పాక్‌తో మూడో టెస్టు.. ఇంగ్లండ్‌ విజయలక్ష్యం 130 | ENG vs PAK 3rd Test: England need 130 after thrilling Razaullah hitting | Sakshi
Sakshi News home page

పాక్‌తో మూడో టెస్టు.. ఇంగ్లండ్‌ విజయలక్ష్యం 130

Sep 12 2026 8:32 AM | Updated on Sep 12 2026 8:37 AM

ENG vs PAK 3rd Test: England need 130 after thrilling Razaullah hitting

పాకిస్తాన్‌తో మూడు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసేందుకు ఇంగ్లండ్‌ 130 పరుగులు చేయాలి. చివరిదైన మూడో టెస్టులో ఓవర్‌నైట్‌ స్కోరు 52/2తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన పాకిస్తాన్‌ 96.4 ఓవర్లలో 449 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్‌ జట్టుకు 130 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. 

పాక్‌ బ్యాటర్లు అజాన్‌ అవైస్‌ (59; 10 ఫోర్లు), షాన్‌ మసూద్‌ (95; 12 ఫోర్లు), కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (76; 11 ఫోర్లు, 1 సిక్స్‌), రజాఉల్లా (81; 4 ఫోర్లు, 8 సిక్స్‌లు) దూకుడుగా ఆడి అర్ధ సెంచరీలు సాధించారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో అట్కిన్‌సన్‌ 3 వికెట్లు తీయగా... జోష్‌ టంగ్, డాన్‌ లారెన్స్, రాబిన్‌సన్‌ 2 వికెట్ల చొప్పున పడగొట్టారు. 

అంతకుముందు ఇంగ్లండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 453 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. హ్యారీ బ్రూక్‌(75), లారెన్స్‌(65), జేమీ స్మిత్‌(69), గే(60) హాఫ్‌ సెంచరీలతో రాణించారు. కాగా ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో పాక్‌ కేవలం 133 పరుగులకు కుప్పకూలిన సంగతి తెలిసిందే.
చదవండి: IND vs AFG: వైభవ్‌కు చుక్కలు చూపించిన జస్ప్రీత్‌ బుమ్రా
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement