అంబానీ గణేశ్‌ పూజకు.. ‘డీప్‌ నెక్‌’లో హీరోయిన్‌.. ఏకిపారేస్తున్న నెటిజన్లు! | Disha Patani Trolled Over Outfit at Ambani Ganesh Puja | Sakshi
Sakshi News home page

అంబానీ గణేశ్‌ పూజకు.. ‘డీప్‌ నెక్‌’లో హీరోయిన్‌.. ఏకిపారేస్తున్న నెటిజన్లు!

Sep 15 2026 10:27 AM | Updated on Sep 15 2026 10:31 AM

Disha Patani Trolled Over Outfit at Ambani Ganesh Puja

ముంబై: గణేశ్‌ చతుర్థి సందర్భంగా ముకేశ్‌ అంబానీ నివాసం ‘యాంటీలియా’లో సెప్టెంబర్‌ 14న నిర్వహించిన ప్రత్యేక పూజకు పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు హాజరయ్యారు. నటి దిశా పటానీ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. అయితే ఆమె ధరించిన దుస్తులపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఆమె ఎరుపు రంగు లెహంగా చోళీలో హాజరయ్యారు. లెహంగాతో పాటు డీప్‌ నెక్‌ బ్రాలెట్‌ తరహా బ్లౌజ్‌ ధరించారు. ఈ దుస్తుల డిజైన్‌ ఎక్కువగా రివీలింగ్‌గా ఉందంటూ పలువురు నెటిజన్లు ఆమెను ట్రోల్‌ చేశారు. పండుగ పూట, అదికూడా పూజ లాంటి సంప్రదాయ కార్యక్రమాలకు ఇలాంటి దుస్తులతో వస్తారా అంటూ పలువురు ఆమెను ‍ఎద్దేవా చేస్తున్నారు.

ఈ వేడుకకు హాజరైన పలువురు సెలబ్రిటీలు సంప్రదాయ దుస్తుల్లో కనిపించడంతో దిశా పటానీ లుక్‌ మరింత చర్చనీయాంశమైంది. సామాజిక మాధ్యమాల్లో కొందరు ఆమె వస్త్రధారణను ఇతర నటీమణుల దుస్తులతో పోల్చారు. రివీలింగ్‌ దుస్తుల విషయంలో దిశా పటానీ గతంలోనూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు ఎదుర్కొన్నారు. గత ఏడాది గణపతి పూజకు కూడా ఇలాంటి దుస్తులతో హాజరైనప్పుడు ట్రోలింగ్‌ జరిగింది.

అంబానీ ఇంట జరిగిన గణేశ్‌ చతుర్థి వేడుకలో సల్మాన్‌ ఖాన్‌, కరీనా కపూర్‌-సైఫ్‌ అలీ ఖాన్‌, ఆలియా భట్‌-రణ్‌బీర్‌ కపూర్‌, కత్రినా కైఫ్‌-విక్కీ కౌశల్‌, సిద్ధార్థ్‌ మల్హోత్రా-కియారా అద్వాణీ, రేఖ, కాజోల్‌, రణ్‌వీర్‌ సింగ్‌, కరణ్‌ జోహార్‌ తదితరులు పాల్గొన్నారు. పండుగలు, ప్రత్యేక కార్యక్రమాల్లో సినీ ప్రముఖులు ధరించే దుస్తులపై సామాజిక మాధ్యమాల్లో తరచూ చర్చ జరుగుతోంది. సంప్రదాయ వేడుకల్లో ఆధునిక లేదా బోల్డ్‌ లుక్‌ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ఫ్యాషన్‌ స్వేచ్ఛకు మద్దతు లభిస్తుండగా, మరోవైపు సంస్కృతి, సంప్రదాయాలను ప్రస్తావిస్తూ విమర్శలు వస్తున్నాయి. 

ఇదీ చదవండి: మేయర్‌ ఇంట్లో.. రెండో తరగతి పిల్లాడి వినాయకుడు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement