కుర్రర్రర్రర్రర్రర్ర....తా!
ఎవరు వేసుకున్నా కుర్రగా కనిపిస్తారు కాబట్టి కుర్రర్రర్రర్రర్రతా.. అన్నారేమో! అది కాస్తా కాలక్రమేణా‘కుర్తా’ అయి ఉంటుంది. అమ్మాయిల నుంచి అమ్మమ్మల వరకు అందరికీ నచ్చడమే కాదు కుర్తా ఎంచక్కా నప్పుతుంది కూడా! లెగ్గింగ్, జెగ్గింగ్, జీన్స్, చుడీ, పటియాల... ఏ బాటమ్ అయినా నప్పే ఒక్క కుర్తా ఉంటే చాలు. ధర కూడా అందరికీ అందుబాటులో ఉండటం ఈ కుర్తా కున్న మరో విశేషం. సౌకర్యంగా, సింపుల్‌గా, స్టైల్‌గా, గ్రాండ్‌గా... అన్నీ ఒక్క కుర్తాతో సరిపెట్టేయచ్చు. అయితే, కుర్తా ఒకటే తరహాకు చెందినదైనా శరీరాకృతి మాత్రం ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది. అందంగా, హుందాగా, కుర్రర్రర్రర్రర్రగా కనిిపించాలంటే శరీరాకృతికి తగ్గ కుర్తానే ఎంచుకోవాలి.
ఛాతి భాగం, నడము భాగం ఒకే పరిమాణంలో ఉండి, నడుము సన్నగా ఉండేవారు ఈ పరిధిలోకి వస్తారు.శరీరానికిఅంటిపెట్టుకున్నట్టుగా ఉండే మంచి ఫిటింగ్ కుర్తా ఈ షేప్ వారికి నప్పుతుందిఅన్ని రకాల నెక్‌లైన్స్ వీరికి నప్పుతాయి స్ట్రెయిట్, బూట్‌కట్ బాటమ్స్ సరైన ఎంపిక నడుము కింది భాగం కొద్దిగా వదులుగా ఉండే కుర్తాను ఎంచుకోవాలి. వీటికి దూరం... మరీ వదులుగా, మరీ ఫిట్‌గా కుర్తా ఉండకూడదు ప్యాట్రన్స్ ఎక్కువున్న కుర్తా ధరిస్తే లావుగా కనిపించే అవకాశం ఉంది.
‘ఎ’ షేప్
భుజాలు, ఛాతి పరిమాణం తక్కువగా, పిరుదుల భాగం విశాలంగా ఉండే వారు ఈ కోవకు చెందుతారు. మన దేశంలో చాలామందిది ఇదే ఆకృతి. లేత రంగు కుర్తీ ధరిస్తే, ముదురు రంగు పటియాల లేదా లెగ్గింగ్‌తో కింది భాగాన్ని కవర్ చేయాలి బాగా కుచ్చులుగా ఉన్న కుర్తా/ అనార్కలీ కుర్తా వీరికి బాగా నప్పుతుంది కుర్తా కాలర్ బోట్‌నెక్ లేదా స్కేయర్నెక్ అయితే బాగుంటుంది ప్రింట్లు, పోల్కా డాట్స్, చారలు ఉన్న కుర్తీలు బెస్ట్ పొడవాటి కుర్తాలు బాగా నప్పుతాయి.వీటికి దూరం... శరీరానికి అతుక్కుపోయే ఫ్యాబ్రిక్స్ బిగుతుగా ఉండే బాటమ్స్.
యాపిల్
శరీరాకృతి యాపిల్ షేప్‌లో ఉంటే లావుగా కనిపిస్తారు. అందుకని వీరు... ముదురు రంగులు ఎంచుకోవాలి కాటన్, సిల్క్ రెండింటి కలయికతో రూపొందిన ఫ్యాబ్రిక్ నప్పుతుంది నెక్లైన్ -’గ’ షేప్ ఉండేలా చూసుకోవాలి ఎంబ్రాయిడరీ అంటే ఇష్టం ఉంటే భుజాల దగ్గర వర్క్ ఉన్నవి ఎంచుకోవాలి కఫ్ స్లీవ్స్ (కుర్తా చేతుల చివరి భాగం మడతపెట్టినట్టుగా ఉండేవి) వీరికి బాగుంటాయి.
వీటికి దూరం... షేప్ లేనివి, ఫిటింగ్ వదులుగా ఉన్న కుర్తా పొట్ట భాగంలో వదులుగా ఉన్న కుర్తా.
మెడ కనిపించకుండా ఉండే యోక్డ్ స్టైల్ నెక్స్.
త్రికోణం
పై భాగం వెడల్పుగా, కింది భాగం సన్నగా కోన్ షేప్‌లో ఉన్నవారు ఈ పరిధిలోకి వస్తారు. కుర్తీని ఎంచుకునేటప్పుడు చేతుల క్లాత్ మృదువుగా ఉండేది ఎంచుకోవాలి. అప్పుడు పై భాగం ఎక్కువ కనిపించదు.కాలర్ లేనివి, ’్ఖ, గ’ నెక్‌లైన్స్ ఎంచుకోవాలి. నడుము కింది భాగం కుచ్చులుగా ఉండేదైతే బాగుంటుంది.
వీటికి దూరం...
నెక్ లైన్స్ మరీ పెద్దగా ఉండకూడదు.అలాగే కాలర్ దగ్గర ఎక్కువ వర్క్, ప్యాట్రన్స్ ఉండకూడదు.
నలుచదరం
డీప్ నెక్‌తో కింది భాగం విశాలంగా ఉన్న కుర్తాలు.
కుర్తా పైన బెల్ట్ ధరిస్తే నడుము కింది భాగం విశాలంగా కనపడుతుంది.
అనార్కలీ స్టైల్ లేదా ఎక్కువ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన కుర్తా బాగుంటుంది.
లెగ్గింగ్స్, చుడీ.. వంటివి బాటమ్స్గా వీరికి బాగుంటాయి.
వీటికి దూరం...
{స్టెయిట్ కట్, బిగుతుగా ఉండే కుర్తాలు. మరీ వదులుగా ఉండేవి.