
నగదు కొరతతో బాధపడుతున్న పాకిస్తాన్ (Pakistan) ఇతర దేశాలు, అంతర్జాతీయ సంస్థల సహాయంపై తీవ్రంగా ఆధారపడుతుంది. ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్, చైనా, అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) కీలక భూమిక వహిస్తున్నా, మరో ముస్లిం దేశమైన సౌదీ అరేబియా కూడా పాకిస్తాన్‌కు స్థిరమైన ఆర్థిక మద్దతును అందిస్తోంది.
తక్కువ వడ్డీకే రుణాలు
సౌదీ అరేబియా (Saudi Arabia) పాకిస్తాన్‌కు కేవలం 4 శాతం వడ్డీకే రుణాలు అందిస్తోంది. ఇది చైనా, ఇతర అంతర్జాతీయ రుణదాతలతో పోల్చితే చాలా తక్కువ. సౌదీ రుణాల వడ్డీ రేటు చైనాకు చెల్లించే నగదు డిపాజిట్ వడ్డీ కంటే మూడింట ఒక వంతు మాత్రమే. విదేశీ వాణిజ్య రుణాల ఖర్చుతో పోలిస్తే కూడా సౌదీ రుణ ఖర్చు సగం కంటే తక్కువ.
పాకిస్తాన్ రుణాలను సకాలంలో తిరిగి చెల్లించకపోయినా, సౌదీ అరేబియా అదనపు రుసుములు లేకుండా ప్రతి సంవత్సరం రుణ గడువును పొడిగిస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్‌కు సౌదీ అరేబియా ఇచ్చిన 2 బిలియన్ డాలర్ల రుణం గడువు డిసెంబర్‌లో ముగియనుంది. అయితే సౌదీ ఆర్థిక మంత్రిత్వ శాఖ దీన్ని మళ్లీ పొడిగించాలనే యోచనలో ఉంది.
ఐఎంఎఫ్ ప్రోగ్రాం కింద పాకిస్తాన్‌కు సౌదీ అరేబియా ఇచ్చిన మరో 3 బిలియన్ డాలర్ల రుణానికి వచ్చే ఏడాది జూన్లో గడువు ముగుస్తుంది. పాకిస్తాన్ తన బాహ్య ఆర్థిక లోటును పూడ్చుకోవడానికి ఈ రుణాన్ని తీసుకుంది.
ఇదీ చదవండి: అమెరికా పెంచితే మేం రద్దు చేస్తాం..!