గుత్తి-తాడిప్రతి హైవేపై మిస్టరీ డెత్‌ | Car Rams Into Lorry On Gooty Tadipatri Highway | Sakshi
Sakshi News home page

గుత్తి-తాడిప్రతి హైవేపై మిస్టరీ డెత్‌

Jul 30 2026 9:00 AM | Updated on Jul 30 2026 10:27 AM

Car Rams Into Lorry On Gooty Tadipatri Highway

సాక్షి, అనంతపురం: గుత్తి-తాడిపత్రి హైవేపై మృతి చెందిన వ్యక్తిని తెలంగాణ వాసిగా పోలీసులు గుర్తించారు. కారు వేగంగా లారీని ఢీ కొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే కారులో మంటలు చెలరేగాయి. దీంతో ఇద్దరు దూకేశారు. కారులో చిక్కుకున్న డ్రైవర్‌ సజీవదహనం అయినట్లు పోలీసులు వెల్లడించారు.

ఘటనా స్థలంలో డీజిల్‌ క్యాన్‌లు పోలీసులు గుర్తించారు. డీజిల్ దొంగల ముఠాగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలోని నారాయణపేట జిల్లా మరికల్ మండలం బుడేగాన్ తాండాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. హత్యా? ప్రమాదమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement