source: X
స్వదేశంలో పాకిస్తాన్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఇంగ్లండ్ క్లీన్ స్వీప్ చేసే దిశగా దూసుకెళ్తుంది. ఇప్పటికే తొలి రెండు టెస్ట్‌లను గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న ఆతిథ్య జట్టు.. ప్రస్తుతం జరుగుతున్న మూడో టెస్ట్‌లోనూ భారీ విజయం సాధించేలా కనిపిస్తుంది.
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 133 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బరిలోకి దిగిన ఇంగ్లండ్ 453 పరుగుల భారీ స్కోర్ చేసి, 320 పరుగుల ఆధిక్యం సాధించింది.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు (ఎమిలియో గే (60), హ్యారీ బ్రూక్ (75), డాన్ లారెన్స్ (65), జేమీ స్మిత్ (69), ఓల్లీ రాబిన్సన్ (50)) ఆటగాళ్లు అర్ద సెంచరీలు సాధించారు. ఆఖర్లో జోఫ్రా ఆర్చర్ మెరుపు ఇన్నింగ్స్ (32 నాటౌట్) ఆడాడు.
మిగతా ప్లేయర్లలో బెన్ డకెట్ 11, జోర్డన్ కాక్స్ 4, కెప్టెన్ రూట్ 8, అట్కిన్సన్ 19, టంగ్ 15 పరుగులు చేశారు. పాకిస్తాన్ బౌలర్లలో రజావుల్లా 4, మొహమ్మద్ ఇమ్రాన్, మొహమ్మద్ అలీ తలో రెండు, మొహమ్మద్ అబ్బాస్ ఓ వికెట్ తీశారు.
133 పరుగులకే కుప్పకూలిన పాక్
అంతకుముందు పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 133 పరుగులకే కుప్పకూలింది. పేసర్లు ఓల్లీ రాబిన్సన్ (3-15), జోఫ్రా ఆర్చర్ (3-25), జోష్ టంగ్ (4-42) ధాటికి పేకమేడలా కూలింది.
పాక్ ఇన్నింగ్స్‌లో కేవలం ముగ్గురు (సౌద్ షకీల్ (43), మొహమ్మద్ అబ్బాస్ (21), రజావుల్లా (11)) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఆ జట్టు స్టార్ బ్యాటర్‌గా చెప్పుకునే బాబర్ ఆజం 7 పరుగులు మాత్రమే చేసి జోష్ టంగ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మిగతా ప్లేయర్లలో సైమ్ అయూబ్ 0, అజాన్ అవైస్ 9, అబ్దుల్లా షఫీక్ 3, షాన్ మసూద్ 5, ఘాజీ ఘోరి 4, మొహమ్మద్ ఇమ్రాన్ 5 పరుగులు మాత్రమే చేశారు.
చదవండి: ఫిన్ అలెన్‌కు జాక్‌పాట్.. అత్యంత ఖరీదైన ఆటగాడు


