ఆఫ్ఘన్‌తో తొలి టీ20.. తీవ్ర ఉత్కంఠ | Rain To Play Spoilsport In India vs Afghanistan 1st T20I | Sakshi
Sakshi News home page

ఆఫ్ఘన్‌తో తొలి టీ20.. తీవ్ర ఉత్కంఠ

Sep 12 2026 9:12 PM | Updated on Sep 12 2026 9:12 PM

Rain To Play Spoilsport In India vs Afghanistan 1st T20I

source: BCCI X

భారత్‌-ఆఫ్ఘనిస్తాన్‌ మధ్య రేపు న్యూఢిల్లీ వేదికగా తొలి టీ20 జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌కు ముందు క్రికెట్‌ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రేపటి మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది . దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ఢిల్లీలో గత రెండు వారాలుగా అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. అక్యూ వెదర్‌ అంచనాల ప్రకారం రేపు వర్షం పడే అవకాశం 64 శాతంగా ఉంది. ముఖ్యంగా మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో భారీ వర్ష సూచన ఉంది. మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

అక్యూ వెదర్‌ నివేదిక ప్రకారం మ్యాచ్‌ పూర్తిగా రద్దయ్యే ప్రమాదం లేకపోయినా, ఓవర్ల కోత తప్పకపోవచ్చని తెలుస్తోంది.

శ్రేయస్‌కు తొలి పరీక్ష
ఈ సిరీస్ శ్రేయస్ అయ్యర్‌కు ప్రత్యేకమైనది. భారత టీ20 కెప్టెన్‌గా భారత్‌లో అతడికి ఇదే తొలి సిరీస్. ఇప్పటికే ఇంగ్లండ్, జింబాబ్వే పర్యటనల్లో టీమిండియాకు నాయకత్వం వహించిన అయ్యర్.. తొలిసారి స్వదేశంలో భారత జట్టును నడిపించనున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ అధికారికంగా ఆతిథ్య జట్టు అయినప్పటికీ, మ్యాచ్‌లు భారత్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే.

మిశ్రమ ఫలితాలు
ఇటీవల టీ20 క్రికెట్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. యూకే పర్యటనలో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20ల సిరీస్‌ను  0-2తో కోల్పోయిన టీమిండియా, ఆతర్వాత ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను కూడా 0-4తో కోల్పోయింది. అయితే జింబాబ్వేతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో భారత్ అద్భుతంగా పుంజుకొని, 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది.

ఇదీ చదవండి: ఇషాన్ గాయంపై అప్‌డేట్‌ ఇచ్చిన శ్రేయస్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement