ఆసియా కప్‌ విజేతగా భారత్‌ | India Beat China Win Junior Womens Hockey Asia Cup 2026 | Sakshi
Sakshi News home page

ఆసియా కప్‌ విజేతగా భారత్‌

Sep 13 2026 4:54 PM | Updated on Sep 13 2026 5:41 PM

India Beat China Win Junior Womens Hockey Asia Cup 2026

PC: Hockey India X

జూనియర్‌ మహిళల హాకీ ఆసియా కప్‌ టోర్నమెంట్లో భారత్‌ హ్యాట్రిక్‌ విజయం సాధించింది. వరుసగా మూడోసారి ఈ మెగా ఈవెంట్లో చాంపియన్‌గా అవతరించింది. చైనాలోని మోకీ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో ఆతిథ్య జట్టుపై 1-0 గోల్స్‌ తేడాతో విజయం సాధించి.. టైటిల్‌ను సొంతం చేసుకుంది.

పాక్‌ను మట్టికరిపించి
కాగా గ్రూప్‌ దశలో టాపర్‌గా నిలిచిన భారత మహిళల జట్టు.. క్వార్టర్‌ ఫైనల్లో పాకిస్తాన్‌ను 19-0తో మట్టికరిపించి సెమీస్‌లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో దక్షిణ కొరియాతో శనివారం జరిగిన ఫైనల్లో 5-1 గోల్స్‌ తేడాతో గెలిచిన భారత్‌.. సెమీ ఫైనల్లో చైనాతో తలపడింది.

ఏకైక గోల్‌ ఎవరిదంటే?
మోకీలో జరిగిన టైటిల్‌ పోరులో సనికా చంద్రకాంత్‌ పదిహేడో నిమిషంలో గోల్‌ కొట్టి భారత్‌కు శుభారంభం అందించింది. ఈ క్రమంలో ఆధిక్యంలో వెళ్లిన భారత జట్టు.. ఆ తర్వాత చైనాకు గోల్‌ కొట్టే అవకాశం ఇవ్వకుండా నిలువరించింది. తద్వారా 1-0 తేడాతో గెలిచి స్వర్ణ పతకం గెలుచుకుంది.

ఇక ఈ విజయంతో భారత మహిళల జూనియర్‌ జట్టు.. ప్రపంచకప్‌-2027 టోర్నీకి అర్హత సాధించింది. ఇక భారత్‌తో పాటు పాయింట్ల పట్టికలో టాప్‌-4లో నిలిచిన చైనా, జపాన్‌, సౌత్‌ కొరియా కూడా వరల్డ్‌కప్‌ బెర్తు ఖరారు చేసుకున్నాయి. ఇదిలా ఉంటే.. 2023, 2024 సీజన్లలో ఆసియా కప్‌ విజేతగా నిలిచిన భారత జట్టు.. తాజాగా జరిగిన ఎడిషన్‌లోనూ పతకాన్ని కైవసం చేసుకుంది. 

చదవండి: పంత్‌వి పిల్లాడి చేష్టలు.. సంజీవ్‌ గోయెంకా కామెంట్లు వైరల్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement