breaking news
tadipatri
-
జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరికల వెనుక అర్థం ఏంటి..?
-
రేయ్ JC... నా జోలికి రాకు! ఈసారి మాటలతో చెప్పను...
-
జేసీ ప్రభాకర్ రెడ్డికి మతిభ్రమించింది.. పెద్దారెడ్డి కౌంటర్
సాక్షి, అనంతపురం: తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి మతిభ్రమించింది.. పిచ్చాసుపత్రికి తరలించాలని ఎద్దేవా చేశారు. దాడులు, దౌర్జన్యాలు చేయడమే లక్ష్యంగా ప్రభాకర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. తాము ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదు అంటూ మండిపడ్డారు.తాడిపత్రి వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మాటలు తగ్గించుకుంటే మంచిది. దాడులు, దౌర్జన్యాలు చేయడమే లక్ష్యంగా జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. నాకు మద్దతు ప్రకటించిన మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎంపీ తలారి రంగయ్యలను వ్యక్తిగతంగా దూషించడం సరికాదు. తాడిపత్రి నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలన్నదే మా ఉద్దేశం. మేము ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదు. నాతో సహా తాడిపత్రి వైఎస్సార్సీపీ నేతలు కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారుటీడీపీ నేతలు దాడి చేస్తే.. వైఎస్సార్సీపీ నేతలపై కౌంటర్ కేసులు దుర్మార్గం. తాడిపత్రి ఏఎస్పీగా ఐపీఎస్ ఉన్నా లా అండ్ ఆర్డర్ సమస్య ఎందుకు వస్తోంది?. జేసీ ప్రభాకర్ రెడ్డి వైఖరిని టీడీపీ ప్రజాప్రతినిధులే వ్యతిరేకిస్తున్నారు. జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ వ్యవహారాలు చేసింది జేసీ ప్రభాకర్ రెడ్డి. జేసీ ట్రావెల్స్ బస్సులకు నకిలీ రిజిస్ట్రేషన్లు చేసినందుకే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి. ప్రభాకర్ రెడ్డికి పోలీసులంటే గౌరవం లేదు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి హబ్‌గా తాడిపత్రి మారిపోయింది. టీడీపీ నేతల అసాంఘిక కార్యకలాపాలకు తాడిపత్రి పోలీసులు సహకరించటం దుర్మార్గం. ప్రభాకర్ రెడ్డికి మతిభ్రమించింది. 24 మంది వైఎస్సార్సీపీ నేతల అంతు చూస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరిస్తున్నారు. గొడవలు సృష్టించటమే ప్రభాకర్ రెడ్డి లక్ష్యమా?. తన కొడుకు టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డిని కూడా ఆయన చెడగొడుతున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రజాస్వామ్య బద్ధంగా రాజకీయాలు చేయండి.. లేదంటే శాంతియుతంగా పోరాటాలు కొనసాగిస్తాం’ అని హెచ్చరించారు. -
కేతిరెడ్డిని లాక్కెళ్లిన పోలీసులు
-
తాడిపత్రిలో టెన్షన్.. టెన్షన్
-
అదిగో డ్రోన్.. జేసీకి నేనంటే ఎంత భయమో చూడండి..
-
తాడిపత్రి కేశవ రెడ్డిని పరామర్శించిన వైఎస్ జగన్
-
ముళ్లకంచెలతో తాడిపత్రి నిర్బంధం..
-
‘తాడిపత్రి వెళ్లాలంటే వీసా కావాలా?’
తాడిపత్రి అప్డేట్స్..మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి కామెంట్స్..తాడిపత్రి వెళ్లాలంటే వీసా కావాలా?పోలీసులు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తొత్తులుగా వ్యవహరించటం దుర్మార్గంతాడిపత్రి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులు కనిపించవా?అనంతపురం పోలీసులకు హైకోర్టు ఆదేశాల కన్నా.. జేసీ ఆదేశాలే ముఖ్యమా?జేసీ ప్రభాకర్ రెడ్డి హింసా రాజకీయాలను ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కొంటాం. మాజీ ఎంపీలు తలారి రంగయ్య, మాధవ్ అరెస్ట్..తాడిపత్రిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు.మాజీ ఎంపీలు తలారి రంగయ్య, మాధవ్ అరెస్ట్.తాడిపత్రి వెళ్తున్న రంగయ్య, మాధవ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.తాడిపత్రి వెళ్లకుండా వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు.మహిళా కార్యకర్తలపై పోలీసుల దౌర్జన్యం.మహిళా కార్యకర్తలను లాగిపడేసిన పోలీసులు.పోలీసుల తీరుపై పార్టీ నేతల ఆగ్రహం. తాడిపత్రిలో హైటెన్షన్పెద్దారెడ్డి అరెస్ట్‌ను అడ్డుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలుఇంటి లోపల నిరసన తెలుపుతున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద భారీ ఎత్తున పోలీసుల మోహరింపురోడ్డుపై బైఠాయించిన మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డితాడిపత్రి బయలుదేరిన అనంత వెంకటరామిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి లను అడ్డుకున్న పోలీసులుభారీగా స్తంభించిన ట్రాఫిక్బారికేడ్లను అడ్డుగా పెట్టి వైఎస్సార్సీపీ నేతలు కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు వైఎస్సార్సీపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత..తాడిపత్రి బయలుదేరిన మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, విశ్వేశ్వర రెడ్డిలను అడ్డుకున్న పోలీసులుపోలీసులతో అనంత, విశ్వ వాగ్వాదంపోలీసులు, వైఎస్సార్సీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాటకేతిరెడ్డి పెద్దారెడ్డి కామెంట్స్తాడిపత్రిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అంటూ వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతల నినాదాలుకేతిరెడ్డి పెద్దారెడ్డి కామెంట్స్తాడిపత్రి నియోజకవర్గంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందివైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రక్తంతో రెడ్‌బుక్ తడిచి పోయిందితాడిపత్రిలో పోలీసులు ఉన్నా ప్రయోజనం లేదుపోలీసులు కళ్ల ముందే పార్టీ నాయకుడు శివ కేశవ రెడ్డిపై దాడి చేశారుపోలీసులపై దాడి చేసినా దిక్కు లేదు..పోలీసులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిపెద్దారెడ్డి ఇంటిబయట ఉద్రిక్తతతాడిపత్రి భగత్ సింగ్ నగర్ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిబయట ఉద్రిక్తతతాడిపత్రిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ గాంధీ విగ్రహం వద్ద సామూహిక నిరసనకు పిలుపు ఇచ్చిన పెద్దారెడ్డిఇంటి బయట అడ్డుకున్న పోలీసులు, రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న పెద్దారెడ్డి 👉అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి హింసాత్మక రాజకీయాలను నిరసిస్తూ గాంధీ విగ్రహం వద్ద సామూహిక నిరాహార దీక్షకు వైఎస్సార్సీపీ పిలుపునివ్వడంతో పట్టణంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయగా.. పార్టీ కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు.👉దీంతో, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన ఇంటి బయట రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. తాడిపత్రిలో ప్రజాస్వామ్యం కాపాడాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్బంగా పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తాడిపత్రిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. పోలీసుల కనుసన్నల్లో మట్కా, గంజాయి సాగు చేస్తున్నారు. రాష్ట్రంలో లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది. ఉదయం నుంచి మా నెత్తిమీద డ్రోన్లు ఎగురవేస్తున్నారు. పోలీసులే రౌడీలుగా వ్యవహరిస్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి తొత్తులుగా పోలీసులు మారారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 👉మరోవైపు.. పెద్దారెడ్డి ఇంటికి భారీ ఎత్తున వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు చేరుకుంటున్నారు. అయితే, పెద్దారెడ్డి ఇంటికి వెళ్లకుండా నాలుగు వైపుల పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. తాడిపత్రికి వచ్చే అన్ని వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. భగత్ సింగ్ నగర్ వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. పోలీసులు.. భగత్ సింగ్ నగర్లో పార్టీ నాయకులు, కార్యకర్తలను అడ్డుకోవడంతో వారంతా నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డుపైనే టిఫిన్ తింటూ నిరసన తెలుపుతున్నారు. తాడిపత్రిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు చేస్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాలకు పోలీసులు సహకరిస్తున్నారని మండిపడతున్నారు. -
తాడిపత్రి లో హీటెక్కిన రాజకీయాలు
-
JC ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్ తాడిపత్రిలో YSRCP భారీ నిరసన
-
జేసీ అనుచరుల కంటే పోలీసులే నీచంగా ప్రవర్తిస్తున్నారు
-
జేసీ ఏది చెప్తే అదే చేస్తారా ? తాడిపత్రి పోలీసులపై అనంత వెంకటరామిరెడ్డి ఫైర్
-
కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో శాంతి భద్రతలను పోలీసులు గాలికొదిలేశారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేయాలంటే జేసీ ప్రభాకర్ రెడ్డి అనుమతి కావాలా? అని ప్రశ్నించారు. తాడిపత్రి పోలీసు అధికారులు ఖాకీ చొక్కా తీసేసి.. టీడీపీ కండువాలు వేసుకుంటే మంచిది అంటూ ఘాటు విమర్శలు చేశారు.మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి డైరెక్షన్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. విచ్చలవిడిగా గంజాయి, ఛైన్ స్నాచింగ్స్ కొనసాగుతున్నాయి. అయినప్పటికీ పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇచ్చే లంచాలకు పోలీసు అధికారులు అలవాటు పడ్డారు. అందుకే తాడిపత్రిలో శాంతి భద్రతలను పోలీసులు గాలికొదిలేశారు. పోలీసు అధికారులు జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగడాలను చూసిచూడనట్లు వదిలేస్తున్నారు.పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేయాలంటే జేసీ ప్రభాకర్ రెడ్డి అనుమతి కావాలా?. నేరాలకు పాల్పడటం. కౌంటర్ కేసులు పెట్టడం. జేసీ ప్రభాకర్ రెడ్డికి అలవాటుగా మారింది. తాడిపత్రి పోలీసు అధికారులు ఖాకీ చొక్కా తీసేసి.. టీడీపీ కండువాలు వేసుకుంటే మంచిది. జేసీ దౌర్జన్యాలను చట్టబద్ధంగా ఎదుర్కొంటాం. ఈనెల 26వ తేదీన జరిగే సామూహిక దీక్ష విజయవంతం చేయండి’ అని పిలుపునిచ్చారు. -
కేశవరెడ్డిని ఆస్పత్రిలోనే అంతమొందించే.. జేసీ వర్గం యత్నమా..?
-
నిజంగానే ఏదోకరోజు నీ బట్టలూడదీస్తారు? జేసీకి పెద్దారెడ్డి వార్నింగ్
-
తాడిపత్రి పీఎస్ వద్ద జేసీ ప్రభాకర్ రెడ్డి ఓవరాక్షన్
అనంతపురం: తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు. వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పై అక్రమ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ తాడిపత్రి పీఎస్ వద్ద స్నానం చేస్తూ హైడ్రామా నెలకొల్పారు. తాడిపత్రి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వేచ్ఛ గా పర్యటించవచ్చని హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ,.. ఆ ఆదేశాలు అమలు కాకుండా జేసీ ప్రభాకర్‌రెడ్డి కుట్రలకు తెరలేపారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దౌర్జన్యం చేశారని.. కేసులు నమోదు చేయాలని తాను అనుచరుల ద్వారా తప్పుడు ఫిర్యాదులు చేయించారు ప్రభాకర్‌రెడ్డి. ఆ ఫిర్యాదులు ఆధారంగా కేసులు నమోదు చేయాలని తాడిపత్రి పీఎస్ వద్ద ఓవకాక్షన్ చేశారు.. నడిరోడ్డుపై స్నానం చేసి పోలీసులపై ఆరోపణలు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఒత్తిడితో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పై కేసు నమోదు చేశారు పోలీసులు. -
రేయ్ జేసీ...? నువ్వు నన్ను ఆపగలనని అనుకుంటున్నావా..?!
-
మాజీ ఎమ్యెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్
-
తాడిపత్రిలో ఉద్రిక్తత.. కేతిరెడ్డి పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్
-
తాడిపత్రిలో ఉద్రిక్తత..
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తాడిపత్రి వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో నేడు చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం జరుగుతుండగా.. పెద్దారెడ్డికి పోటీగా టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పెద్దారెడ్డికి అనుమతి లేదంటూ ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది.వివరాల ప్రకారం.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి శుక్రవారం ఉదయం చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన ప్రదర్శనకు హాజరయ్యేందుకు బయలుదేరగా ఆయనను తాడిపత్రి పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం, ఆయన బయటకు వెళ్లేందుకు అనుమతి లేదంటూ హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసుల తీరుపై పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతో తనను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.అయితే, తాడిపత్రి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పర్యటనలకు ఇప్పటికే హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకోవడంపై పార్టీ నేతలు, స్థానికులు.. పోలీసులు తీరుపై మండిపడుతున్నారు. టీడీపీ నేతలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. -
తాడిపత్రిలో చట్టం టీడీపీ నేతల చుట్టమా?: కేతిరెడ్డి ఫైర్
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. తాడిపత్రి పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తాడిపత్రిలో చట్టం టీడీపీ నేతల చుట్టమా? అని కేతిరెడ్డి ప్రశ్నించారు. కూటమి సర్కార్ పాలనపై మండిపడ్డారు.తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో హత్యకు గురైన అబ్దుల్లా మృతదేహాన్ని పరిశీలించి.. కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పరామర్శించారు. అనంతరం, పెద్దారెడ్డి మాట్లాడుతూ..‘గడిచిన 24 గంటల వ్యవధిలో తాడిపత్రిలో ఇద్దరు హత్యకు గురయ్యారు. తాడిపత్రిలో శాంతి భద్రతల పరిరక్షణ పోలీసులకు పట్టదా?. తాడిపత్రిలో పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు. గంజాయి, మట్కా, పేకాట క్లబ్బులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను బైండోవర్ చేస్తున్నారు. బైండోవర్ ఉల్లంఘన పేరుతో అరెస్ట్ చేస్తున్నారు. తాడిపత్రిలో చట్టం టీడీపీ నేతల చుట్టమా?’ అని ప్రశ్నించారు. -
ప్రాణం తీసిన బైక్ కీస్.. తాడిపత్రిలో దారుణ హత్య.. మాటు వేసి కత్తులతో నరికేశారు
-
తాడిపత్రి బాలుడి హత్య కేసు.. నిందితుడిపై పోలీసుల కాల్పులు
-
పోలీసులపై రివర్స్ అటాక్.. నిందితుడిని కాల్చి పడేసిన పోలీసులు
-
తాడిపత్రిలో ఉద్రిక్తత.. పెద్దారెడ్డి ఇంటి చుట్టూ వందలాది పోలీసులు
-
తాడిపత్రిలో హైటెన్షన్.. భారీగా పోలీసుల మోహరింపు
-
జేసీ అరాచకం.. కేతిరెడ్డిపై దాడికి స్కెచ్
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అరాచకాలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై దాడి చేసేందుకు జేసీ, ఆయన అనుచరులు తాడిపత్రిలో పెద్ద స్కెచ్ వేశారు. తాడిపత్రిలో ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం పేక్షక పాత్ర పోషించడం గమనార్హం.తాడిపత్రి నియోజకవర్గంలో అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. అధికార కూటమికి సవాల్ విసిరారు. తాడిపత్రిలో 30 ఏళ్ల జేసీ పాలనకు, ఐదేళ్ల తన పాలనపై చర్చకు రెడీ అని చెప్పుకొచ్చారు. అయితే, కేతిరెడ్డి సవాల్‌కు జేసీ ప్రభాకర్ రెడ్డి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. కానీ, కేతిరెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు దిగారు. రేపు(శుక్రవారం) మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడి చేసేందుకు టీడీపీ నేతల జనసమీకరణ చేశారు.ఇందులో భాగంగా కేతిరెడ్డి పెద్దారెడ్డిపై దాడి చేసేందుకు స్కెచ్ రచిస్తున్నట్టు తెలిసింది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతో జేసీ వర్గీయులు ప్రత్యేక లారీల్లో రాళ్లు తీసుకొచ్చి.. కేతిరెడ్డి ఇంటి వద్ద పోశారు. దాడి చేసేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద కంకర రాళ్లు సిద్ధం చేసుకున్నారు. దీనిపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహించారు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. -
Kethireddy : జాతరకు కూడా వెళ్లకూడదా మీరేం పోలీసులు..
-
తాడిపత్రిలో టీడీపీకి బిగ్ షాక్
సాక్షి, అనంతపురం: కూటమి ప్రభుత్వానికి తాడిపత్రిలో ఊహించని షాక్ తగిలింది. తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు తిరుగుబాటు మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఓ టీడీపీ కార్యకర్త.. స్థానిక ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తాను టీడీపీకి ఓటు వేసి తప్పుచేశానంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ వీడియోను వీడియో చేశారు. దీంతో, సోషల్ మీడియాలో వీడియో చక్కర్లు కొడుతోంది.తాడిపత్రి నియోజకవర్గంలోని పెద్దవడగూరుకు చెందిన టీడీపీ కార్యకర్త విజయ్ కుమార్ రెడ్డి వీడియోలో మాట్లాడుతూ.. నేను టీడీపీకి ఓటు వేసి తప్పు చేశాను. టీడీపీ అధికారంలోకి వచ్చాక పెన్షన్ల విషయంలో ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి 18 మాసాలైనా నా తల్లికి పెన్షన్ మంజూరు చేయలేదు. ఎన్నికల సమయంలో టీడీపీ కోసం ఎంతో పనిచేశాం. నా సొంత డబ్బులను సైతం ఖర్చు పెట్టాను. టీడీపీని అధికారంలోకి తీసుకురావడానికి ఎంతో శ్రమించాం.కానీ, ఇప్పుడు కార్యకర్తలనే పార్టీ పెద్దలు పట్టించుకోవడం లేదు. తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి కార్యకర్తలను పట్టించుకోలేదు. మాకు అన్యాయం జరుగుతున్నా చూసిచూడని విధంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ కార్యకర్తలకు కూడా పథకాలు సరిగా అందడం లేదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
అస్మిత్ రెడ్డిపై టీడీపీ కార్యకర్త సంచలన వ్యాఖ్యలు
-
వామ్మో.. ఘాట్ రహదారి
తాడిపత్రి టౌన్: నియోజకవర్గంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఆలూరు కోన రంగనాథ స్వామి క్షేత్రానికి వెళ్లే ఘాట్ రహదారి ప్రమాదకరంగా మారింది. ఘాట్ రోడ్డుకు ఉన్న రక్షణ గోడ కొన్ని చోట్ల దెబ్బతినగా.. మరి కొన్ని చోట పూర్తిగా నేలవాలింది. యాత్రికులు, భక్తులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది. వాహనాల్లో ఘాట్ రోడ్డులో ప్రయాణించేందుకు జంకుతున్నారు. తాడిపత్రి పట్టణం నుంచి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలూరు కోన క్షేత్రం.. ప్రకృతి రమణీయతతో శోభాయమానంగా వెలుగొందుతోంది. క్షేత్రంలో స్వామి వారు శ్రీదేవి, భూదేవి సమేత శేషతల్పంపై భక్తులకు దర్శనం ఇస్తారు. ఏటా వైశాఖ మాసంలో స్వామికి బ్రహోత్సవాలు నిర్వహిస్తారు. అంతేకాకుండా ప్రతి శని, ఆదివారాల్లో ఆలూరు కోనకు పెద్ద ఎత్తున పర్యాటకులు విచ్చేసి జలపాతంలో సేదతీరుతారు. ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ ఆలయానికి వెళ్లే రోడ్డు మాత్రం అధ్వానంగా మారింది. రోడ్డుపై మోకాలు లోతు గోతులు పడటంతో భక్తులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. అలాగే ఘాట్ రోడ్డులో కొండకు ఒక వైపు రక్షణ గోడ కూలిపోయింది. మరోవైపు రక్షణ గోడ ఏర్పాటు చేయకపోవడంతో భక్తులు, పర్యాటకులు భయపడుతూ ఆలయానికి చేరుకుంటున్నారు. ఏవైనా పెద్ద ప్రమాదాలు జరగక ముందే అధికారులు మేల్కొని చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రోడ్డు గుంతలమయం..తాడిపత్రి నియోజకవర్గంలో ఆలూరు కోన రంగనాయకుల స్వామి దర్శనానికి రోజూ పెద్ద ఎత్తున భక్తులు వెళ్తారు. కోనకు వెళ్లే ఘాట్ రోడ్డు ప్రమాదకరంగా మారింది. రక్షణ గోడ కూలిపోగా.. కొండకు మరో వైపు రక్షణగోడ లేకుండానే రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. రోడ్డు కూడా గుంతలమయంగా మారింది. కొన్ని చోట్ల పూర్తిగా దెబ్బతింది. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని రోడ్డుకు మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది. – యోగేశ్వర రెడ్డి, పర్యాటకుడు, తాడిపత్రి -
పరకామణి కేసులో విచారణ ఎదుర్కొన్న టీటీడీ మాజీ AVSO సతీష్‌కుమార్
-
వీళ్లందరినీ తలుపుకొట్టి ఎప్పుడు అరెస్ట్ చేస్తారు
-
కూటమి ఓవరాక్షన్.. పెద్దారెడ్డిపై కేసు నమోదు
సాక్షి, అనంతపురం: కూటమి ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా తాడిపత్రి వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఇటీవల మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పోలీసులు, టీడీపీ నేతల తీరును మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. టీడీపీ నేతలు సూచనల మేరకే తనను అడ్డుకున్నారని ఆరోపించారు. దీంతో, పెద్దారెడ్డిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. తాజాగా కేతిరెడ్డి పెద్దారెడ్డిపై 296, 79, 351(2), 351(3) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ నేతలు స్పందిస్తూ.. తాడిపత్రి పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి దూషించినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు వెనకడుగు వేశారని ఘాటు విమర్శలు చేశారు. దీంతో, తాడిపత్రి పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
రాత్రి నా పర్యటనకు అమనుతి ఇచ్చి ఇప్పడు రద్దు చేయడం ఏంటి..?
-
తాడిపత్రిలో ర్యాలీ ఆపిన పోలీసులు.. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేసిన పెద్దారెడ్డి
-
తాడిపత్రిలో టెన్షన్.. పోలీసుల హైడ్రామా!
సాక్షి, అనంతపురం: ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్సీపీ ర్యాలీల నేపథ్యంలో తాడిపత్రిలో హైడ్రామా నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనకు పోటీగా టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి మరో కార్యక్రమం ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పెద్దారెడ్డిని అడ్డుకునేందుకు భారీ సంఖ్యలో పోలీసులు ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు.వివరాల ప్రకారం.. తాడిపత్రిలో అధికార టీడీపీ నేతలు రెచ్చగొట్టే చర్యలకు దిగారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్సీపీ ర్యాలీల సమయంలోనే పోటీగా టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి మరో కార్యక్రమానికి తెర లేపారు. అభివృద్ధి కార్యక్రమాల పేరిట జేసీ వర్గీయుల హడావిడి చేస్తున్నారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. వైఎస్సార్సీపీ కార్యక్రమం కేంద్రాన్ని మార్చుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో పోలీసుల సూచనతో వైఎస్సార్సీపీ పెద్దారెడ్డి.. యాడికి మండల కేంద్రానికి ర్యాలీ కార్యక్రమానికి మార్చారు. దీంతో, యాడికి మండల కేంద్రంలో ర్యాలీకి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ తాజాగా టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి.. వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేసి కక్ష సాధింపు చర్యలకు దిగారు. యాడికిలో వైఎస్సార్సీపీ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని జేసీ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామునే పెద్దారెడ్డి ఇంటి వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. తాడిపత్రిలోని ఇంటి వద్దే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, పెద్దారెడ్డి, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. తనను ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను పెద్దారెడ్డి ప్రశ్నించారు. ఈ సందర్బంగా పెద్దారెడ్డి మాట్లాడుతూ.. నా కార్యక్రమాలకు సంబంధించి పోలీసులకు ముందే సమాచారం ఇచ్చాను. నా కార్యక్రమాలకు అనుమతి ఇవ్వాలని ముందే పోలీసులు విజ్ఞప్తి చేశాను. రాత్రి నా కార్యక్రమాలకు అనుమతి ఇచ్చి ఇప్పుడు అడ్డుకోవడం ఏంటి?. చంద్రబాబు, జేసీ మెప్పు కోసం పోలీసులు పనిచేస్తున్నారు అని ఘాటు విమర్శలు చేశారు. ప్రశ్నిస్తే వైఎస్సార్సీపీ శ్రేణులపై తప్పుడు కేసులు పెడుతున్నారు. తాడిపత్రి పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నేను ర్యాలీ చేస్తే అభ్యంతరం ఎందుకు?. నన్ను చూసి జేసీ ప్రభాకర్ రెడ్డి భయపడుతున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిని దూషించారు. అయినప్పటికీ పోలీసులు కఠిన చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గం. జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే జేసీ అస్మిత్ గ్యాంగ్ స్టర్లా వ్యవహరిస్తున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా జేసీ ప్రభాకర్ రెడ్డి అరాచకాలపై పోరాటం కొనసాగిస్తా’ అని వ్యాఖ్యలు చేశారు. -
వైఎస్సార్సీపీ నేత రామసుబ్బారెడ్డిపై టీడీపీ దాడి
అనంతపురం: వైఎస్సార్సీపీ శ్రేణులే లక్ష్యంగా టీడీపీ దాడులు కొనసాగుతున్నాయి. అనంతపురం జిల్లాలో జూటూరులో వైఎస్సార్సీపీ నాయకుడు రామసుబ్బారెడ్డిపై టీడీపీ నేత దాడి చేశారు. రామసుబ్బారెడ్డిపై టీడీపీకి చెందిన రవికుమార్ కొడవలితో దాడికి దిగాడు. ఈ ఘటనలో రామసుబ్బారెడ్డి గాయపడ్డారు. ఆయన్ని తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు.. -
తాడిపత్రి యువకుడికి గూగుల్‌లో రూ.2.25 కోట్ల వార్షిక వేతనం
తాడిపత్రి టౌన్: అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన యువకుడు అరుదైన ఘనత సాధించాడు. చదువు పూర్తికాగానే ఏకంగా రూ.2.25 కోట్ల వార్షిక వేతనంతో గూగుల్‌లో కొలువు సంపాదించాడు. వివరాల్లోకి వెళితే... తాడిపత్రికి చెందిన వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కొనుదుల రమేశ్‌రెడ్డి, అంబిక దంపతుల కుమారుడు సాత్విక్‌రెడ్డి న్యూయార్క్‌లోని స్టో్కన్ బ్రోక్ వర్సీటీలో ఇటీవలే ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. అతడు కాలిఫోరి్నయాలోని గూగుల్‌లో రూ.2.25 కోట్లతో కొలువు సంపాదించాడు. దీంతో పట్టణంలోని పలువురు ప్రముఖులు సాతి్వక్రెడ్డిని ఫోన్లో అభినందించారు. -
నువ్వేంటి.. నీ భాషేంటి.. జేసీకి ఝలక్.. అపాయింట్ మెంట్ ఇవ్వని SP
-
‘రేయ్ ఏఎస్పీ.. నీ అంతు చూస్తా’.. పోలీసులపై రెచ్చిపోయిన జేసీ
అనంతపురం జిల్లా: తాడిపత్రి టీడీపీ నేత, మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై జేసీ నోరు పారేసుకున్నారు. ‘‘తుపాకులు నీ వద్దే కాదు.. నా వద్ద కూడా ఉన్నాయి. రేయ్ ఏఎస్పీ.. నీ అంతు చూస్తా.. నీకు బుద్ధి, జ్ఞానం లేవు. ఏఎస్పీ రంజిత్ ఓ పనికిమాలిన వాడు.. వేస్ట్ ఫేలో.. గొడవలు జరిగితే ఇంట్లో దాక్కుంటాడు’’ అంటూ పోలీసుల అమరవీరుల సంస్మరణ సభలో జేసీ ప్రభాకర్ రెడ్డి రెచ్చిపోయారు.కాగా, అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి రెండు రోజుల క్రితం కూడా వీరంగం సృష్టించిన సంగతి తెలిసిందే. పట్టపగలు అందరూ చూస్తుండగా.. వైఎస్సార్సీపీ నాయకుడిపై తన అనుచరులతో దాడి చేయించి తీవ్రంగా గాయపరిచారు. వైఎస్సార్సీపీ నాయకుడు యర్రగుంటపల్లి నాగేశ్వరరెడ్డి ఆదివారం తాడిపత్రిలోని ఆనంద్ భవన్ హోటల్ వద్ద టీ తాగుతుండగా.. వాహనంలో అటుగా వెళ్తున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి చూశారు.ఆ వెంటనే ‘వీణ్ని ఎందుకురా ఇంత వరకు వదిలేశారు’ అంటూ అనుచరులను రెచ్చగొట్టారు. దీంతో రవీంద్రారెడ్డి, యాసిన్, బద్రీ, విష్ణు, శేఖర్‌తో పాటు సుమారు పది మంది జేసీ అనుచరులు ఇనుప రాడ్లతో నాగేశ్వరరెడ్డిపైకి దూసుకెళ్లారు. వారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన నాగేశ్వరరెడ్డిని.. రోడ్డుపై వెంబడిస్తూ దాడి చేశారు. సమీపంలో వైఎస్సార్సీపీ నాయకురాలు పేరం స్వర్ణలత ఇల్లు కనిపించడంతో.. నాగేశ్వరరెడ్డి అందులోకి పరుగెత్తుకెళ్లి తలదాచుకున్నాడు. జేసీ అనుచరులు అక్కడి నుంచి వెళ్లిపోగానే.. పేరం అమరనాథ్‌రెడ్డి స్థానికులతో కలిసి బాధితుడిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. -
తాడిపత్రిలో హైటెన్షన్.. జేసీ గూండాగిరి
తాడిపత్రి టౌన్: అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో టీడీపీ నేత, మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి మరోసారి వీరంగం సృష్టించారు. పట్టపగలు అందరూ చూస్తుండగా.. వైఎస్సార్సీపీ నాయకుడిపై తన అనుచరులతో దాడి చేయించి తీవ్రంగా గాయపరిచారు. బాధితుడు తెలిపిన వివరాలు.. వైఎస్సార్సీపీ నాయకుడు యర్రగుంటపల్లి నాగేశ్వరరెడ్డి ఆదివారం తాడిపత్రిలోని ఆనంద్ భవన్ హోటల్ వద్ద టీ తాగుతుండగా.. వాహనంలో అటుగా వెళ్తున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి చూశారు. ఆ వెంటనే ‘వీణ్ని ఎందుకురా ఇంత వరకు వదిలేశారు’ అంటూ అనుచరులను రెచ్చగొట్టారు. దీంతో రవీంద్రారెడ్డి, యాసిన్, బద్రీ, విష్ణు, శేఖర్‌తో పాటు సుమారు పది మంది జేసీ అనుచరులు ఇనుప రాడ్లతో నాగేశ్వరరెడ్డిపైకి దూసుకెళ్లారు. వారి నుంచి తప్పించుకునేందుకు ప్రయతి్నంచిన నాగేశ్వరరెడ్డిని.. రోడ్డుపై వెంబడిస్తూ దాడి చేశారు. సమీపంలో వైఎస్సార్సీపీ నాయకురాలు పేరం స్వర్ణలత ఇల్లు కనిపించడంతో.. నాగేశ్వరరెడ్డి అందులోకి పరుగెత్తుకెళ్లి తలదాచుకున్నాడు. జేసీ అనుచరులు అక్కడి నుంచి వెళ్లిపోగానే.. పేరం అమరనాథ్‌రెడ్డి స్థానికులతో కలిసి బాధితుడిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఆస్పత్రి వద్దకు చేరుకుని దాడి వివరాలను ఆరా తీశారు. జేసీ ప్రభాకర్‌రెడ్డిపై పోలీసులు చర్యలు తీసుకుంటారన్న నమ్మకం తనకు లేదంటూ.. కేసు పెట్టడానికి బాధితుడు నిరాకరించారు. కాగా, నాగేశ్వరరెడ్డిని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫోన్లో పరామర్శించారు. -
సుప్రీం వ్యాఖ్యలు లెక్క చేయకుండా.. జేసీ మాటే వేదంగా పోలీసుల తీరు
-
తాడిపత్రి డేరా బాబావి.. ఒంగోలులో ఏం పీకుతావు జేసీ!: టీడీపీ నేత ఫైర్
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘తాడిపత్రి మున్సిపల్ చైర్మన్‌గా ఉండి ఒంగోలుకు వచ్చి ఏమి పీకుతావు జేసీ ప్రభాకరరెడ్డి’.. అంటూ ఒంగోలుకు చెందిన టీడీపీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడు పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్‌రెడ్డి(Surya Prakash) మండిపడ్డారు. ఒంగోలులోని ఓ స్థలం విషయంలో జేసీ ఫోన్‌చేసి తనను బెదిరించారని శనివారం మీడియా సమావేశంలో పెద్దిరెడ్డి వెల్లడించారు.ఆయన ఏమన్నారంటే.. జేసీ ప్రభాకరరెడ్డి(Prabhakar Reddy) శుక్రవారం సాయంత్రం ఫోన్‌చేసి ఒంగోలులోని 148 సర్వే నంబరులోని స్థలం విషయంలో తన మనుషులు వస్తారని, వాళ్లకు ఆ స్థలం అప్పగించాలంటూ నన్ను బెదిరించాడు. నీ స్థలంలోకి నా మనుషులు వస్తారు.. నువ్వక్కడ లేకుంటే నీ ఇంటికి వస్తారు. సెటిల్ చేసుకో. లేకుంటే నువ్వు ఎక్కడుంటే అక్కడ నుంచే ఎత్తుకు వస్తారు అని బెదిరించాడు. గలీజు మాటలు, బండ బూతులు, మీడియా ముందు చెప్పుకోలేని పదజాలం వాడాడు. గడ్డం బాబా మాదిరిగా తాడిపత్రిలో పిచ్చిపిచ్చి చేష్టలు చేస్తున్న జేసీ ప్రభాకరరెడ్డి ఒక డేరా బాబా మాదిరిగా మారి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. జేసీ ప్రభాకర్‌రెడ్డీ.. అనంతపురం జిల్లాలో, తాడిపత్రిలో చేసినట్లు ఫ్యాక్షన్ రాజకీయాలు, బెదిరింపులు ఒంగోలులో చేస్తే చెల్లవు. నువ్వూ టీడీపీ నాయకుడివే. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్‌వి. తాడిపత్రిలో ఉన్న మురుగు సంగతి చూసుకో. అక్కడ మురుగు కంపుకొడుతోంది. దానిని కడుక్కోలేని నువ్వు ఒంగోలుకు వచ్చి పీకేది ఏంది? అంటూ ప్రశ్నించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు టీడీపీలో(TDP) కొత్త ట్విస్ట్ ఇచ్చాయి. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
ఒంగోలుకు వచ్చి నువ్వు ఏం పీకుతావు!
-
తాడిపత్రిలో పోలీసుల ఓవరాక్షన్!
-
తాడిపత్రిలో ఉద్రిక్తత.. పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులు
-
తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత.. పోలీసుల ఓవరాక్షన్!
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విషయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. తాడిపత్రికి వెళ్తున్న పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.వివరాల ప్రకారం.. తాడిపత్రిలో వివాహ కార్యక్రమానికి వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. తాడిపత్రి పట్టణంలోని పుట్లూరు రహదారిలో పెద్దారెడ్డిని ఆపారు. ఈ క్రమంలో పోలీసుల అత్యుత్సాహంపై పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను వివాహానికి వెళ్తానని మందుగానే పోలీసులకు లేఖ ద్వారా సమాచారం ఇచ్చినా ఎందుకు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. -
మీడియాకు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్
-
అలా రాస్తే మీ ఇంటికి వస్తా.. మీడియాకు టీడీపీ నేత జేసీ వార్నింగ్
సాక్షి, అనంతపురం: టీడీపీ నేత, మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి మరోసారి రెచ్చిపోయారు. తాడిపత్రిలో ఉద్రిక్తతలు అంటూ చూపొద్దంటూ మీడియాకు వార్నింగ్ ఇచ్చారు. ఈసారి అలా రాస్తే.. మీ ఇళ్ల వద్దకు వస్తానంటూ జేసీ బెదిరింపులకు దిగారు. ‘‘నా దగ్గర తమాషాలు చేయొద్దు.. నా గురించి అందరికీ తెలుసు.. మీడియా వాళ్లకు తప్పా?’’ అంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు.తాడిపత్రిలో రోడ్డుపై పడుకుని జేసీ హల్చల్కాగా, జేసీ ప్రభాకర్‌రెడ్డి నిన్న (సోమవారం) కూడా హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. పోలీస్ అధికారులను బెదిరించే ధోరణిలో స్థానిక ఏఎస్పీ కార్యాలయం ఎదుట, అశోక్ పిల్లర్ సర్కిల్లో దాదాపు ఐదు గంటల పాటు మంచంపై పడుకుని నిరసన పేరిట హంగామా సృష్టించారు. పది రోజుల క్రితం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఏఎస్పీ రోహిత్‌కుమార్‌కు జేసీ ప్రభాకర్‌రెడ్డి అందజేశారు.దీనిపై పోలీసుల నుంచి ఎలాంటి స్పందనా రాలేదంటూ సోమవారం నేరుగా ఏఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకుని ఏఎస్పీతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఇందుకు ఏఎస్పీ సుముఖంగా లేకపోవడంతో కార్యాలయం ముందు రోడ్డుపై పడుకుని హంగామా చేశారు. అయినప్పటికీ ఏఎస్పీ పట్టించుకోకపోవడంతో పట్టణంలోని అశోక్‌పిల్లర్ సర్కిల్‌కు చేరుకుని నడిరోడ్డుపై కుర్చీలో కూర్చొన్నారు. అయినా పోలీసుల నుంచి స్పందన కరువవడంతో అప్పటికప్పుడు రోడ్డుపై టెంట్ వేయించి.. మంచంపై పడుకున్నారు. ఉదయం 11 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఆయన హైడ్రామా కొనసాగింది. చివరకు జిల్లా ఎస్పీ నుంచి ఫోన్ రావడంతో వెనక్కి తగ్గారు. -
కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి జేసీ
-
కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద జేసీ వీరంగం
-
తాడిపత్రిలో టెన్షన్.. టెన్షన్
సాక్షి, టాస్క్‌ఫోర్స్: అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ నాయకుడు, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన అనుచరులు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి ముందుకొచ్చి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. టీడీపీ శ్రేణులు ఓవరాక్షన్‌కు దిగాయి. దీంతో, పోలీసులు కలుగజేసుకుని వారిని అక్కడి నుంచి పంపించేశారు. ఇక, అంతకుముందు.. పెద్దారెడ్డి పోలీసు బందోబస్తు మధ్య శుక్రవారం ఉదయం తన నివాసానికి చేరుకున్నారు. తన ఇంటికి వెనుక వైపునున్న ప్రహరీ కొంత తొలగించి గేటు నిర్మాణం చేపట్టారు. అయితే, అది నచ్చని జేసీ మున్సిపల్ అధికారులను ఉసిగొల్పి గేటును ధ్వంసం చేయించి యథావిధిగా గోడ నిర్మాణం చేపట్టారు. ఆ సమయంలో సోషల్ మీడియా ద్వారా తన అనుచరులను వెంటనే రావాలంటూ జేసీ మెసేజ్ పెట్టారు. అనుచరులు తన ఇంటి వద్దకు చేరుకోగానే జేసీ ప్రభాకర్‌రెడ్డి వారితో కలిసి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి ముందున్న కళాశాల క్రీడా మైదానంలోకి చేరుకున్నారు. కేకలతో రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించారు. అదే సమయంలో ఏఎస్పీ రోహిత్‌కుమార్ పోలీసు బలగాలతో వచ్చి వారిని వెనక్కి పంపడంతో సమస్య సద్దుమణిగింది. మరోవైపు.. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి సమీపంలో పోలీసులు బారికేడ్లతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సమన్వయం పాటించాలని వైఎస్సార్సీపీ కార్యకర్తలకు కేతిరెడ్డి పెద్దారెడ్డి సూచించారు. అనంతరం, జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు వెనక్కి పంపించేశారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి ముందున్న గ్రౌండ్లో గుముకూడిన జెసి వర్గీయులు pic.twitter.com/FE6JL0mOGz— YSRCP DHARMAVARAM (@sekharreddivari) September 19, 2025 -
తాడిపత్రిలో TDP అరాచకాలు మితిమీరాయి: పెద్దారెడ్డి
-
తాడిపత్రిలో ఉద్రిక్తత.. మరోసారి పెద్దారెడ్డి అరెస్ట్
-
పెద్దారెడ్డిపై మరో కుట్ర ఇంటి వద్ద అధికారుల సర్వే
-
టార్గెట్ పెద్దారెడ్డి.. తాడిపత్రిలో మళ్లీ జేసీ మార్క్ రాజకీయం
సాక్షి, అనంతపురం: తాడిపత్రి వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై రాజకీయ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. పెద్దారెడ్డి ఇంటిని టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి టార్గెట్ చేశారు. ఆక్రమణలు ఉన్నాయంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డికి తాడిపత్రి మునిసిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద సర్వే చేపట్టారు.తాడిపత్రి చేరుకున్న కేతిరెడ్డి పెద్దారెడ్డి.. తన ఇంటి వద్ద చేపట్టిన సర్వేను పరిశీలించారు. తన ఇళ్లు, స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు అందజేశారు. తన ఇంటి స్థలంలో మునిసిపల్ స్థలం ఆక్రమించలేదని వివరణ ఇచ్చారు.జేసీ ఆదేశాలతోనే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద సర్వే చేపట్టారని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాడిపత్రి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి ఇప్పటికే ఒకసారి కొలతలు వేసిన అధికారులు.. మళ్లీ మళ్లీ కొలతలు వేయడంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. పెద్దారెడ్డి సహా వైఎస్సార్సీపీ నేతల ఇళ్లను కూల్చేస్తానంటూ గతంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించిన సంగతి తెలిసిందే.కాగా, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈ నెల 6న ఎట్టకేలకు తాడిపత్రిలోని తన నివాసానికి చేరుకున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో పోలీసులు దిగొచ్చారు. ప్రభుత్వ అండతో టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర్‌రెడ్డి కూటమి సర్కారు ఏర్పడినప్పటి నుంచి పెద్దారెడ్డిని తాడిపత్రికి రాకుండా అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. చివరికి ఆయన గత నెలలో సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేలా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. -
జేసీ స్టిక్కర్ లేకపోతే ఎవ్వడైనా సరే నో ఎంట్రీ..!
-
Audio Leak: జేసి అనుచరుడి సంచలన ఆడియో
-
చంద్రబాబు సభ.. తాడిపత్రి టీడీపీలో పొలిటికల్ వార్
సాక్షి, అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా తాడిపత్రి టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. టీడీపీ నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డి, కాకర్ల రంగనాథ్ మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతోంది. చంద్రబాబు పర్యటన సందర్భంగా తమ బల ప్రదర్శనకు ఇరు వర్గాల నేతలు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యం జేసీ వర్గం హెచ్చరికలతో తాడిపత్రిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. సీఎం చంద్రబాబు తాడిపత్రి పర్యటన నేపథ్యంలో టీడీపీలో వర్గపోరు పీక్ స్టేజ్‌కు చేరుకుంది. సొంత పార్టీ నేతల వాహనాలపై విధ్వంసానికి జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు సిద్దమయ్యారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, కాకర్ల రంగనాథ్ మధ్య వర్గాల మధ్య రాజకీయం ఘర్షణలకు దారి తీస్తోంది. తాడిపత్రి నుంచి జేసీ ఫోటో ఉన్న వాహనాలే చంద్రబాబు సభ వద్దకు వెళ్లాలని హెచ్చరికలు జారీ అయ్యాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి ఫోటో లేని వాహనాలు ధ్వంసం చేస్తామని వార్నింగ్ ఇవ్వడం సంచలనంగా మారింది. ఈ క్రమంలో జేసీ వర్గం.. నిర్దేశిత ఫార్మాట్, ఆడియోను విడుదల చేసింది. దీనికి సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.మరోవైపు.. సుమారు వంద వాహనాల్లో చంద్రబాబు సభకు వెళ్లాలని టీడీపీ నేత కాకర్ల రంగనాథ్ ఏర్పాట్లు చేశారు. జేసీ వర్గానికి కౌంటర్ ఇస్తూ వాహనాలపై స్టిక్కర్లు వేసినట్టు సమాచారం. ఇక, జేసీ వర్గం హెచ్చరికలతో తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. ఇదిలా ఉండగా.. ఇటీవల వినాయక నిమజ్జనం సందర్భంగా రాళ్లు జేసీ ప్రభాకర్-కాకర్ల రంగనాథ్ వర్గీయులు రాళ్లతో దాడులు చేసుకున్న విషయం తెలిసిందే. -
తాడిపత్రిలో జేసీకి బిగ్ షాక్
-
తాడిపత్రి వదిలిపో.. పెద్దారెడ్డికి పోలీసుల లేఖ
-
‘పదోతేదీ వరకూ తాడిపత్రి రాకండి..ఆరోజు బాబుగారొస్తున్నారు..’
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రావడానికి సుప్రీంకోర్టు అనుమతించి.. భద్రతా కల్పించాలని పోలీసులను ఆదేశించినా పోలీసులు మాత్రం ఇంకా తెలుగుదేశం ప్రభుత్వానికి అనుకూలంగానే మాట్లాడుతున్నారు.. రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు.. స్థానిక ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి ఎన్ని అడ్డంకులు కల్పించినా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన పంతం వీడక సుప్రీం కోర్టు వరకూ వెళ్లి పోరాడి తన హక్కులు సాధించుకున్నారు.. ఎలాగైనా సరే భీష్మించుకుని తాడిపత్రిలో అడుగుపెట్టారు.. అయితే ఇప్పుడు మళ్ళీ పోలీసులు కొత్త రాగం తీస్తున్నారు.వాస్తవానికి గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన తాడిపత్రిలో అడుగిడేందుకు ఆయనకు దాదాపు 15 నెలల సమయం పట్టింది.. పెద్దారెడ్డి తాడిపత్రి ఎలా వస్తాడో. ఎలా తిరిగివెళ్లాడో చూస్తాను అంటూ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి చేసిన హెచ్చరికలు ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు రేపగా ఆయన్ను తాడిపత్రి రావద్దని పోలీసులు కూడా సూచించారు. దీనిమీద అయన హైకోర్టుకు వెళ్లారు.. అక్కడ ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చినట్లే వచ్చి మళ్ళీ అడ్డంకులు వచ్చాయి. దీంతో అయన సుప్రీం కోర్టుకు వెళ్లారు. అక్కడ ఆయనకు పూర్తి సానుకూలమైన తీర్పు వచ్చింది.అయన సొంత నియోజకవర్గానికి వెళ్ళడానికి ఎవరు అడ్డంకి.. వెళ్లనీయండి.. కాకుంటే ఆయనకు భారీ భద్రతా కల్పిస్తూ పోలీసుల సమక్షంలో ఆ పర్యటన జరగాలి.. ఆ భద్రతకు అయ్యే ఖర్చు మొత్తం పెద్దారెడ్డి భరించాలి అని కోర్టు చెప్పింది.. దీంతో ఇక పోలీసులు.. ఏపీ ప్రభుత్వం కూడా అయన రాకను అడ్డుకోలేని పరిస్థితి వచ్చింది. దీంతో అయన సెప్టెంబర్ ఆరున తాడిపత్రి వెళ్లారు.. దీనికి భారీ భద్రత కల్పించారు.. అయితే అంతలోనే మళ్ళీ పోలీసులు ఆయన్ను నియంత్రిస్తున్నారు.. మీరు పదోతేదీన ఇక్కడ ఉక్కడ ఉండకూడదు.. ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తున్నారు కాబట్టి.. మేమంతా అయన భద్రతా చర్యల్లో ఉంటాం.. మీకు సరైన భద్రత కల్పించలేం.. మళ్ళీ జరగరానిది జరిగితే మీకు మాకు కూడా ఇబ్బంది.. ఎందుకొచ్చిన గొడవ.. ఆ తరువాత మీరు రావచ్చు.. ఇప్పుడైతే మీ సొంత ఊరు వెళ్లిపోండి.. తరువాత వద్దురుగాని అని చెబుతున్నారు.. చంద్రబాబు పర్యటన సమయంలో వైఎస్సార్సీపీ అభిమానులు.. పెద్దారెడ్డి అనుచరులు ఏమైనా హడావుడి చేస్తే ప్రభుత్వానికి చికాకు కదా జాగ్రత్తతో ఇలా చెబుతున్నారని తెలుస్తోంది.. చంద్రబాబు భద్రతకు మూణ్ణాలుగు జిల్లాల నుంచి పోలీసులను రప్పించే ప్రభుత్వం పెద్దారెడ్డికి మాత్రమే రక్షణ కల్పించలేకపోవడం చేతగాని రాజకీయం అని అయన అభిమానులు అంటున్నారు.::సిమ్మాదిరప్పన్న -
జేసీ ప్రభాకర్ రెడ్డికి కాకర్ల రంగనాథ్ బిగ్ షాక్
-
తాడిపత్రికి చంద్రబాబు.. పెద్దారెడ్డిపై పోలీసుల కొత్త డ్రామా..
-
పెద్దారెడ్డి విషయంలో మరో ట్విస్ట్..! తాడిపత్రిలో పోలీసుల హైడ్రామా
-
తాడిపత్రిలో పోలీసుల హైడ్రామా.. పెద్దారెడ్డి విషయంలో మరో ట్విస్ట్!
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో పోలీసులు మరోసారి హై డ్రామాకు తెరలేపారు. తాజాగా తాడిపత్రి వదిలి వెళ్లాలని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈనెల పదో తేదీన అనంతపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో కేతిరెడ్డిని తాడిపత్రి నుంచి వెళ్లిపోవాలని సూచించడం గమనార్హం.వివరాల ప్రకారం.. తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విషయంలో పోలీసులు మరో ట్విస్ట్ ఇచ్చారు. ఈనెల పదో తేదీన అనంతపురంలో సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పోలీసు బలగాలు ఆ కార్యక్రమంలో పాల్గొంటారని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి.. తాడిపత్రి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన అనంతరం తాడిపత్రికి రావాలని పెద్దారెడ్డికి పోలీసులు చెప్పారు.ఈ నేపథ్యంలో పెద్దారెడ్డి స్పందిస్తూ.. దీనికి సంబంధించి లిఖితపూర్వకంగా లేఖ ఇవ్వాలని కోరారు. కానీ, లేఖ ఇవ్వడానికి పోలీసులు నిరాకరించారు. ఈ నేపథ్యంలో పోలీసుల అనుమానాస్పద వైఖరిని పెద్దారెడ్డి ప్రశ్నించారు. అనంతరం, అనంతపురం ఎస్పీ జగదీష్‌కు కేతిరెడ్డి మెయిల్ పంపించారు. సీఎం పర్యటన అనంతరం తాడిపత్రి వస్తానని లేఖలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రిలో ఉండేందుకు ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో పెద్దారెడ్డి.. శనివారం ఉదయం తాడిపత్రిలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. -
తాడిపత్రికి పెద్దారెడ్డి.. పోలీసులకు సహకరిస్తా.. టీడీపీపై పోరాటం ఆపను
-
తాడిపత్రి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి
-
తాడిపత్రి చేరుకున్న పెద్దారెడ్డి.. ఎస్పీ సమక్షంలో భద్రత
సాక్షి, అనంతపురం: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి చేరుకున్నారు. పోలీసు భద్రత మధ్య తాడిపత్రిలోని స్వగృహానికి వెళ్లారు పెద్దారెడ్డి. కాగా, సుప్రీంకోర్టు ఆదేశాలతో అనంతపురం ఎస్పీ జగదీష్ స్వయంగా రంగంలోకి దిగి భద్రత కల్పించారు. ఇక, కేతిరెడ్డి పెద్దారెడ్డి రాక సందర్భంగా 672 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పెద్దారెడ్డికి హారతి ఇచ్చి దిష్టి తీశారు కుటుంబ సభ్యులు. వైఎస్సార్సీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దాదాపు 15 నెలల తర్వాత తాడిపత్రికి వెళ్లారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో తాడిపత్రిలో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. అంతకుముందు.. తాడిపత్రి వెళ్లటంపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా కేతిరెడ్డి మాట్లాడుతూ..‘15 మాసాల తర్వాత తాడిపత్రికి వెళ్లటం ఆనందంగా ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు భద్రత కల్పించారు. పోలీసులకు అన్ని విధాలా సహకరిస్తాను. తాడిపత్రి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తాను. తాడిపత్రిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తాను’ అని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రాకుండా టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ‘ఓ వ్యక్తిని తన నియోజకవర్గానికి వెళ్లకుండా ఎలా అడ్డుకుంటారు..?’ అని పోలీసులను ఘాటుగా ప్రశ్నించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల మేరకు పెద్దారెడ్డికి తగిన భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ ఖర్చును భరించాలని పెద్దారెడ్డికి సూచించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. -
టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు
-
జేసీ సహా టీడీపీ నేతలపై కేసు నమోదు
సాక్షి, అనంతపురం: తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసు కేసు నమోదైంది. తాడిపత్రి సీఐ ఫిర్యాదుతో జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల వినాయక నిమజ్జనం సందర్భంగా చోటుచేసుకున్న గొడవ కారణంగా కేసు ఫైల్ చేసినట్టు తెలిసింది.వివరాల ప్రకారం.. టీడీపీ నేతల మధ్య ఆధిపత్యపోరుతో తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వినాయక నిమజ్జనం సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ టీడీపీ నేత కాకర్ల రంగనాథ్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వినాయక నిమజ్జనం ఊరేగింపులో జేసీ, కాకర్ల వర్గీయులు ఎదురుపడ్డారు. పరస్పర నినాదాలు చేసుకుంటూ ఒకరిపై ఒకరు రాళ్లు రువుకున్నారు. ఇరు వర్గాలకు జరిగిన ఘర్షణలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఘర్షణపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతంలో పెద్ద ఎత్తున మొహరించారు. ఇరు వర్గాలపై లాఠీఛార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.అనంతరం, తాడిపత్రి సీఐ సాయి ప్రసాద్ ఫిర్యాదు మేరకు పోలీసులు.. జేసీ ప్రభాకర్ రెడ్డి సహా మరో ఏడుగురు టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. అయితే, అధికార పార్టీ నేతలపై కేసులు నమోదు చేయడంతో దీన్ని తట్టుకోలేని ఓ టీడీపీ నేత సీఐ సాయిప్రసాద్‌కు ఫోన్ చేసి దుర్భాషలాడినట్లు తెలిసింది. దీంతో మనస్తాపానికి గురైన సీఐ సెలవుపై వెళ్లినట్లు సర్వత్రా చర్చ జరుగుతోంది. కాగా, తాడిపత్రి పట్టణ ఇన్చార్జ్ సీఐగా బాధ్యతలను మంగళవారం రూరల్ సీఐ శివగంగాధర్‌రెడ్డి స్వీకరించారు. -
కేతిరెడ్డికి గ్రీన్ సిగ్నల్.. దిగొచ్చిన పోలీసులు
-
తాడిపత్రికి పెద్దారెడ్డి.. సుప్రీంకోర్టు దెబ్బకు దిగొచ్చిన ఎస్పీ!
సాక్షి, అనంతపురం: సుప్రీంకోర్టు కోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ దిగి వచ్చారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో ఈనెల ఐదో తేదీ తర్వాత కేతిరెడ్డి తాడిపత్రికి వచ్చేందుకు తేదీని ఖరారు చేయాలని పెద్దారెడ్డికి ఎస్పీ జగదీష్ లేఖ రాశారు.వివరాల ప్రకారం.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వచ్చేందుకు ఒక తేదీని ఖరారు చేయాలని ఎస్పీ జగదీష్ లేఖ రాశారు. ఈ సందర్బంగా లేఖలో పెద్దారెడ్డి పోలీసు భద్రతకు అయ్యే ఖర్చు వివరాలను ఇస్తామని.. అది డిపాజిట్ చేయాలని తెలిపారు. దీనికి కేతిరెడ్డి పెద్దారెడ్డి అంగీకారం తెలిపారు. ఈ సందర్భంగా పెద్దారెడ్డి.. పోలీసుల సూచనలు పాటిస్తాను. తాడిపత్రిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తాను అని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. తాడిపత్రిలోని తన ఇంటికి వచ్చేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టీడీపీ కూటమి సర్కారు, ఊర్లోకి అడుగుపెట్టకుండా అడ్డుకుంటున్న పోలీసులకు దిమ్మతిరిగే షాక్‌నిచ్చింది. ‘ఓ వ్యక్తిని తన నియోజకవర్గానికి వెళ్లకుండా ఎలా అడ్డుకుంటారు..?’ అని పోలీసులను ఘాటుగా ప్రశ్నించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల మేరకు పెద్దారెడ్డికి తగిన భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ ఖర్చును భరించాలని పెద్దారెడ్డికి సూచించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. -
వినాయక నిమజ్జనం సందర్భంగా గొడవ.. తాడిపత్రిలో తన్నుకున్న టీడీపీ తమ్ముళ్లు
-
రాళ్లు రువ్వుకున్న జేసీ,కాకర్ల వర్గీయులు .. తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత
సాక్షి,అనంతపురం: టీడీపీ నేతల మధ్య ఆధిపత్యపోరుతో తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వినాయక నిమజ్జనం సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ టీడీపీ నేత కాకర్ల రంగనాథ్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వినాయక నిమజ్జనం ఊరేగింపులో జేసీ, కాకర్ల వర్గీయులు ఎదురుపడ్డారు. పరస్పర నినాదాలు చేసుకుంటూ ఒకరిపై ఒకరు రాళ్లు రువుకున్నారు. ఇరు వర్గాలకు జరిగిన ఘర్షణలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.ఘర్షణపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతంలో పెద్ద ఎత్తున మొహరించారు. ఇరు వర్గాలపై లాఠీఛార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
జేసీకి దిమ్మదిరిగే షాక్.. తాడిపత్రికి కేతిరెడ్డి ఎంట్రీ!
-
త్వరలో తాడిపత్రికి ఎంట్రీ ఇస్తా.. సుప్రీం తీర్పుపై పెద్దారెడ్డి రియాక్షన్
-
Pedda Reddy: ఏపీ హైకోర్టు ఆదేశాలపై స్టే విధించిన సుప్రీంకోర్టు
-
తాడిపత్రిలో పెద్దారెడ్డి పర్యటించేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
-
ఎట్టకేలకు న్యాయం గెలిచింది.. ‘సుప్రీం’ తీర్పుపై పెద్దారెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ/అనంతపురం: వైఎస్సార్సీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి భారీ ఊరట(Big Relief For Kethireddy Pedda Reddy) లభించింది. నియోజకవర్గంలో అనుమతి పెట్టేందుకు ఆయనకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయ్యింది. పెద్దారెడ్డి తాడిపత్రి నియోజకవర్గంలోకి నిరభ్యంతరంగా వెళ్లొచ్చని సుప్రీం కోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది.తాడిపత్రిలోకి తనను అనుమతించడం లేదంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. తన సొంత నియోజకవర్గంలోకి అనుమతించకుండా టీడీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ పిటిషన్లో పేర్కొన్నారాయన. ఈ పిటిషన్‌ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం.. ‘‘మీ నియోజకవర్గంలోకి వెళ్లకుండా మిమ్మల్ని ఎవరు ఆపుతారు?’’ అంటూ పెద్దారెడ్డిని ప్రశ్నించింది. హైకోర్టు ఆదేశాలపై స్టే విధిస్తూ.. తాడిపత్రి వెళ్లేందుకు పెద్దారెడ్డికి అవసరమైన భద్రత కల్పించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. ఒకవేళ అవసరమైతే ప్రైవేట్ సెక్యూరిటీ కూడా పెట్టుకోవచ్చని పెద్దారెడ్డికి కోర్టు సూచించింది. ఈ క్రమంలో.. పోలీసు సెక్యూరిటీ అవసరమైన ఖర్చు భరించేందుకు పెద్దారెడ్డి తరపు న్యాయవాదులు అంగీకరించారు.14 నెలలుగా దూరంఏపీలో కిందటి ఏడాది అసెంబ్లీ ఎన్నికల వేళ.. తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పోలింగ్ తర్వాత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడి చేసి టీడీపీ జెండా ఎగరేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి అంటే దాదాపు 14 నెలలుగా.. ఆయన తాడిపత్రిలో అడుగుపెట్టలేకపోతున్నారు.తాడిపత్రి వెళ్లాలనుకున్న ప్రతీసారి పోలీసులు పెద్దారెడ్డిని అడ్డుకుంటూ వస్తున్నారు. జేసీ ఒత్తిళ్ల వల్లే పోలీసులు తనను అడ్డుకుంటున్నారని పెద్దారెడ్డి, ఇటు వైఎస్సార్సీపీ విమర్శిస్తూ వస్తోంది. ఈ క్రమంలో.. హైకోర్టులో పెద్దారెడ్డికి భారీ ఊరట లభించింది. తాడిపత్రికి వెళ్లేందుకు నిబంధనలతో కూడిన అనుమతి ఇచ్చింది. అయినప్పటికీ పోలీసులు ఆయనకు సహకరించకుండా వచ్చారు.దీంతో పెద్దారెడ్డి హైకోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు పోలీసుల నుంచి వివరణ కోరింది. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనే పెద్దారెడ్డిని రానివ్వడం లేదని అనంత ఎస్పీ పిటిషన్ వివరణ ఇచ్చుకున్నారు. దీంతో.. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన అనుమతిని ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. పెద్దారెడ్డి తాడిపత్రి అనుమతిని రద్దు చేస్తూ విచారణ వాయిదా వేసింది. ఈ పిటిషన్ విచారణలో ఉండగానే.. ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించి ఇప్పుడు ఊరట దక్కించుకున్నారు. పెద్దారెడ్డి రియాక్షన్సుప్రీం కోర్టు తీర్పుపై కేతిరెడ్డి పెద్దారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ‘‘నేను తాడిపత్రి వెళ్లేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టులో న్యాయం గెలిచింది. సుప్రీంకోర్టు తీర్పు కాపీలను ఎస్పీ కి అందజేస్తా.. త్వరలో తాడిపత్రి వెళ్తాను. తాడిపత్రి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటా.. సేవ చేస్తా. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు పోలీసులకు సహకరిస్తాను అని అన్నారాయన. -
రోడ్డుకు అడ్డంగా జీపులు పెట్టి.. పెద్దారెడ్డిని అడ్డుకుని..
సాక్షి, అనంతపురం: తాడిపత్రి పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని నియోజకవర్గంలోకి అడుగు పెట్టనీయకుండా అడ్డుకుంటున్నారని వైఎస్సార్సీపీ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. ఈ క్రమంలో ఇవాళ మరోసారి ఉద్రిక్తత నెలకొంది. మంగళవారం ఉదయం తన స్వగ్రామం తిమ్మంపల్లి నుంచి తాడిపత్రి బయలుదేరారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. అయితే ఆయన్ని బుక్కాపురం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఓవరాక్షన్‌కు దిగారు. అడ్డంగా రోడ్డుకు జీపులు పెట్టి మరీ ఆయన్ని ఆపే ప్రయత్నం చేశారు. హైకోర్టు ఆదేశాలున్నా ఎందుకు ఇలా చేస్తున్నారంటూ పెద్దారెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు.. దమ్ముంటే పెద్దారెడ్డి నియోజకవర్గంలో అడుగుపెట్టాలంటూ జేసీ ప్రభాకర్ సవాల్ విసురుతున్న సంగతి తెలిసిందే. అయితే పెద్దారెడ్డి అడుగుపెట్టిన వెంటనే దాడులు చేయాలని జేసీ, ఆయన అనుచరులు ప్లాన్ వేశారని వైఎస్సార్సీపీ అంటోంది. ఉన్నత న్యాయస్థానం పెద్దారెడ్డిని నియోజకవర్గంలో అడుగుపెట్టేందుకు అనుమతించినా.. పోలీసులు అడ్డుకుంటున్న తీరుపై పార్టీ మండిపడుతోంది.తాడిపత్రి వెళ్లాలంటే.. వీసా కావాలా?: పెద్దారెడ్డిపోలీసుల తీరుపై కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రి వెళ్లాలంటే.. వీసా కావాలా? అంటూ ప్రశ్నించారు. నాపై పోలీసుల ఆంక్షలు దుర్మార్గం. నేను ఎక్కడికెళ్లినా పోలీసులు వెంట పడుతున్నారు. జేసీ వర్గీయులు దాడులు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ప్రభాకర్‌రెడ్డి చేతిలో పోలీసులు బందీ అయ్యారు. తాడిపత్రి అరాచకాలపై సిట్ విచారణ జరపాలి’’ అని పెద్దారెడ్డి డిమాండ్ చేశారు. -
హైకోర్టు ఉత్తర్వులను కాదని.. పెద్దారెడ్డిని అడ్డగించిన ఖాకీ
తాడిపత్రి టౌన్/యల్లనూరు: హైకోర్టు ఆదేశాలను సైతం ధిక్కరిస్తూ పోలీసులు వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోని ఆయన ఇంటికి వెళ్లకుండా అడ్డుకున్నారు. అనంతపురం జిల్లా నారాయణరెడ్డిపల్లిలో పెద్దారెడ్డిని పోలీసులు రోడ్డుపై అడ్డుకోవడంతో సోమవారం హైటెన్షన్ నెలకొంది. దీంతో ఆయన రోడ్డుపై కూర్చున్నారు. తన సొంతింటికి వెళ్లకుండా అడ్డుకోవడం ఏమిటని పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ నారాయణరెడ్డిపల్లి చేరుకున్నారు. రోడ్డుమీదే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సంఘీభావం తెలిపారు. ఆయనకు మద్దతుగా అక్కడే ఉన్నారు. దీంతో పోలీసులు గోరంట్ల మాధవ్‌ను అరెస్ట్ చేసి బలవంతంగా తరలించారు. వివరాల్లోకి వెళితే.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సోమవారం ఉదయం 10–11 గంటల మధ్య తాడిపత్రి వెళ్లాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. 14 నెలల తర్వాత హైకోర్టు ఆదేశాలతో పెద్దారెడ్డి యల్లనూరు మండలం తిమ్మంపల్లి నుంచి తాడిపత్రిలోని తన ఇంటికి బయలుదేరారు. అయితేకోర్టు ఉత్తర్వులనూ బేఖాతరు చేస్తూ టీడీపీ నేత, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు పెద్దారెడ్డిని మరోసారి అడ్డుకున్నారు. ఆ రోజునుంచీ ఇంతే.. కూటమి అధికారంలోకి వచి్చనప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి రాకుండా పోలీసులు అడ్డుకుంటూనే ఉన్నారు. టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి ఒత్తిళ్లకు తలొగ్గుతున్న పోలీసులు శాంతిభద్రతల సమస్య అంటూ కేతిరెడ్డికి అడుగడుగునా అడ్డుతగులుతున్నారు. దీనిపై కేతిరెడ్డి పలుమార్లు కోర్టు మెట్లు ఎక్కారు. చివరగా జిల్లా ఎస్పీ జగదీశ్, తాడిపత్రి సీఐ సాయిప్రసాద్‌పై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు.దీంతో హైకోర్టు సోమవారం కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేలా తగు చర్యలు తీసుకోవాలని, శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమైతే అదనపు బలగాలను వినియోగించాలని ఆదేశించింది. దీంతో పెద్దారెడ్డి సోమవారం తిమ్మంపల్లి నుంచి 5 వాహనాల్లో అనుచరులతో కలసి తాడిపత్రికి బయలుదేరారు. మార్గంమధ్యలో పుట్లూరు మండలం నారాయణరెడ్డిపల్లి వద్ద అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లు పోలీసు బలగాలతో కలసి రోడ్డుకు అడ్డంగా బారికేడ్లను ఉంచి కేతిరెడ్డిని అడ్డుకున్నారు. 9 గంటలపాటు హైడ్రామా జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రోద్బలంతోనే పోలీసులు తనను అడ్డుకుంటున్నారని పోలీసులపై కేతిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా నన్నెందుకు తాడిపత్రిలోని నా ఇంటికి పంపించడం లేదు. పోలీసు శాఖకు ప్రభాకర్‌రెడ్డి పెద్దా? అలాగైతే చెప్పండి. అతనికే మొరపెట్టుకుంటా. నాయనా నువ్వు పరి్మషన్ ఇస్తేనే నన్ను పోలీసులు తాడిపత్రికి పంపుతారంట అని. పోలీసులందరికీ జీతాలు ఇస్తున్నావా అని అడుగుతా. పోలీసులంతా జేసీ ప్రభాకర్‌రెడ్డి సంతృప్తి కోసమే పని చేస్తున్నారు’ అని రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లుని నిలదీశారు. ఏప్రిల్ నుంచి రెండుసార్లు కోర్టు ఆర్డర్ తెచ్చానని, అయినా తాడిపత్రికి పంపకపోవడం తగదన్నారు. తాడిపత్రిలో విగ్రహావిష్కరణ సందర్భంగా పెద్దసంఖ్యలో టీడీపీ మద్దతుదారులు వచ్చారని, మిమ్మల్ని అక్కడికి పంపితే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని డీఎస్పీ సమాధానమిచ్చారు.పోలీసుల తీరుకు నిరసనగా కేతిరెడ్డి పెద్దారెడ్డి నారాయణరెడ్డిపల్లి వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు రోడ్డుపైనే బైఠాయించారు. దాదాపు 9గంటల పాటు అక్కడే ఆందోళన చేపట్టారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అక్కడికి చేరుకుని పెద్దారెడ్డికి సంఘీభావం తెలిపారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో అక్కడికి తరలివస్తుండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.సాయంత్రం 6 గంటల సమయంలో కేతిరెడ్డి పెద్దారెడ్డిని, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను బలవంతంగా అక్కడి నుంచి వెనక్కి పంపించారు. మరోవైపు తాడిపత్రి ఏఎస్పీ రోహిత్‌కుమార్ చౌదరి ఆధ్వర్యంలో పట్టణంలో పెద్దఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇళ్ల సమీపంలోని వీధుల్లోకి ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు, ఇనుప కంచెలు, వజ్ర వాహనాలు ఏర్పాటు చేశారు. అక్కడ ఇద్దరు, ముగ్గురు గుమికూడినా హెచ్చరికలు చేస్తూ వెళ్లిపోవాలని సూచించారు. ఇది అనాగరిక చర్య: గోరంట్ల మాధవ్ కోర్టు ఉత్తర్వులతో తాడిపత్రి వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకోవడాన్ని చూస్తే ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించడం లేదని స్పష్టమవుతోందని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. రాష్ట్రంలో కేవలం రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. ఒక మాజీ ఎమ్మెల్యేని తాడిపత్రిలో తిరగనివ్వకుండా, ఇంట్లో ఉండకుండా చేయడం అనాగరిక చర్య అని మండిపడ్డారు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్‌రెడ్డిని కంట్రోల్ చేయలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. జేసీ ఆదేశాలతోనే అడ్డుకుంటున్నారు: కేతిరెడ్డి జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆదేశాలతోనే పోలీసులు తనను అడ్డుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా పోలీసులు అడ్డుకోవడం తగదన్నారు. తాడిపత్రిలో మట్కా, గ్యాంబ్లింగ్ జరుగుతున్నాయని, వాటిని అరికట్టడంలో పోలీస్ అధికారులు విఫలమయ్యారన్నారు. తాను తాడిపత్రికి వెళితే జేసీ చేస్తున్న అవినీతి, అరాచకాలను బయట పెడతానన్న భయంతో అడ్డుకుంటున్నారన్నారు. జేసీ హంగామా కాగా.. సోమవారం తాడిపత్రిలోని రైల్వే బ్రిడ్జి సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన శివుడి విగ్రహాన్ని టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం నేరుగా ఆయన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి సమీపానికి వాహనాల్లో అనుచరులతో చేరుకుని.. అక్కడే ఉన్న పోలీసు అధికారులతో మాట్లాడుతూ హంగామా చేశారు. అక్కడి నుంచి తన అనుచరులతో కలిసి ఇంటివరకు నడుచుకుంటూ వెళ్లారు.కోర్టు ఉత్తర్వులపై ప్రభుత్వ అప్పీల్సాక్షి, అమరావతి: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన ఇంటికి వెళ్లి ఉండేందుకు తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచి్చన ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ధర్మాసనం ఎదుట సోమవారం అప్పీల్ దాఖలు చేసింది. ఈ అప్పీల్‌పై న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ జరపనుంది. -
జేసీ కోసమే పెద్దారెడ్డిని అడ్డుకున్నాం: పోలీసులు
అనంతపురం: తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి తన పంతం నెగ్గించుకున్నారు. వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రాకుండా పోలీసులు మళ్లీ అడ్డుకున్నారు. అయితే, హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి కార్యక్రమం ఉందనే కారణంగానే పెద్దారెడ్డిని అడ్డుకున్నట్టు పోలీసులు చెప్పడం గమనార్హం.తాజాగా డీఎస్పీ వెంకటేషులు మీడియాతో మాట్లాడుతూ.. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి కార్యక్రమం ఉంది. అందుకే నారాయణరెడ్డిపల్లి వద్ద కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకున్నాం. పెద్దారెడ్డి తాడిపత్రిలోకి వెళితే శాంతి భద్రతల సమస్య వస్తుంది. అన్ని విషయాలు హైకోర్టుకు విన్నవిస్తాం అని చెప్పుకొచ్చారు. దీంతో, జేసీ కోసమే పెద్దారెడ్డి అడ్డుకున్నట్టు పోలీసులు బహిరంగంగానే ప్రకంటించేశారు.మరోవైపు.. కేతిరెడ్డి పెద్దారెడ్డిపై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేతిరెడ్డి పెద్దారెడ్డి దమ్ముంటే తాడిపత్రికి రా.. తేల్చుకుందాం అంటూ సవాల్ విసిరారు. కేతిరెడ్డి పెద్దారెడ్డిపై నాకు ఎలాంటి కక్ష లేదు. ఎన్ని కోర్టు ఆదేశాలు తెచ్చినా కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి రావడానికి ఒప్పుకోబోమని స్పష్టం చేశారు.. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి రావడం కాదు.. ముందు అక్రమంగా నిర్మించిన ఆ ఇంటి సంగతి చూసుకోవాలి అంటూ హెచ్చరించారు. దీంతో, పెద్దారెడ్డి ఇంటిని కూల్చి ప్లాన్ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. పోలీసుల తీరుపై పెద్దారెడ్డి సహా వైఎస్సార్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలో పెద్దారెడ్డి మాట్లాడుతూ.. జేసీ ఆదేశాలను పోలీసులు అమలు చేస్తున్నారు. మరోసారి హైకోర్టును ఆశ్రయిస్తాను. పోలీసులకు జీతాలు ఇచ్చేది జేసీనా లేక ప్రభుత్వామా?. జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పినట్టే పోలీసులు పనిచేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలను పోలీసులు బేఖాతరు చేశారు. నేను గతంలో ఫ్యాక్షనిజం చేయలేదు. నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారు’ అని ప్రశ్నించారు.ఇక, తాడిపత్రికి బయలుదేరిన కేతిరెడ్డి పెద్దారెడ్డిని నారాయణరెడ్డిపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఐదు వాహనాల్లో తాడిపత్రి వెళ్తున్నప్పటికీ, హైకోర్టు ఆదేశాలు చూపించినా.. బారికేడ్లు పెట్టి ముందుకు వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. కాగా, 10-11 గంటల మధ్య తాడిపత్రి వెళ్లాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. కాలయాపన చేసి పెద్దారెడ్డిని తాడిపత్రి వెళ్లకుండా అడ్డుకునే కుట్రలు పోలీసులే చేయడం గమనార్హం. -
తాడిపత్రికి బయలుదేరిన పెద్దారెడ్డిని ఆపేసిన పోలీసుల
-
తాడిపత్రిలో ఉద్రిక్తత.. పోలీసుల తీరుపై పెద్దారెడ్డి ఆగ్రహం
సాక్షి, తాడిపత్రి: అనంతపురం జిల్లా నారాయణరెడ్డి పల్లిలో ఆరుగంటలుగా హైడ్రామా కొనసాగుతోంది. తిమ్మంపల్లి నుంచి తాడిపత్రి వెళ్తున్న వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని నారాయణరెడ్డిపల్లిలో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో నారాయణరెడ్డి పల్లిలోనే కేతిరెడ్డి పెద్దారెడ్డి రోడ్డుపై కుర్చీ వేసుకుని కూర్చున్నారు. అయితే,తన స్వగ్రామానికి వెళ్లకుండా అడ్డుకోవడంతో పోలీసులపై కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు,కేతిరెడ్డి పెద్దారెడ్డిపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై సంఘీభావం తెలిపేందుకు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ నారాయణరెడ్డి పల్లికి చేరుకున్నారు. రోడ్డుమీదే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సంఘీభావం తెలిపారు. ఆయనకు మద్దతుగా అక్కడే ఉన్నారు. దీంతో పోలీసులు గోరట్ల మాధవ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. అంతకుముందు.. తాడిపత్రిలో మరోసారి హై టెన్షన్ వాతావరణం నెలకొంది. వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నేడు తాడిపత్రికి వెళ్లనున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు కేతిరెడ్డి.. తాడిపత్రికి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కేతిరెడ్డి పెద్దారెడ్డిని మరోసారి అడ్డుకునేందుకు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కుట్రలు చేస్తున్నారు. మరోవైపు.. తాడిపత్రిలో పోలీసులు భారీగా మోహరించారు.వివరాల ప్రకారం.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈరోజు ఉదయం 10-11 గంటల మధ్య తాడిపత్రి వెళ్లాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. 14 మాసాల తర్వాత హైకోర్టు ఆదేశాలతో పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్తున్నారు. శింగనమల నియోజకవర్గం యల్లనూరు మండలం తిమ్మంపల్లి గ్రామం నుంచి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో కేతిరెడ్డికి పోలీసులు సెక్యూరిటీ ఇవ్వాల్సి ఉంది. దీంతో, తాడిపత్రిలో పోలీసు బలగాలు భారీగా మోహరించారు.తిమ్మంపల్లి నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి బయలుదేరారు. ఈ సందర్భంగా పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘హైకోర్టు తీర్పు చారిత్రాత్మకం. హైకోర్టు తీర్పు వల్లే 14 మాసాల తర్వాత తాడిపత్రికి వెళ్తున్నాను. హైకోర్టు ఆదేశాలు పోలీసులు పాటించాలి. పోలీసులపై నమ్మకం ఉంది. తాడిపత్రి నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటాను. వైఎస్సార్సీపీ శ్రేణులు సమన్వయం పాటించాలి. నన్ను కలిసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు రావద్దు. తాడిపత్రిలోని నా ఇంటి వద్ద 50-60 మంది మాత్రమే ఉండాలని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. హైకోర్టు నిబంధనలు పాటించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. తాడిపత్రి ప్రజల సమస్యలను తీర్చేందుకు కృషి చేస్తాను అని చెప్పుకొచ్చారు.మరోవైపు.. తాడిపత్రికి వస్తున్న పెద్దారెడ్డిని అడ్డుకునేందుకు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కుట్రలు చేస్తున్నారు. టీడీపీ కూటమి నేతలు, కార్యకర్తలు తాడిపత్రి పట్టణానికి రావాలని జేసీ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుత పరిణామాల కారణంగా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకునే అవకాశం ఉంది. -
Political Corridor: నా మాటే శాసనం..! తాడిపత్రిలో రెచ్చిపోతున్న జేసీ
-
జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులపై కేసు నమోదు
-
ఏందిరా నీ ఓవరాక్షన్.. నువ్వేం పీకలేవురా.. రేయ్
తాడిపత్రి టౌన్: ‘ఏందిరా నీ ఓవరాక్షన్ .. నువ్వేం పీకలేవు రా.. రేయ్’ అంటూ మూడు రోజుల క్రితం అనంతపురం నగరంలోని జెడ్పీ కార్యాలయం వద్ద జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) నాగరాజు నాయుడుపై తాడిపత్రి మునిసిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి బూతులతో రెచ్చిపోయిన విషయం విదితమే. దీనికి సంబంధించిన పూర్తిస్థాయి వీడియో శనివారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘జేసీ రౌడీయిజం.. రెడ్‌బుక్ పాలన’ శీర్షికతో ఆ వీడియోను ప్రజాస్వామ్యవాదులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఖండిస్తున్నారు. డీపీవో నాగరాజు నాయుడును ఉద్దేశించి...‘రేయ్ వాణ్ని పట్టుకో’ అంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరులను పురమాయించడం వీడియోలో ఉంది. ‘రేయ్ మర్యాద ఇచి్చన.. నువ్వు నోరు మూసుకో.. మూసుకో నా కొడకా.. లంచం దెం.. ఎప్పుడురా జాయింట్ కలెక్టర్ నీకిచి్చంది’ అనగానే డీపీవో నాగరాజు నాయుడు జేసీ వైపు చూశారు. దీంతో జేసీ ప్రభాకర్.. ‘ఏం అట్ల చూస్తావ్?! పీకలేవు రా రేయ్’ అంటూ దుర్భాషలాడుతూ కొట్టేవిధంగా డీపీవో మీదకు వెళ్తున్న జేసీ ప్రభాకర్‌రెడ్డిని అనుచరుడు పొట్టి రవి అడ్డుకోవడం కనిపించింది. -
రెడ్ బుక్ పాలన.. అధికారుల మీద జేసీ రౌడీయిజం
-
మా మామను ఆపుతారా? పెద్దారెడ్డి కోడలు మాస్ వార్నింగ్
-
తాడిపత్రిలో హైటెన్షన్.. కేతిరెడ్డి పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్
-
తాడిపత్రిలో మళ్లీ ఉద్రిక్తత.. జేసీ వర్గీయుల ఓవరాక్షన్
సాక్షి,అనంతపురం: తాడిపత్రిలో మరోసారి రాజకీయ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశాన్ని అడ్డుకునేందుకు జేసీ వర్గీయులు ప్రయత్నించబోయారు. ఈ క్రమంలో పోలీసుల జోక్యంతో పరిస్థితి ఒక్కసారి ఉద్రిక్తంగా మారింది. తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశం జరగాల్సి ఉంది. అయితే.. కేతిరెడ్డిని నియోజకవర్గంలో అడుగుపెట్టనివ్వనంటూ టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి సవాల్ చేసిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్లే పోలీసులు సైతం.. పెద్దారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు.అయినా జేసీ వర్గీయులు శాంతించలేదు. వైఎస్సార్సీపీ సమావేశ వేదిక వద్దకు జేసీ నివాసం నుంచి ర్యాలీగా బయల్దేరారు. ఈ క్రమంలో పరిస్థితి చేజారిపోయే అవకాశం ఉందని భావించిన పోలీసులు.. వాళ్లను అడ్డుకోగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అంతకు ముందు.. సమావేశానికి హాజరయ్యేందుకు పెద్దారెడ్డి స్వగ్రామం తిమ్మంపల్లి గ్రామం నుంచి తాడిపత్రి బయలుదేరారు. పెద్దారెడ్డి రాకపై అప్రమత్తమైన పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశానికి అనుమతి ఉందంటూనే.. పెద్దారెడ్డి మాత్రం వచ్చేందుకు వీలులేదని ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. పెద్దారెడ్డి మినహా మిగిలిన వైఎస్సార్సీపీ నేతలు కావచ్చంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.మరోవైపు, పెద్దారెడ్డి తాడిపత్రిలో ఉండేందుకు హైకోర్టు ఆదేశాలిచ్చింది. అయినప్పటికీ తనపై పోలీసులు ఆంక్షలు ఎందుకు విధిస్తున్నారని కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి నేనంటే భయం: కేతిరెడ్డి పెద్దారెడ్డిటీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి నన్ను చూసి భయపడుతున్నారు. అందుకే పోలీసుల ద్వారా నన్ను అడ్డుకుంటున్నారు. హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా పోలీసులు జేసీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.తాడిపత్రిలో ప్రజాస్వామ్యం ఖూనీ తాడిపత్రిలో వైఎస్సార్సీపీ సమావేశానికి వెళ్తున్న తనను అడ్డుకోవడం దుర్మార్గం.18వ తేదీన అనుమతిచ్చి.. ఇప్పుడు వెళ్లొద్దంటే ఎలా?. తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చి మూడు మాసాలవుతోంది. తాడిపత్రి వెళ్లేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుమతి కావాలా?తాడిపత్రిలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. -
అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి గూండాగిరి
-
తాడిపత్రికి వెళ్లాలి.. ఎస్పీకి పెద్దారెడ్డి లేఖ
సాక్షి, అనంతపురం: వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు మరోసారి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో తాడిపత్రికి వచ్చేందుకు అనుమతి కోరుతూ ఎస్పీ జగదీష్‌కు తాజాగా కేతిరెడ్డి పెద్దారెడ్డి లేఖ రాశారు. దీంతో, ఎస్పీ జగదీష్ ఈసారైన అనుమతి ఇస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది.అనంతపురం ఎస్పీ జగదీష్‌కు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి లేఖ రాశారు. ఈ సందర్బంగా రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని తాడిపత్రి నియోజకవర్గంలో నిర్వహించాలి.. అందుకు తాను తాడిపత్రికి రావాల్సి ఉందని.. అనుమతి ఇవ్వాలని ఎస్పీని లేఖలో కోరారు. అయితే, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు ఏప్రిల్ 30వ తేదీన హైకోర్టు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లినప్పుడు తగిన భద్రత కల్పించాలని పోలీసు శాఖకు హైకోర్టు సూచించింది. కానీ, అనంతపురం పోలీసులు మాత్రం హైకోర్టు ఆదేశాలను అమలు చేయడం లేదు. ఈ నేపథ్యంలో మరోసారి ఎస్పీకి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి లేఖ రాశారు.ఇదిలా ఉండగా.. ఇటీవల పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన నివాసానికి వెళ్లారు. పెద్దారెడ్డి రాకపై సమాచారం అందుకున్న పోలీసులు తాడిపత్రిలోని తన నివాసంలో బలవంతంగా అరెస్ట్ చేశారు. తాడిపత్రిలో ఉండరాదంటూ ఆంక్షలు విధించారు. అనంతరం, అనంతపురం రాంనగర్లో తన నివాసంలో పెద్దారెడ్డిని వదిలి పెట్టారు. ఈ ఘటనలో పోలీసుల తీరుపై కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తన ఇంటికి తాను వెళితే పోలీసులకు ఇబ్బంది ఏంటి?. పోలీసులకు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుమతి కావాలా?. తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గూండాగిరిని ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కొంటా. జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాలను పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు గుప్పించారు.జేసీ ప్రభాకర్‌రెడ్డి ఓవరాక్షన్.. ‘ఈ రోజు నీ దగ్గరకు వచ్చిన వైఎస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలను రప్పా.. రప్పాలాడిస్తాం. చేతనైతే కాపాడుకో కేతిరెడ్డీ’ అంటూ టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్పర్సన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తాడిపత్రిలో వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత జేసీ తన ఇంటివద్ద విలేకరులతో మాట్లాడారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి వెంట ఎవరెవరు వచ్చారో వారి జాబితా, ఫొటోలు తనవద్ద ఉన్నాయని, వారిని ఇకపై టీడీపీ కార్యకర్తలు రప్పా.. రప్పాలాడిస్తారని అన్నారు. తాడిపత్రిలోని వైఎస్సార్సీపీ వాళ్లు శత్రువులు కాదంటూనే ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఈరోజు మా వాళ్లను గట్టిగా పట్టుకుని కూర్చున్నా. రేపటి నుంచి నేను ఊళ్లో ఉండను. ఓ వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్త చాలా మాట్లాడుతోంది. మా మహిళా కార్యకర్తలూ ఉన్నారు’ అని జేసీ రెచ్చిపోయారు. -
అడ్డొస్తే కాల్చేస్తా!
సాక్షి టాస్క్‌ఫోర్స్: టీడీపీ నేతల అండతో అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ సీఐ సాయిప్రసాద్ చెలరేగిపోతున్నారు. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోని సొంతింటికి రాగా.. పోలీసులు ఆదివారం ఆయన్ని బలవంతంగా అనంతపురానికి తరలించిన సంగతి తెలిసిందే.సీఐ సాయిప్రసాద్ పోలీస్ వాహనంలో పెద్దారెడ్డిని తరలిస్తుండగా.. ఆయన అనుచరులు అనుసరించారు. దీంతో సీఐ తన రివాల్వర్ తీసి.. ‘కాల్చేస్తా’ అన్నట్లుగా వారిని బెదిరించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
అడ్డొస్తే కాల్చేస్తా.. తాడిపత్రి సీఐ ఓవర్ యాక్షన్
-
జేసీ వర్గీయుల దాష్టీకం.. వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్లపై దాడి
సాక్షి, అనంతపురం జిల్లా: రాష్ట్రంలో టీడీపీ నేతల అరాచకాలు ఆగడం లేదు. తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులు దాష్టీకానికి దిగారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు రామకృష్ణ, రేవతి ఇళ్లపై దాడి చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్త రామకృష్ణ కిరాణా షాపును జేసీ వర్గీయులు ధ్వంసం చేశారు. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి మద్దతు ఇవ్వొద్దని జేసీ నిన్న వార్నింగ్ ఇచ్చారు. మద్దతు ఇచ్చిన వారిపై జేసీ వర్గీయులు దాడులకు తెగబడ్డారు.కాగా, ఆదివారం తాడిపత్రిలో వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్పర్సన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘ఈ రోజు నీ దగ్గరకు వచ్చిన వైఎస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలను రప్పా.. రప్పాలాడిస్తాం. చేతనైతే కాపాడుకో కేతిరెడ్డీ’ అంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు.కేతిరెడ్డి పెద్దారెడ్డి వెంట ఎవరెవరు వచ్చారో వారి జాబితా, ఫొటోలు తనవద్ద ఉన్నాయని, వారిని ఇకపై టీడీపీ కార్యకర్తలు రప్పా.. రప్పాలాడిస్తారని అన్నారు. తాడిపత్రిలోని వైఎస్సార్సీపీ వాళ్లు శత్రువులు కాదంటూనే ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఈ రోజు మా వాళ్లను గట్టిగా పట్టుకుని కూర్చున్నా. రేపటి నుంచి నేను ఊళ్లో ఉండను. ఓ వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్త చాలా మాట్లాడుతోంది. మా మహిళా కార్యకర్తలూ ఉన్నారు.’ అంటూ జేసీ వ్యాఖ్యానించారు. -
YSRCP కార్యకర్తలకు గన్ చూపిన సీఐ సాయి ప్రతాప్
-
తాడిపత్రిలో జేసీ దౌర్జన్యం.. ఎస్పీకి వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో జరుగుతున్న పరిణామాలపై ఫిర్యాదు చేసేందుకు వైఎస్సార్సీపీ నేతల బృందం అనంతపురం ఎస్పీ జగదీష్‌ను కలిసింది. ఈ సందర్భంగా ఎస్పీకి తాడిపత్రిలోని పరిస్థితులను వివరించారు. తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అరాచకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. పెద్దారెడ్డి విషయంలో హైకోర్టు ఆదేశాలు పాటించాలని వినతి పత్రం అందజేశారు. ఎస్పీని కలిసిన వారిలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, వై. విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఉన్నారు.అనంతరం, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ..‘తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై రాజకీయ కక్ష సాధింపు చర్యలు దుర్మార్గం. హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా పోలీసులు పట్టించుకోకపోవడం లేదు. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. తాడిపత్రి నియోజకవర్గంలో ఆ కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. పెద్దారెడ్డిని తాడిపత్రి నియోజకవర్గంలోకి వెంటనే అనుమతించాలి. తాడిపత్రిలో నియంత పాలన జరుగుతోంది. పెద్దారెడ్డిపై ఆంక్షలు ఉంటే లిఖితపూర్వకంగా ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు.మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ..‘నేను తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. తగిన భద్రత కల్పించాలని రెండు మాసాల కిందటే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్సీపీ కార్యకర్తలను రపా.. రపా.. నరుకుతానంటూ జేసీ బెదిరిస్తున్నారు. నాకు మద్దతుగా నిలిచిన వారిపై దాడులు జరుగుతున్నాయి. హింసకు పాల్పడుతున్న టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. జేసీ ప్రభాకర్ రెడ్డి దుక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాడిపత్రిలో ప్రశాంత వాతావరణం ఉండేది. కేవలం మున్సిపల్ చైర్మన్ జేసీ చెబితే పోలీసులు నడుచుకోవటం హాస్యాస్పదం. నాపై చేస్తున్న ఆరోపణలపై జేసీ ప్రభాకర్ రెడ్డితో బహిరంగ చర్చకు సిద్ధం’ అని సవాల్ విసిరారు.మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ..‘మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని వెంటనే తాడిపత్రిలోకి అనుమతించాలి. హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా పోలీసులు అమలు చేయకపోవడం దుర్మార్గం. పెద్దారెడ్డి వల్ల లా అండ్ ఆర్డర్ సమస్య రాదు. జేసీ ప్రభాకర్ రెడ్డి, టీడీపీ నేతల దౌర్జన్యాలు దేనికి నిదర్శనం. ఓ మాజీ ఎమ్మెల్యేని ఏడాది కాలంగా అడ్డుకోవడం దేశంలో ఎక్కడైనా ఉందా?. చంద్రబాబు, లోకేష్ ఆదేశాలతో తాడిపత్రిలో నిరంకుశ పాలన జరుగుతోంది. కేతిరెడ్డి పెద్దారెడ్డికి జరుగుతున్న అన్యాయంపై ఉద్యమిస్తాం’ అని అన్నారు.మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ..‘తాడిపత్రిలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. పెద్దారెడ్డికి మద్దతు ఇచ్చే వారిని రప్పా.. రప్పా.. నరుకుతానని జేసీ ప్రభాకర్ రెడ్డి బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు. తాడిపత్రిలో హింసా రాజకీయాలు చేస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఎందుకు కఠిన చర్యలు తీసుకోలేదు. టీడీపీ నేతల దౌర్జన్యాలు, దాడులను పోలీసులు పట్టించుకోరా?. పెద్దారెడ్డి తాడిపత్రిలోని ఆయన ఇంటికి వెళితే పోలీసులకు అభ్యంతరం ఏంటి?. హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలి’ అని డిమాండ్ చేశారు. -
పెద్దారెడ్డితో ఉంటారా.. వాళ్ల సంగతి చూస్తా: జేసీ వార్నింగ్
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో రెడ్‌బుక్ రాజ్యాంగం రాజ్యమేలుతోంది. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేసి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్ ఇవ్వడం తీవ్ర కలకలం సృష్టించింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వెంట ఎవరూ తిరగొద్దు. పెద్దారెడ్డికి మద్దతుగా ఉండే వారిని గుర్తిస్తాం.. ఫోటోలు తీస్తున్నాం. పెద్దారెడ్డిని మద్దతు ఇచ్చే వారిని రప్పా..రప్పా.. అని నరికేస్తాం’ అని కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై ప్రజలు, వైఎస్సార్సీపీ నేతలు మండిపతున్నారు.ఇదిలా ఉండగా.. ఆదివారం ఉదయం నుంచి తాడిపత్రిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏడాది తర్వాత పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన నివాసానికి వెళ్లారు. అయితే, పెద్దారెడ్డి రాకపై సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం ఉదయం తాడిపత్రిలోని తన నివాసంలో బలవంతంగా అరెస్ట్ చేశారు. తాడిపత్రిలో ఉండరాదంటూ ఆంక్షలు విధించారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ పెద్దారెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. అనంతరం పెద్దారెడ్డిని అనంతపురం తరలించారు.ఈ సందర్బంగా పెద్దారెడ్డి మాట్లాడుతూ..‘పోలీసులు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. నేను తాడిపత్రి వెళ్లొచ్చని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నా ఇంటికి నేను వెళితే పోలీసులకు ఇబ్బంది ఏంటి?. పోలీసులకు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుమతి కావాలా?.తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గూండాగిరిని ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కొంటాను. జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాలను పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు గుప్పించారు. మరోవైపు.. టీడీపీ జేసీ, పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ నేతలను ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మాజీ మంత్రి శైలజానాథ్ కామెంట్స్..పోలీసుల తీరును ఖండిస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. తాడిపత్రి వెళ్లిన పెద్దారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు?. పెద్దారెడ్డిపై పోలీసుల ఆంక్షలు ఎందుకు?. ఓ మాజీ ఎమ్మెల్యేని లాక్కొని వస్తారా?. ఇప్పటికైనా పోలీసులు చట్టాన్ని కాపాడాలి. పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అనుమతించాలి. ఎస్పీ జగదీష్ బాధ్యతగా ప్రవర్తించాలి.. ఏకపక్షంగా వ్యవహరించవద్దు.మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కామెంట్స్..ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేసిన రాక్షస ప్రభుత్వం మెడలు వంచి హామీలను నెరవేర్చేంతవరకు పోరాడతాం. బాండ్లు ఇచ్చి మరీ హామీ ఇచ్చారు.. ఇచ్చిన హామీలు ఏమయ్యాయి. ప్రజలను మోసం చేసిన చంద్రబాబుపై ఫిర్యాదు చేస్తాం. పోలీసులు కేసు నమోదు చేస్తారా?. రాజ్యాంగ విరుద్ధంగా రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైఎస్సార్సీపీ నాయకులను పీడిస్తున్నారు. బనగానపల్లె నియోజకవర్గంలో మైనింగ్ వ్యాపారులను బెదిరించి , కేసులు , జరిమానాలు వేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. -
‘తాడిపత్రిలో ఆటవిక రాజ్యం.. పోలీసులు అడ్డుకోవడమేంటి?’
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో ఆటవిక రాజ్యం నడుస్తోందని ఆరోపించారు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి. తాడిపత్రి వెళ్లిన పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల వైఖరి మారకపోతే ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం అని హెచ్చరించారు.వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. పెద్దారెడ్డికి తగిన భద్రత కల్పించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలు వచ్చి రెండు మాసాలైనా పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. ఈరోజు ఉదయం తాడిపత్రి వెళ్లిన పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం. పోలీసులు రాజ్యాంగ బద్దంగా వ్యవహరించటం లేదు.మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లొద్దని ఏవైనా ఆదేశాలు ఉన్నాయా?. మాజీ ఎమ్మెల్యేని తాడిపత్రిలోకి అనుమతించకపోవడం ఏం న్యాయం?. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం దుర్మార్గం. పోలీసుల వైఖరి మారకపోతే ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తాం’ అని చెప్పుకొచ్చారు. -
తాడిపత్రిలో హై టెన్షన్.. పెద్దారెడ్డిని లాక్కెళ్లిన పోలీసులు
-
పెద్దారెడ్డి ఇంటి కూల్చివేతకు కూటమి కుట్ర!
సాక్షి, అనంతపురం: వైఎస్సార్సీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్య కొనసాగుతోంది. ఇప్పటికే ఆయనను తాడిపత్రిలో అడుగుపెట్టకుండా అడ్డుకుంటున్న కూటమి నేతలు.. తాజాగా ఆయన ఇంటిని టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. పెద్దారెడ్డి ఇంటి వద్ద తాజాగా మున్సిపల్ శాఖ అధికారులు కొలతలు తీసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.వివరాల ప్రకారం.. తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కూటమి కక్ష సాధింపు పీక్ స్టేజ్‌కు చేరుకుంది. పెద్దారెడ్డిని టార్గెట్ చేసి అధికారులు, టీడీపీ నేతలు రాజీకీయంగా వేధింపులకు గురిచేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ స్థానిక టీడీపీ నేతలు, పోలీసులు.. ఇప్పటికీ ఆయనను తాడిపత్రిలో అడుగుపెట్టనివ్వడం లేదు. ఇక, తాజాగా తాడిపత్రిలో మున్సిపల్ అధికారులు తనిఖీలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఈరోజు పెద్దారెడ్డి ఇంటి వద్దకు వెళ్లిన అధికారులు.. అక్కడ టేపుతో కొలతలు తీసుకున్నారు. ఇంటి ముందు, పరిసరాల్లో కొలతలు చేపట్టారు. అయితే, మున్సిపల్ స్థలం ఆక్రమించారనే ఫిర్యాదు మేరకు తాము కొలతలు చేపట్టినట్టు అధికారులు చెప్పారు. అయితే, వారి మాటలకు చేతలకు పొంతన కనిపించలేదు. దీంతో, స్థానిక వైఎస్సార్సీపీ నేతలు, ప్రజలు మాత్రం పెద్దారెడ్డి ఇంటిని కూల్చివేసేందుకు కుట్రలు చేస్తున్నట్టు ఆరోపిస్తున్నారు. -
తాడిపత్రిలో మరోసారి పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులు
-
‘నన్ను చూసి జేసీ ప్రభాకర్ రెడ్డి భయపడుతున్నారు’
సాక్షి, అనంతపురం: హైకోర్టు ఆదేశాలను ఏపీ పోలీసులు అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కనుసన్నల్లో పోలీసులు పనిచేస్తున్నారని ఆరోపించారు. అలాగే, తనను చూసి జేసీ ప్రభాకర్ రెడ్డి భయపడుతున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు.తాడిపత్రికి వెళ్లకుండా పోలీసులు.. తనను అడ్డుకోవడం పట్ల కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యకం చేశారు. అనంతరం, ఆయన మాట్లాడుతూ.. ‘నేను తాడిపత్రి వెళితే భద్రత కల్పించాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. విశాఖలో ప్రధాన మంత్రి పర్యటన ఉందని.. భద్రత కల్పించలేమని ఎస్పీ జగదీష్ వివరణ ఇస్తున్నారు. ఇప్పటికే ఏడెనిమిది సార్లు నేను తాడిపత్రి పర్యటన వాయిదా వేసుకున్నా. నాకు తాడిపత్రిలో సొంత ఇళ్లు ఉంది.. నా ఇంటికి నేను వెళ్తానంటుంటే పోలీసులు అడ్డుపడుతున్నారు. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కనుసన్నల్లో పోలీసులు పనిచేస్తున్నారు. నన్ను చూసి జేసీ ప్రభాకర్ రెడ్డి భయపడుతున్నారునేను తాడిపత్రి వస్తానని తెలిసిన ప్రతిసారీ.. రౌడీలు, గూండాలు ఉన్న ప్రైవేటు సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. తాడిపత్రిలో టీడీపీ గూండాలు మారణాయుధాలతో సంచరిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. తాడిపత్రిలో ఐపీఎస్ అధికారి విధులు నిర్వహిస్తున్నా ఏం ప్రయోజనం లేదు. విచ్చలవిడిగా గంజాయి, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. నేను తాడిపత్రి వెళితే టీడీపీ నేతల అక్రమాల దందా సాగదని జేసీ భయపడుతున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు.ఇదిలా ఉండగా.. శనివారం ఉదయమే తాడిపత్రి వెళ్లేందుకు కేతిరెడ్ఢి పెద్దారెడ్డి బయలుదేరారు. వెంటనే ఆయన వద్దకు చేరుకున్న పోలీసులు.. శింగనమల నియోజకవర్గం యల్లనూరు మండలం తిమ్మంపల్లి గ్రామంలో పెద్దారెడ్డిని అడ్డుకున్నారు. పోలీసులు వాహనాలు అడ్డుపెట్టి మరీ పెద్దారెడ్డిని అడ్డుకోవడం గమనార్హం. ఈ సందర్బంగా పోలీసులు తీరుపై కేతిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ పోలీసులు.. ఎందుకు అడ్డుకుంటున్నారని.. ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నించారు. -
తాడిపత్రిలో టెన్షన్.. పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులు
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం తాడిపత్రి వెళ్లేందుకు బయలుదేరిన కేతిరెడ్ఢి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకోవడం చర్చకు దారి తీసింది. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా పోలీసులు.. ఆయనతో అనుచితంగా ప్రవర్తించినట్టు సమాచారం. తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శనివారం ఉదయమే తాడిపత్రి వెళ్లేందుకు కేతిరెడ్ఢి పెద్దారెడ్డి బయలుదేరారు. వెంటనే ఆయన వద్దకు చేరుకున్న పోలీసులు.. శింగనమల నియోజకవర్గం యల్లనూరు మండలం తిమ్మంపల్లి గ్రామంలో పెద్దారెడ్డిని అడ్డుకున్నారు. పోలీసులు వాహనాలు అడ్డుపెట్టి మరీ పెద్దారెడ్డిని అడ్డుకోవడం గమనార్హం. ఈ సందర్బంగా పోలీసులు తీరుపై కేతిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ పోలీసులు.. ఎందుకు అడ్డుకుంటున్నారని.. ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నించారు.ఇదిలా ఉండగా.. తాడిపత్రి వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్సీ కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ, పోలీసులు మాత్రం హైకోర్టు ఆదేశాలను అమలు చేయడం లేదు. కేతిరెడ్డిని తాడిపత్రికి వెళ్లనివ్వడం లేదు. ఇప్పటి వరకు కేతిరెడ్డి.. తాడిపత్రికి వెళ్లకుండా పోలీసులు మూడు సార్లు అడ్డుకున్నారు. మరోవైపు.. పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే దాడులు చేసేందుకు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు సిద్ధంగా ఉన్నారు. పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే.. కచ్చితంగా దాడులు చేస్తామని గతంలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు. -
వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టమే..: జేసీ ప్రభాకర్‌రెడ్డి
తాడిపత్రి టౌన్: సంక్షేమ పథకాలు రావడం లేదంటూ ప్రజలు తిడుతున్నారని, వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టంగానే ఉంటుందని అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తాడిపత్రి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో బుధవారం వైరల్‌గా మారాయి. ప్రతిరోజూ.. తాడిపత్రిలో పర్యటిస్తున్నామని, ప్రభుత్వ పథకాలు రాలేదని ప్రజలు మమ్మల్ని తిడుతున్నారని ఆయనన్నారు. గత ప్రభుత్వంలో అమ్మఒడి.. అదీ ఇదీ అని 15 వేలు ప్రజలకు నేరుగా డబ్బులు జేబులో పడేవని, ఇప్పుడు డబ్బులు అందకపోవడంతో నాయకులను ప్రజలు తిడుతున్నారని జేసీ చెప్పారు. ‘రోడ్లు బాగా లేకుండాలేవు. నీళ్లు తక్కువేమీ లేవు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ బాగా చేశాం. అయినా ప్రజలకు కావాల్సింది ఏమిటంటే.. నేరుగా డబ్బులు జేబులోకి చక్కగా పడాలి. ఒక్కనికీ బుద్ధిలేదు. ఈ జనాలకు బుద్ధిలేద’ని ప్రభాకర్‌రెడ్డి ఆవేశంగా అన్నారు. తాడిపత్రి నియోజకవర్గంలోని దాదాపు 43 కిలోమీటర్ల మేర పెన్నానదిలో ఇసుకను ఇష్టమొచ్చినట్లు ఎవ్వరు పడితే వాళ్లు తవ్వుకుని అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. తాము కూడా ఈసారి ఓపెన్‌గానే ఇసుక అమ్ముదామనుకుంటున్నానని జేసీ వ్యాఖ్యానించారు. -
YSRCP హయాంలో ఈ తరహా రాజకీయాలు చేయలేదు: YS Jagan
-
కేతిరెడ్డి పెద్దారెడ్డికి లేఖ.. వివాదాస్పదంగా తాడిపత్రి ఎస్పీ తీరు!
సాక్షి, అనంతపురం: వైఎస్సార్సీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విషయంలో పోలీసులు మరోసారి చేతులెత్తేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డికి రక్షణ కల్పించలేమని స్వయంగా ఎస్పీ జగదీష్ లేఖ రాశారు. ఈ క్రమంలో తాడిపత్రి పర్యటనను వారం లేదా పది రోజులు వాయిదా వేసుకోవాలని ఎస్పీ జగదీష్ సూచించడం గమనార్హం.ఏపీలో కూటమి సర్కార్ పాలనలో పోలీసులు తీరు వివాదాస్పదంగా మారుతోంది. ఇప్పటకే ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నేతలను అక్రమ కేసులతో టార్గెట్ చేసి అరెస్ట్ చేస్తుండగా.. మరోవైపు, భద్రత కల్పించడంలో కూడా పోలీసులు విఫలమవుతున్నారు. తాజాగా కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఎస్పీ జగదీష్ రెండోసారి లేఖ రాశారు. లేఖలో పెద్దారెడ్డికి రక్షణ కల్పించలేమని తెలిపారు. తాడిపత్రి పర్యటనను వారం లేదా పది రోజులు వాయిదా వేసుకోవాలని మాజీ ఎమ్మెల్యేకు సూచించారు. టీడీపీ మహానాడు, రాప్తాడు జంట హత్యలు, ఎంపీపీ ఉప ఎన్నికల దృష్ట్యా భద్రత కల్పించలేమని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి తాడిపత్రి వెళ్లేందుకు భద్రత కల్పించాలని ఇప్పటికే హైకోర్టు ఆదేలిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెద్దారెడ్డి తాను తాడిపత్రి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఇప్పటికే ఎస్పీకి తెలిపారు. అయిన్పటికీ ఎస్పీ ఇదే తీరుగా వ్యవహరిస్తూ వివాదంలో చిక్కుకుంటున్నారు. వివిధ కారణాలు చూపి భద్రత కల్పించలేమని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక, అంతకుముందు కూడా పెద్దారెడ్డి తాడిపత్రి పర్యటనకు భద్రత కల్పించలేమంటూ చేతులెత్తేశారు ఎస్పీ జగదీష్. ఈ నెల తొమ్మిదో తేదీన సీఎం చంద్రబాబు పర్యటన ఉన్నందున భద్రత ఇవ్వలేమని ఎస్పీ తెలిపారు. ఎస్పీ లేఖతో పెద్దారెడ్డి తాడిపత్రి పర్యటన వాయిదా పడింది.మరోవైపు.. తాడిపత్రి వస్తే అంతుచూస్తామంటూ తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పదేపదే బెదిరిస్తున్నారు. పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లడానికి హైకోర్టు అనుమతి ఇచ్చినా.. తాను మాత్రం దాడులు చేస్తానని జేసీ బహిరంగంగా సవాల్ చేశారు. పెద్దారెడ్డికి ఎవరూ మద్దత ఇవ్వొద్దని, తనకు పెద్దారెడ్డితో గొడవలు ఉన్నాయని, ఒకవేళ వస్తే తిరిగి వెళ్లడు అంటూ వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తాడిపత్రి వెళ్లడానికి హైకోర్టు అనుమతిచ్చిన క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇలా వ్యాఖ్యానించడం ఏంటో అర్థం కావడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. -
పెద్దారెడ్డికి భద్రత కల్పించలేం: ఎస్పీ
అనంతపురం: తన స్వగ్రామమైన తాడిపత్రికి రావడానికి భద్రత కోరుతూ జిల్లా ఎస్పీ జగదీష్ కు లేఖ రాశారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. అయితే పెద్దారెడ్డి తాడిపత్రి పర్యటనకు భద్రత కల్పించలేమంటూ చేతులెత్తేశారు ఎస్పీ. ఈ నెల9వ తేదీన సీఎం చంద్రబాబు పర్యటన ఉన్నందున భద్రత ఇవ్వలేమని ఎస్పీ తెలిపారు. ఎస్పీ లేఖతో పెద్దారెడ్డి తాడిపత్రి పర్యటన వాయిదా పడింది. సీఎం పర్యటన అనంతరం పోలీస్ భద్రతతో కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లే అవకాశం ఉంది.కాగా, కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లడానికి హైకోర్టు అనుమతిచ్చినా ఆయన ఇంకా అక్కడకి వెళ్లలేకపోయారు. పెద్దారెడ్డి తాడిపత్రలో అడుగుపెడితే అంటూ టీడీపీ టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తొడలు కొడుతున్నారు.పెద్దారెడ్డి తాడిపత్రి వస్తే తిరిగి వెళ్లడు అంటూ రెండు రోజుల క్రితం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. . పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లడానికి హైకోర్టు అనుమతి ఇచ్చినా... తాను మాత్రం దాడులు చేస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి బహిరంగంగా సవాల్ చేశారు.పెద్దారెడ్డికి ఎవరూ మద్దత ఇవ్వొద్దని, తనకు పెద్దారెడ్డితో గొడవలు ఉన్నాయని, ఒకవేళ వస్తే తిరిగి వెళ్లడు అంటూ వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తాడిపత్రి వెళ్లడానికి హైకోర్టు అనుమతిచ్చిన క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇలా వ్యాఖ్యానించడం ఏంటో అర్థం కావడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. -
తాడిపత్రిలో టెన్షన్.. ఎస్పీ జగదీష్ తీరుపై చర్చ
సాక్షి, అనంతపురం: అనంతపురం ఎస్పీ జగదీష్ వివాదం చిక్కుకున్నారు. తాడిపత్రి వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ పోలీసులు మాత్రం ఓవరాక్షన్ చేస్తున్నారు. హైకోర్టు ఉత్తర్వులను అందజేసేందుకు ఎస్పీ జగదీష్‌ను కలిసేందుకు పెద్దారెడ్డి ప్రయత్నించినప్పటికీ ఆయన జాప్యం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈనెల ఎనిమిదో తేదీన తాడిపత్రికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. తాడిపత్రికి వెళ్తున్నట్టు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తాను తాడిపత్రి వెళ్తేందుకు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఎస్పీ జగదీష్‌కు ఇచ్చేందుకు పెద్దారెడ్డి అపాయింమెంట్ తీసుకున్నారు. కానీ, పెద్దారెడ్డి మాత్రం ఎస్పీ అపాయింట్మెంట్కు అనుమతి ఇవ్వలేదు. గత మూడు రోజులుగా అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఎస్పీ జగదీష్ జాప్యం చేస్తున్నారు. ఈ క్రమంలో డీఐజీ, ఎస్పీలకు వాట్సాప్ ద్వారా పెద్దారెడ్డి సమాచారం అందించారు. ఈనెల 8వ తేదీన తాడిపత్రి వెళ్తున్నట్లు స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు భద్రత కల్పించాలని కోరారు. ఇక, పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్తున్న నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత నెలకునే అవకాశం ఉంది.ఇదిలా ఉండగా.. గత సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఘర్షణల కారణంగా పెద్దారెడ్డితో పాటు జేసీ ప్రభాకర్ రెడ్డిలు తాడిపత్రికి వెళ్లకూడదని నిబంధన విధించారు. అయితే, ఎన్నికల కౌంటింగ్ అనంతరం ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి వెళ్లారు. ఈ క్రమంలోనే కేతిరెడ్డి పెద్దారెడ్డి పట్టణానికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు నిలువరించారు. దీంతో పెద్దారెడ్డి హైకోర్టును ఆశ్రయించగా.. తాడిపత్రికి వెళ్లడానికి ఇటీవల న్యాయస్థానం అనుమతించింది. ఆయనకు తగిన భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది.మరోవైపు.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇవ్వడాన్ని జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గం జీర్ణించుకోలేకపోతోంది. ఎలాగైనా పెద్దారెడ్డిని తాడిపత్రిలో అడుగుపెట్టనీయకూడదన్న ఉద్దేశంతో దాడులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటి ఎదురుగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి సమీపంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆట స్థలంలో జేసీ అనుచరులు టిప్పర్లతో నాపరాళ్ల వ్యర్థాలను కుప్పలుగా వదిలారు. రాళ్లదాడి చేసేందుకే జేసీ ప్రభాకర్‌రెడ్డి తన అనుచరులతో ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని పట్టణంతో తీవ్ర చర్చ జరుగుతోంది. -
కేతిరెడ్డి ఇంటిని కూల్చేస్తా.. జేసీ ప్రభాకర్ బరితెగింపు
సాక్షి, అనంతపురం: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. అధికారంలో ఉన్నారనే కారణంగా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు తాజాగా తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఓవరాక్షన్‌కు దిగారు. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిని కూల్చివేస్తామని వార్నింగ్ ఇచ్చారు. దీంతో, ఆయన వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి బరితెగింపు చర్యలకు దిగారు. వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిని కూల్చివేస్తానని వార్నింగ్ ఇవ్వడం తీవ్ర కలకలం సృష్టించింది. తాడిపత్రిలో వైఎస్సార్సీపీకి చెందిన ఆరుగురు నేతల ఇళ్లను స్వయంగా తానే కూల్చివేస్తానని జేసీ ప్రభాకర్ హెచ్చరించారు. స్వయంగా ఆర్డీవో కేశవ్ నాయుడు ఎదుటే జేసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అలాగే, పోలీసుల వైఫల్యం వల్లే తాడిపత్రిలో రాళ్ల దాడి జరిగిందని జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుంటాను అంటూ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. దీంతో, జేసీ వ్యాఖ్యలు, ఆయన తీరు తీవ్ర దుమారం రేపుతోంది. ఇంతా జరిగినా పోలీసులు స్పందించకపోవడం విశేషం. -
తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైఎస్సార్సీపీ నేత ఇంటిపై టీడీపీ నేతల దాడి
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేస్తూ టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. తాజాగా, వైఎస్సార్సీపీ నేత ఫయాజ్ బాషా ఇంటిపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి దాడి చేయించారు.వైఎస్సార్ సీపీ నేత ఫయాజ్ బాషా.. తాడిపత్రిలో నూతనంగా ఇంటిని నిర్మించుకోగా, అన్ని అనుమతులు ఉన్నా కానీ టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. వందలాది మంది అనుచరులతో ఫయాజ్ బాషా ఇంటిపై దాడికి తెగబడ్డారు. వైఎస్సార్ సీపీ నేత ఫయాజ్ బాషా ఇంటిపై జేసీ.. రాళ్లతో దాడి చేయించారు. టీడీపీ నేతలను అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారు. -
నటి మాధవీలతపై కేసు నమోదు
-
మాధవీలతపై కేసు.. ‘జేసీ’ ఆదేశాలతోనే..?
సాక్షి,అనంతపురం: సినీ నటి మాధవీలతపై తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. మాధవీలత తనపై కించపరిచే వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేత, మాల కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ తాడిపత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెక్షన్ 353 కింద మాధవీలతపై పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆదేశాలతోనే మాధవీలతపై కేసు నమోదు చేశారని తాడిపత్రి లో చర్చ జరుగుతోంది.గతంలో తనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగాను జేసీ ప్రభాకర్‌రెడ్డిపై మాధవీలత హైదరాబాద్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులతో పాటు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లోనూ మాధవీలత జేసీపై కంప్లైంట్ ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలకుగాను మాధవీలతకు జేసీ ఒక దశలో క్షమాపణలు కూడా చెప్పారు. అయినా వీరి మధ్య వివాదం కొనసాగుతోంది. -
జేసీ ప్రభాకర్ రెడ్డి అత్యుత్సాహం
-
అప్పేచర్లలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడి
-
తాడిపత్రిలో ఇంత దారుణమా..
-
జేసీ కక్ష.. తాడిపత్రిలో వైఎస్సార్సీపీ నేత ఇల్లు కూల్చివేత
సాక్షి, అనంతపురం జిల్లా: తాడిపత్రి వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. వైఎస్సార్ సీపీ నేత రమేష్ రెడ్డి ఇంటిని మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. అన్ని అనుమతులు ఉన్నా కానీ రమేష్ రెడ్డి ఇంటిని కూల్చేశారు. మునిసిపల్ అధికారుల తీరుపై వైఎస్సార్సీపీ నేత రమేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని రమేష్ రెడ్డి మండిపడ్డారు.వైఎస్సార్సీపీ కార్యకర్త పొలానికి మళ్లీ నిప్పు మరో ఘటనలో రాప్తాడు మండలంలోని పుల్లలరేవు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు పెద్ద ఓబులేష్, వసంత్‌కు చెందిన పొలానికి మళ్లీ నిప్పు పెట్టారు. మండలంలోని గొందిరెడ్డిపల్లి రెవెన్యూ పరిధి (పులల్లరేవు) పరిధిలోని సర్వే నంబర్ 103–2 (88–3)లో 4.90, 103–3 (88–3)లో పెద్ద ఓబులేష్, వసంత్ తమకున్న 7.76 ఎకరాల వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం ఆ పొలంలో రెండేళ్ల క్రితం దాదాపుగా 400 అల్ల నేరేడు మొక్కలను నాటారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెద్ద ఓబులేష్‌కు చెందిన మొక్కలను గుర్తు తెలియని వ్యక్తులు నరికివేశారు. ఈ ఏడాది జనవరి 17న 15 చెట్లు, అలాగే జనవరి 21న 40 చెట్లను టీడీపీ నాయకులు నరికి వేశారు. మళ్లీ ఈ నెల 3న గుర్తు తెలియని వ్యక్తులు పెద్ద ఓబులేష్ తోటకు నిప్పు పెట్టడంతో కొన్ని చెట్లు కాలిపోయాయి.వారం రోజులు కూడా గడవక ముందే మళ్లీ ఈ నెల 10న మరో సారి నిప్పు పెట్టడంతో తోటలోని డ్రిప్ పరికరాలు, మోటర్ సెల్ పూర్తిగా కాలిపోయాయి. 10 రోజులు కూడా గడవక ముందే మూడోసారి పొలానికి నిప్పు పెట్టడంతో దాదాపుగా 4 ఎకరాల్లో పొలం చుట్టూ ఉన్న ముళ్ల కంప కాలిపోయింది. ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
VRO బాగోతం బయటపెట్టిన మహిళ
-
తాడిపత్రిలో వీఆర్వో కీచకపర్వం
సాక్షి, అనంతపురం జిల్లా: కులం, మతం, ప్రాంతం చూడకుండా సంక్షేమ పథకాలను ఇంటింటికి అందించిన రామరాజ్యం నాడు. రేషన్ కార్డు కావాలంటే నీ కూతుర్ని నా దగ్గరికి పంపు అని వీఆర్వో అడిగిన రావణ పాలన నేడు. రేషన్ కార్డు అడిగిన పాపానికి పేద వృద్ధురాలికి వచ్చిన బెదిరింపు ఇది. ‘రేషన్‌కార్డు కావాలంటే నీ కూతురిని నా దగ్గరకు పంపించు’ అన్న ఓ వీఆర్వో కీచకపర్వం ఆలస్యంగా వెలుగుచూసింది. తీవ్ర మనోవేదనకు గురైన ఆ వృద్ధురాలు తన వేదనను వీడియో రూపంలో సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. దీంతో అధికారులు ఆ కీచక వీఆర్వోపై విచారణ చేపట్టారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం 35వ వార్డుకు చెందిన లక్ష్మీని రెండేళ్ల కిందట భర్త వదిలేయడంతో తల్లి నాగమునెమ్మ దగ్గర ఉంటోంది. రేషన్‌కార్డు లేనందున కుమార్తెకు ఒంటరి మహిళ పింఛన్ రావడం లేదని.. తన కుమార్తెకు కార్డు మంజూరు చేయాలంటూ నాగమునెమ్మ ఏడాదిగా వీఆర్వో చంద్రశేఖర్‌ను బతిమాలుతూ వస్తోంది.తాడిపత్రి మునిసిపల్ అధికారులకూ విన్నవించుకుంది. అయినా ఫలితం లేకపోయింది. పదే పదే వీఆర్వోను బతిమాలుతుండటంతో ఇదే అదునుగా భావించిన వీఆర్వో చంద్రశేఖర్ ‘నీ కూతురిని నా దగ్గరకు పంపించు. అప్పుడు రేషన్‌కార్డు ఇప్పిస్తా’ అని చెప్పడంతో ఆమె కన్నీటి పర్యంతమైంది. వీఆర్వో దుర్మార్గాన్ని వీడియోలో వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనిపై అనంతపురం ఆర్డీవో కేశవనాయుడు విచారణకు ఆదేశించారు. ఈ మేరకు తాడిపత్రి తహసీల్దార్ రజాక్‌వలి శుక్రవారం నాగమునెమ్మను తన కార్యాలయానికి పిలిచి విచారించి.. నివేదికను ఆర్డీవోకు అందించారు.ఇదీ చదవండి: మీర్పేట్ మాధవి హత్య కేసులో మరో సంచలనం -
నువ్వు ఎన్ని అడ్డంకులు పెట్టినా తాడిపత్రి కి వెళ్లి తీరుతా...
-
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్
-
తాడిపత్రిలో టెన్షన్.. కేతిరెడ్డి హౌస్ అరెస్ట్
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పెద్దారెడ్డికి పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేశారు. అనంతరం, తాడిపత్రి నియోజకవర్గంలోకి కేతిరెడ్డి వెళ్లొద్దంటూ ఆంక్షలు విధించారు. తాడిపత్రి వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు.తాడిపత్రిలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నేడు తాడిపత్రి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆయనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. సోమవారం ఉదమయే కేతిరెడ్డి ఇంటికి పోలీసులు చేరుకుని ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. యల్లనూరు మండలం తిమ్మంపల్లి గ్రామంలో పెద్దారెడ్డిని గృహ నిర్బంధంలోనే ఉంచారు. అనంతరం, కేతిరెడ్డికి 41ఏ నోటీసులు జారీ చేశారు.ఇదిలా ఉండగా.. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తాడిపత్రిలో ఎమ్మెల్యే జేసీ వర్గీయులు రెచ్చిపోతున్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు ఏడు నెలలుగా అడ్డంకులు సృష్టిస్తూన ఉన్నారు. జేసీ కనుసన్నల్లోనే పోలీసులు పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో జేసీ, పోలీసుల తీరుపై కేతిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గం తాడిపత్రిలోకి ఎందుకు వెళ్లనివ్వడం లేదంటూ ప్రశ్నించారు. దీంతో, తిమ్మంపల్లి గ్రామంలో పోలీసులు భారీ సంఖ్యలో బందోబస్తు ఏర్పాటు చేశారు. -
తాడిపత్రిలో దారుణం.. భార్యను నరికి చంపిన భర్త
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో దారుణం చోటు చేసుకుంది. భార్యను భర్త వెంకటేశ్వరరెడ్డి వేట కొడవలితో నరికి చంపాడు. భార్య పుష్పావతి అక్కడికక్కడే మృతి చెందింది. తాడిపత్రి పట్టణంలోని హేమాద్రి లాడ్జిలో ఘటన జరిగింది. దంపతుల సమస్యలను పరిష్కరించేందుకు ఇరు వర్గాల పెద్దలు లాడ్జిలో సమావేశమయ్యారు. ఒంటరిగా మాట్లాడాలని చెప్పిన భర్త.. భార్యను హత్య చేశాడు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.అనుమానాస్పదంగా మహిళ మృతికోనసీమ జిల్లా: రామచంద్రపురం మండలం తోటపేట గ్రామంలో ఈ నెల 12న దామిశెట్టి మహాలక్ష్మి (54) అనుమానాస్పదంగా మృతి చెందింది. సహజ మరణంగా భావించిన బంధువులు సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఆమె ఒంటిపై బంగారం లేదని, బంగారం కోసమే హత్య చేసి ఉంటారని ద్రాక్షారామ పోలీసులకు బంధువులు ఫిర్యాదు చేశారు. దీంతో పాతిపెట్టిన మహాలక్ష్మి మృతదేహాన్ని బయటకు తీశారు. స్మశానవాటిక వద్దనే వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అనుమానాస్పద మృతి కింద కేసుగా నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.ఇదీ చదవండి: జంట హత్యల కేసులో వీడిన మిస్టరీ -
‘‘రేయ్.. నీ కథ చూస్తా!’’ జేసీ బెదిరింపులు వెలుగులోకి
అనంతపురం, సాక్షి: కూటమి సర్కార్ అండతో తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి(JC Prabhakar Reddy) రెచ్చిపోతూనే ఉన్నారు. అధికారులు, రాజకీయ నేతలు ఎవరనేది చూడకుండా దురుసుగా ప్రవర్తిస్తూ నిత్యం వార్తల్లోక్కి ఎక్కుతున్నారు. తాజాగా మరోసారి ఆయన వివాదంలో నిలిచారు. ఓ దళిత నేతను ఫోన్లో బెదిరించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పైగా ఇది ఇక్కడితోనే ఆగలేదు. దళిత సంఘం నేత రాంపుల్లయ్య మున్సిపల్ సమావేశాలకు హాజరు కావడం లేదు. ఈ విషయంపై ఆయన్ని ఫోన్లో బెదిరించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పిలిచినా మీటింగ్‌కు రాకపోవం ఏంటని జేసీ ప్రశ్నించగా.. ఆ ఆహ్వానం గౌరవంగా ఉండాలని రాంపుల్లయ్య అన్నారు. ఆ సమాధానం తట్టుకోలేని జేసీ ‘‘నేను పిలిస్తే రావా.. రేయ్.. నీ కథ చూస్తా’’ అంటూ చిందులు తొక్కాతూ ఫోన్ పెట్టారు. అయితే.. ఈ బెదిరింపుల వ్యవహారాన్ని తాడిపత్రి(Tadipatri) సీఐ సాయి ప్రసాద్ దృష్టికి ఫోన్ ద్వారా రాంపుల్లయ్య తీసుకెళ్లారు. ఈ క్రమంలో.. సీఐ కూడా జేసీకి మద్దతుగా రాం పులయ్యనే దూర్భాషలాడారు. పరస్పర దూషణలతో కూడిన ఆ ఆడియో క్లిప్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇదీ చదవండి: ఏపీ రాజకీయాలకు సరిగ్గా సరిపోయే సామెత! -
తాడిపత్రిలో సీఐ, దళిత నేత మధ్య చిచ్చుపెట్టిన జేసీ ప్రభాకర్ రెడ్డి
-
గాంధీనగర్ లో కాశీ మనోజ్ ను కిడ్నాప్ చేసిన దుండగులు
-
కూటమి సర్కార్ కక్ష సాధింపు.. మున్సిపల్ అధికారుల ఓవరాక్షన్!
సాక్షి, అనంతపురం: ఏపీలో కూటమి పాలనలో ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ నేతలను కూటమి నేతలు, అధికారులు టార్గెట్ చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తాజాగా తాడిపత్రిలో మున్సిపల్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు.వివరాల ప్రకారం.. తాడిపత్రిలో వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా వైఎస్సార్సీపీ నేత రమేష్ రెడ్డి ఇంటి నిర్మాణాన్ని మున్సిపల్ అధికారులు అడ్డుకున్నారు. అన్ని అనుమతులు ఉన్నా ఎందుకు అడ్డుకుంటున్నారని రమేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు ఇవ్వకుండా మున్సిపల్ అధికారులు వేధిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యే ఆదేశాలతోనే అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. -
కూటమి నేతల కమీషన్ దందా.. జేసీ ప్రభాకర్‌పై ఫిర్యాదు!
సాక్షి, అనంతపురం: కూటమి సర్కార్ పాలనలో లిక్కర్ మాఫియా హవా కొనసాగుతోంది. పలుచోట్ల కూటమి నేతలకు మద్యం షాపులు దక్కకపోవడంతో కమీషన్ల కోసం టీడీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. ఈ కారణంగా తాడిపత్రిలో నేటికీ నాలుగు మద్యం షాపులు ప్రారంభం కాలేదు.వివరాల ప్రకారం.. తాడిపత్రి టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై మద్యం వ్యాపారులు ఫిర్యాదు చేశారు. అయితే, తాడిపత్రిలో నాలుగు మద్యం షాపులను విజయవాడకు చెందిన వ్యాపారులు గోపీనాథ్, గురునాథం దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో తన అనుమతి లేనిదే మద్యం షాపులు ప్రారంభించవద్దని జేసీ ప్రభాకర్ వార్నింగ్ ఇచ్చారు. వ్యాపారులను బెదిరించే ప్రయత్నం చేశారు.దీంతో, నాలుగు మద్యం షాపులు దక్కించుకున్నప్పటికీ తాడిపత్రిలో మాత్రం అవి ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ఈ క్రమంలో విజయవాడ మద్యం వ్యాపారులు గోపీనాథ్, గురునాథం.. తమకు భద్రత కల్పించాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే, తాడిపత్రిలో మద్యం షాపులు తమ వారికి దక్కకపోవడంతో టీడీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. తమకు 15 శాతం కమీషన్ ఇచ్చాకే మద్యం షాపులు నిర్వహించాలని వార్నింగ్ ఇచ్చారు. -
తాడిపత్రిలో టీడీపీ నేతల దౌర్జన్యం
సాక్షి, అనంతపురం జిల్లా: వైఎస్సార్సీపీ నేత జావేద్ ఇంటి వద్ద ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌రెడ్డి అనుచరుడు వీరంగం సృష్టించాడు. డబ్బులు బాకీ ఉన్నారంటూ వైఎస్సార్సీపీ నేత ఇంటి వద్ద అనుచరులతో దౌర్జన్యానికి దిగాడు. కుటుంబ సభ్యులను నిర్బంధించారని పోలీసులకు వైఎస్సార్సీపీ నేత జావేద్ ఫిర్యాదు చేశారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి పేరుతో బెదిరింపులకు దిగుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేత గోరాకు ఎలాంటి బాకీ లేనని జావెద్ స్పష్టం చేశారు.హోంగార్డుపై టీడీపీ నేత దౌర్జన్యం శింగనమల మండలంలోని ఉల్లికల్లు గ్రామానికి చెందిన టీడీపీ నేత రంగారెడ్డి తనపై దాడికి ప్రయత్నించాడంటూ శింగనమల పీఎస్‌లో పనిచేస్తున్న హోంగార్డు నాగేంద్ర మంగళవారం సీఐ కౌలుట్లయ్యకు ఫిర్యాదు చేశారు. వివరాలు... సెప్టెంబరులో ఒక రోజు రాత్రి నాయనపల్లి క్రాస్ నుంచి మరువకొమ్మ వరకూ హెడ్ కానిస్టేబుల్ గిరి మహేష్‌తో కలసి, హోంగార్డు నాగేంద్ర గస్తీ విధులు నిర్వర్తించాడు.ఆ సమయంలో టీడీపీ నేత ఉల్లికల్లు రంగారెడ్డికి చెందిన టిప్పరులో అక్రమంగా ఇసుక తరలిస్తుండడం గుర్తించి పోతురాజుకాలువ సమీపంలో అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు. దీంతో అప్పటి నుంచి హోంగార్డు నాగేంద్ర ఎక్కడ కనిపించిన రంగారెడ్డి కోపంతో దుర్భాషలాడేవాడు. ఈ క్రమంలో మంగళవారం నాయనవారిపల్లిలో జరిగిన శుభకార్యానికి ఎమ్మెల్యేలు బండారు శ్రావణి, ఎంఎస్ రాజు హాజరుకానుండడంతో ఎస్ఐ, ఎఎస్ఐ, హెడ్ కానిస్టేబులు, సిబ్బందితో ఎస్కార్ట్ విధుల్లో నాగేంద్ర కూడా పాల్గొన్నాడు. అక్కడ సిబ్బంది భోజనం చేస్తున్న సమయంలో నాగేంద్రపై రంగారెడ్డి దాడికి ప్రయతి్నంచాడు. అక్కడే ఉన్న పోలీస్ సిబ్బంది అడ్డుకోవడంతో నీ కథ చూస్తా అంటూ బెదిరిస్తూ వెళ్లిపోయాడు. టీడీపీ నాయకుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఐకి బాధితుడు ఫిర్యాదు చేశాడు. -
మాటలకందని విషాదం.. కొన్ని గంటల్లో నిశ్చితార్థం.. అంతలోనే..
తాడిపత్రి రూరల్: నిశ్చితార్థం కోసం గోరింటాకు పెట్టించుకుని సోదరునితో కలిసి ద్విచక్రవాహనంపై వస్తున్న యువతిని రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. తాడిపత్రి అప్‌గ్రేడ్ రూరల్ సీఐ శివగంగాధర్‌రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వెంకటరెడ్డిపల్లికి చెందిన వీణాదేవి(24)కి ఆదివారం వివాహ నిశితార్థం జరగాల్సి ఉంది.ఇందు కోసం శనివారం సోదరుడు నారాయణరెడ్డితో కలిసి బైక్‌పై తాడిపత్రికి వెళ్లి చేతికి గోరింటాకు పెట్టించుకుంది. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా వీరి బైక్‌ను బుగ్గ నుంచి తాడిపత్రి వైపు వస్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి ఢీకొంది. ఈ ప్రమాదంలో వీణాదేవి అక్కడికక్కడే చనిపోయింది.తీవ్రంగా గాయపడిన తమ్ముడు నారాయణరెడ్డికి తాడిపత్రిలో ప్రథమ చికిత్స చేసి, అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మరి కొన్ని గంటల్లో నిశితార్థం జరుగుతుందన్న అనందంలో ఉన్న వీణాదేవి ఊహించని విధంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను, గ్రామస్తులను కలచివేసింది. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్‌పై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. -
తాడిపత్రిలో వెలుగులోకి జేసీ ప్రభాకర్ రెడ్డి మద్యం దందా
-
ఎస్పీని కలిసిన కేతిరెడ్డి
-
రావణ కాష్టం.. రాక్షసానందం!
‘మీరేంటో.. మీ విధానాలేంటో..’ అంటూ ఓ సినిమాలో రావు రమేష్ చెప్పిన డైలాగ్ వారికి బాగా సరిపోతుంది. నిత్యం వివాదాలకు వారే ఆజ్యం పోస్తూ చలికాచుకోవడం రివాజుగా మారింది. గత ఐదేళ్లూ ప్రశాంత వాతావరణంలో జీవనం సాగించిన తాడిపత్రి నియోజకవర్గ ప్రజలు ప్రస్తుతం జేసీ ఆగడాల కారణంగా బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తోంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 13 నియోజకవర్గాలు ఒకరకం.. తాడిపత్రి ఒక్కటీ మరో రకంగా మారింది. ‘మేమే రాజులం, మేమే మంత్రులం.. మేము రాసిందే రాజ్యాంగం’ అనే రీతిలో జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. తమకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపైనా, ప్రత్యర్థి పారీ్టలోని నాయకులపైనా దాడులు చేయడమే కాకుండా తిరిగి వారిపైనే కేసులు పెట్టిస్తూ రాక్షసానందం పొందుతున్నారు. ఇసుక అక్రమాలపై కావాలనే రాద్ధాంతం.. అధికారం చేతిలో ఉందికదా అని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్టు చర్చ జరుగుతోంది. ‘25 మంది ఇసుక తోలేది మా వాళ్లే.. మీరందరూ ఇసుక తోలడం మానుకోండి. లేదా నాకు దూరమవుతారు’ అంటూ ఇటీవల ప్రభాకర్‌రెడ్డి వీడియో సందేశాలు విడుదల చేశారు. అయితే, జేసీ వ్యాఖ్యలను నిశితంగా గమనిస్తే అందులో మరో కోణం అవగతమవుతుంది. తన వర్గం నాయకులు సాగిస్తున్న ఇసుక దందాను నిలిపివేయించి తానే సొంత వాహనాలతో ఇసుక అక్రమ రవాణా సాగించాలన్న మర్మం బయటపడుతుంది. జిల్లాల వారీగా చంద్రబాబు ప్రభుత్వం విజిలెన్స్ రిపోర్టులు తయారు చేయిస్తోందన్న సమాచారం అందడంతోనే డ్రామాలు ఆడుతున్నారన్న విమర్శలు మరోవైపు వినిపిస్తున్నాయి. పోలీసుల్లో అసంతృప్తి.. తాడిపత్రి మండలంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న టిప్పర్లను ఇటీవల పోలీసులు పట్టుకోగా.. ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి వెంటనే సీఐ లక్ష్మీకాంత్ రెడ్డికి ఫోన్ చేసి కేసులు కట్టాలంటూ దురుసుగా వ్యవహరించారు. ఎప్పుడు కేసులు కట్టాలో తనకు తెలుసునని సీఐ చెప్పగా.. ఆయనను ఇష్టారాజ్యంగా మాట్లాడారు. ఈ క్రమంలో సీఐను వెనకేసుకు రావాల్సిన పోలీసు ఉన్నతాధికారులు అందుకు భిన్నంగా వ్యవహరించి, సీఐతో ఎమ్మెల్యేకు క్షమాపణ చెప్పించారు. నిజాయితీగా పనిచేసే ఓ సీఐ పట్ల ఉన్నతాధికారులు వ్యవహరించిన తీరుపై పోలీసు వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఎస్పీ స్థాయి వ్యక్తి క్షమాపణలు చెప్పించడమేంటని కిందిస్థాయి పోలీసు అధికారులు వాపోతున్నారు. ఇదే క్రమంలో.. తాను ఏ తప్పూ చేయలేదని, శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదనే క్షమాపణలు చెప్పానని సీఐ పేర్కొనడం గమనార్హం. మాజీ ఎమ్మెల్యే రాకుండా అడ్డంకులు.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి అడుగుపెట్టకుండా దాడులు చేయిస్తున్నారంటే జేసీ ప్రభాకర్‌రెడ్డి గూండాగిరీ ఏ స్థాయిలో ఉందో ఇట్టే తెలుసుకోవచ్చు. ఇటీవల ఎన్నికల పోలింగ్ రోజు రాళ్లు రువ్వుకున్న ఘటనలో ప్రభాకర్‌రెడ్డి, పెద్దారెడ్డిలు ఇద్దరిపైనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఇద్దరికీ బెయిలొచ్చింది. కానీ పెద్దారెడ్డిని తాడిపత్రికి రానివ్వకుండా జేసీ ప్రభాకర్‌రెడ్డి అడ్డుకుంటున్నారు. ఇటీవల పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లగా తన అనుచరులతో దాడులు చేయించారు. కందిగోపుల మురళి అనే వైఎస్సార్ సీపీ నాయకుడి ఇంటిని ధ్వంసం చేశారు. ఇంత జరుగుతున్నా జిల్లా పోలీసులు చేష్టలుడిగి చూస్తుండడం విమర్శలకు తావిస్తోంది. పనిచేయడానికి అధికారులే రావడం లేదు.. జేసీ కుటుంబం దెబ్బకు నియోజకవర్గంలో పనిచేసేందుకు అధికారులే రావడం లేదంటే అతిశయోక్తి కాదు. తాడిపత్రి తహసీల్దార్‌గా వెళ్లిన ఈశ్వరమ్మ కొన్ని రోజులకే తానక్కడ పనిచేయలేనంటూ తిరిగి వచ్చేశారు. తాడిపత్రి టౌన్‌కు ఎస్ఐ ఉన్నా అటాచ్డ్ కింద పెదపప్పూరు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రూరల్ పోలీసుస్టేషన్లో ఎస్ఐ లేరు. తమకు ఎప్పుడు బదిలీ వస్తే వెళ్లిపోదామా అన్న ఆలోచనలో రవాణా శాఖ సిబ్బంది ఉన్నారు. మైనింగ్, రెవెన్యూ, ఆరోగ్య.. ఇలా ఏ శాఖ అధికారులైనా తాడిపత్రిలో పనిచేసేందుకు జంకుతున్నారు. పోలీసులన్నా, అధికారులన్నా తన కింద గుమస్తాలే అన్న రీతిలో జేసీ వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ ఉద్యోగులు వాపోతున్నారు. -
జేసీ అస్మిత్‌తో నేను దురుసుగా ప్రవర్తించలేదు: సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి
సాక్షి, అనంతపురం: టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డికి క్షమాపణల విషయంపై అనంతపురం జిల్లా తాడిపత్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ స్పందించారు. మంగళవారం తాడిపత్రిలో జరిగిన ఘటనలో తన తప్పేమీ లేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్నే తాను జిల్లా ఎస్పీకి కూడా వ్యక్తిగతంగా కలిసి వివరించానని సి.ఐ. క్ష్మీకాంత్ రెడ్డి బుధవారం తెలిపారు. ఎస్పీ జగదీష్‌ను కలిసిన తరువాత సి.ఐ. విలేకరులతో మాట్లాడుతూ మంగళవారం నాటి ఘటన వివరాలను తెలిపారు. ‘తాడిపత్రి ఘటనలో నా తప్పు ఏమీ లేదు. ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌తో నేను దురుసుగా ప్రవర్తించలేదు. ఎస్సీ, ఎస్టీ కేసు నా పరిధిలోని అంశం కాదు. డీఎస్పీ విచారణ చేస్తారని ఆయనతో చెప్పాను. నేను తాడిపత్రిలో 14 నెలల నుంచి పనిచేస్తున్నాను. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నాపై ఎలాంటి చర్యలు తీసుకున్నా నాకు ఓకే’ అని కామెంట్స్ చేశారు. తాడిపత్రిలో జేసీ ఫ్యామిలీకి ఇదేం రాక్షసానందం? సీఐ లక్ష్మీకాంత రెడ్డితో క్షమాపణలు చెప్పించుకున్న @JaiTDP ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి అధికారమదంతో పోలీసుల మనోభావాల్ని దెబ్బతీస్తూ అందరి ముందు సీఐ నుంచి క్షమాపణలు చెప్పించుకున్న జేసీ అస్మిత్ రెడ్డి pic.twitter.com/UNSgk2TEMt— YSR Congress Party (@YSRCParty) August 27, 2024 -
జేసీ అరాచకాలు సహించం: వైఎస్సార్సీపీ వార్నింగ్
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో టీడీపీ దాడులపై ఎస్పీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నేతలు వినతి పత్రం అందజేశారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై ఆంక్షలు తొలగించాలని మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, శంకర్ నారాయణ, మాజీ ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి విజ్ఞప్తి చేశారు.కూటమి అధికారంలోకి వచ్చాక దాడులకు తెగబడుతోందని వైఎస్సార్సీపీ మండిపడింది. ‘‘మా పాలనలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాం. చంద్రబాబు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోతున్నారు. వైఎస్సార్సీపీ నాయకులపై దాడి చేయడం హేయమైన చర్య. దాడులను ఆపడంలో అధికార యంత్రాంగం విఫలమైంది. ఆస్తులను ధ్వంసం చేస్తుంటే రక్షించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. దాడులు ఇలాగే కొనసాగితే సహించేది లేదు’’ అని వైఎస్సార్సీపీ నేతలు హెచ్చరించారు.ప్రతిపక్షం ఉండకూడదన్నదే జేసీ కుట్రలు: అనంత వెంకటరామిరెడ్డితాడిపత్రి లో జేసీ హింసా రాజకీయాలు ఖండిస్తున్నాం. టీడీపీ దౌర్జన్యాలు, దాడులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోలేదు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి నియోజకవర్గానికి వెళ్తే తప్పేంటి?. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎస్పీ అనుమతితో తాడిపత్రి వెళ్లినా దాడులు చేశారు. చంద్రబాబుకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు. హామీలు అమలు చేయకుండా టీడీపీ నేతలతో దాడులు చేయిస్తున్నారు. టీడీపీ గూండాగిరికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాంపోలీసులు బాధ్యతగా వ్యవహరించాలి: మాజీ ఎంపీ తలారి రంగయ్యశాంతి భద్రతలు పరిరక్షించడం లో చంద్రబాబు విఫలమయ్యారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కక్షసాధింపు రాజకీయాలు లేవు. పోలీసులు బాధ్యతగా వ్యవహరించాలి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి నియోజకవర్గంలోకి అనుమతించాలి.జేసీ రౌడీయిజాన్ని పోలీసులు అడ్డుకోలేరా?: మాజీ మంత్రి శంకర్ నారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆటవిక పాలన ప్రోత్సహిస్తున్నారు. హామీలు అమలు చేయకుండా హింసను ప్రేరేపిస్తున్నారు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి రౌడీయిజాన్ని పోలీసులు అడ్డుకోలేరా?. పోలీసులు కఠిన చర్యలు తీసుకోకపోతే ప్రజా ఉద్యమం తప్పదు. -
చంద్రబాబూ.. జేసీ కుటుంబాన్ని అదుపులో పెట్టు: వైఎస్సార్సీపీ నేత మురళి
సాక్షి, తాడేపల్లి: జేసీ కుటుంబం అరాచకాలపై తాడిపత్రి వైఎస్సార్సీపీ నేత కందిగోపుల మురళి మండిపడ్డారు. మూడు రోజుల క్రితం జేసీ వర్గీయులు తమ ఇంటిపై దాడి చేసి బీభత్సం సృష్టించారని ధ్వజమ్తెతారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాయలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వీడియో తీస్తుంటే మావాళ్ల ఫోన్లను లాక్కున్నారంటూ.. దాడి ఘటనను ఆయన వివరించారు.‘‘మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కాల్ చేస్తే ఆయన ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించాను. కారులో వెళ్తుంటే నాపై దాడి చేసేందుకు జేసీ మనుషులు వచ్చారు. నేను భయపడి వెనక్కి వచ్చేశాను. కాసేపటికే వారంతా మా ఇంటి మీదకు వచ్చారు. వందల మంది వచ్చి దాడులు చేశారు. ఇనుప తలుపులను సైతం పగులకొట్టి లోపలకు వచ్చారు. మారణాయుధాలు చేతపట్టుకుని వచ్చి దాడి చేశారు. తలుపులు, కిటికీలు ధ్వంసం చేశారు. ఫోన్లు చేసిన పోలీసులు రాలేదు. పదేపదే ఫోన్లు చేస్తే 45 నిమిషాల తర్వాత పోలీసులు వచ్చారు’’ అని మురళి చెప్పారు.‘‘నాకు గన్ లైసెన్స్ ఉన్నా ఫైరింగ్ చేయలేదు. గతంలో కూడా ఒకసారి మా ఇంటిపై దాడి చేసి లూఠీ చేశారు. బంగారం దోచుకుపోయారు. ఇరవై ఏళ్ల తర్వాత జేసీ కుటుంబాన్ని ఓడించాం. మళ్లీ ఓడిస్తాం. ఏం ఉన్నా రాజకీయంగా పోరాడతాం. జేసీ కుటుంబం ఇలా ఇళ్లపై దాడులకు దిగటం మంచిది కాదు. రాయలసీమలో ఐదేళ్లుగా శాంతిభద్రతలు బాగున్నాయి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.’’ అని మురళి పేర్కొన్నారు.15 ఏళ్లుగా నాకు గన్ లైసెన్స్ ఉంది. గొడవ అంతా అయిపోయిన తర్వాతే గన్ తీసుకుని బయటకు వచ్చాను. అయితే నేనే టీడీపీ వారిపై దాడి చేసినట్లుగా కేసులు పెట్టారు. చిన్నపిల్లలు, ఆడవారిపై జేసీ కుటుంబం దాడులు చేయడమేంటి?. జేసీ ప్రభాకరరెడ్డి చేసే రాజకీయాలు ఇవేనా?. చంద్రబాబూ.. జేసీ కుటుంబాన్ని అదుపులో పెట్టండి. ఒక విలేకరిని నేను బెదిరించినట్టుగా అక్రమ కేసులు పెట్టారు. తప్పుడు కేసులు పెట్టి కక్ష సాధింపులకు దిగొద్దు’’ అని మురళి అన్నారు. -
తాడిపత్రిలో టీడీపీ నేతల అరాచకం బట్టబయలు
సాక్షి, అనంతపురం జిల్లా: తాడిపత్రిలో టీడీపీ నేతల అరాచకం బట్టబయలైంది. వైఎస్సార్సీపీ నేత కందిగోపుల మురళి ఇంటిపై టీడీపీ నేతల దాడి దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. మురళి ఇంటిపై దాడి, వాహనాల విధ్వంసాన్ని స్థానికులు సెల్ ఫోన్లో చిత్రీకరించారు. జేసీ వర్గీయుల బీభత్సం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.కాగా, ఎన్నికల ఫలితాల తర్వాత దాదాపు మూడు నెలలకు 20వ తేదీన (మంగళవారం) మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లారు. వ్యక్తిగత పని ముగించుకుని అరగంటలో తాడిపత్రి నుంచి బయటకు వెళ్లిపోయారాయన.ఆయన అలా వెళ్లిన వెంటనే.. జేసీ తన వర్గీయుల్ని రెచ్చగొట్టారు. దీంతో.. టీడీపీ గుండాలు వైఎస్సార్ సీపీ నేత కందిగోపుల మురళి ఇంటిపై దాడి చేశారు. మురళి ఇంట ఫర్నీచర్‌ను ధ్వంసం చేయడంతో పాటు ఇంటికి నిప్పు పెట్టారు. అదృష్టవశాత్తూ.. జేసీ వర్గీయుల దాడి నుంచి తృటిలో మురళి తప్పించుకున్నారు. -
అధికార జులుం.. తాడిపత్రిలో కొనసాగుతున్న ఉద్రిక్తత
అనంతపురం, సాక్షి: అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ నేతల్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతుండడంతో.. నియోజకవర్గంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తాజాగా.. కేతిరెడ్డి పెద్దారెడ్డి పర్యటన అనంతరం చెలరేగిన హింస నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారక్కడ. ఎన్నికల ఫలితాల తర్వాత దాదాపు మూడు నెలలకు నిన్న(మంగళవారం) మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లారు. వ్యక్తిగత పని ముగించుకుని అరగంటలో తాడిపత్రి నుంచి బయటకు వెళ్లిపోయారాయన. ఆయన అలా వెళ్లిన వెంటనే.. జేసీ తన వర్గీయుల్ని రెచ్చగొట్టారు. దీంతో.. టీడీపీ గుండాలు వైఎస్సార్ సీపీ నేత కందిగోపుల మురళి ఇంటిపై దాడి చేశారు. మురళి ఇంట ఫర్నీచర్‌ను ధ్వంసం చేయడంతో పాటు ఇంటికి నిప్పు పెట్టారు. అదృష్టవశాత్తూ.. జేసీ వర్గీయుల దాడి నుంచి తృటిలో మురళి తప్పించుకున్నారు. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో తాడిపత్రి అంతటా పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు.. జేసీ ప్రభాకర్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి జాతీయ మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలతో పాటు రాష్ట్ర డీజీపీ, కేంద్ర హోం శాఖలకు సైతం ఫిర్యాదులు పంపారు. ఈ సందర్భంగా జేసీపై కే. పెద్దారెడ్డి సంచలన ఆరోపణలు గుప్పించారు. ‘‘నా హత్యకు జేసీ ప్రభాకర్ రెడ్డి కుట్ర పన్నారు, నన్ను చంపి తాడిపత్రి లో రాజకీయ ప్రత్యర్థి లేకుండా చేయాలని జేసీ భావిస్తున్నారు. 2006లో మా అన్న కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డిని జేసీ ప్రభాకర్ రెడ్డి హత్య చేయించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అరాచకాలపై ప్రజాస్వామ్య బద్ధంగా పోరాడుతా. త్వరలో తాడిపత్రి కి వెళ్లి వైఎస్సార్ సీపీ శ్రేణులకు అండగా ఉంటా అని అన్నారాయన. వంద మంది టీడీపీ గుండాలొచ్చారుదాడి ఘటనపై తాడిపత్రి వైఎస్సార్ సీపీ నేత కందిగోపుల మురళి సాక్షితో మాట్లాడారు. ‘‘జేసీ ప్రభాకర్ రెడ్డి నన్ను చంపేందుకు స్కెచ్ వేశారు. నా ఇంటిపై వంద మంది టీడీపీ గూండాలు దాడి చేశారు. ఫర్నీచర్ ధ్వంసం చేసి, నా ఇంటికి నిప్పు పెట్టారు. తలుపులు పగులగొట్టి నన్ను చంపేందుకు శతవిధాలా ప్రయత్నించారు. నాకు లైసెన్స్ తుపాకీ ఉంది.. అయినప్పటికీ కాల్పులు జరపలేదు. ప్రాణ రక్షణ కోసమే తుపాకీ చేతిలో పట్టుకున్నాను. టీడీపీ అధికారంలోకి వచ్చాక నాకు గన్ మెన్ తొలగించారు అని అన్నారాయన. మురళి భార్య రమా మాట్లాడుతూ.. ఇలా దాడి జరగడం రెండోసారి అని చెప్పారామె.‘‘టీడీపీ గూండాలు మా ఇంటిపై దాడి చేసి బీభత్సం సృష్టించారు. గంటసేపు బెడ్ రూం లో దాక్కుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దాక్కున్నాం. మా ఇంటిపై దాడి టీడీపీ నేతలు దాడి చేస్తే... నా భర్త కందిగోపుల మురళి పై అక్రమ కేసులా?. ఇదెక్కడి న్యాయం?’’:::మురళి భార్య రమాదేవి -
చట్టం.. జేసీ చుట్టం!
తాడిపత్రిటౌన్: చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అయితే తాడిపత్రిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. చట్టం.. జేసీకి చుట్టం అన్న రీతిలో వ్యవహరిస్తోంది. కళ్లెదుటే నిందితులు కనిపిస్తున్నా పోలీసులు అరెస్టు చేయకుండా వదిలేయడం విమర్శలకు తావిస్తోంది. అసలు విషయానికి వస్తే... సార్వత్రిక ఎన్నికల అనంతరం తాడిపత్రిలో రెండు రోజుల పాటు ఇరువర్గాల గొడవలు, అల్లర్ల ఘటనలకు సంబంధించి పోలీసులు ఏడు కేసుల్లో దాదాపు 520 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇందులో 163 మందిని (టీడీపీకి చెందిన వారు 81 మంది, వైఎస్సార్సీపీకి చెందిన వారు 82 మంది) అరెస్టు చేశారు. ఆ సమయంలో మిగిలిన నిందితుల కోసం పట్టణంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా పోలీసులు జల్లెడ పట్టడంతో ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు గ్రామాలు వదిలి బయటప్రాంతాల్లో తలదాచుకున్నారు. గ్రామాలకు గ్రామాలు ఖాళీ అయి బిక్కుబిక్కు మంటూ గడిపాయి. పట్టణంలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ఇరు పార్టీల నాయకుల ఇళ్ల వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి పట్టణ వాసులు సైతం ఆ ప్రాంతానికి వెళ్లేందుకు వీలు లేకుండా రహదారులనే దిగ్బంధించిన సంఘటనను ఎవ్వరూ మరచిపోలేరు.పోలీసుల తీరు వివాదాస్పదంఅల్లర్లు, గొడవల కేసుల్లో నిందితులగా ఉండి కనిపించకుండా పోయిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు కొంతమంది ఎన్నికల ఫలితాల అనంతరం కళ్లెదుటే తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడం వివాదాస్పదంగా మారింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తమ మాట వినని పోలీసులను బదిలీలు చేయిస్తారని, వీఆర్‌కు పంపుతారేమోనని పోలీసులే టీడీపీ నాయకులను చూసి జంకుతున్నారు. నిందితులను చూసి కూడా చూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఇదే విషయమై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మీడియా సాక్షిగా చెబుతున్నా పోలీసులు ఏమాత్రమూ స్పందించడం లేదు. గత బుధవారం మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి అనంతపురం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ఎదుట తలపెట్టిన ధర్నాకు అల్లర్ల కేసుల్లో ఉన్న నిందితులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారన్న విషయం తాడిపత్రిలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. -
తాడిపత్రిలో హై టెన్షన్
సాక్షి, అనంతపురం: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై చంద్రబాబు సర్కార్ కుట్రలకు తెరలేపుతోంది. అక్రమ కేసులతో ఇబ్బందులకు గురిచేస్తోంది. శనివారం ఉదయం తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. బెయిల్ షూరిటీలు సమర్పించేందుకు తాడిపత్రికి కేతిరెడ్ఢి పెద్దారెడ్డి వెళ్లారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే అంతుచూస్తానంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి బెదిరించిన సంగతి తెలిసిందే. నేడు ఉదయం నేరుగా తాడిపత్రి పీఎస్‌కు వెళ్లిన పెద్దారెడ్డి.. తాడిపత్రి పోలీసులతో మాట్లాడారు. బెయిల్ మంజూరై ఐదు రోజులు గడిచినా షూరిటీలు ఎందుకు తీసుకోలేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.కేతిరెడ్డి పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించటం సరికాదని మండిపడ్డారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేసి ఐదు రోజులైనా పోలీసులు ఎందుకు షూరిటీలు స్వీకరించలేదని ప్రశ్నించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, మరో 10 మందిపై ఆంక్షలు ఉన్నా తాడిపత్రిలో విచ్చలవిడిగా సంచరిస్తున్నా పోలీసులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి జాగీరు కాదని పెద్దారెడ్డి ధ్వజమెత్తారు.‘‘నన్ను, నా కొడుకులను జిల్లా బహిష్కరణ చేయటానికి జేసీ ప్రభాకర్ రెడ్డి ఎవరు?. తాడిపత్రి ప్రజలకు అండగా ఉంటా. నా ఊపిరి ఉన్నంతవరకూ తాడిపత్రిలోనే ఉంటా. జేసీ దౌర్జన్యాలను ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కొంటాను’’ అని కేతిరెడ్డి పెద్దారెడ్డి పేర్కొన్నారు. -
మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై టీడీపీ కక్ష సాధింపు
సాక్షి, అనంతపురం: రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల టీడీపీ దుశ్చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై టీడీపీ కక్ష సాధింపు చర్యలకు దిగింది. మునిసిపల్ అధికారులు.. పెద్దారెడ్డి ఇంటికి కొలతలు వేశారు. నోటీసులు ఇవ్వకుండానే కొలతలు వేయటం వైఎస్సార్ సీపీ నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే జేసీ ఆదేశాలతో మునిసిపల్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని వైఎస్సార్ సీపీ శ్రేణులు మండిపడుతున్నారు.కాగా, తిరుపతి నగరంలో నాలుగంతస్తుల భవనాన్ని కూల్చివేయడమే లక్ష్యంగా ఒక టీడీపీ నేత దౌర్జన్యానికి దిగారు. తన స్థలాన్ని కాపాడుకునేందుకు వేరొకరి భవనాన్ని కూల్చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ విషయాన్ని ప్రశ్నించినందుకు భవన యజమానిపై దాడికి దిగారు. ఈ వ్యవహారం నగరంలో హాట్‌టాపిక్‌గా మారింది.తిరుపతిలో తిరుమల బైపాస్ మున్సిపల్ పార్క్ ఎదురుగా ఉన్న విరజా మార్గంలోని టీడీపీ నేత అన్నా రామచంద్రయ్య స్థలంలో మాస్టర్ ప్లాన్ రోడ్డు ఏర్పాటు చేయాల్సి ఉంది. అతడి ఇద్దరు కుమార్తెలు కార్పొరేటర్లుగా ఉన్నారు. దీంతో ఆయన అధికారబలంతో తన స్థలాన్ని కాపాడుకునేందుకు వేరొకరి ఇంటి (నాలుగు అంతస్తుల భవనం) పైకి ఆ రోడ్డుని మళ్లించారు. నూతనంగా నిర్మించిన నాలుగంతస్తుల భవనంపై తన మనుషులతో మంగళవారం 15 అడుగుల పబ్లిక్ రోడ్డు అని రాయించారు.ఈ విషయమై భవన యజమాని మాస్టర్ ప్లాన్ మ్యాప్‌ని, అందుకు సంబంధించిన ఆధారాలను చూపించారు. ఈ విషయాన్ని స్పష్టం చేయాల్సిన టౌన్‌ప్లానింగ్ అధికారులు.. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగి నోరెత్తడంలేదు. బాధితుడు అధికారులను ప్రాధేయపడుతున్నా పట్టించుకోలేదు. ఇదే సమయంలో టీడీపీ నేత అన్నా రామచంద్రయ్య తన మనుషులతో భవనం వద్ద పనులు చేసుకుంటున్న యజమానిపై దాడి చేశారు. ఈ దాడి సీసీ కెమెరాలో రికార్డయింది. ఆ వీడియోలు బయటకు వచ్చాయి. -
తాడిపత్రిలో సిట్.. అల్లర్లపై కొనసాగుతున్న దర్యాప్తు
సాక్షి, అనంతపురం జిల్లా: అనంతపురం తాడిపత్రి అల్లర్ల ఘటనలపై సిట్ బృందం దర్యాప్తు చేపట్టింది. కేసుల వివరాలు, నిందితుల గుర్తింపు లాంటి అంశాలపై సిట్ ఆరా తీస్తోంది. మరోవైపు.. అరెస్టులు కొనసాగుతున్నాయి. పూర్తిస్థాయిలో విచారణ చేసిన తర్వాతే నివేదికను సిద్ధం చేయాలని సిట్ భావిస్తోంది.పల్నాడు జిల్లాలో పోలింగ్ డే ఘటనల్లో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల్ని పోలీసులు గుర్తిస్తున్నారు. నిన్న(గురువారం) పల్నాడులో 60 మందికిపైగా అరెస్టులు జరిగాయి. 33 మంది పెట్రోల్ బాంబులతో దాడులకు తెగబడినట్లు నిర్ధారణ అయ్యింది. నిందితుల్ని నరసరావుపేట కోర్టులో హాజరుపరిచి.. నెల్లూరు జిల్లా జైలుకు పోలీసులు తరలించారు.పల్నాడుపై సిట్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. పల్నాడు జిల్లా పోలింగ్ నాటి హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు చేస్తోంది. మరోవైపు.. ఈవీఎం ధ్వంసం ఘటనపై సిట్ ప్రత్యేక దృష్టి పెట్టింది. సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలోనే విచారణ కొనసాగుతోంది. ఎస్పీ ఆధ్వర్యంలో దర్యాప్తు సాగుతోంది.ఈవీఎం ధ్వంసం వెనుక కారణాలపై సిట్ ఆరా తీస్తోంది. పిన్నెల్లి వీడియోతో సంబంధం లేదని ఈసీ ప్రకటించగా, వీడియో బయటకు ఎలా వచ్చిందనేదానిపై సిట్ విచారణ చేపట్టనుంది. కుట్ర కోణాలు ఉన్నాయా? అనే అంశంపై సిట్ పరిశీలించనుంది. మాచర్ల, పల్నాడు ఈవీఎం ఘటనలపై సిట్ సమగ్ర నివేదిక సిద్ధం చేయనుంది. -
ఎస్పీ కి వైఎస్ఆర్సీపీ నేతల విజ్ఞప్తి
-
కడుపు మంటతోనే టీడీపీ దాడులు
-
చివరి అంకానికి సిట్ దర్యాప్తు
-
తాడిపత్రి హింసాత్మక ఘటనల వెనుక అసలు హస్తం


