మహిళా బైకర్‌ ఘటన : నిందితుడు జిమ్‌ ఓనర్‌, బాడీ బిల్డర్‌? | Gurugram Hit And Run Accused Kalyan Bainsla check deets inside | Sakshi
Sakshi News home page

మహిళా బైకర్‌ ఘటనలో నిందితుడు జిమ్‌ ఓనర్‌, బాడీ బిల్డర్‌?

Sep 14 2026 6:36 PM | Updated on Sep 14 2026 6:36 PM

Gurugram Hit And Run Accused Kalyan Bainsla check deets inside

నిందితుడు కళ్యాణ్‌ దెబ్బకి ఇన్‌స్టానుంచి ఔట్‌ 

హర్యానాలోని గురుగ్రామ్‌లో తన స్నేహితుడి మారుతి సియాజ్ కారుతో మహిళా బైకర్‌ సియాను ఢీకొట్టిన ఘటనలో వరుసగా కీలక పరిణామాలు  చోటు చేసుకుంటున్నారు. సియా పట్ల అనుచితంగా ప్రవర్తించి, వేధించిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది.దీంతో కారు యజమాని స్పందించారు. తన కారును రెండు రోజుల కరితం స్నేహితుడి కిచ్చానని, తనకు ఈ ప్రమాదానికి సంబంధం లేదని వివరణ ఇచ్చాడు.  దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న  వ్యక్తి కళ్యాణ్ బైన్స్లా వెలుగులోకి వచ్చాడు. దీంతో నిందితుడి  వివరాలు నెట్టింట  సంచలనంగా మారాయి.  అలాగే ఈ  కేసును స్యుమోటోగా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు.  

పల్వాల్‌కు చెందిన, KBT జిమ్ యజమాని అని తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రొఫైల్ ఫోటోలో  కండలుతిరిగి ఫోటోలతోపాటు, తనను తాను 'అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్‌, 'భారత రగ్బీ జట్టు' సభ్యుడిని అని చెప్పుకున్నాడు. అతను 'అమెచ్యూర్ ఒలింపియా ఇండియా'(Amateur Olympia India) అనే బాడీ బిల్డింగ్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచానని కూడా అతను పేర్కొన్నాడు. అయితే  ఈ వివరాలను  ధృవీకరించాల్సి ఉంది.  బైన్స్లా ఇన్‌స్టాలో  కసరత్తు చేస్తూ, కండలు చూపిస్తూ కనిపిస్తాడు. ఇతనికి  ఫాలోయింగ్  కూడా భారీగానే  ఉంది. అయితే ఈ ఘటన తరువాత అతని అకౌంట్‌ను డియాక్టివేట్‌  చేశాడు.

ఇదీ చదవండి: మహిళా బైకర్ ఘటనలో ట్విస్ట్ : కారు ఓనర్‌ కీలక ప్రకటన

ఢిల్లీ-ఎన్‌సీఆర్ రోడ్లపై  భద్రత మరింత  ప్రశ్నార్థకంగా నిలిచింది. . ఒక మహిళ బైక్ నడపడాన్ని జీర్ణించుకోలేక, నిన్న గురుగ్రామ్ రోడ్లపై  అనే మహిళా మోటార్‌సైక్లిస్ట్‌ను ఢీకొట్టడం ద్వారా కళ్యాణ్ బైన్స్లా ఆ విషయాన్ని మరోసారి రుజువు చేశాడు సోషల్‌మీడియాలో దుమారం రేగింది.కండలు పెంచినంత మాత్రాన నువ్వు 'మర్ద్' (అసలైన మగాడివి) అయిపోవు. అలా ఒకరిని గుద్ది పారిపోవడం కరెక్ట్‌ కాదు అంటూ మండి పడుతున్నారు.

ఇదీ చదవండి: గురుగ్రామ్‌లో ఏం జరుగుతోంది..‘అయితే నామాట.. లేదంటే థార్‌మాట’!

కాగా ఆదివారం రాత్రి, కారులోని వ్యక్తులు తనను వేధిస్తున్న వీడియోను ఆ మహిళ షేర్ చేశారు. ఈ వీడిమో కారు కుడివైపుకు దూసుకెళ్లి, ఆమెను పక్క నుండి ఢీకొట్టి, వేగంగా వెళ్లిపోయింది. ఆమె రోడ్డుపై పడిపోవడంతో స్వల్ప గాయాలయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement