వేరబుల్స్ అనగానే మనకు గుర్తుకు వచ్చేవి... స్మార్ట్ వాచ్, ఫిట్‌నెస్ బ్యాండ్, రింగ్.... మొదలైనవి. ‘టెంపుల్ రూపంలో కొత్త రకం వేరబుల్ రావాల్సిన అవసరం ఉంది’ అంటున్నారు ‘జొమాటో’ ఫౌండర్ దీపీందర్ గోయల్.
గత కొన్ని నెలలుగా గోయల్ ఈ ‘టెంపుల్’ గురించి ఊరిస్తున్నారు. దానిపై హైప్ సృష్టిస్తున్నారు. ‘త్వరలోనే టెంపుల్ భారతదేశంలో విడుదల కాబోతుంది’ అని ఆయన ప్రకటించారు.
ఇంతకీ ఏమిటి ఈ టెంపుల్?
దీపీందర్ గోయల్ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రయోగాత్మక వెల్నెస్ వేరబుల్...టెంపుల్. అథ్లెట్ల కోసం రూపొందించిన ఒక హై–పెర్ఫార్మెన్స్ ట్రాకర్‌గా ‘టెంపుల్’ గురించి ప్రచారం చేస్తున్నారు. మెదడు, శరీర కార్యకాలపాలను పర్యవేక్షించడానికి దీన్ని రూపొందించారు. ప్రామాణిక ఫిట్‌నెస్ కొలమానాలకు మించి ఇది పనిచేస్తుందని చెబుతున్నారు. ప్రముఖ అథ్లెట్‌లలో కొందరు ‘టెంపుల్’ ధరించి కనిపిస్తున్నారు. తేలికైన డిజైన్‌తో ఉండే ఈ పరికరాన్ని కణతల ప్రాంతంలో నొప్పి లేకుండా ధరించవచ్చు.
ఇవీ చదవండి: ఐఐటీ చదివి గూగుల్‌లో జాబ్ కొట్టాలనుకుంటే..ఏకంగా ఆ కంపెనీనే..!


