వీబీజీ రామ్‌జీ జాబితాలో ఇందిరమ్మ ఇండ్లు?.. రేవంత్ విజ్ఞప్తి | CM Revanth Reddy met Union Minister Shivraj Singh | Sakshi
Sakshi News home page

వీబీజీ రామ్‌జీ జాబితాలో ఇందిరమ్మ ఇండ్లు?.. రేవంత్ విజ్ఞప్తి

Jul 28 2026 3:47 PM | Updated on Jul 28 2026 3:53 PM

CM Revanth Reddy met Union Minister Shivraj Singh

సాక్షి, ఢిల్లీ: ప్రధాన్ మంత్రి ఆవాస్‌ యోజన్ 2.0 కింద  తెలంగాణకు 11.56 ల‌క్ష‌ల ఇండ్లు కేటాయించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి శివరాజ్‌ సింగ్ చౌహన్‌ను కోరారు. ఈ రోజు( మంగళవారం) ఢిల్లీలో శివరాజ్‌సింగ్‌తో ఆయన భేటీ అయ్యారు. గత  ప్ర‌భుత్వ హ‌యాంలో తెలంగాణలో గ్రామీణ ఇళ్ల నిర్మాణం నిర్ల‌క్ష్యం చేశార‌ని ఎల్‌నినో నేప‌థ్యంలో వీబీ-జీ రామ్-జీలో అదనపు పనులు చేర్చాలని కేంద్ర మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌కు విజ్ఞప్తి చేశారు.

కేంద్రం నూతనంగా తీసుకవచ్చిన  వీబీ-జీ రామ్-జీలో బిల్లులో రైతుల జీవనోపాధి  మరింత మెరుగయ్యేలా మరో  10 కొత్త పనులను చేర్చాలని ఈ సందర్బంగా కేంద్రమంత్రికి సూచించారు. కూరగాయల పందిళ్లు, పశుగ్రాస ప్లాట్లు, మల్బరీ తోటలు, పట్టు పురుగుల పెంపక షెడ్లకు,రైతుల భూముల అభివృద్ధి, నీటి సంరక్షణ, ప్ర‌కృతి వైపరీత్యాల‌తో దెబ్బ‌తిన్న భూముల పునరుద్ధరణ అనుమతి కోరారు. 
 

అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పనులను వీబీ-జీ రామ్-జీ జాబితాలో చేర్చి ల‌బ్ధిదారుల‌కు 90 రోజులు ప‌ని క‌ల్పించాల‌ని కేంద్ర మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement