breaking news
Sadiq Khan
-
స్లోపాయిజన్‌తో జగదీశ్వరరెడ్డి హత్య
కాకినాడ రూరల్: కాకినాడలో పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు అల్లుడు జగదీశ్వరరెడ్డిని హత్యచేసేందుకు అతడికి సాధిక్‌ఖాన్ పలుమార్లు స్లోపాయిజన్ ఇచ్చినట్లు తేలింది. నూకరాజు కుటుంబం ఆత్మహత్య, జగదీశ్వరరెడ్డి హత్యకేసుల్లో నిందితుడైన సాధిక్‌ఖాన్‌కు మూడురోజుల పోలీసు కస్టడీ శుక్రవారం ముగిసింది. జగదీశ్వరరెడ్డి హత్యకేసులో విచారణకు సాధిక్‌ను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్న సర్పవరం పోలీసులు గడువు ముగియడంతో శుక్రవారం అతడికి కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో వైద్యపరీక్షలు చేయించి, అమలాపురంలోని మొబైల్ కోర్టు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ అనుమతితో సాధిక్‌ఖాన్‌ను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. నూకరాజు, అతని భార్య మీనా, కుమార్తె సౌజన్య ఆత్మహత్య, అల్లుడు జగదీశ్వరరెడ్డి హత్యకేసులో సాధిక్‌ఖాన్ విచారణలో పోలీసులను బురిడీ కొట్టించే ప్రయత్నించినా సాంకేతిక ఆధారాలు అతడిని నేరం ఒప్పుకొనేలా చేశాయి. ప్రధానంగా కాకినాడ జిల్లా సర్పవరం పోలీస్‌స్టేషన్‌లో జగదీశ్వరరెడ్డి తండ్రి భాస్కరరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్యకేసు నమోదు చేసిన పోలీసులు సాధిక్‌ఖాన్‌ను మంగళవారం కస్టడీలోకి తీసుకుని మూడురోజులు విచారించారు. ఈ విచారణలో సాధిక్‌కు ప్రమాదకరమైన రసాయనం అందించిన హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులను అతడి సమక్షంలో విచారించడంతోపాటు సీన్ రీకన్‌స్ట్రక్షన్‌కు సాధిక్ అకాడమీ వద్దకు తీసుకువెళ్లారు. కీలక ఆధారాలు సేకరించి అకాడమీని సీజ్‌చేశారు. నూకరాజు కుటుంబం ఆత్మహత్య, అల్లుడు హత్య, సూసైడ్ నోట్లలో కీలకమైన అంశాలకు సంబంధించి విచారించేందుకు 200 ప్రశ్నలను సిద్ధం చేసుకున్న పోలీసులు 110 ప్రశ్నను మాత్రమే అడిగినట్లు తెలిసింది. స్లోపాయిజన్ ఇచ్చినట్టు అంగీకారం విచారణకు సంబంధించి పోలీసువర్గాలు తెలిపిన మేరకు.. కుమారుడు కార్తికేయరెడ్డిని రైఫిల్ షూటింగ్ కోసం సాధిక్ అకాడమీ వద్దకు తీసుకువెళ్లిన సౌజన్యను సాధిక్‌ఖాన్ ట్రాప్ చేసి, ఏడాదిన్నరకుపైగా సన్నిహితంగా మెలిగాడు. గత ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం రోజున జగదీశ్వరరెడ్డితో కారులో పిఠాపురం మొబైల్ షాపునకు వెళుతున్న సమయంలో సాధిక్ పదేపదే సౌజన్యకు కాల్ చేశాడు. అనుమానం వచ్చిన జగదీశ్వరరెడ్డి సెల్ లాక్కుని ప్రశ్నించడంతో ఇద్దరికి వాదన జరిగింది. అదేరోజు సాయంత్రం సాధిక్ కాకినాడలోని ఇంట్లో ఉన్న జగదీశ్వరరెడ్డిని కొట్టి, చాకుతో హత్యాయత్నం చేశాడు. ఆర్థికంగా స్థితిమంతుడు, క్లాస్‌వన్ కాంట్రాక్టర్ అయిన జగదీశ్వరరెడ్డి పరువుపోతుందని పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. సాధిక్.. సౌజన్యతో చనువుగా ఉంటూనే జగదీశ్వరరెడ్డిని హత్యచేసేందుకు ప్లాన్ చేశాడు. ఆహారం అరుగుదలకు సంబంధించిన సమస్యతో సర్పవరం జంక్షన్లో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్న జగదీశ్వరరెడ్డికి పలుమార్లు కొబ్బరి బొండంలో స్లోపాయిజన్ రసాయనం కలిపి ఇచ్చాడు. చివరిగా హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్ ఉండగా ఇచ్చాడు. జగదీశ్వరరెడ్డి మృతికి ముందురోజు జూలై ఒకటో తేదీ రాత్రి ఆస్పత్రి రీహేబిలిటేషన్ సెంటరులో ఉండగా రాత్రి సమయంలో పొటాషియం సైనేడ్ ఇచ్చినట్టు పోలీసులు నిర్ధారించారు. అయితే స్లో పాయిజన్ మాత్రమే ఇచ్చానని, సైనేడ్ ఇవ్వలేదని సాధిక్ పోలీసుల వద్ద అంగీకరించాడు.ఆస్తికోసం నరకం చూపించాడుపీఆర్ ఏఈగా పనిచేస్తున్న నూకరాజుకు కుమారుడు చనిపోగా ఒకే కుమార్తె సౌజన్య ఉంది. దీంతో ఆమె తండ్రి ఆస్తులతోపాటు భర్త జగదీశ్వరరెడ్డి ఆస్తులపై సాధిక్ కన్నుపడింది. సౌజన్యను ఆస్తికోసం వేధించాడు. భర్త చనిపోయిన తరువాత తన పేరిట రావులపాలెంలో ఉన్న సుమారు రూ.25 కోట్ల విలువైన 44 సెంట్ల స్థలాన్ని అత్తమామలకు రాసి ఇచ్చేందుకు సౌజన్య సిద్ధమైంది. ఆ స్థలాన్ని తన పేరిట రాయాలని సాధిక్ ఆమెపై ఒత్తిడి తెచ్చి చిత్రహింసలకు గురిచేశాడు. నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన ఆగస్టు 16కు ముందురోజు సాధిక్ ఆ స్థలాన్ని తనకే ఇవ్వాలని పట్టుబట్డాడు. ఇవ్వకపోతే సౌజన్యతో కలిసి జగదీశ్వరరెడ్డిని చంపిన విషయం అతడి తండ్రి భాస్కరరెడ్డికి చెబుతానని బ్లాక్మెయిల్ చేశాడు. అల్లుడి హత్య గురించి అప్పుడే తెలుసుకున్న నూకరాజు కుటుంబం.. సాధిక్ తమను బతకనివ్వడని భయపడింది. నూకరాజు, భార్య, కుమార్తె, మనుమడు కలిసి మరుసటిరోజు గోదావరిలో దూకేశారు. మనుమడు కార్తికేయరెడ్డి బతకగా మిగిలిన ముగ్గురు చనిపోయారు. ఈ విషయం తెలిసిన సాధిక్ మీరట్‌కు పారిపోయి తరువాత పోలీసులకు చిక్కాడు. నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు ముందురోజు వాట్సాప్ కాల్, మామూలు కాల్ ద్వారా నూకరాజును బ్లాక్మెయిల్ చేయడం, ఆస్తికోసం బెదిరించడం వంటి కీలక ఆధారాలను సేకరించిన పోలీసులు విచారణలో ఆ అంశాలు ప్రస్తావించడంతో జగదీశ్వరరెడ్డిని హత్యచేసినట్లు సాధిక్‌ఖాన్ అంగీకరించినట్లు తెలిసింది. నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో విచారించేందుకు రాజమహేంద్రవరం పోలీసులు అతడిని కస్టడీకి ఇవ్వమని న్యాయసా్థనాన్ని కోరేందుకు సిద్ధమవుతున్నారు. -
సాధిక్ ఖాన్ కు రిమాండ్.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు
-
సాధిక్ ఖాన్ కేసులో ట్విస్ట్.. కీలక ఆధారాలు లభ్యం
-
సాధిక్ రైఫిల్ షూటింగ్ అకాడెమీ సీజ్
కాకినాడ రూరల్: పంచాయతీ రాజ్ ఏఈ టి.నూకరాజు కుటుంబం మూకుమ్మడి ఆత్మహత్య, ఆయన అల్లుడి హత్య కేసులో కీలక నిందితుడు షేక్ సాధిక్ ఖాన్ నుంచి పోలీసులు మూడో రోజు కీలక ఆధారాలు సేకరించారు. సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా సర్పవరం సీఐ సీహెచ్ ప్రకాష్, పోలీసు బృందం గురువారం ఉదయం సాధిక్‌ను కాకినాడలోని గుడారిగుంట సమీపంలోని సాధిక్‌కు చెందిన ప్రో రైఫిల్ షూటింగ్ అకాడెమీకి తీసుకువెళ్ళారు. రెండో అంతస్తులో ఉన్న అకాడెమీలో శిక్షణ కోసం వినియోగించే 30 రైఫిల్స్‌ను, కీలకమైన ఆధారాలు, ల్యాప్‌టాప్‌లతో పాటు ప్రత్యేకంగా రూమ్ తదితర వాటిని గుర్తించారు. అకాడెమీని సీజ్ చేసి, అక్కడి రైఫిల్స్, కీలక ఆధారాలను స్వాదీనం చేసుకున్నారు. అనంతరం పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చి సాధిక్‌ను విచారించారు. ముఖ్యంగా రైఫిల్స్ ఎక్కడ నుంచి వచ్చాయి, శిక్షణకు ఉన్న అర్హత, అకాడెమీకి అనుమతులు, ఎంత మందికి శిక్షణ ఇచ్చారు తదితర అంశాలపై ఆరా తీశారు. సౌజన్య కుమారుడితో అకాడెమీకి ఎప్పటి నుంచి వచ్చేది, ఆమెతో పరిచయం, వేధింపులు, ఆమె భర్త హత్య, తదితర కీలకమైన అంశాలపై ప్రశ్నలకు సమాధానం రాబట్టారు. సౌజన్య కుమారుడిని అకాడెమీకి కారులో సాయంత్రం తీసుకువెళ్లి 2 గంటల పాటు అక్కడే ఉండేదని, అక్కడ సాధిక్ రైఫిల్ షూటింగ్ కంటే ఆమెపైనే ఎక్కువ దృష్టి పెట్టేవాడని సమాచారం. ఆమెను తనకు అనుగుణంగా మార్చుకుని పథకం ప్రకారమే జగదీశ్వరరెడ్డిని హతమార్చినట్టు విచారణలో గుర్తించినట్టుగా పోలీసు వర్గాలు చెబుతున్నాయి. విచారణలో భాగంగా జగదీశ్వరరెడ్డికి చెందిన ఖరీదైన కార్లను ఆధారాల కోసం పోలీసులు ఆధీనంలో ఉంచుకున్నట్టు తెలిసింది. సాధిక్ ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా అన్నీ సౌజన్యపై నెట్టివేసే ప్రయత్నం చేయడంతో సాంకేతిక ఆధారాలు, సూసైడ్ నోట్లను ఉదహరిస్తూ 200 ప్రశ్నలతో కొంత మేర సమాచారం రాబట్టారు. సాధిక్ పోలీసు కస్టడీ ముగియడంతో శుక్రవారం ఉదయం కాకినాడలోని కోర్టులో హాజరుపరచనున్నారు. అయితే, మరోసారి కస్టడీ కోరుతూ పిటిషన్ వేసే అవకాశం ఉందని సర్పవరం పోలీసులు చెబుతున్నారు. -
జగదీశ్వర్ రెడ్డి పై పగతో స్లో పాయిజన్ పోలీస్ విచారణలో కీలక విషయాలు
-
సౌజన్య ఎలా పరిచయం.. సాధిక్ తో పోలీసుల సీన్ రీకన్ స్ట్రక్షన్
-
అంతా సౌజన్యే చేసింది!
కాకినాడ రూరల్: పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ టి.నూకరాజు కుటుంబం ఆత్మహత్య, ఆయన అల్లుడు జగదీశ్వరరెడ్డి హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న కాకినాడకు చెందిన షేక్ సాధిక్ ఖాన్ ఈ నేరానికి సంబంధించి పోలీసుల ప్రశ్నలకు వరుసగా రెండవరోజూ ఎప్పటిలాగే ‘తనకేం తెలియదు, తన తప్పేంలేదు’ అని సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. ‘తప్పంతా జగదీశ్వరరెడ్డి భార్య సౌజన్యదే’ అంటూ ఆమెపై నెట్టే ప్రయత్నం చేసినట్లు సమాచారం. మూడు రోజుల విచారణ నిమిత్తం సాధిక్‌ను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం మొదటిరోజు మంగళవారం విచారణలో 60 ప్రశ్నలు సంధించిన పోలీసులు, బుధవారం రెండోరోజూ పలు కీలకమైన అంశాలపై 70 ప్రశ్నలతో సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. విచారణ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేశారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకూ సీఐ గదిలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో న్యాయవాది సమక్షంలో సాధిక్‌ను ప్రశ్నించారు. జగదీశ్వరరెడ్డి హత్యకుగాను సాధిక్‌కు సైనేడ్ ఎలా వచ్చిందనే కోణంలో హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు సర్పవరం స్టేషన్‌కు రప్పించి సాధిక్ సమక్షంలో విచారించారు. ఈ క్రమంలో ఒకరు సైనేడ్ ఇచ్చిన విషయం ఒప్పుకున్నట్టు తెలిసింది. ఉదయం విచారణలో అదనపు ఎస్పీ మహంతి కిశోర్ కుమార్ స్వయంగా పాల్గొన్నారు. ముఖ్యంగా సౌజన్యతో పరిచయం ఎలా ఏర్పడింది, ఆమె భర్త జగదీశ్వరరెడ్డి హత్య, అందుకు వినియోగించిన రసాయనాలు, నూకరాజు కుటుంబానికి వేధింపులు, వారి ఆస్తులపై కన్ను, నకిలీ సర్టిఫికెట్లతో రైఫిల్ షూటింగ్ అకాడమీ నిర్వహణ తదితర అంశాలపై సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. సాధిక్ విచారణ కోసం మొదటి నుంచీ సేకరించిన ఆధారాలు, సూసైడ్ నోట్లలోని అంశాల ఆధారంగా సుమారు 200 ప్రశ్నలతో జాబితా సిద్ధం చేసుకున్న పోలీసులు ఆ విధంగానే ముందుకు సాగుతున్నారు. -
తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయా.. పోలీసులకు సాదిక్ ఖాన్ సమాధానాలు?
-
తెలీదు.. గుర్తులేదు.. మర్చిపోయా..
తెలీదు.. గుర్తులేదు.. మర్చిపోయా.. సర్పవరం పోలీసుల తొలిరోజు విచారణలో నిందితుడు సాధిక్‌ఖాన్ ఇచ్చిన సమాధానాలు దాదాపుగా ఇవే. పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య, అల్లుడు అనుమానాస్పద మృతిలో కీలక నిందితుడు సాధిక్ ఖాన్‌ను మంగళవారం కస్టడీకి తీసుకున్న సర్పవరం పోలీసులు తొలిరోజు విచారణ ప్రారంభించారు. అతడి న్యాయవాది సమక్షంలో అదనపు ఎస్పీ మహంతి కిషోర్‌కుమార్ ఆధ్వర్యంలో రూరల్ పీఎస్ ఆవరణలో ఉన్న ప్రత్యేక గదిలో అతన్ని విచారిస్తున్నారు.ఉదయం ప్రారంభమైన విచారణ, రాత్రి 9.30 సమయానికి కూడా కొనసాగుతోంది. పోలీసు వర్గాల నుంచి తెలిసిన సమాచారం మేరకు.. సాధిక్‌ను విచారించేందుకు 200 ప్రశ్నలతో జాబితాను సిద్ధం చేసుకున్న పోలీసులు తొలిరోజు 60 ప్రశ్నలు అడిగారు. అందులో ఎక్కువ మేరకు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ సాధిక్ సమాధానం ఇవ్వడం గమనార్హం. సాంకేతిక ఆధారాలతో సాధిక్‌ను అడిగిన ప్రశ్నలకు వాస్తవ సమాధానాలు కనిపెట్టే యోచనలో పోలీసులు ఉన్నారు. విచారణకు పూర్తి స్థాయి సహకారం లేకపోవడం వల్ల సాంకేతిక అంశాలపై ఆధారపడి కేసు విచారణ కొనసాగించే అవకాశం ఉందని సమాచారం. మీరట్‌లో ఏం జరిగింది... సాధిక్ మీరట్ వెళ్లడం వెనుక కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. నేరుగా ఆంధ్రా పోలీసులకు చిక్కకుండా సాధిక్ అక్కడి పోలీసుల ద్వారా అరెస్టయ్యాడని తెలిసింది. స్థానిక పోలీసులు అరెస్టు చేయడం వల్లే ఆంధ్రా పోలీసులు వెళ్లి ట్రాన్సిట్ వారెంట్ ద్వారా తీసుకురావలసి వచ్చిందని స్పష్టమైంది. ఆంధ్ర పోలీసులకు చిక్కే సమయానికి సాధిక్‌కు చెందిన స్థానికులు మీరట్ పోలీసులకు సమాచారం అందించి కావాలనే అరెస్టు చేయించారని, నేరుగా ఆంధ్రా పోలీసులకు చిక్కితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ముందే గుర్తించిన సాధిక్ తన మార్గదర్శి ద్వారా ఈ పన్నాగం పన్నాడని చెబుతున్నారు. అతడి వెనకున్నదెవరు అన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. సాధారణంగా దేశంలో ఏ మూల ఉన్నా నిందితులను పోలీసులు ఆయా ప్రాంతాలను వెళ్లి అరెస్టు చేసి జిల్లాకు తీసుకువస్తారు. కాని సాధిక్ విషయంలో అలా జరగలేదు. ట్రాన్సిట్ వారెంట్ తప్పనిసరి అయింది. అవును రసాయనం తెచ్చాను... సౌజన్య భర్త జగదీశ్వర్ రెడ్డి హత్యకు వినియోగించాడని చెబుతున్న ప్రాణాంతక రసాయనం ఏంటి, ఎక్కడి నుంచి తెచ్చావన్న ప్రశ్నకు రసాయనం తేవడం నిజమేనని అంగీకరించినట్టు తెలిసింది. అయితే, ఆ రసాయనం ఉపయోగించి తాను చంపలేదని చెబుతున్నాడు. ఈ విషయాన్ని నిరూపించడం పోలీసులకు ఓ సవాల్‌గా మారింది. ఇప్పటికే జగదీశ్వర్‌రెడ్డి చికిత్స పొందిన ఆసుపత్రుల నుంచి ఆరోగ్య నివేదికలు సేకరించారు. వాటిని నిపుణుల పరిశీలనకు పంపారు. నకిలీ డిగ్రీ సర్టిఫికెట్తో.. మంగళవారం నాటి విచారణలో పోలీసులు కీలక విషయం రాబట్టారు. మోసం చేయడం ఆది నుంచి సాధిక్‌కు ఓ అలవాటైన విషయమని మరోసారి నిర్ధారించుకున్నారు. ఇంత డాబు, దర్పాన్ని ప్రదర్శిస్తున్న సాధిక్ కనీసం డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. నకిలీ సర్టిఫికెట్ ఒకటి తయారు చేయించుకొని వివిధ పోటీలలో పాల్గొనడం దగ్గర నుంచి, కోచ్‌గా పాఠశాలల్లో చేరడం వరకు చేశాడని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈ విషయాన్ని స్వయానా సాధిక్ అంగీకరించాడు. ఇద్దరు సెంటు వ్యాపారస్తుల విచారణ... సా«ధిక్ ఖాన్‌ను కస్టడీకి తీసుకొచ్చే కొద్ది రోజుల ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. జగదీశ్వర్‌రెడ్డిని హతమార్చేందుకు సాధిక్ సర్వ ప్రయత్నాలు చేశాడన్న విషయం రూఢీ అయింది. అందులో భాగంగా రాజమహేంద్రవరం గాం«దీపురంలో ఉన్న ఓ సెంటు వ్యాపారస్తుడు అబ్దుర్ రెహమాన్ సాధిక్ సంప్రదించాడు. తనకు హానికారక రసాయనం కావాలని, ఒక వ్యక్తిని హతమార్చాలని చెప్పాడు. అది ప్రస్తుతం తన వద్ద లేదని చెప్పిన రెహమాన్ హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్ ఖాదిర్‌ను సంప్రదించాలని చెప్పి ఫోన్ నంబర్ ఇచ్చాడు. పోలీసులు వీరిద్దరినీ విచారిస్తుండగా వారి న్యాయవాది వచ్చి విడుదల చేయించారని, విచారణకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పి తీసుకెళ్లారని తెలిసింది. సాధిక్ విచారణ కొనసాగుతుండడంతో వారిద్దరినీ మరో మారు పిలిపించే అవకాశం ఉంది. ఆ పార్సిల్లో ఏముంది? అబ్దుల్ ఖాదిర్ హైదరాబాద్ నుంచి సెంట్ల తయారీలో వినియోగించే ఓ హానికర రసాయనాన్ని సాధిక్‌కు పంపాడని సమాచారం. ఈ విషయాన్ని నిర్ధారించుకునేందుకు పంపిన మార్గాన్ని పోలీసులు అన్వేషిస్తున్నారు. ఓ ట్రావెల్ బస్సులో కొద్ది రోజుల క్రితం సాధిక్‌కు ఓ పార్సిల్ అందిందన్న సమాచారం పోలీసులకు తెలియడంతో డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదురుగా ఉన్న సదరు ట్రావెల్స్ ఆఫీసులో విచారణ చేశారు. అక్కడి వారు పార్సిల్ రావడం నిజమేనని నిర్ధారించారు. ఆ పార్సిల్లో ఏమొచ్చిందో పోలీసులకు అంతుబట్టడం లేదు. అది ఖాదిర్ పంపిన విషపూరిత రసాయనం అయి ఉండొచ్చన్న అనుమానాలు పోలీసులలో ఉన్నాయి. -కాకినాడచదవండి: బ్యాంకులకు వరుసగా నాలుగు రోజులు సెలవులు -
