సాక్షి, కాకినాడ జిల్లా: ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు సాధిక్ వేధింపులు కారణం కాదని సాధిక్ ఖాన్ తల్లి నూర్జహాన్ తెలిపారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నూకరాజు అల్లుడు జగదీశ్వర్‌రెడ్డిని సాధిక్ చంపలేదన్నారు. ‘‘సౌజన్య రెండు సార్లు మా ఇంటికొచ్చింది. సాధిక్‌ను పెళ్ళి చేసుకుంటానని చెప్పింది. ఈ ప్రతిపాదనకు మా కుటుంబం ఒప్పుకోలేదు. జగదీశ్వరరెడ్డి మరణించాక తనను పెళ్లి చేసుకోవాలని సౌజన్య.. సాధిక్‌ను ఒత్తిడి చేసింది’’ అంటూ సాధిక్ ఖాన్ తల్లి చెప్పుకొచ్చారు.
‘‘ఈ ఏడాది ఫిబ్రవరి 14న సౌజన్య ఇంటికి రమ్మని సాధిక్‌ను పిలిచింది. అక్కడ సాధిక్‌పై జగదీశ్వర్‌రెడ్డి అతని మనుషులు దాడి చేసి బంధించారు. దీంతో వంటగదిలో కత్తితో బెదిరించి సాధిక్ అక్కడ నుండి పారిపోయాడు. జగదీశ్వరరెడ్డితో పెళ్లి కాకపొతే సౌజన్యను సాధిక్ ఇచ్చి వివాహం చేసేవాడినని నూకరాజు మా ఇంటికి వచ్చి చెప్పాడు. ఈ రిలేషనల్ మంచిది కాదని సాధిక్‌ను మందలించాను. తన భర్త పట్టించుకోవడం లేదని సాధిక్‌తో సౌజన్య రిలేషన్ నడిపింది. సౌజన్య కొడుకు సాధిక్‌ను అబ్బు అని.. తన తండ్రిని ఇడియట్ అని పిలిచేవాడు. రోజు ఫోన్‌లో మా అబ్బాయి చెప్పే కథలు విని సౌజన్య కొడుకు పడుకునేవాడు.
‘‘మా ఇంటికి వచ్చి తెలుగు ఖురాన్, బుర్కా కావాలని సౌజన్య అడిగింది. చనిపోయిన రోజు సాయంత్రం 5:30కి సాధిక్‌కు సౌజన్య ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలిచింది. తన స్టూడెంట్స్ కేరళలో ఈవెంట్స్ వెళ్లాలని.. రావడం కుదరదని చెప్పి సాధిక్ అకాడమీకి వెళ్ళిపోయాడు. నూకరాజు, జగదీశ్వర రెడ్డి ఆస్తులు, బంగారం మా వద్ద లేదు. మా కుటుంబం బ్యాంక్ పుస్తకాలు, ఆధార్ కార్డులు పోలీసులకు ఇచ్చేశాము.’’ అని సాధిక్ ఖాన్ తల్లి నూర్జహాన్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 6 ఏళ్లకే ఈ బాలుడు ‘అభిజీత్ దీప్కే’లా అయిపోయాడు..


