సౌత్ కొరియా కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్.. జూలై 2025లో తన మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ వెహికల్ 'కారెన్స్ క్లావిస్' ఆవిష్కరించింది. దీనిని కియా సీనియర్ అధికారులు.. ఇటీవల కేంద్ర నూతన & పునరుత్పాదక ఇంధన, వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషికి న్యూఢిల్లీలోని ఆయన నివాసంలో చూపించారు. అంతకుముందు ఈ కారును కేంద్ర భారీ పరిశ్రమలు మరియు ఉక్కు మంత్రి హెచ్డీ కుమారస్వామికి పరిచయం చేశారు.
కారెన్స్ క్లావిస్ EV భారతదేశంలో తయారైన.. ఏడు సీట్ల ఎలక్ట్రిక్ కారు. దీని ధర రూ.17.99 లక్షల నుంచి రూ.24.49 లక్షల మధ్య ఉంటుంది. డిజైన్ పరంగా, ఇది కారెన్స్ క్లావిస్ మాదిరిగా కనిపిస్తుంది.
క్లావిస్ EVలో బ్లాంక్ ఆఫ్ గ్రిల్ కనిపిస్తుంది. త్రిభుజాకార LED హెడ్‌లైట్లు, కోణీయ LED DRLలు ఉన్నాయి. మౌంటెడ్ ఫాగ్ లైట్లు, ఇంటిగ్రేటెడ్ స్కిడ్ ప్లేట్, ముందు భాగంలో యాక్టివ్ ఎయిర్ ఫ్లాప్‌లతో కూడా వస్తుంది. సైడ్ ప్రొఫైల్‌లో.. కియా కారెన్స్ క్లావిస్ ఈవీ 17 అంగుళాల డ్యూయల్-టోన్ ఏరో-ఎఫిషియన్సీ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. వెనుక కనెక్టింగ్ లైట్ బార్‌తో LED టెయిల్‌లైట్‌లను పొందుతుంది.
ఇదీ చదవండి: పెట్రోల్, సీఎన్‌జీ వాహనాలకు గ్రీన్ సెస్?: ధరలు పెరిగే ఛాన్స్
కియా కారెన్స్ క్లావిస్ ఈవీ.. రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలను పొందుతుంది. అవి 42 kWh బ్యాటరీ (404 కి.మీ రేంజ్) & 51.4 kWh బ్యాటరీ (490 కిమీ రేంజ్) ఉన్నాయి. ఇందులోని మోటారు 255 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది HTK+, HTX, HTX ER, HTX + ER అనే నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది.


