యూఎస్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్‌ను ఐదో సీడ్ క్రిస్టియాన్ హారిసన్ (అమెరికా) – నీల్ స్కప్‌స్కీ (యూకే) జంట సొంతం చేసుకున్నారు. శనివారం జరిగిన ఫైనల్లో హారిసన్–స్కప్‌స్కీ 6–4, 7–6 (8/6) స్కోరుతో ఆరో సీడ్ కెవిన్ క్రావిట్జ్ (జర్మనీ) – టిమ్ పుయెట్జ్ (జర్మనీ) ద్వయాన్ని ఓడించారు. 1 గంటా 39 నిమిషాల పాటు సాగిన పోరులో హారిసన్–స్కప్‌స్కీ జోడి 9 ఏస్‌లు సంధించి 38 విన్నర్లు కొట్టింది. 2026 ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ ట్రోఫీని కూడా వీరిద్దరే గెలుచుకున్నారు.


