ఉదయం 6 గంటల నుంచే మద్యం అమ్మకాలు | liquor sales from 6am on december 31 | Sakshi
Sakshi News home page

ఉదయం 6 గంటల నుంచే మద్యం అమ్మకాలు

Dec 29 2025 11:42 AM | Updated on Dec 29 2025 12:00 PM

liquor sales from 6am on december 31

బెంగళూరు:  మద్యం ప్రియులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. డిసెంబర్‌ 31న (బుధవారం) ఉదయం 6 నుంచి అర్ధరాత్రి ఒక గంట వరకు మద్యం విక్రయాలకు అవకాశం కల్పించారు. ఈ నిబంధన ఒక రోజు మాత్రమే అమలులో ఉంటుది. మిగతా రోజుల్లో గతంలో ఉన్న నిబంధనలే అమలులో ఉంటాయి. కొత్త సంవత్సర సంబరాల కోసం ఈ వెసులుబాటు కలి్పంచారు. అన్ని బార్‌లు, పబ్‌లు, వైన్‌షాప్‌లు, ఇతర మద్యం విక్రయ కేంద్రాలకు ఈ నిబంధన వర్తిస్తుంది.

 ప్రైవేట్‌ పారీ్టలు, ప్రత్యేక కార్యక్రమాలు, తాత్కాలిక మద్యం పంపిణీకి వినియోగించే సీఎల్‌–5 లైసెన్స్‌ కలిగినవారికి కూడా ఇదే నిబంధన వర్తిస్తుది. సాధారణంగా సీఎల్‌–5 లైసెన్స్‌ ఉంటే 24 గంటల వరకు మద్యం పార్టీ జరుపవచ్చనే అభిప్రాయముంది. అయితే కొత్త సంవత్సరం రోజున అవాంఛనీయ ఘటనలు జరిగేందుకు ఆస్కారం లేకుండా సమయ పరిమితి విధించారు. సీఎల్‌–5 లైసెన్స్‌ కలిగిన ప్రైవేట్‌ పారీ్టలు కూడా అర్ధరాత్రి 1 గంటలోగా కార్యకలాపాలు ముగించాలి. ఆ తర్వాత మద్యం   విక్రయాలు జరిగితే లైసెన్స్‌ రద్దుతో పాటుగా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.    

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement