PC: X
ఐపీఎల్-2027 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ తమ కోచింగ్ స్టాప్‌లో సమూల మార్పులు చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఢిల్లీ ఫ్రాంచైజీకి డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా సేవలందిస్తున్న సౌరవ్ గంగూలీ.. వచ్చే సీజన్‌లో ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
గతంలో ఢిల్లీ మెంటార్‌గా వ్యవహరించిన గంగూలీ, ఇప్పటివరకు ఐపీఎల్‌లో హెడ్‌కోచ్‌గా పనిచేయలేదు. కాగా తొలి టైటిల్ కోసం ఎదురుచూస్తున్న ఢిల్లీ ఫ్రాంచైజీ వచ్చే ఎడిషన్‌కు సపోర్ట్ స్టాఫ్‌ను మరింత పటిష్టం చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా గంగూలీతో పాటు మరికొంత మంది దిగ్గజాలను బ్యాక్‌రూమ్ స్టాప్‌లోకి తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
బ్యాటింగ్ కోచ్‌గా యువీ!
టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌కు బ్యాటింగ్ కోచ్ బాధ్యతలు కట్టబెట్టనున్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ వంటి యువ ఆటగాళ్లను తీర్చిదిద్దడంలో యువీ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు తన అనుభవాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ కోసం ఉపయోగించనున్నారు.
శ్రీలంక దిగ్గజ పేసర్ చమింద వాస్ బౌలింగ్ కోచ్‌గా నియమితులయ్యే అవకాశం ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లో 355 టెస్టు, 400 వన్డే వికెట్లు పడగొట్టిన వాస్‌కు లంక జాతీయ జట్టుతో పాటు పలు ఫ్రాంచైజీలకు కోచ్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకరిగా నిలిచిన మిశ్రాను స్పిన్ బౌలింగ్ కోచ్‌గా నియమించనున్నట్లు తెలుస్తోంది.
భారతీయ పిచ్‌లు, కండిషన్స్‌పై ఆయనకు మెండుగా అనుభవం ఉంది. భారత క్రికెట్‌కు దశాబ్దాల పాటు సేవలందించిన ఈ దిగ్గజాల రాకతోనైనా ఢిల్లీ క్యాపిటల్స్ రాతను మారుస్తుందేమో చూడాలి.
చదవండి: IND vs AFG: 'వైభవ్ అంటే భయం లేదు.. మా ప్లాన్స్ మాకున్నాయి'


