ఈవీలపై గుడ్‌ న్యూస్‌.. తగ్గనున్న ధరలు | EVs to Become More Affordable After Budget Announcement | Sakshi
Sakshi News home page

ఈవీలపై గుడ్‌ న్యూస్‌.. తగ్గనున్న ధరలు

Feb 1 2026 1:48 PM | Updated on Feb 1 2026 2:45 PM

EVs to Become More Affordable After Budget Announcement

ఈవీలు కొనుగోలు చేసేవారికి శుభవార్త.. కేంద్ర ప్రభుత్వం విద్యుత్తు వాహనాల ధరలు తగ్గే చర్యలు తీసుకుంది. కేంద్ర బడ్జెట్‌ 2026-27లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  లిథియం-అయాన్ బ్యాటరీ తయారీ భాగాలపై ఉన్న కస్టమ్స్ (Basic Customs Duty) సుంకాన్ని మినహాయించాలని ప్రతిపాదించారు.

ప్రభుత్వాలు గత కొన్ని సంవత్సరాలుగా లిథియం-అయాన్ సెల్ తయారీకి మద్దతు ఇవ్వడానికి క్యాపిటల్ గూడ్స్, కొన్ని విడి భాగాలపై కస్టమ్స్ డ్యూటీని సున్నాకి తేవడానికి లక్షణాత్మక నిర్ణయాలు తీసుకుంటూ వచ్చాయి.

ప్రస్తుతం కస్టమ్స్ డ్యూటీ పరిస్థితి
ప్రస్తుతం 35 రకాల క్యాపిటల్ గూడ్స్ (ఈవీ బ్యాటరీ తయారీకి అవసరమైన మెషినరీ/భాగాలు) పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ఉంది. గత బడ్జెట్‌లోనే (2025-26) ప్రభుత్వం దీన్ని గణనీయంగా తగ్గించింది. ఇప్పుడు తాజా బడ్జెట్‌ 2026-27లో లిథియం-అయాన్ బ్యాటరీ తయారీ భాగాలపై ఉన్న కస్టమ్స్ సుంకాన్ని పూర్తిగా మినహాయించాలని ప్రతిపాదించారు.

తగ్గనున్న ఈవీల ధరలు
ఈవీల ధరలో అధిక మొత్తం (సుమారు 40-50%) బ్యాటరీలకే ఉంటుంది.  కస్టమ్స్ డ్యూటీ తగ్గితే, బ్యాటరీ తయారీకి ఉపయోగించే ముఖ్యమైన భాగాలు, మెషినరీ దిగుమతులు చౌకగా అవుతాయి. దీంతో దానికి సంబందించిన ఖర్చు నాటకంగా తగ్గి ఈవీలు, బ్యాటరీల ధరలో కూడా తగ్గుదలకు దారితీస్తుంది. అంతిమంగా ఈవీల ధరలు సుమారు 10-15% వరకు తగ్గొచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement