
ఢిల్లీ: జమ్ము కశ్మీర్ మాజీ సీఎం, డెమోక్రటిక్ ప్రోగ్రసీవ్ ఆజాద్ పార్టీ చీఫ్, మాజీ ఎంపీ గులాం నబీ ఆజాద్ అస్వస్థతకు గురయ్యారు. ఎంపీ బృందంతో సౌదీ పర్యటనలో ఉన్న ఆజాద్ అస్వస్థతకు గురి కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు బీజేపీ ఎంపీ జయంత్ పాండా వెల్లడించారు.
వివరాల ప్రకారం.. ఉగ్రవాదంతో అంటకాగుతూ మన దేశంపై విషం చిమ్ముతున్న పాకిస్తాన్‌ను ఎండగట్టేందుకు వివిధ పార్టీల ఎంపీల నాయకత్వంలోని బృందాలు ప్రపంచదేశాలకు వెళ్లాయి. బీజేపీ నేత బైజయంతి పాండా నేతృత్వంలోని బృందం బహ్రెయిన్‌లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా బృంద సభ్యుల్లో గులాం నబీ ఆజాద్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో సౌదీలో పర్యటిస్తున్న సందర్బంగా ఆజాద్ అస్వస్థతకు గురయ్యారు.
అనంతరం, ఆజాద్‌కు రియాజ్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు బీజేపీ ఎంపీ బైజయంతి పాండా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ క్రమంలో ఆజాద్ ఆరోగ్యం.. ఇప్పుడు స్థిరంగా ఉంది. ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. కొన్ని టెస్టులు చేయాల్సి ఉంది. సౌదీ పర్యటనలో ఉండగా ఆయన అనారోగ్యనికి గురి కావడం మమ్మల్ని తీవ్రంగా కలిచివేసింది. ఆయన సహాకారంతో ఇప్పటి వరకు బహ్రెయిన్, కువైట్‌లలో జరిగిన పర్యటనలు పూర్తిగా ఫలవంతమయ్యాయి. అల్జీరియా పర్యటనలో ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది’ అని చెప్పుకొచ్చారు.
Halfway into our delegation's tour Ghulam Nabi azad has had to be admitted to hospital.His contributions to the met
in Bahrain.Kuwait were highly impactful.he is disappointed at being bedridden.We will deeply miss his presence in Saudi Arabia,Algeria BJP MP Jay Panda @asadowaisi pic.twitter.com/YMDD4Qruch— Mohd Ateeq (@MohdAte48016039) May 27, 2025