చరిత్ర సృష్టించిన అభిషేక్‌ శర్మ | Abhishek Sharma Scripts T20 History Fastest Asian to Achieve Big Feat | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన అభిషేక్‌ శర్మ.. ఆసియాలోనే తొలి ప్లేయర్‌గా..

Sep 14 2026 11:30 AM | Updated on Sep 14 2026 11:39 AM

Abhishek Sharma Scripts T20 History Fastest Asian to Achieve Big Feat

PC: BCCI X

టీమిండియా ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో అత్యంత వేగంగా ఆరు వేల పరుగుల మైలురాయిని చేరుకున్న ఆసియా క్రికెటర్‌గా రికార్డు సాధించాడు. అఫ్గానిస్తాన్‌తో ఆదివారం నాటి తొలి టీ20 మ్యాచ్‌ సందర్భంగా అభిషేక్‌ శర్మ ఈ ఫీట్‌ నమోదు చేశాడు.

 13.4 ఓవర్లలోనే
కాగా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు అఫ్గాన్‌ ఢిల్లీలో టీమిండియాకు ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య అరుణ్‌ జైట్లీ స్టేడియంలో ఆదివారం తొలి టీ20 జరుగగా.. టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అఫ్గాన్‌ విధించిన 157 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.4 ఓవర్లలోనే ఛేదించింది.

తుఫాన్‌ ఇన్నింగ్స్‌
ఇందులో అభిషేక్‌ శర్మదే కీలక పాత్ర. కేవలం 22 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌.. మొత్తంగా 32 బంతుల్లో ఏడు ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 82 పరుగులు సాధించాడు. స్ట్రైక్‌రేటు 256.25. అయితే, మహ్మద్‌ నబీ బౌలింగ్‌లో రషీద్‌ ఖాన్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో అభిషేక్‌ తుఫాన్‌ ఇన్నింగ్స్‌కు తెరపడింది.

ఇదిలా ఉంటే.. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో ఆరు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా అభిషేక్‌ శర్మ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. పొట్టి క్రికెట్‌లో ఆరు వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. కేవలం 3420 బంతుల్లోనే అభిషేక్‌ ఈ మార్కును అందుకున్నాడు.

ఆసియాలోనే తొలి ప్లేయర్‌గా..
ఈ క్రమంలో అత్యంత వేగంగా టీ20లలో ఆరు వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆసియా క్రికెటర్‌గా.. ఓవరాల్‌గా రెండో ప్లేయర్‌గా నిలిచాడు. కాగా దేశీ క్రికెట్‌లో పంజాబ్‌ తరఫున.. ఐపీఎల్‌లో.. టీమిండియా తరఫున కలిపి అభిషేక్‌ శర్మ ఈ మేరకు భారీగా పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు.

ఫాస్టెస్ట్‌ 6000 రన్స్‌ (బంతుల పరంగా)
👉ఫిన్‌ అలెన్‌ (న్యూజిలాండ్‌)- 3386 బంతుల్లో
👉అభిషేక్‌ శర్మ (ఇండియా)- 3420 బంతుల్లో
👉ఆండ్రీ రసెల్‌ (వెస్టిండీస్‌)- 3550 బంతుల్లో
👉టిమ్‌ డేవిడ్‌ (ఆస్ట్రేలియా)- 3681 బంతుల్లో
👉విల్‌ జాక్స్‌, ఫిల్‌ సాల్ట్‌ (ఇంగ్లండ్‌)- 3857 బంతుల్లో.

చదవండి: వద్దన్నా వినడే.. ఇదేం బుద్ధి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement