ కానరాని వింత ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎడారి ప్రాంతమైన సౌదీ అరేబియాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురియడతో పాటు మంచుకురుస్తోంది. సౌదీ చరిత్రలో ఎన్నిడూ చూడని వాతావరణాన్ని ఇప్పుడు చూస్తున్నామని స్థానికులు అంటున్నారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం అల్-జౌఫ్ ప్రాంతంలో భారీగా మంచుకురిసింది. దేశంలో తొలిసారిగా శీతాకాలపు వాతావరణం కనిపించింది. ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురియడం, వడగళ్ల వానలు పడటం, హిమపాతం ఏర్పడటమనేది ఎన్నడూ జరగలేదు. అల్-జౌఫ్ ప్రాంత ప్రజలు ఉదయం నిద్ర నుంచి లేవగానే తెల్లని మంచును చూశామని ఎంతో గొప్పగా చెబుతున్నారు. 📹 Incredible: Snow Blankets Parts of Saudi Arabia After Heavy Rain & Hail pic.twitter.com/mhn3VHHe5D— RT_India (@RT_India_news) November 4, 2024సౌదీ ప్రెస్ ఏజెన్సీ ఈ ప్రాంతంలోని హిమపాతాన్ని, జలపాతాలను హైలైట్ చేసి చూపిస్తోంది. అయితే రానున్న రోజుల్లో ప్రతికూల వాతావరణం ఏర్పడవచ్చని సౌదీ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తుఫాను వచ్చే అవకాశం ఉందని, భారీ వర్షంతో పాటు వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇంతకుముందు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఇలాంటి వాతావరణ మార్పులు కనిపించాయి.ఇది కూడా చదవండి: అమెరికా ఎన్నికల వేళ.. ఉత్తర కొరియా వరుస క్షిపణి ప్రయోగాలు -
తయారీలో సహకారంపై భారత్, సౌదీ చర్చలు
న్యూఢిల్లీ: పునరుత్పాదక ఇంధనం, డిజిటల్ మౌలిక సదుపాయాలు, తయారీ తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవడంపై భారత్, సౌదీ అరేబియా దృష్టి పెడుతున్నాయి. రెండు రోజుల సౌదీ పర్యటన సందర్భంగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్, ఆ దేశ మంత్రులతో ఈ అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. అలాగే, ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్షియేటివ్ కార్యక్రమంలో పాల్గొంటారని, పలువురు అంతర్జాతీయ దిగ్గజ ఇన్వెస్టర్లతో కూడా భేటీ అవుతారని వివరించింది. వ్యవసాయం, ఆహార భద్రత, ఇంధనం, టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తదితర రంగాలపై ప్రధానంగా దృష్టి పెడుతూ ఇండియా–సౌదీ స్ట్రాటెజిక్ పార్ట్నర్íÙప్ కౌన్సిల్ కింద ఎకానమీ–ఇన్వెస్ట్మెంట్ కమిటీ రెండో సమావేశానికి కో–చెయిర్‌గా వ్యవహరిస్తారు. సౌదీ అరేబియాకు భారత్ రెండో అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. భారత్‌కు సౌదీ అరేబియా నాలుగో అతి పెద్ద భాగస్వామి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2023–24లో 43 బిలియన్ డాలర్లుగా ఉంది. ఎల్అండ్టీ, టాటా, విప్రో తదితర దిగ్గజ భారతీయ కంపెనీలు సౌదీ అరేబియాలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. 2000 ఏప్రిల్ నుంచి 2024 జూన్ మధ్య కాలంలో భారత్‌లో సౌదీ అరేబియా 3.22 బిలియన్ డాలర్ల మేర ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టింది. -
ఇజ్రాయెల్‌కు షాక్.. పాలస్తీనా కోసం రంగంలోకి సౌదీ అరేబియా
హమాస్, హోజ్బొల్లా ఉగ్రవాద సంస్థలను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయిల్ దాడులు కొనసాగుతున్నాయి. గాజా, లెబనాన్, ఇరాన్‌పై క్షిపణులు, బాంబులతో విరుచుకుపడుతోంది.ఈ క్రమంలో తాజాగా గాజా, లెబనాన్‌తో ఇజ్రాయెల్ వివాదాన్ని పరిష్కరించేందుకు సౌదీ అరేబియా అరబ్-ఇస్లామిక్ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించనుంది. నవంబర్ 11న జరగనున్న ఈ సమ్మిట్ పాలస్తీనా రాజ్య స్థాపనపై దృష్టి సారించనుంది. రియాద్‌లో రెండు రోజుల పాటు చర్చలు జరగనున్నాయి.ఈ శిఖరాగ్ర సమావేశం గత సంవత్సరం 2023 అరబ్-ఇస్లామిక్ ఎక్స్‌ట్రార్డీనరీ సమ్మిట్‌కు కొనసాగింపుగా జరగనుంది. ఇది సౌదీ అరేబియా రాజు సల్మాన్, ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. అయితే పాలస్తీనాకు రాజ్యాధికారం కల్పించేందుకు ఇజ్రాయెల్‌పై ఎలా ఒత్తిడి తేవాలనే దానిపై ఈ సదస్సులో ఇస్లామిక్ దేశాలు చర్చించనున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు మధ్యప్రాచ్యంలో నెలకొన్న అస్థిరత, యుద్ధాన్ని ముగింపుకు తీసుకోవాల్సిన చర్యలు వంటి ప్రధాన సమస్యలపై ఈ దేశాలు చర్చించనున్నాయి.కాగా గాజాపై ఇజ్రాయెల్ దాడులను సౌదీ అరేబియా ఖండిస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా లెబనాన్ సమగ్రతను దెబ్బతీసే చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇక 2023లో జరిగిన అరబ్-ఇస్లామిక్ శిఖరాగ్ర సమావేశంలో గాజాపై దాడులను ఆపేందుకు, శాంతి స్థాపనకు కృషి చేసేందుకు సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి, ఈజిప్ట్, ఖతార్, జోర్డాన్, ఇండోనేషియా, నైజీరియా, తుర్కియే వంటి ఇస్లామిక్ దేశాల విదేశాంగ మంత్రులతో పాటు ఇస్లామిక్ కోఆపరేషన్ సంస్థ (ఓఐసీ) ప్రధాన కార్యదర్శులు అంగీకరించారు.ఇదిలా ఉండగా గతేడాది అక్టోబరు 7న హమాస్ తమ దేశంలోకి చొరబడి నరమేథానికి పాల్పడటంతో ఇజ్రాయేల్ ప్రతీకారం తీర్చుకునేందుకు యుద్దం ప్రకటించిన విషయం తెలిసిందే. గత ఏడాదిగా సాగుతున్న ఈయుద్ధం కారణంగా- గాజాలో 43,000 మంది పాలస్తీనీయులు మృతి చెందినట్లు అక్కడి ఆరోగ్య శాఖ తెలిపింది. అందులో సగానికిపై మహిళలు, చిన్నారులు ఉన్నట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు 1,01,110 మంది గాయపడినట్లు పేర్కొంది. అయితే మృతుల్లో ఎంతమంది పౌరులు, మిలిటెంట్లు ఉన్నారనే వివరాలు వెల్లడించలేదు. -
థియేటర్లలో కొత్త సినిమాలు.. అక్కడ మాత్రం బ్యాన్
దీపావళి సందర్భంగా గురువారం(అక్టోబర్ 31).. థియేటర్లలో లక్కీ భాస్కర్, క, అమరన్, బఘీర సినిమాలు రిలీజయ్యాయి. అన్నింటికీ పాజిటివ్ టాక్ వచ్చింది. మరోవైపు హిందీ చిత్రాలు భూల్ భులయ్యా 3, సింగం ఎగైన్.. శుక్రవారం (నవంబర్ 01) థియేటర్లలోకి వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ రెండు చిత్రాల్ని సౌదీ అరేబియా దేశంలో మాత్రం నిషేధించారు. ఎందుకో తెలుసా?(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 15 సినిమాలు)'భూల్ భులయ్యా' ఫ్రాంచైజీలో తీసిన మూడో సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. కార్తిక్ ఆరన్య, విద్యాబాలన్, మాధురీ దీక్షిత్, తృప్తి దిమ్రి.. ఇలా స్టార్ యాక్టర్స్ నటించిన ఈ సినిమాని హారర్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తెరకెక్కించారు. అయితే ఇందులో హోమో సెక్సువాలిటీ అనే అంశాన్ని చూపించినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే సౌదీలో ఈ చిత్రాన్ని ప్రదర్శించకుండా బ్యాన్ చేశారు.'సింగం' ఫ్రాంచైజీలో వచ్చిన మూడో మూవీ 'సింగం ఎగైన్'. అజయ్ దేవగణ్, కరీనా కపూర్, అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె, టైగర్ ష్రాఫ్.. ఇలా ఆల్మోస్ట్ బాలీవుడ్‌లోని స్టార్స్ అందరూ ఇందులో నటించేశారు! రామాయణాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ మూవీ తీశారు. ఈ కారణంతో సౌదీ 'సింగం ఎగైన్'పై నిషేధం విధించింది. అక్కడివాళ్లు ఈ మూవీస్ చూడాలంటే ఓటీటీల్లో వచ్చే వరకు ఆగాల్సిందే.(ఇదీ చదవండి: ఆగస్టులో పెళ్లి.. ప్రెగ్నెన్సీ ప్రకటించిన టాలీవుడ్ హీరోయిన్) -
ఇజ్రాయెల్‌కు సాయం చేయకండి: అరబ్ దేశాలకు ఇరాన్ హెచ్చరిక
ఇరాన్-ఇజ్రాయెల్‌ల మధ్య యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పాలస్తీనా, లెబనాన్‌లపై వైమానిక దాడులతో ఇజ్రాయెల్ విరుచుకుపడుతుంటే.. ఇరాన్ ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. ఈనేపథ్యంలో ఇరాన్ పొరుగున ఉన్న అరబ్ దేశాలకు, అమెరికా మిత్ర దేశాలకు తీవ్ర హెచ్చరికలు చేసింది.తమపై(ఇరాన్) దాడులు జరిపేందుకు ఇజ్రాయెల్‌కు సాయం చేయవ ద్దని హెచ్చరించింది. అలా కాదని అరబ్ దేశాలు వారి భూబాగాలు, గగనతలాన్ని ఉపయోగించి దాడులకు పాల్పడితే తీవ్ర ప్రతీకారం తీర్చుకుంటామని బెదిరించింది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జోర్డాన్, ఖతార్ వంటి చమురు సంపన్న రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని రహస్య దౌత్య మార్గాల ద్వారా ఈ హెచ్చరికను పంపింది. అయితే ఇవన్నీ యూఎస్ సైనిక దళాలకు ఆతిథ్యం ఇచ్చే దేశాలు.ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్బొల్లా అధినేత నస్రల్లా మృతి అనంతరం ఇరాన్ 200 బాలిస్టిక్ మిస్సైళ్లతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడిన విషయం తెలిసిందే. దీంతో ఇరాన్ పెద్దతప్పు చేసిందని, భారీ మూల్యం చెల్లించుకుంటుందని, ప్రతీకార దాడి తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు. అయితే ఇరాన్‌లోని అణుస్థావరాలతో పాటు.. చమురు క్షేత్రాలనూ లక్ష్యంగా చేసుకొనే అవకాశం ఉందని ఐడీఎఫ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథయంలోనే ఇస్లామిక్ రిపబ్లిక్‌పై ఎలాంటి దాడులు జరగకూడదని,అలా జరిగితే ప్రతీకార దాడులకు పాల్పడతామని అరబ్ దేశాలను హెచ్చరించింది. -
సౌదీ మారుతోంది..దేశవ్యాప్తంగా మహిళా ఉపాధ్యాయులకు..!
అరబ్ దేశాల్లో మహిళలపై ఎలాంటి ఆంక్షలు ఉంటాయో తెలిసిందే. అక్కడ స్త్రీలు తండ్రిగ్గానీ, భర్తగ్గానీ, దగ్గరి మగవాళ్లగ్గానీ చెప్పకుండా, వారి అనుమతి తీసుకోకుండా ప్రయాణాలు చెయ్యకూడదు. పెళ్లి చేసుకోకూడదు. ఆఖరికి జీవితాన్ని ప్రభావితం చేసే ముఖ్య నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే ‘స్థాయి తక్కువ’ మగాళ్లను మహిళలు దగ్గరికి చేరనివ్వకూడదు. అలాంటి సౌదీలో ఇటీల కొంతకొంత మార్పులు సంతరించుకుంటున్నాయి. మొన్నటకీ మొన్నఅందాల పోటీల్లో పాల్గొనే విషయంలో కూడా నియమాల్ని సడలించడమే గాక అంతర్జాతీయంగా జరిగే అందాల పోటీల్లో పాల్గొనేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా ఇప్పుడూ ఏకంగా దేశవ్యాప్తంగా ఉన్న మహిళా ఉపాద్యాయులందరికి సంగీత విద్యలో శిక్షణ ఇస్తున్నట్లు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ విషయాన్ని సౌదీ సాంస్కృతిక మంత్రిత్వ శాఖలో ప్లానింగ్ డైరెక్టర్ నూర్ అల్-దబాగ్ రియాద్‌లో జరిగిన లెర్న్ కాన్ఫరెన్స్ సందర్భంగా వెల్లడించారు. ఎందుకంటే..ప్రాథమిక తరగతుల నుంచి పాఠ్యాంశాల్లో సంగీత విద్యను చేర్చాలనే యోచనలో ఉండటంతో ఇలా దేశ వ్యాప్తంగా ఉన్న మహిళా ఉపాధ్యాయులందరికీ సంగీతంలో శిక్షణ ఇస్తున్నట్లు నూర్ పేర్కొంది. దాదాపు 9 వేల మంది మహిళా ఉపాధ్యాయులకు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు సదరు శాఖ ప్లానింగ్ డైరెక్టర్ నూర్ తెలిపారు. అలాగే కళలు, సంస్కృతిని కూడా విద్యా పాఠ్యాంశాల్లో విలీనం చేసే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అంతేగాదు విద్యార్థుల నాణ్యమైన విద్యను అందించి తద్వారా సౌదీని సుసంపన్న దేశంగా మలచాలన్న దిశవైపుకు అడుగులు వేస్తోంది. ఇది నిజంగా సౌదీ ప్రగతి శిలకు సూచనగా చెప్పొచ్చు. కాగా, 38 ఏళ్ల సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ ఇటీవలి కాలంలో సౌదీని సంస్కరణల బాటలో పయనింపజేస్తున్నారు. ఇప్పటి వరకు మహిళా డ్రైవర్లపై నిషేధం నుంచి అందాల పోటీల్లో పాల్గొనడం వరకు పలు మార్పులు తీసుకురావడం విశేషం.(చదవండి: కొరియన్ నోట భారతీయ సంగీతం.. 'ఔరా' అంటున్న నెటిజన్లు) -
కిలోమీటర్ బిల్డింగ్!
ఇప్పటివరకూ మనం ఒక భవనం ఎత్తును మీటర్లలోనే చెప్పుకుంటున్నాం... ఇకపై మాత్రం కిలోమీటర్లలో చెప్పుకోవాల్సి రావచ్చు. ఎందుకంటే.. ప్రపంచంలోనే మొట్టమొదటి కిలోమీటరు ఎత్తైన భవనం తాలూకూ నిర్మాణం పూర్తవుతోంది మరి! ఎక్కడుందీ భవనం? ఎవరు కడుతున్నారు? ఎందుకు? ఖర్చెంత?...ఎడారి దేశం సౌదీ అరేబియాలో కొత్త కొత్త ప్రపంచ రికార్డులు నమోదు కావడం కొత్త కాదు. ఎడారి మధ్యలో 170 కిలోమీటర్ల పొడవైన నగరం ‘ద లైన్’ నిర్మాణ దశలో ఉండగానే బోలెడన్ని రికార్డులు బద్ధలు కొట్టింది. తాజాగా ‘జేఈసీ టవర్స్’ పేరుతో సౌదీ అరేబియాలో నిర్మిస్తున్న కిలోమీటరు భవనం కూడా కొత్త రికార్డును సృష్టించింది. అన్నీ సవ్యంగా సాగితే సుమారు 1007 మీటర్లు అంటే కిలోమీటరు కన్నా పిసరంత ఎక్కువ ఎత్తు ఉన్న ఈ భవనం 2028 నాటికి అందుబాటులోకి రానుంది. కిలోమీటర్ ఎత్తు అంటే ఎంత? అని అనుకుంటూ ఉంటే కొన్ని పోలికలు చూద్దాం. ఈఫిల్ టవర్‌కు మూడు రెట్లు ఎక్కువ. లేదా న్యూయార్క్‌లోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఎత్తుకు రెట్టింపు. భారత్‌లోనే అతి ఎత్తైన బిల్డింగ్ లోఖండ్వాలా మినర్వా (78 అంతస్తులు, 301 మీటర్ల ఎత్తు) కంటే మూడు రెట్లు ఇంకొంచెం ఎక్కువన్నమాట. మొదట్లో ఈ జేఈసీ టవర్స్‌కు ‘కింగ్డమ్ టవర్’ అని పేరు పెట్టారు. కాకపోతే అప్పుడు లక్ష్యం ఒక మైలు ఎత్తు. ఇసుక నేలల్లో ఇంత ఎత్తైన భవనం కట్టలేమని స్పష్టమైన తరువాత దీన్ని కిలోమీటరుకు పరిమితం చేశారు. పేరు కూడా ముందు ‘జెడ్డా టవర్స్’ అని తాజాగా ‘జెడ్డా ఎకనమిక్ టవర్’ అని మార్చారు. దుబాయిలోని ఎత్తైన భవం ‘బుర్జ్ ఖలీఫా’ (828 మీటర్ల ఎత్తు)ను డిజైన్ చేసిన ఆడ్రియన్ స్మిత్, గార్డన్ హిల్లు ఈ జేఈసీ టవర్‌కూ రూపకల్పన చేశారు. ఎడారిలో పెరిగే ఓ చెట్టు ఆకుల మాదిరిగా త్రికోణ ఆకారంలో ఆకాశాన్ని అంటేలా ఉంటుందీ భవనం. ఎర్ర సముద్ర తీరంలోని జెడ్డా నగరం బీచ్ ఒడ్డునే కడుతున్నారు.భవనం ఎత్తు పెరిగిన కొద్దీ పై అంతస్తుల్లో గాలి చాలా బలంగా వీస్తుంటుందని మనకు తెలుసు. అందుకే జేఈసీ టవర్ నిర్మాణంలో పలు జాగ్రత్తలు తీసుకున్నారు. బలమైన గాలులను తట్టుకోవడమే కాకుండా.. సూర్యుడి ఎండ ప్రతాపాన్ని తగ్గించేందుకూ తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇసుక నేలలో సుమారు 344 అడుగుల లోతైన 270 కాంక్రీట్ దిమ్మెల పునాదులపై నిర్మాణమవుతోంది. అంతస్తులు ఎన్నో తెలుసా?లోఖండ్ వాలా మినర్వాలో మొత్తం 78 అంతస్తులు ఉండగా.. జేఈసీ టవర్‌లో ఏకంగా 157 అంతస్తులు ఉండబోతున్నాయి. మొత్తం 59 లిఫ్ట్‌లు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే బుర్జ్ ఖలీఫాలో దుబాయి నగరం మొత్తన్ని వీక్షించేందుకు 128వ అంతస్తులో ఏర్పాట్లు ఉంటే.. జేఈసీ టవర్‌లో ఇంతకంటే ఎత్తైన అంతస్తులో వ్యూపాయింట్ ఏర్పాటు చేస్తున్నారు. అత్యంత విలాసవంతమైన అపార్ట్మెంట్లు మాత్రమే కాకుండా.. ఒక లగ్జరీ హోటల్, కార్యాలయాలు కూడా భవనం లోపల ఏర్పాటవుతాయి. జేఈసీ టవర్ నిర్మాణం పదేళ్ల క్రితమే మొదలైనా 60వ అంతస్తు స్థాయికి చేరేటప్పటికి ఆగిపోయింది. కొన్నేళ్ల విరామం తరువాత మూడేళ్ల క్రితం మళ్లీ నిర్మాణం మొదలై పూర్తి చేసుకోబోతోంది. ఇంతకీ ఈ భవనం కట్టేందుకు అయ్యే ఖర్చు ఎంతో చెప్పలేదు కదా... అక్షరాలా... 720 కోట్ల సౌదీ అరేబియా రియాళ్లు! రూపాయల్లో చెప్పుకోవాలంటే 159,662,700,000! పదిహేను వేల కోట్ల రూపాయల కంటే ఎక్కువన్నమాట!!!-జి.గోపాలకృష్ణ మయ్యా -
ప్రమాదకర యుద్ధక్రీడ
ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడితో ఏడాది క్రితం అక్టోబర్ 7న పశ్చిమాసియాలో చెలరేగిన హింసాత్మక సంఘర్షణ ఇప్పుడు మరో మలుపు తీసుకుంది. ముస్లిమ్‌లలోని షియా వర్గానికి చెందిన తీవ్రవాద హెజ్బొల్లా బృందానికి 32 ఏళ్ళుగా సారథ్యం వహిస్తున్న అధినేత హసన్ నస్రల్లాను భీకర గగనతల దాడుల ద్వారా ఇజ్రాయెల్ మట్టుబెట్టిన తీరు ఒక్కసారిగా అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. లెబనాన్‌లోని ఇటీవలి పేజర్లు, వాకీటాకీల పేలుళ్ళ ఉదంతం మరువక ముందే ఇజ్రాయెల్ మరోసారి తన గూఢచర్య, సైనిక సత్తా చాటిన వైనం ముక్కున వేలేసుకొనేలా చేసింది. లెబనాన్‌లో తాత్కాలిక కాల్పుల విరమణకు అమెరికా, ఫ్రాన్స్‌లు గురువారం పిలుపునిచ్చినప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ దాన్ని సమర్థిస్తున్నారనే అందరూ భావించారు. ఒక్క రోజు గడిచిందో లేదో... ఒకపక్క న్యూయార్క్‌లో ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ సమావేశం సాగుతుండగానే, మరోపక్క నెతన్యాహూ మాత్రం బీరుట్‌పై వైమానిక దాడికీ, హెజ్బొల్లా అధినేతను మట్టుబెట్టడానికీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు. ఎవరెన్ని చెప్పినా, ఐరాసలో ఎన్ని తీర్మానాలు చేసినా ఘర్షణను కొనసాగించాలనే ఇజ్రాయెల్ మంకుపట్టుతో ముందుకు పోతున్నట్టు తేటతెల్లమైంది. చిత్రమేమిటంటే, లెబనాన్‌లో కాల్పుల విరమణను బయట తోసిపుచ్చిన నెతన్యాహూ ప్రైవేటుగా మాత్రం అందుకు అంగీకరించారు. అమెరికా, ఫ్రాన్స్ అధికారులు సైతం చెప్పినమాట అదే. తీరా దాడులు మాత్రం నెతన్యాహూ కొనసాగించారు. కొన్ని నెలలుగా ఆయన తీరు అంతే. అమెరికాకు నచ్చే మాటలు పైకి చెబుతారు. కానీ, చివరకు మాత్రం తాను ఏదనుకుంటే అదే చేస్తున్నారు. అమెరికా సైతం పైకి శాంతి వచనాలు చెబుతున్నా, ఇజ్రాయెల్‌కు ఆయుధాల సరఫరా ఆపలేదు. ఆ ఆయుధాలను వాడుకుంటూ ఇజ్రాయెల్ పేట్రేగిపోతుంటే ఆపుతున్నదీ లేదు. ఇప్పటికే కొన్ని వేల మంది గాజాలో ప్రాణాలు కోల్పోయారు. గత వారంలో లెబనాన్‌లోనూ వెయ్యిమంది మరణించారు. అక్కడి జనాభాలో దాదాపు అయిదోవంతు మంది నిర్వాసితులయ్యారు. భవనాలపై బాంబు దాడులకు జడిసి, ప్రజలు వీధుల్లో నిద్రిస్తున్న పరిస్థితి. గగనతలం నుంచి బాంబులు ఆగలేదు. భూమార్గంలోనూ ముప్పు తప్పదన్న భయం తప్పడం లేదు. మరోపక్క ఇజ్రాయెల్ చేపట్టిన పని ఇంకా పూర్తి కాలేదని ఆ దేశ ప్రధాని ప్రకటించడంతో ఈ తలనొప్పి తగ్గేలా లేదు.అలాగని హెజ్బొల్లా అధినేత మరణానికి యావత్ లెబనాన్ బాధపడుతోందని అనలేం. తీవ్ర హింసకు పాల్పడి, ఎందరి మరణానికో కారణమైన నస్రల్లా పట్ల లెబనాన్, ఇజ్రాయెల్, సిరియా సహా పలు ప్రాంతాల్లో ప్రజానీకానికి పెద్దగా ప్రేమ ఏమీ లేదు. అరబ్ ప్రపంచంతో పాటు సాక్షాత్తూ లెబనాన్‌లో సైతం ఆయన మరణానికి సోషల్ మీడియాలో పెద్దయెత్తున ఆనందం వ్యక్తం కావడం గమనార్హం. సిరియన్ నియంత బషర్ అల్–అసద్‌తో చేతులు కలిపి తమ వద్ద ప్రజాస్వామ్య ఉద్యమాన్ని హెజ్బొల్లా అణిచివేయడంతో వారిలో ఆగ్రహం నెలకొంది. అందుకే ఈ రకమైన భావన వ్యక్తమైంది. లెబనీస్ ప్రభుత్వం ఏకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించి, తద్వారా లెబనీస్ సైన్యం హెజ్బొల్లా చేతుల్లోని దక్షిణ లెబనాన్‌పై నియంత్రణ సాధించి, సరిహద్దు వెంట శాంతి నెలకొల్పాల నేది వారి అభ్యర్థన. నిజానికి, ఇజ్రాయెల్‌తో యుద్ధం తాము కోరుకోకపోయినా, ఇరాన్ ఆదేశాలతో లెబనీస్‌ను నస్రల్లా దీనిలోకి లాగారని వారి వాదన. ఇలాగే సాగితే గాజా భూఖండం లాగా బీరుట్ సైతం ధ్వంసమవుతుందనీ, అంతర్యుద్ధం మళ్ళీ వస్తుందనీ లెబనీయుల భయం. ముందు ఇజ్రాయెల్, సౌదీ అరేబియా మధ్య సంబంధాలు సాధారణస్థితికి రావడం ముఖ్యం. అందుకు సౌదీలూ సిద్ధమే! కాకపోతే, రెండు దేశాల ఏర్పాటనే పరిష్కార సూత్రంతో పశ్చిమ తీరం లోని పాలెస్తీనా అథారిటీతో చర్చలు జరిపేందుకు ఇజ్రాయెల్ ముందుకు రావాలన్నది వారి షరతు. వ్యవహారం అక్కడే పీటముడి పడింది. ఇరాన్‌కు నెతన్యాహూ హెచ్చరిక, హెజ్బొల్లా నేత హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఇరాన్ సుప్రీమ్ లీడర్ అయతొల్లా ఖమేనీ ప్రతిజ్ఞ, ఇరాన్ అండతో పెచ్చరిల్లుతున్న ఇతర వర్గాల వ్యవహారం... అంతా చూస్తుంటే ఇక ఇది అంతులేని కథే! నిజానికి, లెబనాన్, గాజాల్లోని తీవ్రవాద వర్గాలను హతమార్చాలనే ఇజ్రాయెల్ సైనిక విధానం వల్ల తాత్కా లిక లాభాలే తప్ప, శాశ్వత ప్రయోజనం ఉండదు. ఆ మధ్య సాక్షాత్తూ ఇరాన్ రాజధాని టెహరాన్‌లో హమాస్ నేత ఇస్మాయిల్ హనీయే, ఇప్పుడు బీరుట్లో హెజ్బొల్లా అధినేత, వెంటనే అదే గ్రూపులోని మరో కీలక నేత నబిల్ కౌక్... ఇలా పలువురిని ఇజ్రాయెల్ చంపేసింది. కానీ ఇలాంటి సంస్థల్లో ఒకరు పోతే మరొకరొస్తారు. పైగా ఇజ్రాయెల్ దూకుడు వల్ల ఇరాన్‌లోని కొత్త సంస్కరణవాద సర్కారూ చేసేదేమీ లేక, తీవ్రంగా ప్రతిస్పందించక తప్పదు. అప్పుడు ముడి మరింత బిగుస్తుంది. అగ్రదేశాల స్వార్థం, ప్రపంచ శాంతికి కృషి చేయాల్సిన అంతర్జాతీయ సంస్థల సంపూర్ణ వైఫల్యం ఈ దీర్ఘకాలిక సమస్యకూ, ఏడాదిగా ఆగని మారణహోమానికీ కారణం. పాలెస్తీనాలో ఇజ్రాయెల్ దురాక్రమణకు వచ్చే ఏడాదిలోగా ముగింపు పలకాలని ఐరాస తీర్మానించిన కొద్దిరోజులకే ఇలా జరిగిందంటే ఏమనాలి! ఐరాసకు కోరలు లేని పరిస్థితుల్లో... ప్రపంచానికి సరికొత్త శాంతిసాధన వ్యవస్థ అవసరం కనిపిస్తోంది. నెతన్యాహూ ఇలాగే తన దూకుడు కొనసాగిస్తే, పశ్చిమాసియాలో పరిస్థితి మరింత దిగజారుతుంది. లెబనాన్‌లో సైతం మరో గాజాను ఇజ్రాయెల్ సృష్టించక ముందే ప్రపంచ దేశాలు కళ్ళు తెరవాలి. నిర్బంధంగానైనా కాల్పుల విరమణను సాధించాలి. లేదంటే, పశ్చిమాసియాపై యుద్ధ మేఘాలు మరింత విస్తరిస్తాయి. ప్రపంచాన్ని చీకటితో కమ్మేస్తాయి. -
యాచకులను నియంత్రించండి.. పాక్‌కు సౌదీ హెచ్చరిక
ఇస్లామాబాద్: పాక్‌లోని యాచకులు తమ పొట్టపోసుకునేందుకు సౌదీ అరబ్‌కు తరలివెళ్లడం గల్ఫ్ దేశానికి భారంగా మారింది. ఉమ్రా, హజ్ పేరుతో తమ దేశానికి వస్తున్న పాకిస్తానీ యాచకుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడంపై సౌదీ అరేబియా ఆందోళన వ్యక్తం చేస్తోంది.పాక్‌లోని యాచకులు గల్ఫ్ దేశంలోకి ప్రవేశించకుండా తగిన చర్యలు తీసుకోవాలని తాజాగా పాకిస్తాన్‌ను సౌదీ అరేబియా హెచ్చరించింది. పాకిస్తాన్ మత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి వచ్చిన సమాచారాన్ని ‘ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ ప్రచురించింది. పాక్‌కు చెందిన యాచకులు గల్ఫ్‌కు తరలివెళ్లడాన్ని నియంత్రించాలని పాకిస్తాన్‌ను సౌదీ అరేబియా కోరింది. అక్కడి యాచకులు తమ దేశానికి రావడంతో ఉమ్రా, హజ్ యాత్రికులపై ప్రతికూల ప్రభావం పడుతున్నదని ఆరోపించింది.ఉమ్రా వీసాతో పాకిస్తానీ యాచకులు గల్ఫ్ దేశంలోకి ప్రవేశించకుండా ఆ దేశం చర్యలు తీసుకోవాలని సౌదీ హజ్ మంత్రిత్వ శాఖ పాకిస్తాన్ మత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు హెచ్చరిక జారీ చేసింది. ఈ నేపధ్యంలో ఉమ్రాను ఏర్పాటు చేసే ట్రావెల్ ఏజెన్సీలను నియంత్రించడం, వాటిని చట్టపరమైన పర్యవేక్షణలోకి తీసుకువచ్చేందుకు ఉమ్రా చట్టం తీసుకురావాలని పాకిస్తాన్ నిర్ణయించింది.దీనికిముందు సౌదీ రాయబారి నవాఫ్ బిన్ సయీద్ అహ్మద్ అల్-మాలికీతో సమావేశమైన పాక్ మంత్రి మొహ్సిన్ నఖ్వీ.. సౌదీ అరేబియాకు యాచకులను పంపే మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉమ్రా పేరుతో పాకిస్తానీ యాచకులు గల్ఫ్ దేశానికి వెళుతున్నారని, అక్కడ భిక్షాటన సాగిస్తున్నారని సౌదీ అరేబియా తరచూ ఆరోపిస్తోంది.ఇది కూడా చదవండి: విదేశీయుల చూపు..ఏపీ సేంద్రియ సాగు వైపు -
సౌదీ అరేబియా ఎడారిలో చిక్కుకుని తెలంగాణ వాసి మృతి
ఉపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లిన తెలంగాణ యువకుడు మృతి చెందాడు. సౌదీ అరేబియాలోని రబ్ అల్ ఖలీ అనే ఎడారిలో చిక్కుకుని 27 ఏళ్ల షెహజాద్ ఖాన్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఆ ఎడారిలో దారితప్పి..ఎటు వెళ్లాలో తెలియక.. మరోవైపు తాగేందుకు నీరు, తినేందుకు ఆహరం లేక ఐదు రోజులుపాటు నరకయాతన అనుభవించి అత్యంత దయనీయ స్థితిలో చనిపోయాడు. వివరాల్లోకెళ్తే..కరీంనగర్‌కి చెంఇన 27 ఏళ్ల షెహజాద్ ఖాన్ బతుకుదెరువు కోసం సౌదీ అరేబియా వెళ్లాడు. అక్కడ టెలికమ్యూనికేషన్స్ కంపెనీలో మూడేళ్లుగా పనిచేస్తున్నాడు. తన డ్యూటీలో భాగంగా ఐదు రోజల క్రితం తన సహోద్యోగి అయిన సూడాన్ వాసితో కలిసి ఓ ప్రాంతానికి వెళ్లాడు. కానీ వారు వెళ్లే సమయంలో జీపీఎస్ సక్రమంగా పనిచేయలేదు.జీపీఎస్ పనిచేయకపోవడంతో వారిద్దరూ దారి తప్పిపోయారు. వారు వెళ్లాల్సిన గమ్యస్థానానికి కాకుండా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన రుబా అల్ ఖలీ అనే ఎడారికి చేరుకున్నారు. ఎటు వెళ్లాలో తెలియక వాహనాన్ని అలాగే పోనిస్తూ ఉండగా అందులో పెట్రోల్ అయిపోయింది. తాము దారితప్పామనే విషయం మేనేజ్మెంట్కు చెబుదామన్నా కూడా ఇద్దరి మొబైల్స్ స్విచ్ఛాఫ్ అయ్యాయి. నాలుగు దేశాల్లో విస్తరించి ఉన్న రుబా అల్ ఖలీ ఎడారిని అత్యంత ప్రమాదకరమైన ఎడారిగా చెబుతుంటారు.దీంతో జనావాసాలు ఉన్న చోటుకు నడుచుకుంటూ అయినా వెళ్లిపోదామని షహబాద్ ఖాన్, అతని సహచరుడు అనుకున్నప్పటికీ.. ఎటుచూసినా ఎడారే కనబడటంతో ఏం చేయాలో పాలుపోలేదు. దీంతో తమను ఆ దేవుడు కాపాడకపోతాడా అని అక్కడే ఎడారిలో నమాజ్ చేసుకుంటూ ఉండిపోయారు. ఈ క్రమంలో పైన ఎండ, కింద ఇసుక వేడితో వాళ్లు డీహైడ్రేషన్‌కు గురయ్యారు. తాగేందుకు నీరు, తినడానికి అహారం లేక అక్కడే ప్రాణాలొదిలారు. సర్వీస్ కోసం వెళ్లిన ఇద్దరు ఉద్యోగులు కనిపించకుండా వెళ్లారని యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు ఎడారిలో వారి వాహనం పక్కనే విగతజీవులుగా ఉన్న వారిద్దరినీ గుర్తించారు పోలీసులు. ఈ విషయాన్ని బాధితుడి కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో ఒక్కసారిగా ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.(చదవండి: వైద్యుడి రూపంలోని రాక్షసుడు) -
ఆరునెలల్లోనే 610 కిలోల నుంచి 63 కిలోలకు తగ్గాడు..ఏం చేశాడంటే..?
ప్రపంచంలోనే అత్యంత బరువుగా ఉన్న రెండో వ్యక్తిగా ఖలీద్ బిన్ మొహసేన్ షరీ అనుహ్యంగా కిలోల కొద్ది బరువు తగ్గాడు. అదికూడా స్వలం కాలంలోనే అన్ని కిలోలు బరువు తగ్గి ఆశ్యర్యపరిచాడు. అంతలా బరువు తగ్గినందుకు గానూ ఖలీద్ సౌదీ అరేబియా రాజు అబ్దుల్లాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు కూడా. ఇంతకీ ఆ వ్యక్తి ఏం చేసి తన బరువుని తగ్గించుకున్నాడు. అందుకు సౌదీ అరేబియా రాజు ఎలాంటి సాయం అందించాడు తదితరాల గురించి సవివరంగా చూద్దాం. ఒకప్పుడూ సజీవంగా ఉన్న అత్యంత బరువైన రెండో వ్యక్తిగా పేరుగాంచిన ఖలీద్ సుమారు 546 కిలోల బరువు తగ్గాడు. 2013 వరకు ఖలీద్ బరువు 610 కేజీలు ఉండేవాడు. ప్రాథమిక అవసరాలకు కూడా స్నేహితులు, కుటుంబసభ్యులపై ఆధారపడే స్థాయికి అతని పరిస్థితి దిగజారింది. ఖలీద్ దుస్థితిని చూసి చలించిపోయిన సౌదీ రాజు అబ్దుల్లా అతని ప్రాణాలు కాపాడేందుకు ఎటువంటి ఖర్చు లేకుండా ఉన్నత స్థాయి వైద్యం అందేలా ఏర్పాటు చేశాడు. ముందుగా ఖలీద్‌ను జజాన్‌లోని అతని ఇంటి నుంచి ఫోర్క్లిఫ్ట్ సాయంతో ప్రత్యేకంగా రూపొందించిన బెడ్ని ఉపయోగించి రియాద్‌లోని షహద్ మెడికల్ సిటీకి తీసుకొచ్చారు.కఠినమైనమైన ఆహార నియమావళితో చికిత్సను ప్రారంభించారు. దీన్ని అమలు చేసేలా సుమారు 30 మంది వైద్య నిపుణుల బృందాన్ని నియమించారు. అంతేగాదు ఖలీద్ చికిత్సలో భాగంగా గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ, కస్టమైజ్డ్ డైట్, ఎక్సర్సైజ్ ప్లాన్, ఇంటెన్సివ్ ఫిజియోథెరపీ సెషన్లు వంటివి అందించారు. ప్రముఖ నిపుణులు సాయంతో ఖలీద్ బరువు తగ్గడంలో అద్భుతమైన ఫలితాలు చూశాడు. అంతేగాదు ఖలీద్ కేవలం ఆరు నెలల్లోనే దాదాపు సగం బరువును కోల్పోయాడు. చెప్పాలంటే 2023 నాటికి 542 కేజీలు తగ్గి ఆరోగ్యకరంగా 63.5 కిలోలకు తగ్గాడు. ఇక్కడ ఖలీద్ అనేక అదనపు చర్మ తొలగింపు శస్త్ర చికిత్సలు అవసరం అవుతుంది. ఎందుకంటే కొత్త శరీర ఆకృతికి అనుగుణంగా చర్మం ఉండదు. అంతేగాదు ఖలీద్‌ని వైద్యులు "ది స్మైలింగ్ మ్యాన్" అని ముద్దుగా పిలుచుకుంటారు.(చదవండి: ఫుడ్ మెమొరీస్.. విభజన టైంలో ఈ వృద్ధుల ‘చేదు’ అనుభవాలు!) -
మా కుమారుడిని ఇంటికి చేర్చండి
అంబాజీపేట: ఉపాధి కోసం సౌదీ వెళ్లిన ఓ యువకుడిని ఏజెంట్ మోసం చేయడంతో ఎడారిలో చిక్కుకుపోయాడు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ప్రభుత్వం జోక్యం చేసుకుని తమ కుమారుడిని తమ ఇంటికి చేర్చాలని అతని తల్లిదండ్రులు కోరుతున్నారు. బాధిత యువకుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలోని ఇసుకపూడి మెరకపేటకు చెందిన సరెళ్ల సత్తిరాజు, మరియమ్మ దంపతుల కుమారుడు సరెళ్ల వీరేంద్రకుమార్ ఈ నెల 9వ తేదీన ఏజెంట్, మధ్యవర్తుల సాయంతో ఖతార్‌లో వంట మనిíÙగా పనిచేసేందుకు వెళ్లాడు.అతను 10వ తేదీన ఖతార్‌కు చేరగా, అక్కడ వంట మనిషి ఉద్యోగం ఇవ్వలేదు. అతడ్ని ఖతార్ నుంచి ఈ నెల 11 తేదీన సౌదీ అరేబియా పంపించారు. అక్కడ ఎడారిలో ఒంటెలకాపరిగా నియమించారు. భగభగ మండే ఎండ తీవ్రత వల్ల ఎడారిలో ఒంటెలకాపరిగా పని చేస్తున్న వీరేంద్రకుమార్ ఆరోగ్యం దెబ్బతిన్నది. తనకు రక్తపు వాంతులు అవుతున్నాయని, తాగేందుకు నీరు, తినేందుకు ఆహారం దొరకడం లేదని, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని వీరేంద్రకుమార్ వాట్సాప్ ద్వారా తన తల్లిదండ్రులు సత్తిరాజు, మరియమ్మ, సోదరుడు రవికుమార్‌తోపాటు బంధువులు, స్నేహితులకు తెలియజేశాడు.తన ఆరోగ్యం క్షీణిస్తోందని, వెంటనే స్వగ్రామం తీసుకువెళ్లేందుకు చర్యలు తీసుకోవాలని కన్నీటిపర్యంతమవుతూ వేడుకున్నాడు. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ఈ నెల 19న అమరావతిలోని ఏపీ నాన్ రెసిడెండ్ తెలుగు సొసైటీ(ఏపీ ఎన్ఆర్టీఎస్) అధికారులను కలిసి సౌదీలో వీరేంద్రకుమార్ పడుతున్న ఇబ్బందులను తెలియజేసి సాయం చేయాలని కోరారు. అమలాపురం ఎంపీ గంటి హరీ‹Ùమాధుర్, ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, తహసీల్దార్ల దృష్టికి కూడా సమస్యను తీసుకువెళ్లి వీరేంద్రకుమార్‌ను స్వస్థలానికి తీసుకువచ్చేందుకు సహకరించాలని విన్నవించారు. -
ఔనా..! స్లిప్పర్స్‌కు లక్ష!
మీరు విన్నది నిజమే! మన రెగ్యులర్‌గా ఉపయోగించే స్లిప్పర్స్ సౌదీలో అక్షరాలా లక్షకు పైమాటే! కువైట్, చుట్టుపక్కల న్యూస్ పంచుకునే ఓ ఇన్స్టాగ్రామ్ ఖాతాదారు ఒక స్టోర్‌లో రికార్డ్ చేసిన వీడియోను షేర్ చేసింది. ‘అత్యాధునికమైనవి’గా ‘చెప్పు’ కుంటున్న ఈ స్ల్లిప్పర్స్ ధర 4,590 సౌదీ రియాల్స్ పలుకుతోంది. ఇది మన రూ΄ాయలలో లక్షా రెండువేలకు పైగానే! ఎరుపు, పసుపు, నీలం, ఆకుపచ్చ రంగులతో సహా వివిధ రంగులలో ఉన్న స్లిప్పర్స్ జతలను ఓ ఉద్యోగి గ్లాస్ కేస్‌లోంచి తీసి వీడియో రికార్డ్ చేస్తున్న వ్యక్తికి చూపించాడు. ఈ వీడియో చూసిన నెటిజనులు... ‘ఇవి మా కుటుంబం వాడే బాత్రూమ్ చెప్పులు’ అని, ‘ఇండియాలో వీటిని టాయిలెట్ ΄ాదరక్షలుగా ఉపయోగిస్తారనీ కామెంట్ చేస్తున్నారు. -
ల్యాండ్ అవుతుండగా విమానంలో మంటలు.. ప్రయాణికుల కేకలు!
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో తృటిలో ఘోర విమానం తప్పింది. సౌదీకి చెందిన ఎయిర్‌లైన్స్‌లోని పెషావర్‌లో ల్యాండ్ అవుతున్న సమయంలో మంటలు వ్యాపించడం అధికారులు గుర్తించారు. వెంటనే సహాయక బృందాలు అప్రమత్తమై విమానాన్ని నిలిపివేసి మంటలను అదుపులోకి తెచ్చారు.వివరాల ప్రకారం.. పాకిస్తాన్‌లోని పెషావర్‌లో సౌదీ ఎయిర్‌లైన్స్ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. గురువారం ఉదయం 276 మంది ప్రయాణికులు, 21 విమాన సిబ్బందితో రియాద్ నుంచి సౌదీ ఎయిర్‌లైన్స్ విమానం ఎస్వీ 792 పాకిస్థాన్‌లోని పెషావర్‌కు బయలుదేరింది. ఇక, విమానం పెషావర్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవుతున్న సమయంలో ఎడమ గేర్ నుంచి దట్టమైన పొగలతోపాటు మంటలు వచ్చాయి.ఈ విషయాన్ని ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అధికారులు గుర్తించారు. దీంతో, వెంటనే అప్రమత్తమయ్యారు. మంటల విషయాన్ని విమాన పైలెట్‌తోపాటు సహాయక సిబ్బందికి చేరవేశారు. అనంతరం, విమానాన్ని వెంటనే ఎయిరోపోర్ట్‌లో నిలిపివేశారు. హుటాహుటిన ప్రయాణికులతోపాటు సిబ్బందిని విమానం నుంచి దింపివేశారు. తర్వాత విమానం గేర్ వద్ద ఎగసిపడుతున్న మంటలను ఆర్పివేశారు. Latest: Saudia Airbus A330 operating Riyadh to Peshawar experienced a fire in the left landing gear on landing The aircraft went on to suffer a runway excursion before coming to a complete stop. Evacuation initiated, all passengers and 21 crew are safe.pic.twitter.com/WF34skShM1— Alex Macheras (@AlexInAir) July 11, 2024 ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, విమానంలో గేర్ నుంచి మంటలు రావడానికి గల కారణాలను టెక్నికల్ టీమ్ అన్వేషిస్తోంది. మరోవైపు.. ఈ ప్రమాదంలో ప్రయాణీకులు ఎవరికీ గాయాలు కాలేదని సౌదీ ఎయిర్ లైన్స్ వెల్లడించింది. #SaudiAirlines flight 792 4rm #Riyadh experienced a #fire in the left landing gear while maneuvering at #Peshawar Airport, Rescue Services swiftly extinguished the #blaze after n alert by air traffic preventing a major accident, 276passeng n 21crew evacuated via inflatable slides pic.twitter.com/mUnBYUvPRj— Sajjad Tarakzai (@SajjadTarakzai) July 11, 2024 -
భారతీయులకు శుభవార్త.. సౌదీ వెళ్లడానికి కొత్త ఎంట్రీ వీసాలు
సౌదీ అరేబియా పర్యాటకాన్ని పెంచే దిశగా భారతీయ పౌరుల కోసం కొత్త వీసా ఎంపికలను ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది. ఇందులో స్టాప్ఓవర్ వీసాలు, ఈవీసాలు, వీసా ఆన్ అరైవల్ వంటివి ఉన్నాయి. 2024 చివరి నాటికి సౌదీ అరేబియాను సందర్శించే భారతీయ పర్యాటకుల సంఖ్య 20 లక్షల కంటే ఎక్కువ ఉండాలని ఈ కొత్త వీసాలను ప్రవేశపెట్టడం జరిగింది.భారతీయులు ఇప్పుడు స్టాప్ఓవర్ వీసా కోసం అప్లై చేసుకోవచ్చు. ఇది గరిష్టంగా 96 గంటలు చెల్లుతుంది. ఈ వీసాను సౌదియా ఎయిర్‌లైన్ వెబ్సైట్ ద్వారా 90 రోజులు ముందుగానే పొందవచ్చు. దీనికోసం నామినల్ ఫీజు వంటివి చెల్లించాల్సి ఉంటుంది.యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్ లేదా స్కెంజెన్ దేశం నుంచి చెల్లుబాటు అయ్యే పర్యాటక లేదా వ్యాపార వీసాలను కలిగి ఉన్న భారతీయ పౌరులు ఈవీసా పొందటానికి అర్హులు. ఈ దేశాలలో శాశ్వత నివాసితులు లేదా సౌదీ అరేబియాలోకి ప్రవేశించిన తేదీ కంటే కనీసం మూడు నెలల చెల్లుబాటు అయ్యే నివాస వీసా ఉన్న వ్యక్తులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈవీసా అధికారిక పోర్టల్ ద్వారా దీనిని పొందవచ్చు.ఈవీసా కోసం అవసరమైన ప్రమాణాలు ఉన్నవారు.. వీసా ఆన్ అరైవల్ కూడా పొందవచ్చు. యూఎస్, యూకే, స్కెంజెన్ దేశాల నుంచి చెల్లుబాటు అయ్యే పర్యాటక లేదా వ్యాపార వీసాలు కలిగిన వారికి మాత్రమే కాకుండా ఈ దేశాలలో శాశ్వత నివాసితులకు వీసా ఆన్ అరైవల్ పొందవచ్చు. దీని కోసం సౌదీ విమానాశ్రయాల్లోని సెల్ఫ్-సర్వీస్ కియోస్క్‌లు లేదా పాస్‌పోర్ట్ కార్యాలయాల్లో అప్లై చేసుకోవచ్చు.సౌదీ అరేబియా భారతీయ పౌరుల కోసం అందిస్తున్న ఈ వీసాల కోసం.. ముంబై, ఢిల్లీ, కొచ్చిన్, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగుళూరు, లక్నో, కోల్‌కతా, కాలికట్లలోని 10 వీసా ఫెసిలిటేషన్ కేంద్రాలలో అప్లై చేసుకోవచ్చు. ఇవి కాకుండా మరిన్ని నగరాల్లో కూడా ప్రత్యేక కేంద్రాలను ప్రారంభించే అవకాశం ఉంది. సౌదీ విజన్ 2030లో భాగంగా 2030నాటికి 75 లక్షల మంది ప్రయాణికులను సౌదీ అరేబియా ఆహ్వానించనుంది. -
హజ్ యాత్ర మృతులపై సౌదీ అధికారిక ప్రకటన.. మరణాలు ఎన్నంటే?
ఇటీవల సౌదీ అరేబియాలో హజ్ యాత్ర సందర్భంగా యాత్రికులు మృత్యువాతపడ్డారు. ఈ సందర్భంగా యాత్రకు వచ్చిన వారిలో 1301 మంది చనిపోయారని సౌదీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇదే సమయంలో అస్వస్థతకు గురైన పలువురు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్టు చెప్పుకొచ్చింది.కాగా, సౌదీ అరేబియా హజ్ యాత్రకు ఈ ఏడాది పలు దేశాల నుంచి కొన్ని లక్షల మంది వచ్చారు. దాదాపు 22 దేశాల నుంచి పది లక్షల మంది యాత్రికులు రాగా.. సౌదీ అరేబియా పౌరులు రెండు లక్షలకుపైగా హాజరయ్యారు. పది లక్షలకు మించి ముస్లింలు ఈజిప్టు నుంచి వచ్చినట్టు ప్రభుత్వం వెల్లడించింది.అయితే, ఈ ఏడాది అధికార వేడి కారణంగా ఉక్కుపోతతో యాత్రికులు ఇబ్బందిపడ్డారు. చాలా మంది ఎండలో కాలినడకన యాత్రకు రావడంతో వారి ఆరోగ్యం క్షీణించింది. వందలాది మంది క్యూ లైన్లలో నిల్చోవడం జరిగింది. ఈ కారణంగా ఉక్కుపోతలో ఊపిరి ఆడక వారంతా చనిపోయినట్టు ప్రభుత్వం పేర్కొంది. అలాగే, చనిపోయిన వారిలో 83 శాతం మంది అనధికారికంగా హజ్ చేయడానికి వచ్చినట్టు ప్రభుత్వం తెలిపింది. ఇక, మరణాలు సంభవించిన రోజున రికార్డు స్థాయిలో 125 డిగ్రీల (ఫారెన్‌హీట్) నమోదు అయినట్టు అధికారులు చెప్పారు. Almost two millions of pilgrims has performed the Hajj easily and safely, with all needed services, the numbers of deaths are 1301 and 83% of them has no permit and tried to came to #Mecca through mountains with no shelter and with high temperatures #Hajj pic.twitter.com/QOt2Hytndt— Ahmmed (@Ahmeeed_839) June 24, 2024 మరోవైపు.. హజ్ యాత్రలో 98 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు విదేశీ మంత్రిత్వ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తంగా ఈ ఏడాది 1,75,000 మంది భారతీయులు హజ్ యాత్రకు వెళ్లినట్లు తెలిపింది. అనారోగ్యం, వృద్ధాప్యం వంటి సహజ కారణాల వల్లే వీరంతా మరణించారని వెల్లడించింది. అయితే గతంలో కన్నా ఈ ఏడాది మృతుల సంఖ్య తగ్గిందని, గత ఏడాది 187 మంది మరణించినట్టు పేర్కొంది.ఇదిలా ఉండగా.. సౌదీ అరేబియా హజ్ యాత్ర చరిత్రలో మరణాలు అసాధారణం ఏమీ కావు. కొన్ని సార్లు రెండు మిలియన్ మంది వరకు యాత్రలో పాల్గొనే సంఘటనలు ఉన్నాయి. 2015లో మీనాలో తొక్కిసలాటలో 2400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అదే సంవత్సరం మీనా వద్ద తొక్కిసలాటలో 111 మంది చనిపోయారు. 1990లో హజ్‌యాత్ర సందర్భంగా 1426 మంది చనిపోయారు. అయితే ఈసారి హీట్‌వేవ్‌తో అత్యధిక మంది ప్రాణాలు కోల్పోయారు. Akibat cuaca panas ekstrem di mekkah melebihi 50° , setidaknya lebih dari 550 jema'ah hajj meninggal dunia dan lebih 2.000 orang di rawat.Innalilahi wa innailaihi rooji'un.Meninggal diwaktu yang indah, ditempat yang indah dan sedang memakai pakaian terindah. pic.twitter.com/HgbcnUU8UM— Humairah (@Humairah_922) June 19, 2024


