ఎన్‌పీసీఐ భారత్‌ కనెక్ట్‌తో ఎన్‌టీటీ డేటా జట్టు | NTT Data teams up with NPCI Bharat Connect | Sakshi
Sakshi News home page

ఎన్‌పీసీఐ భారత్‌ కనెక్ట్‌తో ఎన్‌టీటీ డేటా జట్టు

Feb 13 2026 7:32 PM | Updated on Feb 13 2026 7:40 PM

NTT Data teams up with NPCI Bharat Connect

ఎన్‌పీసీఐ భారత్‌ కనెక్ట్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఎన్‌టీటీ డేటా బిజినెస్‌ సొల్యూషన్స్‌ వెల్లడించింది. హైదరాబాద్‌లో నిర్వహించిన ట్రాన్స్‌ఫర్మేషన్‌ నౌ వార్షిక కార్యక్రమం సందర్భంగా ఇందుకు సంబంధించిన ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది.

సంక్లిష్టమైన వ్యవస్థల కారణంగా మధ్య, భారీ స్థాయి కంపెనీలు బీ2బీ చెల్లింపుల విషయంలో పలు సవాళ్లు ఎదుర్కొంటాయని ఎన్‌టీటీ డేటా బిజినెస్‌ సొల్యూషన్స్‌ ఎండీ కృణాల్‌ పటేల్‌ తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఎస్‌ఏపీ సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించే సంస్థల మధ్య బీ2బీ చెల్లింపులను సరళతరం చేసేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.

ట్రాన్స్‌ఫర్మేషన్‌ నౌ కార్యక్రమంలో 1,500 మంది పైగా సీఎక్స్‌వోలు, పరిశ్రమ దిగ్గజాలు పాల్గొన్నారు. డేటా సార్వ¿ౌమత్వం, బాధ్యతాయుతంగా కృత్రిమ మేథను వినియోగించడం తదితర అంశాలపై చర్చించారు. ఆటోమోటివ్, కెమికల్స్, తయారీ తదితర రంగాల్లో ఎస్‌ఏపీ ఆధారిత వ్యూహాల అమలు తీరుతెన్నులను ఈ సందర్భంగా ప్రదర్శించారు. ఎన్‌టీటీ డేటా బిజినెస్‌ సొల్యూషన్స్‌ గ్లోబల్‌ సీఈవో నార్బర్ట్‌ రోటర్‌తో పాటు ఎన్‌పీసీఐ భారత్‌ కనెక్ట్‌ అధికారులు ఇందులో పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement