యూఎస్‌ ఓపెన్‌ విజేతగా రైబాకినా | Elena Rybakina beats Aryna Sabalenka to win US Open for first time | Sakshi
Sakshi News home page

యూఎస్‌ ఓపెన్‌ విజేతగా రైబాకినా

Sep 13 2026 6:50 AM | Updated on Sep 13 2026 7:25 AM

Elena Rybakina beats Aryna Sabalenka to win US Open for first time

PC: US Open

యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఛాంపియన్‌గా వ‌ర‌ల్డ్ నంబ‌ర్ 2 ఎలెనా రైబాకినా నిలిచింది. రైబాకినా శ‌నివారం అర్ధ‌రాత్రి జ‌రిగిన ఫైన‌ల్లో బెలారసియన్ స్టార్ అరీనా సబలెంకాను 6-4, 5-7, 6-2 తేడాతో ఓడించి తొలి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను ముద్దాడింది.

ఈ మ్యాచ్ ఆరంభంలో ప్రత్యర్ధి సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేసిన రైబాకినా 6-4తో సెట్‌ను గెలుచుకుని శుభారంభం చేసింది. ఆ తర్వాత డిఫెండింగ్ ఛాంపియన్ అరినా సబలెంకా అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చింది. తొలుత రెండు సెట్ పాయింట్లను కాపాడుకున్న సబలెంకా.. అనంతరం రైబాకినా సర్వీస్‌ను బ్రేక్ చేసి 7-5తో రెండో సెట్‌ను కైవసం చేసుకుంది. 

ఇక నిర్ణయాత్మక మూడో సెట్‌లో కజకిస్థాన్ స్టార్‌ రైబాకినా విజృంభించింది. సబలెంకా సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేస్తూ 6-2తో సెట్‌తో పాటు గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను ఖాయం చేసుకుంది.

ఇది రైబాకినాకు మూడవ గ్రాండ్ స్లామ్ టైటిల్. ఈ విజయంతో ఆమె మహిళల టెన్నిస్ అసోసియేషన్ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ ఘనత సాధించిన మొదటి కజకిస్థాన్‌ క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది.
చదవండి: హారిసన్‌–స్కప్‌స్కీ జోడీకి పురుషుల డబుల్స్‌ టైటిల్‌




 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement