రోడ్డుపై ఓ లేడీ బైకర్‌ను కొందరు ఆకతాయిలు వెంబడించారు. తనను వెంబడించొద్దని.. దూరంగా ఉండాలని ఆమె వాళ్లకు సున్నితంగానే చెప్పింది. అయినా పట్టించుకోకుండా వెంటపడ్డారు. చివరకు కారుతో ఆమె బండిని ఢీకొట్టి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో ఆమె కింద పడిపోగా.. బైక్ కొద్దిదూరం ముందుకు వెళ్లింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
గురుగ్రామ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై ఆదివారం ఈ ఘటన జరిగినట్లు బాధిత బైకర్ సియా వెల్లడించింది. ఆమె తన బైకింగ్ గ్రూప్‌తో కలిసి ఏప్రిలియా ఆర్‌ఎస్ 457పై వెళ్తుండగా.. ఓ కారు వెనుక నుంచి వెంటపడటం మొదలుపెట్టిందని తెలిపింది. కారులో ఉన్నవారు దూకుడుగా ప్రవర్తించడంతో.. కొంత దూరం పాటించాలని తాను కోరినట్లు చెప్పింది. అయితే వారు బైక్ ఆపాలని చెప్పారని, మద్యం మత్తులో ఉన్నట్లుగా కనిపించారని తెలిపింది.
కారు తనను పక్కకు రానివ్వకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించానని సియా తెలిపింది. వెనుక వస్తున్న తన స్నేహితుడు కూడా కారును అడ్డుకునేందుకు ప్రయత్నించాడని చెప్పింది. అయినప్పటికీ కారు డ్రైవర్ బైక్‌కు ముందుగా వచ్చి కట్ చేయడంతో ఢీకొట్టిందని ఆరోపించింది. దాంతో సియా బైక్‌పై నుంచి కిందపడిపోగా.. ఆమె స్పోర్ట్స్ బైక్ కొంత దూరం రోడ్డుపై ఈడ్చుకెళ్లింది.
ఈ మొత్తం ఘటన ఆమె బైక్‌కు అమర్చిన యాక్షన్ కెమెరాలో రికార్డైంది. ప్రమాదం తర్వాత సియా స్నేహితుడు కారును వెంబడించి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆపేందుకు ప్రయత్నించాడు. డ్రైవర్‌ను ప్రశ్నించగా.. తన తప్పేమీ లేదంటూ అక్కడి నుంచి కారుతో వెళ్లిపోయినట్లు సియా తెలిపింది.
ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన సియా.. గురుగ్రామ్ పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరింది. వాహనం నంబర్‌తో పాటు ఆర్‌సీ యజమాని వివరాలను కూడా వెల్లడించింది. వీడియో వైరల్ కావడంతో ఢిల్లీ, గురుగ్రామ్, హరియాణా పోలీసులను ట్యాగ్ చేస్తూ నెటిజన్లు నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Caught on Cam: Gurugram Woman Biker Thrown Off Aprilia After Car Rams Her for Asking to Keep Distance#Gurugram - A woman motorcyclist in Gurugram has alleged that a car rammed into her sports bike and fled after she asked the driver to keep a distance. The incident, recorded on… pic.twitter.com/Mq3xdfq83o
— Siraj Noorani (@sirajnoorani) September 14, 2026


