
ట్రంప్ స్పష్టీకరణ
లండన్: లండన్ మేయర్ సాధిక్ ఖాన్ ప్రపంచంలోనే పరమ చెత్త మేయర్ అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అభివరి్ణంచారు. బ్రిటన్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన రాజ విందుకు.. లండన్ మేయర్ సాదిక్ ఖాన్‌ను ఆహ్వానించవద్దని తానే వ్యక్తిగతంగా కోరానని డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కింగ్ చార్లెస్–3 ఆతిథ్యమిచ్చిన రాజ విందులో ట్రంప్ పాల్గొన్నారు. రాజ విందులో బ్రిటన్, అమెరికాకు చెందిన ప్రముఖ నాయకులు, వ్యాపారవేత్తలు, ఇతర ఉన్నత స్థాయి అతిథులు పాల్గొన్నారు. విందు అనంతరం ట్రంప్.. గురువారం బ్రిటన్ నుంచి బయలుదేరుతూ ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో మీడియాతో మాట్లాడారు. ఖాన్ గైర్హాజరీ గురించి అడిగిన ప్రశ్నకు ట్రంప్ స్పందిస్తూ.. సాదిక్ ఖాన్ అక్కడ ఉండటం తనకు ఇష్టం లేదని, అతన్ని ఆహా్వనించవద్దని తానే కోరానని స్పష్టం చేశారు.