క్షణాల్లో కొట్టుకుపోయిన భారీ వంతెన.. వీడియో వైరల్‌ | Uttarakhand Heavy Rainfall Updates, Bridge Swept Away In Seconds Due To Strong Currents, Shocking Video Goes Viral | Sakshi
Sakshi News home page

క్షణాల్లో కొట్టుకుపోయిన భారీ వంతెన.. వీడియో వైరల్‌

Aug 11 2026 8:46 AM | Updated on Aug 11 2026 10:32 AM

Uttarakhand Bridge Swept Away In Seconds Due To Strong Currents

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా వర్షాలు ముంచెత్తుతున్నాయి. నదుల నీటి మట్టం పెరగడంతో అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. నీతి లోయలో నీటి మట్టం ఒక్కసారిగా పెరగడంతో వంతెన కొట్టుకుపోయింది. దీంతో ఆ ప్రాంతానికి ప్రధాన పట్టణంతో సంబంధాలు తెగిపోయాయి. చమోలి జిల్లా పరిధిలోని ఈ ప్రాంతంలో ఉప్పొంగుతున్న నీటి ఉధృతికి సెకన్ల వ్యవధిలో కొట్టుకుపోయిన వంతెన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

వంతెన చుట్టూ నీటి ప్రవాహం అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. కొద్దిసేపటికే బురదతో కూడిన భారీ నీటి ప్రవాహం దిగువకు దూసుకువచ్చి వంతెనను బలంగా ఢీకొట్టింది. ఆ నీటి తీవ్రతను తట్టుకోలేక వంతెన నిర్మాణం పక్కకు ఒరిగి, నది ఒడ్డు వైపునకు కూలిపోయింది. నది పక్కనే ఉన్న రోడ్డుపై వెళ్తున్న ట్రక్కు, ఎస్‌యూవీ (SUV) వాహనాలు కూడా అదే వీడియోలో కనిపించాయి. ఆ రెండు వాహనాలను వెనక్కి మళ్లించి పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాయి. లోయలోని నదులు, వాగుల పరిసర ప్రాంతాలలో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement