రాళ్లు రువ్వుకున్న జేసీ,కాకర్ల వర్గీయులు .. తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత | Tension in Tadipatri over political rivalry between JC Prabhakar Reddy and Kakarla Ranganath | Sakshi
Sakshi News home page

రాళ్లు రువ్వుకున్న జేసీ,కాకర్ల వర్గీయులు .. తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత

Aug 31 2025 4:46 PM | Updated on Aug 31 2025 5:24 PM

Tension in Tadipatri over political rivalry between JC Prabhakar Reddy and Kakarla Ranganath

సాక్షి,అనంతపురం: టీడీపీ నేతల మధ్య ఆధిపత్యపోరుతో తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వినాయక నిమజ్జనం సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ టీడీపీ నేత కాకర్ల రంగనాథ్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వినాయక నిమజ్జనం ఊరేగింపులో జేసీ, కాకర్ల వర్గీయులు ఎదురుపడ్డారు. పరస్పర నినాదాలు చేసుకుంటూ ఒకరిపై ఒకరు రాళ్లు రువుకున్నారు. ఇరు వర్గాలకు జరిగిన ఘర్షణలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.

ఘర్షణపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతంలో పెద్ద ఎత్తున మొహరించారు. ఇరు వర్గాలపై లాఠీఛార్జ్‌ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement