శబరిమల స్వామి అయ్యప్ప దేవాలయం ఈ ఏడాది మండల-మకరవిళక్కు సీజన్ కోసం నవంబర్ 16 సాయంత్రం తలుపులు తెరిచింది. 41 రోజుల మండల పూజ కాలం పూర్తయినందున నవంబర్ 16 నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. డిసెంబర్ 27 సాయంత్రం ఆలయం మూసివేయబడింది. తిరిగి డిసెంబర్ 30న మకర ఉత్సవాల కోసం తెరిచింది దేవస్వం బోర్డు.
రికార్డ్ బ్రేకింగ్ రెవెన్యూ
దేవస్వం బోర్డు గత రికార్డులన్నింటినీ అధిగమించి ఆలయ ఆదాయంలో చారిత్రాత్మక పెరుగుదలను ప్రకటించింది. తాజా గణాంక నివేదిక ప్రకారం:
మొత్తం ఆదాయం: గత 41 రోజుల్లోనే, ఆలయం రూ. 332.77 కోట్లు వసూలు చేసింది.
అరవణ పాయసం అమ్మకాలు రూ. 142 కోట్లు, అప్పం అమ్మకాల ద్వారా రూ. 12 కోట్లు వచ్చాయి.
హుండీ (ఉడియల్) మొత్తం రూ. 83.17 కోట్లు.
గతేడాది మండల పూజ ఆదాయం రూ. 297.06 కోట్లతో పోలిస్తే, ఈ సీజన్‌లో ఆలయం రూ. 35.70 కోట్ల ఆకట్టుకునే పెరుగుదలను చూసింది.
రికార్డు స్థాయి దర్శనాలు..
ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా 30,91,183 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
స్పాట్ బుకింగ్ ద్వారా 4,12,075 మంది వచ్చారు.
పుల్మేడు అటవీ మార్గం ద్వారా 1,29,933 మంది భక్తులు శబరిమలకు చేరుకున్నారు.
గతేడాది మండల సీజన్‌లో 32,49,756 మంది భక్తులు సందర్శించగా, ఈసారి ఆ సంఖ్య గణనీయంగా పెరిగింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అదనంగా 3,83,435 మంది భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం విశేషం.
(చదవండి: శబరిమల యోగా దండం, జప మాల మరమ్మత్తు పనుల కేసుపై సిట్ దర్యాప్తు ముమ్మరం)