రాజమండ్రి సెంట్రల్ జైలుకు సాధిక్ ఖాన్ తరలింపు
-
2 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్ ఖాతా.. సాదిక్ ఖాన్ పాత్రపై పోలీసుల దర్యాప్తు
-
సౌజన్య కేసులో సంచలనం జగదీశ్ రెడ్డి ఆస్తిపై కన్నేసిన సాధిక్ ఖాన్
-
సాధిక్ చేతిలో రూ.2 కోట్ల ఓడీ ఖాతా!
కాకినాడ క్రైం: పంచాయతీరాజ్ శాఖ పిఠాపురం ఏఈ టి.నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడైన సాధిక్ ఖాన్ వ్యవహారంలో తవ్వుతున్నకొద్దీ విస్తుపోయే నిజాలు బయట పడుతున్నాయి. నూకరాజు అల్లుడు జగదీశ్వర్‌రెడ్డికి చెందిన కరూర్ వైశ్యా బ్యాంక్(కేవీబీ)కు సంబంధించి రూ.2 కోట్ల ఓడీ పరిమితి ఉన్న ఖాతా సాధిక్ ఖాన్ చేతికి చిక్కిందనే కీలక విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు కేవీబీ భానుగుడి బ్రాంచికి శుక్రవారం వెళ్లి మేనేజర్‌ను ఆ ఖాతా వివరాలు ఇవ్వాలని కోరారు. తనకు, జగదీశ్వరరెడ్డికి చెందిన ఖాతాల్లో తన ఫోన్ నంబర్ మార్చి, వాటి ఆర్థిక లావాదేవీలను సాధిక్ ఖాన్ తన చేతుల్లో పెట్టుకున్నాడన్న నూకరాజు కుమార్తె సౌజన్య ఆరోపణలపై లోతైన విచారణ చేపట్టారు. ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా పోలీసులకు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. మరింత స్పష్టత కోసం బ్యాంకుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. అలాగే, సాధిక్ సోదరి, తల్లికి చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా సహా ఇతర బ్యాంకు ఖాతాలపై పరిశీలన మొదలు పెట్టారు. సౌజన్య దగ్గర నుంచి సాధిక్ తీసుకున్న సొత్తును వారికి బదలాయించాడన్న ఆరోపణలపై నిజానిజాలను నిగ్గు తేల్చే పనిలో పోలీసులున్నారు. ఇదిలా ఉండగా సాధిక్‌ను కోర్టు సోమవారం తమ కస్టడీకి ఇచ్చే అవకాశం ఉన్నందున ప్రశ్నల వర్షం కురిపించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు సమాయత్తమవుతున్నారు. అంతకు ముందే పూర్తి వివరాలు, సాక్ష్యాధారాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.సాధిక్ ఖాన్ కస్టడీ పిటిషన్‌పైవిచారణ వాయిదా కాకినాడ లీగల్: పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య, ఆయన అల్లుడు జగదీశ్వరరెడ్డి అనుమానాస్పద మృతి కేసులో నిందితుడైన రైఫిల్ ఘాటింగ్ శిక్షకుడు షేక్ సాధిక్ ఖాన్‌ను పలీసు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. దీనిని న్యాయస్థానం వచ్చే నెల రెండో తేదీకి వాయిదా వేసింది. కస్టడీ పిటిషన్‌పై శుక్రవారం మొబైల్ కోర్టులో విచారణ జరిగింది. ఇరు పక్షాల వాదనలు పూర్తి కాకపోవడంతో విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు. చదవండి: నా బిడ్డకు తండ్రి నువ్వే.. డీఎన్ఏ పరీక్షకు సిద్ధం! -
సౌజన్యకి ఎన్నో సార్లు చెప్పం.. మా ఇంటికి వచ్చి ఏం చేసిందంటే.. సాదిక్ తల్లి, చెల్లి
-
సాధిక్, సౌజన్య ఆన్లైన్లో ఏం ఆర్డర్ పెట్టారు?
కాకినాడ క్రైం: పిఠాపురం ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య, జగదీశ్వర్‌రెడ్డి హత్య కేసుల్లో ప్రధాన నిందితుడు సాధిక్ ఖాన్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. జగదీశ్వర్‌రెడ్డికి అందించిన చికిత్స వివరాలు ఇవ్వాలంటూ ఆయన చికిత్స పొందిన ఆస్పత్రులకు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. కాకినాడలోని జన్మభూమి పార్కు సమీపంలో ఉన్న అహోబిల ఆసుపత్రికి, సర్పవరం జంక్షన్లో ఎస్కే ఆసుపత్రి, నాగమల్లితోట జంక్షన్లో ఉన్న ఇనోదయ ఆసుపత్రుల్లో జగదీశ్వర్‌రెడ్డి చికిత్స పొందగా ఆయా ఆసుపత్రులకు నోటీసులు జారీ చేసి వివరాలు కోరారు. చికిత్స వేళ ప్రమాదకరమైన పదార్థాలు ఏవైనా శరీరంలో గుర్తించారా, అనుమానాస్పద రీతిలో ఆరోగ్య స్థితి ఉండడాన్ని గమనించారా వంటి ప్రశ్నలకు సమా«ధానంగా వైద్యులు అందించే ఆరోగ్య నివేదికలు దోహదపడనున్నాయి. ఏం ఆర్డర్ పెట్టారు? స్లోపాయిజన్ గుణాలున్న రసాయనంతో సాధిక్ సౌజన్యతో కలిసి జగదీశ్వర్‌రెడ్డి హత్యకు పాల్పడ్డాడని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చిన నేపథ్యంలో ఎక్కడి నుంచి ఎలా తెప్పించాడనే వివరాలు సేకరిస్తున్నారు. ఇందుకు సంప్రదాయ మార్గాలను ఎంచుకున్నాడా, మరెక్కడి నుంచైనా తెచ్చాడా అని ఆరా తీస్తున్నారు. ఇందుకు సౌజన్య, సాధిక్లు గడచిన మూడు నెలల్లో పెట్టిన ఆన్లైన్ ఆర్డర్లను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో కాకినాడలో ఇన్‌స్టా మార్టు, బ్లింకిట్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సహా ఇతర ఆన్లైన్ డెలివరీ కార్యాలయాలకు సాధిక్, సౌజన్యల ఫోన్ నంబర్లతో ఇచ్చిన ఆర్డర్ హిస్టరీలు అడుగుతున్నారు. ఇందుకు అధికారికంగా నోటీసులు జారీ చేస్తున్నారు. లావాదేవీలపై ఆరా... సాధిక్ బ్యాంకు అకౌంట్లను పోలీసులు జల్లెడ పడుతున్నారు. మతం మార్చడం, లవ్ జీహాద్, ఉగ్రవాదుల ప్రస్తావనలు తెరపైకి వచ్చిన నేపథ్యంలో అక్రమ మార్గాల్లో లేదా మరెవరి నుంచైనా సాధిక్ ఆర్థిక ప్రయోజనాలు పొందాడా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అతడి బ్యాంకు వివరాలు సేకరిస్తున్నారు. ఇందుకుగాను, మెయిన్‌రోడ్డులో ఉన్న యూనియన్ బ్యాంకు సహా కెనరా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడాలకు నోటీసులు జారీ చేశారు. రేపు మరికొన్ని బ్యాంకులకు పోలీసుల నోటీసులు అందనున్నాయి. సాధిక్‌ఖాన్ కస్టడీపై కౌంటర్ దాఖలు కాకినాడ లీగల్: కాకినాడ జిల్లా పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ టి.నూకరాజు కుటుంబం ఆత్మహత్య, ఆయన అల్లుడు జగదీశ్వరరెడ్డి అనుమానాస్పద మృతి కేసులో నిందితుడైన షేక్ సాధిక్‌ఖాన్‌ను 7రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సర్పవరం పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయవాది జవహర్ అలీ మొబైల్ కోర్టులో గురువారం కౌంటర్ దాఖలు చేశారు. దీనిపై కోర్టులో విచారణ జరగనుందిపోలీసులు కనీస మర్యాద ఇవ్వడం లేదు : సాధిక్‌ఖాన్ సోదరి సాజిదతమని స్టేషన్‌కి పిలిపిస్తున్న పోలీసులు హీనంగా చూస్తున్నారని, కనీస మర్యాద ఇవ్వడం లేదని సాధిక్‌ఖాన్ సోదరి సాజిద గురువారం ఆరోపించారు. అవమానకర రీతిలో మాట్లాడుతూ, నిలబెట్టే ప్రశ్నిస్తుండడం ఆవేదన కలిగిస్తోందన్నారు. స్టేషన్‌కు వెళ్లిన వెంటనే ఫోన్లు స్వాదీనం చేసుకోవడం, వాటిని ఇవ్వమంటే ముప్పుతిప్పలు పెట్టడం మానసిక క్షోభకు గురిచేస్తోందని తెలిపారు. చదవండి: మూడేళ్ల కొడుకుని వంతెనపై వదిలి.. నదిలో దూకిన దంపతులు! -
అలా జరగకపోయి ఉంటే.. సాధిక్ నెక్ట్స్ టార్గెట్ ఎవరంటే?
సాక్షి, అంబేద్కర్ కోనసీమ జిల్లా: తన వియ్యంకుడు ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనపై భాస్కర్‌రెడ్డి స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన కుమారుడు మృతిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడు జగదీశ్వర్‌రెడ్డి హత్యతో సాధిక్ ఖాన్ పాత్రతో పాటు తన కోడలు ప్రమేయం కూడా ఉందని భాస్కర్‌రెడ్డి ఆరోపించారు.నూకరాజు కుటుంబం ఆత్మహత్యలకు పాల్పడిన ఘటన జరగకపోయి ఉంటే సాధిక్ ఖాన్ తర్వాత టార్గెట్ తామేనన్న భాస్కర్‌రెడ్డి.. ఇప్పటివరకు ప్రభుత్వం తన మనవడికి ఎటువంటి సెక్యూరిటీ కల్పించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కుమారుణ్ని కాపాడుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశామన్న భాస్కర్‌రెడ్డి.. తన కొడుకును తన నుంచి కోడలు దూరం చేసిందంటూ కన్నీటి పర్యంతమయ్యారు.తన కుమారుడికి అనారోగ్యంగా ఉన్న సమయంలో ఆయనతో పాటు రూమ్‌లో ఉంటానంటే కోడలే వద్దని వారించిందన్నారు. సాధిక్ ఖాన్ ఒక సైకో.. అతడి నుంచి మా కుటుంబానికి రక్షణ కావాలి. నా కొడుకుని పొట్టన పెట్టుకుని మా కుటుంబాన్ని నాశనం చేసిన సాధిక్ ఖాన్‌ను ఉరితీయాలి. మా మనవడికి న్యాయం జరగాలి’’ అని భాస్కర్‌రెడ్డి అన్నారు.ఇదీ చదవండి: సాధిక్‌కు ఆ కెమికల్ ఎక్కడి నుంచి వచ్చింది? -
సాధిక్‌కు ఆ కెమికల్ ఎక్కడి నుంచి వచ్చింది?
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పంచాయతీ రాజ్ ఏఈ నూకరాజు కుమార్తె సౌజన్య భర్త జగదీశ్వరరెడ్డి హత్యలో పోలీసులు కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. సాధిక్ ప్రొటీన్ పౌడర్‌లో కెమికల్స్ కలిపి తన తండ్రికి ఇచ్చాడంటూ జగదీశ్వరరెడ్డి కుమారుడు రియాన్ష్ కార్తికేయ చెప్పడంతో దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఆ కెమికల్ కేరళ నుంచి హైదరాబాద్‌కు వచ్చిందని, అది సాధిక్‌కు చేరేలా హైదరాబాద్‌లోని ఓ బంగారు దుకాణం యజమాని సహకరించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. దీనిని నిగ్గు తేల్చేందుకు పోలీసు బృందం హైదరాబాద్ వెళ్లింది.నూకరాజు కుటుంబం నుంచి ఆస్తులు లాక్కునేందుకు సాధిక్ ప్రయత్నించాడనే ఆరోపణలపైనా విచారణ జరుపుతున్నారు.నూకరాజు కుటుంబం, జగదీశ్వరరెడ్డి ఆస్తులకు సంబంధించి రెండేళ్లలో ఏవైనా లావాదేవీలు జరిగాయా.. అవి ఎవరి పేరు మీద బదిలీ అయ్యాయో తెలుసుకొనేందుకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ అధికారులకు పోలీసులు లేఖ రాశారు. సౌజన్య బ్యాంక్ ఖాతాలు, పాస్ పుస్తకాలను సాధిక్ లాక్కున్నాడనే అంశంపైనా విచారణ సాగుతోంది. సాధిక్ తిమ్మాపురం పంచాయతీలో నూకరాజు పేరిట ఉన్న స్థలాన్ని విక్రయించేందుకు సైతం ప్రయత్నించాడని ఓ వ్యక్తి వాంగ్మూలంలో చెప్పినట్లు సమాచారం.రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు?సాధిక్ ఖాన్‌ను కోర్టులో హాజరుపరిచిన సందర్భంగా పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలు పొందుపరిచినట్లు తెలిసింది. సాధిక్ మొదటి నుంచీ ఆస్తి కొట్టేయాలనే ఆలోచనతో ఉండేవాడని పేర్కొన్నట్లు సమాచారం. జగదీశ్వర్‌రెడ్డి అడ్డు తొలగించుకుని, సౌజన్యను పెళ్లి చేసుకుని, ఆమె డబ్బు, బంగారం, ఆస్తి తీసుకోవాలని అతను పథకం వేసినట్లు రిమాండ్ రిపోర్టులో తెలిపినట్లు సమాచారం. జగదీశ్వర్‌రెడ్డి ఇంటికి వెళ్లిన సాధిక్ అతడితో గొడవ పడి, తీవ్రంగా గాయపరిచాడని, అడ్డు వచ్చిన సౌజన్యపై దాడి చేసినట్లు పేర్కొన్నారు. జగదీశ్వరరెడ్డిని అనేక మార్లు కొట్టినట్లు సాక్షులు వాంగ్మూలం ఇచ్చారని తెలిసింది. జగదీశ్వరరెడ్డి హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న సమయంలో సాధిక్ హైదరాబాద్‌లోనే ఉండి సౌజన్యతో ఫోనులో మాట్లాడేవాడని కాల్ డేటా ద్వారా తేలినట్లు సమాచారం.బయటకొచ్చిన మరో లేఖ..!నూకరాజు, ఆయన కుమార్తె సౌజన్య రాసిన లేఖలతో పాటు మూడో సూసైడ్ నోట్ సైతం ఉన్నట్లు సమాచారం. ఆ నోట్ నూకరాజు భార్య మీనాదిగా ప్రచారం జరుగుతోంది. పోలీసులు సూసైడ్ నోట్లను ఫోరెన్సిక్, హ్యాండ్ రైటింగ్ పరీక్షకు పంపినట్లు సమాచారం. ఈ కేసులో మరింత లోతైన విచారణ కోసం నిందితుడు షేక్ సాధిక్ ఖాన్‌ను వారం రోజుల పాటు తమ కస్టడీకి అనుమతించాలంటూ సర్పవరం పోలీసులు కాకినాడ మొబైల్ జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
ఏఈ నూకరాజు కుటుంబం కేసులో మరో మలుపు
సాక్షి, కాకినాడ జిల్లా: ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు సాధిక్ వేధింపులు కారణం కాదని సాధిక్ ఖాన్ తల్లి నూర్జహాన్ తెలిపారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నూకరాజు అల్లుడు జగదీశ్వర్‌రెడ్డిని సాధిక్ చంపలేదన్నారు. ‘‘సౌజన్య రెండు సార్లు మా ఇంటికొచ్చింది. సాధిక్‌ను పెళ్ళి చేసుకుంటానని చెప్పింది. ఈ ప్రతిపాదనకు మా కుటుంబం ఒప్పుకోలేదు. జగదీశ్వరరెడ్డి మరణించాక తనను పెళ్లి చేసుకోవాలని సౌజన్య.. సాధిక్‌ను ఒత్తిడి చేసింది’’ అంటూ సాధిక్ ఖాన్ తల్లి చెప్పుకొచ్చారు.‘‘ఈ ఏడాది ఫిబ్రవరి 14న సౌజన్య ఇంటికి రమ్మని సాధిక్‌ను పిలిచింది. అక్కడ సాధిక్‌పై జగదీశ్వర్‌రెడ్డి అతని మనుషులు దాడి చేసి బంధించారు. దీంతో వంటగదిలో కత్తితో బెదిరించి సాధిక్ అక్కడ నుండి పారిపోయాడు. జగదీశ్వరరెడ్డితో పెళ్లి కాకపొతే సౌజన్యను సాధిక్ ఇచ్చి వివాహం చేసేవాడినని నూకరాజు మా ఇంటికి వచ్చి చెప్పాడు. ఈ రిలేషనల్ మంచిది కాదని సాధిక్‌ను మందలించాను. తన భర్త పట్టించుకోవడం లేదని సాధిక్తో సౌజన్య రిలేషన్ నడిపింది. సౌజన్య కొడుకు సాధిక్‌ను అబ్బు అని.. తన తండ్రిని ఇడియట్ అని పిలిచేవాడు. రోజు ఫోన్లో మా అబ్బాయి చెప్పే కథలు విని సౌజన్య కొడుకు పడుకునేవాడు.‘‘మా ఇంటికి వచ్చి తెలుగు ఖురాన్, బుర్కా కావాలని సౌజన్య అడిగింది. చనిపోయిన రోజు సాయంత్రం 5:30కి సాధిక్‌కు సౌజన్య ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలిచింది. తన స్టూడెంట్స్ కేరళలో ఈవెంట్స్ వెళ్లాలని.. రావడం కుదరదని చెప్పి సాధిక్ అకాడమీకి వెళ్ళిపోయాడు. నూకరాజు, జగదీశ్వర రెడ్డి ఆస్తులు, బంగారం మా వద్ద లేదు. మా కుటుంబం బ్యాంక్ పుస్తకాలు, ఆధార్ కార్డులు పోలీసులకు ఇచ్చేశాము.’’ అని సాధిక్ ఖాన్ తల్లి నూర్జహాన్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: 6 ఏళ్లకే ఈ బాలుడు ‘అభిజీత్ దీప్కే’లా అయిపోయాడు.. -
సినిమాను మించిన ట్విస్టులు ఆ 5పేజీల లేఖలో నిజమెంత..?
-
పిల్లల్ని ఎరగా వేసి తల్లులకు వల..!
కాకినాడ క్రైం: సౌజన్యను సాధిక్ ఖాన్ ట్రాప్ చేసి తన దారిలోకి తెచ్చుకుంది మొదలు, ఓ క్రైం థ్రిల్లర్‌ని తలపించేలా తన రాచకార్యాల్ని గుట్టుచప్పుడు కాకుండా కొనసాగించాడు. తన దారిలోకి తెచ్చుకోవడం, ఆమైపె ఇష్టాన్ని వ్యక్తం చేయడం, అక్రమ బంధాన్ని కొనసాగించడం, ఆమె భర్తను అడ్డు తొలగించుకునేందుకు కుయుక్తులు పన్నడం, ఆస్తి కాజేసేందుకు చేసిన కుట్ర, అంతకుముందు ఆమెను కొట్టడం, భర్తపై దాడి, బాధితురాలి కుటుంబసభ్యుల పైనా విరుచుకుపడడం, వారిని బ్లాక్మెయిల్ చేయడం ఇవేవీ థ్రిల్లర్‌కు తీసిపోని రీతిలో ఉన్నాయి. ఆత్మహత్య ఘటన తర్వాత తప్పించుకోవడానికి చేసిన విఫలయత్నాలు ఈ కోవకే చెంది పోలీసుల మతులనే పోగొట్టాయి. సౌజన్య లాంటి మరికొందరు సాధిక్ ఖాతాలో ఉండొచ్చన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. పిల్లల్ని అడ్డుపెట్టుకొని తల్లులకు వల వేసేవాడని వారి ప్రాథమిక విచారణలో తేలింది.ఆ ఒక్క క్లూతోనే...కేవలం ఒక్క క్లూతోనే సాధిక్ జాడ బట్టబయలైందని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యలు జరగడం, వాటికి తానే కారణం కావడంతో ఎవరూ అతడిపై ఆరోపణలు చేయకుండానే జాగ్రత్తపడి పరారయ్యాడు. అప్పటికి లేఖ దొరకలేదు, సాధిక్ ఖాన్ అనే వ్యక్తి పేరు కూడా ఎవరికీ తెలియదు. ఆ సమయంలో తాను వినియోగిస్తున్న ఒక్కొక్కటి రూ.1.5 లక్షలు విలువ చేసే రెండు ఖరీదైన ఫోన్లు వదిలేసి పరారయ్యాడు. వెళుతూ రైఫిల్ అసోసియేషన్‌లో ఉన్న ఓ ఆప్తమిత్రుడికి ఫోన్ చేసి ఆ నంబర్ డిలీట్ చేసేశాడు. కొందరి ఫోన్ నంబర్లు పాకెట్ బుక్‌లో రాసుకొని బయల్దేరాడు. కాల్ రికార్డ్స్ డేటాలో ఆ కాల్ జాడ లభ్యమైంది. ఇంటి నుంచి నేరుగా ద్విచక్రవాహనంపై సామర్లకోటకు వెళ్లిన సాధిక్ బైక్‌ను పార్కింగ్‌లో ఉంచి కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాడు. పలువురి ప్రయాణికుల ఫోన్లతో తనకు కావలసిన వారికి ఫోన్లు చేశాడు. చివరికి మహారాష్ట్రకు వెళ్లి తన స్నేహితుడిని కలిశాడు. అక్కడ ఒక రోజు ఉన్నాడు. తర్వాత రోజు మీరట్‌కి బయల్దేరాడు. సరిగ్గా అదే సమయానికి కాకినాడ పోలీసులు సదరు మిత్రుడ్ని చేరారు, కొద్ది సేపటి ముందు సాధిక్ మీరట్‌కు అబ్బాస్ అనే మరో రైఫిల్ ట్రైనర్‌ను కలిసేందుకు వెళ్లాడని సమాచారం అందించాడు. అతడి కంటే ముందు అబ్బాస్ ఇంటి వద్దకు చేరుకున్న పోలీసులు సాధిక్ అబ్బాస్ ఇంటి వద్దకు సమీపిస్తుండగా పట్టుకున్నారు. అక్కడి నుంచి కేరళ వెళ్లాలని అనుకున్నాడని పోలీసులు తెలిపారు.కోడలిపై అనుమానం..కోడలి వ్యవహారశైలి ఆది నుంచీ అనుమానాస్పదంగానే తోచిందని సాధిక్ ఖాన్ చేతిలో హత్యకు గురయ్యాడని భావిస్తున్న జగదీశ్వర్‌రెడ్డి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అనూహ్య రీతిలో ఏ కారణం లేకుండానే జగదీష్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని వాపోయారు. ఏడాది పాటు వాంతులు అయ్యాయని, కారణం తెలిసేది కాదని చెప్పుకొచ్చారు. మాట నెమ్మదించి, కాలు కూడా చచ్చుబడిందని అన్నారు. జీర్ణకోశ సమస్యతో బాధపడుతూ కాకినాడ సర్పవరంలో ఉన్న ఓ ఆసుపత్రిలో ఐదు రోజులు చికిత్స అనంతరం జగదీష్ మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లో ఉన్న ప్రముఖ ఆసుపత్రి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీకి వెళ్లి చికిత్స పొందినట్టు చెప్పారు. అక్కడ కాస్త కోలుకోగా, హైటెక్ సిటీలో ఉన్న ఓ ఫిజియోథెరపీ సెంటర్‌కు సౌజన్యతో పాటు ఆమె తల్లిదండ్రులు, అత్త, మామ తీసుకువెళ్లి చేర్చారు. కేవలం ఫిజియోథెరపీ చేస్తే చాలు కోలుకోవలసిన దశలో జగదీశ్వర్‌రెడ్డి హఠాత్తుగా మరణించాడు. ఫిజియోథెరపీ చేస్తుండగా తన భర్త స్పందించడం లేదని కోడలు సమాచారం ఇచ్చిందని జగదీశ్వర్‌రెడ్డి కుటుంబీకులు చెబుతున్నారు. సౌజన్య ప్రవర్తన తీవ్ర అనుమానాలకు తావిచ్చిందని తెలిపారు. ఆసుపత్రిలో చేర్చినప్పటి నుంచి తాను మాత్రమే ఉంటానని అందరూ వెళ్లిపోవాలని చెప్పేదన్నారు. చనిపోయే కొద్దిసేపటి ముందు కూడా తమను హోటల్ గదికి పంపేసిందని, తానే చూసుకుంటానని చెప్పిందని అంటున్నారు. సాధిక్ ఖాన్ ఆ సమయంలో వచ్చి సౌజన్యతో కలిసి జగదీష్ తాగే ప్రొటీన్ షేక్‌లో అంతకుముందు పట్టించిన స్లో పాయిజన్ గుణాలున్న రసాయనాన్ని మరోమారు కలిపి ఉంటాడని అనుమానిస్తున్నామని కుటుంబీకులు తెలిపారు.పిల్లలు ఎర.. తల్లులు సొరఖతర్నాక్ ఖాన్ వ్యవహార శైలిని తమ పిల్లల్ని కోచింగ్‌లో చేర్చిన పలువురు తల్లులు పూసగుచ్చినట్టు తమను సంప్రదించిన మీడియాకు తెలిపారు. పిల్లల్ని అడ్డుపెట్టుకొని తమతో మాటకలిపేందుకు యత్నించేవాడని, తమ స్టేటస్లు, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగాం పేజీలు ఫాలో అవుతూ లైక్స్ కొడుతూ ముగ్గులోకి దించేందుకు యత్నించేవాడన్నారు. ఈ కారణంతోనే తమ పిల్లల్ని అతడి అకాడమీలో మానిపించేశామని కొందరు చెప్పారు. క్లాస్ ఇన్ఫర్మేషన్ కోసం అంటూ కాల్స్ చేసి అక్కర్లేని విషయాలతో మాటలు పెంచేవాడన్నారు.ఇంటిని అమ్మి ప్రియుడితో వెళ్లిపోయిన భార్య -
సాదిక్ పై నూకరాజు మనవడు సంచలన వ్యాఖ్యలు
-
అప్పుడు తప్ప మళ్ళీ ఎప్పుడు కలవలేదు.. ద్వారంపూడి క్లారిటీ
-
బ్లాక్మెయిల్ చేశాడు.. ప్రశ్నిస్తే కొట్టాడు
కాకినాడ క్రైం: ‘సాధిక్ ఖాన్ నన్ను బ్లాక్మెయిల్ చేశాడు.. ప్రశ్నిస్తే కొట్టాడు.. నన్ను మతం మార్పించడానికి, నా ఆస్తి కోసం వేధించేవాడు’ అంటూ ఆత్మహత్యకు పాల్పడిన పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుమార్తె సౌజన్య మరణానికి ముందు రాసినట్లుగా భావిస్తున్న లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ లేఖలో సాధిక్ క్రూరత్వాన్ని వివరించింది. సాధిక్ తన కుమారుడు రియో సాయంతో తనకు దగ్గరయ్యాడని తెలిపింది. తన బిడ్డ చదివే స్కూల్లో చేరాడని, చెప్పిన మాట వినకపోతే రియోను కిడ్నాప్ చేస్తానని బెదిరించేవాడని పేర్కొంది. తన ప్రైవేటు విషయాలతో బ్లాక్మెయిల్ చేశాడని, ప్రశ్నిస్తే కొట్టాడని తెలిపింది. తన భర్త కూడా సాధిక్‌కు భయపడేవాడని తెలిపింది. తన భర్తను చంపేయడానికి ఓ రసాయనాన్ని తెచ్చాడని పేర్కొంది. తన ప్రతి ఫోన్ కాల్‌ను పరిశీలించేవాడని తెలిపింది. అతడి కన్ను తన ఆస్తిపై ఉందన్న విషయాన్ని ఆలస్యంగా గుర్తించానని పేర్కొంది. తన ఆస్తి పత్రాలు, లాకర్ కూడా అతని ఆధీనంలో పెట్టుకున్నాడని, అతనికి పోలీసులతో సన్నిహిత సంబంధాలు ఉండడం వల్ల ఎవరికీ చెప్పుకోలేకపోయానని వివరించింది. తనను ఇస్లాంలోకి మారాలని తీవ్రమైన ఒత్తిడి తెచ్చి ఇస్లాం మత పుస్తకాలు చదవమని, రాయమని బెదిరించేవాడని పేర్కొంది. చాలాసార్లు మనోవేదనకు గురై చనిపోదామనుకుంటే బిడ్డ గుర్తొచ్చి ఆగిపోయానని తెలిపింది. మతం పిచ్చి, ఆడవాళ్ల పిచ్చి ఉన్న సాధిక్తో ప్రతి మహిళ, యువతులు, పిల్లల తల్లులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఈ లేఖ విషయమై ఎస్పీ బిందుమాధవ్ని వివరణ కోరగా, పరిశీలిస్తున్నామని చెప్పారు. సాధిక్ ఖాన్ తనకంటే పదేళ్లు పెద్ద వయసున్న సౌజన్యను ట్రాప్ చేసి మతం మార్చేందుకు, ఆస్తి కాజేసేందుకు కుట్రపన్నాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. సాధిక్ ఇచ్చిన విష రసాయనంతోనే జగదీశ్వర్ రెడ్డి మృతి? సౌజన్య భర్త జగదీశ్వర్‌రెడ్డి నరాల సంబంధ వ్యాధితో బాధపడుతుండేవాడని, సాధిక్ ఇచ్చిన విష రసాయనంతో అతనికి జీర్ణకోశ వ్యాధి కూడా వచ్చిందని పోలీసువర్గాలు చెబుతున్నాయి. అతన్ని హైదరాబాద్‌లో ఏఐజీ ఆసుపత్రిలో చేర్చగా 23 రోజుల చికిత్స అనంతరం జూలై 2న మృతి చెందినట్లు సమాచారం. పోలీసులతోనే ఫొటోలన్నీ... సాధిక్ కాకినాడ గుడారిగుంటలో నిర్వహిస్తున్న ప్రో షూటింగ్ అకాడెమీలో ఫొటోలన్నీ పోలీసులతోనే ఉండటం చర్చనీయాంశమైంది. తాను సాధించిన మెడల్స్‌తో గతంలో పనిచేసిన జిల్లా ఎస్పీ సహా పలువురు అధికారులతో ఫొటోలు తీయించుకున్నాడు. వీటిని చూపించి పోలీస్ ఉన్నతాధికారులతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని తన అకాడెమీకి వచ్చే పిల్లల తల్లిదండ్రులకు చెప్పుకునేవాడు. పలువురు పోలీసుల పిల్లలకు కూడా సాధిక్ శిక్షణ ఇస్తుండటం గమనార్హం. రిమాండ్‌కు సాధిక్ ఖాన్శనివారం ఉత్తరప్రదేశ్‌లో అరెస్టు చేసిన పోలీసులుకాకినాడ రూరల్/కాకినాడ లీగల్/కాకినాడ క్రైం: కాకినాడ జిల్లా పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ టి.నూకరాజు కుటుంబం ఆత్మహత్య, ఆయన అల్లుడు జగదీశ్వరరెడ్డి అనుమానాస్పద మృతి కేసులో నిందితుడైన రైఫిల్ షూటింగ్ శిక్షకుడు షేక్ సాధిక్ ఖాన్‌ను సర్పవరం పోలీసులు సోమవారం కాకినాడ స్పెషల్ మొబైల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. అతనికి సెప్టెంబర్ 3 వరకు రిమాండ్ విధిస్తూ మేజిస్ట్రేట్ ఎన్.ఉషాలక్ష్మి కుమారి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం నిందితుడిని కాకినాడ సబ్‌జైలుకు రిమాండ్‌కు పంపించారు. ఈ నెల 16న ఏఈ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన వెంటనే సాధిక్ ఖాన్ పరారయ్యాడు. అతన్ని శనివారం ఉదయం ఉత్తరప్రదేశ్‌లోని మీరఠ్‌లో అరెస్ట్ చేసి, ఆదివారం అర్ధరాత్రి సర్పవరం పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఆరితేరిన నేరస్తుడిలా సాధిక్ పరారు: కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ఏఈ నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య ఆత్మహత్యకు పాల్పడగానే సాధిక్ ఖాన్ ఆరితేరిన నేరస్తుడి తరహాలో చాకచక్యంగా పారిపోయాడని ఎస్పీ బిందుమాధవ్ చెప్పారు. అతని కోసం 10 పోలీసు బృందాలు ఆరు రోజుల పాటు ఐదు రాష్ట్రాల్లో గాలించాయని సోమవారం కాకినాడలో విలేకరుల సమావేశంలో తెలిపారు. అతను సామర్లకోట నుంచి కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఎక్కి వెళ్లిపోయాడన్నారు. సామర్లకోట మీదుగా ఢిల్లీ, అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్‌లోని మీరఠ్‌కు వెళ్లాడన్నారు. రైఫిల్ షూటింగ్లో శిక్షకుడైన ఓ మిత్రుడు సహా ఒకరిద్దరి దగ్గర ఆశ్రయం పొందినట్లు తెలిపారు. అతని ఫోన్ నుంచి చివరి కాల్ షూటింగ్ అసోసియేషన్‌లో సభ్యుడైన ఓ వ్యక్తికి వెళ్లడంతో అతని జాడ తెలుసుకొనే అవకాశం చిక్కిందని చెప్పారు. 22వ తేదీన అతని వద్దకు పోలీసులు వెళ్లగా.. అప్పటికి కొద్ది సేపటి ముందు సాధిక్ అక్కడి నుంచి మీరఠ్‌లో ఉంటున్న మరో షూటింగ్ శిక్షకుడైన అబ్బాస్ వద్దకు వెళ్లినట్లు తెలిసిందన్నారు. స్థానిక పోలీసుల సాయంతో అబ్బాస్ ఇంటి వద్ద కాపు కాసి, సాధిక్ రాగానే పట్టుకున్నట్లు తెలిపారు. అతనిపై హత్య, ఆత్మహత్యకు ప్రేరేపించడం, బెదిరింపులు, మతమార్పిడికి యత్నం తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. -
కాకినాడ రూరల్ PS కు సాధిక్ ఖాన్ తరలింపు
-
దేశం దాటేయాలని ప్లాన్.. చిన్న క్లూతో దొరికిపోయిన సాదిక్ ఖాన్
-
పోలీసుల అదుపులో సాధిక్ ఖాన్
-
సాదిక్ ఖాన్ చెత్త మేయర్
లండన్: లండన్ మేయర్ సాధిక్ ఖాన్ ప్రపంచంలోనే పరమ చెత్త మేయర్ అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అభివరి్ణంచారు. బ్రిటన్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన రాజ విందుకు.. లండన్ మేయర్ సాదిక్ ఖాన్‌ను ఆహ్వానించవద్దని తానే వ్యక్తిగతంగా కోరానని డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కింగ్ చార్లెస్–3 ఆతిథ్యమిచ్చిన రాజ విందులో ట్రంప్ పాల్గొన్నారు. రాజ విందులో బ్రిటన్, అమెరికాకు చెందిన ప్రముఖ నాయకులు, వ్యాపారవేత్తలు, ఇతర ఉన్నత స్థాయి అతిథులు పాల్గొన్నారు. విందు అనంతరం ట్రంప్.. గురువారం బ్రిటన్ నుంచి బయలుదేరుతూ ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో మీడియాతో మాట్లాడారు. ఖాన్ గైర్హాజరీ గురించి అడిగిన ప్రశ్నకు ట్రంప్ స్పందిస్తూ.. సాదిక్ ఖాన్ అక్కడ ఉండటం తనకు ఇష్టం లేదని, అతన్ని ఆహా్వనించవద్దని తానే కోరానని స్పష్టం చేశారు. -
‘లండన్ మేయర్ దుష్టుడు’.. సాదిక్ ఖాన్‌పై ట్రంప్ మాటల దాడి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు నోరు పారేసుకున్నారు. లండన్ మేయర్‌ను దుష్టుడు అని, అతను చేయకూడని పనిచేశాడని వ్యాఖ్యానించారు. సెప్టెంబర్‌లో లండన్‌కు రావాలనుకుంటున్నారా? అని ట్రంప్‌ను ఒక విలేకరి అడిగినప్పుడు ఆయన తానేమీ మీ మేయర్ అభిమానిని కాదని, అతను చేయకూడని పనిచేశాడని భావిస్తున్నానని వ్యాఖ్యానించారు.సోమవారం స్కాట్లాండ్లో యూకే ప్రధానితో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన లండన్ మేయర్ సాదిక్ ఖాన్‌పై మాటల దాడి చేశారు. కాగా యునైటెడ్ కింగ్డమ్లో అత్యధిక జనాభా కలిగిన లండన్‌కు మొదటి ముస్లిం మేయర్‌గా సాదిక్ ఖాన్ గుర్తింపు పొందారు. రాజకీయ ప్రత్యర్థులు తన మతాన్ని విమర్శించిన సందర్బాల్లో సాదిక్ ఖాన్ ఎదురుదాడికి దిగుతుంటారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో సాదిక్ ఖాన్‌పై పలు విమర్శలు చేశారు. అయితే సాదిక్ ఖాన్ తాను ఇటువంటి విమర్శలను పట్టించుకోనని గతంలోనే స్పష్టం చేశారు. 2016, మే 9న ఖాన్ లండన్ మేయర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అప్పటి అధ్యక్ష అభ్యర్థి ట్రంప్.. సాదిక్ ఖాన్‌పై పలు విమర్శలు చేశారు. ‘గుడ్ మార్నింగ్’ బ్రిటన్’లో ఖాన్‌ను మెరటు వ్యక్తి అని, అజ్ఞాని అని ట్రంప్ సంబోధించారు. -
లండన్ మేయర్‌గా మూడోసారి సాదిక్ ఖాన్
లండన్: పాక్ సంతతికి చెందిన లేబర్ పార్టీ నేత సాదిక్ ఖాన్(53) లండన్ మేయర్‌గా భారీ మెజారిటీతో వరుసగా మూడోసారి గెలుపొందారు. మొత్తం ఓట్లలో 43.8 శాతం అంటే 10,88,225 ఓట్లు సాదిక్ ఖాన్‌కు పడగా కన్జర్వేటివ్ పారీ్టకి చెందిన ప్రధాన ప్రత్యర్ధి సుసాన్ హిల్‌కు 8,11,518 ఓట్లు పడ్డాయి. స్వతంత్ర అభ్యరి్థగా బరిలోకి దిగిన ఢిల్లీలో జన్మించిన వ్యాపారవేత్త తరుణ్ గులాటి ఓట్ల వేటలో విఫలమయ్యారు. మేయర్ పదవికి మొత్తం 13 మంది పోటీ పడ్డారు. లండన్ మేయర్ 89 లక్షల మంది జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తారు. 2000వ సంవత్సరంలో పదవి ఏర్పాటయ్యాక వరుసగా మూడు పర్యాయాలు మేయర్‌గా ఎన్నికైన నేతగా సాదిక్ ఖాన్ రికార్డు సృష్టించారు. నాలుగేళ్ల పదవీ కాలానికిగాను 2016, 2020 ఎన్నికల్లో ఆయన మేయర్‌గా ఎన్నికయ్యారు. -
మేయర్ అరెస్ట్‌కు డిమాండ్.. నవ్వులపాలు
లండన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇతర దేశాల్లోనూ అభిమానుల సంఖ్య తక్కువేం కాదు. ఇంగ్లాండ్‌లో ఆ సంఖ్యకు కొదవేం లేదు. అయితే తాజాగా లండన్‌లో ట్రంప్ వీరాభిమానులని చెప్పుకొనే కొందరు చేపట్టిన ఓ నిరసన ప్రదర్శన ఘోరంగా విఫలం అయ్యింది. ట్రంప్‌కు వ్యతిరేకంగా గళం విప్పుతున్న మేయర్ సాధిక్ ఖాన్ అరెస్ట్‌ను డిమాండ్ చేసి నవ్వులపాలయ్యారు. శనివారం సెంట్రల్ లండన్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మేయర్ సాధిక్ ప్రసంగించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ట్రంప్ మద్ధతుదారులు ఒక్కసారిగా నినాదాలు చేయటం ప్రారంభించారు. ఈయూకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఓ వ్యక్తి అమెరికా జెండాను ప్రదర్శించాడు. నిరసనకు స్పష్టమైన కారణం వెల్లడించనప్పటికీ.. సాధిక్ ఖాన్‌కు మేయర్‌గా కొనసాగే అర్హత లేదని వారంతా సభలో గోల చేశారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఆయన్ని అరెస్ట్ చేయాల్సిందేనని పట్టుబట్టారు. ఈ పరిణామాలతో మేయర్ ప్రసంగానికి కాసేపు ఆటంకం ఎదురైంది. 10 నిమిషాల తర్వాత అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని బలవంతంగా బయటకు లాక్కెల్లారు. అనంతరం ప్రసంగించిన సాధిక్.. ‘‘మేధావుల మూలంగా స్పీచ్‌కు కాసేపు అంతరాయం కలిగిందని.. అందుకు ప్రజలు క్షమించాలి’’ అని పేర్కొనటంతో అక్కడ ఉన్న ప్రజలు గొల్లుమని నవ్వుకున్నారు. ఆపై తన ప్రసంగాన్ని ఆయన కొనసాగించారు. అర్థం పర్థం లేని డిమాండ్‌తో పరువు తీసుకోవటం తప్పించి వారు సాధించింది ఏం లేదని కార్యక్రమం ముగిశాక కొందరు మీడియాతో వ్యాఖ్యానించారు. పాకిస్తానీ డ్రైవర్ కొడుకైన సాధిక్ ఖాన్ లండన్‌కు మెట్టమెదటి ముస్లిం మేయర్. ముస్లిం దేశాలపై ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలను.. విధిస్తున్న ఆంక్షలను.. నిర్ణయాలను సాధిక్ ఖండిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ అభిమానులు ఇలా స్పందించారన్న మాట. -
తప్పే.. కానీ క్షమాపణ చెప్పం!
జలియన్‌వాలా బాగ్ మారణకాండ.. భారత స్వాతంత్య్ర చరిత్రలో అత్యంత భయంకరమైన పీడకల. ఈ మారణహోమానికి వందేళ్లు పూర్తికావస్తున్నా.. దానికి కారణమైన బ్రిటిష్ ప్రభుత్వం విచారం వ్యక్తం చేస్తోందే తప్ప.. ఆనాటి గాయాలను మాన్పేందుకు ఎన్నో రోజులుగా డిమాండ్ చేస్తున్న ‘క్షమాపణ’ మాత్రం చెప్పడంలేదు. లండన్: జలియన్‌వాలా బాగ్ ఘటనకు బ్రిటిష్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాల్సిందేనని లండన్ మేయర్ సాదిక్ ఖాన్ మరోసారి డిమాండ్ చేశారు. 1919లో జరిగిన ఈ మారణహోమం బ్రిటిష్ చరిత్రకు మాయని మచ్చగా మిగిలిందన్నారు. వేలాదిమంది భారతీయుల కుటుంబాల్లో దుఃఖాన్ని మిగిల్చిన దుర్ఘటనకు త్వరలోనే వందేళ్లు పూర్తవుతున్న విషయాన్ని సాదిఖ్ గుర్తుచేశారు. భారతీయులకు క్షమాపణ చెప్పేందుకు ఇదే సరైన సమయమని సాదిఖ్ అభిప్రాయపడ్డారు. ఓ వాణిజ్య కార్యక్రమం కోసం భారత్‌కు వచ్చిన ఆయన జలియన్‌వాలా బాగ్ ఘటన చోటుచేసుకున్న ప్రాంతాన్ని సందర్శించి, అమరులకు నివాళులర్పించారు. గతంలో కూడా.. : గతంలో కూడా బ్రిటిష్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరూన్ భారత పర్యటనకు వచ్చినప్పుడు జలియన్‌వాలా బాగ్ ఘటనను అత్యంత దురదృష్టకరమైనదిగా అభివర్ణిస్తూ విచారం వ్యక్తం చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం తలదించుకునే ఘటనగా కూడా అభివర్ణించారు. అప్పటి డయ్యర్ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కూడా ప్రకటించారు. అయితే క్షమాపణ చెప్పడాన్ని దాటవేశారు. 1997లో బ్రిటిష్ రాణి ఎలిజబెత్, ఆమె భర్త, ప్రిన్స్ ఫిలిప్లు ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పటికీ క్షమాపణలు మాత్రం చెప్పలేదు. ‘నేను చాలా స్పష్టంగా చెబుతున్నా. నాటి దురాగతానికి బ్రిటిష్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పేందుకు ఇదే సరైన సమయం. బాధితుల గాయాలకు బ్రిటిష్ ప్రభుత్వం చెప్పే క్షమాపణలే మందు. ఈ విషయమై బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు నా వంతుగా కృషి చేస్తూనే ఉంటా’ – లండన్ మేయర్, సాదిక్ ఖాన్ -
లండన్ స్కూళ్లలో నైఫ్ డిటెక్టర్లు
లండన్: యువతను, విద్యార్థులను కత్తి పోటు దాడుల నుంచి కాపాడేందుకు లండన్ ప్రభుత్వం పక్కాగా ముందుకు సాగుతోంది. నగరంలోని అన్ని స్కూళ్లలో నైఫ్ డిటెక్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు మేయర్ సాదిఖ్ ఖాన్ తెలిపారు. దీని సాయంతో ఆగంతకుల వద్ద ఉన్న కత్తుల వంటి మారణాయుధాలను సులువుగా గుర్తించవచ్చని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో లండన్‌లో కత్తిపోటు ఘటనలు పెరిగిపోయాయి. ఈ వారం వ్యవధిలోనే క్యానింగ్ టౌన్, ఈస్ట్ హామ్, ఇస్లింగ్టన్ ప్రాంతాల్లో జరిగిన కత్తి పోట్లపై లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించి వివిధ ప్రాంతాల్లో సోదాలు చేపట్టి 518 కత్తులు, 11 పేలుడు పదార్థాలు, వివిధ రకాలైన 50 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా 622 మంది అరెస్ట్ చేయగా ఇందులో 180 మంది వద్ద చాకులు లభించాయి. కత్తులతో దాడులకు పాల్పడే వారిని గుర్తించి అడ్డుకునేందుకు ‘నైఫ్ క్రైం స్ట్రాటజీ’ని ప్రకటించిన లండన్ మేయర్ దీనికోసం 8లక్షల పౌండ్ల నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. 2014-15 కాలంలో లండన్‌లో కత్తిపోటు ఘనటలు 5శాతం మేర పెరగ్గా 2016లో ఇది 11శాతానికి చేరుకుందని మేయర్ వివరించారు. -
రండి.. ఇస్లాం నేర్పిస్తా!
♦ డొనాల్డ్ ట్రంప్‌కు లండన్ మేయర్ సాదిక్ ఆహ్వానం ♦ సాదిక్ వ్యాఖ్యలను పట్టించుకోనన్న ట్రంప్ లండన్: లండన్ కొత్త మేయర్ సాదిక్ ఖాన్, అమెరికా అధ్యక్ష స్థానానికి రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ మధ్య వాగ్యుద్ధం ముదురుతోంది. అమెరికాలో ముస్లింలకు వీసా నిరాకరించినా.. లండన్ కొత్త మేయర్ సాదిక్‌కు ఆహ్వానం ఉంటుందని ట్రంప్ అనడంతో వివాదం మొదలైంది. ఓ బ్రిటన్ టీవీ చానల్‌కు మంగళవారమిచ్చిన ఇంటర్వ్యూలో సాదిక్ మాట్లాడుతూ.. ‘ట్రంప్‌ను లండన్‌కు ఆహ్వానిస్తున్నాను. మా కుటుంబ సభ్యులు, మిత్రులు, చుట్టుపక్కలవారిని పరిచయం చేస్తా. ముస్లింలైనా లండన్ ప్రజలుగా, బ్రిటన్లుగా ఎలా సంతోషంగా ఉంటున్నామో వివరిస్తా. ఆయనకు ఇస్లాం గురించి అర్థమయ్యేలా చెబితే నాకు చాలా సంతోషంగా ఉంటుంది’అని తెలిపారు. అనవసరంగా మతాల గురించి మాట్లాడి.. వివిధ నాగరితకల మధ్య గొడవపెట్టాలనుకునే ఆలోచనను ట్రంప్ మానుకోవాలన్నారు. ఐసిస్, ఇతర ఉగ్రవాద సంస్థలు చేస్తున్న పనికీ.. ట్రంప్ ఆలోచనకు పెద్ద తేడాఏమీ లేదన్నారు. ట్రంప్ అనుసరిస్తున్న విభజన విధానం చాలా ప్రమాదకరమైందని సాదిక్ అన్నారు. ఐ డోంట్ కేర్: ట్రంప్ కాగా,సాదిక్ మర్యాదలేకుండా మాట్లాడుతున్నారని ట్రంప్ అన్నారు. అసలు సమస్యనే తను ప్రస్తావిస్తున్నానని అంతే తప్ప ముస్లిం వ్యతిరేకిని కాదన్నారు. ‘ఆయన మాటలను నేను పట్టించుకోను. నేను ఏం చెప్పాలనుకుంటున్నానో ఆయనకు సరిగా అర్థం కాలేదు. ఇస్లాం టైజం గురించి మాట్లాడినందుకు నా ముస్లిం మిత్రులు నన్ను ప్రశంసించారు’ అని అన్నారు. ఖాన్ తననెప్పుడూ కలవలేదని.. అసలు ఖాన్‌కు తన గురించి పూర్తిగా తెలియదన్నారు. -
లండన్ మేయర్‌గా ముస్లిం
లండన్: బ్రిటన్ రాజధాని లండన్ మేయర్‌గా తొలిసారి ఒక ముస్లిం వ్యక్తి ఎన్నికయ్యారు. ఈ మేరకు రికార్డు మెజారిటీతో గెలిచిన సాదిఖ్ ఖాన్ (45) అధికారికంగా సౌత్‌వార్క్ కేథడ్రల్‌లో జరిగిన కార్యక్రమంలో లండన్ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు. పాకిస్తాన్ చెందిన బస్సు డ్రైవర్ కుమారుడు సాధిఖ్ ఖాన్ లేబర్ పార్టీ తరఫున పోటీచేసి కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి జాక్ గోల్డ్‌స్మిత్‌పై 9 శాతం ఓట్లతో గెలుపొందారు. దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత లండన్‌లో లేబర్ పార్టీ తన సత్తా చాటింది. లేబర్ పార్టీ తరఫున కెన్ లివింగ్స్టన్, కన్జర్వేటీవ్ తరఫున బోరిస్ జాన్సన్‌ల తర్వాత లండన్ మేయర్ పీఠాన్ని అధిష్టించిన మూడో వ్యక్తిగా సాధిఖ్ ఖాన్ రికార్డు సృష్టించారు. మేయర్‌గా ప్రమాణం తర్వాత సాధిఖ్ మాట్లాడుతూ.. ‘లండన్ ప్రపంచంలోనే అత్యున్నత నగరం. నాలాంటి వ్యక్తికి లండన్ మేయర్‌గా అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతాను’ అని పేర్కొన్నారు. -
బస్సు డ్రైవర్ కొడుకు మేయర్ అయ్యాడు!
లండన్: బ్రిటన్ రాజధాని లండన్ మేయర్ గా తొలిసారి ఓ ముస్లిం వ్యక్తి ఎన్నికయ్యారు. పాకిస్థాన్ కు చెందిన బస్సు డ్రైవర్ కొడుకు అయిన సాధిఖ్ ఖాన్ లేబర్ పార్టీ తరఫున లండన్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు. ఈ చరిత్రాత్మక గెలుపుతో దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత బ్రిటన్ రాజధానిపై లేబర్ పార్టీ తన జెండా ఎగురవేసింది. 'సూపర్ థార్స్ డే పోల్స్' పేరిట హోరాహోరీగా జరిగిన లండన్ ఎన్నికల్లో ప్రతిపక్ష లేబర్ పార్టీ తరఫున సాధిఖ్ ఖాన్ బరిలోకి దిగారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ పోరులో తన ప్రత్యర్థి, కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి జాక్ గోల్డ్ స్మిత్ పై 9శాతం ఓట్ల ఆధిక్యంతో సాధిఖ్ విజయం సాధించారు. ఆయనకు పోలైన ఓట్లలో 46శాతం ఓట్లు దక్కాయి. ఈ క్రమంలో లండన్ సిటీ హాల్ లో తొలి ముస్లిం మేయర్ గా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ రావాలంటే 50శాతం ఓట్లు సాధించాలి. కానీ,సాధిఖ్ ఆ మేరకు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను కూడా లెక్కబెట్టారు. రెండో ప్రాధాన్యం ఓట్లలోను సాధిఖ్ దారిదాపుల్లో గోల్డ్ స్మిత్ రాలేకపోయారు. ఈ విజయంతో లండన్ మేయర్ పీఠంపై ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న అధికార కన్జర్వేటివ్ పార్టీని కూలదోసి దానిని లేబర్ పార్టీ కైవసం చేసుకుంది. పాకిస్థాన్ సంతతికి చెందిన ఖాన్ 2005లో టూటింగ్ ఎంపీగా గెలుపొందారు. మాజీ ప్రధాని గార్డన్ బ్రౌన్ కేబినెట్ లో కీలక వ్యక్తిగా పనిచేశారు. ఆయనకు తీవ్రవాదులతో సంబంధాలు అంటగడుతూ ప్రత్యర్థి, దివంగత బిలియనీర్ సర్ జేమ్స్ గోల్డ్ స్మిత్ కొడుకు జాక్ చేసిన ప్రచారం తిప్పికొట్టింది. లండన్ లోని భిన్న మతాలు, సంస్కృతుల ప్రజలను విడగొట్టడానికి జాక్ ప్రయత్నిస్తున్నారని సాధిఖ్ ప్రచారంలో దూసుకెళ్లారు.


