Photo Credit: Twitter
ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా తిలక్ వర్మ ఎంపికయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ముంబై ఇండియన్స్ యాజమాన్యం వచ్చే ఐపీఎల్ సీజన్‌లోగా పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే హార్దిక్ పాండ్యా విషయంలో మాత్రం జట్టు మేనేజ్‌మెంట్ బిగ్ ట్విస్ట్ ఇచ్చింది.
గత సీజన్‌లో కెప్టెన్‌గా, ప్లేయర్‌గా పూర్తిగా విఫలమైన పాండ్యాను ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ చేయనుందనే వార్తలు వచ్చాయి. అటు పాండ్యా కూడా సీఎస్‌కే లేదా కేకేఆర్ జట్టులోకి వెళ్తాడని ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. కానీ వాటన్నింటికి తెరదించుతూ ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాను తమతోనే అట్టిపెట్టుకోవాలనే భావిస్తున్నట్లు సమాచారం.
కెప్టెన్‌గా విఫలమైనప్పటికీ, ఆల్‌రౌండర్‌గా పాండ్యా ముంబై ఇండియన్స్‌కు గతంలో కీలక ఆటగాడిగా రాణించాడు. ఈ నేపథ్యంలోనే అతడిని కెప్టెన్సీ నుంచి తొలగించి, ఆ బాధ్యతలను యువ బ్యాటర్ తిలక్ వర్మకు అప్పగించాలని ముంబై ఇండియన్స్ యాజమాన్యం భావిస్తుందట.
అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లోనూ తిలక్ వర్మ స్థిరమైన ప్రదర్శన కనబరుస్తుండటంతో అతడిపై యాజమాన్యానికి నమ్మకం పెరిగినట్లు తెలుస్తోంది. తిలక్‌లో నాయకత్వ లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయని ముంబయి భావిస్తోంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని యువ ఆటగాడికి కెప్టెన్సీ అప్పగిస్తే.. జట్టును దీర్ఘకాలం పాటు బలమైన యూనిట్‌గా తీర్చిదిద్దవచ్చని యాజమాన్యం ఆలోచిస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే జట్టులో సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉండడంతో, వారి దిశానిర్దేశంలో తిలక్ వర్మ జట్టును విజయవంతంగా నడిపిస్తాడని ముంబై ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఈ విషయమై ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయనప్పటికీ, త్వరలోనే ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్‌గా తిలక్ వర్మను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
TILAK VARMA AS MUMBAI INDIANS CAPTAIN 💙
- Tilak Varma is top contenders for Mumbai Indians captaincy in IPL 2027. pic.twitter.com/n1q3dQWh4g— Cricket Central (@CricketCentrl) September 1, 2026


