సాక్షి, విశాఖపట్నం: రానున్న మూడు గంటల్లో శ్రీకాకుళం జిల్లాలో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇవాళ(గురువారం) రాత్రి మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి జిల్లాల్లో ఒకటి, రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
విశాఖలో వాతావరణం ఒక్కసారిగా మారింది. పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వేడి, ఉక్క పోత వాతావరణంతో అల్లాడుతున్న జనానికి ఉపశమనం కలిగింది. ఎంవిపీ, ఆరిలోవ, ఎండాడ, సాగర్ నగర్ సహా పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది.


