నేపాల్‌ వరదలు : మరోసారి సోనూసూద్ ఔదార్యం | Nepal floods Bollywood actor Sonu Sood arrives in Kathmandu to distribute relief to victims | Sakshi
Sakshi News home page

నేపాల్‌ వరదలు : మరోసారి సోనూసూద్ ఔదార్యం

Sep 1 2026 5:10 PM | Updated on Sep 1 2026 5:41 PM

Nepal floods Bollywood actor Sonu Sood arrives in Kathmandu to distribute relief to victims

ఆపదలోఉన్నవారిని ఆదుకునేందుకు ఎప్పుడూ ముందుండే బాలీవుడ్‌ నటుడు సోనూ సూద్. తాజాగా నేపల్‌ విలయం సమయంలో కూడా మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. నేపాల్‌ వరద బాధితులను ఆదుకునేందుకు ముందడుగు వేశారు. కష్టకాలంలో ఉన్న నేపాల్‌ ప్రజలకు సాయం అందించేందుకు రానున్న కాలంలో కూడా పనిచేస్తానని  చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

నేపాల్ వరద బాధితులకు సహాయం అందించేందుకు సోనూ సూద్ ఖాఠ్మండు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద బాధితులను కలిసి, వారికి సహాయక సామగ్రిని పంపిణీ చేయడానికి  ఇక్కడి వచ్చామన్నారు. వారు తిరిగి సామాన్య జీవితాన్ని గడిపేలా తమ  వంతు సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. పెద్ద మొత్తంలో దుప్పట్లు, ఆహారాన్ని బాధితులకు అందించేందుకు తీసుకొచ్చామని చెప్పారు. రాబోయే నెలల్లో కూడా నేపాల్‌కు సహాయం అందేలా చూసేందుకు  కృషి చేస్తామని హామీ ఇవ్వడం  విశేషం.

నేపాల్‌లో ప్రకృతి విపత్తు గురించి తెలిసిన వెంటనే  సోషల్ మీడియా ద్వారా తన విచారాన్ని వ్యక్తం  చేసిన సోనూ సూద్‌  సాయం చేస్తానని అప్పుడే మాట ఇచ్చారు.  "నేపాల్, నీవు ఒంటరివి కావు.. మీకు అండగా నిలిచి, తిరిగి కోలుకోవడంలో సహాయపడేందుకు ఆహారం, ఆశ్రయం మరియు ధైర్యంతో  వస్తున్నాం అంటూ ట్విట్‌ చేయడం గమనార్హం. 

 

 > ఇదీ చదవండి: లక్షల్లో జీతం, హెచ్‌1 బీ వీసా : తిరిగి ఇండియాకు, ఎందుకు?

 

కాగా భారతదేశంలో కోవిడ్ మహమ్మారి పంజా విసిరిన సమయంలో సోనూసూద్‌  ఎంతోమందికి అండగా నిలబడ్డారు. లాక్‌డౌన్‌ కాలంలో విదేశాల్లో చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేలా కృషి చేశారు.  ఇదే కాలంలో స్మార్ట్‌ఫోన్‌ లేక ఆన్‌లైన్‌ తరగతులకు హాజరు కాలేని పేద విద్యార్థులకు నేను ఉన్నానంటూ భరోసా ఇచ్చారు. అంతేకాదు సాయం చేయాలని సోషల్‌ మీడియా ద్వారా అర్థించిన ఎంతోమందికి సాయం చేసిన కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. 
ఇదీ చదవండి : 6 రోజుల్లొ 100 రెస్క్యూ ఆపరేషన్లు: ఎవరీ ప్రియా అధికారి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement