Photo: Sonysports X
అఫ్గానిస్తాన్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కాగా భారత్ వేదికగా అఫ్గాన్ బోర్డు.. టీమిండియాకు మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక.
UPDATES:
పవర్ ప్లేలో అఫ్గాన్ స్కోరు: 41-4 (6 ఓవర్లు)
ఓపెనర్లలో రహ్మనుల్లా గుర్బాజ్‌ను జస్‌ప్రీత్ బుమ్రా డకౌట్ చేయగా.. కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ (11) రనౌట్ అయ్యాడు. వన్‌డౌన్ బ్యాటర్ సెదీకుల్లా అటల్ 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. గుల్బదిన్ నైబ్ ఆరు బంతులు ఎదుర్కొని రెండు పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్‌లో నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు.
టాస్ గెలిచిన టీమిండియా.. వైభవ్ ఆడటం లేదు
ఇక టాస్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. ‘‘మేము ముందుగా బౌలింగ్ చేస్తాము. ఢిల్లీ వికెట్ మీద తొలుత బౌలింగ్ చేస్తే అనుకూలంగా ఉంటుంది. జింబాబ్వే పర్యటనలో మాకెన్నో సానుకూల అంశాలు కనిపించాయి. ఇక్కడా అదే జోరు కొనసాగిస్తాం. అయితే, వైభవ్ సూర్యవంశీ ఆడటం లేదు’’ అని తెలిపాడు.
తిరిగి వచ్చిన సంజూ
కాగా జింబాబ్వే పర్యటనకు సంజూ శాంసన్ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అభిషేక్ శర్మకు ఓపెనింగ్ జోడీగా వచ్చిన చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ అదరగొట్టాడు. ఈ సిరీస్‌లో భారత్ 3-0తో జింబాబ్వేను క్లీన్‌స్వీప్ చేయగా.. ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును వైభవ్ గెలుచుకున్నాడు.
అయితే, అఫ్గాన్‌తో సిరీస్‌తో సంజూ తిరిగి రావడంతో వైభవ్‌కు తుదిజట్టులో చోటు కరువైంది. ఇదిలా ఉంటే.. గాయాల నుంచి కోలుకున్న ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తుదిజట్టులోకి వచ్చారు. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు మాత్రం ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కలేదు.
తుదిజట్లు
భారత్
సంజు శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
అఫ్గానిస్తాన్
ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మనుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సెదీకుల్లా అటల్, డార్విష్ రసూలి, అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బదిన్ నైబ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నూర్ అహ్మద్, ఫజల్‌హక్ ఫారూకీ.


