చరిత్ర సృష్టించిన జో రూట్‌.. సచిన్‌ వరల్డ్‌ రికార్డు బద్దలు | Most 50s in tests: Joe Root surpasses Sachin | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన జో రూట్‌.. సచిన్‌ వరల్డ్‌ రికార్డు బద్దలు

Sep 12 2026 5:43 PM | Updated on Sep 12 2026 5:50 PM

Most 50s in tests: Joe Root surpasses Sachin

ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌ జో రూట్‌ మరో భారీ రికార్డును సొంతం చేసుకున్నాడు. టెస్ట్‌ క్రికెట్‌లో అత్యధిక అర్ద సెంచరీలు చేసిన బ్యాటర్‌గా అవతరించాడు. ఈ క్రమంలో దిగ్గజ బ్యాటర్‌ సచిన్‌ టెండూల్కర్‌  రికార్డును బద్దలు కొట్టాడు. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించాడు.

టెస్టుల్లో అత్యధిక అర్ధశతకాలు
69* - జో రూట్
68 - సచిన్ టెండూల్కర్
66 - ఎస్. చందర్‌పాల్
63 - అలెన్ బోర్డర్
63 - రాహుల్ ద్రవిడ్
62 - రికీ పాంటింగ్

రూట్‌ (62 నాటౌట్‌)తో పాటు జోర్డన్‌ కాక్స్‌(59 నాటౌట్‌) అర్ద సెంచరీలతో రాణించడంతో మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ 8 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. ఫలితంగా స్వదేశంలో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్‌ స్వీప్‌ చేసింది.

ఈ మ్యాచ్‌లో పాక్‌ తొలి ఇన్నింగ్స్‌లో 133 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 449 పరుగులు చేయగా.. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 453, రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. 

ఇదీ చదవండి: #80s Trend: టీమిండియా క్రికెటర్లకు బీసీసీఐ సర్‌ప్రైజ్‌!


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement