సచివాలయ ఉద్యోగులపై మరో పిడుగు
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల అటెండెన్స్ యాప్‌లో కొత్త నిబంధనలు
తమను ప్రభుత్వం టార్గెట్ చేసిందని మండిపడుతున్న ఉద్యోగ సంఘాలు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై చంద్రబాబు ప్రభుత్వం మరో పిడుగు వే సింది. ఇప్పటికే సర్వేల పేరిట ఉక్కిరిబిక్కిరి చేస్తూ షోకాజ్ నోటీసులతో బెంబేలెత్తిస్తున్న సర్కారు తాజాగా హాజరు నిబంధనలు మార్చింది. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఉదయం 10.40 గంటల తర్వాత పంచ్ వేస్తే సెలవుగా పరిగణిస్తామంటూ కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మేరకు సచివాలయాల ఉద్యోగుల ముఖ ఆధారిత హాజరు నమోదు యాప్‌లో సోమవారం ఆయా నిబంధనలు ప్రత్యక్షమయ్యాయి.
నిబంధనలు ఇలా...
ఆఫీసు మాన్యువల్ ప్రకారం సచివాలయాల ఉద్యో గులు ఉదయం 10.30 గంటల్లోగా హాజరు నమోదు చేయాలి. మరో పది నిమిషాలు సర్దుబాటు సమయం (గ్రేస్ టైం) కల్పించినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉదయం 10.40 గంటల తర్వాత 11.30 గంటల మధ్య నెలలో హాజరు నమోదును ఆయా సచివాల యాల డీడీవో (వేతన బిల్లులు నమోదు చేసే అధికారి) ముందస్తు అనుమతితో నెలలో మూడు సార్లు సా ధారణ హాజరుగా వీలు కల్పించనున్నట్టు పేర్కొంది.
మూడు సార్లు మించి ఒక ఉద్యోగి 10.40 గంటల త ర్వాత 11.30 గంటల మధ్య హాజరు నమోదు చేసినా ప్రతిసారి అర రోజు సెలవుగా పరిగణిస్తామని ప్రభు త్వం స్పష్టం చేసింది. నెలలో ఏ రోజైనా ఒక ఉద్యోగి 11.31 నుంచి మధ్యాహ్నం రెండు గంటల మధ్య హా జరు నమోదు చేసినా అరరోజు సెలవుగా పరిగణిస్తా రు. మధ్యాహ్నం 2.01 గంటల నుంచి ఐదు గంటల మధ్య హాజరు నమోదు చేస్తే పూర్తి రోజు సెలవుగానే పరిగణించనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.
నెలలో గరిష్టంగా ఏడు రోజులు మాత్రమే ఆన్‌డ్యూటీ హా జరుకు అవకాశం ఇవ్వనున్నట్టు పేర్కొంది. అయితే ప్రభుత్వం ప్రత్యేకించి గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను టార్గెట్ చేసుకుని వివిధ నిబంధనలు అమలు చేస్తున్నట్టు ఉందని గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగ సంఘ నేతలు మండిపడుతున్నారు.


