జొమాటో కస్టమర్ల నెత్తిన పిడుగు, భారీ షాకిచ్చిందిగా! | Zomato Shocks Customers With New COD Fee, Extra ₹5 Charge Added To Food Delivery Orders, Check More Details | Sakshi
Sakshi News home page

జొమాటో కస్టమర్ల నెత్తిన పిడుగు, భారీ షాకిచ్చిందిగా!

Sep 12 2026 3:42 PM | Updated on Sep 12 2026 4:20 PM

Zomato begins charging Rs 5 for cash on delivery orders

ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో (Zomato)   తన వినియోగ దారుల నెత్తిన భారీ పిడుగు  వేసింది. 'క్యాష్ ఆన్ డెలివరీ' (COD) ఎంచుకునే వినియోగదారులకు అదనంగా రూ.5 వసూళ్లను  షురూ చేసి కస్టమర్లకు భారీ షాక్‌ ఇచ్చింది. ఇప్పటికే వినియోగదారులపై మోపుతున్న ఛార్జీల బాదుడుకు  మరో వడ్డన తోడైంది. 

మనీకంట్రోల్  నివేదిక ప్రకారం జొమాటోను సొంతం చేసుకున్న ‘ఎటర్నల్’ (Eternal) సంస్థ, తమ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లో క్యాష్ ఆన్ డెలివరీ (Cash on Delivery) ఎంచుకునే వినియోగదారులపై అదనంగా  ఈ ఫీజును వసూలు చేయనుంది.

ఈ కొత్త “పే ఆన్ డెలివరీ ఫీజు” (Pay on delivery fee) జొమాటో బిల్లు వివరాలలో ప్రత్యేక లైన్ ఐటమ్‌గా కనిపిస్తోంది. ఆహారం ఇంటికి వచ్చాక నగదు రూపంలో చెల్లించే (CoD) ఆర్డర్లపై ఈ రుసుము విధిస్తుస్తోంది.. అయితే కొన్ని సందర్భాల్లో ఈ ఫీజు రూ. 7 నుండి రూ. 20 వరకు మారుతున్నట్లు తెలుస్తోంది. ఈ రుసుము జొమాటో ఇప్పటికే వసూలు చేస్తున్న ప్లాట్‌ఫామ్ ఫీజు, రెస్టారెంట్ ప్యాకేజింగ్ ఛార్జీలు , GST కి అదనమైనది. ఆన్‌లైన్‌లో చెల్లించే వారికి ఈ ఫీజు వర్తించదు, కేవలం క్యాష్ ఆన్ డెలివరీ ఎంచుకున్న వినియోగదారులు మాత్రమే ఈ అదనపు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: రూ. 250లతో చెట్టు కింద ఉచిత స్కూలు: KBC 18 కంటెస్టెంట్‌ ఇంట్రస్టింగ్‌ స్టోరీ

ఇప్పటికే ప్లాట్‌ఫామ్ ఫీజు కింద ప్రతి ఆర్డర్‌పై రూ. 14.99 వరకు  వసూలు చేస్తున్న జొమాటో  రెస్టారెంట్ ప్యాకేజింగ్ ఛార్జీలు, జీఎస్టీ వాయింపునకు తోడుఈ సీఓడీ ఫీజు అదనం. ప్రస్తుత లెక్కల ప్రకారం జొమాటో రోజుకు సగటున 2.3 నుండి 2.5 మిలియన్ల (23-25 లక్షల) ఆర్డర్లను ప్రాసెస్ చేస్తుంది. తాజా పెంపుతో కంపెనీకి ఏడాదికి వందల కోట్ల అదనపు ఆదాయాన్ని దండుకోనుంది. 

ఫుడ్ డెలివరీ రంగంలో పోటీ తీవ్రమవుతున్న సమయంలో జొమాటో ఈ నిర్ణయం తీసుకుంది. రాపిడోకి చెందిన ‘ఓన్లీ’ (Ownly) ఆదరణ పొందుతుండటం, ఫ్లిప్‌కార్ట్ ‘ఈట్ ఇన్’ (Eat In) పేరుతో ఫుడ్ డెలివరీ సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించడం మరియు ‘స్విష్’ (Swish) వంటి స్టార్టప్‌లు కొత్తగా నిధులు సమకూర్చుకోవడంతో జొమాటో, స్విగ్గీ వంటి దిగ్గజాలపై పోటీ ఒత్తిడి పెరుగుతోందంటున్నారు మార్కెట్‌ నిపుణులు.
ఇదీ చదవండి:  నేనో పెద్ద ప్రకటన చేయబోతున్నా : కేజ్రీవాల్‌ ట్వీట్‌ వైరల్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement