సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో జేసీ వర్గీయులు గూండాగిరి ప్రదర్శించారు. వైఎస్సార్‌సీపీ నేత హరినాథ్‌రెడ్డిపై టీడీపీ గూండాలు దాడికి దిగారు. ముసుగులు ధరించి టీడీపీ నేతలు దాడి చేశారు. తాడిపత్రి పట్టణంలోని కొత్త కూరగాయల మార్కెట్ వద్ద ఘటన జరిగింది. వైఎస్సార్‌సీపీ నేత హరినాథ్ రెడ్డి ఇంటికి వెళ్తుండగా టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులు దాడి చేశారు. గాయపడిన హరినాథ్‌రెడ్డిని ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: నెల్లూరు మేయర్ సీటు.. టీడీపీలో కుర్చీ కుంపటి!


