ఫిట్‌నెస్‌కి ఎంత ప్రాధాన్యత ఇస్తుంది టాలీవుడ్ హీరోహియిన్ సమీరా రెడ్డి ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫిట్‌నెస్ టిప్స్ షేర్ చేసుకుంటుంటారు. హెల్దీగా ఉండే రెసిపీలు, బరువు తగ్గించే వర్కౌట్లను తన అభిమానులతో షేర్ చేసుకుంటుంటారామె. ఈసారి అలానే ఆరోగ్యకరమైన రెసిపీతో ముందుకొచ్చారు. తాను చేసే రెసిపి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో వివరిస్తూ..ఆ కర్రీ తయార చేసే విధానాన్ని తెలియజేశారామె. ఇంతకీ ఏంటా హెల్దీ రెసిపీ అంటే..
సమీరా రెడ్డి కడుపుకి మేలు చేసే అరటికాండం పప్పు కూర తయారీ విధానాన్ని పంచుకున్నారు. అందుకోసం ఏమేమి పదార్థాలు కావాలంటే..
అరటి కాండం-1(శుభ్రం చేసి, సన్నగా తరిగి నానబెట్టింది)
కంది పప్పు లేదా పెసర పప్పు: ¼ కప్పు
కరివేపాకు 1
పసుపు టీ స్పూన్
ఆవాలు టీ స్పూన్
తాజా కొబ్బరి పేస్ట్-1
కాశ్మీరీ మిరపకాయ-1
జీలకర్ర- 1 టీస్పూన్
ఉప్పు రుచికి సరిపడా
తయారీ విధానం: ముందుగా అరటికాండం, పప్పు, పసుపు, ఉప్పు వేసి ప్రెషర్ కుక్కర్‌లో ఉడికించాలి. మొత్తం 6 విజల్స్ వచ్చాక కొబ్బరి పచ్చిమిర్చి,జీలకర్ర కలిపిని పేస్ట్‌ని వేసుకోవాలి. ఆ తర్వాత నెయ్యి వేడి చేసి అందులో ఆవాలు, కాశ్మీరీ మిరపకాయ, కరివేపాకు వేసి తాలింపు పెట్టాలి. ఈ కర్రీ ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్పుకొచ్చారు. అంతేగాదు దీన్నితినడం వల్ల కలిగే లాభాలు కూడా వివరించారు.
అవేంటంటే..
ఇందులో ఫైబర్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి.
అలసటను తగ్గించడంలో హెల్ప్ అవుతుంది
హార్మోన్ల సమతుల్యతకు మద్దతిస్తుంది
ప్రేగు ఆరోగ్యం, డిటాక్స్ కోసం అద్భుతమైనది
కడుపు ఉబ్బరం, నీరు నిలుపుదలని తగ్గించడంలో సహాయపడుతుంది
బరువు నిర్వహణకు సహాయపడుతుంది
రుతుక్రమ ఆరోగ్యానికి మంచిది
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది
జీర్ణక్రియను మెరుగ్గా ఉంచుతుంది.
అలాగే పోస్ట్ చివరలో సమీరా ఉడికించిన తర్వాత ఆ అరటికాండం పోగులను తీసివేయాలని, అవి తినకూడదని, జీర్ణం అవ్వడానికి కష్టంగా ఉంటుందని హెచ్చిరించారు. అలాగే ఇలాగే ఇలా తొలగించడం వల్ల కూర మృదువుగా, మెత్తగా ఉండి సులభంగా తినేయగలుగుతామని కూడా అన్నారామె. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.


