ద్వైపాక్షిక సంబంధాల్లో మెరుగుదల: చైనాలో జైశంకర్‌ | Jaishankar Meets Chinese Vice President | Sakshi
Sakshi News home page

ద్వైపాక్షిక సంబంధాల్లో మెరుగుదల: చైనాలో జైశంకర్‌

Jul 14 2025 10:45 AM | Updated on Jul 14 2025 11:18 AM

Jaishankar Meets Chinese Vice President

బీజింగ్: భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్  తాజాగా చైనా రాజధాని బీజింగ్‌లో చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్‌ను కలుసుకున్నారు. తన పర్యటన నేపధ్యంలో ఇరు దేశాల మధ్య సానుకూల చర్చలు జరుగుతాయని  ఆశాభావం వ్యక్తం చేశారు. చైనా షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో)అధ్యక్ష పదవికి భారతదేశం మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.

జైశంకర్ తన ‘ఎక్స్‌’ పోస్టులో తాను బీజింగ్ కు  చేరుకున్నాక ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్‌ను కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. చైనా ఎస్‌సీఓ అధ్యక్ష పదవికి భారతదేశం మద్దతు ఇస్తున్నట్లు తెలియజేశానని పేర్కొన్నారు. ఇరు ద్వైపాక్షిక సంబంధాలలో మెరుగుదల గమనించానని, తన పర్యటనలో జరిగే చర్చలు సానుకూల పథాన్ని కొనసాగిస్తాయని నమ్ముతున్నానని అన్నారు.
 

గతంలో కజాన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ- చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ మధ్య జరిగిన సమావేశం  అనంతరం రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయని జైశంకర్‌ పేర్కొన్నారు. భారత్‌- చైనా దౌత్య సంబంధాలు 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాయన్నారు. కైలాశ్‌ మానసరోవర్ యాత్ర పునఃప్రారంభాన్ని చాలామంది ప్రశంసిస్తున్నారని అన్నారు. ప్రపంచ ప్రధాన ఆర్థిక వ్యవస్థలుగా ఉన్న భారత్‌, చైనాల మధ్య అభిప్రాయాలు, దృక్పథాల బహిరంగ మార్పిడి చాలా ముఖ్యమని అంటూనే, తన. పర్యటన  అలాంటి చర్చలకు దారితీస్తుందని భావిస్తున్నానని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement